Monday, August 3, 2009

మానవవాదం ఎందుకు?


Left to right:M/s C.Narasimha rao, T.V.Rao and Innaiah addressing the gathering. Photo:cbrao



Left to right: M/s Anant, Gandhi and Mrs Chandana Chakrabarthi
Photo:cbrao


ఆగస్ట్ 2 వ తేది హైదరాబాదులో జరిగిన Indian Radical Humanist Association సభలో, డాలస్ (టెక్సాస్) నుంచి వచ్చిన, తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారి తెలుగు సాహిత్య వేదిక నెల నెలా తెలుగు వెన్నెల నిర్వాహకులు అనంత్ మల్లవరపు ప్రసంగిస్తూ, అభివృద్ధి చెందిన అమెరికా లో కూడా మత మౌఢ్యం, కుల మౌఢ్యం బహిరంగ చర్చకు వస్తున్నాయని అన్నారు. మానవ , హేతు వాద విషయాలలో తాను ఇన్నయ్యగారి అభిమాని అని, డాలస్ లో ఇన్నయ్య గారు హేతుబద్ధత, శాస్త్రీయ ద్రృక్పధాలపై ప్రసంగించారని సభకు తెలియ చేశారు. చూడండి http://naprapamcham.blogspot.com/2009/04/blog-post_21.html

బాబాలు, అమ్మలు అమెరికా వచ్చి పాదపూజ వగైరాలను ప్రోత్సహిస్తూ నిధుల సేకరణ చేస్తున్నారన్నారు. మొదట తెలుగు భాషా ప్రాతిపదికపై కలిసిన వారు, కులం పేరిట, ప్రాంతాల పేరిట అమెరికా లోని తెలుగు వారు విడిపోవటం బాధ కలిగిస్తుందన్నారు. హైదారాబాదు నగరంలో ప్రధాన వీధులలో కూడా మతపరమైన కట్టడాలు వెలుస్తున్నాయని, ఇవి వాహన రాక పోకలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని విచారం వ్యక్తం చెశారు.

-cbr


Audience & electronic media at the meeting Photo:Ramabrahmam of Jana Vignana Vedika

3 comments:

Anonymous said...

సుమారు 15 మంది హాజరైన ఈ సభకు ముగ్గు ఫొటొగ్రఫర్లు 5 ఉపన్యాసకులు.రాసిన సి.బి. రావు గారు కూడా మీటింగ్ కి హాజరు అయినట్లు లేదు. మీరు 40 సంవత్సరాల నుంచి కృషి చేస్తె ఇది మీకు ఉన్న ప్రజాదరణ. మరి మీకు బత్తిన సోదరుల ప్రజాదర్రణ చూసి కోపం రావడం లో తప్పు లేదు.

Praveen Mandangi said...

టి.వి. చానెళ్ళలో పబ్లిసిటీ ఇప్పించి జనాన్ని తీసుకురావడం గొప్ప కాదులే.

Praveen Mandangi said...

ఇన్నయ్య గారు ఆ సభ జరగబోతోందని టి.వి.లో ముందే ప్రకటించారా, బత్తిన సోదరులలాగ?