కార్య కారణ జ్ఞానం
ప్రతిదానికీ కారణం వుంటుందని అన్నాది నుండీ జనం తలచారు.అది సరైనదే.కారణం తెలియనప్పుడు శక్తులను వూహించారు.దేవుడు దయ్యం,నరకం స్వర్గం అలా వచ్చాయి .కారణం తెలిసిన తరువాత కూడా నమ్మకాలు అట్టిపెట్టుకుంతే అది మూఢనమ్మకం అన్నమాట.ఇప్పటికీ అధారాలు లేని నమ్మకాలు: ఆత్మ, పునర్జన్మ .ఆలాగే అతీంద్రియ శక్తులు .వీటి చుట్టూ చాలా ఆధ్యాత్మిక వ్యాపారం జోరుగా సాగిపోతున్నది .ప్రశ్నలు వేయడం పిల్లలకు సహజం.కాని కొన్ని ప్రశ్నలు వేస్తే తప్పు అని, కళ్ళు పోతాయని భయపెట్టి నోరు మూయిస్తారు.నేను ఎట్లా పుట్టాను, దేవుడిని ఎవరు పుట్టించారు అని పిల్లలు అడిగితే,తెలియదు , తెలుసు కుని చెబుతాను అనాలి .రుజువు చేయలేనివి చెబితే పిల్లలకు మాఢనమ్మకాలు నూరిపోసినట్లె .మనకు తెలియనివి ప్రక్రితిలో చాలా వున్నాయి. క్రమేణా తెలుసుకుంటూ పోవడమే మంచి పధతి.
4 comments:
ఇన్నయ్య గారు,
"కారణం తెలియనప్పుడు శక్తులను వూహించారు. దేవుడు దయ్యం,నరకం స్వర్గం అలా వచ్చాయి ."
"మనకు తెలియనివి ప్రకృతిలో చాలా వున్నాయి. క్రమేణా తెలుసుకుంటూ పోవడమే మంచి పద్దతి."
చాలా బాగా చెప్పారు. మనకు తెలియని వాటికి దేవుడు కారణ౦ అని అనుకు౦టే మూఢనమ్మక౦ కాదు అని అ౦టున్నారు.
మనకు తెలియని విషయాలు వున్న౦తవరకు దేవుడు వున్నాడు అనే అభిప్రాయ౦ నిలిచి వు౦టు౦ది. అ౦దుకని దేవుడు వున్నాడా, లేడా అనేదానిపై వాది౦చుకోవడ౦ అనవసర౦ అని నా అభిప్రాయ౦.
There is a quote by Einstein:
"I want to know all Gods thoughts; all the rest are just details".
you are right.when certain people ascertain the existence of god as certain, then only they were asked to prove.Because the burden of proof is on those who propose.
ఇన్నయ్య గారు,
మనిషికి మనస్సు, మేథస్సు వు౦టాయి అ౦టారు. ఇ౦కా మనిషికి జ౦తువులక౦టే ఇక్కువ మేథస్సు వు౦టు౦ది అని అ౦టారు. నిజమేనా?
ఈ లింక్ కూడా వీక్షించండి: http://sahityaavalokanam.net/?p=143
Post a Comment