Monday, April 9, 2007

డాక్టర్ ఇన్నయ్య - రచయిత - పరిచయం




నరిశెట్టి ఇన్నయ్య గారి వివిధ పత్రికలు,పాత్రికేయులతో అనుభవాలు ప్రచురించటానికి ఎంతో సంతోషిస్తున్నాను. అముద్రితమైన ఈ పుస్తకు తొలిసారిగా ఈ బ్లాగు ద్వారా వెలుగులోకి వస్తున్నది. Journalism విధ్యార్థులకు, సమకాలీన రాజకీయాలు పై ఆసక్తి గలవారికి ఈ పుస్తకం ఉపయుక్తకరంగా ఉండగలదు. వీరు పాత్రికేయులే కాకుండా మానవతావాది. M.N.Roy గారి మానవతావాద సిద్ధాంతాల్ని త్రికరణ శుద్ధిగా నమ్మి, వాటి ప్రచారానికై పలు పుస్తకాలను వెలువరించారు. Philosophy of Modern Science లో Doctorate తీసుకున్న వీరు పలు ఆదర్శ వివాహలకు పౌరోహిత్యం వహించారు. ఆంధ్ర జ్యోతి దినపత్రిక Hyderabad Bureau Chief గా కొన్ని సంవత్సరాలు పని చేశారు. వీరి గురించి సమగ్ర సమాచారానికై చూడండి, ఈ వెబ్ పేజీలు.

http://innaiahn.tripod.com/
http://en.wikipedia.org/wiki/Innaiah_Narisetti
http://amazon.com (search for innaiah)

1 comment:

రవి వైజాసత్య said...

ఇన్నయ్య గారి గురించి ఆంగ్ల వికీలో మీరు వ్యాసం రాసినట్టు చూశా.. అదే చేత్తో తెలుగు వికీలో కూడా ఒక వ్యాసం రాయండి రావుగారు