Tuesday, May 19, 2009

జ్యొతిశ్యం -ఆలొచించండి





జ్యోతిశ్యంలొ గ్రహబలం వాస్తవం అయితే ,ఆనాడు తెలియని కొత్త గ్రహాలు కనుగొన్నారు గదా.వాటి ప్రభవం లేకుండానే ఇన్నాళ్ళూ కథ నడిచిందన్నమాటేగా.యురేనస్,నెప్తూన్ ,ప్లూటో వంటి వి .


తారా బలం నిజంగా వుంటే భూమికి అతి సమీపం లో వుండే తార నుండి కిరణాలు రావడానికి 4 కాంతి సంవత్చరాలు పడుతుంది .మిగిలిన తారలు ఇంకా దూరాన వున్నాయిగదా .మరి వాటి ప్రభవం ఎలా గణిస్తారు?


రాసులు అని చెప్పేవి వూహించిన ఆకారాలుగదా .అవి నిజంగా లేవు.వాటిని బట్టి జన్మ నక్సత్రం అని చెప్పేవి రుజువుకు నిలబడవుగదా .జ్యొతిశ్యం ఎలా శాస్త్రయం ?


ప్రశాంతంగా ఆలోచించండి.

7 comments:

Anonymous said...

ప్రశాంతంగా చెబ్తున్నాను; మీరు ప్రశాంతంగా వినండి.

1. మీరు అడిగిన ప్రశ్నలకు కొన్నిటికైనా జవాబులు ఉన్నాయి. కానీ, దానికి మీరు రోజూ చూసే పేపర్లో "ఫలానా రూములో సంప్రదించండి" అని చెప్పే జ్యోతిష్యులు

చెప్పలేరు. దాన్ని శాస్త్రంగా నమ్మి అధ్యయనం చేసే వాళ్ళని అడిగితే చెప్పగలరేమో చూడండి. కాకపోతే, అలా అలా మీరు జ్యోతిష్యం నేర్చుకునేసి, అందులో అన్

రిజాల్వ్డ్ ప్రశ్నలని సాధించేస్తే, మీరు చాలా గొప్పవారై పోతారు. :) అంటే అందులో ’అన్నీ తెలీదు’ అని జ్యోతిష్యులకు తెలుసు. ఆ విషయాన్ని మీరు

తెలుసుకోగలుగుతారు. ఐనా వాళ్లు శోధిస్తున్నారు.

2. దీన్ని శాస్త్రీయ మార్గంలో ఎలా నడిపించాలో అని ఆలోచిస్తే, ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పి, ఎక్కడ కొరకుడు పడట్లేదూ వాళ్ళూ చెబ్తారు.అలా

కాకుండా, అది అశాస్త్రీయం, మూఢనమ్మకం అని మీరంటే, వాళ్ళకి మీతో వచ్చే లాభం లేదు; పైగా మీ వల్ల చాలా హానీ కూడా! సో వాళ్ళు మీ జోలికి రారు.

౩.పోతే, హేతువాదిగా మీరు ప్రజలకి చెప్పగలిగేది ఒకటే! "ఆలోచించండి" అని! అంతేగానీ, ఏది రైటో, ఏది రాంగో మీరే నిర్ధారించి చెబితే, మీకూ, ఆ జ్యోతిష్యులకూ నా కైతే

తేడాలేదనిపిస్తుంది. ఆలోచించడాన్ని, శోధించడాన్ని నేర్పాలేగానే - మీకు "జ్యోతిష్యం" తెలుసు అని మీరు భ్రమించ కూడదేమో! అలాగే ఎవ్వరినీ భ్రమింప

చేయకుడదేమో! మరి అలా అంటే, మోసపోతున్న వాడిని ఆపద్దని కాదుగా! కాబట్టి చెప్పాలి కూడా!

ఒక్కమాటకి నాకు సమాధానం చెప్పండి : తాగి చెడకురా అని మీరు ఓ దరిద్రుడికి చెబుతారా! మరి అదే మాట తాజ్ కృష్ణాలో ఉన్నవాడికీ చెబుతారా! చెప్పరే!

ఎందుకని? అదే తేడా ఇక్కడ కూడా!

చివరగా: జోతిష్యం అంటే జాతకాలు చెప్పడం, ముహుర్తాలు పెట్టడం, రాళ్ల ఉంగరాలు చెప్పడం, జపాలు చేయడం మాత్రం కాదు; సైన్స్ వెదికేది టివి కోసం కాదు; కానీ

టివి కనుగొనటానికి ఉపయోగపడింది. అలాగే జ్యోతిష్యం వెదికేది మనుష్యుల భవిష్య్తత్తులు చెప్పడం మాత్రం కాదు కాక కాదు.

పోనీ నాకు జ్యోతిష్యం రాకపోయినా నేను ఓ విషయం చెబ్తాను; మీరెవరితో నైనా ట్రై చెయ్యండి.

జ్యోతిష్యం ప్రకారం ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మీరు చూడండి - ఇందులో చాలా సిస్టమ్స్ ఉన్నాయి.
సైన్స్ పరంగా కూడా ఇప్పుడు ఆయా ప్లానెట్స్ అవే రాశుల్లో ఉన్నాయా లేదా అని గమనించండి. చాలా సార్లు అది కరెక్టే నని తేలవచ్చు; కొన్ని సార్లు తేడా ఉంటుంది.

అప్పుడు మీరు లెక్కలు చూడండి; చంద్రుడ్ని బేస్ చేసుకోవడం వల్ల ఎంత తేడా వస్తుంది; సూర్యిడిని బేస్ చేసుకోవడం వల్ల ఎంత తేడా వస్తుంది - ఇలాగన్న మాట!
ఈ కంపేరిజన్స్ లో ఖచ్చితంగా జ్యోతిష్యము ఇది ఎలా గణిస్తోంది అనే ఆసక్తైనా రావాలిగా! గ్రహాణాలను వీళ్ళు ఎలా లెక్కిస్తున్నారు అనైన అసలు మీకు ఆసక్తి

రావాలిగా! అలాగన్న మాట. అలా ఇది శాస్త్రీయమే! ఐతే - శాస్త్రం అనేది ఏమిటి అనేదానికి ఓ నిర్వచనం ఉన్నది; దీన్ని మీరు మళ్ళి పాశ్చాత్యుల సైన్స్ అన్న డెఫనిషన్

తో చూస్తే కొంచెం ట్రబుల్ ఉంటుంది, కానీ, ఆ డెఫెనెషన్లో స్వయంగా ఇంకా సైంటిఫిక్ అప్రోచస్ అన్ని ఫిట్ అవ్వవు కాబట్టి, ఇందులో ఫిట్ గానీ పోర్షన్ని కూడా అలాగే

భావించి, శోధించి సాధించాలి. ఇది మనం చేయలేకపోతే, చేసే వాళ్ళని ప్రోత్సహించాలి; అదీ చేయలేకపోతే వాళ్ళమానానికి వాళ్ళనొదిలేయాలి. కానీ ప్రజలు

మోసపోతున్నారే అని మీరడిగితే - ’ఔను మీరందుకే ఇలాగే చెప్పండి’ అని చెప్పి మిమ్మల్ని వాళ్ళు వదిలేయాలి - అదీ విషయం.

పోతే, బహుశా మీరు గుర్తించిన మరో యాంగిల్ చెబ్తా వినండి:
1. ఓ పక్కనుంచి మీరు జ్యోతిష్యులను తిట్టి, వాళ్లు చెప్పే రాళ్ళ ఉంగరాల బిజినస్, జపాల బిజినస్, పూజల బిజినస్ దెబ్బకొడుతుంటే, మరో పక్క ఫెంగుషూయీ

మార్కెటింగ్ ఎక్కువైపోయి వాటికి బోళ్డు గిరాకీ పెరిగి పోతోంది. చివరికి మన సంస్కృతి అని పిలుచుకోవడానికి, కనీసం మన రత్నాలతో పొదిగిన బంగారు ఉంగరాలు

కూడా మిగల్చదేమో చూడండి; నా కైతే భయం లేదు - జ్యుయలరీ షాపు వాళ్ళు దీన్ని పోషిస్తున్నారు; కాకపోతే, ఆ లాభాలేవి నిజమైన జ్యోతిష్య అభివృద్ధికి మాత్రం

ఎవ్వరూ విదిల్చటం లేదు. అదే సైన్స్ లో ఐతే, కనుగొన్న ప్రతిదాన్ని మార్కెట్ చేసుకోవచ్చు - ఎంచక్కా! అలా వచ్చే డబ్బుతో మళ్ళీ సైన్స్ ని ఫండింగ్ చేసుకోవచ్చు!

2.మన సంస్కృతిలో మనకీ ఓ క్యాలెండర్ ఉన్నదని, దాంట్లో మన పంటలకి లింకు పెట్టి, పండగలు ఉన్నాయని మర్చిపోయి, కేవలం కొన్ని గ్రీటింగ్ కార్డ్ కంపెనీలు నేర్పిన

పండగలు అలవాటు చేసుకొని ఆనందిస్తాం; దీనిలో తప్పులేదు; కానీ మన సంస్కృతి అనేది ఏదీ మిగలదు.అది ఎందుక్కావాలి అని అడిగితే నేను ఇక్కడ సమాధానం

చెప్పలేను.

ఇలా ఎంతైనా రాయొచ్చు; ఇక్కడితో ముగిస్తున్నాను. పబ్లిష్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంతకీ మీకు తెలుగెందుకు బతకాలో ఇప్పటికైనా తెలిసిందా!! మెజార్టీ తెలుగు

ప్రజలున్నారు కాబట్టి "తెలుగు" ఉండక్కర్లేదు, వాళ్లకి ఇంగ్లిషు నేర్పిస్తే సరి అనే విషయం అవగతమైందా!!! ఆఫ్ కోర్స్ ఎలాగూ ప్రభుత్వం అదే చేస్తోంది.
మీకింకో విషయం చెప్పనా - మీరు తెలుగులో రాసినదాన్ని ఎవ్వరూ చదవరు; ఎందుకో తెలుసా - తెలుగే చచ్చిపొతే ఇదంతా ఎవడు చదువుతాడు ::)) :)) :))

Praveen Mandangi said...

గ్రహాల ప్రభావం భూమి మీద పడే అవకాశాలు చాలా తక్కువ. ఆ ప్రభావం మనుషుల మీద ఉంటుందనుకోవడం హాస్యాస్పదం.

భాస్కర రామిరెడ్డి said...

ఒక్కసారి మీరందరూ A Brief History of Time ( Stephen Hawking ) పుస్త్కాన్ని చద్వండి. చదివి నమ్మ దగ్గదిగా వుంటే అప్పుడు మనము ఖగోళ శాస్త్రం గురించి, గ్రహాల ప్రభావం భూమి మీద పడే అవకాశాల గురించి మాట్లాడుకోవచ్చు.

Praveen Mandangi said...

గ్రహాల యొక్క కాంతి ప్రభావం లేదా గ్రావిటేషన్ ప్రభావం భూమి మీద పడే అవకాశాలు చాలా తక్కువ. ఖగోళ శాస్త్రం గురించి బొత్తిగా తెలియనివాళ్ళకి కూడా ఈ విషయం చెపితే అర్థమవుతుంది.

చిత్తూరు మురుగేశన్ తన బ్లాగ్ లో వ్రాశాడు. "జ్యోతిష్య ప్రభావం వల్లే రాజశేఖర రెడ్డి గెలిచాడట, అతను చెప్పిన జాతకం నిజమయ్యిందట!". జాతక ప్రభావం ఏమీ లేదు, పోలవరం, పులిచింతల కాలువలు నిర్మాణంలో ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ కి వోట్లు ఎక్కువ పడ్డాయి కనుక ఇరిగేషన్ ప్రోజెక్టుల వల్ల గెలిచినట్టు అని నేను సమాధానం చెప్పాను. అతను ఆ సమాధానం అంగీకరించలేదు. గ్రహబలం అనుకూలించడం వల్లే రాజశేఖర రెడ్డి పోలవరం & పులిచింతల ప్రోజెక్టులు చేపట్టగలిగాడని మురుగేశన్ వాదించాడు.

భాస్కర రామిరెడ్డి said...

జ్యోతిష్య ప్రభావం వల్లే రాజశేఖర రెడ్డి గెలిచాడట, అతను చెప్పిన జాతకం నిజమయ్యిందట!".

:-)

Praveen Mandangi said...

http://blaagu.com/swamy7867/2009/05/16/ఈ లింక్ చదవండి.

Chittoor Murugesan said...

అయ్యా నేను కూడ మీలా ఎంతో తెలివిగా ప్రశ్నించినవాడే..
జ్యోతిషం గురించి ఉత్తుత్తి విమర్శలెందుకు. మీకు దమ్ముంటే మీ జాతకం నేను చెబుతా (బ్లాగులోనే) సం. తరువాత వాదిస్తాం.
మనిషి శరీరంలోని నీరు, తల్లి గర్భంలో శిశువు తేలాడే నీరు, సముద్రపు నీరు వీటిని చెరో టెస్ట్ ట్యూబులో పెట్టి పరీక్షిస్తే వీటి కెమికల్ కాంబినేషన్ ఒకటై ఉండటాన్ని చూడొచ్చు. సముద్రపు నీటిని చంద్రుడు ప్రభావించగా లేనిది అదే కెమికల్ కాంబినేషన్లోని నీటిని 70 శాతం తన శరీరంలో కలిగి ఉన్న మనిషిని చంద్రుడు ప్రభావించడా.
కొత్త గ్రహాల మాటంటారా..
జ్యోతిషమన్నది ఎంతో అభివ్రుద్ది చెందాల్సిన అధ్భుత విజ్ఞానం. కాని మీ బోటి వారి వితండా వాదాలతో ఇలా మరుగున పడింది.
సవాలు విసురుతున్నాను.
100 జాతకాలు నాకు పంపండి. వాటికి ఫలితాలు బ్లాగులో పెడతాను . ఆ జాతకులను తేల్చమనండి జ్యోతిషం ఎంతవరకు నిజమైందో

గ్రహాలెన్నో ఉండొచ్చు. వాటి ప్రభావం మనమీద ఎంత మెరకుంటుందని ఎలా అంచనా వెయ్యడం ? నాటి రుషులు లేరు ? నేటి ఆస్ట్రోనెట్లు సహకరించరు. ఎలా చావమంటారు ?