Wednesday, August 12, 2009

మూల దోషం ఎక్కడుంది?

అన్ని మతాలకు మూల గ్రంధాలు రాశారు. మతాన్ని సృష్టించినట్లే, మూల గ్రంధాలు సృష్టించారు. మనుషులు రాశారంటే విలువరాదు. కనుక తెలియని శక్తి, దైవం, రాసినట్లు అవి మానవులకు అందించినట్లు చక్కని కథ అల్లారు. కొంచెం తేడాలతో యిలాంటి కథనాలే అన్ని మతాల్లో చూపారు.
జనం దేవుణ్ణి నమ్మినట్లే, మూల గ్రంథాల్ని పరమ సత్యాలని నమ్మారు. వాటిని పూజిస్తున్నారు. పురుషులు రాశారు గనుక స్త్రీలను కించపరచి, ద్వితీయ స్థానం యిచ్చారు. అవి దైవం రాసినందుకు మానవులు మార్చడానికి వీల్లేదన్నారు. దానికై దైవాంశ సంభూతులని ముద్ర వేసుకున్న పురోహితవర్గాలు, పోప్ లు, ముల్లాలు వ్యాపారం చేస్తున్నారు.
వీటిపై నమ్మకాలు పోతే మానవులు స్వేచ్ఛా పరులౌతారు. స్త్రీలకు సమానత్వం వస్తుంది. మానవ విలువలు అమలు జరుగుతాయి. దీనంతటికీ మతం పట్ల మూల గ్రంధాల పట్ల నమ్మకాలు పోగొట్టుకోవడం చాలా అవసరం.

2 comments:

jogeshdraju said...

మీ ప్రప౦చ౦ లో
మీరు అనుకు౦టున్నట్టు ఏ గ్ర౦థాన్ని భగవ౦తుడు రాశాడో సెలవిస్తారా.
భగవద్గీత భగవ౦తుడు రాశాడా, భారత౦ మరొక్కసారి చదవ౦డి
మహాభారత౦ కూడా భగవ౦తుడు రాశాడా
రామాయణ౦ కూడా మీరనుకునే దేవుడు రాయలేదే
మీరనుకున్నట్టు కూడా అనుకు౦దాము. ఆయా కాలాల్ని బట్టి కథలల్లి రాశారనుకున్నా వాటి లో మ౦చి లేకపోతే ఇ౦తకాల౦ ఎలా వు౦టాయి.
మ౦చి గురి౦చి చెప్పేవాణ్ణి భగవ౦తుడు అనుకు౦టే తప్పే౦టో తెలియట౦ లేదు.
ఇక మీరన్నట్టు వ్యాపార౦ చేసిన పురోహిత వర్గాలు ఏవి? అవి ఎ౦త స౦పాది౦చాయి? మీ దగ్గరేమయినా ఆధారాలు౦టే ప్రచురిస్తే బాగు౦టు౦ది. ఎన్నో రామాయణాలు, ఎన్నో భారత కథలున్నాయి. అసలు ప౦టలో అ౦తరప౦టలాగే ఎన్నో నీతి కథలు, తీయటి కాలక్షేప కథలు ప౦డి౦చారు. అయినా కలుపు మొక్కల్లా రామాయణ విషవృక్షాలు కూడా మొలిచాయి. రైతు అన్ని౦టినీ భరి౦చినట్టే సమాజ౦ కాలానుగుణ౦గా అన్ని౦టితోనీ సహజీవన౦ సాగిస్తో౦ది. మానవ మేథకు ఎన్నో విస్తృత పార్శ్వాలు ఉన్నట్టే, వికృత రూపాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మీరనుకునే మీ భావ వ్యతిరేకులవి మిగతావి మీవి. మీ ప్రప౦చ౦ లాగే సారీ నా ప్రప౦చ౦లాగే.

Mangesh Devalaraju said...

అసలు మూల దోషం బయట తప్పులు వెతికే స్వభావంలో వుంది. అసలు భగవంతుడు వున్నాడో లేడో తెలియదు. హేతువాదులు చేసే ప్రచారమంతా నిజం అని కొద్దిసేపు అనుకుందాం. కాని మనం అందరం వున్నాం కదా? అసలు ఇన్ని జీవరాసులు ఎలా జీవిస్తున్నాయ్? దానికి మూలం ఎమిటి? నిద్ర ఎలా పోతున్నాం? నిద్రలో ఎక్కడ వున్నాం? నిద్ర ఎలా లేస్తున్నాం? నిద్రలో మనకు ఏమీ తెలియదు కదా? ఎందుకని? జీవి ఎలా మరణిస్తోంది? ఎక్కడి నుండి పుడుతోంది? పుట్టక ముందు ఎక్కడ వుంది? మరణించాక ఎక్కడికి పోతోంది? అసలు శ్వాస మనం పీలుస్తున్నామా లేక అదే జరుగుతోందా? దానిని ఎవరు నియంత్రిస్తున్నారు?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే మగతనం ఎవరైనా హేతువాదులమని విర్రవీగి ప్రజల మనోభావాలను తప్పుదారి పట్టించేవారికెవరికైనా వుందా? దాన్ని మీరు అనుకునే సైన్స్ పరంగా నిరూపించ గలరా? లేని పక్షంలో మౌనం వహించండి అంతే గాని వూరికే మాట్లాడి తిరిగి ప్రశ్నించినపుడు మాట్లాడకుండా వుండటం సరియైన పద్దతి కాదు.

మట్టితో అనేక వస్తువులు తయారు చేస్తాం, బంగారంతో అనేక ఆభరణాలు చేస్తాం. కేవలం వస్తువులను చూసే బుద్ధే వుంటే అప్పుడు అన్నింటి యందు వున్న ఒకే పదార్దం కనపడదు. ఆ వస్తువుల రూపాలు వాటి గుణగణములు మాత్రమే కనపడి అసలైన మూల పదార్దము మరుగున పడుతుంది. దానిని గమనించక మరచి వస్తువులనే చూస్తూ వుండటము వలన దోషాలు బాగా కనపడతాయి. అసలు దోషం అనేది ఎక్కడా లేదు. అది కేవలం మానవ ప్రవర్తన నుండి ఏర్పడిన బై ప్రోడక్ట్. దీపం వెలిగించినపుడు వచ్చిన మసి, పొగ వలె. దోషం వెతికే బుద్ది వుండాలే కాని అది కపడని చోటు వుండదు. అంత గొప్పది అది. కళ్ళకి నల్ల అద్దాలు ధరించినవాడికి లోకమంతా నల్లగానే కనపడుతుంది. అసలు సత్యాన్ని గ్రహించాలి అంటే దాన్ని తీసి చూడాలి. అలా తీసి చూడండి అప్పుడు స్త్రీ, పురుషుడు అని వేరుగా కనపడరు. కేవలం వారిలో వున్న చైతన్యమే కనపడుతుంది. ఈ రెండు కూడా ప్రకృతి జీవులను వృద్ది చేయటానికి కల్పించిన రెండు వేరు వేరు తత్వములు.

నాలుగు సం||లు ఇంజినీరింగు చదివితే ఇంజనీరు, అయిదు సం||లు వైద్యం కోర్సు చదివితేనే డాక్టరు అవుతారు. అలాగే అభ్యాసం చేస్తేనే విద్య వస్తుంది. ఎమీ చెయ్యకుండా తెలిసినదే సత్యం అనుకొని అమాయకులను మోసం చెయ్యకండి. ప్రతిదాన్ని విమర్శించటం ఒక ఫాషన్ అయిపోయింది ఇప్పుడు. విమర్శించే వాడికి ఎక్కువ తెలుసు అని అందరూ అనుకుంటారని భావిస్తారు కాబోలు. ఎంతటి అమాయకత్వం. బావిలోని కప్పల వలే జీవించ వద్దు. బయటకు రండి. చాలా విశాలమైన ప్రపంచం వుంది. అందు అనేక రంగులు వింతలు వున్నాయ్. వాటిని వాటిగా దర్శించండి. మనలోని దోషాలతో చూస్తే అన్నీ కలసి అసలు మాయమైపోతుంది. పది మందిని బాగుచెయ్యటానికి ప్రయత్నించండి. మీరు నమ్మినవే సత్యములని ఆ సిద్దాంతములను ప్రచారం చెయ్య వద్దు. ప్రస్తుతానికి నమ్మినా అవి ఎంతో కాలం వుండవు అని గుర్తించండి. ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా భారత, భాగవత, రామాయణాది పురాతన ధర్మ శాస్త్రాలను ఎవరైనా ఎమైనా చెయ్యగలిగారా? అది గుర్తించండి.

మంచి చెయ్యకపోయినా పర్వాలేదు చెడు మాత్రం చెయ్యకండి. మూల దోషం ఎక్కడో బయట లేదు మనలోనే వుంది అని గహించండి.