Friday, July 3, 2009

తెలుగు విశ్వ విద్యాలయంలో వాస్తు, జ్యోతిష్యం





అశాస్త్రీయమైన వాస్తు మరియు జ్యోతిష్యం శాస్త్రాల పాఠ్యాంశాలను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తొలగించాలని కోరుతూ, ఇన్నయ్య గారి ఆధ్వర్యంలో T.V.రావు, K.V.రెడ్డి, రామబ్రహ్మం ప్రభృతులు ఈ రోజు (July 3, 2009) సాయంత్రం 4 గంటలకు , విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య భూమన్న గారికి ఒక వినతి పత్రాన్ని అందచేశారు. హేతువాదుల అర్జిపై, హైకోర్ట్ వారు ఈ రెండు విషయాల శాస్త్రీయత ను అధ్యయనం చేయటానికి ఒక నిపుణుల సభ ను నియమించమని , నాలుగు సంవత్సరముల క్రితం విశ్వవిద్యాలయానికి సూచించినారు. ఇంత కాలం గడిచినా విశ్వవిద్యాలయం వారు న్యాయస్థానానికి ఎలాంటి బదులు ఇవ్వలేకపోయారు. ఈ పాఠ్యాంశాల శాస్త్రీయతను నిరూపించలేకపొయారు. ఈ విషయాన్నిఆచార్యుల వారి దృష్టికి తెచ్చి, అశాస్త్రీయమైన ఈ పాఠ్యాంశాలను తొలగించవలసినదిగా కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఉపకులపతి వారు, పాత్రికేయుల సమక్షంలో, హేతువాద బృందానికి చెప్పారు.

6 comments:

మాగంటి వంశీ మోహన్ said...

శాస్త్రీయత ? అశాస్త్రీయత...హ్మ్మ్....జ్యోతిషం, వాస్తు...మరి కొన్ని రోజులకు విశ్వవిద్యాలయాలు, ఆ పైన చదువుకునేవాళ్ళు....హ్మ్మ్మ్....పోగాలం దాపురిస్తోందా?....అయితే వీరభోగ వసంతరాయలవారికి నిజంగానే సమయం ఆసన్నమయ్యింది....ఆయన గుర్రానికి గుగ్గిళ్ళు తినిపించాల్సిందే !

Kathi Mahesh Kumar said...

ఓహ్ కోర్టు ఆదేశం అయినా పరిస్థితి ఇలా ఉందా! అయినా తెలుగు యూనివర్సిటీ పెట్టిన ఉద్దేశమే తుంగలోతొక్కి చాలా కాలమయ్యింది. దానికేంజెయ్యాల్లో!

Anonymous said...

ఇన్నయ గారు,
మీకు టి.వి. ల లో చూపించే నేరాలు, ఘోరాలు లాంటి ప్రసారాల మీద కూడా పోరాటం చేసే ఆలోచన ఉందా? అఘొరాలు,చేత బడులు ఇంకా చాల పనికిమాలిన వాటిని రాత్రి పూట వీరు ప్రసారం చేస్తారు. దీని ప్రభావం చాలమంది పైన పడుతున్నాది. మరీ ఇటువంటివి కూడా అశాస్త్రీయమే కాదా. ఇటువంటి కార్యక్రమాలు రోజు ప్రసారం చెసి ప్రజల లో భయాందోళలను,మూఢనమ్మకాలను పుట్టిస్తున్నారు. మీవంటి వారు (హేతువాదులు) పూనుకొని ఇటువంటి ప్రసారాలకు తెర వేస్తారని ఆశిస్తాను.

innaiah said...

TV channels are also with full of believers. But their managements are yeilding to sponsored programs where they get money. For example the babas are sponsored , christian missinaries are sponsored and that is how TV channels get money. When money is flowing managements forget ethics , norms and scientific truth. We requested the Channels and print media to put stroll saying that the matter is not scientific. Yet they are not doing.

షణ్ముఖన్ said...

అయ్యా,
మీకు చెప్పేటంతటి వాడిని కాదు, అయినా..
తెలియనివన్నీ అశాస్త్రీయమనుకోవటం హేతువాదుల లక్షణం కాదు. ఖచ్చితంగా జ్యోతిషం చెవ్వేవాళ్ళు చాలామందే ఉన్నారు. మీర కొంచెం సమయం వెచ్చిస్తే అలాంటి వారిని కలుసుకోవచ్చు.

Praveen Mandangi said...

ఈ లింక్ చదవండి: http://teluguradical.blogspot.com/2009/07/blog-post_14.html