Monday, September 28, 2009

ఆంధ్రలో సామాజిక విప్లవ బీజాలు -పునర్వికాసం

స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా సాగుతుండగా, మరో వైపు ఆంధ్రలో సామాజిక విప్లవ బీజాలు పడ్డాయి. 1940 ప్రాంతాలలో విజృంభించిన యీ పునర్వికాసం కొందరు యువతను బాగా ఆకట్టుకున్నది. సినిమా, కళలు, సాహిత్యం, వివాహం, చదువు, పత్రికల రంగాలలో యీ పునర్వికాసం తొంగిచూచింది.

అటు బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు నుండి సామాజిక సంస్కరణ వాసనలు వచ్చి ప్రభావితం చేశాయి. ఆంధ్రకు ఎం.ఎన్. రాయ్ ను తెచ్చిన అబ్బూరి రామకృష్ణారావు, ములుకుట్ల వెంకటశాస్త్రి, వెన్నెలకంటి రాఘవయ్య అనుకోకుండా సాంఘిక విప్లవ బీజాలు నాటారు. కాంగ్రెస్ పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. అది మెచ్చిన వారు, పునర్వికాసానికి దోహదం చేశారు. ఆనాడు వారిది ఎదురీత. అయినా వారు నాటిన బీజాలు మానసిక వికాసానికి, భావ విప్లవానికి దారి తీశాయి.


బ్రిటిష్ వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండోప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, నాజీ నియంతలు, మన దేశంలో బలపడకుండా జపాన్ తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు. గుర్రం జాషువా వంటి వారికి ఆ వాదన నచ్చగా, యధాశక్తి అనుసరించారు. మరొక పక్క నాస్తిక వాదంతో గోరా, త్రిపురనేని రామస్వామి పురాణాల తిరోగమనాన్ని వ్యతిరేకిస్తుండగా స్త్రీ స్వేచ్ఛకై చలం సాహిత్య పోరాటం చేశారు. సాంఘిక ఉద్యమం తలపెట్టారు.


ఎం.ఎన్. రాయ్ శాస్త్రీయ ధోరణి, అధ్యయన తరగతులు, సాహిత్యం చాలా మందిని ఆకట్టుకున్నాయి. సినిమా రంగంలో గూడ వల్లి రాంబ్రహ్మం సంస్కరణ చిత్రాలు తీసి కొత్త వెలుగు చూపారు. ప్రజా మిత్ర పత్రిక ద్వారా ఎవరూ వెయ్యని ఎం.ఎన్. రాయ్ వ్యాసాలు, ఆయన అనుచరుల సాహిత్యాన్ని జనానికి అందించి, కళ్ళు తెరిపించారు.


ఆనాడు అదంతా ఎదురీత. స్వాతంత్ర వుద్యమ ప్రవాహం. విపరీతంగా వుండగా పునర్వికాసం సాహసోపేతంగా సేవలు అందించింది. ఎం.ఎన్. రాయ్ ఆంధ్ర పర్యటనలు కొందరు మేధావులను పురికొల్పి, ఉద్యమానికి ఉద్యుక్తుల్ని గావించింది.
అబ్బూరి రామకృష్ణారావు స్జేజి నాటక రంగంలో కొత్త దారులు చూపారు. పి.హెచ్. గుప్తా విశాఖ నుండి రామాయణ విమర్శ అందించారు.
గుంటూరులో బండారు వందనం దళితుల మధ్య పునర్వికాసానికి నాంది పలికారు. కార్మిక రంగంలో పెమ్మరాజు వెంకటరావు నెల్లి మర్ల జూట్ మిల్లు కార్మికులతో ఆరంభించి, కార్మిక పత్రిక నడిపి, చక్కని పునాదులు ఏర్పరచారు.


ఉపాధ్యాయుడుగా ఎలవర్తి రోశయ్య అనేక మంది విద్యార్థులకు అటు భావ విప్లవ సాహిత్యాన్ని పరిచయం చేసి, చదివించారు. విద్యార్థి లోకంలో సంచలనం కలిగింది. పాముల పాటి కృష్ణచౌదరి రాడికల్ విద్యార్థి పత్రిక నడిపారు.


గుత్తి కొండ నరహరి తన వుపన్యాసాలతో వ్యాసాలతో వుర్రూత లూగించారు. బండి బుచ్చయ్య నడిపిన ములుకోల అందుకు వూతంయిచ్చింది.
సాహిత్య ప్రచురణలు ఏర్పరచి కోగంటి రాధా కృష్ణ మూర్తి తెనాలి నుండి నలంధా ప్రచురణలు, ప్రజా సాహిత్య గ్రంథాలు వెలికి తెచ్చారు.
ఆవుల గోపాలకృష్ణమూర్తి వ్యాసోపన్యాసకుడుగా ఎం.ఎన్. రాయ్ భావ ప్రచారం చేసి, లౌకిక వివాహాలు జరిపాడు. కవులను, గాయకులను, చిత్ర కారులను, రచయితలను కూడ గట్టి, ఆవుల (ఎజికె అనే వారు) అధ్యయన తరగతులు నిర్వహించారు. సాహిత్యంలో ఔచిత్యం వుండాలన్నారు. త్రిపురనేని రామస్వామి సాహిత్యాన్ని, ఏటుకూరి వెంకట నరసయ్య రచనలను బాగా విస్తృతం గా జనంలోకి తీసుకెళ్ళారు.


తెనాలి కేంద్రంగా రాడికల్, రాడికల్ హ్యూమనిస్ట్, సమీక్ష, జ్యోతి, రేరాణి, సినిమా, అభిసారిక పత్రికలు వివిధ రంగాలలో శాస్త్రీయ ఆలోచనకు దోహదం చేశాయి. ఆలపాటి రవీంద్రనాధ్ జ్యోతి పత్రిక యువ రచయితలకు ఆయువు పట్టుగా, శాస్త్రీయ చింతనకు దీటుగా తోడ్పడింది. ఆనాడే కుటుంబనియంత్రణ కావాలన్న పత్రిక జ్యోతి గొప్ప మలుపు తిప్పింది.


జి.వి. కృష్ణారావు కళా సాహితీ రంగాలలో మానవ వాద ధోరణిలో మార్క్సిస్టు పంధాను విమర్శిస్తూ, కావ్య జగత్తు రాశారు. కీలు బొమ్మలు, జఘనసుందరి, కళాపూర్ణోదయ విమర్శ, పాపి కొండలు వెలువరించారు.

రాజకీయ రంగంలో కాంగ్రెస్ వ్యవస్తనూ కమ్యూనిస్టు పద్ధతుల్ని కాదని, చిన్న కథలలో రాజకీయాల్ని రాసిన గోపీ చంద్ పెద్ద సంచలనం సృష్టించారు. ఎం.ఎన్. రాయ్ అనుచరుడుగా చక్కని ఆలోచనా పూరిత రచనలు చేశారు. గోకుల్ చంద్, పి.వి. సుబ్బారావు, కోగంటి సుబ్రహ్మణ్యం ఆ కోవలోని వారే. జాస్తి జగన్నాధం విద్యార్థి దశ నుండి ఎం.ఎన్. రాయ్ రచనల్ని కొన్ని తెలుగులోకి అందించారు. చరిత్రలో శాస్త్రీయ పంధా ఎలా వుండాలో చూపారు భట్టి ప్రోలు హనుమంతరావు, కల్లూరి బసవేశ్వరరావు. ఇది ఎం.ఎన్. రాయ్ వేసిన బాట.
నాటకం, కథలు, సినీరంగంలో రాయ్ అనుచరుడుగా భావ విప్లవానికి బీజాలు వేసిన డి.వి. నరసరాజు పేర్కొన దగిన వ్యక్తి. మల్లాది రామమూర్తి మానవ వాదిగా తీవ్ర కృషి చేయగా, మల్లాది సుబ్బమ్మ ఆ కృషిని కొనసాగించింది.


రావిపూడి వెంకటాద్రి హేతువాద మానవ వాద వుద్యమాన్ని నిలబెట్టడంలో విపరీత సాహిత్య, పత్రిక, వ్యాస రంగాలను వినియోగించారు. అధ్యయన తరగతులు నిర్వహించారు.

ఎన్.వి. బ్రహ్మం మత ఛాందసాలను, బైబిల్ బండారం ద్వారా ఎండగట్టారు. సి.హెచ్. రాజారెడ్డి, కొల్లి శివరామరెడ్డి, ఎం.వి. రమణయ్య, అచ్యుత రామ్, పరమయ్య మానవ వికాస ఉద్యమ రంగంలో అనేక పరిమళాలు వెదజల్లారు. ఎ.ఎస్. అవధాని ఆ కోవలోని వారే. అలాగే ఎ.వి. మోహన్ కూడా.


తెలుగులోకి మానవ వాద సాహిత్యం అనువాదాలరూపేణా, సొంత రచనల ద్వారా రావడానికి తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్శిటి సహకరించాయి. (ఎన్. ఇన్నయ్య అనువాదాన్ని, రచనల్ని వారు వెలువరించారు).

పత్రికా రంగంలో ఎ.ఎల్. నరసింహారావు, ఎన్.కె. ఆచార్య వుద్యమాన్ని పోషించారు. ఆవుల సాంబశివరావు వివిధ పదవులు సాగిస్తూనే, మానవ వాదిగా సాహిత్యాన్ని సమాజంలోకి తెచ్చారు.

ఎం.ఎన్. రాయ్ మానవ వాద ప్రభావంతో నార్ల వెంకటేశ్వరరావు ఇంగ్లీషులో గీతపై విమర్శ గ్రంథం తెచ్చారు.
నార్ల నాటికలు, నాటకాలు, విమర్శలు, పద్యాలు బాగా పునర్వికాస మానవ వాద ధోరణి ప్రబలించాయి. నరకంలో హరిశ్చంద్ర నాటకాన్ని ఎన్. ఇన్నయ్యకు అంకితం చేశారు. అలాగే తన యితర రచనల్ని మానవ వాదులకు అంకితం చేశారు.
ఎం.ఎన్. రాయ్ మానవ వాద ధోరణి శ్లాఘిస్తూ సంజీవ దేవ్ రాశారు. లలిత కళారంగంలో కొత్త పోకడలు చూపారు. అతీంద్రియ శక్తుల ఆలోచనలో శాస్త్రీయత, లేదన్నారు. పాలగుమ్మి పద్మరాజు పుంఖాను పుంఖంగా మానవ వాద రచనలు చేసి రెండో అశోకుడి ముణ్ణాళ్ళ పాలన రచనతో పార్టీ రహిత ప్రజాస్వామ్యం చూపాడు.


కొండ వీటి వెంకట కవి, ఆలూరి బైరాగి, కవిరావు, తెలంగాణాలో ఎం. నారాయణ వై. రాఘవయ్య, ఆలంఖుందుమీరి యిలా ఎందరో యధాశక్తి పునర్వికాసానికి తోడ్పడ్డారు. విజయనగరంలో తాతా దేవకీ నందన్ మొదలు ఎందరో వుద్యమానికి ఉపకరించారు.
నేడు సమాజంలో శాస్త్రీయ ధోరణి సన్నగిల్లి, మత మౌఢ్య మోతాదు పెరిగింది. విద్యార్ధులలో వైజ్ఞానిక దృక్పధం పోతున్నది. ఎందుకని?
నేటి ఆవశ్యకత పునర్వికాసం, వైజ్ఞానిక పంధా, మానవ విలువ, అదెలా సాధ్యం? ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
పునర్వికాసం అంటే మానవ విలువలు పాటించడం చరిత్రను వైజ్ఞానికంగా రాసుకోవడం. మానవులను కించపరచే కులం, దానికి మూల మైన మతాన్ని దూరంపెట్టడం, శాస్త్రీయ పాఠ్య ప్రణాళికను ప్రాధమిక దశ నుండే అమలు పర్చాలి. ఇది కష్ట సాధ్యం అయినా అవస

మానవ సేవలో వైద్య రంగం


human anatomy as discovered by Vesalius made things easy for medical treatment


William Harvey made turning point through finding of circulation of bloodWilhelm Roentgen who revolutionised through x-ray discovery


Alexander Fleming who discovered anasthesia to save surgical treatmenthumans are gradually revealed through jenome and DNAanatomy started medical revolution
శాస్త్రీయ పరిసొధనలు చేసి ప్రపంచానికి తెలియజేసి ఉత్తమ సేవ చేసిన, చేస్తున్న రంగం వైద్యం.
ఇందులో మలుపులు తిప్పిన పరిశీలనలు వున్నాయి.
1. అనాటమీ

మానవ శరీరంలో వివరాలు బాగాతెలిస్తే వైద్యం చేయడం అనుకూలమౌతుంది .ఆందుకు ప్రధమం గా ఉపయోగపడినది శరీరవిభాగాల శాస్త్రం.ముందు జంతువులను తురువాత మనుషుల శవాలను కోసి అనాతమి వివరాలు గ్రహించారు. అది నిరంతరంగా సాగుతున్న పరిషోధన. ఎందరో మహానుభావులు వున్నా వెసాలియస్స్ కు తొలి ధన్యవాదాలు చెప్పవచ్చు .2.రక్త ప్రసరణ గురుంచి గ్రహించడంలో విలియం హార్వె ను ప్రధము
దు గా చెప్పాలి.ఇతరులు వున్నా మౌలికంగా హార్వె కీలక పాత్ర వహించాడు. వైద్యం బాగా ముందుకు సాగడానికి ఇది పెద్ద మలుపు అయింది.


3 లెవిన్ హూక్ అనె వ్యక్తి తొలుత సూక్ష్మ జీవులున్నాయని లోకానికి చెప్పినతరువాత వైద్యవిధానంలో తిరుగులేని మార్పులు వచాయి.
4. ఎడ్వర్ద్ జెన్నర్ శాస్త్రగ్నుడు టీకాల పధతి చూపడంతో చిరకాలం గావస్తున్న మశూచి వంతి మారణ రోగాలకు అడ్డుకట్ట పదింది .ఆ రంగం వుత్తరోత్తరా చాలా మార్పులకు లోనై మానవాళి ని కాపాడుతున్నది .5.క్రా ఫర్డ్ లాంగ్ వలన అనస్తీషియా కనుగొనగా శస్త్ర చికిచ్చ తేలిక అయి, బాధ లేకుండా చేయడం కుదిరింది .ఆందులో నేడు చాలా వుత్తమ మార్గాలు ప్రవేస పెట్టారు .
6. సైన్శ్ ప్రగతిలో గొప్ప విప్లవం తెచ్చిన ఎక్ష్ రె , వైద్యానికి కీలక మలుపులు తిప్పుతున్నది .రోట్ గెన్ ప్రారంబించిన ఈ విధానం లో క్రమీణా హాని, దోషాలు తొలగిస్తూ పోతున్నారు .

7.రొస్ హారిసన్ వలన టిస్స్యు కల్చర్ పరిసీలన వైరస్ రంగాన్ని ఎప్పటి కప్పుడు గ్రహించడానికి రోగ నిర్ధారణకు ఉపకరిస్తున్నది.
8.నికొలై అనిచ్ కొవ్ వలన రక్తంలో కొలిస్త్రాల్ గ్రహించడం మొదలైంది .ముఖ్యంగా గుండె జబ్బులకు, తదితర రుగ్మతలకు ఈ రంగం సేవ చేస్తున్నది .9.అలెక్షాండర్ ఫ్లెమింగ్ వలన యాంటి బయటిక్స్ రాగా నేడది రోగాల పట్ల అనూహ్య శరణ్యం గా మారింది.
10 ఇక జీవన రంగాన్ని సమూలంగా అవగాన చెసుకోడానికి ది ఎన్ ఎ కనుగొనడం ప్రధాన కారణమైంది .క్రమేణా జన్యు సాస్త్రానికి దారి తీసింది .
వివరాలకు పోతే చాలా ఆసక్తి కరమైన సంగతులు వున్నాయి.
వైద్య చరిత్రలో కీలక పాత్ర వహించిన పరిషొధనలు 10

Sunday, September 27, 2009

ప్రెమానంద్ చివరిదశలో


Premanand with beard.It is removed during cancer treatment.

Narendra Naik, the successor of Premanand in Federation of Rationalist, Humanist association and Indian Skeptic magazine, sitting at the bedside of Premanand.

Premanand in Abiram hospital, not able to recognise anyone.His long beard was removed.


Will of Premanand ,asking to donate his body after his death


బసవ ప్రేమానంద్ భారత దేసం లోనే గాక ప్రపంచములో అనేక దేశాలు పర్యటించారు.
దేశములో శిక్షణ తరగతులు నిర్వహించారు.
మాజిక్ ద్వారా జరుగుతున్న బాబాల ,మాతల మోసాలను గుట్టు విప్పారు.
కోయంబత్తూర్ సమీపం లో పోడ నూర్ లో తన భవనం లో సైన్స్ ప్రదర్శన ఏర్పరచారు .
ఆయన వయస్సు 80. కొన్నాళ్ళు గా కేన్సర్ తొ వుంటూ, ఇప్పుడు చివరిదశకు చేరారు .
ముందు తరాల వారికి ఆదర్శంగా విల్లు రాసి ,తాను చనిపోగానె తన దేహాన్ని మెడికల్ కాలేజ్ కు ఇవ్వమన్నారు .
సత్య సాయి బాబా మొదలు అనేక మంది మోసాలను , అరాచకాలను బయతపెట్టారు .
సాయి బాబా ఆశ్రమంలో హత్యలు పేరిట డాక్యుమెంటరి తో గ్రంధం వెలువరించారు .

వివిధ మాజిక్ విషయాలు శాస్తియంగా వివరిస్తూ ,అవి ఎలా చెస్తారు అని సోదాహరణగా చూపుతూ మరొక గ్రంధం రాశారు.
ఇండియన్ స్కెప్తిక్ అనే మాస పత్రిక నడిపి ,ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తం గా జరుగుతున్న విశెసాలను అందించారు .

దాక్టర్ పి ఎం భార్గవ సైన్స్ ప్రదర్సన పెడితే మత పార్తీలు దానిని నాసనం చేసే ప్రయత్నం తలపెట్టగా ,ప్రేమానంద్ ఆదుకొని తన చోట దానిని ధైర్యంగా పెట్టారు .
అంత గొప్ప వ్యక్తిని కోల్పోతున్నాము త్వరలో .లోగడ అబ్రహాం కోవూర్ వలె ప్రెమానంద్ కూడా మానవ హేతువాద వుద్యమాలలో సేవ చేసారు.
ఆయన ఇప్పుదు మనకు అందించిన సాహిత్యం గొప్ప సంపద.
ఆయన చివరి దశను చూపే కొన్ని చిత్రాలు ఇక్కడ పెడుతున్నాము.

Saturday, September 26, 2009

యోగ ద్వారా మోక్షం


ఆసనాలు యోగలో ఒక భాగం. యోగలో మోక్ష సాధనకు 8 మార్గాలు చెప్పారు. ఆ సనాలు ఒక మెట్టు మాత్రమే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు మోక్షం సాధించాలి. ఇది యోగ దర్శన సారాంశం. దీనికి ఆద్యుడు పతంజలి.
యోగ ఆరోగ్యం కొరకనేది ఎక్కడా చెప్పలేదు. కాని ఇప్పుడది వీధి వ్యాపార ఆకర్షణ అయింది. ఇందులో చిలువలు పలవలుగా యోగాలు ఎన్నో పేర్లతో తలెత్తాయి. భారతీయ దర్శనాలు ఆరు మోక్ష మార్గాలుగా వున్నాయి. ఒకరి మార్గం మరొకరు ఒప్పుకోలేదు గనుకనే ఆరు వేర్వేరు కుంపట్లు రాజేశాయి.
యోగ వ్యక్తిగతం అని మూలంలో చెప్పారు. నేడది బృహత్తర పరిశ్రమగా తలెత్తింది. రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో తలతిరిగే అసత్యాలు వ్యాపింపజేస్తున్నది. ప్రపంచం అంత మౌతుందనేది అందులో ఒకటి.
సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరు దర్శనాలువుండగా, యోగ ఒకటి అని గ్రహించాలి.
హఠయోగం, తాంత్రికయోగం మొదలైనవి అక్కడక్కడా కొందరు స్వీకరించారు. వీటిలో తాంత్రిక యోగంలో సెక్స్ దృష్ట్యా అస్సాం, కేరళ, గుజరాత్ లలో నిషేధానికి గురైంది.
యోగలో భాగంగా కొందరు సూర్య నమస్కారాలు, అందలి ఆసనాలు బోధిస్తున్నారు.
చిత్త వృత్తి నిరోధం యోగానికి ప్రధానం. ఆలోచన చంపేస్తే మనిషికి యోగ పడుతుంది. కాని మానవ లక్షణాలలో అతి విశిష్టమైనది ఆలోచనే, యోగ అమానుషం.
యోగ స్కూళ్ళలో ఎక్కడా, మూల దర్శనం ప్రకారం మోక్ష ప్రస్తావన తీసుకురావడం లేదు. అలాగంటే, నేటి తరం వారు రారేమోనని అనుకోని వుండొచ్చు. కనుక చిట్కా యోగాలే కేంద్రాలుగా తలెత్తి, వాణిజ్యరంగాలుగా మారాయి. అంతా ఆద్యాత్మికంగానే జరుగుతున్నది.
ఆరోగ్యానికి వ్యాయామం చేయడం డాక్టర్లు చెబుతారు. యోగను కొందరు అంత వరకే పరిమితం చేయడం బాగుంది. విదేశాలకు ప్రాకిన యోగలో దీపక్ చోప్రా వంటి వారు అక్కడ కూడా సైన్స్ పదజాలంతో మోసగిస్తుండగా మహేష్ యోగి వంటి వారు కొత్త పేర్లతో ఆకట్టుకున్నారు. కామిగాని వాడు మోక్షగామిగాడయా అనే సూత్రాన్ని రజనీష్ చక్కగా పాటించి, పోయారు. ఇందిరాగాంధికి సన్నిహితుడైన ధీరేంద్ర బ్రహ్మచారి ఏకంగా ఆర్డినెన్స్ ఫాక్టరీ కూడా నెలకొల్పాడు.
ఇప్పుడు రాందేవ్ యోగం మొదలెట్టి ఏకంగా కేన్సర్ నయం చేస్తానంటున్నాడు. ఆయన్ను ఆరోగ్యశాఖ ఖండించింది. యోగ చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి కేన్సర్ తో చనిపోయారు. 38 ఏళ్ళకే చనిపోయిన వివేకానంద యోగ సరిగా చేయలేదా.?
ఆరోగ్యం కోసం పరిమిత యోగం సమర్థనీయం కావచ్చు.

Thursday, September 24, 2009

సూర్యనమస్కారాలు చేసినందువలన....భారతదేశంలో సూర్య నమస్కారాల ఆచారాన్ని కొందరు ఆరోగ్య రీత్యా చూస్తున్నారు. మరి కొందరు మతపరంగా, భక్తి పర్వంలోకి దించారు. యోగ వ్యాపారం సరేసరి. చిలవలు పలవలుగా చెప్పడం, పుస్తకాలు ప్రచురించడం కూడా జరుగుతున్నది. ఆరోగ్యాన్ని ఆచారానికి జోడించే సరికి జనానికి కొందరికి ఆకర్షణ పెరిగింది.

ఇంతకూ అసలు సంగతేమిటో చూద్దాం

భూమికి 8 కాంతి నిమిషాల (సెకనుకు 1,86,000 మెళ్ళ) దూరంలో సూర్యగోళం వుంది. అక్కడ నుండి మన భూమిపైకి పడే వాటిల్లో, కాస్మిక్ కిరణాలు, అల్ ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్, చార్జ్ డ్ పార్టికల్స్ యిత్యాదులు వున్నాయి.
సూర్యుని నుండి భూమిపై పడే వాటిలో ఏది సూటిగా మన మీద ప్రసరించినా యిబ్బంది కరమే. సూటిగా సూర్యుని ఎప్పుడూ చూడరాదు. గ్రహణం అప్పుడే గాక, అన్ని వేళలా జాగ్రత్త పడాల్సిందే.
అయితే భూమిపైన సుమారు 90 కిలో మీటర్ల ఎత్తువరకూ వాతావరణ పరిధి వున్నది. అది మనకు పెద్ద అండ, రక్షణ. అందులో నుండి కిరణాలు వడపోతతో వస్తాయి గనుక, మనకు చాలా భద్రత వుంది. చివరకు మేఘాలనుండి సూటిగా వర్షం, వడగళ్ళు మన మీద పడ్డా ప్రమాదమే. వర్ష బిందువులు సైతంవడపోతలోనే మనకు చేరతాయి.
భూమిపైన వాతావరణం నాలుగు అంచెలుగా వుంది. భూమి నుండి తక్షణమే వున్న పొరను ట్రోపోస్పియర్ అంటారు. ఇది 10 నుండి 16 కిలోమీటర్ల వరకూ వుంటుంది. ఈ పొరలోనే మనం అనుభవించే నీరు, వాతావరణం వుంది.
ఆపైన రెండోపొర స్ట్రాటోస్పియర్ ఇక్కడ ఓజోన్ ప్రభావం వుంటుంది. తరువాత మెసోస్పియర్. పిమ్మట ధర్మోస్పియర్ (లేదా ఇసోనోస్పియర్) రాకెట్లు ప్రయోగించినప్పుడు వీటన్నిటిని దాటి పోవాలి.
మానవులకు 5 వేల మీటర్ల ఎత్తు వరకే భూమిపైన పరిమితం. అప్పటికే వూపిరాడకపోవడం, ఆక్సిజన్ గొట్టాలు కావలసిరావడం కద్దు. పర్వతాలు ఎక్కేవారికి అదే స్థితి. వాతావరణంలో 40 వేల ఉరుముల వర్షాలు రోజూ ప్రపంచంలో చూస్తాం. అలాగే అనేక మెరుపులు, అవి ఎంతో విద్యుత్తుశక్తి కలిగి వుంటాయి.
సూర్యుని నుండి భూమిపైకి వచ్చే వేడి ప్రాంతాల వారీగా మారుతుంది. అలాగే గాలి కూడా. వాతావరణం నిర్దుష్టంగా తెలుసుకునే శాస్త్రీయ ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటి వరకూ కొంత తెలుసు. ఇంకా చాలా తెలియాలి. అలాగే సముద్రాలను గురించి కొంతే తెలుసు. వాతావరణం నుండి భూమి మీదకు బొగ్గు పులుసు వాయువు విపరీతంగా వస్తుంటుంది. దానిని సూక్ష్మజీవులు స్వీకరించడం వలన మనం సురక్షితంగా వుంటున్నాం. ఈ కార్బన్ ను మళ్ళీ వాతావరణంలోకి రాకుండా తమ గుల్లల్లో (షెల్స్) అట్టి పెడతాయి. అదొక ప్రకృతి అద్భుతం.
జ్యోతిష్యులకు, మూఢనమ్మకస్తులకు, యీ ప్రకృతి సత్యాలు తెలుసుకోవడం అవసరం. అలాగే యోగ గురువులకు కూడా.
సూర్యుని ప్రభావం వలె మన మీద ఇతర తారల ప్రభావం వుండదు. అవి కాంతి సంవత్సరాల దూరంలో వుండడమే కారణం. అయినా తెలియకుండా తారాబలం అంటూ జ్యోతిష్యులు కథలు అల్లితే, జనం నమ్మి మోసపోతున్నారు. నక్షత్ర రాసులంటూ పేర్లు పెట్టి మనుషుల ఛాందసాలపై స్వారి చేస్తున్నారు.
అలాగే గ్రహాల నుండి మనుషుల మీద పడే కిరణాలు, తదితరాలు లేవు. దాని చుట్టూ చాలా పురాణాలు చుట్టేశారు. చక్కగా వ్యాపారం చేస్తున్నారు. దానికి టాక్స్ లేదు. బాధ్యత లేదు.

Wednesday, September 23, 2009

జనాభా పెరిగిపోతున్నది

ఒకప్పుడు జనాభా పెరుగుదల అత్యవసర సమస్యగా పరిగనించారు. ఇందిరా గాంధి కుమారుడు సంజయ్ 1975 ప్రాంతాలలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరెషనులు చేయిస్తే పెడ్డ రియాక్షన్ వచ్చింది .ఆ తరువాత ఎవరికి వారు ముక్యంగా రాజకీయ పార్తీలు జనాభా పెరుగుదల వూసెత్తలేదు .
మత పరంగా ముస్లింలు , కేథలిక్కులు జనాభా అదుపు కు వ్యతిరేకులు. హిందువులలో మత రాజకీయ పక్షాలు ముస్లింల బూచి చూపి ,హిందువులు తగ్గి పోతారు గనుక కుటుంబ నియంత్రణ వ్యతిరేకిస్తున్నారు.
జనాభా పెరుగుదల చుట్టూ చాలా సమస్యలు అల్లుక పోయి వున్నాయి .ఆహారం, పిల్లల పోషణ ,కాలుష్యం ,పేదరికం ,తల్లి ఆరోగ్యం ,అన్నీ ఈ సమస్యతో ముడివడి వున్నాయి.
జనంలో మతపరమైన బావాలకు వ్యతిరేకం గా పోతే వోట్లు రావని రాజకీయ పార్తీలు ,కావాలని ఈ సమస్యను దాటి వేయడం చాలా తప్పు. ప్రజలకు నచ్చ చెప్పాలి .పాఠాలలో వివరించాలి .
ఇది భవిష్యత్తును దెబ్బతీసే సమస్య .జాగ్రత్త అవసరం.

Tuesday, September 15, 2009

స్త్రీలు జాగరీకులు కావాలి


అన్ని మతాలూ అమానుషాలు.అంటే దైవం ప్రధానం అని,మనిషి తుచ్చుడని భావించాయి.అంతే కాదు. ప్రతి మతమూ స్త్రీని ద్వితీయ శ్రేణి లో చూపాయి.ఇది పవిత్ర గ్రంధాల ద్వారా పురుషులు రాసి నందున , అదే ప్రమాణం అయిపోయింది .నేటి మానవ హక్కులకు అన్ని మతాలు విరుధమే .
స్త్రీలు మతాలకు దూరం అయితే ప్రపంచం మెరుగౌతుంది .వారి సంతానం ఉత్తమ పౌరులుగా రూపొందుతారు .
ఈది చెప్పినంత సులుభం కాదు .కాని ఇలా జరగడం అవసరం. .
ప్రతి మత పవిత్ర మూల గ్రంధంలో స్త్రీల గురుంచి నీచంగా రాసిన విషపూరిత రాతలు స్త్రీలకు తెలియజేస్తూ పోవాలి.

Thursday, September 10, 2009

అబద్ధాలలో బ్రతకటం మానేద్దాం

అసత్యాలలో మునిగి తేలుతున్నాం. ఇందులో చాలా వరకూ తెలిసి చేస్తున్న విషయాలే ఉన్నాయి.

పుస్తకాలు మనుషులే రాస్తారు. ఆ విషయం ఇంచుమించు అందరికీ తెలుసు. అయితే కొన్ని పుస్తకాలు మనుషులు రాయలేదని, కానీ మనుషులకు దైవం ఇచ్చినట్లు చక్కని కథలు అల్లారు. ఇది కురాన్ కు, బైబుల్ కు, వేదాలకు ఇలా అనేక మతాలలో పవిత్ర గ్రంథాల పేరుతో అన్వయిస్తుంది. రాను రాను మన అబద్ధాలను మనమే నిజమని నమ్మి, అదే ఆరాధ్యంగా, పవిత్రంగా చూడటం మొదలు పెటడతాం. మనం రాసిన పుస్తకాలు, మనం అచ్చు వేసిన గ్రంథాలనే కళ్ళకు అద్దుకుని, ప్రత్యక్షరం నిజమని నమ్ముతాం, నమ్మిస్తాం. ఇంకా ఘోరం ఎమిటంటే పిల్లలకు ఈ అబద్ధాలను చిన్నప్పటి నుంచి నూరి పోస్తాం. అవి వారికి పెద్దైన తర్వాత కూడా చెరిగిపోవు.

మసీదులు, దేవాలయాలు, చర్చిలు, పగోడాలు మనుషులు కట్టేవే. వాటిలో పెట్టే విగ్రహాలు, రాతలు, చిత్రపటాలు మనుషులు అమర్చేవే. కానీ వాటిని కాలానుగుణంగా వెలసినట్లు, వాటంతట అవే వచ్చినట్లు క్షేత్ర మహిమలు ఉన్నట్లు ఉదంతాలు చెబుతాం. అదికూడా చెప్పగా చెప్పగా నిజమేమో అనిపించే భ్రమ కల్పిస్తాం. పురోహిత వర్గాలు భక్తుల్ని అలరించటానికి, ఆకట్టుకోవటానికి అనేక క్రతువులు, ఆచారాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, పునస్కారాలు సృష్టించి, నమ్మించి చేయిస్తారు. భక్తులు అదంతా నిజమని నమ్మినా, అందులో నిజం లేదని తెలిసిన వారు ప్రప్రధమంగా పురోహితులే. కానీ వారి జీవనాధారానికి, మత వ్యాపారానికి అబద్ధాన్ని అలవాటుగా భక్తులకు చెప్పక తప్పదు. ఈ ప్రక్రియలో భక్తులు దాన ధర్మాలు చేయటం, కర్మ కాండలు చేయటం, నిలువు దోపిడీలు చేయటం, యాత్రలు జరపటం, మొక్కుబడుల పేరిట విపరీతంగా నగ, నట్రా మందిరాలకు, దేవాలయాలకు, మసీదులకు సమర్పించటం నిత్య కృత్యమైపోయింది. ఆ విధంగా మతాలు డబ్బు కూడగట్టుకుని, పిల్లలను మతాలకు దూరం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతీ మతం కూడా చిన్నప్పటి నుండి పిల్లల్ని మతానికి దగ్గరగా చేర్చి మూఢనమ్మకాలు నూరిపోసి మనసులను కలుషితం చేసి దారుణమైన తప్పులు చేస్తున్నారు. కానీ అది తప్పు అని తల్లిదండ్రులు అనుకోవటం లేదు. దానికి నీతి, నియమం అనే ముసుగు కప్పారు. మతం లేకపోతే నీతి అండదు అనే అబద్ధాలను, దైవం పేరిట భయాన్ని విపరీతంగా వ్యాపింపజేశారు. దీనికి గాను సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూ, ఆకర్షణీయంగా కవితలు అల్లుతూ, భాషను కూడా భ్రష్టం చేస్తున్నారు.

చదువుకున్నా అందులో నిష్ఠాతులైనా, చిన్నప్పటి నుండి వచ్చిన మూఢనమ్మకాలను మాత్రం వదిలించుకోలేక పోతున్నారు. అందుకే హేతువులు, శాస్త్రీయ పద్ధతిని మానవ సంక్షేమానికి వినియోగిస్తూనే మరోపక్కన మూఢనమ్మకాలతో కొందరు సమాజానికి హాని చేస్తూ మానవులను ముందుకు పోకుండా ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నారు.

చివరకు సైన్స్ వల్లన క్రమేణా విషయాలు తెలుసుకుంటూ అభివృద్ధి సాధిస్తూ ముందుకు పోగలుగుతున్నాం. వైద్య రంగంలో అభ్యుదయాన్ని సాధిస్తున్నాం. ప్రార్థనలతో రోగాలు నయం కావని, వర్షాలు రావని తెలుసుకుంటుంన్నాం. ప్రకృతి భీభత్సాలకు కారణాలు వేరే ఉన్నాయని గ్రహిస్తున్నాం. కానీ వీటిలో కూడా జ్యోతిష్యులు, దొంగ వ్యాపారానికి వెనుకాడటం లేదు.

మతం మానవాళికి చేసిన, చేస్తున్న ద్రోహం ఇంతా అంతా కాదు. దాని పేరిట జరిగిన హింస అనూహ్యమైనది. మతం వల్లన మానవాళికి ఉపయోగ పడని అంశం లేదు. కానీ మనుషుల్ని చీలదీసి, కులాలు సృష్టించి అంటరాని తనాన్ని పెంచి పోషించి అమానుషంగా ప్రవర్తించారు. అందుకే అలాంటి దారుణాలను నీతి పేరిట అమలు పరచిన ధర్మశాస్త్రాలను దగ్ధం చేయమని కీ.శే. అంబేద్కర్ నినదించారు. మానవాళికి భవిష్యత్తు వైజ్ఞానిక దృక్పధంలోనే ఉన్నది. అందులో తప్పులు దిద్దుకుంటూ పోయే లక్షణం ఉండటం గొప్ప విశేషం.

Sunday, September 6, 2009

రాజశేఖరరెడ్డి- జ్యొతిష్యం

మేము ముందే చెప్పాము అంటూ ప్రగల్భాలు పలుకుతూ, సునామి వంటివి అలా చెప్పగలిగాము అన్న జ్యోతిష్యులు లేకపోలేదు.
ఆంధ్ర ప్రదేష్ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశెఖరరెడ్డి సెప్తెంబర్ 2 న మరణిస్తాడని చెప్పిన జ్యోతిష్యుడు ఎవరన్నా వున్నారా?
అంత ప్రధాన విషయం ఎందుకు చెప్పలేకపోయారు ?
జ్యోతిష్యం సాంఘిక నేరం .అది గ్రహిస్తే మంచిది
శాస్త్రీయ పరిశీలనకు జ్యొతిస్యం నిలవదు.
అందుకే ఎవరైనా శాస్త్రియతను జ్యోతిస్యంలో రుజువు చెస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తానని జేంస్ రాండి బాంక్ లో ధనం పెట్టి సవాల్ చేస్తున్నాడు.www.randi.org

Thursday, September 3, 2009

త్రిపురనేని గోపిచంద్

గోపీచంద్ శత జయంతి జరుపుతున్నారు.అసలు గోపీచంద్ ను మరచిపోతున్నారు.త్రిపురనేని గోపిచంద్ 1937 నుండి రచనలు అనువాదాలు మొదలు పెట్టారు.తండ్రి త్రిపురనేని రామస్వామి ప్రభావం అతనిపై అప్పటికే వున్నది. దేశంలో ఎం ఎన్ రాయ్ వచ్చి అటు గాంధేయ మితవాదానికి ఇటు కమ్మ్యూ నిస్త్ అతి వాదానికి మార్గాంతరం గా పునర్ వికాసం ,శాస్త్రీయ ముగా చరిత్రను రాయడం ,పునర్ వికాసం ,నూతన రాజ్యాంగం ,వికేంద్రీకరణ ప్రచారం చేసాడు .అది గోపిచంద్ ను ఆకట్టుకున్నది .అమ్రుత బజార్ పత్రికలో రాయ్ వ్యాసాలు అనువదించి ప్రచురించాలంటే ఎవరు ముందుకు రాలేదు. గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రజా మిత్ర సాహసం తో వాటిని ప్రచురించింది 1937-38 లో. రాయ్ ప్రభావంతో గోపిచంద్ రాజకీయ కథలు రాసి కొత్త దారులు చూపారు .పట్టాభి సోషలిజం ,మార్కిజం అంటే ఏమిటి రాసారు .రాజకీయాలో కొత్త దారులు తొక్కాలని రాయ్ పెట్టిన రాడికల్ డెమొక్రటిక్ పార్తీకి గోపిచంద్ కార్యదర్సిగా ఉపన్యాసాలు ,శిక్షణలు ఇచ్చారు .అసమర్ధుని జీవయాత్ర రాసారు .రచనలలో వ్యంగ్యం ,వాదం ,ఆలోచన ప్రవేశపెట్టారు.తండ్రి చనిపోయిన తరువాత ,1946 లో మద్రాస్ లో సినిమా రంగం లో అడుగుపెట్టి ,మారిపోయారు .అసలు గోపీచంద్ ఆగి పోగా ,ఆధ్యాత్మిక ధోరణిలో రచనలు చేస్తూ ,వివిధ వుద్యోగాలలో వుంటూ ,52 ఏళ్ళకే చనిపోయారు .