Tuesday, September 30, 2008

తెలుగు సభలు -Memoirs in USA


Siromani award in ATA New York 1992










ఆటా సభలు

1992లో ఆటా (అమెరికా తెలుగు అసోసియేషన్) ప్రధమ సభలు న్యూయార్క్ నగరంలో జరిగాయి. డా. చిట్టి రామచంద్రమూర్తి నన్ను ఆహ్వానించగా వెళ్ళి పాల్లొన్నాను. నాతోపాటు నా భార్య కోమల, కుమార్తె డా.నవీన, అల్లుడు హేమంత్ ఉన్నారు. నాకు ఆ సభలలో మానవవాది, జర్నలిస్ట్ పురస్కారం ఇచ్చి(Siromani) సన్మానించారు. 1992 జులైలో జరిగిన ఆ సన్మానానికి సుప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం వేదికపై నన్ను పరిచయం చేశారు. నాతోపాటు నండూరి రామమోహనరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో పరిశ్రమల మంత్రి పి. రామచంద్రారెడ్డి పురస్కారాలు అందించారు. అమెరికా న్యూయార్క్ నగరంలో ఫార్మసీ నడిపిస్తున్న మానవవాద మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర వీడియో తీశారు. ఆటావారు అప్పుడు ప్రచురించిన ప్రత్యేక సంచికలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ పరిణామాలపై 100 పేజీల నా వ్యాసాన్ని ప్రచురించారు.

తానా సభలు

1997లో లాస్ఏంజిలస్ శివార్లలో డిస్నీలాండ్ వద్ద జరిగిన తానా సభలకు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ అమెరికా) నన్ను ఆహ్వానించి విశిష్ఠపురస్కారాన్ని(journalist) అందించారు. సుప్రసిద్ధ సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు వాటిని అందజేశారు. నా కుమార్తె నవీన, భార్య కోమల, మానవ వాద మిత్రులు, డా.నిర్మల్ మిశ్రా పాల్గొని ఫోటోలు తీశారు.

మరొక సంవత్సరం సిన్సినాటిలో జరిగిన తాన్ సభలకు వెళ్లాను. అక్కడ మెడికల్ సమావేశంలో నా కుమార్తె నవీన ప్రసంగించింది. అది రికార్డు చేశాము. డా. జంపాల చౌదరి (తానాపత్రిక ఎడిటర్) ఆహ్వానంపై ఇది జరిగింది.

తానా సభలు, ఆటా సభలు కొన్నాళ్లు పోటీపడి నిర్వహించిన తరువాత రాజీపడి సభలు పెట్టుకుంటున్నారు. అయితే జాతరలు, కొలుపులు తలపించే రీతిలో ఇవి జరుగుతున్నాయి. అంతకుమించి ఆట్టే నిర్మాణాత్మకమైన ప్రయోజనం కనిపించడం లేదు. కొందరు బాబాలు ఈ సభలను అడ్డం పెట్టుకుని భక్తులతో పిలిపించుకుని ఆధ్యాత్మక వ్యాపారం చేసుకుంటున్నారు. చాలామంది తెలుగువారు ఒకచోట కలుసుకోవటం పేర్కొనదగిన అంశం.

న్యూయార్క్ తెలుగు సభలు

ఒకసారి 1999-2000 ప్రాంతాలలో న్యూయార్క్ లో జరిగిన తెలుగు మహాసభలకు నన్ను మాట్లాడవలసిందిగా ఆహ్వానించారు. డా. దొడ్డపనేని బాబూరావు, జానకి నిర్వహించిన ఆ సభలలో పాల్గొని ప్రసంగించాను.

గ్రేటర్ ఫిలడల్ఫియా తెలుగు అసోసియేషన్

1999-99 ప్రాంతాలలో ఫిలడల్ఫియాలో జరిగిన తెలుగు అసోసియేషన్ కు నన్ను ఆహ్వానించి సన్మానించారు. సినీనటుడు కాకరాల సత్యనారాయణ పురస్కారాలు అందజేశారు. డెలవర్ రాష్ట్ర రాజధాని డోవర్ లో ఉంటున్న మిత్రులు వెలివోలు శ్యామ్ బాబు ఈ ఏర్పాట్లు చేశారు. ఆ సందర్భంగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి అన్నను అక్కడ కలిశాను. రాచకొండ రచనలు కొన్ని ఇంగ్లీషులోకి అనువదిస్తున్నట్లు చెబితే సంతోషించాను. ఆయన డాక్టరుగా రిటైర్ అయ్యి విశాఖపట్టణం వెళ్లిపోయారు.

Saturday, September 27, 2008

New Yorkప్రపంచ వాణిజ్య రాజధాని


Broadway theater glimpse














New york map








ప్రపంచ వాణిజ్య రాజధానిగా పేరు తెచ్చుకున్న న్యూయార్క్ ను టూరిస్ట్ పరిభాషలో బిగ్ యాపిల్ అని కూడా అంటారు. నేను అనేకసార్లు న్యూయార్క్ వెళ్ళాను. ఎన్నో రోజులు న్యూయార్క్ లో గడపగలిగాను. నా కుమారుడు రాజు నరిసెట్టి అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఉన్నందున నాకు అవకాశం లభించింది.

న్యూయార్క్ లో అన్ని భారీ ఎత్తున ఉంటాయి. తిరిగి చూడడానికి సబ్ వే రైళ్లు, బస్సులు పుష్కలంగా ఉన్నాయి. రాత్రింబగళ్ళు సిటీలో భయం లేకుండా రైళ్లలో తిరగొచ్చు. ఎంత దూరం వెళ్ళినా రైలు టికెట్టు డాలర్ న్నర మాత్రమే. ఒకసారి దిగి బయటకు వస్తే మళ్లీ డాలర్ న్నర పెట్టి టికెట్టు కొనుక్కోవాలి.

ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మనుషులను న్యూయార్క్ వీధులలో చూడవచ్చు. వివిధ దేశాల రుచులు ఆయా రెస్టారెంట్లలో చౌకగా తినవచ్చు. గ్రెనిచ్ విలేజ్ ఒక ప్రత్యేక ప్రాంతం నగరం మధ్యలో ఉన్నది. అక్కడ తిరిగి చూస్తే రచయితలు, కవులు, గాయకులు, చిత్రకారులు వివిధ సంఘాలవారు యథేచ్చగా వ్యక్తం చేయడం గమనించవచ్చు.

చిన్న చిన్న రెస్టరెంట్లు పేవ్ మెంట్ల మీద కనిపిస్తాయి. పక్కనే చెల్సీ ప్రాంతం కూడా వివిధ స్వేచ్ఛాపరుల సంచలనాలకు నిలయంగా ఉంది. పాత పుస్తకాలు బాగా లభించే, చౌకగా కొనుక్కోవటానికి వీలయిన స్ట్రాండ్ బుక్ షాపు కొంచం వెతికితే కనిపిస్తుంది.

వాల్ స్ట్రీట్ ప్రపంచ వాణిజ్యానికి పెత్తనం వహించే కేంద్రం. ఆ వీధిలో నడుస్తుంటే భవనాలు మీదపడతాయేమో అన్నట్టుంటుంది. అక్కడే స్టాక్ ఎక్స్ ఛేంజ్ కేంద్రంలోకి వెళ్లి చూస్తే మనకు అంతుపట్టని హడావుడి ఉంటుంది. సాయంత్రం 5గం.లకు ముగుస్తుంది.

న్యూయార్క్ వీధులలో అక్కడక్కడ సబ్ వేలో కొన్ని చోట్ల వివిధ వాయిద్య పరికరాలతో సంగీతం వినిపించే నల్లవారు కనిపిస్తారు. విని ఆనందించినవారు కొద్దోగొప్పో డబ్బులు పడేసి పోతుంటారు. అందరికీ సుప్రసిద్ధమయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట నిర్మణాలను ముస్లిం ఉగ్రవాదులు నాశనం చేసేవరకు అవి ఆకర్షణీయమైన యాత్రా స్థలంగా ఉండేవి. అక్కడకు ఎన్నోసార్లు వెళ్ళి పై వరకూ లిఫ్ట్ లో పోయి న్యూయార్క్ నగరాన్ని చూచాను.

సర్వసాధారణంగా యాత్రికులందరూ చూచేది లిబర్టీ విగ్రహం. ఇది ఫ్రెంచి వారు దానం చేశారు. అక్కడికి వెళ్ళి తిలకించి ఆనందించటం ఒక విశేషం.

న్యూయార్క్ రాష్ట్రంలో న్యూయార్క్ నగరం చాలా పెద్దది. కానీ రాష్ట్రానికి రాజధాని మాత్రం కొంచెం దూరంగా అల్బనీ అనే చోట పెట్టుకున్నారు. న్యూయార్క్ లో అతి ఖరీదైనవి అతి చౌకయినవి అన్ని రంగాలలోనూ ఉన్నాయి. తొందరగా చూడాలనుకునేవారు టూరిస్టు బస్సులలో గబగబ చూడవచ్చు. నగర ప్రముఖ వాణిజ్య ప్రాంతాలను డౌన్ టౌన్ అంటారు. కొన్ని ప్రాంతాలు కేవలం పేదవారు నల్లవారు నివసించేవి కనిపిస్తాయి. అలాంటి చోట మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన ఆఫీసు పెట్టుకున్నాడు. నగరంలో కేంద్ర రైల్వే స్టేషన్ ను టెన్ స్టేషన్ అంటారు. పూర్తి పేరు పెన్సిల్ వేనియా. ఇతర రాష్ట్రాలకు అక్కడనుండే రైళ్ళు వెడతాయి. మరొక పెద్ద కేంద్రం టైమ్ స్క్వేర్. అది వాణిజ్య వినోద వార్తా కేంద్రం.

న్యూయార్క్ లో ఇతర చోట్ల లేని ఒక ప్రత్యేకత థియేటర్ ప్రాంతం. బ్రాడ్ వే థియేటక్ అంటారు. ఇందులో 30 నాటక స్టేజీలున్నాయి. అక్కడ ప్రదర్శన రాణిస్తే ప్రపంచ ఖ్యాతి వస్తుంది. సంవత్సరాల తరబడి ఆడే నాటకాలున్నాయి. రోజుకు రెండు ప్రదర్శనలుంటాయి. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్టు కొంచెం ఖరీదనిపిస్తుంది. నాటకం చూసిన తరవాత ఖరీదు సంగతి మర్చిపోతాం. సైగాన్, డా. జకిల్ అండ్ మిస్టర్ హైడ్, లయన్ కింగ్ వంటివి బహుళ ప్రచారంలో ఆకర్షించాయి. నటుల వయస్సు పెరుగుతుంటే ఎప్పటికప్పుడు కొత్తవాళ్ళకి తర్ఫీదు ఇస్తుంటారు. దీని వెలుపల మరొక 30 థియేటర్లున్నాయి. వాటికి ఆఫ్ బ్రాడ్ వే అని పేరు పెట్టారు. తక్కువ ఖర్చులో నాటకాలు వేసుకోటానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ఆఫ్ ఆఫ్ బ్రాడ్ వే థియేటర్లు అంటారు. నాటకాలలో కొత్త ఫక్కీలు, వీధి నాటకాలు మొదలైన వాటికి అక్కడ అవకాశాలు కనిపిస్తాయి. వ్యయం కూడా తక్కువే ఉంటుంది.

న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి కేంద్రం ఉన్నది అది స్వతంత్ర ప్రాంతం. దానికి వేరే పాస్టాఫీసు తదితర సౌకర్యాలున్నాయి. వివిధ నాన్ గవర్నమెంట్ సంఘాలు పనిచేస్తుంటాయి. అందులో హ్యూమనిస్టు సంఘం కూడా ఉన్నది. నేను అనేక పర్యాయాలు అక్కడికి వెళ్ళాను. పిల్లలకు సంబంధించిన సమస్యలపై చర్చించి విషయ సేకరణ చేశాను.

న్యూయార్క్ లో బేలే ( Ballet)థియేటర్ మంచి ఆకర్షణ. ఇది ఖరీదును బట్టి యాత్రికుల నంతగా ఆకర్షించదు కాబట్టి స్టేజి ప్రియులకు గొప్ప నిలయం. ఎవరైనా ఉచితంగా తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు.

క్వీన్స్ ప్రాంతంలో టెన్నిస్ కోర్టు సముదాయం ఉన్నది. సెప్టెంబరులో యు.ఎస్. ఓపెన్ టెన్నిస్ జరుగుతున్నప్పుడు క్రీడా ప్రియులకు పండుగవలె ఉంటుంది. నేను టెన్నిస్ అటలకు వెళ్ళినప్పుడు అక్కడ క్రీడాకారులను చూడడం కొందర్ని పలకరించడం ఆనందదాయకమైన అనుభూతి. న్యూయార్క్ పెద్ద నగరం కావటం వలన అక్కడ పనిచేసే చాలామంది లాంగ్ ఐలండ్, న్యూజెర్సి, ఇంకా చుట్టుపట్లం నుండి వచ్చీ పనిచేసి పోతుంటారు. అదొక ప్రత్యేక లోకం. అక్కడున్నవారు జనం సందడికి అలవాటై, ఎక్కడికైనా వెడితే తోచనట్లుగా భావిస్తారు.

Wednesday, September 24, 2008

వాషింగ్టన్ లో- America experiences-2


pleasure to visit-Union station







Treasure of human knowledge




unique news museum in the world














వాషింగ్టన్ లో సందర్శకులు తిరిగి చూడటం చాలా సులభం. రైళ్ళు బస్సులు ఆ విధంగా అందుబాటులో ఉన్నాయి. ప్రతి స్థానిక రైలు రాజధాని మీదుగానే మేరీలాండ్, వర్జీనియాకు తిరుగుతుంటాయి. బస్సులు అంతే. అవిగాక టూరిస్టు బస్సులు రాత్రింబవళ్లు ఉన్నాయి. ఫెడరల్ ప్రభుత్వము అడుగుతున్న మ్యూజియంలు గనుక, స్మిత్ సానియన్ మ్యూజియమ్ లన్నీ ఉచితంగా చూడవచ్చు. అందరూ చూచే మ్యూజయమ్ లు ఎయిర్ అండ్ స్పేస్, చారిత్రక మ్యూజియమ్ లు. అయితే శిల్ప సంపద కళాఖండాలు ఉన్న మ్యూజియమ్, బొటానిక్ గార్డెన్ నల్లజాతి వారి మ్యూజియమ్ విశిష్టమైనవి.

యూనియన్ స్టేషన్

యూనియన్ స్టేషన్ కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు. ఫోటోలు తీసుకోకుండా బయటకు రాలేనంత ఆకర్షణీయంగా డోమ్ పై, గోడలపై చెక్కిన శిల్పాలు, మ్యూజియమ్ చూస్తున్నామా అనిపించేటట్లుంటాయి. అక్కడినుండే అన్ని రైళ్లు బయట ప్రాంతాలకు పోతాయి. సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. వివిధ దేశాలకు చెందిన ఫలహార శాలలు ప్రత్యేక ఆకర్షణ కాగా, అప్పడాలు, దోసెలు లభించే ఇండియన్ రెస్టరెంట్లు ఉన్నాయి. విక్టోరియా సీక్రెట్ తో సహా వివిధ షాపింగ్ సెంటర్లు పుస్తకాల షాపు పోస్టాఫీసు రోజంతా గడపడానికి వీలుగా ఉంటుంది.

స్టేషన్ కు ముందు నిలబడి చూస్తే, కేపిటల్ హిల్ (పార్లమెంట్ హౌస్), ఒక ప్రక్కన పురాతన పోస్టాఫీసు కనిపిస్తాయి. పాత స్టాంపులు, పోస్టల్ చరిత్ర సందర్ళకులకు చక్కని విద్యగా పనికొస్తుంది. స్టషన్ నుండి నడచి వెళ్ళి పార్లమెంటు, సుప్రీమ్ కోర్టు, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, పార్లమెంట్ సభ్యుల ఆఫీసు భవనాలు, మాల్, మాన్యుమెంట్లు చూడవచ్చు. అన్నట్లు ఏప్రిల్ లో వెళ్లేవారికి మాన్యుమెంట్ల దగ్గర సరస్సు దాని చుట్టూ విరబూసిన తెల్లని చెర్రీ బ్లాసమ్స్ కనుల విందు చేస్తాయి. జపాను వారిచ్చిన వాటిని జాగర్తగా పోషిస్తూ మాన్యుమెంటు దగ్గర ఏడాదికోసారి ఉత్సవం జరుపుతారు. తరచు మాల్ లో ప్రదర్శనలు జరుగుతుంటాయి. అందులో నిరసనలు కూడా చూస్తాం. సుప్రీంకోర్టు చూసేవారు లోనకు ప్రవేశించగానే కనిపించే లా మేకర్స్ విగ్రహాలు గోడలపై నిలువెత్తున చెక్కి ఉండడాన్ని చూస్తారు. సాధారణంగా ఎక్కడా కనిపించని ప్రవక్త మహమ్మదు విగ్రహం ఆశ్చర్యపరుస్తుంది. ఇస్లాం చట్టాన్ని అందించిన దృష్ట్యా ఆ విగ్రహం పెట్టారు.

లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్

ఇది మూడు భవనాల సముదాయం. జఫర్సన్, మాడిసన్, యాడమ్స్ అనే ముగ్గురు అమెరికా అధ్యక్షుల పేరుతో ఉన్నాయి. మూటిని కలుపుతూ స్వరంగ మార్గాలున్నాయి. ఈ భవనాల పై ఉన్న తాత్వికుల కళాకారుల, కవుల, చరిత్రకారుల విగ్రహాలు, శిల్పాలు, చిత్రాలు, వారి వచనాలు ఎవరినైనా ఆకట్టుకొనక మానవు. సందర్శకులకు పైపైన చూబెడతారు. సభ్యత్వం ఉన్నవారు లోన సౌకర్యాలు వినియోగించుకోవచ్చు. పుస్తకాలు ఇంటికి ఇవ్వరు. అక్కడ చదువుకొని కావాలంటే కాపీ చేసుకోవచ్చు. అలాగే పత్రికలు, డాక్యుమెంట్లు, సినిమాలు కూడా కాపీ చేసుకోవచ్చు. నిత్య నూతనంగా సేకరణ చేస్తున్న ఈ గ్రంథాలయంలో 13 కోట్ల పుస్తకాలు తదితరాలు ఉన్నయి. ఏషియా, ఆఫ్రికా విభాగాలపై బాగా దృష్టి పెట్టారు. సభ్యులకు వేరోచోట నుండి పుస్తకాలు, సమాచారం తెప్పించి పెడతారు. పార్లమెంటు సభ్యులకు లైబ్రరీ సహాయం ఇంతా అంతా కాదు. ఎప్పుడూ చిన్న సమావేశాలు, చర్చలు, ప్రదర్శనలు జరుపుతుంటారు. ఫ్రాయిడ్ పై జరిపిన ఒక ప్రదర్శనను నేను చూడగలిగాను. పుస్తక సేకరణకు ప్రపంచ వ్యాప్తంగా కేంద్రాలు నెలకొల్పారు. అన్ని భాషలకు సంబంధించినవి సేకరిస్తున్నారు. అనువాదాలు తీసుకోరు. నేను కేటలాగ్ పరిశీలించినప్పుడు తెలుగువారి రచనలెన్నో ఉండటం గమనించాను. నా రచనలన్నీ ఉన్నాయి. చోటు కోసం మైక్రో ఫిల్మ్ చేస్తూ పోతున్నాను.

వాషింగ్టన్ లో జార్జి టౌన్ కు వెళితే చారిత్రక కట్టడాలు వివిధ దేశాల రెస్టరెంట్లు, వివిధ దేశాల సినిమాలు ప్రదర్శించే చోట్లు కనిపిస్తాయి. కెనడి, ఫోర్డ్ థియేటర్లు పేర్కొనదగినవి. పొటామిక్ నది రాజధానిలో ప్రవహిస్తుండగా దాని చుట్టూ ఎన్నో చూడవలసిన విశేషాలు ఉన్నాయి. రాను రాను అధ్యక్ష భవనం (వైట్ హౌస్) సందర్శన రక్షణ కట్టుబాట్ల దృష్ట్యా పరిమితం చేశారు. మ్యూజియం అనేది ప్రపంచంలో పత్రికల, మీడియాకు చెందిన ఒక ప్రత్యేక ప్రదర్శన స్థలం వార్తా సేకరణలో చనిపోయిన విలేఖర్ల జ్ఞాపకార్థం ఫ్రీడం పార్టు ఏర్పాటు చేశారు. మీడియా వారు దీనిని చూడకుండా రాకూడదు.

Tuesday, September 23, 2008

మరోకోణంలో అమెరికా విశేషాలు – 1

అమెరికా రాజధాని వాషింగ్టన్ లో లోగడ నుండి ఇప్పటి వరకు అనుభవాలు, అనుభూతులు, వ్యక్తుల కలయిక, సమావేశాలలో పాల్గొనడం విశేషంగా పేర్కొనదగిన ప్రదేశాలు, పరిశోధనలు క్లుప్తంగా వివరిస్తాను.

1992లో తొలిసారి అమెరికా రాజధాని వాషింగ్టన్ లో అడుగు పెట్టాను. ఇండియా నుండి, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి యాత్రికులు రాజధానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. న్యూయార్క్, చికాగో, డెట్రాయిట్, న్యూజెర్సీ, లాస్ ఏంజెలస్, అట్లాంటా ఎక్కువగా సందర్శిస్తుంటారు. ఇటీవల రాజధాని సందర్శనకు ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నది.

వాషింగ్టన్ లో చూడడానికి మ్యూజియంలు, మాన్యుమెంట్లు, లైబ్రరీలు, ఉన్నాయి. తిరగడానికి బస్సులూ, రైళ్ళ సౌకర్యం బాగా ఉన్నందున ఎవ్వరి మీదా ఆధారపడకుండా ఆనందించవచ్చు.

వాషింగ్టన్ ఆశ్చర్యకరంగా అతిచిన్న నగరం. కేవలం ఆరు లక్షల జనాభా మాత్రమే ఉన్నారు. ఇది నల్లవారి ఆధిపత్యాన ఉన్నది. ఎప్పుడూ నీగ్రో మేయర్ ఎన్నికవుతుంటారు. రాజధాని చుట్టూ మేరీలాండ్, వర్జీనియా రాష్ట్రాలు ఉండడం వలన రాజధాని వచ్చి పనిచేసి వెళ్ళిపోతుంటారు. ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా రాజధానికి ఎయిర్ పోర్టు లేదు. ఉన్నవన్నీ వర్జీనియాలో నెలకొన్నాయి. మూడు నదులు ప్రవహిస్తున్న రాజధానిలో సాధారణంగా సందర్శకులు చూచేవి మాన్యుమెంట్లు, మ్యూజియంలు. కానీ చూడవలసినవి, తెలుసుకోవలసినవి వేరే ఉన్నాయి. ఇప్పుడు ఆ కోణాలు చూద్దాం.

Thursday, September 18, 2008

బాబా విభూది ఎలా యివ్వగలిగాడు


Sanal (now in Delhi) distributes holy ash








ఎటుచూచినా జనం భక్తులు పారవశ్యంతో చెంపలు వేసుకుంటూ టక్కర్ బాబాను చూస్తున్నారు. కొందరు పాదాలపై పడుతున్నారు. కాషాయ వస్త్రాలతో మెడలో రుద్రాక్షలతో, కర్క చెప్పులతో బాబా ఏవో మంత్రాలు చెబుతూ భక్తులకు విభూది యిస్తున్నాడు. అది కళ్ళకు అద్దుకొని, నొసట బొట్టుగా పెట్టుకుంటున్నారు. అంతమంది భక్తులకు హఠాత్తుగా బాబా విభూది ఎలా యివ్వగలిగాడు? చేతులు అటూ ఇటూ తిప్పి, తరువాత భక్తులకు విభూది యిచ్చిన బాబా మహత్తును కొనియాడుతున్నారు.
ఒక సందేహవాదికి అనుమానం కలిగింది. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని అడిగారు. ఆయన వెంటనే చేతులు అటూ ఇటూ తిప్పి యిచ్చారు. సందేహవాది ఆశ్చర్యపోయి, ఎలా సాధ్యమైంది అని అడిగాడు. ప్రేమానంద్ వివరించాడు. విభూది వుండను చూపుడువేలు బొటనవేలు మధ్య పెట్టుకోవాలి. అలా వుంచి కూడా, నమస్కారం పెట్టవచ్చు. కరచాలనం చేయడం అలవాటు చేసుకోవచ్చు. తరువాత చేతిని అటూ ఇటూ తిప్పాలి. వేళ్ళ మధ్య వున్న విభూది వుండను అరచేతిలోకి తెచ్చి పొడిచేసి, కొంచెంగా భక్తులకు పంచాలి. బాబా చేసే పని యిదే పదార్థం లేకుండా. సృష్టి కాదు. బాబా దగ్గరకు వచ్చే భక్తులు అనుమానంగా ప్రశ్నించడానికి రారుగా? అందు వలన బాబాచేసే ట్రిక్కులు, మాజిక్ లు భక్తులకు అద్భుతాలుగాకనిపిస్తాయి.
సువాసనవచ్చే విభూదిని గంజి నీళ్ళతో కలిసి వుండలు చేసి అట్టి పెట్టుకుంటే యీ పని చేయవచ్చు. సాయిబాబా మొదలు శివానంద వరకూ ఏ బాబా చేసినా యింతే. లోగడ అబ్రహాం కోవూరు కూడా చంకలో నుండి ఒక గొట్టాన్ని లాల్చీలో అమర్చి, అందులో నుండి విభూది కావలసినంత తెప్పించేవాడు.
భక్తులు ఎక్కువగా వున్నప్పుడు బాబా వారి వద్దకు వెళ్ళి విభూతి ఇస్తారు.అక్కడక్కడా తన వారిని పెట్టుకుంటారు.విభూతి ఇస్తున్నట్లే చూపి తనవారి నుండి విభూతి వుండ తీసుకుంటారు.అలా ఎంతమందికైనా విభూతి పంచి మహిమగా చూపవచ్చు

సర్వరోగ నివారిణి ఆయిల్ పుల్లింగ్

ఇటీవల చదువుకున్న వారినీ, సామాన్య అమాయకుల్నీ అవరించిన వైద్యం ఆయిల్ పుల్లింగ్. నూనె నోట్లో పోసుకొని కొంచెం సేపు పుక్కిలించి తరువాత వూసేయడం యిందులో ప్రధానం. మస్టర్డ్, సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. ఆయిల్ రంగు మొదట్లో ఎలా వున్నా నోట్లో పోసుకుని కాసేపు పుక్కిలించేసరికి, నోట్లో లాలాజలంతో కలసిపోతుంది. అలా కలవడం వలన నూనె రంగు మారుతుంది. రంగు మారటాన్ని చికిత్సగా భావిస్తున్నారు. అంతేగాక అన్ని రోగాలకు యిది మందు అని ప్రచారం చేస్తున్నారు. ఇలా నూనె పుక్కిలిస్తున్న వారు కొందరు తమకు ఏదో రిలీఫ్ యిచ్చినట్లున్నదని భావిస్తున్నారు. శరీరంలో సహజంగా వున్న రోగనిరోధక శక్తి వలన తగ్గిపోయే లక్షణాలుంటాయని వీరు గమనించడం లేదు.
తాంత్రికులు, మాంత్రికులు లోగడ కామెర్ల (జాన్ డిస్) రోగులకు ఆయిల్ యిచ్చి బాగా పుక్కిలించమనేవారు. కాసేపటికి వూసేస్తే అది లాలాజలంతో కలసినందున పసుపుపచ్చగా మారేది. అది చూపించి, జబ్బు తగ్గిందని, పథ్యం చెప్పేవారు. కాలేయం, లివర్ కు విశ్రాంతి యిస్తే తగ్గే రోగాలకు అలా చెప్పి జనాన్ని భ్రమింపజేయడం చిరకాలంగా వస్తున్నదే.

.

శరీరంలో ఉష్టోగ్రత మహత్తు

వూళ్ళోకి స్వాములు వారు వేంచేశారు. భక్తులు యధాశక్తి కానుకలు అర్పిస్తున్నారు. రోజూ ఆయన చెప్పినట్లు పూజలు చేస్తున్నారు. స్వామి ఆకర్షణీయంగా చెప్పే మాటలకు పారవశ్యం చెందుతున్నారు. కొత్తగా వచ్చిన స్వామి, రోజుకో మహత్తు చూపి భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు.
ఆ రోజు స్వామి కోసం భక్తులు ఎదురు చూసి విసిగిపోతున్నారు. ఎంతకూ వేదికపైకి ఆయన రాలేదు. చివరకు శిష్యుడు వచ్చి స్వామి రాకను ప్రకటించారు. స్వామివారు రాగానే, వూళ్ళో డాక్టరును పిలిపించమన్నారు. డాక్టర్ రాగానే థర్మామీటరుతో ఉష్టోగ్రత చూడమన్నారు. మామూలుగా వున్నది. కాసేపువున్న తరువాత మళ్ళీ చూడమన్నారు. ఈసారి 104 డిగ్రీలతో ఒడలు మండిపోతున్నది. అయినా స్వామి చలించలేదు. ఇంతలో ఏం జరిగిందో తెలియని భక్తులు స్వామి మహత్తుకు అబ్బురపడి దండాలు పెట్టి నోరు మూసుకున్నారు.
డాక్టరు వస్తున్నప్పుడే సబ్బు ముక్క చప్పరించి మింగిన స్వామి, కొద్దిగా తేనీరు సేవించారు. ఆ విషయం భక్తులకు తెలియదు. తీర్థం పుచ్చుకుంటున్నాడని భ్రమించారు.
కడుపులో సబ్బునందుగల క్షారం (ఆల్కలీ)తో తేనీటిలోని ఆమ్లం (యాసిడ్) మిళితం కాగా, రసాయనిక మార్పు జరిగి వేడి పుడుతుంది. ఇది కృత్రిమంగా సృష్టించిన ఉష్టోగ్రత, భక్తులు ఆశ్చర్యపడుతుండగా స్వామి ఏమీ పుచ్చుకోకుండా కేవలం చల్లని నీరు తాగుతూ డాక్టరు ఇస్తామన్న మందులు, ఇంజక్షన్ పుచ్చుకోరు. చల్లని నీరు వలన కడుపులో మంట, ఉష్టం తగ్గిపోతుంది. అదంతా దివ్యశక్తిగా భక్తులు భావిస్తారు.

.

Wednesday, September 17, 2008

నాడి కొట్టుకోకుండా ఆపగలరా?








బ్రతికినంత కాలం నాడి కొట్టుకుంటుంది. నాడి ఆగడం అంటే చనిపోవడమే. కాని సిద్ధులు తమ తపస్సు వలన, శక్తిని సాధించి, నాడి సైతం ఆపగలరని ప్రచారంలో వుంది. భక్తులు యిది కళ్ళారా చూచినపుడు నమ్మక చేసేదేముంటుంది.
వూళ్ళోకి వచ్చిన స్వాములవారు ఇంకోరోజు డాక్టరును పిలుచుక రమ్మన్నారు. ఆ వేళ ఏమి అద్భుతం జరుగుతుందోనని భక్తులు ఎదురుచూస్తుండగా, నాడి చూడమని స్వామివారు చెయ్యి చాచారు. డాక్టరు పరీక్షించి, సాధారణంగా, నాడి ఆడుతున్నట్లు ప్రకటించారు.
స్వామీజీ యిలోగా ఏవో మంత్రాలు చదివారు. సంస్కృతంలో వున్న ఆ మంత్రాలకు అర్థం తెలియక భక్తులు దండాలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ నాడి చూడమని డాక్టర్ కు సైగ చేశారు. ఈసారి చూచిన డాక్టర్ నాడికొట్టుకోవడం లేదని చెప్పాడు. మళ్ళీ చూచారు. సెతస్కోప్ కు నాడీ శబ్దం అందలేదు.
భక్తులు సాష్టాంగపడ్డారు. ఇంకా కొందరు విరాళాలు గుప్పించారు.
హేతువాది ప్రేమానంద్ వచ్చి తానూ నాడి చూస్తానన్నారు. స్వామీజీ చేయి అందించారు. స్వామీజీ రెండు చేతుల్నీ పైకి ఎత్తిన ప్రేమానంద్, చూస్తుండగానే, స్వామీజీ రెండు చంకల నుండి రెండు నిమ్మకాయలు కిందపడడం భక్తులు చూచారు. చంకలో నిమ్మకాయలు గాని చేతి రుమాలు వుండగా చుట్టిగాని పెట్టి గట్టిగా నొక్కితే రక్తప్రవాహం ఆగి నాడి ఆగినట్లు అవుతుంది. హేతువాది వలన స్వామీజీ గుట్టు బయటపడింది గాని లేకుంటే గిట్టుబాటు వ్యాపారమే.

సమాధిలో యోగులు

కారేశ్వరి బాబా సజీవ సమాధి అవుతారని ఢిల్లీలో వార్త ప్రాకింది. ఇంకేముంది? భక్తులు ఆఫీసులకు సెలవు పెట్టి వచ్చేశారు. బాబా గుడ్డి, చెవిటి, మూగవాడు. ఆ విషయం తెలిసి ఆయనపై యింకా ఆసక్తి పెరిగింది.
10 అడుగుల లోతు 2.5 అడుగల చతురస్రపు సమాధి తయారు చేశారు. సిమెంటు చేసిన సమాధిలో కారేశ్వరి బాబా ప్రవేశించారు. అది 1980 అక్టోబరు మాసం.
సమాధిలో ప్రవేశించడం కళ్ళారా చూచిన భక్తులు, చుట్టూ చేరి భజనలు చేశారు. 24 గంటల అనంతరం సమాధి తెరిచి చూచారు.
ఆశ్చర్యపోవాల్సిన భక్తులు నోరు నొక్కుకున్నారు. కారేశ్వరి బాబాను పురుగులు తింటున్నాయి. ఆయన చనిపోయాడు.
ఏం జరిగింది? మహత్తు ఏమైంది?
హేతువాది ప్రేమానంద్ భక్తులకు వివరించారు. సిమెంట్ చేయని సమాధి అయితే నేలలోని రంధ్రాల ద్వారా ప్రాణవాయువు వస్తుంటుంది. అందు వలన 24 గంటలు వుండగలరు. సిమెంట్ చేసిన సమాధిలో కారేశ్వరి బాబా నిమిత్తం ప్రత్యేకంగా ఆక్సిజన్ వచ్చేట్లు ఏర్పాటు చేశారు. అయినా ఎందుకు చనిపోయాడు? గాలి బయటకు పోవడానికి ఏర్పాట్లు చేయలేదు. వత్తిడి పెరిగినందున కారేశ్వరి బాబా చనిపోయాడు.
పైలట్ బాబా అనే అతడు కూడా జీవసమాధి అవుతానని చాలాసార్లు ప్రకటించాడు. కాని సాహసించలేకపోయాడు.

Tuesday, September 9, 2008

చిట్కాలతో సంతానం

నీవు బాబా కావచ్చు! (మాతకూడా!)
గిట్టుబాటు వ్యాపారమే
.



పిల్లలు పుట్టనివారికి మానసిక బలహీనత వుంటుంది. ఎలాగైనా సరే సంతానం పొందాలి. ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇరుగుపొరుగు వారు సలహాలు చెబుతుంటారు. మొక్కుబడులు చేయిస్తుంటారు. గుడులకు పంపిస్తుంటారు. అంతటితో ఆగక, బాబాలకు, మాతలకు పరిచయం చేస్తుంటారు. సంతానం కలిగిస్తామని చెప్పే బాబాలు అనేక చిట్కాలు చేయిస్తారు. ధనాన్ని వివిధ రూపాలుగా రాబడతారు. కొందరు ఇళ్ళలో తిష్టవేసి ఏవేవో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, క్రతువులు చేయిస్తారు. ఆ విధంగా ఖర్చుపెట్టి ఆరిపోయిన వారున్నారు. అయితే సంతాన ఆశ వారిచేత ఏ పనైనా చేయిస్తుంది. ఎంతకూ తమ ఖర్మ అనుకుంటారే గాని, చేస్తున్న పనులకూ, సంతాన ప్రాప్తికీ సంబంధం లేదని గ్రహించరు.
ఒక స్వామి సంతానప్రాప్తి పరీక్షగా పాత్రలో బియ్యం పోసి, కత్తి అందులో దింపి, కత్తితో పైకెత్తినప్పుడు పాత్ర పైకిలేస్తే, సంతానప్రాప్తి కలుగుతుందనీ, లేకుంటే లేదనీ చెబుతాడు. హేతువాది ప్రేమానంద్ కొన్ని వేల పర్యాయాలు ఈ చిట్కా వేసి చూపెట్టాడు. దీనికి సంతానానికి ఎలాంటి కార్యకారణ సంబంధం లేదని స్పష్టం చేశాడు.
అడుగుభాగం వెడల్పుగానూ, మూతివద్ద సన్నంగానూ వుండే పాత్ర తీసుకోండి. అందులో బియ్యం నింపి, ఒక నిడువైన కత్తితో పొడుస్తూ వుండండి. బియ్యం పాత్ర అడుగున బాగా బిగుసుకు పోయినప్పుడు కత్తిని అడుగువరకూ దింపి, పిడి పట్టుకొని పైకి ఎత్తితే బియ్యం పాత్ర పైకి లేస్తుంది. బియ్యం బాగా బిగుసుకుపోవడం యిక్కడ ముఖ్యం. అలా జరిగిన తరువాత కత్తిని దింపితే, గట్టిగా పట్టుకుంటుంది. దీనికీ సంతానానికీ ముడి పెట్టడం

.

Monday, September 8, 2008

బాబా పూనకం

ప్రతిరోజువలె నేడు కూడా బాబా 12 గంటలకు దర్శనం యిస్తారని భక్తులు చెప్పారు. దర్శనార్థం వచ్చినవారు కానుకలు సమర్పించి, ప్రార్థనలు చేస్తున్నారు.
రోజూ రావలసిన సమయానికి బాబా రాలేదు. ఒక శిష్యుడు వచ్చి నేడు బాబాకు పూనకం వచ్చింది. అమ్మవారి దర్శనం ఆయనతో పాటు యితరులకు సైతం చూచే భాగ్యం కల్పిస్తారని ప్రకటించారు.
బాబా రానున్న సందర్భంగా ఒక తెల్లని వస్త్రం పరచారు. బాబా కాళ్ళను కడిగిన భక్తుడు, ఆ నీళ్ళను కళ్ళకు అద్దుకున్నారు. అప్పుడు ప్రవేశించిన బాబా ఆ తెల్లని వస్త్రంపై పాదాలు పెట్టగానే, అమ్మవారి పాదాలవలె ముద్రలు పడ్డాయి. బాబా, పూనకం వచ్చినట్లు ఏవేవో మంత్రాలు చదివారు. గ్రామస్తులు ఏం చేయాల్సిందీ చెప్పారు. తెల్లని వస్త్రంపై ఎర్రని పాదముద్రలు అక్కడి భక్తులంతా కళ్ళారా చూచారు.
భక్తులలోని ఒక సందేహవాది యీ విషయాన్ని హేతువాది ప్రేమానంద్ కు చెప్పారు. ఆయన విషయ వివరణ చేశారు.
బాబా వచ్చేముందు పరచిన తెల్లని వస్త్రం అంతకు ముందే పసుపు ద్రావకంలో తడిపారు. ఎండబెట్టారు. వస్త్రం అంతటి పసుపు పౌడర్ ను దులిపారు. వస్త్రం మళ్ళీ తెల్లగా కనిపించింది. బాబా ఆ వస్త్రం పై నడవబోయే ముందు భక్తుడు కాళ్ళు కడిగాడు గదా. ఆ నీళ్ళ నిమ్మరసం కలిపిన నీళ్ళు. ఆ కాళ్ళతో బాబా తెల్లని వస్త్రంపై నడిచారు. అంతకు ముందే పసుపు ద్రవంలో తడిపిన వస్త్రం గనుక నిమ్మరసం తగలగానే కాలిముద్రలు ఎర్రగా పడ్డాయి. పసుపు, నిమ్మ కలసినందున ఎర్రగా మారిందనేది అసలు రహస్యం. దీనిని పూనకంగా చూపి బాబా భ్రమింపచేశారు. ప్రేమానంద్ వివరణతో గుట్టు బట్టబయలైంది.

Sunday, September 7, 2008

ఆక్యుపంక్చర్ కథాకమామిషు


unverified belief points in china









Points for needles







Acupuncture in China













చైనాలో అనాదిగా వస్తున్న సూదుల వైద్యాన్ని ఆక్యుపంక్చర్ అంటారు. శరీరంలో జీవశక్తి ప్రవహిస్తుంటుందని, దీనిని చి, కి అని అంటారని ఈ వద్యంలో మూల సూత్రంగా చెప్పారు. శరీరంలో జీవశక్తి ప్రవహించే మార్గాలను మెరిడియన్ అని పిలిచారు. ఇవి నిలువుగానూ, అడ్డంగానూ పయనిస్తుంటాయని, శరీరం పై భాగంలో ఇవి కలిసే చోట్లు 365 ఉన్నాయని నమ్మారు. ఆక్యుపంక్చర్ వైద్యంలో రోగ నిర్ణయానికి నాడి చూడడం ఒక పద్దతిగా వస్తున్నది. పురుష శక్తిని యంగ్ అంటార.



. మెరిడియన్ గుర్తించిన చోట్లు రెండు వేల వరకూ పెరిగాయి. శరీరంలో ఈ శక్తులు ఉన్నాయనీ. స్త్రీ శక్తిని ఇన్ అంటారనీ, పురుష శక్తిని యంగ్ అంటారనీ నమ్మారు. శరీరంలో ఈ శక్తులు తులనాత్మకంగా ఉండటానికి అనువుగా సూదులు గుచ్చి ప్రకోపింప చేసి సరైన పద్ధతిలో పెట్టవచ్చునని నమ్మారు. రుతువులూ, వాతావరణం రోజులో సమయం, నాడి ఆధారంగా రోగ లక్షణాలను నిర్దారిస్తారు. దేహంలోని అంగాలకు ప్రాతినిధ్యం వహిస్తూ మణికట్టు వద్ద నాడి ఆరు విధాలుగా ఆడుతుందన్నారు. ప్రతినాడీ ప్రకంపనానికి 25 లక్షణాలున్నాయన్నారు. చికిత్స ప్రారంభించేముందు రోగి నాడిని ఆధారంగా 300 నాడీ ప్రకంపనాలను పరిశీలిస్తారు. సూదులను ఆయా శరీర భాగాలలో గుచ్చి ఎంతసేపు ఉంచవలసిందీ రోగి లక్షణాలను బట్టి నిర్ణయిస్తారు. ఈ సూదులు 6 అంగుళాల నుండి 12 అంగుళాల వరకూ ఉంటాయి. ఒక మూలికను ( ) ఆయా శరీర భాగాల మీదగానీ, పుండు పడిన చోట గానీ ఉంచి వేడి చేస్తారు. ఏ రోగానికైనా ఈ సూది మందులు పనిచేస్తాయని నమ్మారు. రోగనిర్ధారణలో నాలుకను కూడా పరిశీలిస్తారు.
ప్రాచీన చైనాలో శరీరాన్ని కోసి చూడటం నిషిద్ధం. కనుక శరీరంలో ఏ
ఆక్యుపంక్చర్ విరోచనాలకు, కంటిజబ్బులకు, ముక్కు దిబ్బడలకు, గొంతు నొప్పికి, ఉబ్బసానికీ, కీళ్ళ వాతానికీ, శరీరంలో పుండ్లకు పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీనికి శాస్ర్తీయ ఆధారాలు చూపలేకపోయింది. ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులకు, తలనొప్పి, మలబద్ధకం, లైంగిక వ్యాధులూ, అలసట వంటి లక్షణాలకు ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని జోసఫ్ హెల్మ్ ప్రకటించారు. ఇందుకు ఆధారాలు శాస్త్రీయంగా చూపమన్నప్పుడు అందుకు నిలబడలేకపోయారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ పనిచేస్తుందని జోసెఫ్ హెల్మ్ ప్రకటించారు. ఇందుకు ఆధారాలు శాస్త్రీయంగా చూపమన్నప్పుడు అందుకు నిలబడ లేకపోయారు. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ అమెరికా, ఇండియా తదితర దేశాలలో ప్రచారంలో ఉన్నది. దీనిని ఆచరించేవారు ఆధునిక వైద్య విధానాలను జోడించటానికి ప్రయత్నిస్తున్నారు. కాని శాస్త్రీయ పరిశోధనలలో ఇంతవరకూ ఆక్యుపంక్చర్ ఏ ఒక్క సిద్ధాంతాన్నీ రుజువుపరచలేకపోయింది.

Acupuncture in United States of America





ఆక్యుపంక్చర్ లో శాస్త్రీయత ఎంత
ఆక్యుపంక్చర్ లో అనేక నమ్మకాలున్నాయి. ఆలోచనకు కేంద్రం స్ప్లిన్ అంటారు. కన్నీళ్ళు రావటానికి కాలేయం కారణం అంటారు. భయానికీ, ఇచ్ఛకూ కేంద్రం మూత్రకోశాలన్నారు. చెవులలో ఉన్న కేంద్రాలు శరీరంలో ప్రతి భాగానికీ ప్రతిబింబిస్తాయని నమ్మారు. ఆక్యుపంక్చర్ ప్లాసిబ్ ప్రభావాన్ని చూపుతున్నది. నొప్పులకు ఉపశమనం కలిగిస్తుందనే నమ్మకం ఈ వైద్యంలో ఉన్నది. మందులు వాడరు గనుక ఈ చికిత్స వలన చెడు ఫలితాలు లేవనీ, ఎలాంటి దోషాలూ రావని ప్రచారం చేశారు. అయితే, సూదుల్ని గుచ్చెటంలో జాగ్రత్త వహించకపోతే నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నది. ఎయిడ్స్ వంటి వ్యాధులు ఈ సూదుల వలన వ్యాపించే అవకాశం ఉన్నది. ఒకరికి గుచ్చిన సూదులు ఎంత శుద్ధి చేసినప్పటికీ మరొకరికి ప్రయోగించినప్పుడు సూక్ష్మ జీవులు వ్యాపించే అవకాశం ఉన్నది. ఒకరికి చేసిన సూదులు ఎంత శుద్ధి చేసినప్పటికీ మరొకరికి ప్రయోగించినప్పుడు సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉన్నది. ఇటీవలనే ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇది జర్మనీ నుండి వచ్చింది. దీనివల్ల రోగి లక్షణాలను నిర్దుష్టంగా నిర్ణయించి చికత్స చేయవచ్చునని చెప్పారు. రెయినాల్డ్ ఓల్ అనే అతను ఆక్యుపంక్చర్ కు ఆధునిక రీతులు చేర్చి మెరిడియన్ ను కచ్చితంగా నిర్దారించానికి యిది ఉపకరిస్తుందన్నారు. ఇందుకుగాను, సూదివైద్యానికి గాల్వనోమీటర్ చేర్చాడు. శరీరంలో జీవశక్తి ప్రవహించే కేంద్రాలు తెలుసుకోవటానికి ఈ పద్ధతిని ప్రయోగించాడు. అయితే మరే విధమైన పరీక్షలూ చేయటం కానీ, రోగి చరిత్రను తెలుసుకోవటం కానీ ఈ విధానంలో లేదు. మరికొందరు ప్రాచీన ఆక్యుపంక్చర్ విధానాన్ని కొంతవరకు మార్చివేసి కొత్త రీతుల్ని ప్రవేశపెట్టారు. జీవశక్తి ప్రవహించే చోట్లు బాగా తగ్గించారు. సూదులకు విద్యుత్ ప్రవాహం కల్పించి శరీరంలో గుచ్చే రీతుల్ని కూడా వాడుతున్నారు. ప్రాచీన పద్ధతిపై మెరుగులు దిద్దినట్లు వీరు చెప్పుకుంటున్నారు.
ఆక్యుపంక్చర్ లో సూదులు వాడకుండా ప్రవేశపెట్టిన కొత్తపద్ధతిని ఆక్యు ప్రెషర్ అంటున్నారు. ప్రాచీన చైనాలో యిదికూడా ఉండేది. శరీరంలో జీవశక్తి ప్రవహించే చోట్లలో సూదులు గుచ్చకుండా చేతులతో నొక్కడం, మెల్లగా మర్దన చేయటం ఈ విధానంలో ప్రత్యేకత.
ఆక్యుపంక్చర్ శిక్షణ సంవత్సరాల నుండి కేవలం కొన్ని గంటల వరకు పరిమితమైన రీతులు ప్రవేశపెట్టారు.
ఆక్యుపంక్చర్ వైద్యంలో వివిధ ప్రమాదాలను గుర్తించారు. ముఖ్యంగా సూదుల్ని గుచ్చటంలో, కొన్ని సందర్భాలలో నరాలు తెగటం, సున్నితమైన అంగాలు దెబ్బతినటం, ఊపిరితిత్తులలో గుచ్చినపుడు రక్తం చింది ప్రమాదానికి గురికావటం సంభవించింది. కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఆక్యుపంక్చర్ విధానంలో ముఖ్యంగా చైనాలో సూదులను స్టెరిలైజ్ చేయటం ఉండేది కాదు. సూక్ష్మ క్రిములు రోగాలను తెస్తాయనే విషయం వారికి తెలియదు. అందువలన ఈ సూదులు అంటురోగాలను వ్యాపింపజేశాయి. చైనాలో సూదులను సారాలో అట్టిపెడతారు. కాని, సారా వైరస్ ను సంహరించలేదని వారు గ్రహించలేకపోయారు. సూదులు గుచ్చినప్పుడు, ఒక్కొక్క సందర్భంలో అవి సన్నగా పలుచగా ఉండి విరిగిపోవటం, శరీరం నుండి వాటిని తొలగించడానికి ఆపరేషన్ అవసరం కావటం కూడా నమోదయ్యింది. విద్యుత్ లో సూదులను ప్రకంపనానికి గురిచేసినప్పుడు వాటి సమయ ప్రభావాన్ని గుర్తించనందున నరాలు శాశ్వతంగా దెబ్బతిన్న సందర్భాలున్నాయి. వెన్నెముకలో సూదులు గుచ్చి చికిత్స చేస్తున్నప్పుడు కొందరు పక్షవాతానికి గురయ్యారు. కాళ్లూ, చేతులకు వెన్నెముక నరాలతో సూటిగా, సంబంధం ఉండటం అలాంటి నరాలపై సూదులు గుచ్చటం యిందుకు కారణం. చెవులపై సూదులు గుచ్చే ప్రక్రియను అరిక్యులో థెరపీ అంటారు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు ఇందుకు వారు చెప్పే కారణాలు రుజువుకు నిలబడ లేదు.
చైనాలో ఆక్యుపంక్చర్ విధానం ఉంది గనక ఇది కమ్యూనిజానికి సంబంధం ఉన్న వైద్యంగా భారత దేశంలో కొంతమంది భ్రమపడిన సందర్భాలు లేక పోలేదు. చైనా వెళ్లి శిక్షణ పొంది వచ్చి, ప్రాక్టీసు పెట్టినవారూ ఉన్నారు. బహుశ వారు చైనాలో చూసి వచ్చిన తరువాత కమ్యూనిజానికి ఎలాంటి పొత్తూ దానికి లేదని గ్రహించే ఉంటారు. చైనా జనాభాకు కావలసినంత మంది ఆధునిక వైద్యులు లేరు. కమ్యూనిజం అధికారంలోకి వచ్చిన తరువాత శాస్త్రీయ వైద్య విధానాన్ని అనుసరించినప్పటికీ అందరికీ వైద్య సదుపాయాలు అందించలేక విమర్శలు తట్టుకునే నిమిత్తం బేర్ ఫుట్ డాక్టర్ల పద్ధతిని కొనసాగించారు. చైనా అధునాతన వైద్య పత్రికలు పద్ధతులూ గమనించిన వారు, ఆక్యు పంక్చర్ వారి అధికార విధానం కాదని తెలుసుకోగలరు. నిరాధార మైన నమ్మకాలపై కొనసాగుతున్న సూదుల వైద్యం శాస్త్రీయ పద్ధతిని కోరుకునే కమ్యూనిజం ఆమోదించలేదు.

Saturday, September 6, 2008

తాంత్రికుల అగ్ని పరీక్ష

















తాంత్రిక విద్య వింతగా, భయానకంగా వుంటుంది. తాంత్రిక యోగంలో స్త్రీ వుండాలనేది నిషేధానికి గురైంది. తాంత్రిక విద్య బహుళ ప్రచారం పొందకపోయినా, అక్కడక్కడా ఆచరణలో వుంది, తాంత్రికులు అనేక విచిత్ర చర్యలు చేస్తుంటారు. వారి భీభత్సభక్తికి నిదర్శనగా చాలా ప్రయోగాలు పేర్కొనవచ్చు.
ఒక లోహపాత్రలో రంపపు పొడి వుంచి అందులో సోడియం పెరాక్సైడ్ పొడి కలుపుతారు. భక్తులలో ఒకరిని పిలిచి నీళ్లు తెమ్మంటారు. నీళ్ళు గుక్కెడు తాగి, రంపపు పొట్టుపై వదలుతారు. నీరు తగలగానే సోడియం పెరాక్సైడ్ వలన మంటలు లేస్తాయి. అప్పుడు తాంత్రికుడు ఏవో మంత్రాలు ఉచ్చరిస్తాడు. భక్తులు అదంతా మహిమగా స్వీకరిస్తారు.
పూనకం వచ్చినట్లు నటించే తాంత్రికుడు ఏవో సోది భవిష్యత్తు కబుర్లు చెబుతాడు. పొటాషియం నైట్రేట్ ద్రావకంలో నాలుగు పర్యాయాలు నారను ముంచి ఎండనిస్తారు. ఒకవైపు నారతాడు వెలిగించి మిగిలిన తాడు దూదితో వుండగా చుడతాడు. ఆ వుండను నోటిలో పెట్టుకుంటాడు. నోటితో గాలి వదలుతుంటే మంటలు వస్తుంటాయి. నోటిలో బాగా లాలాజలం వూరిన తర్వాత ఇలా చేస్తాడు. నోటిలో వుండ వున్నంతసేపు గాలి వదలడం తప్ప, పీల్చడు. తరువాత ఒక వస్త్రంతో నోటిలోని వుండ తీస్తాడు. అలా చేసినప్పుడు భక్తులు మంత్రాలు చదువుతుండగా శిష్యులు హావభావాలు చేస్తూ, కానుకలు వసూలు చేసి పెడతారు.

Thursday, September 4, 2008

బాబా నిప్పు మింగాడు








టక్కర్ బాబా విడిదిచేసి నెల రోజులైంది. పక్క గ్రామాల నుండి కూడా తండోపతండాలుగా జనం వస్తున్నారు. క్రమ బద్ధం చేయడానికి పోలీస్ కూడా వచ్చింది. బాబా ఆదాయం పెరిగిపోతున్నది. పత్రికల వాళ్ళు, టి.వి. వాళ్ళు పోటీపడి బాబా మహిమల్ని చూపుతున్నారు.
ఈ రోజు ఏం జరుగుతుందోనని జనం ఎదురుచూస్తున్నారు. వేచి వున్న జనాన్ని ఆదుకోడానికి కొందరు మంచి నీళ్ళు అందిస్తున్నారు.
చివరకు స్వామీజీ రానే వచ్చారు. చిన్న ప్రసంగం చేశారు. బాబాకు తెలుగురాదు గనుక ఆయన ప్రవచనాన్ని శిష్యులు తెలుగులో చెప్పారు.
మాటల అనంతరం బాబా అరచేతిలో కర్పూరం పెట్టుకొని, మంత్రాలు చదువుతూ వెలిగించారు. చూస్తుండగానే మండుతున్న కర్పూరాన్ని నోట్లో వేసుకున్నారు.
భక్తులంతా ఆశ్చర్యపోయారు. బాబా మామూలుగానే మాట్లాడారు. ఆయనకు నోరుకాలదా?
ఇంతలో హేతువాది ప్రేమానంద్ వచ్చాడు. నేనూ బాబావలె చేయగలనని చేతిలో కర్ఫూరపు ముద్ద వెలిగించి, నోట్లో వేసుకున్నాడు.
నిప్పు రావాలంటే ఆక్సిజన్ అవసరం. కర్పూరం వెలుగుతుండగా నోట్లో వేసుకొని, నోరు మూసుకుంటే ఆక్సిజన్ లేక ఆరిపోతుంది. నోట్లో కర్పూరపు ముద్ద వేసుకొని నోరు మూసి గాలి బయటకు వదలాలి. మనం వదిలేది కార్బన్ డైయాక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు). అది మంటను వెంటనే ఆర్పేస్తుంది. కాకుంటే నోట్లో వెలిగే కర్పూరపు ముద్ద వున్నప్పుడు గాలి పీల్చకూడదు. పీల్చేది ఆక్సిజన్ (ప్రాణవాయువు) గనుక, అది మంటను ఆర్పదు.
ప్రేమానంద్ వివరణలో బాబా ట్రిక్కు, అందిరీక బట్టబయలు అయింది. అయినా భక్తులు కొత్త మహత్తులకు ఎదురుచూస్తున్నారు.

.
.

Tuesday, September 2, 2008

గుడిశెలు తగులబడుతున్నాయి


PREMANAND










తెలంగాణా మారుమూల గ్రామం సింగారంలో ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వున్నట్లుండి ఒక గుడిశపై మంటలు చెలరేగాయి. మగవాళ్ళంతా కూలీకిపోయారు. మంటలు చూచిన ఆడవాళ్ళు గుండెలు బాదుకున్నారు. కష్టపడి నీళ్ళు పోసి ఆర్పేశారు.
మరునాడు ఇంకోగుడిసెపై అలాగే మంటలు లేచాయి. ఈ వార్త ప్రాకిపోయి, ఆ వూరికేదో శాపం తగిలిందన్నారు. జనం పొరుగూళ్ళ నుండి వచ్చి చూచి, వింతకథలు అల్లారు. స్థానికపత్రికలలో కూడా వార్త వచ్చింది.
హేతువాదులకు యీ విషయం తెలిసి, వెళ్ళి పరిశీలించదలచారు. ప్రేమానంద్ అనే మాంత్రిక హేతువాదిని వెంటబెట్టుకొని ఆ వూరు చేరారు. జనం చెప్పిన కథలు ఆలకించారు.
ప్రేమానంద్ తగులబడిన గుడిసెలు పరిశీలించాడు. పిడకలు ఎండ బెట్టిన గుడిశెలే తగులబడ్డాయి. పిడకలు లేని ఇళ్ళకు మంటలు రాలేదు.
ఏం జరిగింది? పరిశీలించగా తేలిన సారాంశం.
పిడకలు చేసేటప్పుడే పచ్చ ఫాస్పరస్ కలిపి పెట్టారు. పిడకలలో తడి ఆరగానే, పచ్చ ఫాస్ఫరస్ నుండి వేడి వచ్చి, క్రమేణా గుడిసెపై పొగరావడం, తగులబడడం జరిగింది. కావాలని పచ్చ ఫాస్ఫరస్ ను కలిపి పెట్టారన్నమాట. ఎవరు పిడకలు చేశారో తెలుసుకుంటే దొంగ దోరికిపోతాడు. ఎందుకు అలా చేసిందీ ఆరా తీయవచ్చు. ఇది చేయకుండా నమ్మకాలతో వుంటే, ఇంకా జనాన్ని భయకంపితుల్ని గావించి, వ్యాపారం చేసుకునే వారుంటారు.

.

Monday, September 1, 2008

నిప్పులపై నడక









ఇసుక వేస్తే రాలనంత జనం. బాబా నిప్పులపైన నడుస్తారని ఆనోటా ఆనోటా ప్రచారం అయింది. వూరి వెలుపల చింత నిప్పుల గుండం ఏర్పరచారు. చుట్టూ జనం వున్నారు. ఇంతలో ఎక్కడినుండో బాబా ఆ స్థలానికి చేరుకున్నారు. చింత నిప్పుల కణాలు గుండంలో వున్నాయి. ఆత్రుతగా జనం చూస్తున్నారు. పూర్వం సీతమ్మవారు యిలాగే రాములవారి కోరికపై నిప్పుల మీద నడచి పాతివ్రత్యం నిరూపించారని అనుకున్నారు. అంటే శీలపరీక్ష కూడా చింతనిప్పులు తేల్చి పారేస్తాయన్నమాట.
బాబా గబగబా కొన్ని సెకండ్లలో చెప్పులు లేకుండా అగ్నిగుండంలో 8 అడుగులు నిడివిని నడచి వెళ్ళారు. కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయింది. అద్భుతం అనుకున్నారు.
ఎక్కడి నుండో ఆగండి అంటూ కేక వినిపించింది. ప్రేమానంద్, మరి కొందరు హేతువాదులు వచ్చారు. మేమూ నడుస్తాం అన్నారు. అంటూనే ముందుగా ప్రేమానంద్ నిప్పులపై నడవగా, ఆయన్ను అనుసరించి కొందరు హేతువాదులు నడిచారు.
బాబాగారంటే మహత్తు వలన నడిచారన్నారు. మరి వీరెలా నడవగలిగారు? ప్రేమానంద్ వివరించారు.
నిప్పుకణాలపై బూడిద వుంటుంది. అది వేడిని వెంటనే రానివ్వకుండా ఆపగల్గుతుంది. అలాంటి నిప్పులపై ఏడెనిమిద క్షణాలు నడచినా కాలుకాలదు. ఎక్కువ సేపు వుంటే కాలుతుంది. నిప్పుల్లో మేకులు, సీసపు పెంకులు, లోహాలు లేకుండా జాగ్రత్ పడాలి. వేడి పాత్రలో నీరు కాస్తే వేడి ఆవిరి వస్తుంది. అందులో చేయి పెడితే వెంటనే కాలదు. అయితే పాత్రకు చేయి తగలకుండా చూచుకోవాలి. ఏ బాబా కూడా కాలే లోహపు పాత్రల మీద, ఇనుపకడ్డీల మీద నడవలేడు.
హేతువాదుల వివరణతో బాబా పస తేలిపోయింది.