Thursday, October 30, 2008

ఇంగర్ సాల్ మ్యూజియం


Fred Edwords Humanist leader now in Washington DC








అమెరికా హ్యూమనిస్ట్ మహాసభ

1997 లో డెట్రాయిట్ నగరంలో జరిగిన అమెరికా మానవవాద సభలలో పాల్గొని ప్రసంగించాను. నాతో పాటు విజయవాడ నుండి నాస్తిక నాయకుడు లవణం, ఒరిస్సా నుండి పత్రి పాల్గొన్నారు. సుప్రసిద్ధ హ్యూమనిస్ట్ కవి ఫిలిప్ యాపిల్ బిను అక్కడే కలిశాను. సభలో ఆయన కవితలు చదివి వినిపించి ప్రత్యేకంగా ఆకర్షించారు. హ్యూమనిస్ట్ నాయకుడు ఫ్రెడ్ ఎడ్వర్డ్ ఆహ్వానంపై ఆ సభలలో పాల్గొన్నాను.

ఇంగర్ సాల్ మ్యూజియం


Ingersoll musuem at Dresden



న్యూయార్క్ రాష్ట్రంలో రోచెష్టర్ సమీపాన డ్రెస్డన్ వద్ద ఇంగర్ సాల్ మ్యూజియంను 1996లో తెరిచారు. ఆ ప్రారంభ సమావేశానికి, నేను మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర వెళ్లి పాల్గొన్నాము. కార్యక్రమంలో భాగంగా స్టేట్, చర్చ్ వీధుల మధ్య నిలచి సింబాలిక్ గా ఫొటో తీయించుకున్నాము. ప్రభుత్వాన్ని, మతాన్ని వేరు చేయాలని, మతం వ్యక్తిగతంగా అట్టి పెట్టుకోవాలని, ఆ విధంగా సెక్యులర్ ధోరణిలో పరిపాలన జరగాలని సూచన ప్రాయంగా ఆ పని చేశాం. ఇందులో పాల్గొన్నవారు గార్డెన్ స్టెయిన్ (ఎన్ సక్లోపీడియా ఆఫ్ పేరా నార్మల్ ఎడిటర్) టామ్ ఫ్లిమ్ ( ఎడిటర్, ఫ్రీ ఇంక్వైరీ), టిమ్ మేడిగన్ మెదలైనవారున్నారు. భారత దేశంలు ఇంగర్ సాల్ రచనల ప్రభావం, వెలువడిన అనువాదాలు ఆ సభలో నిర్వహించారు.



Robert Ingersoll famous rationalist and orator

Wednesday, October 29, 2008

వుద్యోగం లొ చేరడానికి దేవునిపై ప్రమాణం యెందుకు


Roy Torcaso with daughter







Notary Roy Torcaso







రాయ్ తార్కాసో

ఇతను 1961లో అత్యంత ప్రాధాన్యతలోకి వచ్చారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరటానికి మతపరమైన ప్రమాణం చేయవలసి ఉంది. రాయ్ తనకు దేవునిమీద నమ్మకం లేదంటూ ఆ ప్రమాణం చేయటానికి నిరాకరించాడు. కాని ఉద్యోగంలో చేర్చుకోకపోతే కోర్టుకు వెళ్ళి పోరాడాడు.నొటరి గా వుద్యోగం లొ చేరడానికి దేవునిపై ప్రమాణం యెందుకు అని సుప్రీం కోర్త్ కు విళ్ళి 1961 లో గెలిచారు మార్కదర్శకత్వం చూపాడు. అతడు 1992లో నేను కలిసేనాటికి మేరిలాండ్ రాష్ట్ర మానవ వాద సంఘ అత్యక్షులుగా ఉన్నారు. ప్రతిమాసం సమావేశాలు జరుగుతుండేవి. వాటికి వెళ్ళిన నేను రాయ్ తో కలిసి మాట్లాడటం అనుభవాలు పంచుకోవటం జరిగింది. క్రమేణా రాయ్ ఒక కొత్త సంఘానికి నాయకత్వం వహించి చురుకుగా కార్యక్రమాలు చేశారు.

అదేమిటో తెలుసా? ఏవరైనా విపరీత శారీరక బాధలతో, రోగాలతో చనిపోదలిస్తే అందుకు ఆ వ్యక్తికిస్వే
చ్చ ఉండాలని, అతడి సంఘానికి లక్ష్యం. దీనిని క్రైస్తవ మతం వ్యతిరేకించింది. ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నది. దీనిని EUTHNASIA సంఘం అంటారు. హెం లాక్ సొసైటి కి నాయకత్వం వహించి బాధ తట్టుకోలేక ఇక నయం కాదని తెలి సి నప్పుడు చనిపో యే హక్కు వుండాలని వుద్య మించారు

రాయ్ చాలా మెల్లగా సున్నితంగా మాట్లాడేవారు. చక్కగా రాసేవారు. వృధాప్యం వల్లన ఆయన చురుకుదనం తగ్గినా, మానసికంగా హుషారుగానే ఉండేవారు. 2007 జూన్ 9
లో రాయ్ టార్కాసో చనిపోయారు. అప్పటివరకు ఆయన్ను కలసి మాట్లాడే అవకాశం లభించడం నా అనుభవంలో ఒకటి.

Saturday, October 25, 2008

రాజకీయాలనుండి యోగ లోకి-Meeting Pulagenda









రాజకీయాలనుండి యోగ లోకి
గుంటూరు నుండి రవిచంద్ కో రగా, రావెల సోమయ్య బోస్తన్ నుండి నాకు ఫోన్ చేసి పులగెంద సిన్ హ ను PULAGENDA SINHA కలియమన్నారు.
యెందుకు?
గీత లొ ఇంతవరకు బయట పడని స్లోకాలు ,కావాలని దాచిన వాటిని ఆయన వెలువరించాడట .
నేను అప్పటికే వి ఆర్ నార్ల రాసిన గీత విమర్శను THE TRUTH ABOUT THE GITA
తెలుగులోకి అనువదించి ప్రచురించాను .
పులగెంద సిన్ హ వర్జీనియ లోని కి బులవార్డ్ 703 లో ఒక గదిలో వుంటున్నాడు.
ఫోన్ చే సి రమ్మంటే వెళ్ళి చాలసే పు ముచ్హటించాను .
ఆయనకు గొంతు కేన్సర్ వలన 1970 లో గొంతులో స్వర నాళం తొల గించారు .కనుక ఎలెక్త్రానిక్ పరికరం తో మాట్లాదుతున్నారు.
1924 లో బీ హా ర్ లో పుట్టి, 1952 తొలి యెన్నికలలో శాసన సభకు పోటీ చే సి ఓదిపోయారు .సోషలిస్త్ రాజకీయాలలొ 1957 వరకు వుండి ప్రజా సోషలిస్త్ పార్తీ పై సిద్ధాంత వ్యాసం ప్రచురించారు .అనంటి తన గురించి పత్రికలలొ పడిన విషయాలు చూపారు .
భారత రాజకీయాలలో రాణించలేమని గ్రహించి కాబోలు అమెరికా వలస వచ్హి యో గ కేంద్రం 1970 ప్రాంతాలలొ పెట్టి చివరి వరకు కొన సాగించారు .
అమెరికాలొ హరే క్రిష్ణ ఉద్యమం వారు ప్రభు పాద నాయకత్వాన విపరీత గొడవ చేస్తున్నారు. ఫ్రభుపాద గీత పై ఒక పుస్తకం రాశారు Gita as it is.అందుకు స్పందించి పులగేంద గీత పై రాసారు GITA AS IT WAS. 1987 లో ఓ పెన్ కో ర్త్ దీ నిని ప్రచురించగా సనాతన పండితులు విరుచుక పడ్డారు.
గీతలొ మూల స్లోకాలు చాలా బయటకు రానివ్వ లెదని, వాటిని చూపాదు.
అయినా పులగెంద పుస్తకం భారత దేశం లో ప్రచారం కాలేదు.
పులగెందతో కొన్ని పర్యాయాలు ఫోన్ లో మాట్లాడాను.
2006 లొ చనిపో యారు .ఆయన భార్య కుమారుదు బీహార్ లొ వున్నారు.

Thursday, October 23, 2008

Telugu lover in USA






ఇన్నయ్య పంతులుగారు నిండా వందనములు అని
ప్రేమగా పిలిచే అమెరికా ప్రొఫెసర్ రాబర్త్ ఫ్రికన్ బర్గ్
విస్కాన్సిన్ యూనివర్సిటిలొ నేడు ఎమిరిటిస్ ప్రొఫెసర్.
1975 లో ప్రధమ ప్రపంచ తెలుగు సభలు హైదరబాద్
లాల్ బహదూర్ స్తే డియం లో జరిగినప్పుదు కలసి మాట్లాడాను.
తెలుగు బాగా మాట్లాడు తుంటే ఎలా నేర్చు కున్నారు అని అడిగాను.
1930 లో ఒక పాస్తర్ కుటుంబంలో నల్లగొండ లో పుట్టాను అని
1942 వరుకు ఆంధ్రలో పెరిగాను అని చెప్పారు.
20 ఏళ్ళ తరువాత అమెరికా వచ్చి వుత్తరం రాస్తే వెంటనే జవాబు ఇచ్హారు .
ఇప్పటివరకు వుత్తరాలలొ పలకరించు కుంటున్నాము.
తెలుగు అలవాటు తప్పి మరచి పో తున్నాను అంటున్నరు.
గుంటూరు జిల్లా పై ఆయన రచనను ఆక్స్ ఫర్ద్ వారు ప్రచురించారు
మంచి పరిశొధన . ఆంధ్ర లో రెవెన్యూ విధానం పై రచన చదవ దగినది.
మరొక పుస్తకం డిల్లి పై రాసారు .

Bio Sketch:

Born (1930) and reared in India, trained in America and Britain (Ph.D., London [SOAS], 1961), he came to Wisconsin in 1962. Founded SAMP (South Asia Microfilm Project) in 1963. Chairman, Department of South Asian Studies and Director of South Asia Studies Center from 1970 to 1973. Founded annual Wisconsin Conference on South Asian Studies in 1972, an international event that attracts over five-hundred participants. Directed Pew RAPs (Research Advancement Project (1994-1999); and served on board of Pew Research Enablement Project (New Haven CT:1993-1999). As visiting fellow of All Soul’s College, delivered Radhakrishnan Memorial Lectures at Oxford University in1998 (Trinity Term): AIndia=s Raj: Indigenous Ingredients in the Construction of the Imperial System.@ Emeritus status began in 1998.

Selected Publications & Research Interests:

Guntur District, 1788-1848: A History of Local Influence and Central Authority (Oxford: Clarendon Press, 1965), initiated localistic, >bottom-up=, Indocentric approach to Indian history. After editing Land Control and Social Structure in Indian History (Madison 1969; New Delhi 1978), Land Tenure and Peasant in South Asia (Madison, New Delhi: 1977, 1981), Delhi Through the Ages (New Delhi, Oxford 1986, 1993), each of which broke new ground, History and Belief: The Foundations of Historical Understanding (Grand Rapids: Eerdmanns, 1996) delved into philosophical issues and provided a framework for work on the history religious movements in India. Four edited volumes followed: Christians, Cultural Interactions and India=s Religious Traditions (London: RoutledgeCurzon; Grand Rapids: Eerdmans, 2002), with Judith M. Brown; Christians and Missionaries in India: Cross-Cultural Communication since 1500 (London: RoutledgeCurzon; and Grand Rapids: Eerdmans, 2003); Tirunelveli’s Evangelical Christians: Two Centuries of Family Vamsâvali Traditions (Bangalore: SAIACS, 2003), with D. & S Packiamuthu and Chris Barrigar; and Pandita Ramabai=s America: A Translation from Marathi of her AConditions of Life in the United States, 1889" (Grand Rapids: Eerdmans, 2003), in collaboration Philip Engblom & Shitija Gomes. Completed in 2006, his Oxford History of Christianity in India (220,000 words is now in press) represents a decade of research.

Among over sixty articles, chapters, and essays are items pertaining to the history of Christianity, Hinduism and Christian Missions, such as:

"On Roads and Riots in Tinnevelly: Radical Change and Ideology in Madras Presidency During the 19th Century," South Asia, IV, 2 (December, 1982), 34‑52.
"Modern Education in South India, 1784‑1854: Its Roots and Its Role as a Vehicle of Integration under Company Raj", The American Historical Review 91, 1 (February, 1986), 37-65.
"The Concept of 'Majority' as a Devilish Force in the Politics of Modern India," Journal of Commonwealth and Comparative Politics, XXV: 3 (November, 1987), 267-274.
"The Emergence of Modern 'Hinduism' As a Concept and As an Institution: A Reappraisal With Special Reference to South India," Hinduism Reconsidered (Heidelberg: 1989), 1-29, edited by Gunther Sontheimer and Hermann Kulke (reissued in New Delhi: Manohar Books, 1997), 82-107.
"Constructions of Hinduism At the Nexus of History and Religion," Journal of Interdisciplin­ary History, XXIII: 3 (Winter 1993), 523-550.
"Hindu Fundamentalism and the Structural Stability of India," Fundamental­isms and the State: Remaking Polities, Economies, and Militance (Chicago: 1993), 233-55; and "Fundamental­isms in South Asia: Ideologies and Institutions in Historical Perspective," Accounting for Fundamentalisms: The Dynamic Character of Movements (Chicago: 1994), 589-614, edited by Martin E. Marty and R. Scott Appleby.
“India: An Historical Overview,” The World History of Christianity (London: Cassell,
1999).

Saturday, October 18, 2008

అమెరికాలో మోసాలు


Oliver B Roy (left) who signed the certificates







నాకు తెలిసిన మిత్రులు కొందరు ఇండియాలో డాక్టరేట్లు తెచ్చుకున్నారు.
మిసిమి ఎడిటర్ ఆలపాటి రవింద్రనాథ్ కు గౌరవ డాక్టరేట్ వచినప్పుడు సన్మాన సభ జరిగినప్పుడు సినారె రానని నిరాకరించారు. డిగ్రీ సరైనదని రుజువు కావాలన్నారు.
ఆయన్ అనుమానం నిజమే .జరిగిన విషయం ఇది.
అవి అంతర్జాతీయ కాలిఫోర్నియా యూనివర్శిటీనుండి లభించినట్లు అందమైన సర్టిఫికెట్లు ఉన్నాయి. మద్రాసులో Thiagarajan.K of united writers association 75 kamakoti nagar, chennai 600087 phone 4838965) అనే వ్యక్తి ఒక సంఘాన్ని నడుపుతూ కొందరికి వారి వారి కృషి, రచనలు ఆధారంగా ఇలా డిగ్రీలు ఇప్పిస్తున్నట్లు తెలిసి ఆయన్ని కలిశాను. తాను కేవలం మధ్యవర్తిని మాత్రమేనని, విషయమంతా అమెరికాకు పంపిస్తే, వారే నిర్ణయించి డిగ్రి ఇస్తారని చేప్తారు.
ఆలీవర్ బి. రాయ్ సంతకంతో సర్టిఫికెట్లు ఉన్నాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు అతడిని గురించి, ఆ యూనివర్శిటీ గురించి ఆరాతీశాను. అలాంటి యూనివర్శిటీ ఎక్కడా ఉనికిలో లేదని తెలిసింది. అయితే బి. రాయ్ మాత్రం ఉన్నట్లు, ఆయన అడ్రస్ పట్టుకొని వివరాలు సేకరించారు. సిలికన్ వ్యాలి దగ్గరలో ఆయన నివసిస్తున్నారు. నేను స్టాన్ ఫర్ట్ యూనివర్శిటీకి వెళ్ళినప్పుడు ఫోను చేసి నేను పలానా అని, ఆయనను చూడాలనుకుంటున్నాని కోరాను. ఫలానా సమయంలో రమ్మని చెప్పారు. నా మేనల్లుడు చెరుకూరి రాజశేఖర్ అక్కడ హూలేట్ ప్యాకర్డ్ లో పనిచేస్తున్నాడు. అతడిని వెంటపెట్టుకుని రాయ్ ఇంటికి వెళ్ళాము. ఆయన వృద్ధుడు. ఆయన భార్యను పరిచయం చేశాడు. ఆమె రచయిత్రి. మూడు గదుల ఇల్లు, సిమ్మింగ్ ఫూల్ ఉన్నది. అక్కడ కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మధ్యలో ఆయనకు అనుమానం వచ్చి యూనివర్శిటీ గురించి ఆరాతీయటానికి వచ్చావా అని అడిగారు. అవును అని చెప్పి వివరాలు అడిగాను. యూనివర్శిటీ కేంద్రం వాషింగ్ టన్ లో ఉన్నదని అడ్రసు, వ్యక్తిపేరు ఇచ్చాడు. ఫోన్ అడిగితే లేదన్నాడు. యూనివర్శిటీకి ఫోన్ లేకపోవటం ఏమిటనేది ఆశ్చర్యం వేసింది. డిగ్రీలు ఎలా ఇస్తారు. అని అడిగితే, ఆయా వ్యక్తుల కృషిని బట్టీ ఇస్తామన్నారు. ఎంత చార్జి చేసారు అంటే, ఆయన చెప్పిందాన్ని బట్టి 15, 20 వేల రూపాయల మధ్య ఉన్నది. క్లాస్ రూము లు, టీచింగ్ లు ఉంటాయా అంటే లేవన్నాడు. నేపాల్, ఇండియా, శ్రీలంక, మొదలైన చోట్ల తమ ఏజెంట్లు ఉన్నారని చెప్పాడు. హోమియో ఇత్యాది కోర్సులు ఉంటాయన్నాడు. మద్రాసు నుండి వెలువడే హిందూ పత్రికలో తమ యూనిర్శిటీపై విమర్శ వచ్చిందని, ప్రెస్ కటింగ్ చూపాడు. తాను సమాధానం పంపిస్తున్నట్లు చెప్పాడు. మేము ఆయనతో కలసి ఫోటో తీయించుకున్నాము.

తరువాత ఆయన చెప్పిన ప్రకారం వాషింగ్ టన్ రాజధానిలో వెళ్ళి చూస్తే నల్లజాతివారు ఉండే పేద ఇళ్ళ మద్య ఒక అపార్టు మెంటు. అక్కడ ఎవరూ లేరు. ఫోను లేదు. అంతా బోగస్ అని తేలింది.

మరుసటి సంవత్సరం ఆరా తీస్తే ఆలీవర్ రాయ్ మేము వెళ్ళిన అడ్రస్ లో ఉండటం లేదని, ఆ ఫోను కూడా పనిచేయటం లేదని తెలిసింది. భారతదేశంలో మాత్రం చాలా మంది ఆ డిగ్రీలు పెట్టుకొని అవి నిజమేననుకుని డాక్టరేట్లుగా ముద్రవేసుకుంటున్నారు.

రాయ్ అలివర్ అందిచ్చిన సమాచారం ప్రకారం యూనివర్సిటి 1912 లో కాన్ పూర్ లొ మొదలై సిలోన్ మీదుగా అమెరికా చేరుకున్నది.క్రైస్తవ మత ప్రచార సంస్త ఇది.ఇంటి అడ్రస్ నే యూని వర్సిటి అనుకో మన్నారు. కనీ సం ఫో న్ కూడా లే ని సంస్థ .
తెలిస్తే ఆంజనేయులు ( writer and journalist who contributed between you and me column in H ,రవీంద్రనాథ్ లు డిగ్రీలు అవతల పారే సే వారే .మరి కొందరు తెలుగు వారు మోస పోయారని తెలిసింది.

Saturday, October 11, 2008

నరకంలో ఎవరున్నారు? USA experiences












వారెన్ ఎలెన్ స్మిత్

నేను అమెరికాలో కలసిన చాలా ఆసక్తి కరమైన వ్యక్తులలో వారెన్ పేర్కొనదగినవారు. ఆయన ఫోటో స్టూడియో న్యూయార్క్ లో నడిపారు. పెళ్ళి చేసుకోలేదు. నేను కలిసే నాటికే బాగా వృద్ధుడు. సింగిల్ రూమ్ లో ఉంటూ పరిశోధనలు చేస్తూ వ్యాసాలు రాస్తూ, ఆనంద దాయకంగా జీవితం గడుపు తున్నారు. నేను అమెరికాలో న్యూయార్క్ వచ్చిన సందర్భంగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఉంటున్న అపార్ట్ మెంట్ టెరేస్ మీద సాయంకాలం ఆహ్లాదకరమైన మిత్రుల సన్నివేశం అది. నాతో పాటు మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర, నా భార్య కోమల కూడా ఉన్నారు. అతను భారత నాస్తిక, మానవ వాద వ్యక్తులతో గల సంబంధాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఎలెన్ రాయ్ రాసిన ఉత్తరాన్ని చూపారు. గోరాతో పరిచయం ఉందన్నారు.

ఎలెన్ స్మిత్ హాస్యంగా మాట్లాడతారు, రాస్తారు. ఆయన సంకల్పించి, ప్రచురించిన ఒక బృహత్తర గ్రంథం Who is who in hell అనేది పేర్కొనదగినది.
మత నమ్మకాలు లెని వారు నరకానికి పోతారని అంటారు.దానిపై వ్యంగ్యంగా నాటి నుండి నే టి వరకు ఎవరు నరకం లొ వున్నారో జాబితా ఇస్తూ పెద్ద పుస్తకం ప్రచురించారు నా పే రు కూ డా రాసారు .
అందులో భారతదేశాన్ని గురించి ఆయన కొరికపై నేను వ్యాసాలు వ్రాశాను. అతను తస్లిమా నస్రిన్ ను ఆదుకొని, ఆదరించి, సహాయపడిన వ్యక్తి. ఆమె విషయమై వెబ్ సైట్ నిర్వహించారు. ఆమెను ఆహ్వానించి ఒక హోటల్ లో విందు చేసినప్పుడు నేను పాల్గొన్నాను.
వాషింగ్టన్ లో 2006లో నాస్తికుల సభ, ఊరేగింపు పార్లమెంట్ ఎదురుగా జరిగింది. అందులో ఎలెన్ స్మిత్, నేను కలసి పాల్గొన్నాము. నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటున్నాము. నేను రాసే నాటికి ఆయన 80వ పడిలో ఉన్నారు.
See his fascinating website: http://wasm.us

Wednesday, October 8, 2008

Experiences in USA continued-అమెరికా నాస్తిక నాయకులతో


Madalyn O hair Murray













నేను మొదటిసారి 1992లో అమెరికా వెళ్లినప్పుడు మడల్యా ఓ హేర్ తో ఫోన్ లో మాట్లాడాను. ఆమె టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ లో ఉండేది. అప్పటికే వృద్ధురాలు. భారత దేశంలో పర్యటించినప్పుడు విజయవాడ, హైదరాబాదు సభలలో పాల్గొన్నది. ఫోనులో చాలాసార్లు చాలాసేపు మాట్లాడాను. ఆస్టిన్ ఆహ్వానించినా నేను వెళ్ళలేకపోయాను. ఎందుకోగాని విజయవాడ నాస్తిక కేంద్రానికి చెందిన లవణం పట్ల వ్యతిరేకత చూపింది. అమెరికా నాస్తికులలో ఆమె తీవ్రవాది. రేడియో, టి.వి. ఛానల్స్ ద్వారా నాస్తిక ప్రచారం ఉధృతంగా చేసింది. పుస్తకాలు, వ్యాసాలు ప్రచురించింది. ఆమె తీవ్ర ధోరణికి తట్టుకోలేక కొందరు చీలిపోయి వేరే సంఘం పెట్టుకున్నారు.

1960 ప్రాంతాలలోనే మడల్యా ఓహెర్ పోరాడి పాఠశాలలలో మత విద్య బోధించరాదని పట్టుబట్టి సుప్రీం కోర్టు ద్వారా గెలిచింది. మేరీలాండ్ రాష్ట్రం నుండి వెళ్లి ఆస్టిన్ లో స్థిరపడింది. అమెరికా పర్యటనలో మరోసారి ఆమెను కలుసుకోవాలను కుంటుండగా హత్యకు గురైంది. ఆమెదగ్గర పనిచేసే వారే డబ్బు కోసం అలా చేశారని తరవాత బయటపడింది.

నాస్తిక ఉద్యమ కేంద్రం ఆస్టిన్ నుండి న్యూజెర్సీకి మారింది. శ్రీమతి ఎలెన్ జాన్సన్ అధ్యక్షురాలుగా నాయకత్వం వహించింది. ఆమెకు మద్దతుగా రాల్ బేరియర్ స్పోక్స్ పర్సన్ గా ఉండేవాడు. వారికి స్ట్రాటన్ ఐలెండ్ లో స్టూడియో ఉండేది. అది న్యూయార్క్ న్యూజెర్సీ మధ్య ఉన్నది. 1998 December 13 లో వారు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ నాతో చేశారు. అది అమెరికాలో ప్రసారం అయింది. మదర్ థెరిసా నుండి ఇండియాలో నాస్తిక ఉద్యమాల రీతులను ఆ ఇంటర్వ్యూలో వివరించాము. మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర ఫోటోలు తీశారు. అమెరికన్ ఎథియిస్ట్ మాగజైన్ లో నా వ్యాసాలు ప్రచురించారు. ఫ్రాంక్ జెండ్లర్ (కొలంబస్) ఎడిటర్ గా ఉన్నారు. ఆయన ఇండియా వచ్చి నాస్తిక కేంద్రంలో ప్రసంగించినప్పుడు మేము కలసి ఉన్నాము (2003). వాషింగ్టన్ లో జరిగిన నాస్తిక సభలలో, పార్లమెంట్ ఎదుట జరిగిన రాలీలో సుప్రీంకోర్టు దగ్గర ప్రదర్శనలో నేను పాల్గొనగలిగాను. చాలామంది అమెరికన్ నాస్తికులు సన్నిహితులయ్యారు. అప్పుడే రీటా స్వాన్ (చిన్నపిల్లల సమస్యల నిపుణురాలు)ను కలిశాను.

Ellen Johnson president of American Athiest Association(center), Ron Barrier with Innaiah in Studio



అమెరికాలో మరొక ప్రముఖ నాస్తిక సంఘానికి మార్గరెట్ డౌనీ నాయకత్వం వహిస్తున్నారు. శాస్త్రీయ పరిశీలనా కేంద్ర ప్రారంభోత్సవం వాషింగ్టన్ లో 2006లో జరిగినప్పుడు ఆమెను కలిశాను. చేతి పర్సులో గోరా ఫోటో పెట్టుకొన్నది. లవణం తనకు తెలుసని చెప్పింది. 2007 సెప్టెంబరులో వాషింగ్టన్ లో జరిగిన నాస్తిక సభలకు నన్నాహ్వానించింది.

Margaret Downey

Sunday, October 5, 2008

జేమ్స్ రాండీతో పరిచయం-Experiences in USA


James Randi now in his 80s





సుప్రసిద్ధ మానవ వాద మెజీషియన్ జేమ్స్ రాండీతో ఇండియా నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుండేవాణ్ణి. ఆయన రచనలు ముఖ్యంగా ఫెయిత్ హీలర్స్ ( faith healers)వంటివి చదివాను. ఆయన వెబ్ సైట్ నిత్యమూ పరిశీలిస్తుంటాను. 1998 లో వాషింగ్టన్ లో స్మిత్ సానియిన్ మ్యూజియమ్ లో ఆయన కార్యక్రమానికి వెళ్లాను. చక్కగా ప్రసంగించి మేజిక్ చేసి చూపారు. అప్పుడే తొలిసారి కలిసి మాట్లాడాను. ఇండియాలో పర్యటించమని ఆహ్వానించాను. కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఖర్చులు పెట్టుకుంటే వస్తామన్నారు. కాని ఆ పని చేయలేక పోయాను. యూరి గెల్లర్ వంటివారి మోసాలను క్రైస్తవ ప్రచారకుల మత వ్యాపారాన్ని ఆయన బట్టబయలు చేశారు. 5 కోట్ల రూపాయలు అవార్డు ప్రకటించి హోమియోపతి నుండి జ్యోతిష్యం వరకు శాస్త్రీయమని రుజువు చేయమని ఛాలెంజ్ చేశారు. కొందరు ప్రయత్నించి విఫలం కాగా మరికొందరు సాహసించి ముందుకు రాలేకపోయారు. ఫ్లారిడా రాష్ట్రంలో ప్లాంటేషన్(Plantation) కేంద్రంలో జేమ్స్ రాండీ శిక్షణ ఇస్తూ, పర్యటనలు చేస్తూ శాస్త్రీయ పంథాను బాగా వ్యాపింపచేస్తున్నారు. వయస్సు మీదపడుతున్నా పట్టుదలగా తన పని చేసుకుపోతున్నారు. చైనాప్రభుత్వం ఈయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయించడం పేర్కొనదగినది.



The Foundation is committed to providing reliable information about paranormal claims. It both supports and conducts original research into such claims.

At JREF, we offer a one-million-dollar prize to anyone who can show, under proper observing conditions, evidence of any paranormal, supernatural, or occult power or event. The JREF does not involve itself in the testing procedure, other than helping to design the protocol and approving the conditions under which a test will take place. All tests are designed with the participation and approval of the applicant. In most cases, the applicant will be asked to perform a relatively simple preliminary test of the claim, which if successful, will be followed by the formal test. Preliminary tests are usually conducted by associates of the JREF at the site where the applicant lives. Upon success in the preliminary testing process, the "applicant" becomes a "claimant."

To date, no one has passed the preliminary tests
Please see for details,application at:
www.randi.org

Friday, October 3, 2008

God Delusion Telugu translation


Presented translation to Richard Dawkins,Scientist in Washington DC
The book is rated as best seller in New York Times
(R to L) Richard Dawkins, Sam Harris ( End of Faith writer), Rohit and translator N.Innaiah





God Delusion Telugu translation devudi bramalo

Richard Dawkins published scientific study of evolution, intelligent design and the need for ethical life without religion, god and superstitions. This is translated into Telugu by Innaiah as Devudi Bramalo.

* Devudi Bramaloa.pdf

God Is Not Great


Christopher Hitchens







God Is Not Great


Christopher Hitchens


Telugu translation



Narisetti Innaiah




లేని దేవుడి పేరు పై మోసం



క్రిస్టొఫర్ హిచిన్స్



తెలుగు

నరిశెట్టి ఇన్నయ్య
can be accessed at:





* Telugu_translation_of_God_is_not_great.
PDF file
19 chapters
New York Times Best Seller

Wednesday, October 1, 2008

మరోకోణంలో అమెరికా విశేషాలు









ఎమ్.ఎన్. రాయ్ మొదటి భార్య ఎవిలిన్ పై రిసర్చ్

అమెరికాలో పరిశోధన, పరిశీలన సౌకర్యాలు విరివిగా ఉన్నాయి. రాజధానిలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, ఆర్కివ్స్ ఇందుకు ఎంతో తోడ్పడ్డాయి. నేను 1992లోనే ఎమ్.ఎన్. రాయ్ మొదటి భార్య ఎవిలిన్ పై సమాచార సేకరణ ప్రారంభించాను. ఆమె అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో 1920 నుండి పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీని తాష్కెంట్ లో స్థాపించినవారిలో ఉన్నారు. రష్యా యూరోపులలో పర్యటిస్తూ పత్రికలు నడిపారు. లెనిన్, స్టాలిన్, ట్రాటస్కీ వంటివారితో పరిచయం ఉన్నది. అయినా ఆమెను గురించి తన జీవిత గాథలలో రాయ్ ఒక్కమాట కూడా రాయలేదు. ఆ మిస్టరీ వెనుక యదార్థం కోసం చేసిన ప్రయత్నమే నా రీసర్చ్. అందులో భాగంగా ఆమ్ స్టర్ డామ్ సామాజిక పరిశోధనా సంస్థ నుండి ఆమె ఉత్తరాలు, పత్రాలు సేకరించగలిగాను. జాక్ హార్నర్ అనే కమ్యూనిస్ట్ నాయకుడుతో ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లభించాయి. అమెరికాలో ఆమె సోదరితో ఉత్తరాల ద్వారా కొన్ని ఫోటోలు సేకరించగలిగాను. ఎవిలిన్ అక్క కుమారుడు డెవిల్ మెరిడెత్ ఉన్నాడని తెలిసి ఆయన్ని కలుసుకున్నాను. లాస్ ఏంజిలస్ దగ్గరలో పామ్ డెసర్ట్ వద్ద ఆయన నివసిస్తున్నాడు. వెళ్ళి ఇంటర్వూ చేశాను. నాతోపాటు గోగినేని కృష్ణారావు ఆయన అల్లుడు కీ.శే. మదన్ వచ్చి రికార్డు చేసి పెట్టారు. తెలుగు ఆదరంతో చాలా విషయాలు చెప్పారు. పెద్దమ్మను గురించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఎవిలిన్ చివరి రోజులలో స్తాన్ ఫర్డ్ యూనివర్సిటీ దగ్గర చిన్న ఉద్యోగాలు ఏవో చేసుకుంటూ, తన గత జీవితాన్ని దాచి పెట్టి కాలం వెళ్ళబుచ్చింది. ఆమెతో ఎవరైనా ఇంటర్యూ చేయాలంటే స్తాన్ ఫర్డ్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ రాబర్ట్ సి. నార్త్ ద్వారానే వీలయ్యేది. 1970లో ఎవిలిన్ చనిపోయింది. నేను ప్రొఫెసర్ నార్త్ ను 1998లో కలిసినప్పుడు ఆయన తనకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పారు. నార్త్ కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర డాక్యుమెంట్లను అధికారి పరిష్కరించి ప్రచురించారు. ఇందులోనూ ఎవిలిన్ పాత్ర ఉన్నది. నా పరిశోధనా సారాంశాన్ని ఎవిలిన్ ట్రెంట్ అలియాస్ శాంతి దేవి శీర్షికతో ప్రచురించాము. కమ్యూనిస్టుగా ఆమె శాంతి దేవిగా ప్రచారంలో ఉండేది.

Author:
Innaiah, N.,
Title:
Evelyn Trent alias Shanthi Devi, founder member of exile Indian Communist Party / N. Innaiah.
Publisher:
V. Komala : Sole distributorBooklinks Corp.,
Copyright Date:
1995
Description:
121 p. : ill. ; 23 cm.
Subject:
Trent, Evelyn, --1892-1970
Roy, M. N. --Manabendra Nath--1887-1954
Communists --United States
Communists --India
Summary:
Brief biography of Evelyn Trent, 1892-1970, former wife of M.N. Roy co-founder of the Communist Party of India; includes correspondence, letters, and documents.
Locations:
University of Iowa Libraries (University of Iowa) (Iowa City