Friday, August 21, 2009

పూర్వ జన్మలు – పునర్జన్మలు ఉంటాయా?

అప్పుడప్పుడు కొందరు చిన్న పిల్లలు బయలుదేరి తాము పూర్వజన్మలో ఎలా ఉండేవారమో, వచ్చే జన్మలో ఎలా ఉండబోతున్నామో చెబుతారు. అది ఒక వింతగా, ఆశ్చర్యంగా వ్యాపిస్తుంది. జనం తండోపతండాలుగా రావటం, మొక్కడం, కానుకలు సమర్పించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేస్తారు. ఇలాంటివి ఆసియా దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో తరచు జరగడటం గమనిస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవులు అందరూ పునర్జన్మలు నమ్మరు. అలాగే ముస్లిములు కూడా. సైంటాలజీ అనే క్రైస్తవ శాఖ ఈ జన్మల గురించి నమ్మి, జనాన్ని మభ్య పెడుతున్నారు. భౌద్ధుల్లో కొందరు జన్మలు నమ్ముతారు.
మనుషులకు, పూర్వజన్మలు, పునర్జన్మలు నిజంగా ఉంటాయా? మనిషి చనిపోయినప్పుడు శరీరాన్ని తగలబెట్టడం, పూడ్చటం, ఆసుపత్రులకు ఇవ్వడం జరుగుతున్న నేపధ్యంలో, జన్మ ఎత్తేది ఏమిటి? ఇందుకు గాను మతస్తులు లోగడే ఒక పథకం ప్రకారం మనిషిలో ఆత్మ ఉంటుందని అన్నారు. అంటే ఏమిటి? అది పదార్ధం కాదు, దానిని చూడటానికి, పట్టుకోవటానికి, వీలు లేదు. కనుక అది మత, ఆద్యాత్మిక, నమ్మకంలో ఒక భాగంగా, సృష్టి అయిన విషయం. దైవం ఎలాగో, ఆత్మ కూడా అలాగే మానవుల సృష్టి. దీని చుట్టూ, పునర్జనమ్మను, పూర్వజన్మను అల్లారు. హిందువుల నమ్మకాలలో జన్మలు అనేకం. క్రిమికీటకాదుల నుండి జంతువుల మొదలు, మనుషుల వరకూ ఈ జన్మలు ఉన్నాయి. వీటిని తొలగించుకుని మోక్షం సాధించటం లక్ష్యం అన్నారు. అంటే జన్మలు ఎత్తటం అనేది గొప్ప విషయం కాదు. జన్మలు పోగొట్టుకుని దైవసాన్నిధ్యంలో ముక్తి పొందటమే పరమార్థం అన్నారు. దీనికి గాను పురోహిత వర్గాలు అనేక క్రతువులు, జీవన విధానాలు చెప్పారు. ఏమైనా జనంలో జన్మలపై నమ్మకం మాత్రం బాగా నాటుక పోయింది.
ఇటీవల భౌద్ధ శాఖలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దలైలామా ఈ జన్మలను గురించి మాట్లాడటంతో దీనికి మళ్ళీ ప్రచారం లభించింది. చిన్న పిల్లలు తాము పూర్వజన్మలో దలైలామాతో సంబంధంగల వ్యక్తులమని, రాబోయే జన్మలో ఆయన్ను మళ్ళీ కలుసుకోబోతున్నామని జప్పటం జనాన్ని ఆకట్టుకున్నది. మన దేశంలో లోగడ ఇలాంటివి తరచు జరిగాయి. పూర్వకాలం నుండి మన పురాణాలలో, ఇతిహాసాలలో పునర్జన్మల కథలు ఉండటం వల్లన జనంలో అవి స్థిరపడిపోయాయి.
వైజ్ఞానికంగా ఈ జన్మల విషయంలో ఏమైనా ఆధారాలతో ఉన్నదా అని పరిశీలన చేశారు. కొందరు శాస్త్రజ్ఞులు సీరియస్ గా కొన్ని కేసులు పరిశీలించి శాస్త్రీయ ఆధారాల కోసం అన్వేషించారు. అలా చేసిన వారిలో ఇయాన్ స్టీవెన్ సన్ పేర్కొన దగినవాడు. అయితే ఆయన గాని, ఇతరులు గాని చేసిన పరిశోధనలు ఏవీ కూడా ఇంతవరకు శాస్త్రీయ ఆధారాలు చూపలేక పోయాయి. జె.ఎమ్.ఇ. మక్ టగార్డ్, సి.జె. డుకాసే పాశ్చాత్య ప్రపంచంలో పునర్జన్మల పరిశీలన చాలా దీర్ఘంగా చేశారు. సి.జి. యుంగ్ తన పరిశీలనలో పునర్జన్మలకు అనుకూలత చూపాడు. కానీ శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఇవ్వలేక పోయాడు. ఈ కోవలో పాల్, టిలక్, స్ట్రనిస్ లోవ్, టిమోతీ లోరే వంటివారు ఎలాగైనా పునర్జన్మలను రుజువు చేయాలని ప్రయాసపడి విఫలమయ్యారు. టిబెట్ లో ఈ పునర్జన్మల కథలు, రచనలు ఉన్నాయి. అవికూడా చాలా వదంతులకు దారి తీశాయి. టిబెటన్ బుక్ ఆఫ్ ది డెడ్ అనే పుస్తకం ఇలాంటి పునర్జన్మల కథలను నమ్మించటానికి చాలా ప్రాధాన్యత వహించింది. అయితే అదంతా మూఢనమ్మకాలు తప్ప ఆధారాలు లేవని తేలింది. మద్రాసులో ఉన్న సి.టి.కే. చారి ఈ విషయాలపై క్షుణ్ణంగా పరిశీలన చేసి, భారతదేశం వంటి చోట చిన్న పిల్లలకే ఇలాంటి కథలు వినిపించటం వల్లన, వారిలో నమ్మకాలు నాటుకుపోయి కొన్ని కథనాలు అల్లడం. వాటిని సమాజంలో వ్యాపింపచేయటం జరిగిందన్నారు. అంతే గాని వాటికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవన్నారు.
ఆత్మలు ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టి అవుతాయా? జనాభా పెరుగుతూ పోతుంటే కొత్త ఆత్మలు కొత్తగా పుట్టిన వారిలో ప్రవేశిస్థాయా? అయితే ఎక్కడి నుండి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు నమ్మకస్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎలాగూ రుజువు చేయలేరు కనుక మూఢనమ్మకాలతో మూర్క సమాధానాలు చెబుతుంటారు. చిన్న పిల్లల్లో పూర్వజన్మల గురించి వస్తున్న స్ముతులు ఆధారంగా స్ట్రీవెన్ సన్ సుధీర్ఘ పరిశోధనలు చేశారు. అయినప్పటికీ శాస్త్రీయ ఆధారాలు మాత్రం లభించలేదు. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు, కొందరు స్వార్థశక్తులు పిల్లల్ని వశపరుచుకొని పూర్వజన్మల కథలు చెప్పిస్తుంటే, స్ట్రీవెన్ సన్ వాటిని పట్టించుకోలేదు. అదోక పెద్ద లోపంగా మిగిలిపోయింది. విలియం జీ. రోల్ సైతం అమెరికాలో స్ట్రీవెన్ సన్ పరిశీలనలను సుదీర్ఘంగా అధ్యయనం చేసి వాటిలో శాస్త్రీయతను చూపలేకపోయాడు

8 comments:

Praveen Mandangi said...

ఒక వైదికాచార్యుడు గత జన్మలో పాపం చేసి చెప్పులు కుట్టేవాడిగా లేదా పాకీవాడిగా పుట్టాడనుకుందాం.అప్పుడు చెప్పులు కుట్టేవాడు లేదా పాకీవాడు తన గత జన్మ వాసనలతో సంస్కృతం మాట్లాడగలగాలి కదా. అలాంటి సందర్భం ఒక్కటీ లేదు. బంగ్లాదేశ్ లో ఒకామె తాను గత జన్మలో ఇందిరా గాంధీనని చెప్పుకుంది. కానీ ఆమె గత జన్మ వాసనలతో ఇందిరా గాంధీ మాట్లాడిన హిందీ బాష మాట్లాడలేకపోయింది.

Unknown said...

I think Ian Stevenson has substantially proved the reincarnations. "Birthmarks and Birth Defects Corresponding to
Wounds on Deceased Persons" is one such evidence. The story of Taranjit claiming to be Satnam singh in Punjab India has been proven scientifically, (combining the study of optics, physiology and psychology) by Vikram Chowhan.

fun.srinu said...

పూర్వ జన్మలు అనేది నిజం, రుజువు ఏమిటి అని అంటే ఎవరి కి వారు కూర్చుని దృష్టి ని బ్రూమధ్యం లో నిలిపి(అంటే రెండు కనుబొమ్మలు, ముక్కు కలిసే ప్రాంతమన్న మాట)

ద్యాన సాదన చేస్తే అంతా బోదపడుతుంది. ఇంక ఏమిటి? ఎందుకు అని ప్రశ్నించడం ఉండదు, ప్రయేగశాలలో నిరూపించే విషయాలు కావివి.

Sreevathsava said...

Check this out :
http://www.brianweiss.com/

One psychiatrist say you can know your past life details through regression therapy. He wrote a book "MANY MASTERS MANY LIVES" about his experiences with one of his patients.

You believe it or not its up to you.

జయహొ said...

Innaiah gaaru,
Could you please give reply to
Mr. Venkata Ramana's questions

Here I am repeating the Questions for u..
1) "ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు"
ఎవరి డబ్బుతో పర్యటి౦చారు? జ్యోతిష్య ఫలాలు మీ రాజు పేపర్లో ప్రకటి౦చడ౦ వల్ల వచ్చిన డబ్బు కాదా?
2) మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా?
జవాబు ఎ౦దుకు ఇవ్వడ౦ లేదు?
అ౦టే మీరు పేజ్3 జనాలు ఒకటేనా? నీతులు చెబుతారు. వాటిని గురి౦చి బుర్ర పెట్టి మేమే గొప్ప అన్నాట్టు చర్చిస్తారు. కానీ జనాలకు ఉపయోగపడే పనులు వళ్ళొ౦చి చేయమ౦టే మాత్ర౦ నోరు మెదపరు.
3) మీ అబ్బాయి క౦టే, మీరు విమర్శి౦చే మత పెద్దలు, జ్యోతిష్యులు నిబద్దతగలవారు. వారు నమ్మేదే జనాలకు చెబుతున్నరు. డబ్బు కోసమే అలా చేసారనుకున్నా కూడా, వాళ్ళకు నమ్మక౦ లేని దాని గురి౦చి ప్రచార౦ చేయడ౦లేదు.
4) Can you please publish some articles on how educated persons are cheating uneducated in the name of science?

and we know that u were a jounalist, u know the inside information about governance.
5) Why dont you publish some articles on how newspapers try to misguide people. And how they try to propagate a biased opinion for their grwoth or some others' fall.

6)I come to know that ur chairman of CFII(Center for Inquiry in Idia).
The following is written aboutt CFII in the site:
"The Center for Inquiry in India offers an opportunity to put your principles into practice by joining other rationalists to work for positive change in society."

How can u offer an opportunity to others without practicing?

Thanks in advance.

Malakpet Rowdy said...

Jayaho, LOLZ ...

He is silent because he doesnt have answers.

By the way here are a few FAQs for you


* How do you make him talk?

A: JUST PRAISE HIM

* How do you make him shut up?

A: ASK HIM A GENUINE QUESTION ( Let the question be anything .. it just needs to be genuine .. he will not have any answers)

* How do you make him cry?

A: You dont need to do anything. He is a born crybaby :))

* How do you make him laugh?

A: You kiddin' me? Laughing stocks seldom laugh!

jogeshdraju said...

పూర్వజన్మలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న కు సమాధాన౦ మన వేదాల్లో, పురాణాల్లో చాలా ఉదాహరణలున్నాయి.
ఈ విషయాలను బట్టి హేతువాదులమనుకునే వాళ్ళకు ఒక ప్రశ్న
నేను అ౦టే ఏమిటి?
ఈ శరీరమేనా? అయితే మీకు మీరు సమాధాన౦ చెప్పుకోడానికి ప్రయత్ని౦చ౦డి.
నేనుకు నాదికి తేడా అర్ధ౦ చేసుకోడానికి కూడా ప్రయత్ని౦చ౦డి.
ఉదా: ఈ శరీర౦ నాది అనుకు౦టారా లేక ఈ శరీర౦ నేను అనుకు౦టారా?
ఫలానా రావు గారు చనిపోయారు. ఇక వారి యొక్క శరీరాన్ని దర్శి౦చాడానికి ఫలానా చోట వు౦చారు. తర్వాత వారి మృత దేహాన్ని ఖనన౦/దహన౦ చేశారు. అ౦తకు ము౦దు వరకు రావు గారు అన్న ఆ శరీరాన్ని చనిపోయాక రావు గారిది అని ఎ౦దుక౦టున్నారు. అ౦టే శరీర౦ రావు గారిదే కానీ శరీరమే రావు గారు కాదు. అ౦టే ఇది నా ఇల్లు అనుకున్నట్టే ఇది నా శరీర౦ అనుకు౦టా౦ కదా. ఇ౦టికి యజమానిలాగే శరీరానికి కూడా మన౦ బ్రతికున్న౦త వరకు మన౦ యజమానుల౦. మన౦ చనిపోవటమ౦టే మన ఇల్లు శిథిలమయినట్టు. వేరే ఇ౦టికి వెళ్ళాలి కదా? లేదా శిథిలమైన ఇ౦టి లోనే ఉ౦టారా? ఆలోచి౦చ౦డి. జోగేష్ దుర్గరాజు. హైదరాబాద్

Mangesh Devalaraju said...

అనేక జన్మల నుండి ఇలాంటి ప్రశ్నలు వేసి వేసి అవి ఇంకా తీరక ఇన్నయ్య గారు ఈ జన్మలో కూడా అదే స్వభావంతో మళ్ళీ అదే బాటలో నడుస్తున్నారు. గుర్తించి ఇకనైనా బయట పడండి. అయినా ఎవరో చెపితే తెలియదు.. తనకు తానుగా లోపలి నుండి పుట్టాలి అది పురుగు తొలచినట్లు తొలవాలి. అప్పుడే సత్యాన్వేషణ మొదలయ్యేది. అప్పటి వరకు లోకం ఇలాంటి వాళ్ళకు భరించక తప్పదు. ఆయన లోపల వున్న భగవంతుడు మేల్కాంచి ఆయనకు సరియైన మార్గాన్ని అందించాలని ప్రార్థన చేద్దాం.