నాస్త్రడామస్ ఫ్రెంచ్ వైద్యుడు.(1503-1566).అసలు పేరు మైకల్.వెయ్యి ఆటవెలది పద్యాలవంటివి రాసాడు. వాటిలో పదాలకు చిలవలు పలవలుగా అర్ధాలు చెప్పి రానున్న సంగతులన్నీ సరిగా చెప్పాడని నమ్మిస్తున్నారు .ఆయన రొజులలోనే రాజు హెన్రి చాలకాలం బ్రతుకుతాడని చెబితే , మరుసతి ఏడే కన్నుమూశాడు. ఆ రొజులలో ఫ్రెంచ్ రాణి కాథరిన్ అతన్ని కొలువుకు పిలిచింది. అంతటితో పేరు ప్రాకి పోయింది. విడ్డూరపు కథలు , వ్యఖ్యానాలు గోరంతలు కొండంతలుగా చెప్పారు. వైఫల్యాలు చెప్పలేదు.ఇథర భాషలొలోకి అనువాదాలు రాగా నేటికీ ప్రచారం సాగుతున్నది. ఇప్పుదు తెలుగు వారికి కూడా అవి అంటుకున్నాయి. కడపలో లోగడ బ్రహ్మం అనే ఆయన తత్వాలు చెప్పాడని అవి నేటికీ నిజమౌతున్నాయనేవారున్నారు.హిస్టర్ అని నాస్త్రడాం వాడిన పదాన్ని హిట్లర్ అని మార్చేసి , ముందే హిట్లర్ సంగతి చెప్పాడని రాసారు. జోస్యం వ్యాపారం అలా సాగి పోతున్నది.నిశిత పరిశీలన చేయకుండా ప్రశ్నించకుండా నమ్మే వారున్నంతవరకు జోశ్యం గిట్టుబాటుగానే వుంటుంది .
నాస్త్రడామస్ వెయ్యి పద్యాల రచన సెంచరీస్ ను క్రైస్తవ చర్చ్ నిషేధించిందికూడా.అతని వైఫల్యాలు చెప్పే వారు కాదు. అనాగ్రాంస్ వాడి అక్షరాలు మార్చి అనుకూల అర్థాన్ని చెబుతుండేవారు.ఫ్రెంచ్ వుచ్చారణ అర్థంకూడా అనువాదంలో మార్చి చెబుతున్నారు .
ఆతని జోశ్యంలో అతని ఎదుటే విఫలమైనవి:1666 లండన్ అగ్నిప్రమాదం, 16 వ లూయి పలాయనం ,పట్టుబడటం, ఇంగ్లడ్ 1 వ చార్లెస్ ఉరి, 1వ ఎలిజబెత్ గురించి చెప్పినవి రుజువు కాలేదు.ఆయన పేరిట వ్యాపారమ చేస్తున్న భక్తులు అవి చెప్పరు. జంకు గొంకు లేకుండా సాగి పోవడం జ్యొతిస్యుల వ్యాపార ధర్మం!
1 comment:
ఇక్కడ సునామీ వచ్చిన తరువాత, అనేక మంది చనిపోయిన తరువాత బ్రహ్మం గారి మఠం సభ్యులు సునామీ గురించి బ్రహ్మం గారు ముందే చెప్పారని ప్రకటించారు. జనం ప్రాణాలు పోకముందు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అని విలేఖరులు అడిగితే మఠం సభ్యులు సమాధానం చెప్పలేకపోయారు.
Post a Comment