Sunday, May 31, 2009

ఖగోళ శాస్త్రం – జ్యోతిష్యం










ఖగోళశాస్త్రం సైన్స్ లో భాగం. ఇందులో పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నది. కనుక క్రమేణా తెలుసుకునేది విస్తృతమౌతున్నది. పూర్వం తెలియని గ్రహాలు, నక్షత్రాలు, శకలాలు ఇలా ప్రకృతిలో ఎన్నో విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పటికి పరిమితంగా తెలిసింది. ఇంకా తెలియవలసింది అనంతంగా ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రంలో ఏప్పుడూ నిత్య నూతనంగా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇందులో మరొక విశేషమేమిటంటే లోగడ తెలుగుకున్న వాటిలో దోషాలున్నా, అసంపూర్ణతలు ఉన్నా అవి దిద్దుకుంటూ పోవటం శాస్త్రియ ప్రక్రియలో ఒక ఉత్తమ గుణం. తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం. ఇది సైన్స్ లో అన్ని విభాగాల్లోనూ ఉంటుంది. ఇందులో జ్యోతిష్యాలకు, ఊహలకూ, మనుషుల బలహీనతలను అట్టం పెట్టుకుని వ్యాపారం చేసే ధోరణి ఉండదు.
జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.

Friday, May 29, 2009

హొం మంత్రిగా మహిళ







తొలిసారి మహిళకు ఆంధ్ర ప్రదేష్ లో ( సబిత రెడ్డి) కి హోం ఇవ్వడం పట్ల ప్రధానంగా పత్రికలు రాశాయి.కాని హోం మంత్రికి అధికారాలు లేవని చాలా మందికి తెలియదు .లా అండ్ ఆర్డర్ ముఖ్య మంత్రి చేతిలో వున్నది. అది లేకుండా హోం అంటే ఆరవ వేలు వంటిదన్న మాట .ఉన్నత పొలిస్ అధికారులను బదిలీ చేయడం, నక్సలైట్ సమస్యలు ,ఇంటిలిజె న్స్ అంతా ముఖ్య మంత్రిదే .లోగడ వసంత నాగెశ్వరరావ్ ,జానారెడ్డి, ఇంద్రారెడ్డి ,హాషిం వంటివారు అధికారాలు లేకుండానే వాపోయారు. ఎన్ కౌంటర్ మరణాలకు హోం మంత్రిని తిడతారు .

Thursday, May 28, 2009

మంత్రులకు మూఢనమ్మకాలుంటే

భారతదేశంలో ఎన్నికలు పూర్తయి కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మంత్రులు ప్రమాణాలు చేసేటప్పుడు రాజ్యాంగం అమలు జరుపుతామని హామీ ఇస్తూ పదవీ స్వీకారం చేస్తారు. రాజ్యాంగం కొంతమంది చదువుతారో, అర్థం చేసుకుంటారో తెలియదు. రాజ్యాంగంలో మౌలిక విధిగా శాస్త్రీయ పంథాను ప్రజలలో వ్యాపింపజేయటం ముఖ్యం అని స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది. అది చేసే బదులు, అందుకు విరుద్ధంగా తమ వ్యక్తిగత మూఢ నమ్మకాలను, చేదస్తాలను ఆఫీసులలోకి, పరిపాలనలోకి తీసుకు వస్తున్నారు. పదవి చేబట్టి ఆఫీసులో ప్రవేశించడానికి ముహూర్తాలు చూస్తున్నారు. వాస్తు పాటిస్తున్నారు. తాము నమ్మిన దేవుళ్ళను, బాబాలను ఆఫీసులలో కూడా ఫోటోలు పెట్టి దండాలు పెడుతున్నారు.
మంత్రులు మానవ మాత్రులే కనుక వారికి నమ్మకాలు, మత పరమైన ఛాదస్తాలు, వంశపారంపర్యంగా వస్తున్నాయి. కాని వారు నిర్వహించే పదవి ప్రజా ధనంతో కూడినది. ప్రజలలో అన్ని మతాలవారూ, మతేతరులు ఉన్నారు. వారు పన్నులు చెల్లిస్తారు కనుక పరిపాలనలో నిస్పక్షపాతంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని పరిపాలించాలి. వ్యక్తిగత నమ్మకాలను, మత విశ్వాసాలను వ్యక్తిగతంగానే అట్టిపెట్టుకోవాలి. లేకుంటే క్రమేణా ఈర్ష్యలూ, ద్వేషాలూ, కలహాలూ వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొందరు మంత్రులు వాస్తు ప్రకారం ఆఫీసులు, ప్రభుత్వ ఇళ్లూ మారుస్తున్నారు. దానికయ్యే ఖర్చు ప్రజలపై పడుతుంది. మరికొందరు మంత్రులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి తిరుపతికి, బాబాల వద్దకు, చర్చిలకు, మసీదులకు పోతున్నారు. అది స్వంత ఖర్చుతో ప్రభుత్వ ఆర్భాటం లేకుండా చేస్తే సరే, అలా కాక ప్రజల డబ్బుతో చేస్తే దుర్వినియోగ పరిచినట్లే. కానీ, మూఢ నమ్మకాలను ప్రజల నుండి తొలగించాల్సినవారే, ప్రజలకు ఇంకా మూఢనమ్మకాలు నూరిపోయడం దారుణం. వర్షాలు రాకపోతే యజ్ఞాలు చేయించి, అది ప్రజా సేవ అని అనుకోమనడం కంటే మోసం మరొకటి లేదు.

Saturday, May 23, 2009

మంత్రుల ప్రమాణం




c p joshi


sushil kumar shinde



a k anthony , jaipal reddi





chidambaram




























భారత ప్రభుత్వ కొత్త మంత్రి మండలిలో 6 గురు ప్రమాణ స్వీకారంలో రాజ్యాంగంపై చిత్తంపై ప్రమాణం చేయదం ఆహ్వానించ దగిన పురోగమనం. వీరు చిదంబరం,జయపల్ రెడ్డి, ఎస్ కె ఆంతోని, సుషి ల్ కుమార్ షిండే, వీరప్ప మొయిలీ ,ఎస్ పి జోషీ .ప్రజల వోట్లతో వచ్చి దేవుడిపై ప్రమాణం చేయడమంటే ,వోటర్లకు బాధ్యులు కారని అర్థం. పాలనలో నమ్మకాలు దూరంగా వుంచాలి .

Thursday, May 21, 2009

మతం దైవం పేరిట పిల్లలను
















1 బిలియన్ డాలర్లు నస్త పరిహారంగా కేథలిక్ చర్చ్ ప్రీస్త్ లు చెల్లించారు .దేనికి? చర్చ్ లలో , మఠాలలో ,కాన్వెంట్ లలో చేరిన పిల్లలను లైంగికంగా చెరచినందుకు! అంతా జేసస్ క్రైస్త్ పేరిట చేసినందుకు.1200 మంది ఇలాంటి ఫిర్యాడులు చేశారు .కొన్ని చర్చ్ లు దివాలా తీశాయి. పోప్ క్షమాపణ కోరి, ఈ నేరాలను సివిల్ కోర్ట్ లలో గాక ,మత కోర్ట్ లలో విచారిస్తామన్నారు . కాని భక్తులు ఒప్పుకోలేదు.ఇప్పుదు ఐర్లంద్ లో ఇలాంటి లైంగిక నేరాలు జరిగినట్లు విచారణలో బయటపడింది .ఐర్లంద్ కేతలిక్ దేసం. పిల్లల్ని దైవ సేవకోసం తల్లితండ్రులు పంపిస్తారు .తమకు లైంగిక అపచారం జరిగిందని చెప్పినా తల్లి తంద్రులు నమ్మదం లేదు. నమ్మినా మత గురువులు , నన్స్ పై చర్య తీసుకోమనదం లేదు. రాను రాను ఇవి శ్రుతి మించే సరికి బయటపడ్డారు ప్రపంచ వ్యాప్తం గా కేతలిక్ లలో ఇవి జరుగుతూ వస్తున్నాయి. మిగిలిన మతాలలో వున్నట్లు బయటపడుతున్నాయి. బాబాల ఆశ్రమాలలో జరిగినట్లు బాధితులే రాశారు. సత్య శాయి బాబా పై యునెస్కో వారితో సహా పెక్కు మంది ఫిర్యాదులు చేశారు. ప్రేమానంద్ డాక్యుమెంటరీ వివరాలతో ప్రచురించాదు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వున్నాయి.ముస్లింలలో ఇలాంటివి జరుగుటున్నట్లు ఇబన్ వారక్ "నే నెందుకు ముస్లిం ను కాను అనే పరిశొధనా రచనలో వెల్లడించాడు
2600 page report on sexual abuse of children in Ireland is just now released!

Tuesday, May 19, 2009

జ్యొతిశ్యం -ఆలొచించండి





జ్యోతిశ్యంలొ గ్రహబలం వాస్తవం అయితే ,ఆనాడు తెలియని కొత్త గ్రహాలు కనుగొన్నారు గదా.వాటి ప్రభవం లేకుండానే ఇన్నాళ్ళూ కథ నడిచిందన్నమాటేగా.యురేనస్,నెప్తూన్ ,ప్లూటో వంటి వి .


తారా బలం నిజంగా వుంటే భూమికి అతి సమీపం లో వుండే తార నుండి కిరణాలు రావడానికి 4 కాంతి సంవత్చరాలు పడుతుంది .మిగిలిన తారలు ఇంకా దూరాన వున్నాయిగదా .మరి వాటి ప్రభవం ఎలా గణిస్తారు?


రాసులు అని చెప్పేవి వూహించిన ఆకారాలుగదా .అవి నిజంగా లేవు.వాటిని బట్టి జన్మ నక్సత్రం అని చెప్పేవి రుజువుకు నిలబడవుగదా .జ్యొతిశ్యం ఎలా శాస్త్రయం ?


ప్రశాంతంగా ఆలోచించండి.

Saturday, May 16, 2009

ఇలా వుంటాయి జోశ్యాలు






ప్రపంచం అంతమౌతుందని తేదీలు కూడా ప్రకటించి విఫలం అయ్యారు.సుప్రసిద్ద రచయిత చలం 1962 లో లోకం అంతమౌతుందని అందరిని అరుణాచలం రమ్మని వుత్తరాలు రాశాడు.1999 లో ప్రపంచం అంతమౌతుందని ఫ్రెంచ్ జ్యొతిశ్యుదు నాస్త్రడామస్ తన 10-72 పద్యంలో రాశాదు.ఇక మత సంఘాలు ,జెహొవా విట్ నెస్ వారు 1975 లో ఆఖర్ అన్నారు. ఇలాంటివి చెప్పేవారు కొద్దిమంది వుండగా నమ్మి భయపెడేవారు, పురొహితులు చెప్పినట్లు సమర్పించుకునేవారూ చాలామంది వుంటున్నారు. చట్ట ప్రకారం చీటింగ్ కేస్ పెట్టి శిక్సిస్తే కొంత నయం .
ప్రపంచం 1982 లో అంతమౌతుందని అమెరికలో పాట్ రాబర్త్ సన్ క్రైస్తవ ప్రచారకుడుగా భయపెట్టాడు. ఒక సారి బాగ శిక్షిస్తే మిగిలినవారికి భయం వుంటుంది. మతాన్ని అడ్డం పెట్టుకొని ఇస్తం వచినట్లు అవాకులు చవాకులు కూస్తున్నారు .

Thursday, May 14, 2009

జ్యోతిస్యులారా




అన్నీ ముందే చెప్పామని జ్యొతిష్యులుప్రకటిస్తుంటారు .ఇప్పుదు ఇండియాలోఎన్నికల పలితాలు ముందే చెప్పి 25 లక్షల రూపాయలు గెలుచుకోమని కలకత్తా హేతువాద మిత్రులు బాంక్ లో డబ్బు పెట్టి చాలెంజ్ చేసారు .మేమూ వారితో కలసి జ్యోతిస్యులను తమ నిజాయితి నిరూపించుకోమని అడుగుతున్నాము
INR 25,00,000 challenge to all astrologers to forecast result of Parliament Election 2009
May 11th 2009
Science and Rationalists’ Association of India (Bharayatiya Bigyan o Yuktibadi Samiti) challenges all astrologers to forecast following results / information regarding Parliament Election 2009:--
How many seats will be acquired by Congress, BJP, TMC, CPI(M), BSP, RJD, Samajbadi Party, DMK, AIDMK?
How much differences in votes will remain to win/lose for Manmohan Singh, Sonia Gandhi, Lalkrishna Advani, Mamata Bandopadhyay, Laluprasad Yadav, Rambilas Paswan from their respective nearest opponents?
If any astrologer can forecast the correct result, Science and Rationalists’ Association of India will give him INR 25,00,000.00 (Twenty five lakhs Indian Rupees) (approx US$50,000.00) and shut down the Association.
Astrologers should forecast on 14th or 15th May 2009. They should send their forecast to Science and Rationalists’ Association of India by email (Email id of General Secretary: http://in.mc84.mail.yahoo.com/mc/compose?to=prabir_rationalist@hotmail.com , Email id of President: http://in.mc84.mail.yahoo.com/mc/compose?to=sumitra_humanist@hotmail.com ) and any of the following Press:
Anandabazar Patrika
Bartaman
Star Ananda
Kolkata TV
The Statesman
The Times of India
NDTV
Aajtak
BBC
PTI
UNI
AFP
AP
Astrologers have the habit of announcing after every election that, they had predicted the correct result. Science and Rationalists’ Association of India challenges in order to stop such false propaganda.
Prabir Ghosh,General Secretary,Science and Rationalists’ Association of India
Sumitra Padmanabhan,President,Science and Rationalists’ Association of India


వార్తా సేకరణలో జర్నలిస్తుల ఆహుతి

committee to protect journalists symbol
arrest of journalist





ఈ సంవత్సరంలో హైదరాబాద్ లో ప్రపంచ ఎడిటర్ల సమావెశండిసెంబర్లో జరుగనున్నది. 2008 లో ఎందరు జర్నలిస్త్లు జైలుపాలైనారో ,మరెందరు చంపేయ బడ్డారో నివెదిక విడుదల చేసారు. 673 మంది అరెస్త్ కాగా 70 మందిని చంపే సారు .125 మంది జైళ్ళలో వున్నారు .భారతదేశంలో 7గురు మరణించారు .జర్నలిస్త్లను కాపాడే సంఘం న్యూయార్క్ లో కేంద్రంగా పనిచెస్తున్నది .ఆంధ్ర జ్యోతి పై మాదిగ సంఘం చేసిన దాడిని నివేదిక పేర్కొన్నది. ఎవరైనా ఈ సంఘానికి తెలియపరిస్తే వెంటనే నిజానిజాలు విచారించి ఆయా ప్రభుత్వాలతో చర్యలకు పూనుకుంటారు. ఇండియాలో జరిగే సంఘటనలు 212 465 9344 కు చెప్పవచ్చు .ఇ మెయిల్ asia@cpg.org

Tuesday, May 12, 2009

వాడియా--నాడియా సినిమాలు


J BH WADIA












NADIA IN FRONTIER MAIL







జె బి హెచ్ వాడియా (1901-1986) సినీరంగంలో కొత్త ప్రయోగాలు చేశారు.నాడియా అనే తారను ప్రవేశ పెట్టి స్తంట్ లు చేయించి సఫలమయ్యారు .వాడియావారి నాడియా అని సినిమాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. వాడియా మహరాస్త్రీయుడు .ఎం ఎన్ రాయ్ అనుచరుడుగా హేతువాది, మానవవాది .అలా నాకూ పరిచయమైంది .హైదరాబాద్ లో ఆయన ప్రసంగాలు ఏర్పాటు చేసాము. అబ్బూరి రామక్రిష్నారావు సభలకు ప్రసిదెంట్ . బాంబే లో వాడియా స్తుడియో వున్నది. ఆయన కుమారుడు ఫిల్మ్ మ్యూసియం ఏర్పరచారు. ఎం ఎన్ రాయ్ తో తన అనుభవాలు వాడియా రాసారు .నేను చదువుకునే రోజులలో వాడియా సినిమాలు బాగా చూసి ఆనందించే వారము. హంటర్వాలికా బేటా వంటి సినిమాలు ఇప్పుడు చరిత్రగా మిగిలాయి .

వాడియా కుమారుడు వించి స్తుడియొ అభివ్రుద్ది చేశాడు.2003 లోచనిపోయాడు.నాడియా వారికుటుంబంలోనే హోమి వాడియాను పెళ్ళి చేసుకున్నది. వారి వెబ్ సైట్ చూడండి. www.wadiamovietone.com

సత్య జిత్ రే

sharmila tagore in Devi



Satyajit ray






2009 సత్య జిత్ రే శత జయంతి. ఈ తరం వారికి అతను పరిచయం లెడు. కాని భారత దేశానికి సినీ రంగంలో ఖ్యాతి తెచ్చిపెట్టినవాడు. 1992 లో ఆస్కార్ అవార్డ్ వచ్చింది.నేను చదువుకునే రోజులలో అతని సినిమాలు చూ శాను. అప్పుదూ జనం విరగబడి చూసిన సినిమాలు కాదు. కాని సమాజాన్ని ,కళను, ఫొటోగ్రఫీని , టాగోర్ ఇతి కథలను సినిమాలుగా తీశాడు. కొన్ని సినిమాలు: పథేర్ పాంచాలి (1955);అపరాజిత (1956);అపూర్ సన్సార్ (1959); జలసాగర్ (1958);దేవి (1960);కాంచనగంగ (1962);చారులత (1964) ; అరన్య దిన్ రాత్ (1969);ఘరె- బైరె (1984) దేవి లో షర్మిళ టాగోర్ గొప్పగా నటించింది .హిందూ మత లోపాల్ని చూపాడు .చారులత టాగోర్ కత నాతో నీత్ .బెంగాల్ పునర్వికాసం లో తీసినది సత్య జిత్ రె పై శ్యాంబెనగల్ సినిమా తీశారు

Saturday, May 9, 2009

నాస్త్రడామస్ కడపలో బ్రహ్మం వంటి వాడే
















నాస్త్రడామస్ ఫ్రెంచ్ వైద్యుడు.(1503-1566).అసలు పేరు మైకల్.వెయ్యి ఆటవెలది పద్యాలవంటివి రాసాడు. వాటిలో పదాలకు చిలవలు పలవలుగా అర్ధాలు చెప్పి రానున్న సంగతులన్నీ సరిగా చెప్పాడని నమ్మిస్తున్నారు .ఆయన రొజులలోనే రాజు హెన్రి చాలకాలం బ్రతుకుతాడని చెబితే , మరుసతి ఏడే కన్నుమూశాడు. ఆ రొజులలో ఫ్రెంచ్ రాణి కాథరిన్ అతన్ని కొలువుకు పిలిచింది. అంతటితో పేరు ప్రాకి పోయింది. విడ్డూరపు కథలు , వ్యఖ్యానాలు గోరంతలు కొండంతలుగా చెప్పారు. వైఫల్యాలు చెప్పలేదు.ఇథర భాషలొలోకి అనువాదాలు రాగా నేటికీ ప్రచారం సాగుతున్నది. ఇప్పుదు తెలుగు వారికి కూడా అవి అంటుకున్నాయి. కడపలో లోగడ బ్రహ్మం అనే ఆయన తత్వాలు చెప్పాడని అవి నేటికీ నిజమౌతున్నాయనేవారున్నారు.హిస్టర్ అని నాస్త్రడాం వాడిన పదాన్ని హిట్లర్ అని మార్చేసి , ముందే హిట్లర్ సంగతి చెప్పాడని రాసారు. జోస్యం వ్యాపారం అలా సాగి పోతున్నది.నిశిత పరిశీలన చేయకుండా ప్రశ్నించకుండా నమ్మే వారున్నంతవరకు జోశ్యం గిట్టుబాటుగానే వుంటుంది .

నాస్త్రడామస్ వెయ్యి పద్యాల రచన సెంచరీస్ ను క్రైస్తవ చర్చ్ నిషేధించిందికూడా.అతని వైఫల్యాలు చెప్పే వారు కాదు. అనాగ్రాంస్ వాడి అక్షరాలు మార్చి అనుకూల అర్థాన్ని చెబుతుండేవారు.ఫ్రెంచ్ వుచ్చారణ అర్థంకూడా అనువాదంలో మార్చి చెబుతున్నారు .

ఆతని జోశ్యంలో అతని ఎదుటే విఫలమైనవి:1666 లండన్ అగ్నిప్రమాదం, 16 వ లూయి పలాయనం ,పట్టుబడటం, ఇంగ్లడ్ 1 వ చార్లెస్ ఉరి, 1వ ఎలిజబెత్ గురించి చెప్పినవి రుజువు కాలేదు.ఆయన పేరిట వ్యాపారమ చేస్తున్న భక్తులు అవి చెప్పరు. జంకు గొంకు లేకుండా సాగి పోవడం జ్యొతిస్యుల వ్యాపార ధర్మం!

Friday, May 1, 2009

క్రైస్తవ మోసాలు - -మదర్ తెరీసా పేరిట








నిరంతరం మత వ్రపారాన్ని కొత్త మహిమలతో జనాన్ని ఆకట్టుకొని వ్యవస్తను కొనసాగించడం క్రైస్తవులు చిరకాలంగా చేస్తున్నారు.అందులో అధునాతన మహిమ మదర్ తెరీసా పేరిట జరుగుతున్నది.ఆమె మహిమలు అసత్యాలని క్రిస్తోఫర్ హిచిన్స్ పోప్ ఎదుటే చెప్పినా సరే మోసాలు జంకు లేకుండా గిట్టుబాటు గా చేయదం , శిక్షించే వారు లేనందునే.




క్రీస్తు శవానికి కప్పిన లినిన్ వస్త్రంపై ముద్ర పడిందంటూ ప్రదర్సనకు పెట్టి వ్యపారం చేస్తున్నారు. పాతిపెట్టిన 14 శతబ్దాలకు బయట పడిందన్నారు.చివరకు చిత్రకారుడి అద్దకం అని తేలినా ప్రదర్సన కొనసాగించడం మూడ్డ నమ్మకానికి నిదర్సన. ఇప్పుడు ఇటలీలో త్యురిన్ లో ఒక చర్చ్ లో వుంచారు .



Shroud of Turin in St John church



Joe Nickel who revealed the cheatings














christ blood!


ఫ్రపంచ వ్యాప్తంగా భక్తులను రక రకాలుగా క్రైస్తవ సంఘాలు, సంస్తలు ఒక క్రమ పధతిలో మోసాలు చెస్తున్నయి. గుడ్డి నమ్మకస్తులు యాత్రలు చేసి దక్షిణలు సమర్పించి, వస్తువులు కొనుక్కుని మోసపోతున్నారు .క్రైస్తు శిలువ వేసినప్పుడు కొట్టిన మేకులు, కారిన రక్తము (!) ,ముఖము తుడిచిన వస్త్రము,చివరకు శవంపై కప్పిన వస్త్రము ప్రదర్సనలో పెట్టారు .ఇవి ఎక్కువగా ఇటలి, ఫ్రాన్స్ ,జర్మని ,బెల్గియం ,స్పెయిన్ లొలోఅ చూపుతున్నారు.మధ్య శతాబ్దాలలో ఇవి మొదలు పెట్టారు. కార్బన్ పరీక్షలు,అన్ని సైంటిఫిచ్ పరీక్షలు ఇవి మోసాలని ఎలుగెత్తి చాటుతున్నా మహిమల ప్రదర్సన ఆగలేదు. రక్తం ఇప్పటికీ ఎర్రగా వుంచడము పరాకాస్ట. రక్తం త్వరలో వూదా గా మారి తరువాత నల్లగా అవుతుంది .అదికూదా విస్మరించి ఎప్పటికప్పుదు ఎర్రగా అట్టిపెట్టదం విశెషం. జో నికిల్ ప్రత్యెక పరిశొధన చేసి బయట ఫెట్టాదు. ఇటీవల ఆయన్ను కలిసి చర్చించాను .రెలిక్స్ ఆఫ్ క్రైస్త్ పుస్తకం చూడండి.