Wednesday, December 31, 2008

హోమియోశాస్త్రీయం అయితే రుజువు చేసే పద్దతులు ఎందుకు చేయరు

హొమియో లొ నమ్మకమే ప్రధానమా?




హోమియో చికిత్స జర్మనీలో ప్రారంభించిన హేనిమన్ 1819లో యువరాజు షవర్జన్ బర్గ్ కు చికిత్స చేశాడు. ఆనాడు యువరాజు ప్రజలలో ప్రాచుర్యంగల ఆకర్షణీయ వ్యక్తి. హేనిమన్ ప్రత్యామ్నాయ చికిత్సవలన అతడు మరణించాడు. ఆధునిక వైద్య విధానాన్ని విమర్శిస్తూ బయలుదేరిన హేనిమన్ వైఫల్యాన్ని పండితులు గానీ, ప్రజలు గానీ హర్షించలేదు. అతని వెంటబడి తరిమికొట్టారు. అప్పుడు హేనిమన్ జర్మనీ వదలి ఫ్రాన్స్ పారిపోయాడు. ఆగ్రహావేశులైన ప్రజలు అతని మందులను పారబోసి, పుస్తకాలను తగులబెట్టారు. ఫ్రాన్స్ లో స్థిరపడిన హేనిమన్ వయసులో తనకంటే 45 సం. తేడాగల సంపన్న యువతిని పెండ్లాడు. అయితే ఫ్రాన్స్ లో హోమియో ప్రాక్టీసు ద్వారా బాగా ఆర్జించాడు.
హేనిమన్ సమకాలీనుడు ఆండ్రాల్ అతని అనుచరుడు కూడా వైద్య వృత్తిలో ఉంటూ హేనిమన్ చెప్పిన ఔషధాలు పరిశీలనార్థం తీసుకున్నారు. సింకోనా, ఎకోనైట్, సల్ఫర్, ఆర్నికా వంటి హోమియో ఔషధాలు వేసుకున్నారు. ఎం.డబుల్ కూడా సింకోనా తీసుకున్నాడు. అలాగే ఎం. బోనెట్ హేనిమన్ ను పారిస్ లో సవాల్ చేస్తూ అతడు చెప్పిన ఏ ఔషధాన్నయినా స్వీకరిస్తాననీ, అతడు చెప్పిన లక్షణాలు కనిపిస్తే హోమియోను అంగీకరిస్తాననీ, 1835లో ప్రకటించారు. హేనిమన్ గానీ, అతని అనుచరులు గానీ అలాంటి సవాల్ను స్వీకరించడానికి ముందుకు రాలేదు. ఔషధాలు స్వీకరించిన వారికి హేనిమన్ చెప్పిన లక్షణాలేవీ కనిపించలేదు. అయినప్పటికీ ఆనాడు వైద్యవిధానం లోపాల వలన హేనిమన్ సిద్ధాంతాలూ, రచనలూ బహుళ ప్రచారంలోకి వచ్చాయి. యూరప్ లో హేనిమన్ బాగా పేరు తెచ్చుకున్నాడు. క్రమేణా నమ్మకం ఆధారంగానే హోమియో ప్రచారంలోకి వచ్చింది. హేనిమన్ బ్రతికుండగానే యూరప్ లో ప్లేగు, కలరా, మసూచి వంటి రోగాలు అంటు వ్యాధులుగా లక్షలాది జనాన్ని తుడిచి పెడుతుంటే హోమియో నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవలసి వచ్చింది. ఉత్తరోత్తర ఆధునిక వైద్య విధానం వలననే ఈ అంటు రోగాలను అరికట్ట గలిగారు.

హోమియోను యూరోప్ దేశాలలో, ఆస్ట్రేలియాలో, అమెరికాలో భిన్న కాలాలలో నాటి నుండి నేటి వరకు శాస్త్రీయ పరిశోధనలకు గురి చేశారు. ఏ ఒక్క సందర్భంలోనూ హోమియో శాస్త్రీయ పరిశోధనలకు నిలవలేకపోయింది. రుజువు పరుచుకోలేకపోయింది.

1977లో ఆస్ట్రేలియా పార్లమెంటుకు వైద్య శాస్త్రజ్ఞుల నిపుణుల సంఘం తన నివేదికను సమర్పించింది. అనేక వాదోపవాదాల తరువాత నిగ్గు తేల్చాలని ఈ సంఘాన్ని నియమించారు. మందులో మూల పదార్థాన్ని తగ్గించుకుంటూ, కుదుపుతూపోతే పొటెన్సీ పెరుగుతుందనే హోమియో సిద్ధాంతం రుజువు కాలేదని వారు స్పష్టం చేశారు.

అమెరికాలో తొలుత 19వ శతాబ్దంలోనూ, 20వ శతాబ్దంలోనూ హోమియో జనాన్ని ఆకట్టుకుంది. 1920 ప్రాంతానికి హోమియో కళాశాలలో ప్రభావం తగ్గిపోగా వాటన్నిటినీ మూసివేశారు. అయినప్పటికీ హోమియో ప్రచారం కొందరు సాగిస్తూనే ఉన్నారు. దీనికి ఎలాంటి డిగ్రీలు, అర్హతలు అక్కరలేకపోవడం, గుర్తింపు లేని హోమియో కేంద్రాలు వ్యాప్తిలో ఉండడం జరుగుచున్నది. ఆకర్షణీయంగా మార్గాంతర వైద్యం పేరుతో పుస్తకాలు రాసి ప్రచారం చేస్తున్నారు. పత్రికలు అచ్చు వేస్తున్నారు. కొందరు హోమియో చికిత్సలో కంప్యూటర్లను వాడుతున్నారు. అదొక ప్రత్యేకతగా జనానికి చూపుతున్నారు. అమెరికా, ఫ్రాన్స్ లో, ఇజ్రాయల్ లో కొందరు హోమియో వాదులు రుజువునకు నిలబడతామని విఫలమయ్యారు. శాస్త్రీయ పరిశోధనా ఫలితాలు నేచర్ పత్రికలో ప్రచురించగా, అమెరికా నుండి శాస్త్రీయ పరిశోధనా సంఘం వెళ్లి నిజానిజాలు తెలుసుకున్నది. దొంగ లెక్కలతో అబద్ధాలతో నివేదిక రాసినట్లు రుజువయింది. పారిస్ లో ఉన్న హోమియో పరిశీలనా కేంద్రాన్ని అంతటితో మూసివేయవలసి వచ్చింది. అమెరికాలో కూడా హోమియో రుజువుపరచలేక కోర్టుకు వెళ్ళి కూడా ఓడిపోయి నార్త్ కెరోలైన్ రాష్ట్రంలో హోమియో డాక్టర్లు క్షమాపణలు చెప్పుకోవలసి వచ్చింది. హ్యూమనిస్ట్ పరిశోధనాకేంద్రంవారు హోమియో అధ్యయనానికి ఒక నిపుణుల సంఘాన్ని నియమించారు. వీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హోమియో వారు చెప్పుకుంటున్నరుజువులు అనే అబద్ధాలను బయట పెడుతున్నారు.

వైఫల్యాలకు బాద్యత వహించె పద్దతి వున్నదా ?

రోగ నిరోధక శక్తి అనే సూత్రాన్ని హోమియో వారు చెప్పిన రీతిలో ఆధునిక వైద్యం కూడా అనుసరిస్తున్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇందుకు టీకాల వైద్యం హోమియోకి విరుద్ధంగా నడుస్తున్న చికిత్స. టీకాల మందు పెద్ద మోతాదులలో ఇస్తే ఆ లక్షణాలు హోమియో సూత్రం ప్రకారం మనిషికి కావాలి. కాని అలాంటిదేమీ రుజువు కాలేదు. టీకాల మోతాదు హోమియో చెప్పినట్లు తగ్గిస్తూ పోతే దాని ప్రభావమే ఉండదు. అంతేగాక, కుదపటం అందువలన శక్తి పెరుగుతుందటం కూడా టీకాల వైద్యంలో జరగదు. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచటానికి టీకాల మందు ఇస్తారు. ఈ మందు కూడా అలాగే పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి.

హోమియోపతి ఎయిడ్స్ మొదలు, కేన్సర్ వరకు చికిత్స చేయగలదని చెపుతుంటారు. దీనికి కూడా రుజువుకు నిలిచిన ఆధారాలు లేవు. తల్లిదండ్రుల నుండి పారంపర్యంగా కొన్ని లక్షణాలతో కూడిన మియాజంలు పిల్లలకు సంక్రమిస్తాయని హోమియో చెబుతుంది. వ్యక్తి స్వభావం, ప్రవర్తన, అలోచన ఉద్వేగాలు పరిగణనలోకి తీసుకుని రోగనిర్ణయం చేస్తుందని వ్యక్తిత్వ ఔషధం నిర్ధారిస్తుందని చెబుతారు. (కాన్ట్సిట్యూషనల్ మెడిసిన్) ఈ పద్ధతిని హోమియో సంపూర్ణ వ్యక్తిత్వ చికిత్సగా పేర్కొన్నారు. మిగిలిన చికిత్సలకంటే ఇది ఉన్నతం కావడానికి ఇది వ్యక్తిత్వ చికిత్సే పేర్కొనదగినదన్నారు. ఇలాంటి నమ్మకాలతో హోమియో వైద్యం జనాన్ని ఆకట్టుకోవటానికి తోడ్పడుతున్నది. ఏదీ రుజువు చేయనక్కరలేని స్థితిలో హోమియో సాగిపోతున్నది.

1986లో బ్రిటిష్ జర్నల్ లాసెట్ ప్రచురించిన నివేదిక ప్రకారం జ్వరపీడితులైన రోగులకు, జ్వరం లేని వారికీ పంచదార మాత్రలు, హోమియో ఔషధాలు యిచ్చి పరిశీలించగా హోమియో ప్రభావం కనిపించలేదని రుజువయినట్లు రాశారు. ఇలాంటి నివేదికలు 1989లో కూడా లాన్ సెట్ ప్రచురించింది.

ఇంగ్లండులో హోమియో వైద్య విధానం అక్కడి ఆధునిక వైద్యశాఖలో భాగంగా ఉండాలని హోమియో వైద్యుడికి ఎం.డి. డిగ్రీ ఉండాలని ఆంక్షలు పెట్టారు. హోమియోవారు వాటిని అంగీకరించి ఆ పరిమితులకు లోబడి పనిచేస్తున్నారు. వృత్తి వ్యాపార నిమిత్తం ఎలాంటి రాజీ ధోరణి అయినా హోమియో అవలంబిస్తుందని ఇది ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. భారత దేశంలో హోమియో వైద్యం ప్రభుత్వ గుర్తింపు పొందినది. వైద్య అధ్యయనంలో ఆధునిక వైద్య పద్ధతులు నేర్చుకుంటున్నారు. ఈ పద్ధతులకూ, వారి వైద్యానికీ పూర్తి వైవిధ్యం ఉన్నది. హోమియోలో ఆధునిక పరిశోధనా, పరిశీలన భారతదేశంలో జరగటం లేదు. కాని హోమియో వైద్యులు మాత్రం డిగ్రీలు పుచ్చుకుని ప్రాక్టీసు చేస్తున్నారు. ఏ డిగ్రీలూ లేకుండా హోమియో గ్రంథాలు చదివి కేవలం అనుభవంతో వైద్యం చేసేవారు చాలామంది ఉన్నారు. వీరిపైన నామమాత్రమయిన ఆంక్షలే ఉన్నాయి. రోగులతో చెలగాటమాడే యీ వైద్య విధానంలో యిలాంటివారి బాధ్యతారహితమైన ప్రాక్టీస్ ప్రమాదాలను తెచ్చిపెడుతున్నది. హోమియో చికిత్సకు భీమా లేదు. చికిత్స చేయించుకున్న రోగుల విషయం సర్వే లేదు. వైద్యులు సాధారణంగా రికార్డు అట్టిపెట్టరు. మందులు ఏది వాడారు అనే విషయం బహిరంగంగా చెప్పరు. హోమియో చికిత్సలో రోగి చనిపోతే పోస్ట్ మార్టమ్ పద్ధతి లేదు. ఒకవేళ ఉన్నా ఏ మందు తీసుకున్నదీ తెలియదు. మందు లేదు గనుక తెలియడానికి వీలు లేదు. ప్రభుత్వం హోమియోకి నిధులు యిచ్చేటప్పుడు యిలాంటి విషయాలను పట్టించుకోవటం అవసరం.

వైఫల్యాలకు బాద్యత వహించె పద్దతి వున్నదా ?

కేంద్ర ప్రభుత్వం హోమియోను గుర్తించింది గనుక రాష్ట్రాలు రబ్బరు స్టాంపువలె గుర్తింపునిచ్చాయి. ఈ గుర్తింపు కేవలం నిధుల కోసమేనని గమనించాలి. ఇంగ్లండులో వలె ఆధునిక వైద్య కౌన్సిల్ ఆధ్వర్యంలో హోమియోను అదుపులో పెట్టాలి. నిరంతర పరిశోధనలు జరపటానికీ, రుజువు పరచడానికీ ఒక బోర్డును నియమించాలి.

హోమియో మందుల వలన చెడు జరగదనీ, ఇంగ్లీషు మందులవలె దుష్ఫలితాలు ఉండవనీ ప్రచారం చేస్తున్నారు. సీరియస్ జబ్బులకు, కలరా వంటి అంటు రోగాలకు హోమియో చికిత్స పనికిరాకపోగా, ప్రాణాపాయం కలిగిస్తున్నది. హోమియో చికిత్స విఫలం కాగా లివర్, కిడ్నీ జబ్బులతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికొచ్చినవారున్నారు. ఒక హోమియో కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల కిడ్నీలో రాళ్ళు తీయించుకోటానికి హైదరాబాదులో అత్యంత అధునాతనమైన ఆస్పత్రిలో చేరాడు. ఇలాంటి విషయాలు దృష్టికి వచ్చినప్పుడు హోమియో వారు చెప్పేదానికీ, చేస్తున్నదానికీ అవినీతికరమైన వ్యత్యాసం కనిపిస్తున్నది.



హోమియో కొన్నిటికే బాగా పనిచెస్తుందా? అవి ఏవి?







కొందరు హేతువాదులు హోమియో చికిత్స చేస్తున్నారు. మిగిలిన అన్ని విషయాలలో హేతుబద్ధం కాని వాటిని విమర్శిస్తూ, హోమియో విషయం వచ్చేసరికి హేతువాదాన్ని అన్వయించలేకపోతున్నారు. ఇందుకు సంపాదనే ప్రధాన కారణం. హేతువాదం ఒకవేళ హోమియోను సమర్ధిస్తే, హేనిమన్ సిద్ధాంతాలలో వైటల్ ఫోర్స్ వంటి నమ్మకాలు, వ్యక్తిని వర్గీకరించడం, పొటెన్సీ సిద్ధాంతం శాస్త్రీయంగా ఎలా రుజువు చేస్తారో చెప్పగలగాలి. హోమియోలో అత్యంత ఆధునిక శాస్త్రీయ జ్ఞానం అనుసరిస్తున్నట్టు ఎప్పటికప్పుడు మార్పులూ, చేర్పులూ చేస్తున్నట్లు కొందరు రాస్తున్నారు. హోమియో మూలగ్రంథాలు ఆర్గానన్ వంటివి ఏ మేరకు సవరించారు, ఖండించారు, తృణీకరిస్తున్నారు అనేది స్పష్టం కావాలి. హేనిమన్ చనిపోయిన తరువాత ఆధునిక విజ్ఞానం ఎంతో పెరిగింది. సూక్ష్మజీవుల విషయం మొదలు సూక్ష్మాణువుల విషయం వరకూ అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. వాటిని వైద్యశాస్త్రం మానవులకు ఉపయోగకారిగా మలుచుకుంటుంది. హోమియో అలాంటిదేమీ చేయలేకపోయింది.

----

Friday, December 26, 2008

క్రైస్తవం ఇంత అమానుషమా?


Innaiah with Sam Harris in USA







Book Release function
{L to R}Vikram,Mr Isanaka Muralidhar, Innaiah, Mrs Chandana Chakravarty, Ravi Prakash,CEO TV9,

Mr C.Narasimharao. in press club, Hyderabad, India









శాం హారిస్ రాసిన 'A Letter to Christian Nation" అనే పుస్తకాన్ని క్రైస్తవం ఇంత అమానుషమా? అనే పేరుతో తెలుగీకరించారు.


మతం మానవాళికి మత్తుమందన్నాడు కార్ల్ మార్క్స్. ఎవరికి వారు తమ మతం గొప్పదంటే తమ మతం గొప్పదంటూ యుద్ధాలు సృష్టిస్తున్నారు; మూఢనమ్మకాలకు తమ వంతు చేయూతనిస్తున్నారు.

ఈ భూమిపై జరిగే ప్రతి పనీ, దేవుని అనుజ్ఞతోనే జరుగుతుందని క్రిష్టియన్ల విశ్వాసం. 2004 సునామిలో కొన్ని వేల మంది పిల్లలు తల్లి తండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. తమిళ్‌నాడు లోని వెళ్లంకన్ని మేరి మాత చర్చ్ కు, క్రిస్ట్మస్ పర్వదినాన వెళ్లిన భక్తులు, ఆ మరుసటి దినం వుదయాన చర్చ్ పక్కనే గల బీచ్ లో వాహ్యాళి కెళ్లిన సందర్భంలో, సునామి వాత పడి సుమారు 2000 మంది చనిపోయారు;120 వ్యాపార అంగళ్లు కొట్టుకు పోయాయి. చర్చ్ కు ఏమి కాలేదు. ఆసియ ఖండంలో సునామి దెబ్బకు ఎంతో మంది అనాధలయ్యారు. దేవుడే వుంటే ఇలాంటి అరాజకపు పని జరగనిస్తాడా?

ఏసు దయామయుడని క్రిస్టియన్ల విశ్వాసం. బైబుల్ లో పరమత సహనం: దేవుని యందు విశ్వాసం లేని వారిని చిత్రహింస చెయ్యాలని (సెయింట్ ఆగస్టీన్), చంపెయ్యాలని(అక్వినాస్) చెప్పారు.బైబుల్ బానిసత్వాన్ని, జంతుబలిని ప్రోత్సహిస్తుంది.ఆఫ్రికా ఖండం ఎయిడ్స్ తో సతమతమౌతుంటే, సహారా ఎడారి ప్రాంతంలో కండోం లు వాడవద్దన్న క్రైస్తవుల ప్రచారంతో, ఎయిడ్స్ అక్కడ ఒక పెద్ద సామాజిక సమస్యై కూర్చుంది. క్రిస్టియానిటి గర్భస్రావాన్ని అనుమతించక పోవటం తో , పెళ్లి కాని తల్లులు, పెక్కు సమస్యలు, కొన్ని దేశాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది.బైబుల్ లో పరస్పర విరూద్ధాంశాలు చాల ఉన్నాయి. ఆ వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

బైబుల్ దేవవాక్కయితే, ఇందు లో గణితానికి సంబంధించి తప్పులెలా వుంటాయి? బైబుల్ సర్వస్వం కాదు.వైజ్ఞానిక విషయాలను చెప్పటంలో విఫలమయ్యింది. ఉదాహరణకు విద్యుత్, జీవాణువు (DNA), విశ్వ పరిమాణం, విశ్వ వయస్సు ఇంకా కాన్సర్ చికిత్స గురించి బైబుల్ చెప్పలేదు. ఈ విశాల జగత్తులో బాల్య మరణాలు అధికం. బాప్టిజం పుచ్చుకోకుండా చనిపోతున్న ఈ బాలలంతా, శాశ్వతంగా నరకంలో వుండి పోతారని,సెయింట్ ఆగస్టీన్ బాష్యం చెప్పారు.క్రైస్తవంలో,అనంత విస్ఫోటనాన్ని (Big Bang theory) అంగీకరించక, అంతా దేవుడి తెలివైన నమూనా (Intelligent Design) అని నమ్మి, ఆ సిద్ధాంత ప్రచారానికై, అశాస్త్రీయ పాఠ్య పుస్తకాలను పిల్లలపై రుద్దుతున్నారు.

మత సంఘర్షణలు: కాథొలిక్స్కు, ప్రొటెస్టంట్లకు పడదు.సున్నీ, షియాలకు పడదు.శైవులకూ, వైష్ణవులకూ పడదు. వీరంతా ఒకే మతంలో వుంటూ, ఆ మతానికి పరస్పర విరుద్ధ భాష్యాలు చెపుతూ కలహించు కొంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా భిన్న మతస్తులు పరస్పరం యుద్ధాలు చేసుకొంటున్నారు.

1775 లో అమెరికా లో బానిసత్వాన్ని తొలగించాలని కొందరు వాదిస్తే, అలా వాదించే వారు తమ సమయాన్ని వృధా చేసుకొంటున్నారని తలిచారు. ఈ మతం వలన మానవాళికి ఒరిగిందేమిటి? పరస్పర యుద్ధాలు, మనిషిని అంధ విశ్వాసాల లోకి నెట్టి వేయటం తప్ప. విద్య,శాస్త్రీయ దృక్పధం,హేతువాదం పెంపొందిన నాడు , దేవుడనే ఇప్పటి ప్రజల విశ్వాసం చూసి, భవిష్య మానవుడు నవ్వుకుంటాడు.






ఈ పుస్తకాన్ని e-book గా ఇస్తున్నాము.
http://www.esnips.com/doc/fb11c928-9223-4e15-9b84-80836c12e26e/Christianity-by-Sam

Friday, December 19, 2008

అడవిగాచిన వెన్నెల చైనాలొ నిషేదించారు


Komala Venigalla ( translator)
writer Jung Chang
Jon Haliday( Chang`s husband)







యంగ్ చాంగ్ గొప్ప చైనీస్ రచయిత్రి. ఆమె రాసిన అడవిగాచిన వెన్నెల( Wild Swans) చైనాలొ నిషేదించారు.కాని ఆమెను మాత్రం చైనా రానిస్తున్నారు.ప్రస్తుతం యంగ్ ఇంగ్లంద్ లొ భర్త జాన్ హాలిడే తో వుంటున్నది.
తెలుగులో వెనిగళ్ళ కోమల వెలువరించగా ,ఆవిష్కరణకు యంగ్ ,జాన్ వచ్చి మాట్లాడారు .
యంగ్ కుటుంబం చైనాలో మావో ,కమ్మ్యూనిస్ట్ అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు గల వారు. కమ్మ్యూనిస్టుల దారుణాలు ,మావో క్రూరత్వం యంగ్ చాంగ్ కళ్ళకు కట్టినట్ట్లు రాసింది. అందుకే నిషెదించారు . కాని బయట లక్ష లలో అమ్ముడు పోయింది.
కోమల తెలుగు సేతకు చాలా సమీక్షలు వచ్చాయి . సభలో కోమల రచయిత్రిని పరిచయం చేసి ,పుస్తకాన్ని వివరించిన తీరు యంగ్ మెచ్చుకున్నది.
ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఆంధ్ర ప్రభలో చాలా సుదీర్ఘ సమీక్ష చేసారు .
యంగ్ , జాన్ కలసి మావో మీది రాసిన గ్రంధం కూదా బాగా ఆదరణకు గురి అయినది.



Jon Haliday, Jung Chang, (Innaiah interviewing at Hyderabad)

Thursday, December 18, 2008

అమెరికాలో తెలుగు పాటల కేసెట్


Ganti Udayabhaskar
released Telugu songs in USA






గంటి ఉదయ భాస్కర్ అమెరికాలొ విదుదల చేసిన పాటల కేసెట్ తెలుగు సభలు సమావేశాలలో ఆదరణ పొందినది.

భలే భలే ఇండియా ప్రయాణం

అదే అదే అప్పుల సరాగం

ఆ ట్రిప్ ప్రమాదం చుట్టాల వినొదం

మనసేమో విచారం లైఫ్ అంతా కల్లోలం

ఫస్ట్ ప్రయాణం అది పెద్ద ప్రయోగం

వెళ్ళినప్పుదు పెట్టె నిండా పెద్ద బరువుతో

వచ్చు నప్పుడు పెట్టె నిండా ఆవకాయలే

అప్పు చేసి పట్టుకెళ్ళు వి సి ఆర్ లు

వచ్చు నప్పుదు తీసుకొచ్చు తోలు చెప్పులు

నూనె జిడ్డుతో నడ్డి నొప్పితో

అప్పులేక తిరిగిరాడు ఒక్కరైననూ

నెల ముందు చెప్పిరంతా ఏమీ లేదని


రోజు ముందు నిండి పోవు పెట్టెలన్ని

నీవు ఇచ్చు బ్లేద్ పెన్ అచట దొరుకులే

పెద్ద వస్తువిచ్చు శక్తి నీకు లేదులే

బుద్ది మార్చుకో తెలివి తెచ్చుకో

డాబు కొరకు డాలర్లు వ్రుధా చేయకు

కారులెక్కి లేనిపోని పోజులివ్వకు

పుట్టినింటి అభిమానం మారిపోదులే

ఈ దేశపు వస్తువుతో మార్చవద్దులే


ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా

పొంగి పోరు ఒక్కరైనా ఆత్మ త్రుప్తితో

ప్రస్తుతం అమెరికాలో కంప్యుటర్ ఇంజనీర్ గా పని సాగిస్తున్నారు .


( ఈ పాటను ఏమే ఏమే భామా శైలిలో పాడాలని రచయిత కోరిక)

దేశానికి తెచ్చాదు వూరంతా చెప్పాదు

ఇంతివద్ద సాయంగా వుంచ్చారయ్యా

కారులోనే తిప్పారు కాళ్ళ పీకు తెచ్చారు


ఇంటిలోన తోడులేక

టి వి చూడమంటూ మమ్ము వదిలేరయ్యా

ఈ ఇల్లు కూడా అందమైన జైలేమోనయ్యా

మేమున్నామని పార్టీ ఇచ్చిరే

వంటలోని మిగులు అన్నీ

నెక్స్ట్ వీక్ లింక్ పెట్టి

బిజి బిజీ అంటూ వారు తిరిగారయ్యా

మాకు భొజనాలు ఇక వద్దనిపించ్చారయ్యా

అదేదో సంతాపం

పాపా బాబ్జి పుట్టిన రోజు

వద్దమ్మో ఏటేటా రాళ్ళబాత

కొన్నాళ్ళు డేకేర్ కొన్నేళ్ళు కాలేజ్

పేరెంట్స్ పార్టీలో కిద్స్ అంతా ఖైదీలు

మన కల్చర్ అన్నారు డాన్స్ ఏదో నేర్పారు

వాళ్ళంతా వచ్చేసి డిస్కోలే చేసారు

ఏదో లెక్చర్ ఇచ్చే మనోళ్ళు

వద్దమ్మో వాళ్ళిచ్చే బోర్ స్పీచ్
(ఇలా అనేక పాటలు రాసి స్వయంగా పాడుతున్నారు )
ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజులలో ఎన్నికలలో తిరిగి పాడారు .
Now computer soft ware engineer in USA

Wednesday, December 17, 2008

పురాణ ప్రలాపం






పురాణ ప్రలాపం ఒక వినూత్న రచన. హరి మోహన్ ఝా హిందీలో రాసారు .తెలుగులోకి జె. లక్ష్మి రెడ్డి తెచ్చారు .కాని ఎక్కడా అనువాదం అనిపించదు .
ఇటీవల ఇంత మంచి రచన గమనించలేదు .వేదాలు, పురాణాలు, ఆయుర్వెదం, సత్యనారాయణ వ్రతం, దుర్గ పూజ ,జ్యొతిష్యం మొదలైన విషయాలపై మూల గ్రంధాల నుండి వుదహరిస్తూ ,వ్యంగ్యం , హాస్యం మిళితం చేసి రాసారు .పవిత్ర రచనల్లో ఇలావుంటుందా అని అబ్బురపడతాము.
ఇది ఇ రచనగా అందిస్తున్నాము .
http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_29.html


Down load at the above site and if you make copy, it would idle gift to friends.

Tuesday, December 16, 2008

హ్యూమనిస్ట్ వే








ఆంధ్ర ప్రదెశ్ లో నవ్య మానవవాద ఉద్యమం కొన్నాళ్ళు బలంగా సాగింది.అప్పుడు అఖిల భారత మానవ వాద సభలో హ్యూమనిస్ట్ వే అనే వ్యాస సంకలనం నేను, జి బాబు ప్రచురించాము. హేమ ప్రచురణలు చీ రాలలో రావి పూడి వెంకటాద్రి వద్ద లభిస్తాయి .
ఆ పుస్తకాన్ని విడుదల చేసి ముగ్గురు మెధావులు ప్రసంగించారు .
ఫొటోలో ఎడమ నుంచి ప్రొఫెసర్ శిబ్ నారయణ్ రే గొప్ప గ్రంధ కర్త .రాజా రామ మోహన్ రాయ్ గ్రంధాలయ సంస్తకు కొన్నాళ్ళు నిర్వాహకులుగా వున్నారు .
తరువాత జస్టిస్ వి ఎం తార్కుందే పౌర హక్కుల కొరకు క్రిషి చేసిన వారు.
ఇందుమతి పరేక్ సాంఘిక సేవలొ అవార్డులు అందుకున్న మహిళా నాయకురాలు .
వారితో కలసి పనిచేసాను .అది గొప్ప అనుభవం.

Monday, December 15, 2008

జ్వాలాముఖి చనిపోయారు







జ్వాలాముఖి విప్లవ కవి. నేను నిజాం కాలేజీ లొ 1970 లొ ఫిలాసఫి చెబుతున్నప్పుడు జ్వాలాముఖి నా విద్యార్థి.తరువాత స్నేహితులం. నా పుస్తకం అబద్దాల వేట అతనే ఆవిష్కరించాడు. దిగంబర కవులతో సమావెశం జరిపి చర్చలు చెసాము. ఇద్దరం నేటి రాజకీయం పత్రికలో కలసి పని చేసాము .
నిన్న చనిపోయారు. ఉపన్యాసకుడు గా, టేచర్ గా పేరున్నది .తీ వ్ర కవితలు రాసారు .జ్వాలముఖి పెట్టుకున్న పేరు .

Sunday, December 14, 2008

మార్గాంతర వైద్యం Alternative medicine

ఇటీవల మార్గాంతర వైద్యం పై చ్క్కటి సైంతిఫిక్ గ్రంధం వెలువడినది.చదవమని కోరుతున్నాను.ఇంటర్నెట్ ద్వారా తెప్పించుకోవచ్చు.
ఇందులొ హొమియో, అక్యుపంక్చర్,పై శాస్త్రియ వివరణ వున్నది.
writers:
Simon Singh and Edzard Ernst
Title: Trick or treatment; undeniable facts about alternative medicine
published: 2008 w.w. norton and co London and New York

నూరేళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు








నూరేళ్ళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో విడుదల చేసినప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ లు పాల్గొని,నిశిత పరిశీలన ప్రసంగాలు చేసారు.
ఫొటోలో ఎడమనుంచి కె.శ్రినివాస్ రెడ్డి ,విశాలాంధ్ర ఎడిటర్;
కె.రామచంద్ర మూర్తి ,కొత్త టి.వి. చానల్ సి ఇ ఒ ;
పుస్తక రచయిత ;
దేవులపల్లి అమర్ ,ప్రెస్ అకాడమి అధ్యక్షులు ;
కి.శె. ఆర్ .జె. రాజేంద్ర ప్రసాద్ (హిందు );
బండారు శ్రీనివాస్ (ఆకాశవాణి )
ముఖ్య మంత్రిగా రాజశేఖరరెడ్డి పదవి చేపట్టినంతవరకు రచన వున్నది.

Saturday, December 13, 2008

తెలుగులో మానవ వాద సాహిత్యం


left to right sitting : Indumati Parekh, president Indian Radical Humanist association; Dr Sivaramamurthy, registrar of university; Justice Avula Sambasivarao, chief justice A P High court





తెలుగులో మానవ వాద సాహిత్యం 1940 నుండీ ప్రచురితమైనది. ఎం ఎన్ రాయ్ పై కొందరు సమగ్రంగా రాసారు. ప్రొఫెసర్ శిబ్ నరాయణ రే రాసిన రాయ్ జీవితాన్ని నేను తెలుగులో అనువదించగా పొట్టి శ్రీరాములు తెలుగు యూ నివర్సిటీ ప్రచురించింది .హై కోర్త్ ప్రధాన న్యాయ మూర్తి ఆవుల సాంబ
శివరావు ఆవిష్కరించగా , భారత హూమనిస్త్ సంఘ అధ్యక్షురాలు ఇందుమతి పరేక్ ప్రత్యెకంగా పాల్గొన్నారు .యూ నివర్సిటీ రిజిస్త్రార్ శివ రామ మూర్తి ప్రసంగించారు .

Friday, December 12, 2008

కంచి శంకరాచార్యను అరెస్ట్








తమిళనాదు ముఖ్య మంత్రి జయలలిత కొన్ని నేరాలకు గాను కంచి శంకరాచార్యను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది .చట్టానికి అతీతంగా ఆయన్ను చూడాలని భక్తులు ఆందొళన చేసినా ఆమె లొంగి రాలేదు.
. కంచి ఆచార్యుల దారుణాలు వివరంగా కె. వీ రమణి గ్రంధం రాశారు .ఇప్పటికీ కంచి ఆచార్యులు కోర్ట్ చుట్టూ తిరుగుతూనే వున్నారు. ఆయన ఒకప్పుదు ఆశ్రమం వదలి ఒకామెను తీసుకొని వెళ్ళగా ,పరువు పోతుందని పరమచార్య వెళ్ళి బ్రతిమిలాడి వెనక్కు తెచ్చిన విషయం భక్తులు మరచి పోయారు .
ఆశ్రమంలొ హత్యలు , నేరాలు , ధన దుర్వినియోగం విపరీతంగా జరిగింది. ఆశ్రమాలకు పన్ను మినహాయింపు దేనికి? రహశ్య కార్య కలాపాలు అవసరం ఏమిటి?
సత్య శాయి ఆశ్రమంలో హత్యలు జరిగితే ఎన్ టి రామారావు ముఖ్య మంత్రిగా అరెస్ట్ వారెంట్ ఇస్తే అమలు జరగకుండా ఆపినదెవరు?
పారదర్సికంగా ఆశ్రమాలు వుండకపోటానికి ఎవరు కారకులు?
Police enquiry reports in this regard are also suppressed by some key persons in power without the knowledge of NTR. Deccan Chronicle revealed some such police records where as Premanand gave full details.

premanand gave documentary evidence of murders in satya sai ashram

Wednesday, December 10, 2008

సత్య సాయి ని నమ్ముకొని పోతే

అమరెంద్ర మంచి కవి, అనువాదకుడు,ఇంగ్లిష్ లో ఉపాధ్యాయుడు గా గుంటూ ర్ హిందూ కళాశాలలోనూ ,హైదరాబాద్ లోని అమెరికా పరిషొధనా సంస్థలోనూ పనిచేసారు .

వి కె గోకక్ హైదెరాబాద్ లోని కెంద్ర ఇంగ్లిష్ ఫారెన్ భాషల సంస్థకు దైరెక్తర్ గా వుండేవారు.
అడపా రామక్రిష్నరావు ఉస్మానియ విశ్వ విద్యాలయం ఇంగ్లిష్ శాఖలో పనిచేసారు. రచయిత .

వీరంతా వివిధ దశలలో , పైకి చెప్పక పోయినా , ఏదో ఐ పోదామని , సత్య సాయి బాబా దగ్గర కుదురుకున్నారు .
కొన్నాళ్ళు వుండి తిరిగి వచి మౌనం గా వుండి పోయారు .

నేను అడిగితే ఏమీ జవాబు ఇవ్వలేదు.

వ్యతిరేకం గా చెప్పలేరు, అనుకూలంగా చెప్పడానికి ఏమీలేదు! అదీ సంగతి.

భవనం వెంకట్రాం విద్యా మంత్రిగా, ముఖ్య మంత్రిగా వుండగా సత్య సాయిని దర్సించుకోమని చాలా వత్తిళ్లు వచ్చాయి .ఆయనకు నమ్మకం లేదు. కనుక నిరాకరించాడు.అదే సమయంలొ మాధురి షా యునివర్సిటి గ్రాంట్స్ కమిషన్ చైర్ మన్ గా అనంతపురం వెళ్ళినప్పుడు, విద్యామంత్రి గా భవనం కూడా వెళ్ళారు. నేను వున్నాను. శ్రి క్రిష్న దేవరాయ యూనివర్సిటి ని అశ్రద్ద చేసి ఆమె పుట్టపర్తి డీం డ్ యూనివర్సిటి కి వెళ్ళింది. అప్పుదూ భవనం నిరాకరించి అనంతపురం లోనే వున్నాడు. ( She gave deemed university status as chairman of UGC and she was devotee of Sai Baba)

ఎం ఆర్ పాయ్ ఐ ఎ స్ అధికారి గా వున్నప్పుడు ఆయనకు నమ్మకాలు లేవు. కాని ఆయన భార్య అనసూయ కు కాన్సర్ రాగా చివరి దశలో ఆమె సాయి దగ్గరకు వెడితే నయం అవుతుందని చెప్పగా , పాయ్ ఏమీ అనలేక వారుకున్నాడు. సాయి దగ్గర ఏమీ జరగ లేదు . ఆమె చనిపో యింది. నమ్మకాల ప్రమాదం అలాంటిది.

న్ మిత్రుడు శివనాగెస్వరరావు ఒకప్పుడు శాయి పాఠశాలలో చదివాడు.ప్రతి ఏటా ఊటొకి తీసుక వెళ్ళేవారని అక్కడ లైంగిక దురాచారాలు జరిగేవని చెప్పాడు. అయితే తల్లి తండ్రులకు ఎందుకు చెప్పరు అంటే , వారు పరమ భక్టులు గనుక నమ్మరని, పైగా తమనే కోపపడేవారని అన్నారు.
.

Tuesday, December 9, 2008

మానవ వాద సంఘం


Innaiah( speaking),Ravipudi Venkatadri(only slightly visible), Sakhamuri Raghavarao





మానవ వాద సంఘానికి ఆంధ్రలో 1950 నుండీ చరిత్ర వున్నది. నేను 1980 -1990 మధ్య రాస్త్ర శాఖ అధ్యక్షుడుగా , తరువాత భారత శాఖ కార్య దర్శిగా పనిచేసాను.
నా మిత్రుదు , శాఖ మూరి రాఘవరావు నాతొ పాటు పని చేశారు. ఆయన ప్రస్తుతం గుంటూరులో లలిత ఆసుపత్రి మేనేజర్ గా వుంటున్నారు .మెము ఇరువురం ఎ. సి .కాలేజిలో , ఆంధ్ర యూని వర్సిటిలో కలసి ఫిలాసఫి చదివాము .
రాను రాను మానవ వాద సంఘం పెరగడం లేదు. యువకులు రావడం లేదు.
ఫాత వారే వున్నారు. రావిపూడి వెంకటాద్రి , అంచా బాపారావు పని చేస్తున్నారు.
చాలా సభలు జరిపాము .ఇక్కద అలాంటి ఒక సభ ఫొటో ప్రచురిస్తున్నాను.
Founder: M N Roy
active participants in the past:
Gopichand, Abburi Ramakrishnarao
Palagummi Padmaraju
Tata Devakinandan,
Koganti Radhakrishna Murthy
Malladi Ramamurthy, Subbamma
V.S.Avadhani
G.V.Krishnarao

Sunday, December 7, 2008

నూరేళ్ళ అంధ్ర ప్రదేష్ రాజకీయాలు


సినారె, గాలి ముద్దు క్రిష్న మ నాయుదు (నాదు మంత్రి), కి.శె. నల్లపురెడ్డి స్రీనివాసులు రెడ్డి ( మంత్రి)left)Innaiah ,హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లొ ప్రసంగించారు .







ఆంధ్ర ప్రదెష్ రాజకీయాల గురించి 1968 నుండీ రాస్తున్నాను. తొలి పుస్తకం విజయవాడలొ నవజ్యొతి వారు ప్రచురించారు. ఆంధ్ర ప్రదెష్ రాజకీయ పరిణామ చరిత్ర 100 పుటల రచన.
1900 నుండి నూరేళ్ళ అంధ్ర ప్రదేష్ రాజకీయాలు పేరిట తొలుత ఇంగ్లిష్ లొ రాసాను. మిత్రులు వెనిగళ్ళ వెంకటరత్నం టైప్ చేసి 100 కాపీలు జెరాక్ష్ తీసారు. బుక్ లింక్స్ కె.బి. సత్యనారాయణ అమ్మారు .మొదటగా లై బ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు 20 కాపీస్ కొన్నారు .తరువాత అచ్చు మొదలు పెట్టాము .


ఆ తరువాత ఎప్ప్పటికప్పుదు రాస్తూ వున్నాను. ఎన్ టి రామారావు ముఖ్య మంత్రి అయినప్పుదు ఖద్దర్ నుండి కాషాయానికి అని తెలుగులోనూ , శాఫ్రాన్ స్తార్ ఓవర్ ఆంధ్ర ప్రదెష్ అని ఇంగ్లిష్ లోనూ రాసాను.
పార్తీలు ఎన్ని మారిస్తే నేం పైన ఖద్దరే గదా అని మరొకటి రాసాను.
ఇలా కొత్త విషయాలు చేర్చి నప్పుదు శీర్షిక మారుతూ పోయింది .
1986 లొ ఒక సభలో రాజకీయాల పుస్తకాలు విడుదల చేసిన సభలొ సినారె, గాలి ముద్దు క్రిష్న మ నాయుదు (నాదు మంత్రి), కి.శె. నల్లపురెడ్డి స్రీనివాసులు రెడ్డి ( మంత్రి) ,హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లొ ప్రసంగించారు .
ఇటీవల రాష్త్ర రాజకీయాలు రాయడం లేదు.

Saturday, December 6, 2008

చేకూరి రామారావు, వడ్లమూడి శ్రీ క్రిష్ణ


chekuri ramarao, vadlamudi srikrishna, Innaiah, Mrs srikrishna jamuna in USA




.
శ్రి క్రిష్ణ 1960 లోనే అమెరికా వచ్చి ప్రభుత్వ వుద్యోగంలో వున్నారు. తొలుత చికాగోలో వుండేవారు. ఆరోజులలో అమెరికా వచ్చిన తెలుగు వారికి ఆయన ఆదరించ్చే వారు. తరువాత వాషింగ్తొన్ లొ స్తిర పడ్డారు .1963 లో ఆవుల గోపాల క్రిష్ణ మూర్తి వచ్చినప్పుదు ఆయన అతిధి గా వున్నారు .ప్రతి తానా సభకు , ఇతర తెలుగు సభలకు క్రిష్ణ తప్పక వెళ్ళేవారు. 2000 తరువాత హైద్స్రాబాద్ లొ వుంటూ చనిపోయారు .మోపర్రు గ్రామము వారిది. తెనాలి సమీపంలో వున్నది. ఆ గ్రామానికి సహయ పదుతుండేవారు.
చేకూరి రామారావ్ నేను ఉస్మానియా విశ్వ విద్యాలయం లొ పని చేసినప్పటి నుండి -1965- స్నేహితులం .ఆయన లింగ్విస్తిక్స్ లొ నేను ఫి లాసఫి శాఖలొ వున్నాము.
చెకూరి రామారావ్ నేను వుద్యమాలలో కలసి పని చేయలేదు. కేవలం మిత్రులు గానే ఇప్పటికీ కొనసాగుతున్నాము.
ఒకసారి ఉదయం దినపత్రికలొ త్రిపురనేని రామస్వామి విషయం లో భేదాప్రిప్రాయాలు రాసుకున్నాము .రామస్వామి లొ హేతు వాద ధోరణులు సమర్ధిస్తూ , తొలి దశలో వెల్లడి అయిన కులతత్వాన్ని చూపాను . రామారావు రామ స్వామిని సమర్ధిస్తూ రాసారు.
రామారవు అనేక సాహిత్య సభలలో పాల్గొనే వారు. అమెరికాలొ తానా సభలో ఒకసారి అవధానం గోస్తి లో అధ్యక్షత వహించ్చారు. అప్పుదు మాదుగుల ఫణి శర్మ జ్ఞాపక శక్తికి అంటూ సరస్వతి లేహ్యం తమలపాకులో పెట్టి $ 116 కు అమ్మారు. రామారవు అభ్యంతర పెట్టారు. సభలొ అలాంతి పనులు చేయరాదన్నారు .పైగా అమెరికాలో లై సెన్సె లేకుండా మందులు అమ్మడం నేరం అన్నారు. రామారావు ధొరణి నాకు నచ్చింది. మాదుగుల శర్మ అధికార భాషా సంఘ అధ్యక్షుదుగా వచ్చి దుర్వినియోగం చేయడం తప్పు.
శ్రి క్రిష్న ఇంట్లొ రామారావు నేను మేరీ లాండ్ లొ కలసి ఫోటొ తీయించు కున్నాము.

Tuesday, December 2, 2008

ఆంధ్ర ప్రదెష్ రాజకీయాలు అంకితం


left K P S Raju,middle Ravipudi Venkatadri releasing Andhra Pradesh politics by N.Innaiah in Inkole, near parchur,ongole tq, AP





రావిపూడి వెంకటాద్రి , నేను 50 సంవత్సరాలుగా మానవవాద ఉద్యమం లో కలసి పని చేస్తున్నాము. ప్రస్తుతం ఆయన వయస్సు 85 దాటింది.అయినా రచనలు సాగిస్తున్నారు. పర్యటనలు ,ప్రసంగాలు తగ్గిపోయాయి .తన పాత రచనలన్నీ సంపుటాలుగా వెలికి తెస్తున్నారు .ఫాసిజం రచనకు నాచే త పీఠిక రాయించారు .
నేను రాసిన ఆంధ్ర ప్రదెష్ రాజకీయాలు ఇంగ్లిష్ గ్రంధాన్ని వెంకటాద్రి ఇంకొల్లు లో విడుదల చేసినప్పుదు ,కె పి ఎస్ రాజు ( తణుకు )గారు అంకితం అందుకున్నారు .రాజు గారు 1940 ప్రాంతాలలో ఎం ఎన్ రాయ్ ని తణుకులో ఊరేగింపు జరిపి సభ పెట్టారు.

Meeting Dr Gauri, Mr Ed Doerr in USA


left Ed Doerr , humanist working for center for Inquiry in USA
right Dr Gauri , humanist, worked for renaissance institute, India


గౌరి ఇండియాలొ ప్రముఖ మానవ వాది. ఎం ఎన్ రాయ్ తత్వాన్ని పాటించింది. రినైసాన్స్ సంస్థ కు అధ్యక్షురాలిగా చాలా కాలం పని చేసారు. మెడిచల్ డాక్తర్. ఆమె భర్త మాలిక్ కూడా మానవ వాది. ఆమె తండ్రి ప్రే మ నా త్ కాస్మిరి పండిత్ . గీత పై విమర్స రాసారు .
ఎడ్ డోర్ అమెరికా మానవ వాద సంఘ ప్రెసిడెంట్ గా సెక్యుల రిజం కొరకు క్రిషి చేసారు . నేడు శాస్త్రీయ పరిసీలనా కెంద్రం పై పని చెస్తున్నారు.
ఇరువురి తో చిరకాలం గా నాకు సన్నిహిత పరిచయం వున్నది. అమెరికాలో అతనికి గౌరి ని పరిచయం చేసిన సందర్భం గా ఫొటొ తీసుకున్నాము. గౌరి నే డు అమెరికాలోనే వుంటున్నారు.

Monday, December 1, 2008

సంజయ్ గాంధి బాధితుడు ఆవుల


(right side) Avula Vijayarao in syracuse




అవుల విజయా రావు నేడు సిరక్యూస్ , న్యూయార్క్ లో వుంటున్నారు. ఇండియన్ అడ్మినిస్త్రేటివ్ సర్వీస్ ఇండియాలొ చదివి కేంద్ర సర్వీస్ లొ పని చేసారు. బంగ్లా దెష్ సరిహద్దులలొ కార్ల బోర్డ్లు మార్చి దొంగ రవాణా చేస్తున్నవారిని ఆపాడు. ఫలి తంగా బీహార్ కు బదిలీ అయ్యారు. అక్కడ రాజకీయ నాయకుల ఆటలు సాగనివ్వక , విద్యుత్ బిల్లులు ఇగగొట్టటాన్ని ఆపారు. ప్రతిఫలంగా డిల్లి కి మార్చారు .
అప్పుడు ఇందిరా గాంధి కుమారుడు సంజయ్ గాంధి అనధికార పెత్తనం విచలవిడిగా సాగుతున్నది .ఒక సారి విమాన ప్రయాణం చే యించడానికి విజయరావు నిరాకరించారు. ఇంకేముంది ? బాగా బాధలు పెట్టసాగారు . విశాఖ వుక్కు కర్మాగారంలొ పనులు చేసారు.
బాధలు తప్పించుకొడానికి ప్రపంచ బాంక్ లో వాషింగ్ టన్ లొ పని చేసారు . చివరకు ఐ ఎ స్ కు రాజీ నామా ఇచారు . అది ఒక పట్టాన ఒప్పుకోలెదు. పి.వి. నరసిం హా రావ్ ప్రధాని గా వుందగా తేళ్ళ లక్ష్మి కాంతమ్మ సహాయంతొ బయట పడి , అమెరికాలొ వుద్యోగాలు చేసుకుంటూ వున్నారు.
అసలు తెనాలి ప్రాంతం వాసి అయితే చిత్తూ రు ప్రవాసము వెళ్ళారు. మద్రాసు లొ తండ్రి అద్వ కే ట్ గా కుమార మంగళం వద్ద పని చేస్తుండగా , అతని సలహా పై ఐ ఎ స్ చదివి , ముక్కు సూటిగా వున్నందుకు ఇన్ని బాధలు పద్దారు .
నాకు మంచి మిత్రులు . కొండపి జానకి తో సహా అనేక ఐ ఎ స్ అధికారులకు సహాయ పద్దారు .
ఇటివల గుండె పోటు రాగా కోలు కుంతున్నారు. కులాతీతంగా గుజరాతి ని పెళ్ళి చేసుకున్నారు .

Saturday, November 29, 2008

శాస్త్రీయ పరిశీలనాకేంద్రం


founder of the center for inquiry ( now 82 years)











అంతర్జాతీయ శాస్త్రీయ పరిశీలనాకేంద్రం

1992లో మొదటసారిగా బఫెలో నగరం శివార్లలో ఉన్న అంరెస్ట్ ప్రాంతానికి వెళ్లాను. అక్కడ అమెరికా హూమనిస్టు కేంద్రంలో ఒకపూట గడిపి ప్రెడ్ ఎడ్వర్డ్స్ తో చర్చలు చేశాను. ఆయన కేంద్రం చేస్తున్న పనులు వివరించి వారి ప్రచురణలు కొన్ని బహూకరించారు. అక్కడకి సమీపంలోనే శాస్త్రీయ పరిశీలనాకేంద్రం ఉన్నది.

పాల్ కజ్ అమెరికాలో సుప్రసిద్ధ మానవవాధి, సెక్యులరిస్టు. అమెరికా హూమనిస్టు సంఘ అధ్యక్షులుగా, అంతర్జాతీయ హూమనిస్టు సంఘ ఉపాద్యక్షులుగా, బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక శాస్త్రీయ రచనలు చేశారు. ఖగోళ శాస్త్ర సంఘం వారు ఆయన సేవలను గుర్తించి, ఒక Asteroidకు ఆయన పేరు పెట్టారు. ప్రమీతియస్ ప్రచురణలు పెట్టి అనేక హేతుబద్ధమైన శాస్త్రీయమైన రచనలు ప్రచురిస్తున్నారు. అమెరికాలో రెడియో, టెలివిజన్ కార్యక్రమాలద్వారా, సెక్యులర్, మానవవాద ఉద్యమాన్ని బహుళవ్యాప్తి చెందించారు. ఆయన ఆహ్వానంపై కొత్తగా నెలకొల్పిన శాస్త్రీయ పరిశీలనాకేంద్రానికి వెళ్ళాను. చాలా విషయాలు చర్చించాము. చేపట్టదలచిన కార్యక్రమాలు ఆలోచించాము. అనేక మంది నిష్నాతులైన మేధావులను నాకు పరిచయం చేశారు. 1992 నుండి ఇప్పటివరకు ప్రతిసంవత్సరం ఆ సెంటర్ కు వెళ్ళి వస్తున్నాను. దీనివలన సంతరించుకున్న అనుభవం నాకు అనేక కొత్తమార్గాలను రీతులను, చూపింది. పాల్ కజ్ నా పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలతో ఉన్నారు.

ఆయన ప్రోత్సాహంతో భారతదేశంలో శాస్త్రీయ పరిశీలనాకేంద్రం స్థాపించి, కొన్నేళ్ళుగా పనిచేసున్నాను. అంతర్జాతీయ కేంద్రంలో పనిచేస్తున్న నా సన్నిహిత మిత్రులు : టిం. మాడిగన్ (ప్రస్తుతం – రాచస్టర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు; కోప్సెల్ (ప్రస్తుతం వేరే యూనివర్శిటీలో పనిచేస్తున్నారు).

టామ్ ఫ్లిన్ – ఎడిటర్, ఫ్రీ ఇన్ క్వయిరీ. ఇతను న్యూ ఎన్ సైక్లోపీడియా అన్ బిలీఫ్ కు ఎడిటర్. ఆ గ్రంధంలో భారతదేశాన్ని పిలిచి నా చేత ఆరు వ్యాసాలు రాయించారు.

డి.జె. గ్రోతే : (ప్రస్తుతం సెయింట్ లూయీస్ లో పనిచేస్తున్నారు.

జో నికిల్ : ఇతను మజీషియన్. హేతుబద్దంగా శాస్త్రీయంగా వివరించి మోసాలు చేసే బాబాలను, క్రైస్తవ ప్రచారకులను, బట్టబయలు చేస్తుంటారు.

మాట్ షేరీ : ప్రస్తుతం న్యూయార్క్ లో మానవ వాద సంఘ వెబ్ సైట్ నడుపుతున్నారు.

నా పుస్తకాలు ఎమ్.ఎన్. రాయ్ పిలాసఫీ, చిన్న పిల్లల పట్ల మతాల దుర్వినియోగం గురించి ప్రమితియస్ వారు ప్రచురించేటట్లు పాల్ కజ్ తోడ్పడ్డారు. ఆ విధంగా ఈ కేంద్రం శాస్త్రీయ పరిశీలనకు అన్నివిధాలా సహకరిస్తున్నది.

please visit to see details including Indian chapters:
http://www.centerforinquiry.net/

Thursday, November 27, 2008

ఎవరీ ఇబన్ వారక్? Why I am not Muslim fame


photo with Ibn Warrak in 2000 New York




అసలు పేరు అది కాదు. కానీ భద్రత దృష్టా అలా పెట్టుకుని పనిచేస్తున్నారు. ఆయన భారతదేశం నుండి యూరోప్ మీదుగా అమెరికాలో స్ధిరపడి, ఇస్లామ్ పై నిశిత పరిశీలన గ్రంథాలు వెలువరిస్తున్నారు. అందులో అందరిని ఆకట్టుకున్న గ్రంథం – (why I am not a Muslim). ఇది ఆయన అనుమతితో తెలుగులోకి అనువదించగా, హెతువాద సంఘం వారు ప్రచురించారు.

1994లో ఇబ్న వారక్ వాషింగ్ టన్ లో జార్జి యూనివర్శిటీలో ప్రసంగించారు. అప్పుడు స్వయంగా ఆయన్ను కలిశాను. చాలా చర్చించాము. ఆయన ఉపన్యాసం ఆకట్టుకునే విధంగా ఉండదు. కానీ విషయం చాలా కనిపిస్తుంది. రచన కూడా ఆకర్షణీయంగా ఉండదు. కానీ ఎంతో పరిశోధనా పాండిత్యం కనిపిస్తుంది. ఆయనకు మా కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేశాను. అందరం కలసి భోజనాలు చేశాం. తన కుటుంబ విషయాలు, కష్టనష్టాలు చెప్పుకున్నారు. అమెరికాలో ఆయన ఉనికి రహస్యంగా ఉంచుకున్నారు. నేను చేసిన అనువాదం మొట్టమొదటిది కావటం వల్ల ఆయన ఎంతో మందికి ఆ విషయాన్ని గర్వంగా ప్రచారం చేశారు. ఆ తరువాత ఫ్రెంచ్ అనువాదం వచ్చింది. ఆ గ్రంథంపై మేను మిసిమి పత్రికలో రాసిన సమీక్షను ఇంగ్లీషులో ఢిల్లీలో ప్రచురించారు. ఉత్తరోత్తరా అది అమెరికా పత్రికలలో కూడా ప్రచురితమైంది.

ఇబ్న వారక్ ను అమెరికా వెళ్ళినప్పుడల్లా ఎక్కడో చోట కలుసుకుంటు చర్చించుకుంటున్నాం. ఆయనకు ఇండియా రావాలని ఉన్నది. కానీ వీలుపడలేదు.
లొగద సెంటర్ ఫర్ ఎన్ క్వైరి కి కొరాన్ , ఇస్లాం పై అనే క పరిసోధనా గ్రంధాలు రాసారు. ప్రస్తుతం యూరోప్ లో వున్నారని తెలిసింది .వివరాలు తెలియవు.
please visit this site to read full Telugu text of Why I am not a muslim:


http://www.centerforinquiry.net/india/local_resources/why_i_am_not_a_muslim/

St Louis -visit


Walter Hoops second from right.





వాల్టర్ హూప్స్

1992లో సెయింట్ లూయీస్ వెళ్ళినప్పుడు 10 రోజుల పాటు మిత్రులు డా. రామారావు గారి దగ్గర ఉండి, స్థానిక రేషన్ లిస్ట్, స్కెప్కిట్ సంస్థల కార్యకలాపాలలో పాల్గొన్నారు. నేను వచ్చిన సందర్భంగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భారతదేశ హేతువాద ఉద్యమాలను గురించి చెప్పమని కోరారు. విషయాలు తెలుసుకుంటూ చాలా ఆసక్తిగా, ప్రశ్నలు వేశారు. అందులో వాల్టర్ హూప్స్ పాల్గొన్నారు. ఆయన ఉద్యమాలలో కురు వృద్ధుడు. అప్పటి ఆయన వయసు 88 మాత్రమే. సమావేశానంతరం ఆయన్ను ఇంటికి దగ్గర దింపి, సెలవు తీసుకుంటూ మళ్ళీ కలుద్దామని అభివాదం చేశారు. తప్పనిసరిగా అంటూ, వచ్చే సంవత్సరం రండీ అని ఆహ్వానించారు. ఆ తరువాత హైదరాబాద్ లో అఖిల భారత మానవ వాద సమావేశం జరిపినప్పుడు ఆయన్ను సందేశం అడిగాం. చక్కగా రాసి పంపారు. సభలో అది చదివి, నేను ఆనందించాను. ఉద్యమంలో ఆయన ఎంతో గణనీయమైన పాత్ర వహించారు. వయస్సుతో నిమిత్తం లేకుండా కృషి చేశారు. అయితే నేను మళ్ళి అమెరికా వెళ్ళే సరికి ఆయన మరణ వార్త వినవలసి వచ్చింది.
He migrated from Germany during early 30s and worked with local German society

Monday, November 24, 2008

సైంటిస్ట్ రిచర్డ్ డాకిన్స్ ను కలుసుకోవటం


With Richard Dawkins ( in the middle) at New Enlightenment conference, Buffalo, USA 2005 oct






presenting telugu translation of God Delusion to Richard Dawkins
)first from left Dawkins) in Washington DC 2007 sep 29



ప్రపంచ ప్రసిద్ధ పరిణామ వాద సైంటిస్ట్ రిచర్డ్ డాకిన్స్ ను కలుసుకోవటం గొప్ప అనుభవం. 2005లో బఫెలో నగరంలో శాస్త్రియ పరిశీలనాకేంద్రంవారు 5 రోజుల మహాసభలు జరిపారు. అప్పుడే రిచర్డ్ డాకిన్స్ ను కలసి మాట్లాడాను. ఫోటో తీయించుకున్నాను. భారతదేశానికి రావలసిందిగా ఆహ్వానించాను. ఆయన ప్రసంగాలు అక్కడ ఆనందించాను. పరిణామాన్ని గురించి వివరించటం. సృష్టివాదాన్ని ఖండించటం చాలా శాస్త్రీయంగా చెప్పారు. అదే సమావేశాలలో తాను కొత్త పుస్తకం రాయబోతున్నటు ప్రకటించారు. నేను అప్పటికే ఆయన రచనలు కొన్ని పరిణామ సిద్ధాంతానికి సంబంధించినవి చదివాను. డాకిన్స్ చాలా ఆకర్షణీయంగా శక్తివంతంగా రాస్తాడు.

2006లో ఆయన వెల్లడించిన కొత్త రచన మార్కెట్ లోకి వచ్చింది. అది గాడ్ డెల్యూజన్. యూరోప్ లోనూ అమెరికాలోనూ అది అత్యుత్తమ సర్కులేషన్ లోకి వెళ్ళింది. మేము ఆ గ్రంథం చదివి వెంటనే తెలుగులోకి అనువదించాను. ఈ లోగా రిచర్డ్ డాకిన్స్ కు ఉత్తరం రాసి నా అనువాదాన్ని అనుమతిస్తూ ప్రచురించటానికి వీలు కలిపించమని కోరాను. ఆయన ఉదారంగా సమాధానం ఇస్తూ, తనకు అంగీకారమేనని తన లిటరరీ ఏజెంట్ మాక్స్ బ్రాక్ మన్ ను న్యూయార్క్ లో అడగమని చెప్పారు. వారితో ఉత్తర ప్రత్యత్తరాలు జరిపి తెలుగు, తమిళం, హిందీ అనువాదాలకు అనుమతి తీసుకున్నాను. శాస్త్రీయ పరిశీలనా కేంద్ర పక్షాన వాటిని ప్రచురించ దలచాము. నేను చేసిన తెలుగు అనువాదాన్ని విజయవాడలోని అలక్ నందా ప్రచురణల వారు వెలువరించారు. ఆ ప్రతిని 2007 సెప్టెంబరు 28న వాషింగ్ టన్ లో జరిగిన అమెరికన్ ఎథి యిస్ట్ అలయన్స్ మహాసభలలో వెదికపై సమర్పించారు. నాతో పాటు నా మనుమడు రోహిత్ కూడా ఉన్నాడు. సభలో ఉండి నా కుమార్తె డా. నవీన ఫోటోలు తీసింది. ఇదంతా మార్గరెట్ డౌని (నాస్తిక సంఘ అధ్యక్షురాలు) ఏర్పాటు చేసింది. హిందీ అనువాదం ఎప్పుడు వస్తుంది అని డాకిన్స్ ఆత్రుతగా అడిగారు.

భారతదేశం రావాలని, హైదరాబాద్ లో సైంటిస్టుల సభలో మాట్లాడమని, రానుపోనూ విమాన ఖర్చులు భరించే సంఘాలున్నాయని డాకిన్స్ ను కోరాను. కానీ ఆయన ప్రయాణం చేయలేనని, రీసెర్చ్ పై దృష్టి సారించదల చానని చెప్పారు. నిరుత్సాహ పడ్డాను. అయితే డాకిన్స్ వెబ్ సైట్ నిరంతరం పరిశీలిస్తున్నాను. అందులో నేను రాసిన వ్యాసాన్ని కూడా పెట్టారు. ఫ్రీ ఇన్ క్వయిరీ పత్రికలో పిల్లల పట్ల మతాలు చేస్తున్న ద్రోహాన్ని గురించి, వారిని కాపాడాల్సిన అవసరాన్ని గురించి రాశాను. అది డాకిన్స్ వెబ్ సైట్లో ఉంచటం నాకు గర్వకారణం. 2008లో ఆయన పుస్తకం మళయాళ భాషలో అనువదించటానికి అనుమతి కోరాను. అందుకు కూడా ఆయన అంగీకరించారు. సుప్రసిద్ధ హేతువాది సనాల్ ఎడమరుకు దీనిని అనువదిస్తామన్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూ హేతువాద ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఆ విధంగా గాడ్ డెల్యూజన్ భారతీయ భాషలలోకి తీసుకురాగలిగాము.
WITHOUT FAIL PLEASE SEE THE WEBSITE: http://richarddawkins.net
You will enjoy.

Tuesday, November 18, 2008

7 నెలల ముఖ్య మంత్రి భవనం తో


Bhavanam Venkatram 1932-2002






Bhavanam at our residence in Hyderabad




భవనం వెంకట్రం మా కుటుంబ మిత్రుదు. 1978 లో విద్యా మంత్రి గా వున్నప్పుడు పరిచయం మొదలై చివరివరకు సాగింది.ముఖ్య మంత్రిగా 7 నెలలు మాత్రమే 1982 లొ కొనసాగాడు. తరచు మా ఇంటికి రావదం ఆప్యాయం గా మాటలు చెప్పదం ,సంత్రుప్తిగా భోజనం చేయదం ఆయన అలవాటు. కళా ప్రియుడు. సో ష లిస్త్ భావాలతొ రాజకీయాలలొ ప్రవెసించారు .ఆయన రెడ్డి . కమ్మ ను పెళ్ళి చేసుకున్నారు . తన పేరులో రెద్ది తొలగించుకున్నాడు. చక్కని ప్రసంగాలు చేసే వారు. కాంగ్రెస్ రాజకేయాలలో ఇమడ లేక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. కళలు సాహిత్యం ఇష్తం.
కొన్ని పర్యాయాలు కలసి ప్రయాణం చే సినప్పుదు అనేక అనుభవాలు నాతో పంచుకునేవారు .
మా ఇంటెల్ల పాదీ ఆయన అంటే అభిమానించేవారు పడేవారు.
ఆయన రాజకీయాలతో నిమిత్తం లేకుందా స్నేహం సాగించాను .
భవనం ముక్యమంత్రిగా వుందగా సుప్రసిద్ద హింది గాయకురాలు లత మంగెష్కర్ ఆయన ఇంటికి వచ్చింది .ఆమెను ఆహ్వనించదానికి నేను ఒక్కడినే వున్నాను. కనీసం ఫొటో తీసుకోదానికి కెమేరా లేదు! కూర్చొబెట్టి కబుర్లు చెబుతునంటే భవనం వచ్చారు . తన తంద్రి పేరిట స్తలం అడిగింది. నేటి ముఖ్య మంత్రులతే పోల్చితే ఇప్పుదు ఆశ్చర్యం వేస్తుంది .

సుప్రసిద్ద నాట్య దంపతులు రాధ-రాజారెడ్డి లను నాకు పరిచయం చేసారు.ఇప్పటికీ వారి డాన్స్ గొప్పగా వుంటుంది .
మా అమ్మాయి కొత్తగా సీత అనసూయ ల వద్ద జానపద గేయాలు నేర్చు కోగా అవి పాడమని , విని ఆనందించేవాడు .
రాజకీయాలథో నిమిత్తం లేకుండా స్నెహితులుగానే మేము వున్నాము.
విద్యామంత్రిగా వుండగా ఆయనతో కలసి వేములవాడ వెళ్ళాను. అక్కడ రాజ రాజెశ్వరి గుడి వద్ద చెన్నమనేని రాజెస్వరరావు స్వాగతం పలికితే నేను ఆశ్చర్య పోయాను .అప్పటికి ఆయన అసెంబ్లీలో కమూనిస్త్ నాయకుడు. గుడికి ఆయన ట్రస్తీ .తరువాత తెలుగు దేశం పార్తీలో చేరాడు.
మరో సారి ముఖ్య మంత్రిగా భవనం సైంటిస్త్ ల సభను ప్రారంభిచవలసి వున్నది. చాలా ఆందోళన పడ్డారు . నన్ను అడిగితే ఉపన్యాసం రాసి పెట్టాను .సాస్త్రియ పధతి గురించి నాకు సుపరిచిత విషయం గనుక రాసాను. అది బాగా చదివి చూడకుందా చెబితే సభానంతరం సైంటిస్తులు ఆయన్ను బాగా మెచుకొని రాజకీయ పదవులలో వున్న వ్యక్తి ఇలా సైన్స్ గురించి చెప్పగలగదం విశేషం అన్నారు. నాపరువు కాపాడావి అని భవనం అన్నారు.

Sunday, November 16, 2008

నెల నెలా సమావెశాలు


1970`s picture








హైదరాబాద్ లో మిత్రులు వెనిగళ్ళ వెంకతరత్నం, నేను కలసి నెలకు ఒక సమావెశం అని ఒక పధకం అమలు జరిపాము. ప్రతి నెలా ఒకరిని పిలిచి ప్రసంగం ఇప్పించాము.వీతి రికార్ద్ వెంకతరత్నం అట్టిపెట్టారు. త్వరలో వివరంగా రాస్తామన్నారు
శ్రి రమణ ,సి. భాస్కరావు ఇంకా ఎందరో వాటికి వచ్చెవారు .దొరికిన చోట చిన్న హాల్ ,లేక గది తీసుకొని కలిసే వారము. ఇష్తాగోస్టిగా చర్చలు సాగేవి .కొన్నెళ్ళు జరిపి ఆపెశాము .అవి మధుర స్మ్రుతులు .
అలాంటి ఒక సమావెశంలో ఆంధ్ర జ్యోతి సంపాదకులు నార్ల వెంకటెశ్వరరావు వచ్చి ప్రసంగించారు . సమావెశం మొదలు కాక ముందు తీసిన ఫోటొ లభించింది .ఇందులో నార్ల ఎదురుగా కూర్చున్న దండమూడి మహీధర్ ( ఆకాశవాణి హైదరాబాద్ లొ హింది విభాగం లో పనిచేశారు ),ఇన్న య్య ను చూడవచ్చు .

Saturday, November 15, 2008

88వ పడిలో సాజ్ Untamed Tongue


Dr Thomas Szasz with Dr Naveena




Dr Szasz discussing with Dr Naveena , Washington DC









అమెరికాలో నేను కలుసుకున్న విశిష్ట వ్యక్తులలో థామస్ సాజ్ పేర్కొనదగినవారు. ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. ఆయనకు చక్కని వెబ్ సైటు ఉన్నది. న్యూయార్క్ స్టేట్ లో సిరక్యూస్ లో ఉన్నారు. అక్కడకు వెళ్లి కలిసి మాట్లాడాను. నాతోబాటు ప్రవీణ్ (ప్రస్తుతం డూలర్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్ మెంట్ లో ఉపాధ్యాయుడు.) ఉన్నారు.

థామస్ సా జ్ వాషింగ్ట్ న్ లో కొన్ని పర్యాయాలు కలిశారు. నా కుమార్తె డా. నవీనను పరిచయం చేశాను. వారిరువురూ తమ సబ్జక్ట్ సైకియాట్రి గురించి చర్చించుకున్నారు. అమెరికా యూనివర్సిటీ (వాషింగ్టన్) లో ఆయన ప్రసంగం విన్నాను. 2005లో న్యూ ఎన్ లైటెన్ మెంట్ సభలు శాస్త్రీయ పరిశీలనా కేంద్రం బఫెలో నగరంలో నిర్వహించింది. అప్పుడు సాజ్ తో కలసి ఉన్నాను.

థామస్ సాజ్ సంచలనాత్మకమైన పరిశోధనా రచయిత. సైక్రియాట్రి నిపుణులు. ఆ రంగంలో జరుగుతున్న దారుణాలు, అశాస్త్రీయ విధానాలు ఎండగట్టాడు. ఆయన రాసిన ది మిత్ ఆఫ్ మెంటల్ ఇల్ నెస్ ఆ రంగంలో పునాదుల్ని పెకలించి వేసింది. సైకో ఎనాలిసిస్ పేరిట ఫ్రాయిడ్ లోకాన్ని వంచించిన తీరును గుట్టు రట్టు చేశాడు. ఆయన రచనలు ఇంచుమించు చాలా వరకు చదివాను. వాటి ఆధారంగా తెలుగులో వ్యాసాలు రాశాను. అనువాదాలకు కూడా నాకు అనుమతిచ్చాడు. కాని ప్రచురణకర్తలు ఒకపట్టాన పడనివ్వకపోవడంతో ఆయన నిస్సహాయంగా ఊరుకున్నాడు. రచనలు చాలా పదునుగా, ఘాటుగా, సూటిగా ఉంటాయి. సంక్షిప్త పదజాలంతో అన్ టేమ్డ్ టంగ్ అనే శీర్షికన రాసిన సూక్తూలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఉదాహరణకు దేవుడితో మనం మాట్లాడాము అంటే దాన్ని ప్రార్థన అంటారు. కాని దేవుడే నాతో మాట్లాడాడు అని ఎవరైనా అంటే పిచ్చివాడు అంటారు. 80వ పడిలో సాజ్ ఎంతో పట్టుదలతో కృషి సాధిస్తున్నారు.
some of his books:
1973 The Second Sin. Doubleday.
1973 (editor). The Age of Madness: A History of Involuntary Mental Hospitalization Presented in Selected Texts. Doubleday Anchor.
1974 (1961). The Myth of Mental Illness: Foundations of a Theory of Personal Conduct. Harper & Row.
1976 Heresies. Doubleday Anchor.
1984 The Therapeutic State: Psychiatry in the Mirror of Current Events. Buffalo NY: Prometheus Books.
1985 (1976). Ceremonial Chemistry: The Ritual Persecution of Drugs, Addicts, and Pushers. Holmes Beach FL: Learning Publications.
1987 (1963). Law, Liberty, and Psychiatry: An Inquiry into the Social Uses of Mental Health Practices. SUP.
1988 (1965). Psychiatric Justice. SUP.
1988 (1965). The Ethics of Psychoanalysis: The Theory and Method of Autonomous Psychotherapy. SUP.
1988 (1957). Pain and Pleasure: A Study of Bodily Feelings. SUP.
1988 (1976). Schizophrenia: The Sacred Symbol of Psychiatry. SUP.
1988 (1977). The Theology of Medicine: The Political-Philosophical Foundations of Medical Ethics. SUP.
1988 (1978). The Myth of Psychotherapy: Mental Healing as Religion, Rhetoric, and Repression. SUP.
1990 (1980). Sex by Prescription. SUP.
1990 The Untamed Tongue: A Dissenting Dictionary. Lasalle IL: Open Court.
1990 Anti-Freud: Karl Kraus and His Criticism of Psychoanalysis and Psychiatry. SUP. First printed in 1976 as Karl Kraus and the Soul-Doctors: A Pioneer Critic and His Criticism of Psychiatry and Psychoanalysis. Louisiana State University Press.
1991 (1970. Ideol

Recent letter from Thomas Szasz

I received prompt reply to my email on 18 october 2008 and I am proud about it.

Dear Dr. Innaiah,

Thank you for your e-mail. I am OK. I don't expect to be in DC in the foreseeable future, but should I plan to come I would be glad to let you know. It would be a pleasure to see you and your daughter again.
My two most recent books are THE MEDICALIZATION OF EVERYDAY LIFE and PSYCHIATRY: THE SCIENCE OF LIES. Take a look at them at Amazon.
Warm regards to you and your daughter.

Thursday, November 13, 2008

సన్యాసి సత్యం పలికితే!


speaking at Ambedkar open university






అగేహానంద భారతి

1988లో ఎమ్.ఎన్.రాయ్ శతజయంతి ఉత్సవాలను ఇండియాలో జరిపాం. నా ఆహ్వానంపై అగేహానంద భారతి హైదరాబాద్ వచ్చి, పాల్గొని ఉపన్యాసాలు ఇచ్చారు. అందులో ఒకటి ఉస్మానియా యూనివర్శిటీలోనూ, మరొకటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలోనూ ఇచ్చారు. అది వీడియో రికార్టు కూడా చేశాము. హైదరాబాద్ లో ఉండగా ఆయనతో చాలా ఉల్లాసంఘా చర్చలు జరిపాము. ఆయన పరిణమించిన తీరు, ఆసక్తి దాయకమైనది. ఆ విషయాలను Ochre Robe అనే పుస్తకంలో రాశారు. దానిని నేను తెలుగులోకి అనువదించాను. ఆయన గ్రంథాలలో ప్రమాణమైనది ఇంగ్లీషులో Great Tradition & Little Traditions in India అనే పుస్తకాన్ని చౌకంబా ప్రచురణ కర్తలు వెలువరించారు. అదికూడా నేను అనువదించగా, తెలుగు అకాడమీ వారు ప్రచురించారు. అమెరికా వచ్చినప్పుడు కలుసుకుందామని అనుకున్నాం. 1992లో వెళ్ళి కలసుకుందామని ఊవ్విళ్ళూరాను. అయితే అంతకు ముందే ఆయన సిరక్యూస్ యూనివర్శిటీలో పనిచేస్తూ చనిపోయారు. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆ యూనివర్శిటీకి వెళ్ళాను. న్యూయార్క్ స్టేట్ లో అదొక ప్రాచీనమైన చరిత్రగల యూనివర్శిటీ. అగేహానంద భారతి అక్కడ సాంస్కతిక ఆంత్రోపాలజీ శాఖలో పనిచేశారు. ఆయన రచనలన్నీ వారు భద్రపరచి రికార్టు చేశారు. అక్కడకు వెళ్ళి అది గమనించాను. ఆయనతో గడిపినవారు తమ మధుర స్మృతులను చెప్పారు. అగేహానంద ఒక విచిత్రమైన వ్యక్తి. సన్యాసిగా మారి జర్మనీనుండి భారతదేశం వెళ్ళి ఉత్తరోత్తర భౌద్దం భోదించి అమెరికా చేరుకుని నిశిత పరిశీలకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఆయనతో చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.
see full text of Ochre Robe at:http://www.centerforinquiry.net/uploads/attachments/Final%20Sanyasi%20Satyempalikete.doc
సన్యాసి సత్యం పలికితే!















సన్యాసి సత్యం పలికితే!
ochre robe

ఇంగ్లీషు మూలం :

స్వామి అగేహానంద భారతి



















తెలుగు సేత :

నరిశెట్టి ఇన్నయ్య

జర్మనీ నుండి ఇండియా వచ్చి సన్యాసిగా వివిధ జీవితానుభవాలు పొందిన విశిష్ట బ్రహ్మచారి లెపాల్క్ ఫిషర్. పేరు మార్చి వూరుమార్చి ప్రపంచమే తన యిల్లుగా చివరకు అమెరికాలో అస్తమించాడు. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం వుంది. కేవలం ఉత్తర ప్రత్తుత్తరాలతో పరిమితం గాక, పిలిపించి ప్రసంగాలు చేయించాను. అవన్నీ రికార్డు చేసి భద్రపరిచాము. అగేహానంద భారతిని కలసిన వారు ఆయన్ను మరువలేరు.

ఆయన రచన దిగ్రేట్ ట్రెడిషన్ లిటిల్ ట్రెడిషన్స్ నేను తెలుగులో అనువదించగా తెలుగు అకాడమీ ప్రచురించింది. ఇండియాను దికైజాన్స్ ప్రచురణలు వారు ఆయన మోనో గ్రాఫ్లలను వెలువరించారు.

ఎం.ఎన్. రాయ్ తో ఒక్కసారి డెహ్రడూన్ లో కలసిన భారతి పూర్తిగా మారి పోయినట్లు పేర్కొన్నాడు. మానవ వాదిగా రూపొంది కల్చరల్ యాంత్రొపాలజూ బోధిస్తూ సిరక్యుస్ యూనివర్శిటీలో స్థిరపడ్డాడు.

1987లో భారతిని హైదరాబాద్ కు పిలిపించి, ఉస్మానియా ఓపెన్ యూనివర్శిటీలో ఎం.ఎన్. రాయ్ శతజయంతి సంస్మరణ ఉపన్యాసాలు యిప్పించాను.

ప్రస్తుతం తెనిగించిన ఆకర్ రోబ్ అనే రచన 1967లో వెలువడినప్పుడు భారత ప్రభుత్వం నిషేధించింది. రామకృష్ణ, వివేకానందల గురించి నిజం చెప్పినందుకు, ఆ ఆశ్రమ వత్తిడి కారణంగా అలా చేశారని తెలిసింది. కుష్వంత్ సింగ్ వంటి వారు నిషేదానికి నిరసన తెలిపారు. అయితే భారతి అమెరికా నుండి మరో అధ్యాయం చేర్చి, ఆ కర్ రోబ్ వెలువరించారు. దాని అనువాదమే యిది.

నిశిత పరిశీలకులకు యిది నచ్చుతుంది. వెర్రి ఆవేశంలో గుడ్డి ఆరాధన చేసేవారికి యిది కనువిప్పు చేస్తుంది. అందుకే దీని అవసరం వుందని, అందిస్తున్నాం.

(1991లో భారతి చనిపోయారు)

- ఎన్. ఇన్నయ్య

Monday, November 10, 2008

శామ్ హారిస్-


presenting to Sam Harris on 29 sep 2007 in Atheist Alliance conference at Washington DC Next to Sam (right) Rohit and Innaiah





translated into Telugu by me






Best Selller in New York Times





second from left Sam Harris






ఇతను యువకుడు. అమెరికాలో రాసి ప్రచురించిన తొలిపుస్తకానికే బహుళ ప్రచారం లభించి కీర్తి మంతుడయ్యాడు. ఆ పుస్తకం "The End of faith" ఇది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ అయింది. అద్భుతంగా రాశాడు. ఆయన్ని కలుసుకోవాలి అనుకుంటుండగా శాస్త్రీయ పరిశీలనా కేంద్రం అమెరికాలో నయాగరా వద్ద సెంటర్ లో జరిపిన మహాసభలకు వచ్చాడు. అది 2005 సంవత్సరం. సభలో ఆయన ప్రసంగం మామూలుగా ఉంది. రచనలో ఉన్న పదును, ప్రసంగంలో లేదు. కానీ విషయం ఉన్నది. సభ అనంతరం ఆయన్ను కలసి మాట్లాడాను. ఆయన పుస్తకంపై ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. శామ్ నాతో చెబుతూ తాను ఇండియాలో ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాలు పర్యటించానని తన రీసెర్చి కోసం విషయ సేకరణ చేశానని చెప్పాడు.

తరువాత మరొక పుస్తకం లెటర్ టూ క్రిస్టియన్ నేషన్ అని రాసి ప్రచురించాడు. అది కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. దానిని తెలుగులో అనువదించి ప్రచురించటానికి అనుమతి కొరాను. ఆయన అడ్రస్ రహస్యంగా ఉంచుకున్నందున, నా మిత్రుడు ఫ్రీ ఇంక్వయిరీ మాగజైన్ ఎడిటర్ టామ్ ఫ్లిన్ ద్వారా ఉత్తరం పంపించాను. శామ్ దయతో అనుమతిచ్చాడు. అది తెలుగులో ప్రచురించాం. ఆ పుస్తకాన్ని Atheist Alliance Conferenceలో అమెరికాలోని వర్జీనియాలో పెంట్ గాన్ వద్ద జరిగిన సభలో ఇచ్చాను. 2007 సెప్టెంబరు 28న రాత్రి 9 గంటలకు సభా వేదికపై ఇది జరిగింది. ఆయన చాలా సంతోషించాడు. ఆయన వెబ్ సైట్ నడుపుతున్నారు. ఆయన్, హర్షి, అలీ అనే రచయిత్రి ఇస్లామ్ ఉద్యమ కారిణి నిషేదాలకు గురికాగా, శామ్ ఆమెను కాపాడుకుంటూ వస్తున్నారు
see his website: http://www.samharris.org

Saturday, November 8, 2008

అమెరికాలో ఆత్మ దర్శన కేంద్రాలు Modern Mafia


seance view






things can be viewed in darkness-snooper scope










make belief with Chiffon











అమెరికాలొ
అంధ విశ్వాసాలకు బలి అవుతున్న తీరు
ఆత్మ వున్నదని నమ్మేవారిని ఎలా మోసగించాలో హైటెక్ పద్దతులు చూపి వ్యాపారం సాగించాలో అమెరికాను చూసి గ్రహించవలసిందే

అమెరికాలో ఆత్మ దర్శన కేంద్రాలు న్యూజెర్సి, ఫ్లారిడా మొదలైన చో ట్ల ఉన్నాయి.పైకి మత కేంద్రాలు గా చూపుతారు. కనుక వీరికి పన్నులు లేవు.లెక్కలు చూపనక్కరలేడు. ఇండియాతో సహా ఆత్మ తో కలసి మాట్లాడి జ్ఞాపికలు కూడా అందుకొని దబ్బు సమర్పించుకొని వెడుతున్నారు .
ఆత్మ కెంద్రాలలొ సందర్సకులకు వసతి సమకూర్చుతారు. చేరగానె ఒక తే ది ఇచ్చి కొన్నాళ్ళు ప్రార్థనలు చేయిస్తారు .ఈలోగా రక రకాలుగా వారి సమాచారం రాబడతారు .క్రెడిట్ కార్డులు ,ఫోన్ నంబర్లు , ద్వారా , విషయాలు చూస్తారు .ఎవరి ఆత్మను కలుసుకో దలచారో వారి విషయం సే కరిస్తారు .
సందర్సన రోజున రాత్రి చీకటి గదిలొ కూర్చోబెడతారు .గుడిలో పీఠం వలె అమర్చి( Seance) దానిపై ఆత్మను చూపే వ్యక్తి ఆసీనుడౌతాదు . ఇన్ ఫ్రా రెడ్ లైట్ తో అతను చీకట్లో చూడగలుగుతాడు. స్చూకర్ స్కోప్ వలన ఇది వీలౌ తుంది .తెల్లని షిఫాన్ బట్ట పొరలు విప్పుతూ చుట్టుకుంటాడు. చూసే అతనికి అదే ఆత్మ రూపం . అప్పుదు బూర పుచ్చుకొని ఆత్మ మాత్లాడుతున్నట్లు చెబుతాడు. ఒక బూరలా మరొక బూర పెట్టి మాటలు చెబితే అదె ఆత్మ శబ్దం గా అనిపిస్టుంది.
ఆత్మ చేత జ్ఞాపికలు ఇప్పించడము, కరచాలనం పరాకాష్ట .( Ectoplasm)
అరుదుగా ముద్దు పెట్టదం , సంభొగం చేయడం కద్దు .
ఇది కలయా మాయా అని వినేవారికి అనిపించవచ్చు .
ఇలాంటి కేంద్రం 13 యేళ్ళు నడపిన లమార్ కీన్ చివరకు స్వయంగా బయటపది నిజాలు బయట పెట్టాడు. మిగిలిన కేంద్రాలవారు చంపుతామన్నారు . భయపడి మారుపేరుతో అంతా బట్టబయలు చేసాడు .
షిఫ్ఫాన్ వస్త్రం విప్పుతూ పోతుంటె ఆత్మ అద్రుశ్యం అవుతున్నట్లు భ్రమ కలుగు తుంది. గుడ్డి నమ్మకాలపై వ్యాపారానికి యెన్ని వేషాలొ గమని ంచండి
పొలీస్ వచ్చి ఆత్మ సందర్సకుల వలె వుండి అరెస్త్ చేసిన కేసులు వున్నాయి.

who revealed the secrets-M Lamaar Keene


M. Lamar Keene (as told to Allen Spraggett), The Psychic Mafia, Prometheus Books



must read to know the happenings

Thursday, November 6, 2008

కార్ల్ సేగన్- MeetingGreat scientist


meeting Carl Sagan in Washington DC 1994




సుప్రసిద్ధ ఖగోళశాస్త్రజ్ఞులు కార్ల్ సేగన్ గొప్ప మానవ వాది. రచయిత, సైన్స్ ప్రచారం చేయటంలో అందేవేసిన చేయి. ఆయన కాస్మాస్ రచన, వీడియో ప్రపంచ వ్యాప్తంగా నాగరికతను గురించి ప్రాచీన చరిత్ర పరిణామాన్ని గురించి అద్భుతంగా జనాలకు అంధించాడు. భారతదేశానికి ఒకసారి వచ్చి ఖగోళశాస్త్ర సమావేశంలో ఢిల్లీలో పాల్గొన్నారు. అది 1979 ప్రాంతం. అప్పట్లో నేను ఆయన్ను కలుసుకోలేకపోయాను. ఆయన రచనలు చాలా వరకు చదివి. కాస్మాస్ చూశాను. అమెరికా వెళ్ళగానే 1992లో ఆయనకు ఉత్తరాలు వ్రాశాను. వెంటనే జవాబు ఇచ్చారు. చాలా సంతోషించాను. అప్పట్లో సేగన్ అమెరికా మానవ వాద సంఘ అధ్యక్షులుగానూ ఉన్నారు. ఆయన్ను ఉత్తమ మానవ వాదిగా అమెరికా హూమనిస్టు సంఘం సత్కరించింది. కార్నేల్ యూనివర్శిటీలో ఉండేవారు. ఆయన్ను కలుసుకోవాలని, మాట్లాడాలని ఆశించాను.

అంగారక గ్రహంపై కొన్ని శకలాలు దాటిచేయబోతున్నాయని, అలాంటిదే భూమిపై దాడిజరిగితే పూర్తిగా నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. కార్ల్ సేగన్ కొందరు ఖగోళశాస్త్రజ్ఞులతో కలసి ఆ విషయమై పరిశోధించి భూమిపైకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అంగారక గ్రహాన్ని ఏలా దాడిచేయ బోతున్నాయో కూడా పరిశీలించారు.




తదనంతరం వారు చెప్పినట్లే జరిగింది. ఆ విషయాలని వివరించటానికి వాషింగ్ టన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానికి నేను, నా కుమార్తె డా. నవీన, బాల్టిమోర్ నుండి ప్రసిద్ధ హూమనిస్టు కేన్నత్ మార్సలక్ కలసి వెళ్ళాము. అప్పుడే కార్ల్ సేగన్ ను కలసి అభివాదం చేసి, పరిచయం చేసుకోని మాట్లాడాను. ఆయన సాధరంగా పలికి చక్కగా చెప్పారు. మేము ఇరువురం మాట్లాడుతుండగా నవీన ఫోటోలు కూడా తీసింది.

తరువాత మరొక సందర్భంలో వాషింగ్ టన్ లో ఏయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో కార్ల్ సేగన్ విశ్వంలో మానవుడి స్థానం గురించి ఉపన్యసించారు. దానికి నేను, కేన్నత్ మార్సలక్ వెళ్ళాము. అది గొప్ప వివరణతో కూడిన ఉపన్యాసం. ఎంతో ఆనందించాము. ఆ విధంగా సభానంతరం కార్ల్ సేగన్ ను మరోసారి కలిశాము. ఇండియాకు రమ్మని ఆహ్వానించాను. వీలున్నప్పుడు వస్తామన్నారు. లోగడ తాను వచ్చినప్పుడు దేశంలో హ్యూనిస్టులు తనకు పరిచయం లేదని అందువల్లన ఎవరినీ కలవలేదని అన్నారు. ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రం కొనసాగించాను. 1996లో కార్లే సేగన్ క్యాన్సర్ తో సియాటల్ హాస్పటల్లో చనిపోయారు. అప్పటికి ఆయన వయస్సు 62 సంవత్సరాలే. అది అటు ఖగోళశాస్త్రజ్ఞులకు, ఇటు మానవ వాదులకు, ప్రపంచ ప్రజానీకానికి తీరని లోటు. సైన్స్ పత్రికలు ఆయనకు గొప్ప నివాళి అర్పించాయి
The Demon Haunted World is a must read
see his website: http://www.carlsagan.com/

Planets (LIFE Science Library), Sagan, Carl, Jonathon Norton Leonard and editors of Life, Time, Inc., 1966
Intelligent Life in the Universe, I.S. Shklovskii coauthor, Random House, 1966, 509 pgs
UFO's: A Scientific Debate, Thornton Page coauthor, Cornell University Press, 1972, 310 pgs
Communication with Extraterrestrial Intelligence. MIT Press, 1973, 428 pgs
Mars and the Mind of Man, Sagan, Carl, et al., Harper & Row, 1973, 143 pgs
Cosmic Connection: An Extraterrestrial Perspective, Jerome Agel coauthor, Anchor Press, 1973, ISBN 0-521-78303-8, 301 pgs
Other Worlds. Bantam Books, 1975
Murmurs of Earth: The Voyager Interstellar Record, Sagan, Carl, et al., Random House, ISBN 0-394-41047-5, 1978
The Dragons of Eden: Speculations on the Evolution of Human Intelligence. Ballantine Books, 1978, ISBN 0-345-34629-7, 288 pgs
Broca's Brain: Reflections on the Romance of Science. Ballantine Books, 1979, ISBN 0-345-33689-5, 416 pgs
Cosmos. Random house, 1980. Random House New Edition, May 7, 2002, ISBN 0-375-50832-5, 384 pgs
The Nuclear Winter: The World After Nuclear War, Sagan, Carl et al., Sidgwick & Jackson, 1985
Comet, Ann Druyan coauthor, Ballantine Books, 1985, ISBN 0-345-41222-2, 496 pgs
Contact. Simon and Schuster, 1985; Reissued August 1997 by Doubleday Books, ISBN 1-56865-424-3, 352 pgs
The Varieties of Scientific Experience: A Personal View of the Search for God, Ann Druyan editor, 1985 Gifford lectures, Penguin Press, 2006, ISBN 1-59420-107-2, 304 pgs
A Path Where No Man Thought: Nuclear Winter and the End of the Arms Race, Richard Turco coauthor, Random House, 1990, ISBN 0-394-58307-8, 499 pgs
Shadows of Forgotten Ancestors: A Search for Who We Are, Ann Druyan Coauthor, Ballantine Books, October 1993, ISBN 0-345-38472-5, 528 pgs
Pale Blue Dot: A Vision of the Human Future in Space. Random House, November 1994, ISBN 0-679-43841-6, 429 pgs
The Demon-Haunted World: Science as a Candle in the Dark. Ballantine Books, March 1996, ISBN 0-345-40946-9, 480 pgs
Billions and Billions: Thoughts on Life and Death at the Brink of the Millennium, Ann Druyan coauthor, Ballantine Books, June 1997, ISBN 0-345-37918-7, 320 pgs
The Varieties of Scientific Experience: A Personal View of the Search for God, Carl Sagan (writer) & Ann Druyan (editor), Penguin Press HC, November 2006, ISBN 1594201072, 304 pgs

Monday, November 3, 2008

మూఢ నమ్మకాలలో నూ అమెరికా అగ్ర రాజ్యమే


mary shedding tears like Vinayak drinks milk !








broken mirror brings bad luck




black cat on 13 and friday








13 number avoided












చదువుకున్న వారిలొ అంధ విశ్వాసాలు అమెరికాలొ ఎన్ని వున్నాయో లెక్క లేదు.సినిమా తారలలో క్రీడాకారులలో వివిధ చాందసాలు ప్రదర్సితం గావడం తో జనం పై వాటి ప్రభావం కనబడుతున్నది.
కొన్ని క్రైస్తవ శాఖలు ప్రార్ధన తో జబ్బులు నయం అవుతాయని పిల్లలను ఆస్పత్రులలో చేర్చరు . పిల్లలు చనిపో యినా అది మత పరమైన అంశం గనుక కోర్తులు సైతం యే మీ చేయదం లేదు.
మత ప్రచార కూటమిలలో పూనకం రావడం విపరీతం గా చూ డవచ్చు .
మేరి మాత విగ్రహం కన్నీరు పెట్టిందన్నా రక్తపు బొత్లు కార్చిందన్నా జనం ఎగబడి డాలర్లు వెదజల్లుతున్నారు .
13 నంబర్ అప శకునం గనుక భవనాలకు హోటళ్ళకు ఆ నంబర్ వుంచరు .
శుక్రవారం నల్లపిల్లి ఎదురు అయితే చాలా అరిస్తం అనుకుంటారు .
పగిలిన అద్దంలొ చూస్తే విపత్తు వస్తుందంతారు .
ఆటలలో గెలుపు వోటములు వారు ధరించే తాయెత్తులు పై వుంటుందని నమ్ముతారు .
చీమల్ని తొక్కితే వాన వస్తుందని భావిస్తారు .
చేతబది బానామతి జరుగుతుందని మత పరంగా చికిచ్చలు చేస్తాలు .
నిచ్చెన కింద నడిస్తె అపశకునం అంటారు.
మంచులో భెతాళుదు నడిచాడని, అడుగుల గుర్తులు చూసి నమ్మారు .
విదెశాల నుండి రేకి ,సైకిక్ సర్జరి వంటివి అరువు తెచ్చుకున్నారు .
ఇలాంటి మూధ నమ్మకాలు అశాస్తీయమని హేతువాదులు ,మానవ వాదులు ఎప్పటికప్పుడు చూపుతూ వ్యాసాలు పుస్తకాలు అందిస్తూనే వున్నారు.
జేంస్ రాండి , జో నికిల్ నిరంతరం శ్రమిస్తూనే వున్నారు.
క్రైస్తవ మతం మూడ నమ్మకాల పుట్టగా అమెరికాలో వున్నది .

అమెరికాలొ మూడ నమ్మకాలు ఎలా వున్నాయో చూపడానికి మానవ వాదులు వాషింగ్టన్ లో యేర్పాటు చేసిన ప్రదర్శన సభలో, అక్తొబర్ 13 న నేను పాల్గొన్నాను ఫ్రెడ్ యెడ్వర్ద్ అందులో దెయ్యం పాత్ర ధరించి ఆకర్షణీయం గా నటించారు.

THE LIST IS ENDLESS
See Skeptic dictionary,Encyclopedia of Paranormal,
James Randi website: www.randi.org

Sunday, November 2, 2008

ఎగిరే పళ్ళాలు భ్రమ American myth exposed


ఫిలిప్ జే. క్లాజ్













ఎగిరే పళ్ళాలు కొన్నేళ్ళ పాటు అమెరికాని, పాశ్యాత్య లోకాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తాయి. 1947లో టెక్సాస్ ప్రాంతంలో ఈ వదంతి మొదలై క్రమేణా బలపడింది. దీనిపై కథలు, పుస్తకాలు వచ్చాయి. సినిమాలు తీశారు. టీ.వీ.లు కథనాలు ప్రసారాలు చేశాయి. ఇందులో నిజా నిజాలు శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నాన్ని ఫిలిప్ జే. క్లాజ్ చేపట్టారు. ఆయన పరిశోధించి నిజంగా ఆకాశంలో ఎగిరే పళ్ళాలు లేవని చాటిచెప్పారు. ఇది టెక్సాస్ లో మొదలైన తీరును ఆద్యంతం వివరించారు. దురదృష్టవశాత్తు అమెరికా సైన్యం కూడా కొన్నాళ్ళు అనుకూల ప్రచారం చేయటం వల్ల నిజమేమోనని జనం భ్రమపడ్డారు.

క్లాజ్ వాషింగ్ టన్ లో ఉండేవాడు. 1992లో నేను ఆయన్ను కలుసుకొని ఇంటర్వ్యూ చేశాను. నా వెంట హేమంత్ (నా అల్లుడు) వచ్చి ఫోటోలు తీసి రికార్టు చేశారు. ఆయన ఒక అపార్టుమెంటులో ఉంటూ కుక్కను పెంచు కుంటున్నాడు. చాలా విషయాలు ఓపికగా వివరంగా ఎగిరే పళ్ళాల గురించి విడమర్చి చెప్పారు. ఇంచు మించు ఆయన చెబుతుండటం, నేను వినటమే కాని ఆట్టే అడగటానికి ఆస్కారం లేకపోయింది. ఆయన శాస్త్రీయ ఆధారాలతో చేసిన పరిశీలన నా ముందు పెట్టారు. భారతదేశంలో ఈ విషయం అంతగా ప్రచారంలో లేదు. ఇది సాధారణ జనానికి అంటుకోలేదు. ఆ విషయమే ఆయనతో చెప్పి ఇంటర్వ్యూ సారాంశాన్ని భారతదేశంలో ప్రచురిస్తానని చేప్పాను. ఆయన రచనలు, పరిశోధనలు, ప్రమాణాలుగా ఇప్పటికి చాలామంది ఉదహరిస్తారు. శాస్త్రీయ పరిశీలనా కేంద్రంవారు ఆయన రచనలను ప్రచురించారు. ఖగోళశాస్త్రవిజయాల కమిటీలోనూ ఆయన ఉండేవారు. వాషింగ్టన్ లో తరచు ఆయను కలిసే అవకాశం నాకు లభించింది( died 2005)

UFOs — Identified, 1968,
Secret Sentries in Space, 1971, (about spy satellites)
UFOs Explained, 1974,
UFOs: The Public Deceived, 1983, Prometheus Books,
UFO Abductions: A Dangerous Game, 1989, Prometheus Books,
The Real Roswell Crashed-saucer Coverup, 1997, Prometheus Books,
Bringing UFOs Down to Earth, 1997, Prometheus Books, (for ages 9-12)

Saturday, November 1, 2008

స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీకి


Left Robert C North with Innaiah N






ఎమ్.ఎన్. రాయ్ చైనాలో నిర్వహించిన పాత్రను పరిశోదించి ఒక పెద్ద గ్రంథాన్ని( M N Roy`s Mission to China 1963) ప్రమాణయుతంగా వెలువరించారు రాబర్డ్ సి. నార్త్. నేను ఇండియాలో ఆ పుస్తకం చదివాను. ఆయన్ను ఎప్పుడైనా కలుసుకోవలనుకున్నాను. 1989 ప్రాంతాల్లో బొంబాయిలో జరిగిన మానవ వాద మహాసభకు వచ్చి ఆయన పాల్గొన్నారు. కానీ నేను అప్పుడు వెళ్ళలేకపోయాను. తరువాత అమెరికా వెళ్ళినప్పుడు ఆయనను కలుసుకోవాలనుకున్నాను. ఆ విషయం తెలిసి జి.ఆర్. బాబు (ప్రపంచ మానవ వాద నైతిక సంఘంలో పనిచేస్తున్నారు) చెబుతూ, ఆయన ఇంకెక్కడున్నాడు చనిపోయాడు అన్నారు. చాలా విచారించాను. అయితే ఆయన పనిచేసిన స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ పోలిటికల్ సైన్స్ శాఖకు ఉత్తరం రాశాను. ఆయనకు సంబంధించిన పరిశోధనా పత్రాలు చూడాలని ఉందని రాశాను. దానికి ఆశ్చర్యకరంగా రాబర్ట్ సి. నార్త్ నుండే నాకు ఉత్తరం వచ్చింది. అదేమిటయ్యా చనిపోయాడన్నావు, ఆయనే బత్రికే ఉన్నాడని జి.ఆర్. బాబుతో చెబితే ఆయన సారీ..., నాకు వచ్చిన సమాచారం పొరపాటు అయినది అన్నాడు. రాబర్ట్ సి. నార్త్ తనను కలుసుకోవలసిందిగా ఒక తేదీ ఇచ్చారు. శాన్ ఫ్రాన్సిస్ శివార్లలో ఉన్న స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీకి వెళ్ళాను. అప్పటికి సి. నార్త్ కు 81 ఏళ్ళు. గడ్డం పెంచి ఉన్నారు. ఆయనే స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. పైగా అది గేర్స్ తో ఉన్న కారు. చాలా పురాతనమై నది. ప్రక్కనే ఆయన భార్య ఉన్నది. పోలిటికల్ సైన్స్ ప్యాకల్టీలో నాకు చక్కని లంచ్ ఇచ్చారు. చాలా సేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాతో పాటు వచ్చిన మేనల్లుడు రాజశేఖర్ మమ్మల్ని ఫోటోలు తీశాడు. సి. నార్త్ తన అనుభవాలు చెబుతూ 1950 ప్రాంతాల్లో ప్రకారం
హైదరాబాద్ లొ వున్నట్లు
వెల్లడిస్తే ఆశ్చర్యపోయాను. తన భార్య అప్పుడు గర్భిణిగా ఉన్నదని, నైజాంకు చెందిన ఒక నర్శింగ్ హోమ్ లో చేర్పించామని చెప్పాడు. హైదరాబాద్ గురించి అడిగి తెలుసుకున్నాడు.

ఎమ్.ఎన్. రాయ్ ని గురించి ఆయన అనుభవాలు అడిగాను. ఢిల్లీ నుండి ఒక మిత్రుడి సహాయంతో డెహరాడూన్ లో ఉన్న ఎమ్.ఎన్. రాయ్ ను కలుసుకుని ఇంటర్వ్యూ చేశామని చెప్పారు. ఆయన భార్య ఎలెన్ కూడా అనేక విషయాలు ఆసక్తికరంగా చెప్పిందన్నాడు.

ఎమ్.ఎన్. రాయ్ మొదటి భార్య ఎవిలిన్ ట్రెంట్ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన గ్రాడ్యుయేట్. ఆమె చివరి రోజుల్లో తన ఉనికిని ఇతరులకు తెలియకుండా ఉండదలచింది. ఉత్తర ప్రత్యుత్తరాలు రాబర్ట్ సి. నార్త్ ద్వారా జరిపింది. ఆ విధంగా ఆయన సన్నిహితంగా వారి విషయాలు తెలిసినవారు. అవికూడా చాలా ఆసక్తికరంగా చెప్పాడు. కమ్యూనిస్టులు కొందరు ఆమెను ఇంటర్వ్యూ చేయాలంటే సి. నార్త్ ద్వారానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. అవన్ని ఆయన ఓపికగా నాతో చెప్పారు. ఒక పూట అంతా ఆయనతో గడపటం, గొప్ప ఆనందకరమైన అనుభవం. 2002 july 15 లో ఆయన చనిపోయారు

గార్డన్ స్టయిన్ Paranormal Encyclopedia editor












1978 లో గార్టన్ స్టయిన్ అమెరికా నుండి నాకు లేఖ రాస్తూ, ENCYCLOPEDIA of Paranormal అనే సంకలన గ్రంధాన్నికి భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాసం రాయమన్నారు. నా పేరును నా సన్నిహిత వృద్యమ మిత్రులు ప్రొఫెసర్ ఎ.బి. షా ఆయనకు చెప్పారు. అమెరికా భాషా ప్రమాణాలు దృష్టిలో పెట్టుకుని వ్యాసం రాయమని కోరారు. ఆ ప్రకారమే రాశాను. అది ప్రచురించారు.

ఆ తరువాత 1992లో అమెరికా వెళ్ళినప్పుడు గార్డన్ స్టయిన్ ను శాస్త్రీయ పరిశీలనా కేంద్రంలో కలిశాను. చాలా చర్చలు జరిపాము. తరువాత మేరిలాండ్ లోని కోలంబియాలో ఒక సేమినార్ లో మళ్ళీ కలసి సంభాషించుకోగలిగాము. ఫోటో కూడా తీయించుకున్నాము.

తరువాత రాచెస్టర్ లో ఇంగర్ సాల్ మ్యూజియమ్ ప్రారంభోత్సవ సందర్భంగా నేను, మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర పాల్గొని, గార్డన్ స్టయిన్ ని కలిశాము. అప్పట్లో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఇంగర్ సాల్ కు సంబంధించిన వ్యాసాలు, రచనలు, పాత పుస్తకాలు, అనువాదాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. భారతదేశంలో ఇంగర్ సాల్ ప్రభావం గురించి నేను ఆ సభలో చెప్పాను. సేయింట్ లూయిస్ నుండి వెలువడే అమెరికన్ రేషన్ లిస్ట్ పత్రికను కొన్నాళ్ళు గార్టన్ స్టయిన్ ఎడిట్ చేశారు.

కానీ తన పదకాలు పూర్తి కాకముందే గార్డన్ స్టయిన్ కాన్సర్ తో చనిపోయారు. మంచి మేధావిని, ఉద్యమకారుణి ఆ విధంగా కోల్పోయినట్లు భావించారు.