Monday, June 22, 2009

ముస్లిం ల మదరసాలు అంటే




ముస్లిం చిన్న పిల్లలను ముస్లింలు తప్పని సరిగా మతపరమైన బడులలో చేర్పించి మత విద్య చెప్పిస్తారు .అవి మదరసాలు.జకాత్ అని ఫిత్రా అని సదఖా,ఇందాత్ అనీ డబ్బు ఇస్తారు.విదేసాలలో వున్న భారతీయ ముస్లింలు కూడా ఈ డబ్బు ఇస్తారు. మదరసాలలో పిల్లలకు వుచిత భోజనం పెడతారు. కొన్ని వక్ఫ్ బోర్డ్ లు పరిమితంగా మదరాసాలకు ఆర్థిక సహాయం అందిస్తాయి .ఇంతవరకూ బాగానే వున్నది. కాని మదరసాలలో తప్పనిసరిగా కురాన్ కంటస్తం చేయిస్తారు .అంటే ఆరబిక్ భాష విధిగా, అర్థం తెలియక పోయినా వల్లె వేయాల్సిందే. లోపం ఎక్కడ అంతే సైన్స్ చెప్పక పోవడం. దీని వలన ముస్లిం విద్యార్థులు మతపరంగానె వుంటూ, సమజంలో ఇతరులతో దీటుగా రాలేకపోవడం జరుగుతున్నది. మదరసాలలో మరొక ప్రమాదం ఏమంటే పరమత ద్వెషం ,ఇస్లాం కోసం త్యాగం నూరి పోయడం. ఇది ఆత్మాహుతి దళాలకు, హింసకు ,తెర్రరిజానికి దారి తీస్తున్నది. లోగడ పాకిస్తాన్ ప్రసిడెంట్ ముషారఫ్ కూడా మదరసాలలో జరుగుతున్న ప్రమాదాలను చెప్పి, సైన్స్ కు మరల మన్నాడు. వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాషీ లేకపోవడం కూదా మంచిది కాదు.

3 comments:

Kathi Mahesh Kumar said...

మదరసాలకు ప్రభుత్వం పాక్షికంగా ఆర్ధిక సహాయం చేస్తూకూడా Educational mainstreaming and reforms వైపు తీసుకెళ్ళే ప్రయత్నాలు చెయ్యటం లేదు. Minority sensitivity పేరుతో వీరు చేస్తున్నది ముస్లిం విద్యార్థుల భవితకు తీవ్రమైన నష్టం అనేది కనీసం ముస్లిం నేతలు కూడా గ్రహించటం లేదు.

7 వతరగతికి సమానమైన మదరసా qualification ఉన్నా కనీసం mainstream education లోని ఐదవతరగతి పాఠాలు అర్థం చేసుకోలేని విద్యార్థులుగా ఒక జెనరేషన్ తయారయ్యారు.ఇక వీరు ఒకసారి వెనుకబడితే మరి జీవితాంతం అంతే.

ఇక మదరసాల్లోని మతవిద్య గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. గుడ్డిగా వల్లెవెయ్యడం తప్ప కనీసం అరబిక్,పార్శీవంటి భాషా జ్ఞానంకూడా పిల్లలకు అందివ్వని ఈ మత విద్యవల్ల మూఢత్వం వస్తుందేగానీ ఉపయోగం ఏమాత్రం లేదు.

Indian Minerva said...

మీరన్నట్లు ప్రభుత్వ అజమాయిషీలో మదర్సాలు ఉంటే విద్వేషాన్ని నూరిపోసేవాళ్ళ ఆటకట్టించవచ్చు. అసలునన్నడిగితే మతమనేది ఎవరికివారు తెలుసుకొని ఆచరించేదిగా ఉండాలేగానీ జన్మతః వచ్చేదిగా, తర్కం తెలీని వయసులో రుద్దబడేదిగా వుండకూడదు. ముస్లింపిల్లలని కేవలం మదర్సా విద్యకే పరిమితమైపోకుండా ఉపాధికి అవసరమైన విద్యగడించడానికికూడా (మరింత)ప్రోత్సహించాలి.

మహేష్ గారితో ఏకీభవిస్తున్నాను.

Anonymous said...

Teliyani vishayam vivarinchinanduku dhanya vaadalu..