Sunday, June 28, 2009

వెనక్కు పోతున్నామా







తిరుపతి వెంకన్న విగ్రహానికి 45 కోట్ల వ్యయంతో గాలి జనార్ధన రెడ్డి వజ్రాల కిరీటం కానుకగా ఇవ్వగా, మరొక భక్తుడు విజయవాడ దుర్గ విగ్రహానికి 2 కోట్ల ఖర్చుతో బంగారు బిస్క ట్లు సమర్పించ్చాడని వార్త.


ఇలాంటి వారిపై త్రిపురనేని రామస్వామి ఇలా రాసాడు .


మల మల మాడు పొట్ట తెగ మాసిన బట్ట కలత పెట్టగా


విల విల ఏడ్చు చున్న నిరుపేదకు జాలిని చూపకుండా


వుత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు


ఇళ్ళు వాకిళ్ళు పొలము పుట్ర ఇచ్చు ప్రభుద్ద వదాన్యుల ఇచ్చ మెచ్చెదన్

5 comments:

పునర్వసు said...

మతాలనూ, కులాలనూ ప్రభుత్వం గుర్తించకుండా ఉండాలి. అవి మనుషులకు అక్కరలేదని, దూమపానం, మద్యపానం లాగా అవి సమాజానికి హాని కరమని ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. ప్రభుత్వపు డబ్బుతో వరుణ యాగాలు చేయడం మానాలి. టీటీడి మొదలైన ధార్మిక సంస్థలకిచ్చే విరాళాలకు ఇంకంటాక్సు రిబేటులు తీసేయాలి. మతము, కులము అనే నమ్మకాలను వ్యక్తిగతానికి వదిలేయాలి. హేతువాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.

జయహొ said...

@పునర్వసు, చాలా కాలం (రమారమి 50 సం|| క్రితం )నుంచి ఇన్నయ గారు మీరు చెప్పిన వాటి గురించి వ్యతిరేకం గా రాయటం మొదలు పేట్టారు. కాని అది పేరిగిందే కాని తగ్గ లేదు.
*ప్రభుత్వపు డబ్బుతో వరుణ యాగాలు చేయడం మానాలి *
నాకు తెలిసి అది ప్రభుత్వపు డబ్బుతో చేయటం లేదు, దెవాలయాలకు వచ్చిన ఆదాయం తో చేస్తున్నారు. హజ్ యాత్ర, జేరుసలేం యాత్రలు ఖర్చు ఆయ్యే (గవర్నమెంట్ )డబ్బులు మీకు గుర్తుకు రాక పోవడం శొచనీయం.

పునర్వసు said...

జయహో గారు,
నా వ్యాఖ్యానం మీకు నాఉద్దేశ్యాన్ని పూర్తిగా విశదపరచనందుకు క్షంతవ్యుడను.
ఇది చదవగలరు.
http://tureeyam.blogspot.com/2009/06/blog-post_6530.html
మతము, కులమూ నేటి సమాజంలో కాంట్రవర్సీ అయినపుడు, సెక్యులర్ (అని చెప్పబడే) గవర్నమెంటు చేసే కొన్ని పనులను వ్యక్తిగతానికి ఒదిలేయాలని నాఉద్దేశం. ప్రభుత్వం యొక్క ద్యంద్యనీతి వలన ప్రజల డబ్బు, ప్రజా ప్రయోజనానికి వినియోగపడకపోగా, కులమత విద్వేషాలను పెంచడానికి ఉపయోగ పడుతుంది. దీన్ని హేతువాదులందరూ తమ ఎజండాలో చేర్చుకోవరసినదిగా కోరాను. 50 ఏళ్ళ నుండి వ్రాస్తున్నా తగ్గక పోగా పెరుగుతున్నందుకు కారణాలను కూడా అన్వేషించాలి. మతము మీద నమ్మకము, గౌరవము ఉన్నవారు ఎలాగూ వరుణయాగాలు లాంటివి తమ సొంత డబ్బుతో సమాజ ప్రయోజనార్థము చేయిస్తారు. మత సంస్థలకు దాని మీద నమ్మకంతో ఇచ్చే విరాళాలు సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ముట్టుకోకుండా ఉండాలి.

naprapamcham said...

government should not indulge in religious propaganda,including haj, Jerusalem tours, christian, Muslim propaganda. Similarly hindu pilgrimage in Tirupati, Bhadradri etc.
All exemptions to religious taxes should be removed and collect taxes on religious income.

Praveen Mandangi said...

ఈ లింక్ కూడా చదవండి: http://sahacharudu.blogspot.com/2009/07/blog-post.html