జ్యోతిష్యంలో బోగస్ నమ్మకాలు
తారాబలం అనేది జ్యోతిష్యంలో ప్రధానంగా పేర్కొంటారు. అంటే 27 నక్షత్రాల బలం మనుషులపై గట్టిగా ఉన్నట్లు చెబుతారు. అదే బోగస్ అంటే.
వారు చెప్పే తారలు ఖగోళ శాస్త్రం ధృవీకరించడం లేదు. అదలా వుంచితే, యీ తారల వెలుగు మనుషులపై పడ్డా ఎంతకాలం పడుతుంది? వాటి దూరం ఎంత? జ్యోతిష్యులు ఎలా కొలుస్తున్నారు? దీనికి జవాబు రాదు. ఇవ్వలేరు కూడా. అలాంటప్పుడు జన్మ నక్షత్రం బోగస్ కదా? అలాగే నమ్మిస్తున్నారు. ప్రశ్నించకుండా జనం గుడ్డిగా అనుసరిస్తున్నారు.
రాసుల విషయమూ అంతే గదా. అవి వూహలు. వాటి బలం ఎలా ఆపాదిస్తారు? ఇలా ఒక్కొక్కటే పొరలు విప్పుతూ పోతే జ్యోతిష్యంలో రుజువులకు నిలిచేది లేదు.
పుట్టుకను ఎలా నిర్ధారిస్తారు? పుట్టినప్పుడు శిశువుపై పడే కిరణాల వలన నిర్ధారిస్తారా? అయితే ఏ సమయంలో ఎన్ని కిరణాలు పడతాయి? జ్యోతిష్యానికి యివి ఏవీ తెలియవు.
వ్యాపారం మాత్రం జోరుగా సాగిపోతున్నది. జవాబులు చెప్పలేనప్పుడు మిగిలేది ఆగ్రహమే?
Tuesday, June 2, 2009
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
సిజేరియన్ చెయ్యడం రిస్కీ అని తెలిసి కూడా మంచి ముహూర్తంలో పిల్లలు పుట్టాలని టైమ్ కి ముందే సిజేరియన్ చెయ్యించి మహిళలని శారీరక అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఈ నమ్మకాలు లేని భార్యభర్తలు పెద్దల ఒత్తిడుల వల్ల కూడా టైమ్ కి ముందు సిజేరియన్ చెయ్యించుకోవడం కూడా జరుగుతోంది.
ఇంతింతై కిరణమంతై
నా ప్రపంచమంతై
జ్యోతిషమంతై
నక్షత్రమంతై
వాటి బలమంతై
ఖగోళశాస్త్రమంతై
ఆ పైన బోగసంతై
అంతై ఇంతై
తలతిక్కంతై
తైతక్కలంతై
మతిభ్రమించినంతై
ఒకరికి ఇద్దరంతై
ఎప్పటికీ బాగుపడనంతై....
ఇంతే సంగతులు చిత్తగించవలెను.....
గ్రహ పూజలు చేస్తే జాతక దోషాలు పోతాయని చెప్పి గ్రహ పూజలు చెయ్యించి డబ్బులు సంపాదించే పురోహితులు కూడా ఉన్నారు. అవి పొట్ట కూటి కోసం నేర్చిన విద్యలు. వాళ్ళ విద్యలకి మనం అంత విలువ ఇవ్వాల్సిన పని లేదు.
మీరు చేప ప్రసాదం గురించి కూడా వ్యాసం వ్రాస్తే బాగుంటుందనుకుంటాను. చేప మందులో ఏ పదార్థాలు ఉన్నాయో బత్తిన సోదరులు చెప్పలేదు. చేప మందులో ఏ పదార్థాలు ఉన్నాయో చెపితే ఆ మందు పని చెయ్యదని బత్తిన సోదరులు సమాధానం చెప్పారు.
http://palavelli.blogspot.com/2009/06/blog-post_06.html
Post a Comment