Thursday, August 27, 2009

నిప్పులపై నడక

జేమ్స్ రాండీ బయటపెట్టిన అనేక మ్యాజిక్ రహస్యాలలో నిప్పులపై నడక ఒకటి. ఆయన సిలోన్ లో మొదలు పెట్టి అనేక సందర్భాలలో మండే నిప్పుకణాలపై నడచి, అది మానవ సాధ్యమేనని చూపారు. ఇదే విషయంలో కొందరు సాధువులు, మాంత్రికులు, నిప్పులపై నడచి, అది ఒక అద్భుతంగా చాటి, గిట్టుబాటు వ్యాపారంగా చేసుకున్నారు. అంతేకాక దీని వెనుక మతపరమైన, దైవ పరమైన శక్తి ఉన్నదని, అమాయకులను భ్రమపెట్టారు. డబ్బు వసూలు చేశారు. అది అంతా బూటకమని, ఎవరైనా ప్రాక్టీసు చేస్తే నిప్పులపై నడక మామూలు విషయంగా చూపవచ్చునని జేమ్స్ ర్యాండీ నిరూపించాడు.
అగ్నిగుండం ఏర్పరచినప్పుడు సర్వసాధారణంగా బొగ్గులు వాడతారు, కట్టెలు కూడా పెడతారు. అలా కాల్చిన వాటిపై కాసేపటికి బూడిదపొర కమ్ముతుంది. అందువల్లన సెగ తొందరగా తగలకుండా ఆపుతుంది. నడిచినప్పుడు అరికాలికి నిప్పుకణాలకి మధ్య ఈ బూడిద పొర చాలా వరకు తొర్పడుతుంది. అంటే మండే కణాలనుండి సెగ రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో నడక పూర్తి కావడం జరిగిపోతుంది. అయితే అగ్నిగుండంలో ఇనుప ముక్కలు లేకుండా చూచుకోవాలి. మేకులు ఉంటే అవి కాలి తొందరగా శరీరాన్ని కాల్చేస్తాయి కనుక తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇదే హెచ్చరికను జెమ్స్ రాండీ చేశాడు.
ఉదాహరణకు కాలే పెనంపై చెయ్యి పెడితే వెంటనే సెగ అంటి అరచెయ్యి కాలుతుంది. అంతే సెగ ఉన్న అవెన్ లో చెయ్యి పెడితే కాలదు. సెగ ఒకటే అయినప్పుడు ఈ తేడా ఎందుకు వస్తుంది. అంటే సెగ అంటడంలో తేడా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
1983లో శ్రీలంకలో జెమ్స్ రాండీ నిప్పులపై నడిచి తన మ్యాజిక్ అద్భుతాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని చాలా సార్లు విడమర్చి చెప్పాడు. కొందరు నిప్పులపై నడిచినప్పుడు తాము మద్యపానం సేవించి ఆ మత్తులో నడుస్తామని చెప్పారు. కానీ మత్తుకి, శరీరం కాలటానికి సంబంధం లేదు. మత్తు లేకుండా నడచి కాళ్ళు కాలవనీ జెమ్స్ రాండీ చూపాడు.
ఈ విషయంలో ఆద్యాత్మిక కారణాలు చెప్పి జనాన్ని మభ్యపెట్టే వారిని జెమ్స్ ర్యాండీ ఖండించాడు. నిప్పులపై నడవటం అనేది అనేక దేశాల్లో ఉన్నది. ఇది ఒక మతాచారంగా కూడా చేస్తున్నారు. జపాన్, హవాయి మొదలైన చోట్ల కూడా ఈ సంఘటనలు జరిగాయి.
కేక్ తయారు చేయటంలో చక్కని ఉదాహరణ చూపవచ్చు. వివిధ వస్థువులలోకి వేడి ఎలా ప్రసురిస్తుందో ఇదొక చక్కని ఉదాహహగరణ. నాలుగు వందల డిగ్రీల వేడిలో కేక్ అవెన్ లో బేక్ అవుతుంది. అక్కడ చెయ్యి పెట్టినా కాలదు. అలాగే అంత వేడిలో బేక్ అయిన కేక్ పై చెయ్యి పెట్టినా కాలదు. అంతే వేడిగల పెనంపై చెయ్యి పెడితే కాలిపోతుంది. దీనిని బట్టి ఒకే వేడిదగ్గర వివిధ వస్తువులు వివిధ రీతులలో వేడిని ప్రసరింపచేస్తాయని అర్థమౌతుంది.
ఈ విధంగా వైజ్ఞానిక దృక్పధంతో ప్రతీ అద్భుతాన్ని, మ్యాజిక్ అంశాన్నీ వివరించవచ్చునని, జేమ్స్ రాండి అంటాడు. అలాగే అనేక ఆశ్చర్యకరమైన విషయాలను విడమరచి శాస్రీయ దోరణిలో చెప్పాడు, రాశాడు. అందుకే అతడు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. బూటకంతో జనాన్ని మోసం చేసి మభ్యపెట్టే వారిని బట్టబయలు చేశాడు. వైద్య, ఆరోగ్య రంగాల్లో, జ్యోతిష్యంలో, అతీంద్రియ శక్తులలో ఇలాగే చేసి చూపాడు.

7 comments:

venkataramana said...

Here r the voting results for Innaiah's Hetuvada credibility...

Option1: 0
Option2: 9
Option3: 0
Total Viewers: 15

Option1: Innaiah is a True Hetuvadi
Option2: Innaiah is a Suedo Hetuvadi
Option3: None

Here r the results for Innaiah's Manavatavada credibility:

Option 1: 0
Option 2: 3
Option 3: 0

Option 1: ఇన్నయ్య అసలు,సిసలైన మానవతా వాది.
Option 2: ఇన్నయ్య అసలైన మానవతావాది కాదు.
Option 3: నాకు ఏమీ తెలీదు.

సుభద్ర said...

manchi vishayam chepparu.

Anonymous said...

Option 2: ఇన్నయ్య అసలైన మానవతావాది కాదు

మంచు పల్లకీ said...

Option 2: ఇన్నయ్య అసలైన మానవతావాది కాదు

ధరణీరాయ్ చౌదరి said...

నిజం నిప్పులాంటిది ...అలాంటి నిజాల నిప్పు కణాల పై మీరు రోజూ నడుస్తూనే ఉన్నారు. మేము చూస్తూనే ఉన్నాము...థాంక్స్...మంచి విషయాలు చెబుతున్నందుకు!

మంచు పల్లకీ said...

ఎక్కడొ మొదలుపెట్టి ఎక్కడొ ఆపి , ఎదెదొ వుద్దహరణలు ఇచ్చి , పిచ్చ పిచ్చ గా రాసారు ఇన్నయ్య గారు.
మన చెయ్యి ఎంత వెడెక్కింది అన్నది మన చేతికి హేట్ సొర్స్ కి మద్య వున్న థర్మల్ రెసిస్టన్స్ మీద డిపెండ్ అవుతుంది. బేక్ చెసిన కేక్ 400 డిగ్రీలు వుండదు. ఎదయినా రాసెముందు కాస్త రాసేదాంట్లొ మీ పరిజ్ఞానం ఎంతుందొ తెలుసుకొండి.

ఇక అసలు విషయానికి వస్తే నిప్పులుమీద నడవదానికి కావల్సింది ప్రాక్టిస్ మరియు దైర్యం(ఎమి కాదు అన్న నమ్మకం) . అంతకుమించి దానికి స్పెషల్ మహిమలు కావాలి అని ఈ బ్లాగు చదివే వాళ్ళు ఎవరు అనుకోరు. నిప్పులు మీద నడిచె దైర్యం(ఎమి కాదు అన్న నమ్మకం) మీరు చెప్పిన ఆద్యాత్మిక కారణాలు వల్ల వచ్చింది.

దీనికి మీరిచ్చిన ఒవెన్ , పెనం ఉదాహరణ మాత్రం పిచ్చ కామెడి. ఈ లెక్కన మీ మీటింగ్ వచ్చి మీరు చెప్పె సొల్లు వినెవాళ్ళు ఇంకెంత తింగరోళ్ళొ :-)

అశోక్ చౌదరి said...

హ హ హ.. చాల గొప్ప విషయం కనిపెట్టారు.. ఒక సరి నడిచి చూసారా మీరు?
అలానే చాల మంది సాధువులు గాలిలో తేలటం కూడా చేసి చూపారు.. దానికి కూడా ఏదన్న సైన్సు వుంటే చెప్పండి..మీరు చేస్తాము అన్న చెప్పండి అందరు చూస్తారు...