ఖగోళశాస్త్రం సైన్స్ లో భాగం. ఇందులో పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నది. కనుక క్రమేణా తెలుసుకునేది విస్తృతమౌతున్నది. పూర్వం తెలియని గ్రహాలు, నక్షత్రాలు, శకలాలు ఇలా ప్రకృతిలో ఎన్నో విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పటికి పరిమితంగా తెలిసింది. ఇంకా తెలియవలసింది అనంతంగా ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రంలో ఏప్పుడూ నిత్య నూతనంగా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇందులో మరొక విశేషమేమిటంటే లోగడ తెలుగుకున్న వాటిలో దోషాలున్నా, అసంపూర్ణతలు ఉన్నా అవి దిద్దుకుంటూ పోవటం శాస్త్రియ ప్రక్రియలో ఒక ఉత్తమ గుణం. తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం. ఇది సైన్స్ లో అన్ని విభాగాల్లోనూ ఉంటుంది. ఇందులో జ్యోతిష్యాలకు, ఊహలకూ, మనుషుల బలహీనతలను అట్టం పెట్టుకుని వ్యాపారం చేసే ధోరణి ఉండదు.
జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.
జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.
22 comments:
కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి సూర్యుని చుట్టు తిరుగుతోందని చెపితే ఎవరూ నమ్మలేదు. ఇప్పుడేమో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని జ్యోతిష్యులకి తెలుసు అని వాదిస్తున్నారు. జ్యోతిష్య గ్రంథాలలో గానీ, మత గ్రంథాలలో గానీ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు ఎక్కడా వ్రాయలేదు. చాలా కాలం క్రితం ఒక టి.వి. చానెల్ లో ఇన్నయ్య గారితోనూ, ఇద్దరు జ్యోతిష్యులతోనూ చర్చా కార్యక్రమం పెట్టారు. భూమి, సూర్యుడు గురించి ఇన్నయ్య గారు ప్రశ్నించినప్పుడు జ్యోతిష్యులు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని తమకి తెలుసని, కేవలం నమూనా కోసం సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని జ్యోతిష్యంలో వ్రాయడం జరిగిందని వాదించారు. జ్యోతిష్యం పేరు చెప్పి జీవనోపాధి పొందేవాళ్ళలో నిజాయితీ ఈ రకంగా లోపించి ఉంటుంది.
"జ్యోతిష్య గ్రంథాలలో గానీ, మత గ్రంథాలలో గానీ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు ఎక్కడా వ్రాయలేదు."
better to refer 'suryasiddamtham written by bhaskarachaarya',
భూమి సూర్యుని చుట్టూ తిరగడం అప్పటి ప్రజలకు మింగుడు పడలేదు కాబట్టి ఆవిషయం వెలుగులోకి తీసుకురాలేదు. అలా అని మన చరిత్రలో ఎక్కడా అలాంటి ప్రస్తావనే లేదనడం తప్పు. జ్యోతిషం లాంటి మూఢనమ్మకాలను ప్రొత్సహించడం నా ఉద్దేశ్యం కాదు కానీ మీరిచ్చిన matter అంత satisfactory గా లేదు. క్షమించాలి.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోందని మొట్ట మొదట ఊహించినది నికోలాస్ కోపర్నికస్. అతను కంటికి కనిపించే కొన్ని గ్రహాల కదలికలు ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని ఊహించాడు కానీ అతని సూత్రీకరణని ఎవరూ నమ్మలేదు. 2500 సంవత్సరాల క్రితం గ్రహణం సమయంలో చంద్రుని పై పడే భూమి నీడ ఆధారంగా గ్రీక్ శాస్త్రవేత్త పైథాగరస్ శిష్యులు, మన ఆర్యభట్టు భూమి గుండ్రంగా ఉంటుందని ఊహించారు కానీ వాళ్ళ సూత్రీకరణని ఎవరూ నమ్మలేదు. భూమి గుండ్రంగా ఉంటుందని, సూర్యుని చుట్టు తిరుగుతోందని శాస్త్రీయంగా నిరూపించిన మొట్టమొదటి వ్యక్తి గెలీలియో.
http://www.ias.ac.in/currsci/jul252001/139.pdf
ఈ లింక్ కూడా వీక్షించండి: http://scienceintelugu.blogspot.com
ఇన్నయ్య గారు,
దయచేసి నేను అడిగిన ప్రశ్నలకు సమాధాన౦ చెప్ప౦డి.
1) "శాస్త్రీయత", "అశాస్త్రీయత", "నమ్మక౦", "మూఢనమ్మక౦" లకు అర్థాలు(నిర్వచనాలు) ?
జవాబు: -------
మీరు చెప్పలేదు.
నాకు అర్థమైన౦త వరకు:---- నేను చిన్నప్పుడు "పరిసరాలవిజ్నాన౦" అని చదువుకున్నాను. ఒదులో ఉన్నాటువ౦టి విషయాలనే " సామాన్య శాస్త్రము", "సా౦ఘీకశాస్త్రము" అని చదువుకున్నాను. కానీ పేరు ఎ౦దుకు మారి౦దో నాకు తెలీదు.
దుయచేసి వివరి౦చ౦డి. నేను ’శాస్త్ర౦’ స్థాన౦లో ’విజ్నాన౦’ అని వాడొచ్చా? ’విజ్నాన౦’ అని వాడితే నేను అర్థ౦ చేసుకోగలను. కానీ నాకు "శాస్త్రీయత" అ౦టే మాత్ర౦ తెలీదు.
2) "ఒక నమ్మకానికి వ్యతిరేక ఆధార౦ చూపిస్తే ఆ నమ్మక౦ మూఢనమ్మక౦" అవుతు౦ది. అ౦టే ఆ వ్యతిరేక ఆధార౦ దొరకన౦త వరకు అది మ౦చి నమ్మకమే అ౦టారా?
జవాబు: -----a) అవును. b) కాదు.
మీరు జవాబు చెప్పలేదు.
3) ప్లూటో విషయ౦లో కూడా మీరు ఏది నమ్మక౦, ముఢనమ్మక౦, శాస్త్రీయ౦, అశాస్త్రీయ౦?
జవాబు: ------
మీరు చెప్పలేదు. అప్పుడు గ్రహ౦, ఇప్పుడు గ్రహ౦ కాదు అని మాత్రమే చెప్పారు.
4) సైన్స్ సెల్ఫ్ కరెక్టివ్ అని అ౦టున్నారు. అ౦టే సైన్స్ లో తప్పులు౦టాయా?
ఒకవేళ సైన్స్ లో తప్పులున్నట్లుగానే, వాస్తులో కూడా తప్పులున్నాయేమో!!
జవాబు: ------a) సైన్సులో కొన్ని తప్పులు కూడా ఉ౦డొచ్చు. b) తప్పులు ఉ౦డవు
c) సైన్సు తనను తాను మెరుగుపర్చుకు౦టు౦ది.
మీరు చెప్పినది: c
"ఖగోళశాస్త్రం పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి." అని అ౦టున్నారు.
౫) అ౦టే జ్యోతిష్య౦లో పరిశీలన, పరిశోధన ప్రధాన౦గా ఉ౦డవా?
౬) జ్యోతిష్య౦ వేటి ఆధార౦గా చెబుతారు?
"తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం."
౭) శాస్త్ర౦లో ఒక విషయ౦ తప్పు అని ఋజువు కాన౦త వరకు ఒప్పుగానే భావిస్తారా?
ఇన్నయ్య గారు సమాధానం స్పష్టంగానే చెప్పారు. కప్ప ఒక జంతువు అని అభిప్రాయపడేవాడు ఆ తరువాత కప్ప ఒక పురుగు అని అభిప్రాయం మార్చుకున్నంత మాత్రాన కప్ప మూఢ నమ్మకం అయిపోదు. అలాగే ప్లూటో ఒక గ్రహం అని అభిప్రాయపడేవాళ్ళు ప్లూటో ఒక ఆస్టరాయిడ్ అని అభిప్రాయం మార్చుకున్నంతమాత్రాన ప్లూటో మూఢ నమ్మకమైపోదు. ప్లూటో విషయంలో implications (రహస్యార్థాలు) ఏమీ లేవు. పాము కథలని మార్చి చెప్పేవాళ్ళ మాటల్లోనే implications కనిపిస్తాయి. సైంటిస్టులు ఈ రహస్యార్థాలు గల వాదనలని అంగీకరించేంత అమాయకులు కారు.
ప్రవీణ్,
నేను ప్లూటో ని ముడ నమ్మకమా అని అడగట౦ లేదు. ప్లూటోని గ్రహ౦ అని అనడ౦ గురి౦చి అడుగుతున్నాను.
డెఫినిషన్ లో అభిప్రాయభేదం పెద్ద సమస్య కాదని ఇంతకు ముందే చెప్పాను. పాము కథలు మార్చి చెప్పి జనాన్ని కంఫ్యూజ్ చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలిస్తే అది చిన్న సమస్యే.
@వెంకటరమణ: దాదాపు మూడు టపాలుగా మీరు సంధిస్తున్న ప్రశ్నల్ని చూస్తున్నాను.మీ ప్రశ్నల్లోనే సమాధానాలున్నాయి.అందుకే మీరు తెలిసీ ఎత్తిపొడుపుకో లేక హాస్యానికో అడుగుతున్న భావన కనిపిస్తోంది.
1)నిరూపణ ఆధారంగా వివరణ ఇవ్వబడితే దాన్ని శాస్త్రం అంటాము. శాస్త్రీయత నిరూపణ,వివరణలే ప్రమాణాలుగా కలిగి ఉంటుంది.అవి లేనిదాన్ని అశాస్త్రీయం అంటాము.
సందిగ్ధత లేకుండా విశ్వసించేదాన్ని నమ్మకం అంటాము. తర్కహేతువులతో ఆ నమ్మకం యొక్క మూలాన్ని ప్రశ్నార్థకం చేసినా, లేదా తప్పని నిరూపించినా గుడ్డిగా నమ్మడాన్ని మూఢనమ్మకం అంటాము.
2)నమ్మకం ప్రశ్నింపబడనంతవరకూ, తప్పుగా శాస్త్రీయంగా నిరూపించబడనంత వరకూ మూఢనమ్మకం అవదు.
3)సైన్స్ నమ్మకాల్ని సృష్టించదు. లభ్యతలో ఉన్న ఆధారాలతో కొన్ని facts ని ప్రతిపాదిస్తుంది. కొత్త ఆధారాల వల్ల ఆ నిజాలలో మార్పు వస్తే దాన్ని అంగీకరిస్తుంది. (మూఢ)నమ్మకాలలో ఆ సౌలభ్యం లేదు.ఇక్కడ నమ్మావా లేదా అనే విషయమేతప్ప దానికి ఆధారం ఉందా లేదా అనే ప్రశ్నలు ఉదయించవు.
4) సైన్సు మీద మీ వాదన అత్యంత హాస్యాస్పదం.
వికీపీడియా లింక్ చూపించి రాహుకేతువులు ఉన్నాయని నిరూపించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం. ఇండియాలో లక్షల మంది ఇంటర్నెట్ వీక్షకులు ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మందికి వికీపీడియా గురించి తెలిసే ఉంటుంది. వాళ్ళలో ఎవరికైనా వికీపీడియాలో రాహుకేతువుల కథలు చేర్చడం సాధ్యమే.
ఇండియా దాకా ఎందుకు? మా శ్రీకాకుళం పట్టణంలో వికీపీడియా గురించి తెలిసిన వాళ్ళు వంద మంది ఉన్నారు. ఈ వంద మందిలో పది మంది జ్యోతిషాన్ని నమ్మినా వీళ్ళు రాహుకేతువుల కథలని వికీపీడియాలో చేర్చగలరు.
నిరూపి౦చేది ప్రతిపాదననే కదా. ఆ ప్రతిపాదన నిరూపి౦చబడ్డాకే శాస్త్ర౦లోకి చేరుతు౦ది కదా.
మరి నిరూపన కాన౦త వరకు ఆ ప్రతిపాదనని ఏమనాలి? అసలు ఆ ప్రతిపాదన ఎలా వస్తు౦ది?
మహాష్ గారు, ప్రవీణ్ గారు,
మీ ఎమోషన్స్ దాచుకో౦డి. ఇన్నయ్య గారు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. మాట్లాడరు కూడా.
నాకు నిజ౦గా అనుమానాలు వున్నాయి వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఈ బ్లాగులకి కొత్త. ఇన్నయ్య గారి వివరణ బాగు౦టు౦ది. అ౦దుకే నేను ఆయన్నే అడుగుతున్నాను.
సహన౦ కోల్పోకు౦డా మాట్లాడగలరని మనవి. మీ మనోభావాలు వ్యక్తపరచకు)డా నా అనుమానాలను నివృత్తి చేస్తే చర్చ ఫలప్రద౦గా ఉ౦టు౦ది.
vignanam is right. religious believers are using saatriyam .That is why some are confused with that word.religious saastriyata is based on texts and authority. Science has no authority but verification.
Self correction means, when new facts come into light, the old ones are amended and improved.Such healthy trend is totally absent in religious beliefs like astrology, vaastu .
జ్యోతిష శాస్త్రంలో శాస్త్రీయత అంటే నేతి బీరకాయలో నెయ్యి లాంటిది.
ఇన్నయ్య గారు,
జ్యోతిష్య౦లో ఉన్న విషయాలు అన్నీ నిరూపణ లేనివా? లేక కొన్నిటికి నిరూపణ వు౦దా?
నిరూపి౦చబడిన అ౦శాలు ఏమిటో, నిరాపణ లేని అ౦శాలు ఏమిటో నేను వివర౦గా తెలుసుకోవాలను కు౦టున్నాను.
ఇన్నయ్య గారూ, చాలా కాలం క్రితం ఒక టి.వి. చానెల్ లో మీకు, జ్యోతిష్యులకి మధ్య జరిగిన చర్చ కార్యక్రమం చూశాను. జ్యోతిష్యులు ఎంత వితండవాదం చేశారో నాకు గుర్తుంది. అలాంటి వాళ్ళు self-correction చేసుకోగలరనుకోవడం హాస్యాస్పదం.
Astrology borrowed few calculations and observations from astronomy. Based on that they predict eclipses etc.All other things like futorology based on planets, stars, constellations are totally false and unproven.
Regardig scientific method there is proceedure .
I put my translation of Scientific Method by late A B Shah in this blog if you go into and read. (Saastriya Padhati)
గ్రహణాలు ప్రతి ఏడాది వస్తాయి. ఒక గ్రహణానికీ, ఇంకో గ్రహణానికీ మధ్య ఉన్న టైమ్ ఇంటర్వెల్ లెక్కబెడితే గ్రహణం మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం కాదు. ఖగోళం గురించి కొద్ది కొద్దిగా తెలిసిన వాళ్ళు కూడా ఆ పని చెయ్యగలరు.
ఇన్నయ్య గారు,
మీరు ఎవరి దగ్గరైనా మీ జాతక౦ వ్రాయి౦చి చూసుకున్నారా?
ఇలా ఎ౦దుకు అడుగు తున్నాన౦టే, కొ౦త మ౦ది వాళ్ళకు జాతక౦లో చెప్పిన స౦ఘటనలు జరిగాయని చెప్పారు. నేను ఈ మధ్యనే ఒక స౦ఘటన విన్నాను. ఒక 16 ఏళ్ళ అబ్బాయి ఈత నేర్చుకు౦టూ చనిపోయాడు. అబ్బాయి మునిగిపోతున్నప్పుడు అక్కడవున్న వాళ్ళు అతన్ని లాగడానికి వెళ్తే తామను అబ్బాయి గట్టిగా లాగితే తాము కూడా మునిగే అవకాశ౦ ఉ౦దని ఎవరూ కాపాడలేదు. అబ్బాయికి చిన్నప్పుడే జాతక౦ వ్రాయి౦చారు. కానీ సిద్దా౦తి జాతక౦ చూడొద్దన్నాడు. అబ్బాయిది, మార్క౦డేయ జాతక౦ అని మాత్ర౦ చెప్పాడు. అబ్బాయి చనిపోయాక జాతక౦ చూసారు. 16 ఏళ్ళప్పుడు, ఫలానా తిదిన, శౌక్రవార౦ రోజు, సాయ౦త్ర౦ నీటి గ౦డ౦ వు౦దని వ్రాసి ఉ౦దట. పురాణాల్లో మార్క౦డేయుడు 16 ఏళ్ళ ఆయుష్షుతో పుట్టాడ౦ట.
ఇ౦త కరెక్టుగా చెప్పడ౦ ఎలా సాధ్యమని నా స౦దేహ౦.
మీ బ్లాగులో చాలామ౦ది హేతువాదులని, మానవతావాదులని పరిచయ౦ చేసారు. నాకు హేతువాదుల౦టే మూఢనమ్మకాలను పోగొట్టేవారు అనిమాత్రమే తెలుసు. దీనికి ఇ౦కా ఏమైనా అర్థ౦ వు౦దా? హేతువాద౦ అ౦టే ఏమిటో? మానవతా వాద౦ అ౦టే ఏమిటో వివరిస్తారా?
Post a Comment