Thursday, October 1, 2009

ఇక సెలవు

నా ప్రపంచం వ్యాసాలలో ఉదహరించిన రాందేవ్, బాబా, రవిశంకర్ వగైరా ప్రభృతులపై నాకు ఎలాంటి వ్యక్తిగత వైరం కాని ద్వేషం కాని లేవు. వారు వెళ్లడించిన భావాలతోనే నా అసమ్మతి, వ్యక్తులపై కాదు. నేను పాత్రికేయుడను. నా పుస్తకాలు తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, ప్రామిథియస్ అమెరికా వగైరా ప్రచురణకర్తలు ప్రచురించారు. అంతర్జాలంతో ఎలాంటి సంబంధం లేని నేను, మిత్రులు సి.బి.రావు అహ్వానంపై బ్లాగులోకంలోకి రావటం జరిగింది. తొలుత వారి సూచన మేరకు వివిధ పత్రికలు,పాత్రికేయులతో నా అనుభవాలు మీతో పంచుకోవటానికై ఈ బ్లాగు ప్రారంభించటం జరిగింది. నా అముద్రిత రచనలు కూడా నా ప్రపంచం లో చోటుచేసుకున్నాయి. చాలా పుస్తకాలను e-books గా ఇవ్వటం జరిగింది. తొలినాళ్లలో ఈ బ్లాగులో నా వ్యాసాలను సి.బి.రావు గారు ప్రచురించారు. వారి సహకారంతో నా ప్రపంచం లో నేనే స్వయంగా నా ప్రపంచం పేరుతో పలు వ్యాసాలు ప్రచురించాను. ఈ బ్లాగు ప్రారంభించిన ఉద్దేశం నెరవేరింది కనుక దీనిని ఇకముందు ఉపయోగించబోవటం లేదు. మానవవాదం అనే సరికొత్త బ్లాగులో త్వరలో మీతో నా భావాలు పంచుకుంటాను.

ఇన్నాళ్లుగా ఈ బ్లాగును ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఇక సెలవు.

మీ,

ఇన్నయ్య
http://innaiahn.tripod.com

7 comments:

yogirk said...

ఇన్నయ్యగారు వద్దు. వెళ్ళొద్దు. మీరులేని బ్లాగు పెపంచకంలో నేనుండలేను. ఉండిపోండి పిల్లీజ్!

Unknown said...

అయ్యో మీరు ఇలా అర్థంతరంగా వెళ్ళిపోతే ఎలా.
ఈ బ్లాగు చాలా మందికి సరదాయైన బ్లాగు. వాళ్ళ వాళ్ళ మనో భావాలను తెలియచేసుకోటానికి ఉపయోగించుకుంటున్నారుగా!

దయచేసి వాళ్ళ సరాదని పడుచేయకండి.

Unknown said...

Please please please don't go

మంచు said...

ఇన్నయ్యగారు ఇక్కడే వున్నారు.
http://innaiahn.blogspot.com/

Suresh Veeragoni said...

please do post your new blog link here! i love to read your articles and know the perspective of people...

Anonymous said...

ఇన్నయ్య గారు ఇక లేరు అంటే నమ్మలేకుండా వున్నాను. ఆ భగవంతుడు అపుడే ఇన్నయ్య గారిని నిష్క్రమించేలా చేశాడు , ఎంత కఠినాత్ముడు!
సాహితీ రంగానికైతేనేమి, తెలుగు భాషకైతేనేమి, బ్లాగ్ స్పాట్ కైతేనేమి , అదీతేనేమి, ఇదైతేనేమి ఆయన సేవలు మరువరానివి. ఆంధ్రదేశం గర్వించదగ్గ వ్యక్తులలో ఆయన ఒకరు అని చెప్పడంలో సందేహం లేదు.
ఆయన మనచెంత లేకున్నా ఆయన సల్పిన కృషి సదా మనతో వుంటుందని ఆశిస్తూ, శ్రద్ధాంజలి ఘటిస్తున్నా..

cbrao said...

@S: ఇన్నయ్య గారు తన కొత్త పుస్తకం Political History of Andhra Pradesh ఇప్పుడే ప్రచురించారు. త్వరలో మానవవాదం బ్లాగులో మిమ్ములను కలువబోతున్నారు.