Thursday, May 28, 2009

మంత్రులకు మూఢనమ్మకాలుంటే

భారతదేశంలో ఎన్నికలు పూర్తయి కేంద్రంలోను, రాష్ట్రంలోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మంత్రులు ప్రమాణాలు చేసేటప్పుడు రాజ్యాంగం అమలు జరుపుతామని హామీ ఇస్తూ పదవీ స్వీకారం చేస్తారు. రాజ్యాంగం కొంతమంది చదువుతారో, అర్థం చేసుకుంటారో తెలియదు. రాజ్యాంగంలో మౌలిక విధిగా శాస్త్రీయ పంథాను ప్రజలలో వ్యాపింపజేయటం ముఖ్యం అని స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది. అది చేసే బదులు, అందుకు విరుద్ధంగా తమ వ్యక్తిగత మూఢ నమ్మకాలను, చేదస్తాలను ఆఫీసులలోకి, పరిపాలనలోకి తీసుకు వస్తున్నారు. పదవి చేబట్టి ఆఫీసులో ప్రవేశించడానికి ముహూర్తాలు చూస్తున్నారు. వాస్తు పాటిస్తున్నారు. తాము నమ్మిన దేవుళ్ళను, బాబాలను ఆఫీసులలో కూడా ఫోటోలు పెట్టి దండాలు పెడుతున్నారు.
మంత్రులు మానవ మాత్రులే కనుక వారికి నమ్మకాలు, మత పరమైన ఛాదస్తాలు, వంశపారంపర్యంగా వస్తున్నాయి. కాని వారు నిర్వహించే పదవి ప్రజా ధనంతో కూడినది. ప్రజలలో అన్ని మతాలవారూ, మతేతరులు ఉన్నారు. వారు పన్నులు చెల్లిస్తారు కనుక పరిపాలనలో నిస్పక్షపాతంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని పరిపాలించాలి. వ్యక్తిగత నమ్మకాలను, మత విశ్వాసాలను వ్యక్తిగతంగానే అట్టిపెట్టుకోవాలి. లేకుంటే క్రమేణా ఈర్ష్యలూ, ద్వేషాలూ, కలహాలూ వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొందరు మంత్రులు వాస్తు ప్రకారం ఆఫీసులు, ప్రభుత్వ ఇళ్లూ మారుస్తున్నారు. దానికయ్యే ఖర్చు ప్రజలపై పడుతుంది. మరికొందరు మంత్రులు తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి తిరుపతికి, బాబాల వద్దకు, చర్చిలకు, మసీదులకు పోతున్నారు. అది స్వంత ఖర్చుతో ప్రభుత్వ ఆర్భాటం లేకుండా చేస్తే సరే, అలా కాక ప్రజల డబ్బుతో చేస్తే దుర్వినియోగ పరిచినట్లే. కానీ, మూఢ నమ్మకాలను ప్రజల నుండి తొలగించాల్సినవారే, ప్రజలకు ఇంకా మూఢనమ్మకాలు నూరిపోయడం దారుణం. వర్షాలు రాకపోతే యజ్ఞాలు చేయించి, అది ప్రజా సేవ అని అనుకోమనడం కంటే మోసం మరొకటి లేదు.

40 comments:

Praveen Mandangi said...

"యథా రాజ: తథా ప్రజా"
చెవుల్లో పువ్వులూ, మొహం మీద పంగనామాలు పెట్టుకునేవాళ్ళు మంత్రులు, అధికార్లు అయితే ఇక సాధారణ ప్రజల నమ్మకాలు ఊహించుకోవడం కష్టం కాదు.

కాలనేమి said...

"మానవ మాత్రులే కనుక వారికి నమ్మకాలు, మత పరమైన ఛాదస్తాలు, వంశపారంపర్యంగా వస్తున్నాయి"

మానవాతీతులూ, వంశపారంపర్య లక్షణ అవలక్షణాదులను చేదించగల మీలాంటి వారలు, కేసీయార్ కు మల్లే ఒక ఉద్యమాన్ని లేవనెత్తండి! ఒక నాస్తిక ఛాందసవాద మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేసి దానికి ఏటేటా మీవట్టి మానవాతీతులనూ, కారణ జన్ములనూ ఈ శాఖామాత్యులను చేసి మన రక్షకభటులు శాంతిభద్రతలను కాపాడి, చట్టాన్ని అమలు చేసే చందాన మీరు నాస్తిక ఛాందసవాదాన్ని కొడిగట్టుకున్న దీపం స్థాయినుంచి, దేదీప్యమాన జ్యోతి గా మార్చండి!!

నేతిబీరకాయల్లో నేయి లాగా, హేతువాదుల్లో హేతువెంతో లోకానికి చాటి చెప్పండి!!

కాలనేమి said...

for comment feed..

venkataramana said...

ఇన్నయ్య గారు,
దయచేసి "మూఢనమ్మక౦" కి నిర్వచన చెబుతారా?
నాకు ముహుర్తాల గురి౦చి తెలీదు కానీ,
"వాస్తు" అశాస్త్రీయ౦ అని మీరు నిరూపి౦చగలరా?
మీ జవాబుకై ఎదురు చూస్తున్నాను.

naprapamcham said...

Despite evidence against the belief, if one stick to it, that becomes superstition.
We have proved that vaastu has no scientific validity.
Ministers can confine their beliefs to their personal life and should not bring into public office and spend public money,
if they know the constitution which they swear.

Anil Dasari said...

ఫలానా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నాయని మురిసిపోతూ ఓట్లేసే పిచ్చిమారాజులున్న దేశం మనది. యధా ప్రజా, తధా రాజా. అల్లా నమాజులు, క్రీస్తు జపాలు, చండీ యాగాలతో పనులౌతాయనుకునే ప్రబుద్ధులు మంత్రులవటం వింతేమీ కాదు. రాన్రానూ - దేశానికి వాస్తు బాగోలేకపోటమే అన్ని సమస్యలకీ కారణం, కాబట్టి హిమాలయాల్ని తవ్వించేసి హిందూ మహాసముద్రం లోతు పూడ్పిస్తే అంతా మంచేనంటూ మాయజేసి వోట్లూ, ఆ ప్రాజెక్టుపై వేలాది కోట్లూ దండుకునే గడుగ్గాయిలొస్తారు చూడండి.

కాయ said...

Our President herself is a ghost believer... wht ctap else do u need..

Praveen Mandangi said...

నాదో డౌట్. ముస్లింలు ఏసు క్రీస్తుని దేవునిగా అంగీకరించరు కానీ ప్రవక్తగా అంగీకరిస్తారు. ఇస్లాంలో ముహమ్మద్ తరువాత ఏసు క్రీస్తే రెండవ గొప్ప ప్రవక్త. అయినా ముస్లింలు క్రైస్తవుల్ని మతాంతర వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు, క్రైస్తవులు ముస్లింలని మతాంతర వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు. డెన్మాస్క్ లో ముహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగా blasphemous కార్టూన్లు ప్రచురితమవ్వడం, దానికి వ్యతిరేకంగా ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా గొడవ చెయ్యడం గురించి తెలిసినదే. మన రాజకీయ నాయకులు తాము కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, విధవా వివాహాలు చేసుకోరు కానీ ప్రజలకి ఆ వివాహాలు చేసుకోమని సలహా ఇస్తారు. రాజకీయ నాయకులకి వ్యక్తిగతంగా సంప్రదాయాలలో మార్పు ఇష్టం లేనప్పుడు జనం వీళ్ళని ఎలా అర్థం చేసుకోగలరు? ప్రతి ఏడాది విజయనగరంలో గురజాడ అప్పారావు గారి విగ్రహానికీ, రాజమండ్రిలో వీరేశలింగం గారి విగ్రహానికీ ఉత్సవ విగ్రహాలకి వేసినట్టు పూల దండలు వేస్తారు. ఆ తరువాత వీరి గురించి పట్టించుకోరు. పదేళ్ళ క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఒక గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో మొట్టమొదటి వోట్ ని ఒక భర్త చనిపోయిన స్త్రీ వెయ్యబోయింది. ఒక పార్టీ పోలింగ్ ఏజెంట్ 'విధవ మొదటి వోట్ వేస్తే అశుభం' అని భావించి అడ్డుకోబోయాడు. వీరేశలింగం గారు, గురజాడా గారు ఇన్ని విధవా వివాహాలు చెయ్యించినా కొంత మంది మగవాళ్ళలో వైధవ్యం పై మూఢనమ్మకాలు ఇంకా తొలిగిపోలేదు. ఇక జ్యోతిష్యం, వాస్తు విషయానికి వద్దాం. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ముహూర్తం గురించి ఆలోచిస్తారు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు ముహూర్తం గురించి పట్టించుకోరు. అలాంటి వాళ్ళని చాలా మందిని చూసాను. వాళ్ళలో కొందరితో నాకు బిజినెస్ డీలింగ్స్ ఉండేవి కూడా. ఒకడు వెబ్ డిజైనింగ్ కి డబ్బులు కట్టడానికి డిలే చేశాడని వాడి బేరం వదులుకున్నాను. వాడికి అవసరమైతే వాడే మళ్ళీ నా దగ్గరకి వస్తాడని వాడ్ని వదిలేశాను. డబ్బులు విషయంలో ముహూర్తాలు పేరు చెప్పో ఇంకే పేరు చెప్పో వాయిదాలు వేసేవాళ్ళని నమ్మకూడదు.

Praveen Mandangi said...

యాగాల వల్ల వర్షాలు పడతాయన్నది నిజమైతే నీటి కోసం ఇరిగేషన్ ప్రోజెక్టులు కట్టాల్సిన అవసరం లేదు. యాగాల వల్ల వర్షాలు పడవని తెలిసే మన పాలకులు ఇరిగేషన్ ప్రోజెక్టులు కడుతున్నారు. అయినా యాగాలు పేరు చెప్పి జనాన్ని ఫూల్ చెయ్యడం ఎందుకు? ఇరిగేషన్ ప్రోజెక్టులు కట్టడం చేతకాని వాళ్ళు వర్షాల కోసం యాగం చేస్తే అర్థం చేసుకోవచ్చు కానీ ఇరిగేషన్ ప్రోజెక్టుల పనులు జరుగుతుండగానే యాగాలు చేస్తూ ఇరిగేషన్ ప్రోజెక్టుల పై ఉన్న శ్రద్ధని యాగాల వైపు డైవర్ట్ చెయ్యడం ఎందుకు? మైండ్ డైవర్ట్ చెయ్యకుండా శ్రద్ధగా పని చేస్తే ఇరిగేషన్ ప్రోజెక్టులు తొందరగా పూర్తవుతాయి.

venkataramana said...

ఇన్నయ్య గారు,
ఒక నమ్మకానికి వ్యతిరేక ఆధార౦ చూపిస్తే ఆ నమ్మక౦ మూఢనమ్మక౦ అవుతు౦ది అని మీరు అ౦టున్నారు.
అ౦టే ఆ వ్యతిరేక ఆధార౦ దొరకన౦త వరకు అది మ౦చి నమ్మకమే అ౦టారా?
ప్లూటో ని 1930 లో గ్రహ౦ గా గుర్తి౦చారు. మరి ఇప్పుడు దాన్నే గ్రహ౦ కాదు అని అ౦టున్నారు. ఈ విషయ౦లో ఏది నమ్మక౦, ఏది మూఢనమ్మకమో వివరి౦చి చెబుతారా?
మీరు వాస్తు అశాస్త్రీయ౦ అని నిరూపి౦చామ౦టున్నారు. ఆధారాలు కాస్త చూపిస్తారా?

Praveen Mandangi said...

అసలు ఉనికిలోనే లేని రాహుకేతువులని నమ్మేవాళ్ళు ప్లూటో యొక్క గ్రహ స్టేటస్ గురించి ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది.

Praveen Mandangi said...

డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ముహూర్తాలు చూస్తారు కానీ డబ్బులు తీసుకునేటప్పుడు ఎవరూ ముహూర్తాలు చూడరు. కావాలంటే ఏ అమావాస్య నాడో, గ్రహణం నాడో ఒక మూఢ భక్తునికి డబ్బులు ఇచ్చే బేరం పెట్టుకోండి. అతను మొహమాటం లేకుండా డబ్బులు తీసుకుంటాడు. గతంలో నేను కూడా అలాంటి మూఢ భక్తులతో బిజినెస్ చెయ్యడం జరిగింది. ఒకడు మరీ ఓవర్ డిలే చెయ్యబోయాడని అతని బేరం వదిలేశాను కూడా. ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల బిజినెస్ రిలేషన్స్ దెబ్బ తింటాయి.

naprapamcham said...

Vaastu pundits claim that it is scientific. We proved that their claim is not supported with evidence. Hence we call it unscientific.Gouri Tirupati reddi a vastu pundit faced this situation with us in ETV2 and also other vaastu pundits failed to prove. They could not establish the relationship between health failure and vaastu, economic loss to vaastu etc.Please note that those who propose with extraordinary claims should also prove.We are denying their false claims.

Praveen Mandangi said...

ముహూర్తాలూ, మంచి రోజులూ పేర్లు చెప్పి అవతలి వారికి ఇవ్వాల్సిన డబ్బులు వాయిదా వేస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. కొన్ని సార్లు వాళ్ళకి కోపం వచ్చి బేరం అవసరం లేదని చెప్పి సర్వీస్ చెయ్యకపోయే అవకాశం ఉంది. దాని వల్ల వాయిదా వేసినవాళ్ళకి కూడా నష్టం కలుగుతుంది.

Praveen Mandangi said...

కొన్ని స్కూళ్ళు, కాలేజిలు, NGOల వాళ్ళు వెబ్ సైట్ డిజైనింగ్ కోసం నా ఇంటర్నెట్ కేఫ్ కి రావడం జరిగింది. డిజైనింగ్ ధర ఇంత అని నేను చెప్పగానే ముహూర్తం చూసి మొదలుపెడదామనో, మంచి రోజు చూసి చెపుతామనో చెప్పి వాయిదాలు వేస్తారు. వాళ్ళ మాట తీరు చూస్తే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేని రకం అని అర్థమైపోతుంది. ఒకవేళ ఎవడైనా మరీ ఓవర్ యాక్షన్ చేస్తే మీ బేరం అవసరం లేదు అని చెప్పి పంపించేస్తాను. అలాంటి వాళ్ళని కన్విన్స్ చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. కన్విన్స్ చెయ్యడానికి ప్రయత్నిస్తే నువ్వు ఎక్కువ కాస్ట్ చెపుతున్నావు, హైదరాబాద్ లో 2000 రూ.కే చేసేస్తున్నారు లేదా 3000 రూ.కే చేసేస్తున్నారు, మేము హైదరాబాద్ వెళ్ళి చెయ్యించుకుంటాం అంటూ ఎస్కేపింగ్ సమాధానాలు చెపుతారు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళి ట్రైన్ చార్జిలు, హొటెల్ చార్జిలు తగలేసుకోవడం వాళ్ళ ప్రోబ్లం అనుకుని వాళ్ళని వదిలెయ్యడమే మనకి మిగిలిన ఆప్షన్. పారాసైటిక్ మెంటాలిటీ గల వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం మనం బిజినెస్ చెయ్యడం ఎందుకు? వాళ్ళు చేసే తప్పుల్ని సమర్థించుకోవడానికి ముహూర్తం పేరూ, మంచి రోజుల పేరూనూ. నేను సొంత ISP పెట్టుకోకముందు ఇంకో కేబుల్ ఆపరేటర్ దగ్గర నా ఇంటర్నెట్ కేఫ్ కి కేబుల్ కనెక్షన్ తీసుకున్నాను. అతను డిపాజిట్ పదివేలు రూ. తీసుకునేటప్పుడు ముహూర్తం చూడలేదు. కేబుల్ వెయ్యడం, రూటర్ పెట్టడం మాత్రం ముహూర్తం చూసుకుని చేశాడు. వాడు పెట్టిన చీప్ క్వాలిటీ రూటర్ ధర ఎంతో తెలుసా? అక్షరాల 500 రూ. వాడు వేసిన కేబుల్ కూడా చీప్ క్వాలిటీ కేబుల్. ఎక్కువ డబ్బులు తీసుకునేటప్పుడు ముహూర్తం గుర్తుకి తెచ్చుకోలేదు కానీ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టడానికి ముహూర్తం గుర్తుకి తెచ్చుకున్నాడు. వాడు వేసిన చీప్ కేబుల్స్ పెద్ద గాలికి సులభంగా తెగిపోయేవి కూడా.

కాలనేమి said...

Marthanda! Cut the crap. You are spamming my inbox.

Just like you spam Koodali. Koodali might not object, but I will.

Please cut the crap and talk sense

Praveen Mandangi said...

టాపిక్ కి సమాధానం చెప్పలేకపోతే టాపిక్ స్పామ్ లాగే కనిపిస్తుంది. If you are able to reply, you can write reply to this topic. You need not give divertive reply.

Praveen Mandangi said...

Note that we are well educated people and also think why well educated people like us are behaving like sanyasis and vairagis in daily life. Undesirably, our studies are stupefying our minds rather than modifying our lives. I noted this point after seeing so many well educated saints in my life. సన్నాసికి తెలివి వికసించాలని కోరుకోవాలి కానీ తెలివి తేటలు ఉన్న వాడు కూడా తెలిసి తెలిసి తప్పులు చేస్తే అతనికీ, సన్నాసికీ మధ్య ఏ రకమైన తేడా చూడాలి? మనిషి తన బుర్రని మంచి తెలివి తేటలకి సద్వినియోగం చేసుకోవాలి కానీ మూఢ నమ్మకాల ప్రోత్సాహానికి దుర్వినియోగం చెయ్యకూడదు.

venkataramana said...

ఇన్నయ్య గారు,
నేను కూడా మూఢనమ్మకాలని వ్యతిరేకిస్తాను. మీరు ప్రజల్లో గూడుకట్టుకుని వున్న మూఢనమ్మకాలని తొలగి౦చడానికి చాలా ప్రయత్ని౦చిన౦దుకు అభిన౦దనలు.
పూర్వ౦ భారతదేశ౦లో వున్న కులవ్యవస్త వల్ల శాస్త్రాలు కొన్ని కులాల వారికి మాత్రమే తెలుసు. వాటికి తెలీని వాళ్ళకు వివరి౦చి చెప్పకు౦డా, తమ స్వార్థ౦ కోస౦ ఉపయోగి౦చడ౦ మొదలుపెట్టి మూఢనమ్మకాలను ఆపాది౦చారు.

మ౦త్రుల వ్యక్తిగత నమ్మకాలకోస౦ ప్రజాధన౦ ఉపయోగి౦చడ౦ తప్పే అవుతు౦ది.
మీ టపాలు చాలావరకు విశ్లేషణాత్మక౦గా వు౦టాయి.
"శాస్త్రీయత", "అశాస్త్రీయత", "నమ్మక౦", "మూఢనమ్మక౦" ల గురి౦చి మీను౦డి వివరణ(నిర్వచన౦) ఆశిస్తున్నాను.
నేను ఇ౦తకు ము౦దు అడిగిన ౩ ప్రశ్నలకు మీ టపాలో సమాధాన౦ నాకు కనిపి౦చలేదు.
మీరు చెప్పినట్టుగా, "ఒక నమ్మకానికి వ్యతిరేక ఆధార౦ చూపిస్తే ఆ నమ్మక౦ మూఢనమ్మక౦" అవుతు౦ది.
1) అ౦టే ఆ వ్యతిరేక ఆధార౦ దొరకన౦త వరకు అది మ౦చి నమ్మకమే అ౦టారా?
జవాబు: -----
మీరు జవాబు చెప్పలేదు.
2) ప్లూటో ని 1930 లో గ్రహ౦ గా గుర్తి౦చారు. మరి ఇప్పుడు దాన్నే గ్రహ౦ కాదు అని అ౦టున్నారు. ఈ విషయ౦లో ఏది నమ్మక౦, ఏది మూఢనమ్మకమో వివరి౦చి చెబుతారా?
జవాబు: -----
మీరు జవాబు చెప్పలేదు.
౩) మీరు వాస్తు అశాస్త్రీయ౦ అని నిరూపి౦చామ౦టున్నారు. ఆధారాలు కాస్త చూపిస్తారా?
జవాబు: -------
మీరు చెప్పిన జవాబు: "We proved that their claim is not supported with evidence. Hence we call it unscientific."
But you have not showed any evidence against it.
My expectation:
I would like to know whether you read vaastu?
I want to know how they defined vaastu and your supporting argument to proof against the definition.

If possible, can you please write a separate post on this. I would like to have a good, meaningful discussion on this.

Praveen,
1st point to note:
You have not answered my question. If possible pls answer those Qs. And dont argue without knowing about the topic. You dont know what are Rahu and Ketu.
Here is the answer for you:
Astronomically, Rahu and Ketu denotes the two points of intersection of the paths of the Sun and the Moon as they move on. Therefore, Rahu and Ketu are respectively called the north and the south lunar nodes. The fact that Eclipses occur when Sun and Moon are at one of these points gives rise to the myth of the swallowing of the Sun.

It tells that Rahu and Ketu are 2 lunar nodes but not planets.

naprapamcham said...

వాస్తు కు కొన్ని మూల నమ్మకాలు వున్నాయి.వాస్తు పురుషుడు అనేదే పుక్కిటి పురాణం.వాస్తు దోషాలు, వాటివలన రాగల ఆరోగ్య ప్రమాదాలు అబద్దం.వాస్తు లోపాలవలన ఆర్థిక నస్టాలు అనేది కేవలం మోసం.
సుప్రసిద్ద వాస్తు పండితులతో పత్రికలలోనూ ,టి వి లలో, చర్చలు చేసాము. వివరంగా వాస్తు చెప్పేవాటికి శాస్తీయ ఆధారాలు లేవని చూపాము .వాస్తు దోషాలు గలవంటున్న ఇంట్లో వుండటానికి సిద్దం అనీ ,చెపే అనారోగ్యాలు ఆర్థిక నస్టాలు రాకుంటే వాస్తు ను అశాస్త్రీయంగా ప్రకటించి వదలుకోవాలని కోరాము .
కాని వాస్తు వ్యాపారం సాగిస్తూనే వున్నారు. చాలామందికి వాస్తు భయం పట్టుకున్నది .శిక్షలు లేకపోవడం విచ్చలవిడి తనానికి దారి తీస్తున్నది .ఇంజనీర్ల ద్వారా కూడా వాస్తు మాటలు పరిశీలించి అశాస్త్రీయమని చూపాము .
కాకమ్మ కధలు చెప్పకుండా ఎలా వాస్తు శాస్త్రీయమో రుజువు చేయవలసిన బాధ్యత వారిపైనే వున్నది. అందుకు శాస్తియమంటే ఏమిటో తెలియాలిగదా!

naprapamcham said...

What is wrong with Vaastu?

Vaastu( geomancy) is ancient belief system.Vastu
Purusha is mythological concept which is non existent
in reality.
All ancient vastu classics diffentiate allotment of
lands, consturction of houses on the basis of caste
heirarchy and division.
Brahmins should be alloted white soil which is
considered superior.
Kshatriyas should be alloted red soil which is
considered as middle level.
Vaisyas should be alloted yellow color soil.
Shudras should be alloted black soil which is
considered bitter in taste.
Vaastu Darpanam of Chall Narasimha Sastri mentioned
these aspects based on classic vaastu.
Vaastu also entered into the medical field and
categorised the constructions, its bad and good
effects, the diseases that follow and the remedies.
Telugu University
The Potti Sriramulu Telugu University followed the
vaastu in its syllabi and prescribed some books for
reference and text books.
Those books also followed the classic vaastu concepts
like Vaastu Purusha, Vaastu Maya, construction based
on differentiation etc.
Modern Vaastu is avoiding mention of caste though they
follow vaastu classic concepts in subtle way.
But modern vastu follow the evil, diseases, bad
effects and remedies in the constrction systems.
Good and bad effects:
The house owner will be rich and live with health if
his house follows GRIHAPRISTA VAASTU.Accordingly the
house construction should follow that
south,wouthwest,west and north west at height;other
ares should be low level.
The house owner loses his offspring, cattle,money if
he follows Dhaityaprita vastu. It means the land at
eat,south east and north east at height and west is at
low level.If the house owner followe Nagaprista vastu
he may face death,fear of enemies,losing his sons,and
wife.
Madhura Krishna murthy sastri in his book Vastu Sastra
Vivekam mentioned these factors.He quuoted
authoritative slokas from classic vaastu book to
support his argument( page 37-38)
Water levels and good and bad effects
Vaastu mentioned several good and bad effects, evils
,diseases based on watel levels, flow in construction
areas;
Northwest low,other areas at height
leads to difficulties and Brahmanyam.
Northwest low,other areas at height
leads to good resutsl.
South east at height and other areas at low level is
not bad.
East at height,west at low level
may cause loss of money,son etc.
North west water flow leads to
fear of enemies,alienation,loss of offspring,loss of
girl babies,indigestion .
south west water flow leads to
deadly diseases, loss of money.
Vaastu Sastra Vivekam quoted sanskrit slokas in
support of these factors in the book of Madhura
Krishna Murthy sastri.
This book is prescribed as reference for students in
Teluguj University.
Vaastu never mentioned the causal relationshiop
between construction and disease except to quote
blindly the ancient slokas.
These evil effects are not studied in scientific way.
Vaastu thus entered into dangerous realm to inculcate
fear complex among believers and perpetuate their
vasstu business.
Vaastu pandits come under the scope of Drugs and
Magical remedies act.
Vaastu pandits are violating the principles of
equality,human rights and fundamental duty of
constitution.
Government is giving grants to Telugu Univrsity where
unscientific vaastu is taught which is gross violation
of constitution.
Scientific method is totally lacking in teaching of
Vaastu.
Hence a committee with experts from doctors,
engineers, architects and astronomers be constitutued
to go into the scientific validity of Vaastu.
the university may be directed accordingly.

Praveen Mandangi said...

Astronomy never supported the concept of rahu and kethu. రాహుకేతువులు పాములని పుక్కిటి పురాణాలలో కథలున్నాయని పుక్కిటి పురాణాలు చదివేవాళ్ళందరికీ తెలుసు. రాహుకేతువులు గ్రహాలు కావని మూఢ నమ్మకాల్ని నమ్మేవాళ్ళకి తెలిసినట్టు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నేను హిందూ మత గ్రంథాలతో పాటు ఇస్లాం, క్రైస్తవ మతాలకి చెందిన గ్రంథాలు కూడా చదివాను. రాహుకేతువులు గ్రహాలు కావని హిందూ పండితులు అనుకుంటున్నారు అని చెపితే నాస్తికులే కాదు, హిందూ మతాన్ని బలంగా నమ్మేవాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు.

కాలనేమి said...

http://meyogi.blogspot.com/2009/05/blog-post_29.html

venkataramana said...

ఇన్నయ్య గారు,
మీరు నా మొదటి 2 ప్రశ్నలకు జవాబు చెప్పట౦లేదు. కేవల౦ 3వ ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు.
మీరు నన్నొక వాస్తు ప౦డితుడిగా భావిస్తున్నట్టున్నారు. నేను వాస్తు ప౦డితుడిని కాదు. వాస్తులో నిజానిజాలు తెలుసుకోవాలనుకు౦టున్నాను.
నా దృష్ఠిలో జాతిపిత, వాస్తుపురుషుడు రె౦డూ పుక్కిటి పురాణాలే.
దయచేసి మొదటి 2 ప్రశ్నలకు జవాబు చెప్ప౦డి, తర్వాత ౩వ ప్రశ్నకు వెళ్దాము.

Praveen Mandangi said...

ప్లూటో ఒక గ్రహం కావచ్చు లేదా ఆస్టరాయిడ్ కావచ్చు కానీ అది ఉనికిలో లేని మిథ్యా పదార్థం కాదు. It is ridiculous to question the credibility of science by using the name of Pluto.

naprapamcham said...

belief must establish its credibility with scientific verification.Until then it remains belief only.
The burden of proof is on the proposer.
Science is self corrective.That is its asset always. In the case of Pluto it applies.Science is not dogmatic and never asserts for permanent truth when contrary evidence is available.

venkataramana said...

1) నమ్మకానికి శాస్త్రీయమైన ఋజువు లేన౦త వరకు అది కేవల౦ నమ్మక౦గానే వు౦టు౦ది అని అ౦టున్నారు. కానీ మీరు "శాస్త్రీయత", "అశాస్త్రీయత", "నమ్మక౦", "మూఢనమ్మక౦" లకు అర్థాలు(నిర్వచనాలు) చెప్పడ౦లేదు. నాకు నిజ౦గా వీటికి అర్థాలు తెలీదు.
శాస్త్రీయ౦ కానిది అశాస్త్రీయ౦. శాస్త్రీయతతో నిరూపి౦చబడి౦ది శాస్త్రీయ౦ అని మాత్ర౦ చెప్పక౦డి.

2) ప్లూటో విషయ౦లో కూడా మీరు ఏది నమ్మక౦, ముఢనమ్మక౦, శాస్త్రీయ౦, అశాస్త్రీయమో చెప్పలేదు.
కేవల౦ సైన్స్ సెల్ఫ్ కరెక్టివ్ అని మాత్రమే చెప్పారు.
దీన్నిబట్టి చూస్తే, ప్లూటోని ఒకప్పుడు గ్రహ౦ అని అనడ౦ ఒప్పే, గ్రహ౦ కాదు అని అనడ౦ తప్పు. మరి అదే ఇప్పుడు మాత్ర౦ గ్రహ౦ అనడ౦ తప్పు అవుత౦ది. అ౦టే ఒకప్పుడు శాస్త్రవేత్తలు చెప్పి౦ది తప్పు.
నా కొత్త ప్రశ్న:
3) సైన్స్ సెల్ఫ్ కరెక్టివ్ అని అ౦టున్నారు. అ౦టే సైన్స్ లో తప్పులు౦టాయా?
ఒకవేళ సైన్స్ లో తప్పులున్నట్లుగానే, వాస్తులో కూడా తప్పులున్నాయేమో!!
4) మీరు చెప్పినట్టుగా వాస్తు అశాస్త్రీయ౦ అయితే, మీరెలాగూ ప్రముఖ మానవతావాది, హేతువాది, మరియు పూర్వ౦ విలేఖరి కాబట్టి మీకున్న పరిచయాలతో తెలుగు యూనివర్సిటీ రాజ్యా౦గాన్ని ఉల్ల౦గిస్తు౦ది అని ఏమైనా పోరాటాలు చేసారా? కోర్టుల్లో కేసులు వేశారా?
మీరు పోరాట౦ చేసి ఉ౦డేఉ౦టారని అనుకు౦టున్నాను. వాటి వివరాలు, ఫలితాలు మాతో కాస్త ప౦చుకు౦టారా?

Praveen Mandangi said...

ఉనికిలో ఉన్న వస్తువుల డెఫినిషన్ లో అభిప్రాయభేదాలు ఉండొచ్చు. ప్లూటోని ఎలా డిఫైన్ చెయ్యాలి అనే ప్రశ్న చూపించి ప్లూటో పై సైంటిస్టులకి ఉన్నది మూఢ నమ్మకం అనడం హాస్యాస్పదం. రాహుకేతువులు ఉనికిలో లేని మిథ్యా పదార్థాలు అని తెలిసి కూడా వాటిని నమ్మేవాళ్ళు ఉనికిలో ఉన్న ప్లూటో పేరు చెప్పి సైంటిస్టులని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది.

naprapamcham said...

When pluto was discovered it was thought to be planet. Later some more discovereies says that it has no planet things fully.
thus science has endless search and quest. When new things are discovered,old things are corrected , not discarded. Old things becomes part of history.
It has no comparison with Vaastu.Original vaastu has no scientific validity. Hence self correction doesnot arise.
Yes, we filed high court petition against Telugu university teaching astrology and vastu which is still pending. Notice was served on the university. They have yet reply.

Praveen Mandangi said...

కప్ప జంతువా, పురుగా అనే విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంతమాత్రాన కప్ప పై అభిప్రాయం మూఢనమ్మకమో, మిథ్యా పదార్థమో అయిపోతుందా? ప్లూటో గ్రహమైనా కావచ్చు, ఆస్టరాయిడ్ అయినా కావచ్చు. అంతమాత్రాన ప్లూటో పై అభిప్రాయం మూఢ నమ్మకమో, మిథ్యా పదార్థమో అయిపోతుందా?

venkataramana said...
This comment has been removed by the author.
venkataramana said...
This comment has been removed by the author.
venkataramana said...

ప్రవీణ్ గారు,
నేను శాస్త్రవేత్తలు ఒకప్పుడు ఒప్పని చెప్పి౦ది ఇప్పుడు తప్పని అ౦టున్నారు. అని మాత్రమే అన్నాను. వాళ్ళకు మూఢనమ్మకాలు వున్నాయని అనలేదు. వాళ్ళని విమర్శి౦చనూలేదు.
రాహువు, కేతువులు రె౦డు బి౦దువులు అని మత్రమే అన్నాను. గ్రహాలు లేక పాములు అ౦టే నేను ఒప్పుకోను.
కప్ప ఒక ప్రాణి, ప్లూటో ఒక పదార్థ౦ అని చెప్పారు. స౦తోష౦.
నా దృష్ఠిలో అక్షా౦శాలు, రేఖా౦శాలు, భూమధ్యరేఖ, మకరరేఖ, కర్కటరేఖ ల లాగే రాహువు,కేతువు లు పదార్థాలుకావు. కేవల౦ ఊహాజనిత బి౦దువులు మాత్రమే.

ఇన్నయ్య గారు,
నేను దేన్నీ గుడ్డిగా ఒప్పుకోను. నాకు అర్థ౦కాలేదు కదా అని తప్పని కుడా అనను. ఆ విషయ౦ గురి౦చి బాగా తెలిసిన వాళ్ళని అడిగి అర్థమయ్యాక నిర్ణయ౦ తీసుకు౦టాను.
మిమ్మల్ని ఇ౦తగా అడుగుతు౦ది ఎ౦దుక౦టే మీరు చాలా విశ్లేషణాత్మక౦గా వ్రాస్తారు. జ్యోతిష్య౦, వాస్తు విషయ౦లో నాకి౦కా అర్థ౦ కావట౦లేదు.
మా స్నేహితుల్లో కొ౦తమ౦ది పట్టి౦పులు ఉన్నాయి, పట్టి౦పులు లేవు అని మాత్రమే చెబుతున్నారు. అవి శాస్త్రాలా, కావా, నమ్మకాలా, ముఢనమ్మకాలా అన్న దానికి సమాధాన౦ చెప్పలేక పోయారు.
మరి నేను ఎలా౦టి నిర్ణయ౦ తీసుకోవాలో నాకు అర్థ౦ కావట౦లేదు. మీరు "శాస్త్రీయత", "అశాస్త్రీయత", "నమ్మక౦", "మూఢనమ్మక౦" లకు అర్థాలు చెబితే నేను అర్థ౦ చేసుకోగలను.
మీరు తెలుగు యానివర్శిటీ మీద కేసు ఎప్పుడు వేశారు? కోర్టు ఏమని నోటీసు ప౦పి౦ది?
ఇక ప్లూటో విషయ౦:
Pls see this link and u will come to know that there was no definition for planet before 2006.
There were around 200 objects similar to planets. So they defined planet and now those objects do not come under planet category.
http://en.wikipedia.org/wiki/2006_definition_of_planet

దయచేసి నేను అడిగిన ప్రశ్నలకు సమాధాన౦ చెప్ప౦డి.
1) "శాస్త్రీయత", "అశాస్త్రీయత", "నమ్మక౦", "మూఢనమ్మక౦" లకు అర్థాలు(నిర్వచనాలు) ?
జవాబు: -------
మీరు చెప్పలేదు.
2) "ఒక నమ్మకానికి వ్యతిరేక ఆధార౦ చూపిస్తే ఆ నమ్మక౦ మూఢనమ్మక౦" అవుతు౦ది. అ౦టే ఆ వ్యతిరేక ఆధార౦ దొరకన౦త వరకు అది మ౦చి నమ్మకమే అ౦టారా?
జవాబు: -----a) అవును. b) కాదు.
మీరు జవాబు చెప్పలేదు.
3) ప్లూటో విషయ౦లో కూడా మీరు ఏది నమ్మక౦, ముఢనమ్మక౦, శాస్త్రీయ౦, అశాస్త్రీయ౦?
జవాబు: ------
మీరు చెప్పలేదు. అప్పుడు గ్రహ౦, ఇప్పుడు గ్రహ౦ కాదు అని మాత్రమే చెప్పారు.
4) సైన్స్ సెల్ఫ్ కరెక్టివ్ అని అ౦టున్నారు. అ౦టే సైన్స్ లో తప్పులు౦టాయా?
ఒకవేళ సైన్స్ లో తప్పులున్నట్లుగానే, వాస్తులో కూడా తప్పులున్నాయేమో!!
జవాబు: ------a) సైన్సులో కొన్ని తప్పులు కూడా ఉ౦డొచ్చు. b) తప్పులు ఉ౦డవు
c) సైన్సు తనను తాను మెరుగుపర్చుకు౦టు౦ది.
మీరు చెప్పలేదు.

Praveen Mandangi said...

రాహుకేతువులు గురించి పుక్కిటి పురాణాలలో తప్ప సైన్స్ పుస్తకాలలో వ్రాయరు. మరి రాహుకేతువులున్నాయని నమ్మేవాళ్ళు అవి పాములు కావని, గ్రహాలు కావని ఎలా ఒప్పుకుంటారు? మీ వాదన విచిత్రంగా ఉంది. Astronomy had never supported myths such as rahu and kethu.

venkataramana said...

ప్రవీణ్,
పుస్తకాల్లో వ్రాయన౦త వరకు నమ్మకపోతే దానికి నేను బాధ్యుడిని కాదు. సూర్య, చ౦ద్ర గ్రహణాలు ఏర్పడతాయని తెలుసు కదా. గ్రహణాలకు కారణ౦ పూర్వికులు చెప్పి౦ది తప్పని నాకు అర్థమయ్యి౦ది.
నా వాదన వి౦తగా ఉ౦ది అని అన్న౦దుకు స౦తోష౦. మూఢ౦గా, హాస్యాస్పద౦గా ఉ౦ది అని అనలేదు.
Astronomically, there are 2 points of intersection of the paths of the Sun and the Moon as they move on the celestial sphere.The fact that Eclipses occur when Sun and Moon are at one of these points gives rise to the myth of the swallowing of the Sun.
If u want more details go to:
http://en.wikipedia.org/wiki/Rahu

Praveen Mandangi said...

వికీపీడియా ఒక పెద్ద జోక్. ఇంగ్లిష్ వికీపీడియా పై అనేక వివాదాలు ఉన్నాయి. Astronomy had never supported myths such as rahu and kethu. రాహుకేతువులకి సైన్స్ పేరు అప్లై చెయ్యడం విచిత్రమే.

venkataramana said...

Praveen,
There are 2 points of intersection of the paths of the Sun and the Moon as they move on the celestial sphere.

Do u agree with above statement?

Praveen Mandangi said...

పాము కథలని మార్చి చెప్పి రాహుకేతువులు నిజం అంటే ఎలా నమ్మాలి? నేను కూడా పుక్కిటి పురాణాలు చదివాను. భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు కనిపిస్తాయి అనే సూత్రీకరణని మన పూర్వికులు నమ్మలేదు, ఇప్పుడు కూడా కొంత మంది నమ్మరు. మా ఇంటిలో గ్రహణం సమయంలో నేను తప్ప ఎవరూ భోజనం చెయ్యరు. వాళ్ళలో గ్రహణాల పై మూఢ నమ్మకాలు ఇంకా ఉన్నాయి. చిన్నప్పుడు నేను టైమ్ కి అన్నం పెట్టకపోతే ఏడ్చేవాడినని నాకు గ్రహణం సమయంలో కూడా అన్నం పెట్టేవాళ్ళు. కొన్ని విషయాలలో మాత్రమే మా కుటుంబ సభ్యులు మూఢ నమ్మకాలని పక్కన పెట్టేవాళ్ళు. మీరు ప్రతి విషయంలో మూఢ నమ్మకాలని పట్టుకుని వేలాడుతున్నట్టు ఉన్నారు. అందుకే రాహుకేతువులకి సైన్స్ పేరు పెడుతున్నారు.

Nrahamthulla said...

కొన్ని మూఢనమ్మకాలు
* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడిమీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసిరావటమో చేస్తారు.
* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని,అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు.మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం,కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు.అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందనికొరడాతో బాదుతాడు.పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు,అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు.గర్బిణులు బయటకురారు.వంటపాత్రలలో,నీటిలోగడ్డిపోచలు వేస్తారు
* జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షలరూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు.నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు.http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2009/sep/19national6
* జపాన్ లో తెల్లపాము ఎదురుపడితే అదృష్ట దేవత కనిపించిందంటారు.ఉత్తర దిశలో తల ఉంచి నిద్రిస్తే అది శాశ్వత నిద్రేనట.మరణించిన వారి తలలను ఉత్తర దిశలో ఉంచి అంత్యక్రియలు నిర్వహిస్తారు.నాలుగు అంకెను అశుభ సూచకంగా పరిగణిస్తారు.

Nrahamthulla said...

ఒక పూజారిగారి జవాబులివిగోః
1.ఒకరి ఎంగిలి ఒకరు ఎంతో మక్కువతో తింటున్న ప్రజలున్నారు. హోటళ్లలో అయితే అది శాఖాహారమా, మాంసాహారమా అని కూడా ఆలోచించటం లెదెవరూ. చక్కగా చికెన్ తో ఏదో వేపుడు చేసిన మూకుడు లోనే, నూడుల్స్ వేయిస్తాడు. జనాలు అవి ఆవురావురుమని తింటున్నారు .అదేమీ అంత పెద్ద పైత్యంకాదు.
2.ఇది ఆచరించవలసిన విధానమే. దేవాలయం అంత విశాల ప్రాంగణంలో కట్టాలి అని తెలియజేయడానికి ఇది సంకేతం. మన ఇల్లు కట్టినట్టు చిన్న చిన్న స్థలాలలో దేవాలయాలు కట్టకూడదు.
3.ఇది నిజంగా మూఢనమ్మకమే. ఇది తప్పక ఖండించాలి.
4.జాతరలు జరిగే రోజులు అంటు వ్యాధులు ప్రబలే వర్షాకాలంలో వస్తాయి. శుభకార్యాల పేరుతో జనాలు ఎక్కువగా ఒక్కచోట చేరటం వల్ల అవి మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది కదా? పూర్వం గ్రామాల్లో నే కాదు పట్టణాల్లో కూడా ఈ వ్యాధులకు ఎంతో మంది బలైపోయేవారు. అందుకే అటువంటి నమ్మకం ఏర్పరచుకుని ఉంటారు. అది మంచిదే
5.ఏమీ చెప్పలేను.
6.దారుణం. చేతబడులు ఒక హిప్నాటిజం లాంటిది.పూజలు అనేవి మానసిక బలాన్ని పెంచగలవు.చేతబడులు మానసికంగా కృశింపచేయడానికి ఉపయోగ పడతాయి.కానీ నేడు అంత దీక్షగా చేయగలిగే వారెంతమందీ అన్నదే సందేహం.
7.పూజారి ప్రజల బలహీనతలతో బ్రతుకుతున్నాడు
8.ఆ సమయంలో ప్రకృతి శక్తులు అంతగా పనిచెయ్యవు.ఆకాశంలో జరిగే క్రియలు మన దేహంపై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి.గ్రహణ సమయంలో భోజనాదులు కూడా నిషిద్ధం.
9.ఇలాంటి నమ్మకాలు కొంత సత్యానికి , కొంత కల్పన చేర్చి మరింత చేసి మసి పూసి మారేడు కాయ చేసినవన్నమాట.మన తప్పును ఎవరి తుమ్ముపైనో రుద్ధడం అనేది చేతకాని తనం.
10.ఇలా వదిలించుకోవడం శోచనీయం.
11.దీపాలు వెలిగించడం అనేది అనాలోచితమైన పని కాదు. ఎంతో ఆలోచించి ఓ మహాను భావుడెవరో ప్రవేశపెట్టిన ఓ పథకం. తద్వారా ప్రజలకు అభద్రతా భావం ఏర్పడకుండా ఉంటుంది.
12.ఏదైనా అతి పనికి రాదు.
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు
13* ఇది ఓ పిచ్చి . ఆ డబ్బును బీదప్రజలకు దానంగా ఇస్తే ఎన్ని కుటుంబాలకు తిండీ గుడ్డా అందుతాయో కదా..?
14* ఇటువంటి వ్యక్తులను ఎలానమ్ముతారో ప్రజలు. ఇటువంటి దొంగ బాబాలను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి ప్రభుత్వం.
15* జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది మనం కష్టంలో ఉన్నప్పుడు చుక్కానిలా పనిచేస్తుంది. ఏదారీ తోచని వారికి ఓ వెలుగు బాట చూపుతుంది.ఎవరూ తీర్చలేని కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే దాని మీద ఆధారపడండి
16* ఉన్నదానికంటే ఎక్కువ ప్రచారం జరిగింది. దీనికి ముఖ్యకారకులు రాళ్ల వ్యాపారులు. జ్యోతీష్యులను పావులుగా చేసి జనాల బలహీనతలతో ఆటలాడారు/ఆడుతున్నారు.
17* చీము,నెత్తురుతో జుగుప్సాకరంగా ఉండే వైతరిణీ నదిని దాటవలెనంటే గోదానం చెయ్యాలి. ఆ గోదాన మహిమ వల్ల దానిని దాటగల శక్తి వస్తుంది.