Friday, July 4, 2008

వెంకటాద్రి ఉద్యమ వ్యాప్తి దృశ్యాలు

1958 సంవత్సరం. మే నెల చీరాలలో యోగేశ్వరరావు మేడపై ఒక సాయంకాల సమావేశం. చతురస్రాకారంగా అందరూ కూర్చున్నారు. అల్పాహారం ఆరగించిన అనంతరం చిరుప్రసంగ కార్యక్రమం ఆ రంభమైంది.
చీరాల విఆర్ఎస్ కళాశాల ప్రిన్సిపాల్ టేకుమళ్ళ రామారావు మాట్లాడారు. ఆయా విషయాలను తడిమి, రవీంద్రనాథ్ ఠాగోర్ మార్మిక కవితా ధోరణి మెచ్చుకుంటూ చెప్పారు. ఆయన కవితల అనుభూతి మనస్సును ఎక్కడికో తీసుకెడు తుందన్నారు.
తరువాత రావిపూడి వెంకటాద్రి (సుప్రసిద్ధ హేతువాద నాయకులు, హేతువాది పత్రిక సంపాదకులు, బహుగ్రంథ రచయిత, ప్రస్తుతం ఆయన వయసు 87 సంవత్సరాలు.) స్పందిస్తూ, రియాక్ట్ అయ్యారు. టాగోర్ ది పులుముడు వాదమని అన్నారు. సుబ్బారావు గారి వాదనను తీవ్రస్థాయిలో దుయ్యబట్టి, ఖండించారు. ఠాగోర్ మార్మిక వాదం మనుషుల్ని ముందుకు నడపజాలదన్నారు.
ఆనాటి సమావేశం రాడికల్ హ్యూమనిస్టుల గోష్ఠి. ప్రధాన అతిధి టేకుమళ్ళ రామారావు. అయినా వెంకటాద్రి అరమరికలు లేకుండా ఆయన వాదాన్ని తూర్పారబట్టారు.
టేకుమళ్ళ రామారావుకు మద్దత్తుగా లైబ్రెరియన్ నరసింహారావు మాట్లాడబోయారు. అధ్యక్ష స్థానంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి వున్నారు. తనను తాను సమర్థించుకోగల శక్తి రామారావుకు వుందని చెప్పారు. తరువాత మాట్లాడుతూ, వెంకటాద్రి చెప్పినదంతా తాము అంగీకరిస్తున్నామన్నారు. ఎటొచ్చీ మా వాడు సుత్తి దీసుకొని బాదేశాడు. నేనైతే సుతిమెత్తగా ఆ మాటలనే చెప్పేవాడిని అన్నారు. సుబ్బారావును సమర్థించే వారెవరూ అక్కడలేరు. అయితే సుబ్బారావు స్నేహపూర్వకంగానే వున్నారు.
ఆవులగోపాలకృష్ణమూర్తి ఠాగూర్ పై ఉపన్యసించారు. వెంకటాద్రి ధోరణిని వివరిస్తూ మానవవాదాన్ని విడమరచి చెప్పారు. (ఆ ఉపన్యాసాన్ని రాడికల్ హ్యూమనిస్ట్ ఇంగ్లీషు వార పత్రికకు పంపాను. అయితే అది ప్రచురించటానికి శిబ్ నారాయణ్ రే ఎడిటర్ గా తటపటాయించాడు. అయితే మరొక ఎడిటర్ వి.బి. కార్మిక్ నాకు రాస్తూ ప్రచురించమని పట్టుపట్టవద్దన్నాడు. ఉత్తరోత్తరా ఏ.జి.కే. కూడా అంతటితో వదిలేయమన్నాడు.)
నాటి గోష్టిలో సిహెచ్ రాజారెడ్డి, బచ్చు వెంకటేశ్వర్లు, తోటకూర శ్రీరామమూర్తి ప్రభృతులు వున్నారు.
యోగేశ్వరరావు తరచు అలాంటి సమావేశాలు పెడుతుండేవారు. ఆయన బొంబాయిలో కొన్నాళ్ళు వున్నందున, జి.డి. పరేఖే, ఇందుమతి, వి.బి. కర్నిక్, జి.డి. దల్వి, వి.ఎం. తార్కుండే, ఎం.ఎ. రాణే, మణి బెన్ కారా, లక్ష్మణ శాస్త్రి, జోషి వంటి వారితో పరిచయస్తుడయ్యారు. ఆ ప్రభావంతో హ్యూమనిస్టు సమావేశాలు పెట్టేవారు.
ఆ రోజుల్లో ఏటా వేసవిలో చీరాలలో సాయంకాల సమావేశాలుండేవి. రాజారెడ్డి లిబర్టి ప్రెస్ హ్యూమనిస్టుల యిష్టాగోష్టి ప్రదేశం. వెంకటాద్రి ట్యూటోరియల్, విద్యాసంస్థలు నడుపుతూ, సమావేశాల్లో పాల్గొనేవారు. సంతరావూరులో తప్పనిసరిగా వేసవి చర్చా గోష్ఠులలో ఆయన ప్రసంగించేవారు. మధ్యమధ్య ఓడరేవు సందర్శన అక్కడా గోష్ఠి జరపడం ఒక అనుభూతి.

విజయవాడలో ఎమ్.ఎన్.రాయ్ శతజయంతిలో వెంకటాద్రి :
1988లో ఎమ్.ఎన్. రాయ్ శతజయంతి మహాసభ విజయవాడలో జరిగింది. తెలుగు అకాడమీ ప్రచురించిన రాయ్ పుస్తకాల అనువాదాలు (ఎన్. ఇన్నయ్య అనువదించిన వివేచన, ఉద్వేగం, విప్లవం రెండు భాగాలు, రష్యా విప్లవం, చైనాలో విప్లవం, ప్రతివిప్లవం, అధికారం, పార్టీలు, రాజకీయాలు, వి.వి. కర్నిక్ విరచిత రాయ్ జీవితచరిత్ర) ఒక సెట్ గా ఆ సందర్భంలో ఆవిష్కరించారు. నాటి మంత్రులు ఇంద్రారెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు, ట్రినిడాడ్ రాయభారి సి. లక్ష్మన్న సమావేశంలో అధితులుగా పాల్గోన్నారు. హాలు నిండా జనం. అందులో విశిష్ఠ ఉపన్యాసకులు రావిపూడి వెంకటాద్రి. ఎన్. ఇన్నయ్య సభను నిర్వహిస్తుండగా, వెంకటాద్రి ఆ నాడు చేసిన ప్రసంగం మరపురానిది. వివిధ ఉద్యమాలు, మానవ వాద ఉద్యమ పరిణామం, ఎమ్.ఎన్. రాయ్ ఎదిగిన తీరు, కమ్యూనిస్టుల వైఫల్యాల పరంపర, మానవ వాద ఉద్యమ ఆవశ్యకత. సుదీర్ఘంగా చెప్పారు. ఆయన సమాయాభావం వల్లన ప్రసంగాన్ని తగ్గించుకోవలసి వచ్చింది. ప్రేక్షకులకు అధి నచ్చలేదు. ఇంకా కొనసాగించమని కోరారు. ఆనాటి ప్రసంగం, విజయవాడ ప్రముఖులను ఆకట్టుకున్నది. ఉద్యమానికి సంబంధం లేని మేధావులు, రచయితలు, కవులు, సభకు వచ్చి ఆకర్షితులై పుస్తకాలు కొనుక్కోని వెళ్ళారు. వెంకటాద్రి నాడు రాయ్ కు తగిన రీతిలో జోహారులు అర్పించారు.

5 comments:

ఏకాంతపు దిలీప్ said...

@ఇన్నయ్య గారు

అప్పట్లో జరిగినంత రచ్చబండ చర్చలు ఇప్పట్లో జరగడం లేదనే చెప్పాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, చిన్న చిన్న పట్టణాలలో ఆసక్తి కరమైన,అర్ధవంతమైన చర్చలు జరిపేవారని తెలుస్తుంది. అవే ఉద్యమ కేంద్రాలని కూడా అనిపిస్తుంది.

నేను గమనించినంత వరకు నాకు తెలిసింది,గతం లో ఆంధ్ర ప్రదేష్ లో అటు ఇటుగా ప్రతీ దశాబ్ధంలో ఒక ఉద్యమం తీవ్రతని సంతరించుకుంది... సంఘ సంస్కరణోద్యమం, విద్యా ఉద్యమం, రైతు ఉద్యమం, సామ్య వాద ఉద్యమం, హేతువాద ఉద్యమం, రాజకీయ చైతన్యం.. ఇలా..


స్థూలంగా చూస్తే, అప్పటి ప్రజలతో పోల్చుకుంటే ఇప్పటి ప్రజల్లో అంతటి క్రియాశీలత కనిపించడం లేదు... గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ అంతే అనిపిస్తుంది... ఇదంతా నా అపోహేనా? లేక నా పరిశీలనలో ఆలోచించ దగ్గ విషయం ఉందా?

ఇంకా ఆయా ఉద్యమాలని గమనిస్తే అప్పటి కృష్ణ, గుంటూరూ జిల్లాలు బలమైన నాయకత్వం ఇచ్చాయి.. ఎందుకలా జరిగింది? మీకు దీని మీద ఎమైనా అభిప్రాయం ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేసారా?

నా సందేహాలని నివృత్తి చెయ్యగలరు...

ఏకాంతపు దిలీప్ said...

@ఇన్నయ్య గారు

అప్పట్లో జరిగినంత రచ్చబండ చర్చలు ఇప్పట్లో జరగడం లేదనే చెప్పాలి. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, చిన్న చిన్న పట్టణాలలో ఆసక్తి కరమైన,అర్ధవంతమైన చర్చలు జరిపేవారని తెలుస్తుంది. అవే ఉద్యమ కేంద్రాలని కూడా అనిపిస్తుంది.

నేను గమనించినంత వరకు నాకు తెలిసింది,గతం లో ఆంధ్ర ప్రదేష్ లో అటు ఇటుగా ప్రతీ దశాబ్ధంలో ఒక ఉద్యమం తీవ్రతని సంతరించుకుంది... సంఘ సంస్కరణోద్యమం, విద్యా ఉద్యమం, రైతు ఉద్యమం, సామ్య వాద ఉద్యమం, హేతువాద ఉద్యమం, రాజకీయ చైతన్యం.. ఇలా..


స్థూలంగా చూస్తే, అప్పటి ప్రజలతో పోల్చుకుంటే ఇప్పటి ప్రజల్లో అంతటి క్రియాశీలత కనిపించడం లేదు... గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ అంతే అనిపిస్తుంది... ఇదంతా నా అపోహేనా? లేక నా పరిశీలనలో ఆలోచించ దగ్గ విషయం ఉందా?

ఇంకా ఆయా ఉద్యమాలని గమనిస్తే అప్పటి కృష్ణ, గుంటూరూ జిల్లాలు బలమైన నాయకత్వం ఇచ్చాయి.. ఎందుకలా జరిగింది? మీకు దీని మీద ఎమైనా అభిప్రాయం ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేసారా?

నా సందేహాలని నివృత్తి చెయ్యగలరు...

innaiah said...

మీ పరిశీలన ,అవగాహన సరిగా వున్నది.1940 ప్రాంతాలలొ అన్ని రాజకీయ పార్తీ లు యువజన, విద్యార్థి ఉద్యమాలను పెటి అధ్యయన తరగతులు నడిపాయి.కులాంతర వివాహాలు జరిపారు.రాను రాను అవి పో యి ఓట్ కొరకు విలువలు వది లే
సారు .
నే టి సాంకే తికం నాడు లే దు .ఇప్పుదు మతం రాజకీయాలలొ ప్రవే శించి కలుషితం చేస్థున్నది

ఏకాంతపు దిలీప్ said...

@ఇన్నయ్య గారు
స్పందించినందుకు నెనర్లు. ఆ కారణం చేత మనుషుల మధ్య నమ్మకం సడలిపోయి చర్చలు జరగడం లేదు అనిపిస్తుంది ఆలోచిస్తే.

నా రెండో పరిశీలనకు కూడా మీ ఆలోచనని జోడిస్తారని ఆశిస్తున్నాను.

ఆయా ఉద్యమాలను గమనిస్తే, ముందు భౌగోళికంగా ఆ ప్రాంతాలలో బలం పుంజుకుని ఆ ప్రాంతపు నాయకుల బలమైన నాయకత్వంలో ఆంధ్ర ప్రదేష్ అంతటా వ్యాపించాయి.

హేతువాదాన్ని, మానవతా వాదాన్ని జీవన సారంగా చేసుకుని ముందుకు సాగే మీరు కూడా ఆ ప్రాంతానికి చెందినవారే కావడం ఇక్కడ యాదృచ్చికమే అవ్వొచ్చు.

ఇక్కడ ప్రాంతాల వారీగా విడగొట్టి చూడటం నా ఉద్దేశం కాదు. కానీ అన్ని ఉద్యమాలకి ఆ డెల్టా ప్రాంతమే కేంద్ర బిందువు అవ్వడం నన్ను ఆలోచింపచేస్తుంది...

Kathi Mahesh Kumar said...

@దిలీప్,నీ ప్రశ్న చదివిన తరువాత నాకు అనిపించింది స్వతంత్రించి ఇక్కడ రాస్తున్నాను. ఇన్నయ్యగారు నా అభిప్రాయాల్లో తప్పులుంటే సవరించగలరని ఆశిస్తున్నాను.

ఇన్నయ్య గారు చెప్పినట్లు, అప్పటి రాజకీయ వాతావరణం ఈ ‘రచ్చబండ’ లకి అవకాశం కల్పిస్తే, అక్కడి ప్రజల విద్య, సామాజిక పరిస్థితీ వీటికి ప్రోత్సాహాన్ని కల్పించి ఉండవచ్చు. ఇక ఈ ధోరణి ఈ ప్రాంతానికే పరిమితమయ్యిందనిపించడానికి కారణం వీటిని పత్రికలూ,పుస్తకాల రూపంలో ‘రికార్డ్’ చేసే అవకాశం ఉండటమే అని నా నమ్మకం.

మిగతా ప్రాంతాలవారికి, ఈ సౌలభ్యం అంత అందుబాటులో ఉండేది కాదు. ఇప్పటికీ పబ్లిషింగ్ చరిత్ర చూసుకుంటే, విజయవాడకున్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే.

ఇక ఈ మధ్యకాలంలో సారవంతమైన చర్చలు జరగకపోవడానికి మీరు చెప్పిన ‘నమ్మకం సడలిపోవడం’ ఒక కారణమైతే, దానికి మూలం సైద్ధాంతిక బ్రాండింగ్ మరియూ ప్రజల్లో పెరిగిన వేరే దృక్పధాన్ని అస్సలు సహించలేని అసహనం అనిపిస్తుంది.