Thursday, October 1, 2009

ఇక సెలవు

నా ప్రపంచం వ్యాసాలలో ఉదహరించిన రాందేవ్, బాబా, రవిశంకర్ వగైరా ప్రభృతులపై నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం కాని ద్వేషం కాని లేవు. వారు వెళ్లడించిన భావాలతోనే నా అసమ్మతి, వ్యక్తులపై కాదు. నేను పాత్రికేయుడను. నా పుస్తకాలు తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, ప్రామిథియస్ అమెరికా వగైరా ప్రచురణకర్తలు ప్రచురించారు. అంతర్జాలంతో ఎలాంటి సంబంధం లేని నేను, మిత్రులు సి.బి.రావు అహ్వానంపై బ్లాగులోకంలోకి రావటం జరిగింది. తొలుత వారి సూచన మేరకు వివిధ పత్రికలు,పాత్రికేయులతో నా అనుభవాలు మీతో పంచుకోవటానికై ఈ బ్లాగు ప్రారంభించటం జరిగింది. నా అముద్రిత రచనలు కూడా నా ప్రపంచం లో చోటుచేసుకున్నాయి. చాలా పుస్తకాలను e-books గా ఇవ్వటం జరిగింది. తొలినాళ్లలో ఈ బ్లాగులో నా వ్యాసాలను సి.బి.రావు గారు ప్రచురించారు. వారి సహకారంతో నా ప్రపంచం లో నేనే స్వయంగా నా ప్రపంచం పేరుతో పలు వ్యాసాలు ప్రచురించాను. ఈ బ్లాగు ప్రారంభించిన ఉద్దేశం నెరవేరింది కనుక దీనిని ఇకముందు ఉపయోగించబోవటం లేదు. మానవవాదం అనే సరికొత్త బ్లాగులో త్వరలో మీతో నా భావాలు పంచుకుంటాను.

ఇన్నాళ్లుగా ఈ బ్లాగును ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఇక సెలవు.

మీ,

ఇన్నయ్య
http://innaiahn.tripod.com