Tuesday, April 28, 2009

అంబెద్కర్ పేరిట





అంబెద్కర్ పై విపరీతంగా ప్రేమ చూపుతున్నారు.విగ్రహానికి దండలు వేస్తూ జయంతి జరుపుతున్నారు.విగ్రహానికి అవమానము చేస్తే ఆగ్రహం ప్రదర్సిస్తున్నారు.పార్లైమెంట్ భవనంలో చిత్రపటం పెట్టారు.చివరకు భారతీయ జనత పార్తీ కూడా ఈ పనులు చేస్తున్నది .కాని అంబెద్కర్ కావాలని కోరింది ,చేయమని చెప్పింది మాత్రము జాగ్రత్తగా విస్మరించారు .బౌద్దం లో కులం లేదని, అంటరాని తనం లేదని ,మానవుల సమానత ,స్త్రీ పురుషుల సమానత పాటించారని , బుద్దుడు మతం లేని నీతిని చెప్పడని, కనుక అది అవలంబించమని , ముందుగా తాను పాటించాడు. మను స్మ్రుతి తగలబెట్టాదు సూచన ప్రాయంగా. మన రాజకీయ పార్తీలు , సాంఘిక సంఘాలు అంబెద్కర్ పేరిట ప్రజలను ఎలా వొట్ల కోసం ,సీట్ల నిమిత్తం , అధికారం కావాలని ఎలా మోసగిస్తున్నయో మరి.
గౌతమ బుద్దుడు మత రహితంగా చెప్పిన మానవ ధర్మాన్ని, నీతిని కావాలని ,ఆరాధన గాక, ఆచరణ జరపమని, అంటరానితనం పోవాలంటే హిందూమతంలో వున్నంతవరకు జరిగేపని కాదని అంబెద్కర్ చెప్పాడు .తాను అలానె బౌధం లో చే రాడు. కులాంతర పెళ్ళి చేసుకున్నాడు. తొలి ఎన్నికలలోనే కాంగ్రెస్ ఆయన్ను ఓడించింది .అంటరాని వారికి కాంగ్రెస్స్ ,గాంధి ఏమి చేశారని పుస్తకమె రాశాడు. చివరకు విగ్రహాలలో ,పటాలలో మిగుల్చుతున్నారు .ఆయన రాముడిపై రాసిన గ్రంధంపై శివ సేన పెద్ద ఆందోళన చేసింది.

Monday, April 27, 2009

మానవ వాద వుద్యమాలు

N.Innaiah speaking in world congress of Center for Inquiry in USA.Presided over by Prof Paul Kurtz,founder of Center.


అమెరికాలొ ఇటీవల జరిగిన ప్రపంచ సభలో భారత మానవ వాద ఉద్యమాల గురించి వివరంగా ప్రసంగించి ఒక పత్రం సమర్పించాను. ప్రస్తుతం మానవ వాద వుద్యమాలు చాలా బలహీనంగా వున్నాయని ,యువతలో మత నమ్మకాలు పెరిగి పోతున్నాయని వివరించాను. ఎం ఎన్ రాయ్ ,గోరా ,పెరియార్ , అంబెద్కర్ ,అబ్రహం కోవూర్ , స్పూర్థి సన్నగిల్లినదని చెప్పాను .మతం నేడు రాజకీయాలలో ప్రవెశించి భిభత్చం కలిగిస్తున్నది అని, రాజకీయ పార్తీలు వొట్ల కోసం మతాన్ని వెనకేసుకొస్తున్నదని సోదాహరణగా విడమరిచాను .పాటశాలలో శాస్త్రిఎయ సిలబస్ ద్వారా కొంత వరకు ఈ ప్రమాదాన్ని అరికట్ట వచు నని చెప్పాను .పాల్ కర్జ్ ఈ సమావెశానికి అధ్యక్షత వహించ్చారు .

Wednesday, April 22, 2009

జేంస్ రాండి చాలెంజ్










with James Randi in World Congress on april 10,USA
left Innaiah, Rohit, right Dr Naveena










నా అమెరికా పర్యటనలో ఇటీవల జేంస్ రాండి ని కలిసాను. శాస్త్రీయ పరిశీలన వారు నిర్వహించిన ప్రపంచ సభలొ నేను ప్రసంగించడానికి ఏప్రిల్ 10 న్ వెళ్ళినప్పుడు జేంస్ రాండి కలిసాడు. కుశల ప్రశ్నల తరువాత తన గ్రంథం నాస్త్ర దాం పై చేసిన డి సంతకం చేసి ఇచ్చారు .ఇండియాలో ప్రేమానంద్ ఆరోగ్యం అడిగి విచార పడ్డారు .హోమియొ , జ్యొతిష్యం, అతీంద్రియ శక్తులు పై శాస్త్రీయమని నిరూపించిన వారికి 1 మిలియన్ డాలర్లు బహుమానం ఇంకా అమలులో వుందని చెప్పారు. సభలలో ఆయన ప్రదర్సనా పూర్వక ప్రసంగాలు బాగా ఆకట్టుకున్నాయి .చాలెంజ్ వివరాలకు వెబ్ సైట్ లో చూసి పాల్గొన వచ్చు .http://www.randi.org/

Tuesday, April 21, 2009

నెల నెలా తెలుగు వెన్నెల

Innaiah with Texas Telugu association persons in Dallas left second Mr Thotakura Prasad, Tana elected president.Innaiah with Jodhpur coat,next is Mr Anant Mallavarapu, organiser of TEX



Innaiah addressing Texas , USA Telugu assocition

19 april 2009




డల్లాస్ లో ఆసక్తికరంగా నెల నెలా తెలుగు వెన్నెల
తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారి తెలుగు సాహిత్య వేదిక నిర్వహించిన 21 వ "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం స్థానిక పసంద్ ఇండియన్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది సాహితీ ప్రియులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ప్రముఖ రచయిత, జర్నలిస్ట్, మానవతావాది డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య గారు ముఖ్య అతిధి గా విచ్చేశారు. మొదట మురళీధర్ టెక్కలకోట గారు స్వీయ కవితలు చదివి వినిపించారు. తరువాత రమణ జువ్వాది గారు సిరివెన్నెల రాసిన ఉగాది కవితా గానం చేశారు. తదుపరి డాక్టర్ గన్నవరపు నరసింహ మూర్తి గారు చంధోబద్ధంగా రాసిన ఉగాది పద్యాలను చదివి వినిపించారు. తదుపరి చంద్ర కన్నెగంటి గారు తెలుగు భాషలోని కొన్ని ప్రత్యేక పదాలను విశదీకరించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనంత్ మల్లవరపు ముఖ్య అతిధి డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్య గారిని సభకు పరిచయం చేశారు. మొదట ఇన్నయ్య గారు “తెలుగు ప్రజల పునర్వికాసం-నేటి ఆవశ్యకత” అనే అంశంపై ప్రసంగించారు.. తదుపరి మూఢ విశ్వాసాలు, మత ఛాందసవాదం మానవ సమాజానికి, మానవత్వానికి కలుగజేసె హానిగురించి వివరించి, హేతుబద్దత, శాస్త్రీయ ధ్రృక్పదం అలవర్చుకోవలసిన అవసరాన్ని వివరించారు. తదుపరి హేతువాదం మీద వాడిగా వేడిగా సాగిన చర్చలో, సభికుల ప్రశ్నలకు సమాధానాలు తెలియచేశారు. ముఖ్య అతిధిని బిఓటి చైర్ రాం యలమంచిలి, సత్యం కల్యాణదుర్గ గారు శాలువతో సత్కరించగా, టాంటెక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొర్సపాటి గారు పుష్ప గుచ్చంతో , సాహితీ వేదిక కార్యవర్గం జ్ఞాపికతో సత్కరించారు. రావు కల్వల గారి వందన సమర్పనతో కార్యక్రమం ముగిసింది.

Thursday, April 16, 2009

రచయిత్రి యంగ్ చాంగ్ తో చర్చలు

Jon Haliday,Jung Chang with Innaiah in Hyderabad


సుప్రసిద్ధ చైనా రచయిత్రి యంగ్ చాంగ్ రాసిన అడవిగాచిన వెన్నెల (వైల్డ్ స్వాన్స్) పుస్తకాన్ని చైనాలో నిషేధించారు. పాశ్చాత్య దేశాలలో అది విపరీతంగా పాఠకలోకాన్ని ఆకర్షించింది. అయితే యంగ్ చాంగ్ ను చైనా రావడానికి పోవడానికి ప్రభుత్వం అభ్యంతర పెట్టలేదు. ఆమె ఇంగ్లండులో జాన్ హాలిడే అనే బ్రిటిష్ చరిత్ర కారుణ్ణి పెళ్ళి చేసుకుని అక్కడే స్థిరపడింది. వారిరువురూ కలసి మావో అనే గ్రంథాన్ని అధునాతన చారిత్రక ఆధారాలతో వెలువరించారు. అదికూడా చైనాలో నిషిద్ధానికి గురయింది.
నా మిత్రుడు అట్లూరి అశోక్ ఇంగ్లండులో ఈ రచయితలను కలసి పుస్తకాల తెలుగు అనువాదానికి అనుమతి కోరగా వారు ఒప్పుకున్నారు. అశోక్ కోరికపై వెనిగళ్ళ కోమల (నా భార్య) అడవిగాచిన వెన్నెల పేరిట వైల్డ్ స్వాన్స్ ను తెనిగించింది. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి సుప్రసిద్ధ ముస్లిం తిరుగుబాటు రచయిత్రి తస్లీమా నస్రీన్ హైదరాబాదు వచ్చి ఆగస్టు 9, 2007న ప్రెస్ క్లబ్ లో గ్రంథావిష్కరణ జరిపింది.
అడవిగాచిన వెన్నెల పెద్ద గ్రంథం. దానికి తెలుగులో చక్కని సమీక్షలు వచ్చాయి. రచయిత్రి యంగ్ చాంగ్, ఆమె భర్త జాన్ హాలిడే తరువాత హైదరాబాదు వచ్చారు. అక్షర పుస్తకాల షాపువారు కాకతీయ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో వెనిగళ్ల కోమల రచయిత్రిని పరిచయం చేసి గ్రంథాన్ని గురించి తెలిపింది. యంగ్ చాంగ్ తన చైనా అనుభవాలను వివరించింది.
తరువాత అశోక్ యింట్లో విందు సమావేశంలో నేను వారితో చర్చలు జరిపాను. అప్పుడు జాన్ హాలిడే నా రచనల విషయం, ఎమ్. ఎన్.రాయ్ పై పరిశోధనల సంగతులు తెలుసుకుని వాటిని తన రచనలలో ఉత్తరోత్తరా ప్రస్తావిస్తానని చెప్పారు. మాస్కోలో, చైనాలో ఎమ్.ఎన్.రాయ్ పాత్రలను గురించి రాస్తానన్నాడు. యంగ్ చాంగ్ కుటుంబీకులు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీతో, మావోతో సన్నిహిత సంబంధం గలవారు. ఆ కారణంగానే యంగ్ చాంగ్ జుగుప్స చెంది, మావో పట్ల కమ్యూనిస్టుల పట్ల అసహ్య భావాన్ని పెంచుకున్నారు. అవన్నీ రాసినందుకే చైనాలో ఆమె పుస్తకాన్ని భరించలేకపోయారు. ఆమె రాసింది వాస్తవమే అని తెలిసినా కమ్యూనిస్టు రాజకీయం వాటిని జీర్ణించుకోలేక పోయింది. యంగ్ చాంగ్, జాన్ హాలిడేలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, వారితో ముఖాముఖి చర్చలు చేయడం మంచి అనుభవం.

Sunday, April 12, 2009

పింగళి జగన్మోహన రెడ్డితో


సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసిన పింగళి జగన్మోహనరెడ్డి తన స్వీయ చరిత్ర విపులంగా రాశారు. వ్రాత ప్రతిని యువతరం చూస్తే ఎలా ఫీల్ అవుతారో తెలుసుకోవాలని, అచ్చు కాకముందే, నా కుమారుడు నరిశెట్టి రాజుకు యిచ్చారు. అప్పుడు రాజు నిజాం కళాశాలలో గ్రాడ్యుయేట్ చదువుతున్నాడు. చదివిన తరువాత, రాజు వ్యాఖ్యానిస్తూ, మీరేమైనా బెర్ట్రాండ్ రస్సెల్ అనుకున్నారా? ఎవరు చదువుతారు యీ సోది అంతా? అవసర వివరాలు తొలగించండి.” అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. కాని ఆయన విమర్శనాత్మక సూచన స్వీకరించడమేగాక, గ్రంథాన్ని తిరగరాసి, రాజుకు పుస్తకంలో కృతజ్ఞతలు చెప్పాడు.

జడ్జిగా రిటైర్ అయిన తరువాత, 1975లో ఎమర్జన్సీ కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వీధినపడి పరువు పోగొట్టుకున్న సందర్భంగా జగన్మోహన రెడ్డి వైస్ ఛాన్స్ లర్ గా వచ్చారు. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆయన్ను తెచ్చారు. అచిరకాలంలోనే యూనివర్సిటీ దారికొచ్చింది. అప్పుడే నాకు ఆయనతో పరిచయమైంది.

నా పిహెచ్.డి వ్యవహారంలో ఫిలాసఫీ శాఖాధిపతి వి. మధుసూదన రెడ్డి (అరవిందో భక్తుడు) ఆడిన నాటకం వలన, ఎన్నాళ్ళకూ డిగ్రీరాక, అదొక చర్చనీయాంశంగా మారిన రోజులవి. అప్పడు నన్ను యింటికి ఆహ్వానించి, జగన్మోహన రెడ్డి పూర్తి వివరాలు అడిగారు. అప్పటికే యీ విషయమై ఉన్నతాధికార విచారణ సంఘం వేశారు. దానికి భయపడి, మధుసూదన రెడ్డి రాజీనామా యిచ్చి, అరవిందాశ్రమానికి వెళ్ళారు!

అనేక సందర్భాలలో మేము కలుసుకుని చర్చలు చేశాం. నన్ను తరచు యింటికి ఆహ్వానించేవారు. కలసి భోజనం చేశాం. ఆయన పిసిని వాడనీ, నిన్నెలా పిలిచి భోజనం పెట్టారని అకడమిక్ స్టాఫ్ ఆశ్చర్యపడేవారు.

నా కోరికపై జగన్మోహనరెడ్డి రాడికల్ హ్యూమనిస్ట్ సభలకు, శిక్షణ శిబిరాలకు వచ్చి ఉపన్యాసాలిచ్చారు. ఎం.ఎం. తార్కుండే వచ్చినపుడు కూడా మేము కలిశాం.

జగన్మోహన రెడ్డి రచనలు కొన్ని నేను తెలుగు చేయగా తెలుగు అకాడమీ ప్రచురించింది.

ఉస్మానియా యూనివర్సిటీలో జి. రాంరెడ్డి వైస్ ఛాన్స్ లర్ గా చేసిన వ్యవహారాలన్నీ విచారణ సంఘం ద్వారా జగన్మోహన రెడ్డి బయటపెట్టారు. The University I served అని పుస్తకం రాశారు. నేనది తెనిగించాను. ఆ రచన తెలుగు యూనివర్సిటీ ప్రచురించవలసి ఉన్నది. కాని యింతలో వైస్ ఛాన్స్ లర్ మారి, సినారె (సి. నారాయణరెడ్డి వచ్చి ఆ ప్రచురణ ఆపారు.

జి. రాంరెడ్డి మరో విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా ఉండడం, సినారే ఆయనకు బంధువు గావడం కారణం.

అయితే ఉదయం దిన పత్రిక ఆ పుస్తకంలో సంగతులకు సీరియల్ గా ప్రచురించింది. ఆప్తుడు గజ్జల మల్లారెడ్డి ఎడిటర్ గా వున్నారు.

ఓపెన్ యూనివర్సిటీ పై నేను తీవ్ర విమర్శ చేశాను. అది స్థాపించినప్పుడు వైస్ ఛాన్స్ లర్ గా వున్న రాంరెడ్డి తప్పుదారి పట్టించాడన్నాను. దానిపై రాంరెడ్డి బృందం నా పై ధ్వజమెత్తారు. కాని జగన్మోహన రెడ్డి నన్ను సమర్థించారు.

జగన్మోహనరెడ్డిగారంటే చాలా మందికి భయంవుండేది. ఆయన పెద్ద ఆస్తిపరుడనీ, పెద్ద రెడ్డి వంశం అనీ, ఉన్నత పదవులు అధిష్టించాడనీ – ఇలాంటి కారణాల వుండేది. ఏమైనా గానీ, మేమిరువురం అనూహ్యంగా, వయస్సుతో నిమిత్తం లేకుండా, దగ్గర వాళ్ళమయ్యాం. ఆయన కుమారులు పింగళి జయరాం (ఆర్థోపెడిక్ డాక్టర్) గౌతం (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి) కూడా దగ్గర మిత్రులయ్యారు. చివరి రోజులలో ఆయన వ్యాసాలు రచనలు నాకు చూపించి, సలహాలు అడిగేవారు. పద్మజానాయుడు, సరోజినీ నాయుడు మొదలైన వారితో తన పరిచయాలు, విదేశాలలో తన అనుభవాలు ఎన్నో చెప్పేవారు.

Saturday, April 4, 2009

భిన్న కోణాలలో పోలీస్ అధికారి



An idle model police office Mr Parvathaneni Koteswararao(1977 picture)


పర్వతనేని కోటేశ్వరరావు రాష్ట్రపతి, ప్రధాని అవార్డులు అందుకున్న పోలీస్ అధికారి. కృష్ణాజిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. వృత్తి రీత్యా అనేక ఉద్యోగాలు చేశారు.

ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా వుండగా సెక్యూరిటీ ఆఫీసర్ గా వున్నారు. ఆవుల సాంబశివరావు లోకాయుక్తగా వుండగా అక్కడ ఉద్యోగం చేశారు. ఉన్నత పోలీస్ అధికారులు ఆయన్ను బాగా గౌరవించడానికి ఆయన ప్రవర్తన, తెలివితేటలు, జడ్జిమెంట్ కారణం.

కోటేశ్వరరావు మాకు సన్నిహిత కుటుంబ మిత్రులు. ఏమాత్రం అవకాశం ఉన్నా మానవవాద, సెక్యులర్ ఉపన్యాసాలకు, శిబిరాలకు వచ్చేవారు. మంచి విమర్శనాత్మక విశ్లేషణ రచనలు వ్యాసాలు చదివేవారు.

సమకాలీన రాజకీయ పార్టీల, నాయకుల విషయంలో నిశిత పరిశీలన చేసేవారు.

పోలీస్ అధికారిగా ఆయనకు తెలిసిన అనేక లోగుట్టులు చెప్పేవారు. కొన్ని వృత్తి ధర్మం రీత్యా ప్రచురించవద్దనేవారు. అప్పుడే ఆయన మేథస్సు గ్రహించగలిగాను.

ఎన్.టి. రామారావును సన్నిహితంగా చూచాడు గనుక అనేక ఆసక్తికరమైన సంగతులు చెప్పేవాడు. దాదాపు ఆరు మాసాలపాటు సన్యాసి కాషాయవస్త్రాలు సూట్ కేసులో పెట్ట్టుకుని తిరిగాడని, ఆలోచించి, చివరకు వాటిని ధరించాడని చెప్పాడు. కొందరు ఉన్నతాధికారులు రామారావును ముఖస్తుతి చేసి, తిరుపతి దేవస్థానం వంటి చోట పదవులు పొందారన్నాడు.

నాదెళ్ళ భాస్కరరావుకు కోటేశ్వరరావు అంటే యిష్టం వుండేదికాదు. చిత్తశుద్ధిగల ముక్కుసూటి ఆఫీసర్ గావడమే కోటేశ్వరరావు లోపం! అయితే రామారావు ఆయన్ను బాగా గౌరవించేవాడు.

1982 ఎన్నికల సమయంలో పోలీస్ అధికారిగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో డబ్బుల సూట్ కేసులు కళ్ళారా చూచిన కోటేశ్వరరావు ముక్కుపై వేలు వేసుకున్నాడు. ప్రధానిగా ఇందిరాగాంధీ ప్రత్యేక విమానంలో సూట్ కేసులలో డబ్బులు తేవడం, వాటిని కాంగ్రెస్ అభ్యర్థులకు ఉద్దేశించి పోవడం జరిగింది. అయినా ఓడిపోయిన సంగతి అలా ఉంచండి.

శ్రీశ్రీ, నార్ల వెంకటేశ్వరరావు రచనలంటే కోటేశ్వరరావు యిష్టపడేవారు. మేము ఎన్నోసార్లు కలుసుకుని ముచ్చటించేవాళ్ళం. రిటైర్ అయిన కొద్ది రోజులకే (1992లో) చనిపోయారు.

Thursday, April 2, 2009

హోమియోకు సైంటిఫిక్ ఆధారాలు లేవా?

James Randi who offered $million for scientific evidence of Homeo


హోమియో సృష్టికర్త హానిమన్. పూర్తిపేరు శ్యామ్యూల్ హానిమన్. జర్మన్ దేశస్తుడు. బహు భాషలు నేర్చిన వైద్యుడు. ఆనాడు అలోపతి వైద్యం చదివాడు. ఆ వృత్తిలో కనిపించిన దోషాలు, రోగాలు తగ్గించడానికి ఆవలంబించే పద్ధతులు ఆయనకు నచ్చలేదు. ముఖ్యంగా శరీరం నుండి రక్తం తీసే రీతులు చూసి అసహ్యపడ్డాడు

.

క్రమేణా మార్గంతరాలు ఆలోచించాడు. అప్పట్లో మలేరియా వ్యాధి ప్రబలి ఉండేది. దీనికిగాను క్వినైన్ వాడేవాడు.

హానిమన్ ఒకసాకి సింకోనా బెరడు తిన్నాడు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశంలో సింకోనా బెరడు విస్తారంగా లభిస్తుంది. అది తీసుకున్నప్పుడు హానిమన్ చలితో వణికి పోయాడు. మలేరియా జ్వరలక్షణాలు వచ్చాయి. జ్వరం నయం చేయడానికి ఉపకరించే వస్తువు, ఆరోగ్యంగా ఉన్నవారు తీసుకుంటే, రోగలక్షణాలు రావడం విశేషమని భావించాడు. ఇలాంటి రీతిలో ఇతర రోగాలకు వాడ వస్తువులతో ప్రయోగించి చూచాడు. అంటే రోగలక్షణాలు, ఔషధ లక్షణాలు ఒకటే అయితే, దీనిని సూత్రీకరించి, సారూప్య సూత్రం చెప్పాడు.

అయితే ఔషధం బాగా పనిచేయడానికి దాని శక్తి పెంచాలనుకున్నాడు. ఔషధాన్ని పలచబరిచి బాగా కుదుపుతూ పోతే, శక్తి పెరుగుతుందని హానిమన్ నమ్మాడు. తాను పరిశోధించే ఔషధశక్తిని, పనిచేసే తీరును పరిశీలించ నారంభించాడు. కొన్ని స్వయంగా తీసుకున్నాడు. అలాగే ఇతరులకు యిచ్చాడు. అలా తీసుకున్నప్పుడు కొన్నాళ్ళపాటు కనిపించే లక్షణాలన్నీ రాసుకున్నాడు. ఇతరులనూ రాయమన్నాడు. వాటినే రుజువులుగా హానిమన్ స్వీకరించాడు. అలా క్రోడీకరించిన వాటిని ఆరు సంపుటాలుగా ప్రచురించాడు. అదే హోమియో పవిత్ర గ్రంథం అయింది.

హోమియో ఔషధాలు తయారు చేయడానికి, మొక్కలు, లోహాలు, కొన్ని ఆహారపదార్థాలు, కొన్ని రోగాలకు మూలమైన క్రిములు స్వీకరించాడు. అలా స్వీకరించిన వస్తువును నీటితోగాని, సారాయితోగాని కలుపుతారు. మూల వస్తువును మదర్ టింక్చర్ అంటారు. ఒక కూజాలో దీనిని అట్టిపెడతారు. నీటిలో అట్టిపెట్టిన కొన్నాళ్ళకు మూలవస్తువు తొలగిస్తారు. ఆ నీటినే మదర్ టింక్చర్ అంటారు. దానిని క్రమంగా పలచబరుస్తూ ఉంటారు. ఒక భాగం మూల టింక్చర్ కు 9 భాగాల నీటిని కలుపుతారు. బాగా కుదుపుతారు. అలా కుదిపినప్పుడు శక్తి పెరుగుతుందంటారు. మళ్ళీ అందులో ఒక భాగం తీసుకుని 9 పాళ్ళు నీరు కలిపి కుదుపుతారు. అలా కుదుపుతూ, కుదుపుతూ పలచబరుస్తూ పోయి, తరువాత చక్కెర బిళ్ళలో కలుపుతారు.

100 కణాలు మూల పదార్థం వున్నది క్రమేణా ఏ ఒక్క కణం లేని స్థితికి పోతుంది. అది 3x స్థాయి.

30c అనబడే హోమియో ఔషధం సిద్ధం చేయడానికి 30 సార్లు పలచబరచి, ప్రతిసారీ కుదుపుతూ పోతారన్నమాట. అంటే మూల పదార్థాన్ని శక్తివంతం చేయడానికి చేసిన పద్ధతిలో చివరకు మూలకణాలు వుండవు. అంటే రోగులకు యిచ్చే ఔషధ టింక్చర్లో కేవలం నేడు తప్ప ఎలాంటి కణాలూ మిగలవు.

నీటిలో కరగని మూలపదార్థాలను హోమియో వారు, నూరడం, పొడి చేయడం ద్వారా పలచబరుస్తారు. అప్పుడు చక్కెర కలుపుతారు. ఇది లోహాల వంటి వాటికి అన్నమాట.

ఇంతకూ హోమియో ఔషధంలో ఎలాంటి ఔషధకణం లేకున్నా ఎలా పనిచేస్తుంది. వారిచ్చే ఔషధ పిల్, టింక్చర్కు జ్ఞాపక శక్తి వుంటుందా? దివ్యశక్తి వుంటుందా? ఎనర్జీ వుంటుందని వారినమ్మకం. దీనికి ఆధారాలు, రుజువులు లేవు. హానిమన్ ప్రకారం హోమియో చికిత్స వ్యక్తి లక్షణాలకు ప్రాధాన్యతయిస్తుంది. రోగాన్ని నయం చేయడం గాక, వ్యక్తి స్వభావం, లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటామంటారు. కనుకనే రోగిని సుదీర్ఘంగా ఇంటర్వూ చేసి, అన్ని లక్షణాలు రాసుకుంటారు.

అప్పుడు హోమియో మెటీరియా మెడికోలో యీలక్షణాలకు పోలినది చూచి, ఔషధ నిర్ణయం చేస్తారు. హోమియో ప్రకారం అన్ని రోగాలకూ చికిత్స ఉంది.

హానిమన్ తన కాలంలో కొన్ని చికిత్సలు పేర్కొనగా, తరువాత అనుచరులు వాటిని పెంచుతూ వేల సంఖ్యకు చేరారు. రాను రాను మూల విధానాలకు మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. కాని ‘’జీవశక్తి’’ సూత్రం పై నమ్మకం మాత్రం మారలేదు.

హోమియోలో అన్ని రోగాలనూ సిఫిలిస్, సోరోసిస్, సైకోసిస్ అనే మూడుగా వర్గీకరించారు.

హోమియో శాస్త్రీయం కాదనే విమర్శ వుంది. ముఖ్యంగా హోమియో చెప్పే, జీవశక్తి (వైటల్ ఫోర్స్), కుదుపుతూ పలచబరుస్తూ పోతే శక్తి పెరుగుతుందనేది శాస్త్రీయ పరిశోధనకు గురి చేస్తే ఎక్కడా నిలబడడం లేదు.

పాశ్చాత్య దేశాలలో కొందరు సైంటిఫిక్ పద్ధతులలో హోమియోనూ రుజువు చేయడానికి తిప్పలు పడి, చతికిలబడ్డారు. అయినా హోమియోకు బలమైన లాబీ వుంది. పాశ్చాత్య దేశాలలో హోమియో ఆటుపోటులు జరుగుతూనే ఉన్నాయి. హోమియో వ్యాపారం జోరుగా సాగుతున్నది. కొన్ని విశ్వవిద్యాలయాలలో హోమియో డిగ్రీలు యిస్తున్నారు. నమ్మకానికి ఎంత విలువ వుందో దీనివలన తెలుస్తుంది. ఫ్రాన్స్, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాలలో కొందరు హోమియోను శాస్త్రీయం అని రుజువు పరచడానికి కృషి చేశారు. ఒక స్థయిలో రుజువు అయినట్లు పరిశోధనా ఫలితాల వ్యాసాలను మెడికల్ మేగజైన్లకు పంపారు. లాన్సట్ వంటి ప్రతిష్ఠాకరమైన సైన్స్ పరిశోధనా పత్రికలు వాటిని ప్రచురించేసరికి, సైన్స్ లోకం విస్తుపోయింది. తీరా ఆరా తీస్తే పరిశోధనలు అన్నీ మోసపూరితంగా, కృత్రిమంగా తయారు చేశారని తేలింది. పత్రికలు క్షమాపణలు చెప్పాయి. జేమ్స్ రాండీ వంటివారు మిలియన్ డాలర్ల అవార్డు పెట్టి, హోమియోను శాస్త్రీయం అని నిరూపించమన్నారు. నిరూపించామని ప్రగల్భాలు పలికినవి, బూకరింపులని తేలింది.

అయినా హోమియో కొన్ని చోట్ల, ముఖ్యంగా ఇండియా, అమెరికా బెల్జియం, ఇంగ్లండ్, ఫ్రాన్స్ లో సాగిపోతున్నది. ఎందుకని?

నమ్మకం, మూఢవిశ్వాసం ఒక్కటే కారణం కాదు. అలోపతిలో వున్న దోషాలు, పాలనా లోపాలు, వ్యయం సాకుగా చూపుతున్నారు. హోమియోవారు ముందుగా అలోపతిని విమర్శించడంతో రోగిని ఆకర్షిస్తారు. తరువాత క్షుణ్ణంగా ఇంటర్వూ చేయడంతో మరియు బుట్టలో పడేస్తారు. దీనికి తోడు రోగిలో వున్న విశ్వాసం, మూఢనమ్మకం హోమియోకు పెట్టుబడిగా పనికొస్తుంది.

ఇంతకూ మొదటి ప్రశ్న అలాగే మిగిలిపోయింది. మందు లేని మందు ఎలా రోగం నయం చేస్తుంది?

మేరీమాత కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. వినాయకుడు పాలు తాగుతున్నాడు. అయ్యప్ప కొండపై జ్యోతి వెలుగుతుంది. అల్లా ఒక్కడే దేవుడు. వెంకటేశ్వర స్వామికి మొక్కితే తీరుస్తాడు. షిరిడీ సాయి మహత్తులు నిజమైనవి. ఈ నమ్మకాలు చదువుకున్నవారిలో చదువురాని వారిలో వున్నాయి. అలాగే హోమియో వలన రోగాలు నయం అవుతాయనడం కూడా.

దీనికి ఆధారంగా కొందరు సినిమా తారలు. క్రికెట్ ఆటగాళ్లు, నాయకులకు నయం అయినట్లు చెబుతారు.

కొందరు ప్రముఖుల సర్టిఫికెట్లు ప్రదర్శిస్తారు.

నేడు హోమియో వైద్యులు కొందరు ఆధునిక కంప్యూటర్లు. పరికరాలు వాడుతున్నారు. వీటివలన రోగ లక్షణాలు తెలుసుకోవడం శాస్త్రీయంగా ప్రదర్శిస్తున్నారు. ఎలక్ట్రో హోమియో అందులో ఒకటి.

కాని హోమియో మూలతత్వం, మందు మాత్రం శాస్త్రీయం కాదనేది స్పష్టం.

ఆధునిక వైద్యాన్ని విమర్శించేటప్పుడు ఒక విషయం మరచిపోతున్నారు. అది సంపూర్ణతను ప్రదర్శించడం లేదు. లోపాలను ఒప్పుకుంటుంది. నిత్య నూతనంగా పరిశోధన చేస్తూ పోతుంది. తప్పులను దిద్దుకుంటూ సాగుతుంది. శాస్త్రీయ పద్ధతిలో తప్పులు ఒప్పుకొని దిద్దుకుంటూ పోవడం కీలక అంశం.

అది హోమియోలో వుండదు. హోమియో అన్ని విధాలా యిప్పటివరకూ అశాస్త్రీయం.

హోమియో వలన ప్లాసిబొ ప్రభావంతో తత్కాలిక ఉపశమనాలను చికిత్స చూపడం దారుణం. రోగంలో హెచ్చుతగ్గులు ప్రతి రోగికీ వుండగా, వాటిని ఆసరాగా హోమియో తమ గొప్పతనం అని చాటడం తప్పు.

ఇంతకూ హోమియోకు మూలధనం నమ్మకమే. శాస్త్రీయ రుజువులు అడగరాదు.

భారతదేశంలో రిజిష్టర్ చేయించుకోకుండా ప్రాక్టీసు చేసే హోమియోలకు లెక్కలేదు. ఇంగ్లండ్ లో హోమియో ప్రాక్టీసుకు ముందు కనీసం ఎం.బి.బి.ఎస్. చదవాల్సిందే. ఇక అమెరికా హోమియో మందులు విచ్చలవిడిగా అమ్ముకోవచ్చు. దీనికి అదుపు లేకపోవడానికి రాజకీయ లాబీ కారణం. ఇది 1938 నుండీ నడుస్తున్న చరిత్ర.

హోమియో గురించి ఇంటర్నెట్ లో చూడదలచినవారు Quackwatch.com చదవదలచినవారు Trick or Treatment by Simon Singh, Edzard Erust (2008 W.W.Norton & Co. Publication) గ్రహించవచ్చు.

హైదరాబాద్ లో డా. పి.ఎం. భార్గవ (సైంటిస్ట్) నేను పత్రికా సమావేశంలో హోమియోను విమర్శిస్తే, హెమియో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు దాడి చేశారు. శాస్త్రీయ రుజువులు చూపగలవారు రౌడీలుగా మారడం దేనికి ?

హోమియో మందును మీ యిష్టం వచ్చిన లాబ్ (పరిశోధనాలయం)కు తీసుకెళ్ళి, టెస్ట్ (పరీక్ష) చేయించండి. ఏదైనా మందు వుందేమో గమనించండి.

కొందరు టీకాల వైద్యం పద్ధతి హోమియోకు పోల్చి చెప్పబోతారు. కాని టీకాల మందులో మందు వున్నది. హోమియోలో లేదు. అదే ప్రధాన తేడా

నేను బ్రస్సెల్స్ వెళ్ళినప్పుడు ఓపెన్ యూనివర్సిటీలో హోమియోను గురించి చెబితే చాలా ఆశ్చర్యపోయి, అనేక ఆసక్తికర ప్రశ్నలు వేశారు.