Friday, March 27, 2009

వీరే మన జోతిష్కులు – ఇక చదవండి

మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసి, జ్యోతిష్యం చెబుతారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నది. ప్రభుత్వంలో ఎవరున్నా వారికి అనుకూలంగా చెప్పటం ఆనవాయితీ.
1989లో ఎన్.టి. రామారావు మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరుగులేని వాడిగా వస్తాడని ఆయన జోత్సం చెప్పారు. ఎన్నికల్లో ఎన్.టి. రామారావు ప్రతిపక్ష స్థానానికి పోవల్సి వచ్చింది. అదే చంద్రశేఖర శాస్త్రి మళ్ళీ 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపడతాడని ప్రగల్భాల జ్యోతిష్యం రవీంద్రభారతిలో హైదరాబాద్ లో ఆహ్వానిత ప్రేక్షకుల సమక్షంలో పలికారు. కానీ ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారు.
నండూరి రామకృష్ణాచార్యులు అధికార భాషా సంఘ అధ్యక్షులుగా కొన్నాళ్ళు పదవి చేపట్టారు. ఆయన అంతటితో పరిమితం కాకుండా జ్యోతిష్యాలు కూడా చెబుతూ 1989లో ఎన్నికల సమయంలో తిరిగి డోకాలేకుండా ఎన్.టి. రామారావు పదవీ చేపడతాడని జ్యోతిష్యం చెప్పారు. అదేమోగానీ, నండూరి వారి పదవి మాత్రం పోయింది.
ఇ.వీ. సుబ్బారావు జ్యోతిష్య పీఠానికి కొన్నాళ్ళు అదిపతిగా ఒక వెలుగు వెలిగారు. ఆయన నాకు మిత్రుడే. కొట్టిపాటి బ్రహ్మయ్య శాసన మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన పి.ఎ.గా వ్యవహరిస్తూ, బ్రహ్మయ్య గారి నా జీవిత కథ అనే పుస్తకాన్ని పరిష్కరించారు. ఆయన ఏ పదవిలో ఉన్నా జ్యోతిష్కం చెప్పటం ఆచారంగా పెట్టుకున్నారు. 1989లో ఎన్.టి.ఆర్. మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడని చెప్పారు. లోగడ ఇలాంటి జ్యోశ్యాలే చాలామందికి చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే ఆయన చెప్పినవి విఫలమైనప్పుడు అదేమని ఎవరూ అడిగేవారు కాదు. కానీ పొరపాటున సఫలమైతే అదంతా తన గొప్పతనమేనని గొప్పలు చెప్పుకునేవాడు.
వీరందరికీ మించిపోయిన మరొక వాస్తు పండితులున్నారు. ఆయన గౌరు తిరుపతి రెడ్డి గారు. ఆయనతో నేను టీ.వీ. ఛానల్స్ లో బహిరంగ చర్చలో తారసిల్లి సవాళ్ళు చేశాను. ఆయనకు బోకరింపు, దబాయింపు, సెక్షన్ హెచ్చు. తాను ఎందరో తనవంతులకు, రాజకీయ వేత్తలకు, పారిశ్రామికులకు వాస్తు చెప్పి పైకి వచ్చునట్లు చేశానని రాసుకున్నాడు. 1999లో ఎన్నికల సందర్భంగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండేవారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం (గాంధీభవన్) లో అధ్యక్షుడు కూర్చునే గది, కుర్చీ మారిస్తే వాస్తు ప్రకారం కలసి వస్తుందని ముఖ్యమంత్రి అవుతాడని గౌరు తిరుపతి రెడ్డి అలా మార్పించేశాడు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు కానీ గాంధీ భవన్ లో మార్పులకు ఖర్చు చాలా అయింది. అయితే గౌరు తిరుపతి రెడ్డి తన వైఫల్యాలను ఎప్పుడూ చెప్పడు. అది వాస్తు పండితుల ప్రత్యేకత. సఫలాలన్నీ నిజమో కాదో కొంచం పరిశీలన చేయవలసి ఉన్నది. ఇలాంటివి కోకొల్లలుగా చెప్పవచ్చు. కానీ జ్యోతిష్కులు, వాస్తుపండితులు ఇవేవీ పట్టించుకోరు. వారి మాటలని నమ్మి మోసపోయేవారు, డబ్బులిచ్చేవారు, సమాజంలో ఉన్నంతకాలం వారికి తిరుగులేదు.
These are only few examples. But the game is going on.

Tuesday, March 24, 2009

జ్యోతిష్యంలో వింతలు, విడ్డూరాలు, అశాస్త్రీయాలు

ఖగోళ శాస్త్రం – జ్యోతిష్యం :
ఖగోళశాస్త్రం సైన్స్ లో భాగం. ఇందులో పరిశీలన, పరిశోధన ప్రధానంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ ప్రక్రియ జరుగుతున్నది. కనుక క్రమేణా తెలుసుకునేది విస్తృతమౌతున్నది. పూర్వం తెలియని గ్రహాలు, నక్షత్రాలు, శకలాలు ఇలా ప్రకృతిలో ఎన్నో విషయాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఇప్పటికి పరిమితంగా తెలిసింది. ఇంకా తెలియవలసింది అనంతంగా ఉన్నది. కనుక ఖగోళ శాస్త్రంలో ఏప్పుడూ నిత్య నూతనంగా విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇందులో మరొక విశేషమేమిటంటే లోగడ తెలుగుకున్న వాటిలో దోషాలున్నా, అసంపూర్ణతలు ఉన్నా అవి దిద్దుకుంటూ పోవటం శాస్త్రియ ప్రక్రియలో ఒక ఉత్తమ గుణం. తన తప్పులను తాను సవరించుకుంటూ రుజువైన వాటిని అంగీకరిస్తూ, రుజువు కానివాటిని మూఢంగా నమ్మకుండా, రుజువుల కోసం ఎదురు చూడటం ఈ శాస్త్రంలో మంచి లక్షణం. ఇది సైన్స్ లో అన్ని విభాగాల్లోనూ ఉంటుంది. ఇందులో జ్యోతిష్యాలకు, ఊహలకూ, మనుషుల బలహీనతలను అట్టం పెట్టుకుని వ్యాపారం చేసే ధోరణి ఉండదు.
జ్యోతిష్యం భారత దేశం సొత్తు కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యాలతో సహా అనేక చోట్ల ఇది ఉన్నది. భారతదేశంలో ప్రధానంగా మత, ధోరణిలో జోతిష్యం సాగింది. ఎక్కువగా పూర్వీకుల రచనలు, వాదనలు, ఆధారంగా జ్యోతిష్యం నడుస్తున్నది. మనుషులలో ఉన్న బలహీనతలు, నమ్మకాలు, పెట్టుబడిగా జ్యోతిష్యం వాడుకుంటున్నది. ఇందులో దోషాలు దిద్దుకోవటం, తప్పులు సవరించుకోవటం కనిపించదు. పైగా కుంటి సాకులతో కప్పి పుచ్చుకోవటం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం రుజువులు ఆధారాలు లేకపోవటమే. గ్రహాల నుండి మనుషులపై ప్రభావం చూపే ఆధారాలేమీ లేవు. కానీ ఉన్నట్లుగా నమ్మించి, చెప్పి వ్యక్తులను తప్పుదారిన పట్టిస్తున్నారు. ప్రాచీనమైనంత మాత్రాన అదే సరైనదనే ధోరణి నడుస్తున్నది. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఎన్నో దోషాలు అమలులో ఉన్నాయి. మంచిని మాత్రమే స్వీకరించి దోషాలను వదిలేయటం అవసరం. ఉదాహరణకు అంటరాని తనం, కులహెచ్చుతగ్గులు, చాలా కాలం నుంచి వస్తున్నాయి. అంతమాత్రాన అవి మంచివని, వాటినే అనుసరించాలని అనలేము. అలాగే జ్యోతిష్యం ప్రాచీన కాలంలో ఎవరో చెప్పారని ఇప్పటికీ మూర్కంగా అనుసరించటం మన జనాన్ని వెనక్కి నడిపించటమే. ఇదే దోరణి విదేశాల్లోనూ ఉన్నది. అక్కడ ఛాలెంజ్ చేసినప్పుడు వారు రుజువులకు ముందుకు రారు. ఇండియాలోనూ అదే ధోరణి ఉన్నది.

ప్రపంచంలో చాలా దేశాలలో జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి. కానీ భారతీయ జ్యోతిష్యం వాటికి భిన్నంగా, చాలా ప్రత్యేకతలతో ఉన్నది.
భారతీయ జ్యోతిష్యానికి మూలం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, 108 పాదాలు, పుట్టుక కాలం.
9 గ్రహాలలో ప్రపంచంలో ఎక్కడా లేని, శాస్త్రీయ ఆధారాలకు అందని రెండు గ్రహాలున్నాయి. ఒకటి రాహువు, కేతువు.
గ్రహాలకి కులాలున్నాయి. అంటరానితనం ఉన్నది. శని శూద్ర కులానికి చెందగా, వైశ్య కులానికి చెందినవారు చంద్రుడు, బుధుడు అట. రాజ వంశానికి చెందినవారు కుజ, రవి కాగా బ్రాహ్మణులలో శుక్రుడు గురువున్నాడు. ఇంతటితో ఆగలేదు. శుక్రుడు, చంద్రుడు స్త్రీ గ్రహాలట. గురుడు, కుజుడు, రవి పురుషులట. శని, బుధుడు నపుంసకులట. ఈ విచక్షణ వర్గీకరణ ప్రపంచంలో మరే జ్యోతిష్యంలోనూ లేదు. వీనికి తోడు ప్రతి గ్రహానికి ఒకళ్ళో ఇద్దరో దేవుళ్ళు కూడా ఉన్నారు. అందుకే గ్రహాలను దేవతలంటారు. పైగా మన జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు గ్రహం. అంతేగాని నక్షత్రం కాదు.
వ్యక్తి భవిష్యత్తును చెప్పటానికి జనన కాలం, లగ్నం ఆధారంగా సూచిస్తారు.
భారతీయ జ్యోతిష్యానికి మూలం ఎక్కడో కచ్చితంగా తేల్చి చెప్పటంలేదు. వేదాలలో జ్యోతిష్యం లేదు. వేదాంగాలలో 6 భాగాలుండగా అందులో జ్యోతిష్యం ఒకటి. ఎక్కువమంది జ్యోతిష్యులు పరాశరహోరా శాస్త్రాన్ని పాటిస్తారు. ఆ తరువాత చిలవలు పలవలుగా చాలా పుస్తకాలు, చాలామంది పండితులు బయల్దేరి అనేక చిట్కా జ్యోతిష్యాలు చెప్పారు. వీటిలో ఉత్తరోత్తర ఖగోళ శాస్త్రంలో కనుగొన్న గ్రహాలు లేవు. నెప్ట్యూన్, యురేనస్ వంటివి వారికి తెలియదు. గ్రహాలకు బలం ఉంటే అవి మనుషుల మీద ప్రభావం చూపితే మరి ఆ గ్రహాల సంగతి ఏమవుతుందో తెలియదు.
గ్రహాల నుండి వెలుగు రాదు. అయినప్పటికీ గ్రహాల ప్రభావం మనిషిమీద ఎలా ఉంటుంది అనేది ప్రాచీన శాస్త్రాల, అంకెల గారడీతో చెప్పటం తప్ప ఋజువుపరచటానికి ఏమీ లేదు. కానీ కొత్త ఎత్తుగడలతో నామ నక్షత్రం పేరిట మొదటి అక్షరాన్ని బట్టి జన్మ లగ్నం చెప్పటం, ప్రశ్న కాలాన్ని బట్టి చెప్పటం అనేవి బతుకు తెరువుకు వేసిన ఎత్తుగడలు మాత్రమే.
ఖగోళ శాస్త్రంలో ఋజువులూ ఆధారాలూ ఉంటాయి. ఆధునిక పరికరాలతో పరికించే తీరు ఉంటుంది. జ్యోతిష్యంలో ప్రాచీన గ్రంథాలు తప్ప మరే పరిశీల, పరిశోధన ఉండదు. గ్రహానికీ, నక్షత్రానికీ తేడా వీరికి తెలియదు. రాశులు అనేవి ఊహించిన రూపాలే తప్ప వాస్తవంలో లేవు. అయినా వాటినే నేటికీ పాటిస్తున్నారు.
జనన కాలాన్ని నిర్ధారించడానికి, తల్లి గర్భంలో బిడ్డ ప్రవేశించినపుడు, ప్రసవించేటప్పుడు తల బయటికి వచ్చినప్పుడు, తొలిసారి బిడ్డ ఏడ్చినప్పుడు, తొలుత శ్వాస పీల్చినప్పుడు లెక్కలు వేస్తున్నారు. ఇవన్నీ అభిప్రాయ భేదాలతో ఉన్న అంశాలే. కచ్చితంగా జన్మ నక్షత్రాన్ని నిర్ణయించే ఆధారాలేవీ వీరికి లేవు. అయితే నమ్మకం, మూఢవిశ్వాసం సంప్రదాయంగా వస్తున్నాయి గనక జ్యోతిష్యం ఒక వ్యాపారంగా సాగిపోతోంది. ఖగోళ శాస్త్రం పక్కన పెట్టుకొని పరిశీలిస్తే జ్యోతిష్యం నిలబడదు. కనకనే దాని జోలికి పోరు. యూనివర్సిటీలలో జ్యోతిష్యం కోర్సులు పెట్టిన చోట కూడా శాస్త్రీయ పరిశీలన, ఖగోళంతో పోల్చి చూడటం అనేవి లేవు. సూర్యుని నుండీ వచ్చే వెలుగు ప్రతి క్షణం అనంత కిరణాలతో ఉంటుంది అందులో ఏ కిరణంతో పుట్టినప్పుడు ప్రభావితం అవుతారో చెప్పలేరు. అయినా లగ్నాలు, ముహుర్తాలు, మంచి గిట్టుబాటు వాణిజ్యంగా చదువుకున్న వారిలో సైతం సాగుతుండటం పేర్కొనదగిన అంశం.

Sunday, March 22, 2009

18 ఎన్నికల పర్వాల అనంతరం






Please bear with the lengthy matter. Now elections are on and hence this will give reasonble background.You may read in parts as your time permits.


(1952 నుండి ఇప్పటి వరకూ మన రాష్ట్రంలో జరిగిన లోక్ సభ, శాసన సభల ఎన్నికలను సూక్ష్మంగా పరిశీలించిన తరువాత ఈ స్పందన అందిస్తున్నాము.)
రాజకీయాలు దిగజారిపోయాయని, లోగడ ఇలా ఉండేది కాదని భావించేవారు సరి కాదని, కింది వివరాలు తెలియజేస్తున్నాయి. లోపాలకు ప్రధాన కారణం పార్టీల తత్వంలోనే ఉన్నది. నా పార్టీ తప్పు చేయదని, ఎదట పార్టీలు ఏం చేసినా తప్పు అని భావించే ధోరణి అన్ని పార్టీల రాజకీయాలలో ఉన్నది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశంలో 1952 నుండి ఇప్పటికి 18 ఎన్నికల పర్వాలు ముగిశాయి. తొలి జాతీయ ఎన్నికలలో (1952) జవహర్ లాల్ నెహ్రూ నాయకత్వం తిరుగులేనిదిగా ఉండేది. ఆయన్ను వ్యతిరేకించిన మహామహులంతా ఎన్నికలలో ఓడిపోయారు. అందుకు మచ్చుతునకగా బి.ఆర్. అంబేద్కర్, ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం ఇత్యాదులను పేర్కొనవచ్చు. తొలి ఎన్నికలలో అంచెలవారీగా పోలింగు సాగుతూండగా, ఫలితాలను ఎప్పటికప్పుడే ప్రకటించేవారు. దాని ఫలితం జరగబోయే ఎన్నికలపై చూపేది. లోక్ సభ ఎన్నికలలో కమ్యూనిస్టులు హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయను బెజవాడ (విజయవాడ)లో నిలబెట్టి గెలిపించారు. మొదటిసారి ఎన్నికలలోకి దిగిన కొత్త రఘురామయ్య తెనాలి నుండి ఆచార్య రంగాను ఓడించి ఎన్నికయ్యారు. కాంగ్రెసు నుండి ఎన్నికలకు ముందు చీలిపోయి కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ పెట్టిన టంగుటూరి ప్రకాశం, ఆయన నుండి చీలిపోయి కృషీకార్ లోక్ పార్టీ పెట్టిన ఆచార్య రంగా ఓడిపోయారు. నీలం సంజీవరెడ్డి అనంతపూర్ లో ఆయన బావమరిది కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి చేతిలో ఓడిపోయి మళ్ళీ జీవితంలో అనంతపురంలో ఎన్నికలకు నిలబడలేదు. మదరాసులో మంత్రులుగా చేసిన కళా వెంకట్రావు, కల్లూరి చంద్రమౌళి, బెజవాడ గోపాలరెడ్డి, సంజీవరెడ్డి, మొదలైన వారంతా ఓటమిని చూశారు.
1952లో రాష్ట్ర ఎన్నికలు ఆంధ్రలో జరిగినప్పుడు నాటి మదరాసు రాష్ట్రంలో భాగంగానే సాగాయి. తెలంగాణాలో నైజాము పాలన కింద ఎన్నికలు జరిగాయి. వీటిని విడిగానే చూడవలసి ఉన్నది. ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా తలెత్తారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టే అవకాశం టంగుటూరి ప్రకాశానికి లభించినా మదరాసులో శ్రీప్రకాష్ గవర్నర్ గా ఆనాడు కమ్యూనిస్టుల పెత్తనం రానివ్వకుండా రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిని చేశారు. ఆయన కౌన్సిల్ ద్వారానే శాసనసభకు వచ్చారు. మదరాసు హార్బరులో ఓడిపోయిన టంగుటూరి ప్రకాశం శృంగవరపు కోటలో ఎకగ్రీవంగా గెలిచి కమ్యూనిస్టులతో కలిసి మంత్రి వర్గాన్ని ఏర్పరచటానికి విఫల ప్రయత్నం చేశారు. తరువాత ప్రత్యేకాంధ్రకు ఆందోళన జరగగా 1953లో కర్నూలు రాజధానిగా కాంగ్రెసు పక్షాన టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. కమ్యూనిస్టులు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆచార్య రంగా అనుచరులు తొలుత సహకరించకపోయినా తరువాత మంత్రివర్గంలో చేరారు. కానీ మద్యనిషేధం సమస్యపై ప్రకాశాన్ని దించివేశారు. రాష్ట్రంలో తొలిసారి గవర్నర్ పరిపాలన వచ్చింది.
అటు తెలంగాణాలో కమ్యూనిస్టులు పార్టీ పేరుతో కాక పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రెంట్ పేరుతో పోటీ చేసి 37 స్థానాలు గెలుచుకున్నారు. ఆనాడు బలంగా ఉన్న సోషలిస్టు పార్టీకి 11 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 96 స్థానాలు వచ్చాయి. పార్లమెంటుకు కాంగ్రెసుకు 14 స్థానాలు రాగా, పి.డి.ఎఫ్ కు 6 స్థానాలు వచ్చాయి. నైజాము నవాబు రాజప్రముఖ్ గా ఉండగా బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగిపోయింది. సాయుధ పోరాటాన్ని వారు నిలిపివేశారు. తొలి ఎన్నికలలోనే కాంగ్రెసు సీట్లు రాక జలగం వెంగళరావు, శీలం సిద్ధారెడ్డి వంటి వారు కాంగ్రెసుకు ఎదురు తిరిగి స్వతంత్రులుగా పోటీచేసి, 6 సంవత్సరాలు పార్టీ నుండి వెలివేయబడ్డారు.
ఎరుపెక్కిన ఆంధ్ర – 1955 ఉపఎన్నికలు
ఆంధ్రలో 1955లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి. కమ్యూనిస్టులు అన్ని స్థానాలకు పోటీ చేసి, అధికారం చేజిక్కించుకునే స్థాయికి ఎదిగారు. వారిని ఓడించడానికి కాంగ్రెస్, ప్రజా సోషలిస్టు పార్టీ, కృషికార్ లోక్ పార్టీ కలసి ఐక్య కాంగ్రెస్ పేరిట పోటీ చేశారు. ప్రచార సరళి తీవ్ర రూపం దాల్చింది. విజయరాజకుమార్, వీరాచారి వంటివారు కామన్ ప్లాట్ ఫారాలకు కమ్యూనిస్టులను ఛాలెంజి చేసి, విజృంభించి ప్రచారం గావించారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చినట్లే భావించి ముఖ్యమంత్రిగా పుచ్చలపల్లి సుందరయ్య, హోంమంత్రిగా మాకినేని బసవపున్నయ్యను పేర్కొన్నారు. కేంద్రం నుండి లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్.కె. పాటిల్ వచ్చి కాంగ్రెస్ ఎన్నికలకు వ్యూహాన్ని రూపొందించారు. ఫలితంగా కమ్యూనిస్టులు అనూహ్యంగా ఓడిపోయి, 15 స్థానాల ప్రతిపక్షంగా సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పట్లో ఆంధ్రకు రాజధాని కర్నూలు.
1957 ఎన్నికలు
1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణా ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం కలసిన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సంజీవ రెడ్డి అధికారం చేపట్టారు. పెద్దమనుషుల ఒప్పందం జరిగినా ఆంధ్ర తెలంగాణా నాయకులంతా అధికారం మోజులో నిబంధనలనన్నిటినీ విస్మరించారు. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన సంవత్సరంలోనే మళ్ళీ ఎన్నికలు రాగా, అంతకు ఏడాది క్రితమే ఆంధ్రలో ఎన్నికలు జరిగినందున కేవలం తెలంగాణాకే ఎన్నికలు పరిమితం చేశారు. మళ్ళీ కాంగ్రెసు గెలవడంతో సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెసును బలపరిచిన కృషికార్ లోక్ పార్టీ, ప్రజాపార్టీలను సంజీవరెడ్డి దూరంగా పెట్టారు. 1958లో శాసనమండలి ఏర్పరచటంతో అనేక మందికి అవకాశాలు లభించాయి. కాంగ్రెస్ పార్టీలో పదవులు లభించని వారు, ఇతరులు కలిసి వేరే పార్టీలు పెట్టుకున్నారు. అప్పుడు దేశవ్యాప్తంగా ఏర్పడిన పెద్ద పార్టీ స్వతంత్ర పార్టీ.
1962 ఎన్నికలు
1962లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ 177 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ 51 స్థానాలలో నెగ్గింది. స్వతంత్ర పార్టీ 19 స్థానాలతో అసెంబ్లీలో ఆవిర్భవించింది. కాంగ్రెస్ లో సీట్లు లభించనివారు ఎదురు తిరిగి 20 స్థానాలలో స్వతంత్రులుగా నెగ్గారు. కె.వి. నారాయణరెడ్డి నాయకత్వాన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 29 మందితో ఏర్పడి, తరువాత కాంగ్రెసులో కలిసిపోయింది. తెన్నేటి విశ్వనాథం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ 9 మందితో ఏర్పరచినా, అది కాస్తా తరిగిపోయి ముగ్గురితో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, గౌతు లచ్చన్న ప్రతిపక్షంలో ఉండి సభకు రాణింపు తెచ్చారు. ప్రజా సోషలిస్టు పార్టీలో ఉన్న పి.వి.జి. రాజు, భాట్టం శ్రీరామమూర్తి ఇత్యాదులను సంజీవరెడ్డి చేరదీసి కాంగ్రెసు పార్టీలో చేర్చుకున్నారు. ఈలోగా కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు రూట్లను సంజీవరెడ్డి జాతీయం చేయడంతో, అది పక్షపాతంగా చేసినట్లు హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ స్థానంలో తాత్కాలికంగా దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత సంజీవ రెడ్డి అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులుగా ఢిల్లీ వెళ్ళారు. 1962 ఎన్నికల తర్వాత సంజీవరెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయి 1964 వరకు పరిపాలించారు. 1964లో నెహ్రూ చనిపోగా కాంగ్రెసు పార్టీలో పెద్దమార్పు వచ్చింది. సంజీవరెడ్డి కేంద్రానికి వెళ్ళి, ఉక్కు శాఖ మంత్రి అయ్యారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకులు కామరాజు నాడార్ నాయకత్వాన సిండికేటుగా ఏర్పడ్డారు. రాష్ట్రంలో బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా క్రమేణా సంజీవరెడ్డి వ్యతిరేక విధానాలను చేపట్టారు. విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఆందోళన జరిగింది. అది సంజీవరెడ్డి వ్యతిరేక ప్రచారంగా సాగింది.
1967 ఎన్నికలు
1967లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు 165 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెసులో ముఠాలు ఏర్పడి ఇంచుమించు 68 మంది ఎదురుతిరిగి కాంగ్రెసుపై ఇండిపెండెంట్లుగా పోటీ చేసి నెగ్గారు. అలాంటి వారందరినీ పార్టీ బహిష్కరించింది.
కమ్యూనిస్టు పార్టీ అప్పటికి రెండు ప్రధాన పక్షాలుగా చీలిపోయింది. రష్యా అనుకూల వర్గాన్ని సి.పి.ఐ.గాను, చైనా అనుకూల వర్గాన్ని సి.పి.ఎం.గాను పేర్కొన్నారు. ఉభయ పక్షాలూ ఎన్నికలలో పోటీ చేశాయి. సి.పి.ఐ.కి 9, సి.పి.ఎం.కు 11 లభించాయి. ఆ తరువాత నాగిరెడ్డి అసెంబ్లీకి రాజీనామా ఇచ్చి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. శ్రీకాకుళంలో నైక్సలైట్ ఉద్యమం తలెత్తింది.
1968 చివరిలో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం 1969లో తీవ్రరూపం దాల్చింది. దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ ఉద్యమం చెన్నారెడ్డి నాయకత్వాన సాగింది. ప్రత్యేక ముఠాగా కొండా లక్ష్మణ్ కూడా ఉద్యమాన్ని చేపట్టారు.
1972 ఎన్నికలు
1971లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. అప్పటికి కేంద్రంలో ఇందిరాగాంధీ పెద్ద నాయకురాలుగా ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ ను సమర్థిస్తూ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆమె తీసుకున్న నిర్ణయానికి వాజ్ పాయి వంటి నాయకులు కూడా సమర్థిస్తూ ఆమెను దుర్గ మాతగా ఆకాశానికెత్తారు. అప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికలలో తెలంగాణాలో చెన్నారెడ్డి నాయకత్వాన పోటీ చేసిన ప్రజాసమితి కాంగ్రెస్ ను ఓడించి 47.5 శాతం ఓట్లతో 11 స్థానాల ను గెలుచుకున్నది. ఆ తరునాత కొద్ది కాలానికే చెన్నారెడ్డి ప్రజాసమితిని కాంగ్రెసులో కలిపేసి రాష్ట్రానికి దూరంగా పదవి పుచ్చుకుని వెళ్ళిపోయారు. శాసన సభలో కాంగ్రెసుకు 219 స్థానాలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానంద రెడ్డిని తొలగించి, ఆయన స్థానంలో పి.వి. నరసింహారావును తీసుకు వచ్చారు. 219 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకున్నది. మార్క్సిస్ట్ పార్టీకి కేవలం ఒక్క సీటుమాత్రమే వచ్చింది. సిపిఐకి 7 సీట్లు వచ్చాయి. కాంగ్రెసుకు ఎదురు తిరిగిన వారికి 53 స్థానాలు వచ్చాయి. 219 సీట్లతో కాంగ్రెస్ పి.వి.నరసింహారావు నాయకత్వాన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసింది.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమసి పోగా ప్రత్యేక ఆంధ్ర కోసం ఉద్యమం సాగింది. దీనికితోడు భూ సంస్కరణల పేరిట సీలింగ్ పరిమితులను పి.వి. నరసింహారావు ప్రకటించడంతో ఉద్యమం తీవ్రతరమయింది. చివరకు పి.వి.నరసింహారావుని తొలగించి, రాష్ట్రపతి పరిపాలన ఏర్పరచారు.
కొంత సద్దు మణిగిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావును నియమించారు. ఆయన సమైక్యవాదిగా నక్సలైటు ఉద్యమాన్ని అణచి వేయడానికి పూనుకున్నారు. 1975 జూన్ లో ఇందిరా గాంధి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రాష్ట్రంలో వెంగళ రావు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
1978 ఎన్నికలు
1977లో అత్యవసర పరిస్థితి తొలగిన తరువాత దేశంలో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఇందిరాగాంధీ పరిపాలనకి నిరసనగా ప్రజలు దేశంలో కాంగ్రెసును ఓడించారు. కానీ, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ 41 స్థానాలు గెలవడంతో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రతిష్ఠ పెరిగింది. అప్పటికి జనతా పార్టీ ఏర్పడగా అందులో ప్రముఖ పాత్ర వహించిన నీలం సంజీవరెడ్డి నంద్యాల నుండి ఒక్కడే గెలుపొంది, కేంద్రానికి వెళ్ళి స్పీకర్ కాగలిగాడు. లోగడ జరిగిన పోలీసు అత్యాచారాలకు నిరసనగా జస్టిస్ భార్గవ కమిషన్ ఏర్పాటు చేయవలసి వచ్చింది.
1978లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. దేశంలో జనతా పార్టీ అధికారంలో ఉండటం వలన రాష్ట్రంలో కూడా ఆ పార్టీ అధికారానికి రావచ్చునని భావించింది. అప్పటికి ఉత్తర ప్రదేశ్ గవర్నరుగా ఉన్న చెన్నారెడ్డి రాష్ట్రానికి వచ్చి, కొత్తగా ఎర్పడిన ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడయ్యారు. కాంగ్రెస్ చీలిపోగా బ్రహ్మానంద రెడ్డి నాయకత్వాన ఏర్పడిన కాంగ్రెస్ కు రాష్ట్రంలో జలగం వెంగళరావు ప్రాతినిధ్యం వహించారు. 1978 ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నెగ్గింది. అత్యధిక సంఖ్యతో ఇందిరా కాంగ్రెస్ పార్టీ 174 స్థానాలు గెలుచుకున్నది. వెంగళరావు నాయకత్వాన రెడ్డి కాంగ్రెసుకు కేవలం 30 స్థానాలు, జనతా పార్టీకి 60 స్థానాలు, సి.పి.ఎం.కు 8, సి.పి.ఐ.కు 6 వచ్చాయి. చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆయన ప్రత్యేక తెలంగాణా నినాదాన్ని మళ్ళీ తీసుకురాలేదు. రెడ్డి కాంగ్రెసు నాయకుడుగా వెంగళరావు ఉండేవాడు. జనతా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష స్థానం ఉన్నా వారిలో వారు కలహించుకొని చీలిపోయారు.
1980లో లోక్ సభ ఎన్నికలు జరగగా ఆంధ్ర ప్రదేశ్ లో 41 స్థానాలు ఇందిరా కాంగ్రెసు గెలిచింది. పార్వతీ పురం నుండి కిషోర్ చంద్రదేవ్ ఒక్కడే రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నెగ్గారు. జనతా పార్టీ పక్షాన పోటీ చేసిన జయపాల్ రెడ్డి ఓడిపోయారు.
1978 నుండి 82 వరకూ రాష్ట్రంలో కాంగ్రెసు ముఖ్యమంత్రులను కేంద్రం మారుస్తూ పోయింది. అవినీతి ఆరోపణలపై డా. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను తెచ్చారు. ఆయన జంబో జట్ మంత్రిమండలిని ఏర్పరచి నవ్వులపాలయ్యారు. కొన్నాళ్ళకు ఆయన స్థానే భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిని చేశారు. ఆరునెలలోనే ఆయన స్థానంలో కోట్ల విజయభాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని గావించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు అభాసుపాలయింది. విమర్శలకు గురయింది. అవినీతి ఆకాశానికంటింది.


1983 ఎన్నికలు
ఆ దశలో ఎన్.టి.రామారావు రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు వారి పరువు నిలబెట్టాలని ఢిల్లీలో తాకట్టుకు గురయిన తెలుగు స్థానాన్ని మళ్ళీ విడిపించాలని కాంగ్రెస్ అవినీతిని రూపుమాపి ప్రజాపాలన తీసుకురావాలని రాష్ట్రమంతా పర్యటించారు. ఆయనకు విశేష ఆదరణ లభించగా 1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఎన్.టి.రామారావు నాయకత్వాన పెద్ద సంఖ్యాబలంతో (203) నెగ్గింది. ఆయనను ఓడించటానికి ఢిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీ డబ్బుల సంచులను అభ్యర్థులకు పంచింది. సి.పి.ఐ.కి నాలుగు స్థానాలు సి.పి.ఎం.కు నాలుగు స్థానాలు, బి.జె.పి.కి 3 స్థానాలు, జనతా పార్టీకి ఒక స్థానం, ఇండిపెండెంట్లకు 17 వచ్చాయి. కాంగ్రెసు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా 60 సీట్లతో సర్దుకు పోవలసి వచ్చింది.
ఎన్.టి.రామారావును తొలగించటానికి నాదెండ్ల భాస్కరరావు పన్నిన వ్యూహానికి కాంగ్రెసు పార్టీ వత్తాసుపలికింది. తెలుగుదేశంలో కృత్రిమ చీలికలు తెచ్చిన నాదెండ్ల భాస్కరరావుకు అండగా గవర్నర్ రామ్ లాల్ నిలిచారు. రామారావును తొలగించి ఒక నెలరోజుల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలించిన నాదెండ్ల భాస్కరరావు ఆయతో పాటు కాంగ్రెసు పార్టీ అభాసుపాలయింది.
1985 ఎన్నికలు
ఈ నేపథ్యంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు పెట్టి నిగ్గు తేల్చాలని ఎన్.టి.రామారావు పట్టుబట్టగా 1985లో ఎన్నికలు జరిగాయి. తెలుగు దేశానికి 202 స్థానాలు రాగా, కాంగ్రెసు 50 స్థానాలు వచ్చాయి. భాస్కరరావు నామరూపాలు లేకుండా పోయాడు.
1989 ఎన్నికలు
ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు 1989 వరకు కొనసాగారు. అప్పటికే ఆయన పలుకుబడీ, ఆకర్షణా కొంత తగ్గుతూ వచ్చింది. 1989లో జరిగిన ఎన్నికలలో ఎన్.టి.రామారావు మెజారిటీ కోల్పోయి, 74 సీట్లతో ప్రతిపక్ష నాయకుడి స్థానంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. కాంగ్రెసు ముఖ్యమంత్రిగా డా.మర్రి చెన్నారెడ్డి 181 స్థానాలతో మరొకసారి అధికారం చేపట్టారు. అయితే ఆయన ఈసారి ఆట్టేకాలం కొనసాగలేకపోయారు. మళ్ళీ కాంగ్రెసు పార్టీ పాత అలవాట్ల ప్రకారం ముఖ్యమంత్రిని తొలగించి 1990 డిసెంబరు 17న ఎన్.జనార్దన రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది.
1991 లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీని తీవ్రంగా ఎదుర్కొని తెలుగుదేశం గెలుస్తున్న సందర్భంలో ఎన్నికల మధ్యలో 1991 మేలో రాజీవ్ గాంధీని మదరాసులో ఎల్.టి.టి.ఇ. ఉగ్రవాదులు ఆత్మాహుతి దళంతో చంపారు. అంతటితో ఎన్నికల ఫలితాలు మారిపోగా ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెసు నెగ్గింది. కానీ ఎన్. జనార్దన రెడ్డిని ఆట్టే కాలం ముఖ్యమంత్రిగా కొనసాగనివ్వకుండా కోట్ల విజయభాస్కర రెడ్డిని 1992లో ముఖ్యమంత్రిని చేశారు.
1994 ఎన్నికలు
1994లో శాసన సభ ఎన్నికలు వచ్చాయి. తిరిగి ఎన్.టి.రామారావు నాయకత్వాన తెలుగు దేశం 247 స్థానాలతో అధికారంలోకి రాగా, కాంగ్రెసుకు కేవలం 26 మాత్రమే లభించాయి. సి.పి.ఐ.కి 19, సి.పి.ఎమ్.కు 15 వచ్చాయి. బి.జె.పి.కి 3 లభించాయి. తెలుగు దేశానికి 219 స్థానాలు రావడం విశేషం. తరువాత 8 మాసాలకే 162 మంది తెలుగు దేశం శాసన సభ్యులు చంద్రబాబు నాయకత్వాన ఎదురు తిరిగి ఎన్.టి. రామారావును తొలగించి, చంద్రబాబును ఎన్నుకున్నారు. అంతటితో 1995 ఆగస్టు 30న ఎన్.టి. రామారావు రాజీనామా చేయవలసి వచ్చింది. ఆయన 1996 జనవరి 18న చనిపోయాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగాడు.


1996 ఎన్నికలు
1996లో లోక్ సభ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబునాయుడుకి 16 స్థానాలు లోక్ సభలో లభించాయి. అందువల్ల కేంద్రంలో ఉన్న అస్థిరత్వ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించగలిగాడు. 1996 మేలో ప్రధానమంత్రిగా దేవెగౌడను వెనకేసు వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ రాజశేఖర రెడ్డి నాయకత్వాన 90 స్థానాలతో ప్రతిపక్షంగా మాత్రమే ఉండగలిగింది.
1998లో లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశానికి 12 స్థానాలు రాగా, బి.జె.పి. సమర్థించింది. కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబును వ్యతిరేకించాయి.
1999 అసెంబ్లీ ఎన్నికలలో మరొకసారి చంద్రబాబు నాయుడు తెలుగు దేశాన్ని గెలిపించి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన పరిపాలన కొనసాగు తుండగా ఆయన హయాంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ రావడం, కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞాన రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం, రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడం, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు 2001 నవంబరు 27న తన మంత్రి వర్గాన్ని మరొకమారు మార్పులు చేసి రూపొందించారు.
2004 ఎన్నికలు
2004లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు సరైన కార్యక్రమాలు చేపట్టక అభాసు పాలయినారు. అప్పుడు వై.యస్. రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగు దేశం పాలనను విమర్శించి, తప్పులు బయట పెట్టి, కాంగ్రెసు పార్టీ తలపెట్టిన సంక్షేమ పథకాలను పేర్కొన్నారు. ఆయన పర్యటన కాంగ్రెసు పార్టీకి సత్ఫలితాలను చేకూర్చిపెట్టింది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షస్థానంలోకి పోయేట్లు చేసింది. కాంగ్రెసు పార్టీ నాయకుడుగా వై.యస్. రాజశేఖర రెడ్డి ఐదేళ్ళు పరిపాలించారు. ప్రజాహిత కార్యక్రమాలు, ఎన్నో ప్రాజెక్టులను నిర్మాణం ప్రారంభించినారు. కేంద్రంలో కాంగ్రెసు పార్టీ సోనియాగాంధీ నాయకత్వాన అధికారంలో ఉండటం కూడా ఆయనకు మంచి బలాన్నిచ్చింది.
జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పార్టీని స్థాపించి నీతి నిజాయితీ రాజకీయాల్లో కావాలని అవినీతికి దూరంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని డబ్బు ఖర్చు పెట్టటం ప్రధానంగా ఉండరాదని, అది ప్రజలకు ఆశలు చూపటం లోబర్చుకోవటం సక్రమం కాదని చెబుతూ, నేర చరిత్ర కలవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయరాదని స్పష్టం చేస్తున్నారు.
ఇటీవలనే ప్రముఖ సినీ హీరో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలకు సిద్ధమైనారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఉభయ కమ్యూనిస్టులతో మహాకూటమిగా ఏర్పడి ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. జూనియర్ ఎన్టీ ఆర్, నందమూరి బాలకృష్ణ రోడ్ షోలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2009 ఎన్నికలు జరగబో తున్నాయి.
ఓటర్లలో సగం మంది చదువు రానివారైనప్పటికీ అన్ని ఎన్నికల్లోనూ వారు యింగిత జ్ఞానంతో సరైన నిర్ణయాలు చేస్తూ తగిన పార్టీలను, అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. ఈ ధోరణి 1952 నుండి అన్ని ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది. ఈ ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుందనటంలో సందేహం లేదు.
రాజ్యాంగం పేర్కొన్న శాస్త్రీయ ధోరణి ప్రజలకు చెప్పి, మూఢనమ్మకాలు తొలగించి, విజ్ఞానవంతులను చేయడానికి పార్టీలు పూనుకోవలసి ఉన్నది. కానీ ఆ దిశగా ఎవరూ పయనించడం లేదు. పైగా పార్టీ రాజకీయాలలో మతాలు ప్రవేశించాయి. కులం సంగతి సరేసరి.

Friday, March 20, 2009

God in not great by Christopher Hitchens

Christopher and Innaiah in Washington DC
English Title: God is not great
Telugu version: Devudante Idannamaata
by N.Innaiah
see in ebook at site of Center for inquiry

httTelugu versio by N.Innaiah entitled: DeInnaiah with Christopher Hitchensvudante Idannamaatap://www.centerforinquiry.net/uploads/attachments/Teluga_translation_God_is_not_great.pdf

Infidel telugu: Matha Grahanam Veedindi




Aayan Hirshi Ali from Somalia now living in USA
left Komala Venigalla

http://http://www.centerforinquiry.net/uploads/attachments/Infidel_Telugu_Version.pdf



Please go to the link to read ebook of Ms Komala Venigalla



The English Title: Infidel by Aayan Hirshi Ali



Telugu version: Matha Grahanam Veedindi

Thursday, March 19, 2009

రాజకీయ పార్టీలు అంతరించాయి!

రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో అంతరించాయి. వాటిలో కొన్ని

లక్ష్మీపార్వతి - తెలుగుదేశం (ఎల్.పి.)
హరికృష్ణ - అన్న తెలుగుదేశం
విజయశాంతి - తల్లి తెలంగాణ
దేవేంద్ర గౌడ్ - నవ తెలంగాణ
నరేంద్ర (తెలంగాణ) - టి.ఆర్.ఎస్.ఎన్.
చెన్నారెడ్డి - తెలంగాణ ప్రజాసమితి
కొండా లక్ష్మణ్ - తెలంగాణ కాంగ్రెస్
నీలం సంజీవరెడ్డి - జనత
ఆచార్య రంగా - కృషికార్ లోక్ పార్టీ.
టంగుటూరి ప్రకాశం - కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ, ప్రజాపార్టీ
పి.వి.జి. రాజు - ప్రజాసోషలిస్ట్, సోషలిస్ట్ పార్టీ
ఈశ్వరీబాయి - రిపబ్లికన్ పార్టీ
కె.వి. నారాయణ రెడ్డి - డెమొక్రటిక్ ఫ్రంట్
సుబ్బరాజు, లక్ష్మీకాంతమ్మ - ఆంధ్రజనత
నాదెళ్ళ భాస్కరరావు - డెమోక్రటిక్ టి.డి.పి.
గౌతులచ్చన - లోక్ దళ్

Tuesday, March 17, 2009

మానవ విలువలకోసం మల్లాది రామమూర్తి


left M V Ramamurthy ,right N.Innaiah
in Mussorie 1976
భారత రాడికల్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా చేసిన మల్లాది రామమూర్తి నాకు అర్థ శతాబ్దం పాటు సన్నిహిత కుటుంబ మిత్రులు. 1960 ప్రాంతాలలో గుంటూరు జిల్లా బాపట్లలో అడ్వ కేటుగా ఆయన ప్రాక్టీసు చేస్తున్నప్పుడు పరిచయమయ్యాడు. అప్పట్లో ఆయన భార్య మల్లాది సుబ్బమ్మ హైస్కూలు మాత్రమే చదువుకున్న గృహిణి. ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆప్యాయంగా ఆదరించి అన్నం పెట్టిన దంపతులు, సహృదయులు. ఆ తరువాత సుబ్బమ్మను ఇంటర్, బి.ఎ. ప్రైవేటుగా చదివించి, రాయటం, చదవడం బాగా అలవాటు చేసి ఆమెను మానవవాదిగా తీర్చి దిద్దిన శ్రమ అంతా రామమూర్తిగారిదే.
కమ్యూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన రామమూర్తి 1940 ప్రాంతాలకే ఎమ్. ఎన్. రాయ్ ప్రభావంతో మానవ వాదిగా మారి జీవితమంతా అలాగే కొనసాగారు. ఒక వైపు ప్రాక్టీసు చూసుకుంటూనే, మానవ వాద ఉద్యమానికి అంకితమయ్యారు. మేమిరువురం అనేక సమావేశాలలో శిక్షణా శిబిరాలలో కలసి పాల్గొన్నాము. ఆయన ఉత్తరోత్తరా పెట్టిన వికాసం అనే మాసపత్రికలో నేను చాలా వ్యాసాలు వ్రాశాను. మేమిరువురం అఖిల భారత మానవ వాద సభలకు కూడా కలసి వెళ్ళి పాల్లొన్నాము. అలాగే హేతువాద ఉద్యమంలో కూడా కలసి పనిచేశాం.
రామమూర్తి పౌరహక్కుల సంఘాలలో మానవ హక్కుల సమితిలో ఎంతో కృషి చేశారు. జయప్రకాష్ నారాయణ్ మొదలుకొని వి.యమ్. తార్కొండే వరకు రామమూర్తికి బాగా పరిచయం. ఎమ్.ఎన్. రాయ్ తో శిక్షణ పొందిన రామమూర్తి తార్కికంగా రాసేవారూ, ఆలోచించేవారు. ఆవుల గోపాలకృష్ణమూర్తితో అతి సన్నిహితంగా ఉండేవారు. అక్కడ కూడా మేము తరచు కలిసేవారం. రామమూర్తి అనేక సెక్యులర్ పెళ్ళిళ్ళు చేయించారు. నాటికలు రాయించి ప్రదర్శింపచేశారు. అనువాదాలు చేశారు. ప్రజాస్వామ్య ప్రచురణలు అనే సంస్థలో కొన్ని పుస్తకాలు వెలువరించారు. విదేశీ పర్యటనలు చేశారు. రాను రాను చివరి దశలో కేవలం సుబ్బమ్మకు తోడ్పడటం ఆమె నాయకత్వాన్ని పెంచడం పనిగా పెట్టుకున్నారు. సొంత ఖర్చు పెట్టుకొని జీవితమంతా మానవ విలువలకోసం ఉద్యమాలలో రాజీపడకుండా పనిచేశారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో, ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీలో జైలుపాలయ్యారు. 1999లో చనిపోయారు.

Sunday, March 15, 2009

ఆంధ్రప్రదేశ్ లో పునర్వికాసం పునాదులు




Alapati Ravindranath

Yelavarthi Rosaiah



Abburi Ramakrishnarao




D V Narasaraju




















M N Roy

Some pictures of stalwarts who worked for renaissance in Andhra Pradesh and followed M N Roy`s scientific humanist thought













AGK Murthy







ఆంధ్రప్రదేశ్ లో పునర్వికాసం
పునాదులు వేసిన ఎమ్.ఎన్. రాయ్
స్వాతంత్ర పోరాటపు రోజులలో మన రాష్ట్రంలో ముమ్మరంగా వివిధ ఉద్యమాలు చిగురించి, వ్యాపించాయి. అందులో పునర్వికాస ఉద్యమానికి నాంది పలికి ఎందరో మేథావులను, రచయితలను ఆరితేరినవారుగా మలచిన ఖ్యాతి ఎమ్.ఎన్.రాయ్ ది. గాంధీజీ రాజకీయాలకు మార్గాంతరంగా వివేచనా ధోరణులతో ఫైజ్ పూర్ (మహరాష్ట్ర) కాంగ్రెస్ లో కొత్త దారులు తొక్కిన ఎమ్.ఎన్.రాయ్ ఎందరినో ఆకర్షించాడు. కుందూరు ఈశ్వరదత్ తన పత్రిక ప్రతినిధిగా ఎమ్. వి. శాస్త్రి (ములుకుట్ల వెంకట శాస్త్రి)ని పంపారు. రాయ్ ను ఆంధ్రకు ఆహ్వానించి వచ్చారు. 1938 జులై 31న నెల్లూరులో జరిగిన వ్యవసాయ కూలీ మహాసభకు ఎమ్.ఎన్.రాయ్ ను ప్రారంభకులుగా వెన్నెలకంటి రాఘవయ్య పిలుచుకువచ్చారు. అప్పటి నుండి 1954లో చనిపోయే వరకూ ఎమ్.ఎన్.రాయ్ తెలుగు మేథావులపై చెరగని ముద్ర వేశారు.
రచయితలలో అబ్బూరి రామకృష్ణారావు, త్రిపురనేని గోపీచంద్, పాలగుమ్మి పద్మరాజు, డి.వి.నరసరాజు, జి.వి.కృష్ణారావు, ఏ.యస్. అవధాని, పెమ్మరాజు వెంకటరావు, పి.హెచ్. గుప్తా, ఆవుల గోపాల కృష్ణమూర్తి ఎంతో ప్రభావితులై రాయ్ చెప్పిన పునర్వికాస ధోరణిలో ఎన్నో రచనలు వెలువరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి రాస్తూ రాయ్ జైలు లేఖలు సాహిత్య రంగంలో మణిపూసలని మెచ్చుకున్నారు. పైగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్ గా ఉండమన్నారు కూడా. ఫిలాసఫీ ప్రఫెసర్ గా అక్కడే ఉన్న కొత్త సచ్చిదానందమూర్తి తాను వ్రాసిన భారత తత్వ పరిణామ చరిత్రకు ఎమ్.ఎన్. రాయ్ తో సుదీర్ఘ పీఠిక రాయించుకున్నారు.
1938 నుండి గూడవల్లి రామబ్రహ్మం తన ప్రజామిత్ర పత్రికలో రాయ్ ఆలోచనలను తెలుగువారికి అందించటంలో చాలా తోడ్పడ్డారు. ఆయన తీసిన సంస్కరణల సినిమాలు కూడా రాయ్ హేతుబద్ధ ఆలోచనా ప్రభావాల ధోరణి కనిపిస్తుంది.
గోపీచంద్ తొలి రాజకీయ కథలు, వ్యంగ్యాస్త్ర విమర్శలూ రాయ్ అనుచరుడుగా వెలువరించినవే. జి.వి. కృష్ణారావు కీలుబొమ్మలు, పాపికొండలు తాత్విక విమర్శలు అన్నీ రాయిస్ట్ గా వ్రాసినవే. నవ్య మానవవాద తత్వాన్ని తన నవల రెండో అశోకుడి మూన్నాళ్ళ ముచ్చట అనే నవలలో పాలగుమ్మి పద్మరాజు చిత్రీకరించారు. రాయ్ ప్రభావంతో ఆయన చెప్పిన మానవ వాదాన్ని పత్రికా ముఖంగా అందించివారు ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఆలపాటి రవీంద్రనాథ్, పి.వి. సుబ్బారావు, కోగంటి సుబ్రహ్మణ్యం, కొల్లి శివరామిరెడ్డి, ఎమ్.వి. రామమూర్తి, రావిపూడి వెంకటాద్రి, పెమ్మరాజు వెంకటరావు పేర్కొనదగినవారు. ఆ రోజులలో రాయ్ ఆలోచనలను ఒకపట్టాన దినపత్రికలు కానీ వారపత్రికలు గానీ, ప్రచురించేవి కావు. కనుక ఆయన అనుచరులు సొంత పత్రికలు పెట్టి, భావాల ప్రభావాన్ని చూపారు. అలా వచ్చిన పత్రికలలో పేర్కొనదగినవి-ప్రజామిత్ర, రాడికల్, జ్యోతి, రాడికల్ హ్యూమనిస్ట్, రాడికల్ విద్యార్థి, సమీక్ష, వికాసం ఉన్నవి.
ఎమ్.ఎన్.రాయ్ అనేక శిఖణ శిబిరాలు నిర్వహించి, శాస్త్రీయంగా రాజకీయాలు ఉండాలని రాజ్యాంగం సెక్యులర్ గా రూపొందించాలనీ, వికేంద్రీకరణ పిరమిడ్ రూపంలో ఏర్పడాలనీ, చరిత్రను వైజ్ఞానికంగా రాయాలనీ చెప్పారు. అవి ఆంధ్రలో చక్కని పునాదులు వేశాయి. భట్టిప్రోలు హనుమంతరావు, కల్లూరి బసవేశ్వరరావు, జాస్తి జగన్నాధం, ఆవుల సాంబశివరావు, ఎ.ఎల్. నరసింహారావు, ఆలూరి బైరాగి, సి.హెచ్, రాజారెడ్డి. మల్లాది సుబ్బమ్మ మొదలైనవారు రచనలు చేశారు. ములుకోల (బండి బుచ్చయ్య సంపాదకుడు), ప్రజావాణి (వట్టికొండ రంగయ్య సంపాదకుడు) వంటి పత్రికలు భావ ప్రసారాలకు తోడ్పడ్డాయి. రాయ్ ప్రభావంతో విమర్శనాత్మక రచనలు, నిశిత పరిశీలనా గ్రంథాలు వెలువడ్డాయి. అందులో పి.హెచ్. గుప్తాగారి రామాయణ విమర్శ, ఆవుల గోపాలకృష్ణమూర్తి వ్యాసాలు, జి.వి. కృష్ణారావు సారస్వత రచనలు గమనార్హం.
ఎమ్.ఎన్. రాయ్ తో 1940 ప్రాంతాలలోనే ఆలోచనా సమావేశాలను చేయడానికి సుప్రసిద్ధ రచయిత చలం, విమర్శక పితామహుడు త్రిపురనేని రామస్వామిలతో ఆవుల గోపాల కృష్ణమూర్తి చర్చలు ఏర్పాటు చేశారు. ఆంధ్రలో అనేక సెక్యులర్ వివాహాలు జరపడానికి పునర్వికాస ఉద్యమం తోడ్పడింది. పి. కృష్ణ చౌదరి సంపాదకత్వాన రాడికల్ విద్యార్థి పత్రిక విద్యా సంస్థలలో ప్రభావం కనబరిచింది. ఎమ్.ఎన్.రాయ్ రచనలు తెలుగులోకి తీసుకురావడంలో ఎందరో కృషి చేశారు. వాటిని తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ప్రజాపరిషత్తు, నలంద పబ్లిషర్స్, హేమ ప్రచురణలు తోడ్పడ్డాయి. ఇలా తెలుగు అనువాదాలు చేసినవారు భట్రిప్రోలు హనుమంతరావు (రాయ్ స్మృతులు), కోగంటి రాధాకృష్ణమూర్తి (రాయ్ వ్యాసాలు), రాడికల్ హ్యూమనిజం (ఆవుల గోపాలకృష్ణమూర్తి), పిల్లి ఆత్మకథ (వెనిగళ్ళ కోమల), రాయ్ ప్రధాన రచనలు (ఎన్.ఇన్నయ్య) ఉన్నారు.
తెలుగులో ఎమ్.ఎన్.రాయ్ ప్రభావంతో భావ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఖ్యాతి ఆంధ్రజ్యోతి సంపాదకులు కీ.శే. నార్ల వెంకటేశ్వరరావుకు దక్కుతుంది. తన గ్రంథాలను కొన్నిటిని ఎమ్.ఎన్.రాయ్ కు, మానవ వాదులకు అంకితం చేయడమే కాక, ఆ భావాల ప్రభావంతో గీతా రహస్యం, ఉపనిషత్తుల పరిశీలన, పురాణాల విమర్శ, శాస్త్రీయ ఆలోచన రచనలను నార్ల వెలువరించారు.
తెలంగాణా ప్రాంతంలో ఎమ్.ఆర్. కృష్ణ, ఎమ్. నారాయణ, ఆలం ఖుంద్ మెరీ, ఎ.ఎస్.వడ్వాల్కర్ వంటివారు రాయ్ ఆలోచనలను ప్రసారం చేశారు. రాయ్ రచనలలో పార్టీలు అధికారం, రాజకీయాలు అనే వ్యాస సంపుటి నక్సలైట్ కమ్యూనిస్టులను ఆకట్టుకోవటం గమనార్హం.
రాజకీయాలలో శాస్త్రీయ ధోరణి అవసరమని ఆమేరకు వారిని శిక్షితులను చేయడం మనకర్తవ్యమని రాయ్ చెప్పాడు. రాజకీయ పార్టీల నిర్హేతుక ధోరణిని అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారే పద్ధతులను రాయ్ తీవ్రంగా నిరసించారు.

Thursday, March 12, 2009

రచయిత, ఉపన్యాసకులు శేషాద్రి


శేషాద్రి (మధ్యలో ఉన్నారు)
చిరకాలంగా మిత్రులుగా మేము అనేక రంగాలలో కలిసి పనిచేశాం. కందాడై శేషాద్రి మంచి రచయిత, ఉపన్యాసకులు. హాస్యప్రియులు. సుప్రసిద్ధ కమ్యూనిస్ట్ అడ్వకేటు కన్నభిరాన్ కు దగ్గర బంధువు వారి తాతలిరువురూ అన్నదమ్ములు. 1822 జులై 1న, నెల్లూరులో పుట్టిన శేషాద్రి మదరాసులో హైదరాబాదులో, హేగ్ చదివి డిగ్రీలు పొందారు. దేశ, విదేశాలు పర్యటించారు. ఆయన తండ్రి నైజామ్ కొలువులో పనిచేసేవారని చెప్పారు. తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హింది మాట్లాడటం శేషాద్రికి కొట్టిన పిండి.
1940 ప్రాంతాలలో కమ్యూనిస్టుగా జీవితాన్ని ఆరంభించి స్వాతంత్ర్యానంతరం ఆ ఉద్యమానికి దూరమై కేవలం సానుభూతిపరుడుగా మిగిలి, విద్యారంగంలో స్థిరపడ్డారు. నెల్లూరు వాడు కావడం వలన అక్కడి వారితో చిరపరిచితం, అనుభవాల దృష్ట్యా జమీన్ రైతు తెలుగు వారపత్రికలో అనేక వ్యాసాలు వ్రాసారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన నాకు పరిచయమయ్యారు. ఆ తరువాత జీవితమంతా సన్నిహిత స్నేహితులుగా కుటుంబ మిత్రులుగా ఉన్నాము.
మేము 1970 ప్రాంతాలలో ప్రసారిత అనే పేరిట ఒక త్త్రైమాస పత్రికను తెలుగులో హైదరాబాదు నుండి ప్రారంభించాము. పి. సత్యనారాయణ సహ సంపాదకుడు శేషాద్రి మాకు సలహాదారుడుగా ఉంటూ అందులో వ్యాసాలు వ్రాశాడు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో తెలుగులో వివిధ కోర్సులు చెప్పడానికి వీలుగా ఆ వ్యాసాలు తోడ్పడేవి. తెలుగులో ఉన్నత విద్య అభివృద్ధి కావాలంటే అనువాదాలకు బదులు ఆ స్థాయిలో ఇతర దేశాలలో ఉన్న కోర్సులను స్వేచ్ఛగా తెలుగులోకి తీసుకు రావాలని యథేచ్ఛగా సాంకేతిక పదజాలం వాడాలని అప్పుడే తెలుగు పిల్లలు సాంకేతిక, వైద్య, వ్యవసాయ తదితర కోర్సులు నేర్చుకోవడానికి వీలుంటుందని శేషాద్రి చెప్పేవారు. అది నేటికీ అమలుపరచదగిన అంశం.
జెట్టి సాంబశివరావుతో కలసి హేగ్ లో కోర్సులు చదివి తరువాత కొన్నాళ్ళు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, (ఢిల్లీ). వరంగల్ పోస్టు గ్రాడ్యుయేట్ సెంటర్, రాజేంద్ర నగర్ పంచాయతీరాజ్ సంస్థలలో పనిచేశారు. విదేశాలలో అనేక ఉపన్యాసాలు చేశారు. తెలుగులోనూ ఇంగ్లీషులోను చేసిన రచనలలో, కృతయుగ, కమ్యూనిస్టు ఉద్యమమం వ్యవసాయ పాలన, మార్క్సిజం, రాజకీయ శాస్త్రం ఇత్యాదులున్నవి.
నా ఆహ్వానంపై శేషాద్రి అనేక మానవ వాద, హేతువాద సమావేశాలలో అధ్యయన తరగతులలో ఉపన్యాసాలిచ్చారు. చివరి రోజులలో హైదరాబాదులోని చెండ రాజేశ్వరరావు వృద్ధుల సంస్థలో ఉండేవారు. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తలపెట్టిన పంచాయతీ రాజ్ సంస్కరణలకు శేషాద్రి అనేక విధాల తోడ్పడ్డారు.

Tuesday, March 10, 2009

అరుదైన ఫొటో - సమావేశంలో పాల్లొన్నవారు




1970 ప్రాంతాలలో హైదరాబాదులో జరిగిన మానవవాద హేతువాద సెక్యులర్ సమావేశ ఫొటో. అడుగునుండి ఎడమ జస్టిస్ వి.యం. తార్కొండే, జస్టిస్ గోపాలరావు ఎగ్బోటే, జస్టిస్ ఆవుల సాంబశివరావు
కిందనుండి రెండవ వరస ఎ.హెచ్.వి.సుబ్బారావు (జర్నలిస్టు) , ప్రొఫెసర్ పి.వి. రాజగోపాల్ (రాజకీయ శాస్త్ర ఆచార్యులు), ఎ.ఎల్ నరసింహారావు (జర్నలిస్టు, హ్యూమనిస్ట్)
కిందనుంచి మూడవ వరస మధ్యలో ప్రొఫెసర్ ఆలం ఖుందుమీరి (ఉస్మానియా ఫిలాసఫీ ప్రొఫెసర్), డా. జి. ఆర్ దల్వి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి, హ్యూమనిస్టు.
నాలుగవ వరస ఎన్.కె. ఆచార్య (రేషనలిస్ట్, అడ్వకేట్), ఎ.ఎస్. వడ్వాల్కర్ (అడ్వకేట్, హ్యూమనిస్ట్), చివర ఎన్.ఇన్నయ్య (సమావేశకర్త)
పై వరుస జె. శూలపాణి, కొసరాజు సాంబశివరావు.

Monday, March 9, 2009

ముస్లిం దేశాల్లో హీనంగా బతికిన స్త్రీల జీవితం










ఒసామాబిన్ లాడెన్ కుటుంబ స్త్రీల గతి...
--వెనిగళ్ళ కోమల
(ముస్లిం దేశాల్లో హీనంగా బతికిన స్త్రీల జీవితం గురించి గతంలో కొన్ని పుస్తకాలు వచ్చాయి. అక్కడ స్త్రీల జీవితం చాలా దుర్భరమని అవి

చదివాక తెలుస్తుంది. మహమ్మదు ప్రవక్త జన్మస్థలమైన ‘పవిత్ర సౌదీ అరేబియా’ లో రాజకుటుంబ స్త్రీల జీవితంపై 1990లో ‘ప్రిన్సెస్’ అనే పుస్తకం వచ్చి సంచలనం కలిగించింది. ఇప్పుడు అలాంటిదే మరో పుస్తకం. ఒసామా బిన్ లాడెన్ అంటే ‘పేరు మోసిన ఉగ్రవాది’ అని సెప్టెంబర్ 11, 2001 తర్వాత ప్రపంచానికి తెలియవచ్చింది. అతని అన్న యెస్లామ్ బిన్ లాడెన్. యెస్లామ్ భార్య కార్మెన్ రాసిన పుస్తకం ‘ఇన్ సైడ్ ది కింగ్ డం – మై లైఫ్ ఇన్ సౌదీ అరేబియా’ ఇపుడు అమెరికాలో గొప్ప సంచలనం. సౌదీ అరేబియా రాజకుటుంబీకురాలిగా ‘బంగారు పంజరపు చిలక’ కంటే హీనంగా బతికిన కార్మెన్ వాస్తవ జీవిత చిత్రణ ఈ పుస్తకంలో ఉంది. )

ఒసామా బిన్ లాడెన్ 11 సెప్టెంబర్, 2001 అమెరికామీద జరిగిన దాడులతో తెరపైకి వచ్చాడు. ఒసామా తండ్రి షేక్ మహమ్మద్ మూమూలు స్థాయి నుండి బిన్ లాడెన్ కన్.స్ట్రక్షన్ కంపెనీని స్థాపించే స్థితికి ఎదిగాడు. సౌదీలో అది అతి పెద్ద కంపెనీ. ఆయన 22 పెళ్ళిళ్ళు చేసుకుని, 25 మంది కొడుకులకూ, 29 మంది కూతుళ్ళకూ తండ్రయ్యాడు. 23వ వివాహం చేసుకునే నిమిత్తం వెళుతూ విమాన ప్రమాదంలో చనిపోయాడు.

బిన్ లాడెన్ కుటుంబానికీ, సౌదీ రాజుల కుటుంబానికీ సత్సంబంధాలు వున్నాయి. ఇస్లామును పటిష్టంగా పాటించేవారుగా, దక్షతగల వ్యాపారవేత్తలుగా, ధనవంతులుగా బిన్ లాడెన్ కుటుంబం గుర్తింపు పొందింది.
సౌదీలు మహమ్మద్ ప్రవక్త పుట్టిన దేశవాసులుగా గర్విస్తూ తమదే అసలైన ఇస్లాం అని చెప్పుకుంటారు. ఇస్లాం వ్యాప్తి వారి పరమాధిగా భావిస్తారు. 1930 నుండి ‘ఆయిల్ రిచ్’ దేశంగా సౌదీ అరేబియా ఎదిగింది. విదేశాలకు వెళ్ళి చదివిన వారు అక్కడ విలాసవంతంగా గడిపినా సౌదీలో మక్కా మూసజీవితమే గడుపుతారు.

ఒసామా తండ్రి తెలివైనవాడు. ఆరోగ్యంగా, అందంగా ఉండేవాడు. అతని భార్యలు, పిల్లలు అతని చెప్పుచేతల్లో ఉండేవారు. అతని స్థాయికి కొడుకులెవరూ ఎదగలేకపోయారు. భార్యలను, పిల్లలను ఒకే కాంపౌండులో వేరు వేరు ఇళ్ళల్లో ఉంచి పోషించేవాడు. కొందరు భార్యలకు విడాకులిచ్చినా, వారు మరల వివాహం చేసుకోకపోతే వారిని, పిల్లలను తనే పోషించేవాడు.

బిన్ లాడెన్ స్త్రీల జీవితం సౌదీ స్త్రీల జీవితానికి అద్దం పడుతుంది. ఆ స్త్రీలెప్పుడూ తలల నుండి పాదాల దాకా నల్లని, చిక్కని బురఖా ధరించి వుంటారు. (ఇంట్లో సయితం), అంతటి వేడి దేశంలో ఎప్పుడూ ఆ బురఖాలలో మగ్గుతూ ఉంటారు. పరాయి పురుషులెవరూ స్త్రీ ముఖాన్ని చూడగూడదు. ఆ స్త్రీలు ఒంటరిగా ఎక్కడికీ వెళ్ల గూడదు. భర్త అనుమతి లేకుండా ఏ పనీ చేయగూడదు. భర్త వెంట వెళుతున్నా బురఖా ధరించి కారు వెనుక సీట్లో కూర్చొని ప్రయాణం చేయాలి. భర్తతో కలిసి ఒకే టేబుల్ వద్ద భోజనం చేయకూడదు. భర్తకు లోబడే బ్రతకాలి.

బిన్ లాడెన్ స్త్రీలకు పనీపాటా ఏమీ వుండదు. పిల్లలు పనివాళ్ళ చేతుల్లో పెరుగుతుంటారు. బయటకు వెళ్లడానికి డ్రైవర్ని బండి సిద్ధం చేయమని చెప్పాలన్నా, మగ పనివాళ్ళతో వస్తువులు ఏమన్నా తెప్పించుకోవాలన్నా10 సం. కుర్రాడితో చెప్పి పంపిస్తారు. స్త్రీ ముఖం (నేకెడ్ ఫేస్) చూడగలవారు తండ్రి, సోదరులు, భర్త్త, కొడుకులు, మారు తండ్రి మాత్రమే. మరే పురుషుడూ కన్నెత్తి చూడకూడదు. ఆ అవకాశం స్త్రీ ఇవ్వకూడదు.

బిన్ లాడెన్ కుటుంబంలో స్త్రీలంతా కలిసిమెలిసి ఉంటారు. పిల్లల్ని కంటారు. రోజుకు 5సార్లు నమాజ్ చేస్తారు. వారు పెద్ద చదువుకున్నవారు కాదు. ఆడపిల్లల బడుల్లో అమ్మాయిలకు నేర్పేది అరబ్బీ, కొరాన్ పఠనం, అణుకువగా జీవించాలని బోధించడం. ఆడపిల్లలకు చదువు అవసరమనే చట్టమే లేదక్కడ. పై చదువుల కెళ్ళిన అమ్మాయిలకు కూడా మగ ప్రొఫెసర్లు డైరెక్టుగా పాఠాలు చెప్పరు. వీడియో పాఠాల పద్ధతిలో నడుస్తుంది బోధన. మతాచారాలను పాటిస్తూ స్త్రీ రోజంతా భర్త రాకకోసం ఎదురు చూస్తుంటుంది. అతను రాని రోజులే ఎక్కువ వుంటాయి. అతను వచ్చిన నాడు ఆ స్త్రీ సంతోషంగా అడుగులకు మడుగులొత్తుతూ వుంటుంది. ఆ స్త్రీలకు అలాంటి జీవిత విధానానికి మించి వుంటుందని గానీ, వారు మరో రీతిలో జీవించవచ్చనిగానీ తెలిసే అవకాశమివ్వరు పురుషులు.
బంధువులు ఇంటికెళ్ళినా భర్తతో కలిసి వెళ్ళాలి. పెళ్ళిళ్ళు, పార్టీలు, పిక్నిక్కుల కెళ్ళినా ఆడవారు వేరుగా, మగవారు వేరేగా కూర్చుంటారు. ఆడవాళ్ళూ, ఆడవాళ్ళూ కలిసి చిన్న చిన్న పార్టీలు ఏర్పాటు చేసుకుని కేక్ లు తింటూ, టీ తాగుతూ, పిల్లల గురించీ, బట్టల గురించీ, పనివాళ్ళ గురించీ మాట్లాడుకుంటారు. మగవాళ్ళను విమర్శించకూడదు. ఎలా ఉన్నారు అని అడిగే పరామర్శల్లో కూడా మగవారి పేరెత్తి అడగకూడదు. బహు భార్యలు ఉండవచ్చు. విడాకులు ఇవ్వడం సులభం కనుక, అణుకువగా పడి వుండకపోతే భర్త వదిలేస్తాడేమో అని స్త్రీ అహర్నిశలూ భయపడుతుంటుంది. కొన్ని సందర్భాలలో విడాకులిచ్చి భార్యను వెళ్ళగొట్టి ఆమె జీవితకాలం తన పిల్లల్ని కలవనీయకుండా చేసే భర్తలూ ఉన్నారు. తల్లిగా అక్కడ స్త్రీకంత విలువ ఉన్నది మరి..
మగసంతానం కలిగితే తల్లి పెద్ద కొడుకు పేరుతోనే పిలవబడుతుంది. అంతకుముందు ఆమె పేరేదైనా, ఉదా: ఓమ్ సారా అనే ఆమె పెద్ద కొడుకు అలీ అయితే ఆమెను ఓమ్ అలీ అంటారు. అచ్చంగా ఆడపిల్లల్ని కన్నతల్లి, అమె పిల్లలకు కలిపి భర్త ఆస్తిలో 50 శాతమే దక్కుతుంది. ఆమె భర్త ఏకారణంగానైనా చనిపోతే, భర్త సోదరుడు కానీ, సమీప బంధువుకానీ వారికి గార్డియన్ అవుతాడు. వారి పెంపకం, చదువు, పెళ్ళిళ్ళు అతని నిర్ణయానుసారం జరుగుతాయి. బిన్ లాడెన్ కుటుంబంలోని మగవారు వారి వ్యాపార విషయాలు కానీ, సోదరుల మధ్య ఆధిపత్య పోరు గురించి కానీ భార్యలతో చెప్పరు. ఏ విషయాలూ వారితో చర్చించరు. ఆ స్థాయి వారికి ఉండదనేది వారి నమ్మకం. అన్నదమ్ములు ప్రత్యక్షంగా పోట్లాడుకోరు. అందరికీ ఆస్తిలో భాగం వున్నా ఎవరి వ్యాపారం వాళ్ళు వృద్ధి చేసుకుంటారు. అవసరమైతే కలిసికట్టుగా సమస్యలనెదుర్కొంటారు.
స్త్రీలకు మసీదులో ప్రవేశం లేదు. మక్కాయాత్ర కెళ్ళినపుడే వారు బహిరంగంగా ప్రార్థిస్తారు. అదీ ఆడవారికి నిర్దేశించిన స్థలంలోనే. బయట ప్రపంచంలో కొంత మార్పు వచ్చినా బిన్ లాడెన్ కుటుంబంలో అది కనిపించదు. స్త్రీల జీవితాలు బంధింపబడినవిగా, చిన్నవిగా రంగు మాసినట్లు వుంటాయి. అక్కడ స్త్రీలు భర్తల పెంపుడు జంతువులుగా బ్రతుకుతారు. భర్తలు బహుమతులిస్తే ఉప్పొంగిపోతారు. సొంతంగా ఏ పనీ చేయలేరు. వారు భర్తలతో చర్చించవలసింది కూడా ఏమీ వుండకపోవచ్చు.
బిన్ లాడెన్ కుటుంబంలో భార్యాభర్తలు నిజంగా ప్రేమగా వుండడం తక్కువ కనిపిస్తుంది. సౌదీలో చాలా పెళ్ళిళ్ళు అలానే వుంటాయట. ఒక స్త్రీ సౌదీ నుండి బయటకు ప్రయాణం చేయాలంటే అనుమతి పత్రం మీద భర్త, తండ్రి, కుమారుడు ఎవరిదో ఒకరిది సంతకం తప్పకుండా వుండాలి. ఆడవారి పాస్ పోర్టులలో వారి ఫోటోలుండవు. విదేశీ స్త్రీని పెళ్ళి చేసుకుంటే ఆమె ఫోటో, ముఖం కనబడేలా బురఖాతో వుంటుంది.
బిన్ లాడెన్ కుటుంబంలో సంగీతం, నృత్యం ..హరామ్... అంటారు. పుట్టినరోజు వేడుకలు జరపరు. ఒక గర్భిణీ స్త్రీ మార్కెట్ లో మూర్ఛపోతే వెంటవున్న భర్త ఆమెను రెండు చేతుల్లోకి తీసుకోబోతే పోలీసులు (ముతవా) అభ్యంతరం తెలుపుతారు. మగవారు (భర్త అయినా సరే) స్త్రీని పబ్లిక్ గా తాకరాదు.
ఒసామా బిన్ లాడెన్ తల్లి తరుఫు బంధువు నజ్ వా (సిరియన్)ను పెండ్లాడాడు. ఆమెకు 30 ఏళ్లు రాకుండానే వరుసగా 7 మంది కొడుకుల్ని కన్నది. అతను లెబనాన్ లో చదివే రోజుల్లో విలాస పురుషుడేనట. తరువాత ఇస్లాంను స్ట్రిక్ట్ గా పాటిస్తూ, వ్యక్తిగా ఏ ప్రత్యేకత లేకున్నా, అందరి మన్నన పొందాడు. సౌదీ రాజుల విలాసవంతమైన జీవితాన్ని విమర్శించినందుకు దేశబహిష్కరణకు గురయ్యాడు. ఆఫ్.ఘనిస్తాన్ తాలిబన్ వీరుడిగా, అమెరికా విరోధిగా ఎదిగాడు. కుటుంబంతోనూ, రాజకుటుంబంతోనూ బంధాలు వీడలేదు. అమెరికాని ఎటాక్ చేసింది తనే అంటే వాళ్లు ఒప్పుకోరు. ఒసామా సోదరి షేఖా కూడా అతని మాదిరిగానే ఇస్లాం పక్షపాతి. ఆఫ్ఘ.నిస్తాన్.లో తాలిబన్ల సహాయార్థం ఆమె కూడా వెళ్ళి పనిచేసింది. మిగతా స్త్రీలలో సమావేశాలేర్పాటు చేసి కొరాను గురించి చర్చలు జరుపుకుంటుంది.
బిన్ లాడెన్ ఆడవాళ్లు షాపింగ్ కు వెళ్ళాలంటే ముందుగా కబురెడుతుంది. షాపుల్లో మగవారంతా తప్పుకోవాలి. బురఖాల్లోనే షాపింగు చేస్తారు. అక్కడ అమిత వేడి కనుక వర్శం పడితే వాళ్లంతా వర్షంలో తడిసి ఆనందిస్తారు. మగవారెవరూ ఆ దరిదాపుల్లో మెసలకూడదు. చెట్టు చేమ, గ్రీనరీ లేని ఎడారి దేశం. అందంగా ఉండదు. ఇతర దేశాలకు విహారానికి వెళ్ళినట్లు అక్కడ ఎవరూ వెళ్ళరు. ఇసుక తుఫానుకలొచ్చినప్పుడు అంతటా ఇసుక నిండుతుంది. తిండి పదార్థాలలో కూడా పడుతుంది. పనివాళ్ళు తర్వాత అంతా ఊడ్చేస్తారు. సౌదీలో రెండే విలువలు పాటిస్తారు. ఒకటి ఇంటి పెద్ద (పేట్రియార్క్)కు లోబడి వుండడం, రెండవది ఇస్లాంను పాటించడం. అందుకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా ఫలితాలు దారుణంగా వుంటాయి.
సౌదీ రాజకుటుంబంలోని స్త్రీలు కూడా జైలు జీవితం గడుపుతారు. డబ్బున్నది కనుక పోటీలు పడి పెద్ద పెద్ద ఇళ్ళల్లో నివాసముంటారు. సౌదీరాజులు సంచార జాతులనంతా కలిపి సౌదీ అరేబియాను స్థాపించారు. అదొక్కటే దేశం. ఆ రాజుల వంశం ...అల్ సౌద్ పేరుతో పిలువబడుతుంది. ఆ దేశపు ఆయిల్ సంపదనంతా రాచకుటుంబీకులు సొంత ఆస్తిలా పరిగణిస్తారు. స్త్రీలకు డబ్బుకు లోటులేదు. ప్రతి స్త్రీ ఎంతోమంది భార్యల్లో ఒకరుగా ఉంటారు. భార్యా, భర్తా వేర్వేరు ఇళ్లల్లో పక్కపక్కనే ఉంటారు. మగవారికి మగపనివారు, ఆడవాళ్లకి ఆడపనివారు ఉంటారు. భర్త భార్యతో గడపటం చాలా తక్కువ. స్త్రీలు మిట్టమధ్యాహ్నం దాకా నిద్రపోతారు. లేచి తయారయ్యి బురఖాలు కప్పుకుని షాపింగులకెళతారు. డబ్బున్నది కనుక వస్తువులు ఒకరితో ఒకరు పోటీపడి కొంటారు. ఇంట్లో రకరకాల డ్రెస్సులు వేస్తారు. బయటకు బురఖాతోనే వెళ్లాలి. ఆడవారికే ప్రత్యేకించిన షాపుల్లో ముఖం మీద కవరు పైకి తీసి వాళ్లు వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కొత్తగా వచ్చే రెస్టారెంట్లలో ‘ఫ్యామిలీ రూమ్స్’ ఏర్పడడంతో భార్యా, భర్తా కలిసి తింటారు. ముఖం మీద ముసుగు పైకెత్తి తింటున్నా వెయిటర్ ఆర్డర్ తెచ్చేముందు తలుపుమీద తట్టి వచ్చేలోపల స్త్రీ ముసుగు ముఖం మీదికి లాక్కుంటుంది.
రాజకుటుంబంలో స్త్రీ ఏ కొంచమైనా తిరుగుబాటు ధోరణి కనిపించిందంటే ఆమెకు మరణమే దండన. మిషాఅల్ అనే యువరాణి తనని వయసుమీరిన వాడికిచ్చి పెండ్లి చేస్తుంటే తెగించి, తను ప్రేమించిన వాడితో పారిపోతుంటే విమానాశ్రయం నుండి పట్టుకుని తీసుకువచ్చారు. తరువాత ఆమె తాతగారే ఆమెను తుపాకీతో కాల్చి చంపించారు. రాచకుటుంబంలో జనాభాను వృద్ధి చేసుకోవడం లక్ష్యం. ఇప్పటికంతా పాతికవేలదాకా యువరాజులు, రాణులు ఉన్నారంటారు.
స్త్రీలు లండన్ వంటి నగరాలకెళ్ళినప్పుడు డాక్టర్లను కలిసి తమ రోగాలకు మందు రాయించుకుంటారు. స్త్రీలు సూర్యరశ్మికి, వ్యాయామానికి దూరంగా ఉండడం వలన ఎముకల వ్యాధులు, ఎక్కువ తినడం వల్ల గుండెజబ్బులు, భర్తల నిరాదరణ వల్ల డిప్రెషన్లతో బాధపడుతూ మందులు మింగుతుంటారు. విడాకుల భయం పెనుభూతంలా వారిని వెంటాడూతూనే వుంటుంది. పిల్లలను విదేశీ గవర్నెస్సులు, ఆయాలు పెంచుతుంటారు. వారిపట్ల ఏ మాత్రం కృతజ్ఞతా భావం వుండదు. విదేశీ ఆయాలు ఎవరైనా సౌదీలో ఇస్లాం రూల్సు పాటించాల్సిందే. బైబిల్ చదవడం, కలిసి ప్రార్థనలు చేయడం అక్కడ ఒప్పుకోరు. వాళ్ళ పిల్లలను స్కూల్లో కట్టడి చేయరాదు. టీచర్లు చేయలేరు కూడా.
మొదటి నుంచి ఆడవాళ్లని మగవారితో వేరుచేసి పెంచడంవలన వారి మధ్య సయోధ్య వుండదు. మగపిల్లలు అధికులమనుకుంటారు. అలానే ప్రవర్తిస్తారు. ఆడవారికి చదువులు లేవు, పని వుండదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఫైజల్ రాజు భార్య ఎన్నో వ్యతిరేకతల మధ్య ఆడపిల్లలకు స్కూల్ తెరిపించారు.
కొత్త విషయాలు కనుగొనాలన్నా, కొత్త వాహనాలు వాడలన్నా, ఫోటో ఇమేజ్.లు తీయాలన్నా టీవీ వాడాలన్నా సౌదీ మేథావుల అనుమతి కావాలి. మొత్తం మీద ఆడవారి జీవితాలు బావిలో కప్పల చందమే. ఎలాంటి ప్రాధాన్యతా లేని, మార్పులేని జీవితాలు గడుపుతారు.
కార్మెన్ జీవితం
కార్మెన్ బిన్ లాడెన్ ‘ఇన్ సైడ్ ది కింగ్ డమ్, మై లైఫ్ ఇన్ సౌదీ అరేబియా’ అనే పుస్తకం ద్వారా సౌదీ జీవితంలో లోటుపాట్లను ప్రపంచం దృష్టికి తెచ్చారు.
ఒసామా బిన్ లాడెన్ అన్నయ్య యెస్లామ్ బిన్ లాడెన్ ను (కుటుంబంలో 10వ వాడు) కార్మెన్ పెండ్లాడింది. ఆమె జెనీవా (స్విట్జర్లాండ్)లో పుట్టింది. విహారయాత్రకు యెస్లామ్ కుటుంబం జెనీవా వచ్చినపుడు కార్మెన్ వాళ్ళ యింట్లో అద్దెకు దిగారు. యెస్లామ్ తో ఆమె పరిచయం, స్నేహంగా, ప్రేమగా మారి 1974లో వారిద్దరూ పెండ్లి చేసుకున్నారు.
కార్మెన్ తన కుటుంబం, స్నేహితుల మధ్య జెనీవాలో పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడినా, విదేశీయురాలిని పెండ్లాడడానికి సౌదీరాజు నుండి స్పెషల్ పర్మిషన్ తెచ్చాననీ, సౌదీలో చేసుకుంటే ఆ పెళ్లికి గౌరవం పెరుగుతుందనీ చెప్పి యెస్లామ్ ఆమెని సౌదీలో పెళ్ళికి వప్పించాడు.
జెద్దా ప్రయాణానికే బురఖా ధరించి రావలసి వస్తుంది కార్మెన్.కు. చాలా ఇబ్బందిగా అర్థం లేని ఆచారంగా అనిపించినా కాబోయే భర్త కోరిక మేరకు అన్నీ సహిస్తుంది. కొంతకాలం ఇద్దరూ అమెరికాలో చదువులు ముగించి తిరిగి సౌదీ చేరతారు. అమెకు పశ్చిమ దేశపు స్వేచ్ఛా పూరిత వాతావరణం, ఆ నాగరికత అంతా నచ్చుతుంది. అక్కడే మొదటి బిడ్డ ‘వఫా’ జన్మించింది.
సౌదీ తిరిగి వెళ్ళాక అక్కడి పద్ధతులు అలవరచుకున్నది. యెస్లామ్ కు డబ్బు ఉంది. ఇంట్లో కార్మెన్ కు కొంత స్వేచ్ఛ నిచ్చాడు. ఆ జీవితం ఎంతో గొంతు నులిమినట్లున్నా, వారి అలవాట్లూ, వారిలా నమాజు చేయడం, మగవారికి కనబడకుండా వుండడం, చదువు సంధ్యా లేని ఆడవారి మధ్య వుండడం విసుగనిపించినా భవిష్యత్తులో సౌదీలో పరిస్థితిమారి నవీకరణ జరుగుతుంది, ఆడవారి స్థితి మెరుగుపడుతుందనే ఆశతో మనుగడ కొనసాగించింది. భర్త పశ్చిమ సంస్కృతిని ఎరిగినవాడు కనుక తనకు కష్టం కాదేమో అనుకున్నది.
కార్మెన్ స్వేచ్ఛా వాతావరణంలో పెరిగింది. సౌదీ కట్టడి తాత్కాలికమనే అశతో వున్నదామె. రెండవ పాప ‘నాజియా’ పుట్టింది. మగపిల్లవాడు కలగలేదని భర్తకు ఉన్నా బయటపడలేదు. ఆమె బిడ్డల్ని మురిపెంగా పెంచింది. సౌదీ భాష, అలవాట్లు నేర్పింది.
యెస్లామ్ కార్మెన్ తో తన వ్యాపార విషయాలు చర్చించేవాడు. ఆమె సూచనలు పాటించేవాడు కూడా. మిగతా బిన్ లాడెన్ ఆడవారికంటే తన జీవితం మెరుగుగా వున్నదని, తన భర్త మిగతా అన్నదమ్ములకంటే భిన్నంగా ఉంటాడని, తను అదృష్టవంతురాలినని సంతోషించేది. శెలవులకు జెనీవా అమెరికా వెళ్ళేవాళ్ళు. భర్త వ్యాపార పనులమీద విదేశాలు వెడితే తను వెంటే వెళ్ళేది. అలాంటి స్వేచ్ఛకోసం ఎదురు చూస్తూ వుండేది.
1979లో సౌదీలో కొంత మార్పు వచ్చింది. నవీకరణ దిశలో పయనించబోతున్నదనిపించింది. కార్మెన్ భర్త ప్రోత్సాహంతో బయట నుంచి వచ్చిన డిప్లొమాట్స్, వ్యాపార ఉద్యోగ రంగ పెద్దలకు పార్టీలు ఇచ్చింది. ఆమె ఆశ ఎంతో కాలం నిలువలేదు. ఇరాన్ లో షా ను బహిష్కరణ చేసిన విప్లవం వల్ల మతాచారుల పరిపాలన వచ్చింది. వాటి ఫలితంగా సౌదీలో కూడా విప్లవ ధోరణి బయటపడగా, సౌదీ రాజులు భయపడి ఇస్లామ్ ఉక్కుపాద ధోరణి అమలు పరచి, సౌదీని మధ్యయుగాల సంస్కృతి వైపుకు మరలించారు. ఆ తిరోగమనం చూసి కార్మెన్ నిరాశ చెందింది.
కార్మెన్ భర్తలో కూడా భయాలు, మార్పులూ కనిపించసాగాయి. ఎప్పుడూ ఎదో అనారోగ్యమంటూ దేశవిదేశాల డాక్టర్లను సంప్రదిస్తుండేవాడు. దేనికో భయపడుతున్నట్లు మనో బలహీనతకు గురయ్యాడు. ఆమె మూడవసారి గర్భం ధరిస్తే తనకిష్టం లేదని అబార్షన్ చేయించాడు. జెనీవాలో కొడుకుపుడ తాడేమోనన్న ఆశ అలా భగ్నమైంది.
యెస్లామ్ వింతగా ప్రవర్తించడం సాగించేవాడు. సౌదీలో ఆమెకు కొంత స్వేచ్ఛ ఇచ్చినా, జెనీవాలో వున్నప్పుడు టిపికల్ సౌదీలా ప్రవర్తించేవాడు. పిల్లల వేషభాషలను తప్పు పట్టేవాడు.
సౌదీలో వుండే తన పిల్లలు సున్తీ అనే దురాచారానికి గురికావాలేమో అని, నల్లటి ముసుగు జీవితం వారి స్వేచ్ఛను హరిస్తుందని ఆమె భయపడసాగింది. తన పిల్లలకు ఆడ, మగ, సమానమనే ధోరణి అలవాటు చేసింది. వారిని సమానత్వం, స్వేచ్ఛ, సహనం అనే మూడు విలువలతో పెంచాలనుకున్నది. పిల్లలకు సంగీతం, నృత్యం ఇష్టమైన సౌదీలో అవి తప్పు. బయట దేశాల కెళ్ళినప్పుడు పుస్తకాలు, మ్యూజిక్ సీడీలు, మంచి బట్టలు విపరీతంగా కొని తెస్తుండేది. బిన్ లాడెన్ కుటుంబీకుల సామాను ప్రయాణాలలో చెక్ చేయడం వుండేదికాదు. పిల్లల పుట్టిన రోజులు జరపడం, క్రిస్మస్ వేడుకలు చేయడం బిన్ లాడెన్ కుటుంబంలో వింతగా భావించావారు. విదేశీ కోడలు ‘నరకానికి పోతుంది’ అన్నట్లుగా తనను చూచేవారు. మగపిల్లలు, ఆడపిల్లలు పార్టీ సందర్భంగా కలవడం వారికి ఇష్టం వుండేది కాదు.
మరో భయం కార్మెన్.ను వెంటాడసాగింది. తనకిద్దరూ ఆడపిల్లలే. దురదృష్టవశాత్తు యెస్లామ్ కి ఏమైనా జరిగి చనిపోతే తను, పిల్లలు ఒసామా బిన్ లాడెన్ వంటి వారి అధీనంలో వుండవలసిన దుస్థితి వస్తే తన పిల్లలకు ఆ జీవితం ఎంత నరకప్రాయమవుతుందో అని ఆమె భయపడింది.
1987లో శెలవులకు జెనీవా వచ్చి వారి సొంత ఇంట్లో ఉన్నారు. ఆనందంగా గడుస్తున్నది. యెస్లామ్ ప్రవర్తనలో చెప్పలేని మార్పు గమనించిందామె. అతను తాను అనుకున్నదే జరగాలనే ధోరణిలో ఉన్నాడు. ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తున్నది. ‘నాజియా’ను కనడానికి జెనీవాలో ఆసుపత్రిలో చేరి యెస్లామ్ కు ఫోన్ చేస్తుంది. ‘నేను రెండ్రోజుల్లో వస్తాను. అప్పటి దాకా ఆగలేవా’ అంటాడు. అప్పుడు నవ్వుకున్నది. కానీ ఇప్పుడు అర్థమవుతున్నది – అతనన్నీ తనకు కావలసినట్లే చేస్తున్నాడని, అతను తనను, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. శెలవులైపోయినా తనను, పిల్లలను సౌదీకి తీసుకెళ్ళే ఏర్పాట్లు చేయలేదు. బడులు తెరిచే సమయం. తాత్కాలికంగా జెనీవా ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పిస్తుంది వఫా, నాజియాలను. ఆ స్కూల్ స్వేచ్ఛా వాతావరణం, కంప్యూటర్ లాబ్స్, లాంగ్వేజ్ లాబ్స్, సైన్సు బోధన, సంగీతం, నృత్యం నటన వంటి బోధనేతర విద్యా ప్రణాళిక ఆ పిల్లలకెంతో నచ్చింది. త్వరలోనే చదువులో సామర్థ్యం చూపసాగారు. కార్మెన్ కు భయమేసింది. ఈసారి సౌదీ వెళితే పిల్లలకు అక్కడి జీవితానికి, ఇక్కడి జీవితానికి తేడా తెలుస్తుంది. వారు ఇబ్బంది పడతారేమో అని ఆందోళన చెందసాగింది.
కార్మెన్ మరల గర్భం దాలుస్తుంది. లోగడ వలనే అబార్షన్ చేయించు కోమంటాడు భర్త. అప్పటికే యెస్లామ్, యువరాజులొచ్చారు, వ్యాపారవేత్తలను కలుస్తున్నానంటూ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. అతను అబద్ధాలు చెబుతున్నాడని, పరస్త్రీలతో తిరుగుతున్నాడని కార్మెన్ తెలుసుకుంది. నిలదీసింది. బుకాయించబోయాడు. కానీ తప్పించుకోలేడు. ఈ స్థితిలో ‘కార్మెన్ బిడ్డను కని పెంచుకుంటాను, ఈసారి కిరాతకంగా చంపుకోను’ అని నిక్కచ్చిగా చెబుతుంది. భార్యలో విప్లవ ధోరణి యెస్లామ్ సహించలేదు. జనవరి 1, 1988న ఆమెను, పిల్లలను వదలి సౌదీ వెళ్ళిపోతాడు.
1994 దాకా విడాకుల కేసు స్విస్ కోర్టులో నడుస్తుంది. అతను సౌదీకి కేసు మర్చాలంటాడు. అక్కడికెళితే ఆమె, ఆమె పిల్లల గతి ఏమవుతుందో ఎరిగిన కార్మెన్ ఒప్పుకోదు. యెస్లామ్ ఆమెమీద అభియోగాలు మోపాడు. పుట్టిన మూడవ పాప ‘నూర్’కు తను తండ్రిని కాదని సవాలు చేసాడు. డి.ఎన్.ఎ. టెస్టులో అతనే తండ్రి అని తేలింది. అనంతమైన తన ఆస్తి వివరాలు దాచి, ఆమెకు అతి తక్కువ భరణం వచ్చేలా చేస్తాడు.

ఏది ఏమైనా కార్మెన్ గట్టిగా నిలబడింది. నూర్ పుట్టుక తనకు ధైర్యాన్నిచ్చిందంటుందామె. స్విస్ కోర్టు పిల్లల కట్టడి కార్మెన్ కిచ్చింది. సౌదీలో ‘బంగారు అక్వేరియంలో చేప జీవితం’ నుండి ఆమె తప్పించుకున్నది. తన బిడ్డలను తప్పించింది. తండ్రి కుటుంబం పేరు బిన్ లాడెన్ అవటాన పిల్లలు ఆ పేరుతో కొనసాగారు. తండ్రి ఎలా చేసినా అతని కుటుంబం పేరు తమ పిల్లలకుండాలనుకుంది. ఇక ఆ కుటుంబంలోని వారెవరూ కార్మెన్ తోనూ, పిల్లలతోనూ సంబంధం కొనసాగించలేదు.

2001 సెప్టెంబర్ 11న అమెరికా మీద దాడులు జరిగాయి అని వినగానే అది ఒసామా బిన్ లాడెన్ పనే అని ఆమె గట్టిగా నమ్మింది. అతడు అంతటి ఛాందసుడని ఆమె సౌదీలో చూసింది. ఇప్పుడు బిన్ లాడెన్ పేరు పిల్లలకు, కార్మెన్.కు శాపంగా ఆమె టీవీలోనూ, ప్రింట్ మీడియాలోనూ తనకు, బిన్ లాడెన్ కుటుంబానికీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటించవలసి వచ్చింది. అమెరికన్ల బాధలో తానూ పాలుపంచుకుంది. పిల్లలు ‘బిన్ లాడెన్ స్టిగ్మా’ తమను వెంటాడుతుందని భయపడుతున్నారు. వాళ్ళు అమెరికాలో చక్కగా చదువుకుంటూ జీవితాల్లో సెటిల్ అవుతున్నారు. యెస్లామ్ బిన్ లాడెన్ కుటుంబీకులు తనను, పిల్లలనూ ఇంకెన్ని ఆరోపణలకూ, బాధలకూ గురిచేస్తారోనని ఆమె శంకిస్తున్నది. అమెరికన్లు తన మనోగతాన్ని, బాధను అర్థం చేసుకుంటున్నారంటుంది కార్మెన్. తనకు అండగా నిలబడినవారందరికీ తన పుస్తకం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నది. కార్మెన్ సౌదీలో కొన్నేళ్ళు నివసించింది. వారి అంతర్గత విషయాలు బాగా ఆకళింపు చేసుకున్నది. వారి వెనుకబడిన తనం, వారే నిజమైన ఇస్లామీయులు అనే మూఢనమ్మకం, ధనవంతులమనే అహం, విదేశీయులంటే వారికున్న చిన్నచూపు, సౌదీ రాజులు ఇస్లాం వ్యాప్తికి వివిధ దేశాలలో దండిగా డబ్బులు ఖర్చు చేయడం, వారి క్రూరత్వం, సౌదీ స్త్రీల అధోగతి కార్మెన్ గమనించిన సత్యాలు

Saturday, March 7, 2009

ఎడిసన్ మూఢనమ్మకాల ఊబిలో


ఎడిసన్
ఎడిసన్ కనుగొన్న విషయాలతో ప్రపంచం ఎంతో సంతోషించింది. బల్బు మొదలు ఫోనోగ్రాఫ్ వరకూ అతడు వెయ్యికి పైగా ఉపయుక్తమైనవి అందించాడు.
థామస్ అల్వా ఎడిసన్ (1847-1931) స్వేచ్ఛాపరుడుగా జీవితం ఆరంభించాడు. థామస్ పెయిన్ రచనలతో ప్రభావితుడై, నమ్మకాలు లేని సైంటిస్టుగా లోకానికి సేవచేశాడు. ఎడిసన్ భౌతికవాదిగా క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యాడు.
ఎడిసన్ కనుగొన్న విశేషాలతో అతడికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మానవాళికి సైన్స్ ద్వారా ఎనలేని సేవలు అందించాడు. అది తొలి అధ్యాయం. సైంటిఫిక్ పద్ధతిలో ఉన్న గొప్పతనం అది.
అయితే ఎడిసన్ అలా కొనసాగలేదు. మధ్యలో దారితప్పాడు. జీవితం చివరి దశాబ్దాలలో ఎడిసన్ ఆలోచనలు వక్రీకరించాయి. వృద్ధాప్య లక్షణం అయితే కావచ్చు. జీవితానంతరం ఏదో ఉందనే విశ్వాసంతో, మరణించినవారితో మాట్లాడడం సాధ్యమని భ్రమపడ్డాడు. అందుకుగాను ఒక విద్యుత్ పరికరం తయారు చేసే ప్రయత్నం చేశాడు! సైంటిఫిక్ అమెరికన్ పత్రిక వెల్లడించిన ఈ వార్త, చాలామందిని ఆశ్చర్యపరిచింది. చనిపోయిన తరువాత వ్యక్తికి చెందిన జ్ఞాపకాలు, తెలివితేటలు, జ్ఞానం ఉంటాయని, కనుక అలాంటివారితో ప్రసారం సాగించవచ్చునని నమ్మాడు. అందుకు సున్నిత పరికరాన్ని కనుగొనాలని తలపెట్టాడు. చనిపోయినవారితో మాట్లాడి రికార్డు చేసే ప్రయత్నం ఫలిస్తుందన్నాడు. దీనికిగాను ఎలాంటి పరిశీలన, పరిశోధన చేశాడో వివరాలు తెలియదు. కాని అలాంటి ప్రయత్నంపై చాలాకాలం వృధా చేసినట్లు తెలుస్తున్నది. ఫలితం మాత్రం రాలేదు. లోపం ఎక్కడుంది? గుడ్డిగా నమ్మడంలో ఉంది. శాస్త్రీయ పద్ధతి విడనాడి, నమ్మకం ఆధారంగా సాగితే అదే గొడవ, సరిగా, ఎడిసన్ ఒక మలుపులో అలాంటి తప్పటడుగు వేశాడు.
ఎడిసన్ పై దుమ్మెత్తిపోసిన క్రైస్తవులు, హఠాత్తుగా ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు.
ఎడిసన్ క్రమంగా ఆత్మ, దైవం మత్తులోపడి, క్రైస్తవ మతం చాలా గొప్పదని ప్రచారం చేశాడు. మానవులలో సూక్ష్మ కణాలు ఆకాశంలో ఇతర గ్రహాల నుండి వచ్చాయన్నాడు. వ్యక్తి చనిపోతే, అవి మరో చోటకు పోతాయని కూడా నమ్మాడు. ఎడిసన్ చివరి దశలో థియోసఫీ (దివ్యజ్ఞాన సమాజం) ప్రభావంలోపడి, బ్లావ టీస్కీ రచనలు చదివి, సమావేశాలకు వెళ్ళి, వారి నుండి డిప్లొమా స్వీకరించాడు. మనోబలంతో వస్తువుల్ని కదిలించ వచ్చని ఎడిసన్ నమ్మాడు. అలాంటి ప్రయత్నాలు చేసి, ఫలించక వదిలేశాడు. టెలిపతి రుజువు చేయడానికి విద్యుత్ పరికరాలు వాడి, పనిచేయవని తెలుసుకుని, నిరుత్సాహపడ్డాడు. బెర్డ్ హోర్డ్ రీస్ (1841-1926) అనే సమకాలీన మెజీషియన్ చేసిన పనులు చూసి, అద్భుతంగా భావించిన ఎడిసన్, ఇంద్రియాతీత శక్తులకు అదే నిదర్శనం అన్నాడు. మెజీషియన్లు చాలా సందర్బాలలో సైంటిస్టులను బోల్తాకొట్టిస్తారనడానికి అదే నిదర్శనం. రీస్ ఎలా చేస్తాడో తరువాత వివరణ వస్తే, ఎడిసన్ జుట్టు పీక్కున్నాడు... ఎడిసన్ తన ఇంద్రియాతీత శక్తిపై నమ్మకంతో కొన్ని జోస్యాలు చెప్పాడు. అవన్నీ విఫలమయ్యాయి. అయితే ఎడిసన్ శాస్త్రజ్ఞుడుగా తొలి దశలో ఉన్నందున, అతడి మాటల ఆధారంగా సైన్స్ కథలు చాలా వచ్చాయి.
సుప్రసిద్ధ ఫోర్స్ పత్రిక ఎడిటర్ బి.సి.ఫోర్బ్స్ ఒకసారి న్యూయార్క్ లో ఎడిసన్ వద్దకు ఇంటర్వ్యుకు వెళ్ళాడు. అయితే కొత్తగా చెప్పడానికి ఏమీలేక మృతుల ఆత్మలతో మాట్లాడ వచ్చనే కథ అల్లానని ఎడిసన్ చెప్పాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక 1926 అక్టోబర్ 15న ఇంటర్వ్యూ విషయం వచ్చింది. ఇటీవల వెలువడిన ఎడిసన్ జీవిత చరిత్రలలో ఇలాంటి సత్యాలు బయటపడ్డాయి. అయితే ఎడిసన్ నిజంగా ఆత్మలతో మాట్లాడే విషయం నమ్మలేదా అంటే నమ్మాడు. తన డైరీలలో అలా రాసుకున్నాడు. సైంటిస్టులు లోకానికి ఉపయోగపడడం ఎంత గొప్పదనమో, మూఢనమ్మకాల ఊబిలో కూరుకపోవడం అంత ద్రోహం కూడా.

Wednesday, March 4, 2009

లెనిన్ మెదడులో ఏముంది?








సోవియెట్ అధినేత, ప్రపంచ కమ్యూనిస్టు అగ్రనాయకుడు లెనిన్ 1924లో చనిపోయాడు. ఆయన శరీరాన్ని కొన్నాళ్ళపాటు తయలంతో నిక్షిప్తం చేసి ప్రదర్శనకు పెట్టారు. అదొక కమ్యూనిస్టు యాత్రా స్థలంగా మారింది. ఆయన తర్వాత కమ్యూనిస్టు నాయకుడైన స్టాలిన్ కొన్నాళ్ళతర్వాత లెనిన్ మెదడులో కొంత భాగాన్ని శాస్త్రీయ పరిశోధనకు గురిచేశారు. జర్మనీలో ఉన్న నరాల సంబంధ సైన్ టిస్టు ఆస్కార్ ఓట్ (Oskar vogt) ద్వారా పరిశీలింపజేశారు. అతడి సహాయంగా మాస్కో నుండి ఇద్దరు వైద్యులను పంపారు. లెనిన్ మెదడు అధ్యయన నిమిత్తం నిధులను సమకూర్చారు. మెదడు పరిశీలనా సంస్థను పెట్టారు. అయితే ఆ సంస్థ అధ్యక్షుడిగా ఆస్కార్ ఓట్ ను తటపటాయిస్తూనే నియమించారు. మెదడు పరిశీలన అనంతరం నిజం చెప్పేస్తే కమ్యూనిస్టులకు చిక్కు వస్తుందేమోనని భయపడ్డారు. లెనిన్ మెదడును పోలిన మరొక వ్యక్తి మెదడును పరిశీలించినప్పుడు మానసికంగా కుంచించుకు పోయిన ధోరణి వ్యక్తమయిందని జర్మనీలో నిపుణులు అప్పటికే వెళ్ళడించారు. అలాంటిదే లెనిన్ గురించిది కూడా చెబితే చిక్కు వస్తుందనుకున్నారు. ఈ లోగా జర్మన్ సైన్ టిస్ట్ ఆస్కార్ ఓట్ పదవిని కోల్పోయాడు. హిట్లర్ రాజ్యంలో అతడికి అనుకూలత లభించలేదు. ఆ తర్వాత మెదడు పరిశీలనా సంస్థకు రష్యా సైంటిస్టును పెట్టి లెనిన్ మెదడును పరిశీలించమన్నారు. కమ్యూనిస్టు పార్టీ ప్రకటన ప్రకారం లెనిన్ చివరిలో జబ్బు పడినా మెదడు మాత్రం బాగా పనిచేసిందని నివేధిక సమర్పించారు. కానీ పూర్తి నివేదికను శాస్త్రీయంగా పరిశీలించి భయటపెట్టలేదు. పురావస్తు శాఖలో నేరాల విభాగంలో ఆ నివేధికను దాచిపెట్టారు. అలా ఎందుకు చేశారో ఇప్పటికీ తెలియదు. లెనిన్ చేసిన నేరాలు దృష్టిలో పెట్టుకుని అలా చేసిఉండవచ్చునేమో అనుకున్నారు. మొత్తం మీద ఈ విషయాలన్నీ ఇటీవల పరిశోధన చేసి 2008లో 164 పేజీల గ్రంథాన్ని అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో హూవర్ సంస్థ ప్రచురించింది. దీని పేరు లెనిన్స్ బ్రెయిన్. (Lenin’s Brain and other tales from the secret soviet archives by paul R. Gregory).

Monday, March 2, 2009

Just released






Forced Into Faith: How Religion Abuses Children's Rights (Paperback)by Innaiah Narisetti (Author
Published by Prometheus Books, USA
పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు వారి కులాన్ని, మతాన్ని ఎలాంటి అరమరికలు లేకుండా సందేహించకుండా, అదేదో వంశ పార్యంపర్య హక్కయినట్లు పిల్లలకు ముద్రవేస్తారు. అన్ని మతాలు కూడా చిన్నప్పటినుండే పిల్లల్ని తమ మతంలోకి మలచడానికి తగిన పథకాలు పవిత్రగ్రంథాల ద్వారా, పురోహితుల ద్వారా రూపొందించాయి. కనుక హిందువుల పిల్లలు, హిందువులైతే. ముస్లిం పిల్లలు ముస్లిములు గాను, క్రైస్తవ పిల్లలు క్రైస్తవులుగాను ముద్ర వేస్తున్నారు. ఈ విషయంలో పిల్లలకు ఏమాత్రం ప్రమేయం లేదు. చిన్నప్పటినుండి ఆ విధంగా అలవాటై, అదొక ఆచారంగా, మూడనమ్మకంగా మనసులో స్థిరపడిపోతున్నది.

పిల్లలకు పుట్టగానే ఓటు హక్కు ఇవ్వరు. అలాగే పుట్టగానే పెళ్ళిళ్లు చేయరు. ఎందుకని? యుక్తవయస్సు వచ్చేవరకు విషయాలు తెలుసుకుని తరువాత సంసారం చేయటం ఎలాగో అర్థమయిన తర్వాత పెళ్ళి చేయాలి. కనుకనే బాల్య వివాహాలు నిషేదించారు. అలాగే ఓటు హక్కు కూడా యుక్తవయస్సు వచ్చిన తరువాతనే ఇస్తారు. అదే విధంగా కులాన్ని, మతాన్ని కూడా పిల్లలకు అంటగట్టకుండా ఆగాలి. అవి కేవలం మూఢాచారాలు, నమ్మకాలు గనుక వాటిని పిల్లలు అవగాహన చేసుకోవాలి. యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఇష్టం ఉంటే స్వీకరిస్తారు. లేకుంటే వదిలేస్తారు. ఇది ఒక పట్టాన సులభమైన విషయమేమీ కాదు. కానీ దీనిని పాటించడం అవసరం. చిన్నప్పుడే మూఢనమ్మకం మతరూపేణా స్థిరపడిపోతే, పిల్లలు తర్వాత సైన్స్, సాంకేతికం చదువుకున్నా అంతవరకే హేతుబద్దంగా శాస్త్రీయంగా ఉంటున్నారు తప్ప మిగిలిన రంగాల్లో శాస్త్రీయ ఆలోచనను చేయడం లేదు. ఇది ప్రధాన దోషంగా వస్తున్నది. ఇందుకు ఉదాహరణగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ను పేర్కొనవచ్చు. ఆయన వృత్తి రీత్యా సాంకేతిక నిపుణుడైనా, మిగిలిన విషయాల్లో చిన్నప్పటి నుండి వచ్చిన మూడనమ్మకాల్ని పాటించి, చివరకు సత్యసాయిబాబా పాదాలచెంత కూర్చునే స్థాయికి పోయాడు.

ఇలాంటి విషయాలను అధునాతనంగా శాస్త్రీయంగా చర్చించి మార్గాంతరాలు చూపిన గ్రంథం (Forced in to faith).

నార్ల సాహిత్య యాత్రలో ఇంత చైతన్యమా

82 ఏళ్ళ వయస్సులో సుప్రసిద్ధ రచయిత కాశీపట్నం రామారావు పాల్గొన్న నార్ల సాహిత్య యాత్ర గమనార్హం. కథానిలయం నుండి కదలి శ్రీకాకుళం సభలో పాల్గొన్న రామారావు అందరికీ స్ఫూర్తి కలిగించారు.
కీ.శే. నార్ల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆయన మెట్టిన కవుతరం (కృష్ణా జిల్లా) మొదట కథానిలయం. (శ్రీకాకుళంలో కాశీపట్నం రామారావు సాహిత్య వేదిక) వరకూ సాగిన సాహిత్య యాత్ర చాలామందికి కను విప్పు కలిగించింది. హిందీ అకాడమీ అధ్యక్షులు, బహుగ్రంథరచయిత డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన సాహిత్య యాత్ర పార్టీలకు అతీతంగా, సమాజాన్ని స్పందింపజేసింది.
ఫిబ్రవరి 21న (2009) మొదలైన నార్ల సాహిత్య యాత్ర 24తో శ్రీకాకుళంలో ముగిసి, భవిష్యత్తు ఉద్యమానికి పిలుపు యిచ్చింది.
ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికల సంపాదకుడుగా తెలుగు సాహిత్య చరిత్రలో మలుపులు తిప్పిన నార్లకు కేవలం జోహార్లు అర్పించడానికి లక్ష్మీ ప్రసాద్ యీ యాత్రను ఉద్దేశించలేదు. నానాటికీ జనంలో చిక్కిపోతున్న తెలుగు భాషకు మళ్ళీ జీవం పోయాలని సత్సంకల్పంతో మొదలైన యాత్ర యిది. తెలుగు భాష నుడికారం, జీవ చైతన్యం తన రచనలలో ఒలికించిన నార్లను మార్గదర్శకంగా ఎన్నుకున్నారు. తెలుగు భాష బ్రతికి బట్టకట్టాలంటే నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు పాఠ్యప్రణాళికలు, పుస్తకాలు రావాలని నార్ల 1956 నుండీ సూచించారు. ఆధునిక విజ్ఞాన విస్తార రంగాన్ని యధేచ్ఛగా, ఛాందసాలు లేకుండా తెలుగులోకి తెచ్చుకోవాలన్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ప్రభుత్వానికీ, ప్రజలకూ ఒక దిశ చూపడాని వై. లక్ష్మీ ప్రసాద్ పూనుకున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. ఎటుచూచినా 1వ తరగతి నుండీ ఇంగ్లీషు బోధనా భాషగా ఆకర్షిస్తున్నది. ప్రభుత్వం అనుమతిస్తున్నది. తెలుగు రాష్ట్రంలో తెలుగు తెలియకుండానే తెలుగు పిల్లలు స్కూలు విద్య పూర్తి చేస్తున్నారు. అది భవిష్యత్తులో భయానక పరిస్థితికి దారి తీసే అవకాశం వుంది. అందుకే యీ సాహిత్య చైతన్య యాత్ర తలపెట్టారు.
ముందుగా అన్ని తరగతులలో కనీసం ఒక్క సబ్జక్టే అయినా తెలుగు వుండాలన్నారు. వీలైతే 1 నుండి 5 వరకు తెలుగులోనే భోధన వుండాలన్నారు.
దీనికి యువకులు, విద్యార్థులు స్పందించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం విద్యార్థులు, జర్నలిజం విద్యార్థలు యాత్రలో పాల్గొన్నారు. విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, తుని, పాయకారావుపేట, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో వూరేగింపులు, సభలు జరిగాయి.
హైకోర్టు న్యాయమూర్తులు రఘురాం, భాను ప్రసాద్ గారలు వూరేగింపులో పాల్గొని ప్రసంగించారు. మాజీ గవర్నర్, రచయిత రమాదేవి, మంత్రి మండలి బుద్ధప్రసాద్, సినారె, ఎ.బి.కె. ప్రసాద్, వెంకయ్యనాయుడు, ఎమెస్కో అధిపతి విజయకుమార్, నడుస్తున్న చరిత్ర సంపాదకులు, జర్నలిజం శాఖాధిపతి బాబీవర్థన్ ఎక్కడికక్కడ వుత్తేజాన్ని అందించారు. ప్రతి చోటా బాబీ వర్థన్ అనుచరులు అనూహ్యంగా తోడ్పడ్డారు.
సాహిత్య ప్రియుడుగా మండలి బుద్ధ ప్రసాద్ జనంలో కలిసిపోయి సాహిత్య యాత్రను ప్రోత్సహించారు. నార్ల వెంకటేశ్వరరావు పెద్ద కుమార్తె శారద యాత్ర చివరి వరకూ పాల్గొనడం విశేషం. శాసన మండలి సభ్యులు శేషారెడ్డి, రత్నకుమారి పాల్గొని చేయూత నిచ్చారు.
ఈ యాత్ర వెనుక వై. లక్ష్మీ ప్రసాద్ కు సహాయంగా అరమరికలు లేకుండా తోడ్పడిన గజల్ శ్రీనివాస్ పాత్ర గణనీయమైనది. దీనికి తోడు తన గజల్ పాటలతో అదనపు ఆకర్షణ కలిగించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు యధాశక్తి యాత్రకు ప్రేరణ కల్పించారు.
సాహిత్య యాత్రలో నార్ల రచనలు, ఆయన భావాల ప్రాచుర్యం, లభ్యమవుతున్న సంపూర్ణ సంపుటాల వివరాలు నేను అందించాను.
యాత్ర తుది సమావేశంలో తమ స్పందన వినిపించిన విద్యార్థుల గళం యిందులో పరాకాష్ఠ. ఎక్కడికక్కడ స్థానిక అధికారులు కూడా యాత్రకు తమ అండ చూపారు.
పత్రికల వారు తమ వృత్తి ధర్మంగా కాక, నార్ల రచనల ప్రేరణతోనూ, సాహిత్యం పై ప్రేమతోనూ యీ యాత్రలో పాల్గొనడం విశేషం. అనకాపల్లిలో ప్రెస్ క్లబ్ వారే యాత్ర నిర్వహించి, క్లబ్ అనే మాటను పాత్రికేయుల కేంద్రంగా ప్రకటించడం పేర్కొనదగింది.
పరభాషను నేర్చుకుంటూ, పరభాషా ద్వేషం వదిలేసి, సొంత భాషను పెంపొందించాలని, పోషించాలని క్షీణదశకు రాకుండా చూడాలనేది యీ యాత్ర సందేశం.
శ్రీకాకుళం వరకూ ప్రతిచోటా నేను పరామర్శిస్తూ, ఇంగ్లీషు మీడియం పాఠశాలలు, సంస్థలు ఎన్ని వున్నాయి? అని అడిగాను. అందుకు జవాబుగా తెలుగు మీడియంలో ఎవరు చదువుతున్నారు? ఎన్ని బడులు సక్రమంగా నడుస్తున్నాయి? అని అడగండి సార్ అన్నారు. అదీ పరిస్థితి. ఇంగ్లీషు మీడియం సహజం అయిపోయింది. తెలుగు మీడియం విడ్డూరంగా మారింది.
దీనికి కారణం ఎవరనుకున్నారు? తెలుగు అకాడమి, తెలుగు యూనివర్సిటీ, అధికార భాషా సంఘం, సిలబస్ కమిటీలు. తెలుగులో విజ్ఞాన సాంకేతిక, బిజినెస్ పాలన, వృత్తిపరమైన సిలబస్, నిఘంటువులు, శబ్దకోశాలు, విజ్ఞాన సర్వస్వాలు, అందించకపోవడమే పెద్ద లోపం. జ్యోతిష్యం, వాస్తు వంటి మూఢ నమ్మకాల ఛాందసాలు ప్రచారంలో పెట్టారు. గ్రాంధిక భాషలో తెలుగు స్తంభించి పోతున్న దశలో, వాడుక భాష వచ్చి, ప్రజాస్వామిక రీతుల్ని ప్రవేశపెట్టింది. నేడు ఛాందసుల చేతుల్లో తెలుగు వికసించకుండా వున్నది. వైజ్ఞానిక, సాంకేతిక, న్యాయ, పాలన, వాణిజ్య, వ్యవసాయ రంగాలలో తెలుగు విస్తరించాలని ఏ స్థాయిలోనైనా, ఏ విషయాన్నైనా తెలుగులో చదువుకోగలమనే అవకాశం కల్పిస్తే, తెలుగు బట్టకట్టి, తలెత్తుకు తిరుగుతుంది.