Tuesday, May 12, 2009

వాడియా--నాడియా సినిమాలు


J BH WADIA












NADIA IN FRONTIER MAIL







జె బి హెచ్ వాడియా (1901-1986) సినీరంగంలో కొత్త ప్రయోగాలు చేశారు.నాడియా అనే తారను ప్రవేశ పెట్టి స్తంట్ లు చేయించి సఫలమయ్యారు .వాడియావారి నాడియా అని సినిమాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. వాడియా మహరాస్త్రీయుడు .ఎం ఎన్ రాయ్ అనుచరుడుగా హేతువాది, మానవవాది .అలా నాకూ పరిచయమైంది .హైదరాబాద్ లో ఆయన ప్రసంగాలు ఏర్పాటు చేసాము. అబ్బూరి రామక్రిష్నారావు సభలకు ప్రసిదెంట్ . బాంబే లో వాడియా స్తుడియో వున్నది. ఆయన కుమారుడు ఫిల్మ్ మ్యూసియం ఏర్పరచారు. ఎం ఎన్ రాయ్ తో తన అనుభవాలు వాడియా రాసారు .నేను చదువుకునే రోజులలో వాడియా సినిమాలు బాగా చూసి ఆనందించే వారము. హంటర్వాలికా బేటా వంటి సినిమాలు ఇప్పుడు చరిత్రగా మిగిలాయి .

వాడియా కుమారుడు వించి స్తుడియొ అభివ్రుద్ది చేశాడు.2003 లోచనిపోయాడు.నాడియా వారికుటుంబంలోనే హోమి వాడియాను పెళ్ళి చేసుకున్నది. వారి వెబ్ సైట్ చూడండి. www.wadiamovietone.com

No comments: