భారత దేశంలో పుట్టగానే కులం అంటగడతారు.వంశ పారంపర్యంగా కులం వస్తున్నది.కులం అంటే ఏమిటో తల్లి తండ్రులకు తెలియదు.వారి పూర్వికుల నుండి వారికి సంక్రమించింది.కులం ఇప్పుడు అంతువ్యాధి లా ప్రబలి, బలపడి , రాజకీయాల్లొకి వచేసింది .కులానికి తల్లి తండ్రి మతమే. నాలుగు వర్నాలు నేనే పుట్టించానన్నాడు గీతలో .కుల పరంగా మనువు శిక్షలు చెప్పాడు కులం పోగొట్టాలని సంస్కర్తలు ప్రయత్నించి విఫలమయ్యారు .మూలం మతం లో వుండడమే .దాని జోలికి పోకుండా కులం పో దు .
10 comments:
కులానికి మూలం మతంలో ఉందని బాగా సెలవిచ్చారు. అంటే కుల ప్రసక్తి లేని క్రిస్టియానిటి, ఇస్లాం, బౌద్దం లాంటి మతాల్లోకి మారమని మీ సలహానా?
మీరు ఇటువంటి టపాలను ఇంకా రాయాలి. దీని వలన మీ పాటకులందరికి మీకు కొన్ని విషయాల మీద ఉన్న జ్ఞానం తో పాటుగ మీ దగ్గర అజ్ఞానం ఎంత వుందో అవగాహన అవుతుంది. ఇది మీరు 1945-1950 రాసిన టపా కాదు గదా? ఆ రోజుల లో అత్తెసరు తెలివి గల వాళ్ళ వాదన ఇలానే వుండేది. వీళ్ళు క్రైస్తవ మతం మారటే టప్పుడు హిందు మతం మీద ఇలాంటి కుల పరమైన ఆరోపణలు చేసేవారు.
*మూలం మతం లో వుండడమే .దాని జోలికి పోకుండా కులం పోదు *.
50 సంవత్సరాల తరువాత ....... హై దరాబద్ లో పాస్టర్ గా అగ్రవర్ణ కులాని కి చెందిన వారిని నియమించారని 2సం || దళిత క్రైస్తవులు చర్చ్ ముందర నిరసన ప్రదర్శన లు ఎందుకు చేశారు? మరి మూలం మతం లో వుంటే క్రైస్తవ మతం మారిన వారి లో
మన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో మతంకన్నా కులం ప్రధానం. మతంతో సంబంధం లేకపోయినా కులం మాత్రం సుప్రీమే!
http://parnashaala.blogspot.com/2008/12/blog-post_879.html
కులచర్చలు అంత తొందరగా తెగేవీకాదు అంగీకారాత్మక నిర్ణయాలకు వచ్చేవీ కావు.అవి మన సామాజిక మనుగడనూ, ఆలోచననూ problamatize చేసి కొత్త సమీకరణాల్ని తయారుచెయ్యడానికేతప్ప సమస్యల్ని తీర్చడానికి ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఇప్పట్లో అలా ఉపయోగపడే పరిస్థితీ కనిపించడం లేదు.
హిందూ మతస్థులు ఎప్పుడూ ఒక cohesive సమూహంగా వ్యవహరించ లేదు.ఒకే మతానికి చెందినవారిగా కొన్ని shared symbols ఉన్నప్పటికీ,ఆచారవ్యవహారాలు, విధివిధానాలు,సాంప్రదాయాలూ అన్నీ కులపరంగా ఏర్పరచబడ్డాయి లేదా అలాగే ప్రచారం కల్పించబడ్డాయి.
చాతుర్వర్ణాల సృష్టినుంచీ పంచమకులాల్ని చేర్చేవరకూ విభజించి పబ్బంగడుపుకునే బ్రాహ్మణక్షత్రియవర్ణాల ఆధిపత్య కుట్ర తప్ప మతపరిరక్షణ ఎవరి ఉద్దేశమూ కాలేదు. జ్ఞానాధారిత,రాజ్యాధికారాధారిత సంఘం నుంచీ భూమిఆధారిత సంఘం ఏర్పడే సరికీ నియో-క్షత్రియ (రెడ్డి,కమ్మ,బలిజ మొ")కులాలు తమ అధికారాన్ని చెలాయించాయేతప్ప సర్వమానవ సమానత్వం ఎక్కడా చూపించలేదు. అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.
భూమినుంచీ రాజకీయం రాజ్యాధికారానికి మూలమవ్వగానే ఇవే కుల సమీకరణాలు ఆ వ్యవస్థమీద superimpose అయ్యాయి.అంటే వ్యవస్థ మారినా మూలాలు మాత్రం అవే అన్నమాట.ఓట్ బ్యాంక్ రాజకీయ క్షేత్ర్రంలో ఈ వర్గసమూహాల స్పృహ విజయవంతంగా ప్రతిసారీ reinforce చెయ్యబడింది.ప్రజాస్వామ్యంలో సమానత్వం తేవడంపోయి రాజకీయలభ్ధి కోసం కులాలు మరింత కరుడుగట్టిపోయాయి.కొన్ని కులాలు తమపై జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ కులాల ఉనికిని బలోపేతం చేస్తుంటే,మరికొన్ని తమకు సంక్రమించిన అధికారం ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో మరింతగా ఈ కులవ్యవస్థని వ్యవస్థీకరిస్థున్నాయి.
ఇటువంటి రాజకీయబ్రహ్మాస్త్రాన్ని త్యజించి సమానత్వాన్ని కాంక్షించే ఆలోచన దాదాపు అన్నికులాల్లోనూ అడుగంటింది. ఇది హిందూమత సమస్య కాదు. ఇదొక ఆర్థిక-సామాజిక-రాజకీయ సమస్య.కులాలకి మూలాలు మతంలో వున్నా,అసలే అరవ్యవస్థీకృత హిందూమతంలో ఈ విస్తృత సమస్యను తీర్చే శక్తి లేదు.ఈ సామాజిక సమస్యకు మతపరమైన సమాధానం వెతికితే అది మరింత ప్రమాదకరమైన పరిణామం అవుతుందేతప్ప solution ఏనాటికీ కాదు.
కాబట్టి, కులాన్ని ఒక సామాజిక వర్గంగా చూసి ఆర్థం చేసుకుని ఆరాతీసి సమాధానాలు వెతకగలిగితే కొంతైనా సాంత్వన కలగొచ్చు. హిందూమత పరిరక్షణలో భాగంగా కులాలను విడనాడాలని పిలుపునిస్తే మాత్రం మతాన్ని వదిలేస్తారేమోగానీ కులాల్ని చాలా మంది వీడలేరు.ఆధ్యాత్మికతకు మతమైతే కులం ఆర్థిక-సామాజిక-రాజకీయ అధికారానికి హేతువు.ఈ ఒక్క కారణం చాలు మతాన్ని త్యజించి కులాన్ని తలకెక్కించుకోవడానికి.
హిందూ మతం లో మొదట నాలుగు వర్ణాలే ఉన్నాయి. తర్వాత పంచమ వర్ణం పుట్టింది. ఇప్పుడు 2000 లకు పైగా కులాలు మన దేశంలో ఉన్నాయి. వీటన్నిటికి హిందూ మతమే కారణం అంటే సరి కాదు. ఉదాహరణకు ఇప్పుడు క్రిస్టియన్ రెడ్డిలు కుడా కుల రాజకీయాలు నడుపుతున్నారు. దీనికి హిందూ మతం ఎంతవరకు కారణం అవుతుంది?
మహేష్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనదేశంలో మతాలకు అతీతంగా కులానికి స్వయం ప్రతిపత్తి ఉంది. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కుల వృత్తులు మాత్రమె చేసేవారు కాబట్టి కులాలు కొనసాగాయి. ఇప్పుడు ఇంకా కులాలు ఉండడానికి ప్రభుత్వ రికార్డులు, కుల సర్టిఫికెట్లు మాత్రమే కారణం. కాబట్టి ఇవి అంతరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి కులాలకు బదులు OC, BC, SC, ST గా వ్యవహరిస్తే, కనీసం వేల కులాలు చతుర్వర్ణాలుగా మిగులుతాయి (పొడి అక్షరాల రూపంలో). సామాజిక సమానత్వం ఒకస్థాయికి చేరిన తర్వాత ఇవి కుడా రద్దు చేస్తే సరిపోతుంది. అయితే ఈ లోపు చేయాల్సిన పని... కులాన్ని సూచించే పేర్లను కఠినంగా నిషేధించాలి. కులాన్ని ఎవరు ఎక్కడ మాట్లాడినా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
నా ఉద్దేశంలో మన దేశంలో ఈ జాడ్యం నశించడానికి అంతకు మించి వేరే మార్గం లేదు.
@Mahesh,
*ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.*
ఇది మీరూ అంటున్నారేమొ కాని నాకు తెలిసి ఇంకా చాలమంది దళితులు హిందు మతం లో ఉన్నారు. వారేమి మేము హిందువులం కాము అని అనలేదు. ఇంతకి మీరే మంటారు ?
*కులాన్ని ఒక సామాజిక వర్గంగా చూసి ఆర్థం చేసుకుని ఆరాతీసి సమాధానాలు వెతకగలిగితే కొంతైనా సాంత్వన కలగొచ్చు. హిందూమత పరిరక్షణలో భాగంగా కులాలను విడనాడాలని పిలుపునిస్తే మాత్రం మతాన్ని వదిలేస్తారేమోగానీ కులాల్ని చాలా మంది వీడలేరు.*
సమాధానాలు ఎవరు వెతకాలి? వెతికితె అది ఎంతమంది కి ఆమోదయొగ్యం?
"కులాలను విడనాడాలని పిలుపునిస్తే" ఎవరు పిలుపును ఇస్తారు? ఒక వేళ ఎవరైనా ఇస్తే ప్రజలు వింటారా? ఇవి రెండూ జరిగే పనేనా?
అన్ని మతాలు మానవ విద్వెషాలే. క్రైస్తవం, ఇస్లాం మనుషులను ఎంత హీనంగా చూస్తాయో చాలా రాసాము.
మతాలన్ని నా ద్రు ద్రిష్తి లో ఒకటే. ఒక మత దొషం తప్పించుకోడానికి మరొక మతం పుచ్చుకుంటే పెనం పై నుండి పొయ్యిలో పడ్డట్లే .
ఒక మతానికి ఒక ప్రధాన అవ లక్షణం వున్నట్లే , హిందూ మతానికి కులం, అంటరాని తనం వున్నది. క్రైస్తవంలో బానిసత్వం వున్నది.
మానవ హక్కులకు అన్ని మతాలు విరోధులే
@జయహొ : నేను ఇక్కడ పెట్టిన లింకులో మీరు లేవనెత్తిన విషయంపైన చర్చ కొంత జరిగింది.అయినా ఇక్కడ కొంత చెబుతాను.
"‘దళితులు హిందువులం కాదు పొమ్మనటం’ ఒక సైద్ధాంతిక విభేధం.దళితులంటే suppressed classes అని అర్థం. వివక్షకు గురైతూ ఈ మత చట్రంలో ఎందుకుండాలి అనేది ఒక ప్రశ్నైతే,దళిత దేవుళ్ళైన మాతమ్మ,పోలేరమ్మ,పోతరాజులకు స్థానం లేని హైందవ సాంప్రదాయాలు మావి కావేమో అనే సందేహమూ దళిత బహుజనుల్లో ఉంది. ఎంతైనా మనుషుల్నే కానివాళ్ళని చేసినప్పుడు దేవుళ్ళకు మినహాయింపుంటుందా!"
ఇన్నయ్య గారి కంటే తీవ్రంగా కుల వ్యవస్థని విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణ: కంచ ఐలయ్య. ఈ లింక్ వీక్షించండి: http://viplavatarangam.net/2009/04/30/10
ఈ లింక్ కూడా వీక్షించండి: http://viplavatarangam.net/2009/06/15/27
Post a Comment