మదర్ తెరీసా ఇలా కూడా చేయగలదా!
1. Christopher Hitchens : Missionary Position. Mother Terasa theory and practical.
2. Aroup Chatterjee : Mother Teresa The Final Verdict
(Meteor Books, 170/43, Lake Guaradens, Kolkata – 700 045. India. PP - 427)
1976లో హైదరాబాద్ లో నేను మదర్ తెరిసాను ఇంటర్వ్యూ చేసాను. అప్పట్లో ఆంధ్రజ్యోతి బ్యూరోఛీఫ్ గా పబ్లిక్ గార్డెన్స్ లో ఒక కార్యక్రమం సందర్భంగా మదర్ తెరిసాతో మాట్లాడాను. ఏది అడిగినా ఆమె సమాధానం ఒక్కటే. అంతా దైవకృప అనీ, పరిష్కారానికి ప్రార్థనే మార్గమని చెప్పడమే. చాలా నిరుత్సాహపడ్డాను. ఆమె నుండి నేను ఏవో సమాధానాలు ఆశించడం పొరపాటని గ్రహించాను. 2005లో కలకత్తాలో ఆమె స్థాపించిన పిల్లల శరనాలయాలు చూశాను.
కేన్సర్ బాధ భరించలేక ఒక రోగి మూలుగుతుంటే, జీసస్ క్రీస్తు నిన్న ముద్దెట్టుకుంటున్నాడని మదర్ తెరిసా అన్నది. అందుకు బదులుగా ఆ వ్యాధిగ్రస్తుడు, దయచేసి నన్ను ముద్దెట్టుకోవద్దని జీససంకు సిఫారసు చేయమని ఆమెను అడిగాడట.
ఇది జరిగింది కలకత్తాలోని మదర్ తెరిసా ఆశ్రమంలో. ఆమె నిర్వహించిన అనాధపిల్లల గృహాలలో పిల్లలకు రోగాలొస్తే, నయం కావడానికి మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు చేసేవారు. అది వారి విశ్వాసం.
సుప్రసిద్ధ బ్రిటిష్ మెడికల్ మ్యాగ్ జైన్ లాన్సెట్ ఎడిటర్ రాబిన్ ఫాక్స్ స్వయంగా 1991లోనే కలకత్తాలో ఈ దృశ్యాలు చూచారు. అలాగే విశ్వవిఖ్యాత జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచెన్స్ కూడా స్వయంగా మదర్ తెరిసాను కలసి ఇలాంటి సంఘటనలు గ్రహించారు.
అయితే మదర్ తెరిసాకు గుండెపోటు వస్తే, ప్రార్థన చేస్తూ, జీసస్ క్రీస్తు ముద్దు పెట్టుకున్నాడని సరిపెట్టుకున్నారా? స్టార్ హోటళ్ళ వంటి కార్పోరేట్ ఆస్పత్రులలో చేర్చారు. ఏమిటి విచక్షణ? అలాంటి ప్రశ్నలు భారతరత్న మదర్ తెరిసా గురించి వేయకూడదంతే.
మదర్ తెరిసా పేరుమార్చి, ఊరుమార్చి పోప్ జాన్ 2వ పాల్ దృష్టి ఆకర్షించి, నోబెల్ ప్రైజ్ 1979లో గ్రహించింది. భోపాల్ లో ఒకరోజు పొద్దున్నే నిద్రలేచే సరికి వేలాది కార్మికులు, పిల్లలు, తల్లులు యూనియన్ కార్పైడ్ విషవాయువులు కారణంగా చనిపోయారు. అమెరికా కంపెనీ యాజమాన్యం ఖంగుతిన్నది. కలకత్తానుండి హుటాహుటిన భోపాల్ చేరుకున్న మదర్ తెరిసా జీవకారుణ్యంతో ఒక విజ్ఞప్తి చేసింది. కార్మికులనుద్దేశించి ప్రకటన చేసిందనే భ్రమ పడితే పొరపాటే. యాజమాన్యాన్ని క్షమించమని మదర్ తెరిసా కోరింది. అది ఆమె ప్రత్యేకత.
అయితే ఆమెకు మద్దతుగా బలమైన క్రైస్తవమతం, ప్రభుత్వాలు, పాలకవర్గాలు ఉన్నందువల్ల సాగిపోయింది. మదర్ తెరిసా గురించి చాలామందికి చాలా విషయాలు తెలియవని, గుడ్డినమ్మకమే ఆధారమని గ్రహించాను. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు, నాలుగున్నర లక్షల స్త్రీలు, యువతులు చెరచబడి పారిపోయి, ఇండియా వచ్చారు. అయినా సరే, వారెవరూ గర్భం తొలిగించుకోరాదని అదంతా దేవుడిచ్చిన ప్రసాదం అని మదర్ తెరిసా ప్రకటించింది. అది ఆమె జీవకారుణ్యానికి, దైవభక్తికి గీటురాయి.
ఐర్లాండ్ లో కేథలిక్కులు అత్యధికంగా ఉన్నచోట గర్భస్రావం విడాకుల విషయం పార్లమెంటులో చర్చికి రాగా, మదర్ తెరిసా గూడా కల్పించుకుని తన మత ప్రకారం విడాకులు ససేమిరా వీలుకాదన్నది.
కానీ డయానా యువరాణి విడాకులు తీసుకుంటుంటే అది దైవేచ్ఛ అని మదర్ తెరిసా దీవించింది. ఆమెది నాలుకేనా అనబోకండి. డబ్బు, పలుకుబడి, ఆకర్షణ ఉన్న డయానా ప్రభావమే వేరు. మదర్ తెరిసా అక్కడ అవకాశవాదం చూపించింది.
ఇలాంటివి ఏకరువు పెట్టడం ఈ రివ్యూ ఉద్దేశం కాదు. లోకానికి తెలియని మదర్ తెరిసా గురించి నిజాలు చెప్పడమే ముఖ్యం. నీవు ఎన్ని నిజాలు చెప్పినా, మదర్ తెరిసా కీర్తి తగ్గదు అంటారా? వారికి నమస్కారాలు.
మదర్ తెరిసా (1910-1997) తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఆమె పుట్టింది మాసడోనియా దేశంలోని స్కోపీజేలో. సోదరి, సోదరుడు ఉన్నారు. క్రైస్తవమత శాఖలో నన్స్ అయ్యే ఒక సాంప్రదాయం పాటించి, 15వ యేట ఈమె ఐర్లాండ్ వెళ్ళింది. అక్కడి నుండి ఇండియాలో కలకత్తా చేరుకున్నది 1929లో. కొన్నాళ్ళు టీచర్ గా చేసి, చివరకు నన్ గా కుదురుకున్నది. తొలిపేరు ఆగ్నస్ గోన్షా బొజాక్సు.
చిన్నపిల్లల్ని సేకరించి, అనాధశరణాలయాలలో పెట్టడం క్రైస్తవ మత ప్రచారంలో ఒక భాగం. ఆ కార్యక్రమం మదర్ తెరిసా చేపట్టింది. చిన్నప్పుడు పిల్లల్ని రాబడితే, వారిని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చనేది సెయింట్ ఆగస్టీన్ మూలసూత్రం. జెసూట్ ఫాదరీలు కూడా అదే పాటిస్తారు. నన్స్ కూడా ఆ దోవలో నడుస్తారు. మదర్ తెరిసాకు కలకత్తా వీధులు కావలసినంత మంది పిల్లల్ని అందించాయి. ఛారిటీస్ రావడం మొదలైంది. అనేకచోట్ల, వివిధ దేశాల్లో పిల్లల అనాధశరణాలయాలు స్థాపించారు.
పిల్లలకు జబ్బుగా ఉన్నప్పుడు ప్రార్థనలు చేయడం, చనిపోతున్న వారి పక్కన నిలబడి మత విధులు ఆచరించడం మదర్ తెరిసా ఆశ్రమం ఆచారమే. ఆ విధంగా మతమార్పిడి సున్నితంగా చాపకింద నీరువలె ఆచరించారు. అసలు ఉద్దేశం అది కాదంటుండేవారు. ప్రపంచ వ్యాప్తంగా కేథలిక్కులు, వారి సంస్థలు మదర్ తెరిసా సేవల్ని వూదరగొట్టాయి. పోప్ కూడా పొగిడాడు. అంతటితో గుర్తింపుతోబాటు డబ్బు కూడా రావడం మొదలైంది. డబ్బు సేకరించడానికి కేథలిక్కులు అనుసరించే అనేక మార్గాలలో ఛారిటీస్ సంస్థలు ముఖ్యం. మదర్ తెరిసా అరమరికలు లేకుండా కోట్లలో వసూళ్ళు చేసింది.
హైతీదేశపు పాలకులుగా, నరహంతకులుగా ప్రజల్ని నలుచుకుతిన్న డ్యువలియర్ కుటుంబానికి మదర్ తెరిసా సన్నిహితురాలైంది. జీన్ క్లాడ్ డ్యుయలిర్ ఆమెకు సన్మానాలు చేసి. డబ్బిచ్చింది. మదర్ తెరిసా తన సత్కారానికి సమాధానంగా డ్యువెలిర్ కుటుంబం పేదల ప్రేమికులని ఉపన్యసించింది. అంతకంటే పచ్చి అబద్దం మరొకటి ఉండదు.
అమెరికాలో అప్పులిస్తానని నిధులు సేకరించి, మోసగించిన ఛార్లెస్ కీటింగ్ జైల్లో పడ్డాడు. 252 మిలియన్ డాలర్ల మోసగాడికి జైలు శిక్ష తప్పించమని మదర్ తెరిసా జడ్జికి ఉత్తరం రాసింది. కీటింగ్ 1.25 మిలియన్ డాలర్లు ఆమె నిధికి ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తే కీటింగ్ చేతిలో మోసపోయిన కొందరినైనా ఆదుకుంటామని అడ్వకేట్ అడిగాడు. జవాబు లేదు. రాబర్డ్ మాక్స్ వెల్ అనే పత్రికా ప్రచురణ కర్త 450 మిలియన్ పౌండ్ల వాటాదార్ల దగ్గర మోసం చేసినప్పటికీ అతని వద్ద మదర్ తెరిసా డబ్బు పుచ్చుకున్నది. న్యూగినీ దేశంలో మత మార్పిడులు విపరీతంగా చేయించింది.
భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన అత్యవసర పరిస్థితిని 1975 పొగుడుతూ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉద్యోగాలు బాగా లభిస్తున్నాయని, సమ్మెలు లేవని మదర్ తెరిసా సర్టిఫికేట్ ఇచ్చింది. అందువల్లనే అనలేం గానీ, ఆ తరువాతే ఆమెకు భారతరత్న లభించింది.
మదర్ తెరిసా వసూళ్ళ గురించి జర్మనీలో స్టెరన్ అనే పత్రిక విచారణ జరిపింది. నిధులు ఎంత, ఎక్కడ ఉన్నాయి? ఎలా ఖర్చు చేస్తున్నారని అడిగితే చెప్పలేదు. అంతా రహస్యం అన్నారు. స్టెర్న్ (STERN) పత్రికలో వాల్డర్ వ్యూలెన్ వెబర్ 1998 సెప్టెంబరు 1న సుదీర్ఘ విమర్శలు చేస్తూ మదర్ తెరిసా నిధులు, బాంకులో దాచి, పిల్లలకు ఖర్చు పెట్టనితీరు, చివరకు రోమ్ బాంకుకు చేర్చిన విధానం బయటపెట్టాడు. సూజన్ షీల్డ్స్ లోగడ మదర్ తెరిసా వద్ద పనిచేసి విసుగుతో బయటపడి న్యూయార్క్ లో డబ్బు విషయాలు వెల్లడించింది.
భారతదేశంలో డబ్బు పెట్టకుండా విదేశీ బాంకులలో దాచారు. చివరకు అంతా వాటికన్ బాంకుకు ముట్టింది. ఆమె చనిపోయేనాటికి ఒక్క న్యూయార్క్ లోనే 50 మిలియన్ డాలర్లు మూలుగుతున్నాయి. చట్టప్రకారం ఛారిటీస్ కు వసూలైన డబ్బు వేరే ఖర్చు చేయకూడదు. మదర్ తెరిసాను అడిగేదెవరు?
సుప్రసిద్ధ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ హిచిన్స్, తారిక్ అలీ ఇంగ్లాండ్లో ఒక డాక్యుమెంటరీ తీసి (హెల్స్ ఏంజిల్) ఛానల్ 4లో మదర్ తెరిసా గుట్టు రట్టు చేసారు. ది మిషనరీ పొజిషన్ శీర్షికన హిచిన్స్ ఒక పుస్తకం వెలువరించారు. సునంద దత్త రే కూడా నిశిత పరిశీలనా వ్యాసాలు రాసారు. అరూప్ ఛటర్జీ న్యూ స్టేట్స్ మెన్ లో 1997 సెప్టెంబరు 26న తీవ్ర పరిశీలనా వ్యాసం రాసారు. ధీరూషా ఇండియాలో మతమార్పిడిలు చేసిన మదర్ తెరిసా గురించి రాసారు.
కలకత్తా వీధుల్లో మదర్ తెరిసాకు దానంగా వచ్చిన బట్టలు అమ్ముకోవడం, పేద పిల్లలు ఆమె ఆశ్రమాల్లో దిక్కులేక ఎవరికీ చెప్పుకోలేని స్థితిలో బ్రతకడం వెల్లడయ్యాయి. ఏమైతేనేం, మతం ఆమెకు చాలా మంచి ప్రచారం చేసిపెట్టింది.
మదర్ తెరిసా చనిపోగానే, పోప్ జాన్ పాల్ కొత్త ఎత్తుగడకు నాంది పలికాడు. మత వ్యవస్థలో చనిపోయిన వ్యక్తిని సెయింట్ చెయ్యాలంటే రెండు అద్భుతాలు చూపాలి. కనీసం 5 సంవత్సరాలు వేచిఉండాలి. మత వ్యాపారంలో పోప్ ఆరితేరిన వ్యక్తి కనుక, అంత జాప్యం లేకుండా మదర్ తెరిసాను సెయింట్ చేయడానికి పూనుకున్నాడు. 19 అక్టోబర్ 2003లో అందుకు తొలిప్రక్రియ ప్రకటించాడు. ఇప్పుడు పోప్ బెనెడిక్ట్ 16 ఆది సాగిస్తున్నాడు.
ఇక అద్భుతాల సృష్టి ఎలా జరిగిందో చూద్దాం. పశ్చిమబెంగాల్ లో ఆదివాసి కుటుంబానికి చెందిన మోనికాబస్రా అనే ఆమెకు 5 గురు పిల్లలు. పేదకుటుంబం. ఆమెకు క్షయవ్యాధి ఉంది. కడుపులో పెద్ద గడ్డ వచ్చింది. బాలూర్ ఘటా ఆస్పత్రిలో డా. రంజన్ ముస్తాఫ్ చికిత్స చేయగా, కడుపులో గడ్డ పోయింది. మోనికాబస్రా ఒకనాడు కలలో మదర్ తెరిసాను చూసినట్లు, ఆమె సమాధిని సందర్శించినట్లు, దాని ఫలితంగా ఆమెకు ఉన్న కడుపులో గడ్డ మాయం అయినట్లు కథ సృష్టించారు. తొలుత అది సరైనది కాదని ఆమె భర్త సీకో అన్నాడు. తరువాత వారి పిల్లల్ని క్రైస్తవబడిలో చేర్చడం, వారికి కొంత భూమి సమకూర్చడంతో, అద్భుతకథ నిజమేనని చెప్పించారు.
మదర్ తెరిసా బ్రతికుండగా అనాధ పిల్లల పేర నిధులు వసూలు చేసి, రోమ్ కు చేరవేసే చనిపోయిన తరువాత సెయింట్ పేరిట డబ్బు వివిధ రూపాలలో వసూలు అవుతుంది. ఇది కొన్నాళ్లు సాగుతుంది. దీన్నే మతవ్యాపారం అనవచ్చు. ఇలా నిత్య నూతనంగా భక్తుల్ని వంచిస్తూ పోవడం ఆధ్యాత్మిక ప్రక్రియలో అనూచానంగా వస్తున్నది. ఇక మదర్ తెరిసా ఫోటోలు, విగ్రహాలు, రకరకాల చిహ్నాలకు ఏమాత్రం కొదవలేదు.
క్రిస్టొఫర్ హిచిన్స్ విమర్శల దృష్ట్యా పోప్ ఆయన్ను రోం పిలిపించి సాక్ష్యం తీసుకున్నారు. మదర్ తెరీసా మహత్తుల బూటక వ్యవహారంలో యిది జరిగింది.
అయినా మదర్ తెరిసాను సెయింట్ చేస్తే, కేథలిక్ వ్యాపారం బాగాజరుగు తుంది. అంటే ఏటా ఉత్సవాలు, విగ్రహాల ప్రతిష్టాపనలు, పూసల దండలు, పుస్తకాలు అమ్ము కోడం యిత్యాదులు ఎన్నో చేయవచ్చు. కేథలిక్కుల సెయింట్ వాణిజ్యం అంటే యిదే. జనంలో మూఢ విశ్వాసాలున్నంత వరకు యిది సాగిపోతుంటుంది.
అనాధ పిల్లల సంరక్షణ కోసం మదర్ తెరీసాకు చేరిన డబ్బు ఖర్చు పెడితే కలకత్తాలో అనాధ పిల్లలు వుండేవారే కాదు. మదర్ తెరీసా పట్ల కమ్యూనిస్టులు, భారతీయజనతా పార్టీ సైతం వూరుకొని, వెనకేసుకరావడం ఆమె మహిమేనేమో. 123 దేశాలలో ఆశ్రమాలు పెట్టి అతి జాగ్రత్తగా క్రైస్తవమత ప్రచారానికి పరోక్షంగా ప్రభావితం చేసిన మదర్ తెరీసా తగిన బహుమతి పొందింది.
నా మిత్రులు కె. రామచంద్రమూర్తి ఎడిటర్ గా వున్నప్పుడు ఆంధ్రజ్యోతిలో యీ సమీక్షను వేయజాలమన్నారు. మానవవాద పత్రికలు మాత్రం ప్రచురించాయి.
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
మొన్న ఆంధ్రభూమిలో గాంధీ డబ్బుమనిషని రాసిన వ్యాసం చదివాను,
http://andhrabhoomi.com/gandhi.html
ఇప్పుడు ఇది!! నిజనిజాల మాట ఎలా ఉన్నా మనసంతా అదోలా అయిపోయింది :((
NammalEni Nijam. Jeerninchu kovadaniki konchem samayam padutundi.
నిషిగంధ గారి లాగా ధైర్యంగా వ్యాఖ్య రాయలేకపోయాను ఇంతకు ముందు. నా బ్లాగులోనే ఒక టపాలో నాకు కలిగిన భావాలను రాసుకున్నాను.
గర్భస్రావం గురించి ఆ మతమూ, వారి పోప్ కూడా అదే మాట చెప్తారు. అందులో మదర్ థెరీసా ప్రత్యేకంగా కావాలని చేసింది ఏదీ లేదని నాకనిపిస్తుంది.
నా మతం కాదు కాబట్టి నాకూ అనిపిస్తుంది అలా పుట్టి ఘోరమైన పరిస్థితులలో జన్మనిచ్చి ఘోరంగా బతకనివ్వడం మానవత్వమా అని.
మందులివ్వకుండా మతం, విశ్వాసం మాత్రమే వాడారంటే నమ్మశక్యం కాకుండా ఉంది.
వివేకానందుడు, మదర్ థెరీసా లంటి వారి సేవలనే నమ్మద్దంటారా?
ఎంత చెడ్డ వారైనా వీరు మిగిలిన ఎంతో మంది మంచి వారికంటే మంచే చేశారు కాదా?
వీరి పేరు చెప్పుకుని, వీరు నడిపే ఆశ్రమాలలో అక్రమాలు జరిగిఉండచ్చునేమో.
వీరి నమ్మకాలు ప్రశ్నించదగ్గవీ, హేతుబద్ధమైనవీ కాదేమో. ఆలోచించవచ్చు.
మహాత్ముడిని మొదలుకుని ఎవరైనా లోపం లేని వారున్నారా?
మీరు సమాచారం ఇస్తున్నారు. దీనిని చదివే వారం ఏ విధంగా ఉపయోగించుకోగలం అన్నది నాకు అర్థం కాకుండా ఉంది. ప్రశ్నించడం మంచిది. గుడ్డిగా నమ్మక పోవడం మంచిది. "అతి సర్వత్ర వర్జయేత్" అనీ, గాంధీ గారన్నట్టు "choose your battles" అనీ కూడా గుర్తుంచుకోవాలేమో, కాదంటారా?
నమస్తే, అదిరింది మీ టపా. అలాగే సత్య సాయి బాబా ని కూడా సృశించండి.
మదర్ తెరీసా తో పనిచేసిన సుసన్,అరూప్ గారలు
ఆధారాలతో చెప్పారు.ప్రామానిక పత్రిక సంపాదకులు చూసి రాసారు.ఆమె ఉండగానే ఇది జరిగినది.
Nice article andi...It is obvious that Mother Theresa was clear representation of catholic christianity propaganda..Mother theresa chesina seve swami paramanda ( just a random name) cheste noble prize,money everything ichevara..?
మదర్ తెరెసా గురించి ఓషో వ్యాసం :
OSHO EXPOSES MOTHER TERESA
Mother Teresa was awarded the Nobel Prize for her charitable work in India, which Osho criticizes. At the end of December 1980, Mother Teresa writes to Osho.
The politicians and the priests have always been in deep conspiracy, they have divided man. The politician rules the outside and the priest rules the inside: the politician the exterior and the priest the interior. They are joined in a deep conspiracy against humanity—they may not even be aware of what they are doing. I don't suspect their intentions; they may be absolutely unconscious.
Just the other day I received a letter from Mother Teresa. I have no intention of saying anything against her sincerity; whatsoever she wrote in the letter is sincere, but it is unconscious. She is not aware of what she is writing; it is mechanical, it is robot-like. She says, 'I have just received a cutting of your speech. I feel very sorry for you that you could speak as you did. Reference: the Nobel Prize. For the adjectives you add to my name I forgive you with great love.'
She is feeling very sorry for me…I enjoyed the letter! She has not even understood the adjectives that I have used about her. But she is not aware, otherwise she would have felt sorry for herself.
The adjectives that I have used—she has sent the cutting also with the letter—the first is 'deceiver', then 'charlatan' and 'hypocrite'….
Now I have criticized her and said that the Nobel Prize should not have been given to her, and she feels offended by it. She says in her letter, 'Reference: the Nobel Prize.'
This man Nobel was one of the greatest criminals possible in the world. the First World War was fought with his weapons; he was the greatest manufacturer of weapons….
Mother Teresa could not refuse the Nobel Prize. The same desire to be admired, the same desire to be respectable in the world—and the Nobel Prize brings you the greatest respect. She accepted the prize….
That's why I have called the people like Mother Teresa 'deceivers'. They are not deceivers knowingly, certainly, not intentionally, but that does not matter; the outcome, the end result is very clear. Their purpose is to function in this society like a lubricant so that the wheels of the society, the wheels of exploitation, oppression can go on moving smoothly. These people are lubricants! They are deceiving others and they are deceiving themselves.
And I call them 'charlatans' because a really religious person, a man like Jesus…Can you conceive of Jesus getting the Nobel Prize? Impossible! Can you conceive of Socrates getting the Nobel Prize or Al-Hillaj Mansoor getting the Nobel Prize? If Jesus cannot get the Nobel Prize and Socrates cannot get the Nobel Prize—and these are the true religious people, the awakened ones—then who is Mother Teresa?…
The really religious person is rebellious; the society condemns him. Jesus is condemned as a criminal and Mother Teresa is respected as a saint. There is something to be pondered over: if Mother Teresa is right then Jesus is a criminal, and if Jesus is right then Mother Teresa is just a charlatan and nothing else. Charlatans are always praised by the society because they are helpful—helpful to this society, to this status quo.
Whatsoever adjectives I have used I have used very knowingly. I never use a single word without consideration. And I have used the word 'hypocrites'. These people are hypocrites because their basic life style is split: on the surface one thing, inside something else.
She writes: 'The Protestant family was refused the child not because they are Protestant but because at that time we did not have a child that we could give them.'
Now, the Nobel Prize is given to her for helping thousands of orphans and there are thousands of orphans in the homes she runs. Suddenly she ran out of orphans? And in India can you ever run out of orphans? Indians go on creating as many orphans as you want, in fact more than you want!
And the Protestant family which has been refused was not refused immediately. If there was no orphan available, if all the orphans had been disposed of, then what is Mother Teresa doing with seven hundred nuns? What is their work? Seven hundred nuns…then whom are they mothering? Not a single orphan—strange!—and that too in Calcutta! You can find orphans anywhere on the road—you find children in the dustbins. They could have just looked outside the place and they would have found many children. You can just go outside the ashram and you can get orphans. They will come themselves, you need not find them!
Suddenly they ran out of orphans…And if the family had been refused immediately it would have been a totally different matter. But the family was not refused immediately; they were told, 'Yes, you can get an orphan. Fill in the form.' So the form was filled in. Till they came to the point where they had to state their religion, up to that moment, there were orphans, but when they filled in the form and wrote 'We belong to the Protestant Church,' immediately they ran out of orphans!
And this reason was not given to the Protestant family itself. Now, this is hypocrisy! This is deception! This is ugly! The reason given to the family itself was that because these children…because the children were there, so how could she say, 'We don't have any orphans'? They are always on exhibition!
She has invited me also: 'You can come any time and you are welcome to visit our place and see our orphans and our work.' They are constantly on exhibition!
In fact, those Protestants had already chosen the orphan, the child that they wanted to adopt, so she could not say to those people, 'It is because there are no more orphans. We are sorry.'
She said to them, "These orphans are being raised according to the Roman Catholic Church and it will be bad for their psychological growth because it will be such a disruption. Now, giving them to you will make them a little disturbed and it will not be good for them. That's why we cannot give the child to you, because you are Protestant."
Exactly that was the reason given to them. And they are not stupid people. The husband is a professor in a European university—he was shocked, the wife was shocked. They had come from so far away just to adopt a child, and they were refused because they are Protestants. Had they written 'Catholic' they would have been given the child immediately.
And one thing to be understood: these children are basically Hindu. If Mother Teresa is so concerned about their psychological welfare then they should be brought up according to the Hindu religion, but they are brought up according to the Catholic Church. And then to give them to Protestants, who are not different at all from Catholics…What is the difference between a Catholic and a Protestant? Just a few stupid things!…
Just a few days ago there was a bill in the Indian Parliament Freedom of Religion. The purpose of the bill was that nobody should be allowed to convert anybody to another religion: unless somebody chooses it out of his own free will no conversion should be allowed. And Mother Teresa was the first one to oppose it. In her whole life she has never opposed anything; this was the first time, and maybe the last. She opposed it. She wrote a letter to the Prime Minister, and there was a heated controversy between her and the Prime Minister: 'The bill should not be passed because it goes against our whole work. We are determined to save people, and people can be saved only if they become Roman Catholics.' They created so much uproar all over the country—and the politicians are always concerned about votes, they cannot lose the Christian votes—so the bill was dropped, simply dropped….
If Mother Teresa is really honest and believes that converting a person disturbs his psychic structure, then she should be against conversion unless a person chooses it by himself.
For example, you have come to me, I have not gone to you. I don't even go outside the door….
I have not gone to anybody, you have come to me. And I am not converting you to any religion either. I am not creating any ideology here, I am not giving you any catechism, any doctrine. I am simply helping you to be silent. Now, silence is neither Christian or Hindu nor Mohammedan; silence is silence. I am teaching you loving. Now, love is neither Christian nor Hindu nor Mohammedan. I am teaching you to be aware. Now, awareness is simply awareness; it belongs to nobody. And I call this true religiousness.
To me Mother Teresa and people like her are hypocrites: saying one thing but doing something else behind a beautiful facade. It is the whole game of politics—the politics of numbers.
And she says, 'For the adjectives you add to my name I forgive you with great love.' First of all, love need not forgive because in the first place it is not angered. To forgive somebody first you have to be angry; that is a prerequisite.
I don't forgive Mother Teresa at all, because I am not angry at all. Why should I forgive her? She must have been angry. This is why I want you to start meditating on these things. It is said that Buddha never forgave anybody for the simple reason that he was never angry. How can you forgive without anger? It is impossible. She must have been angry. This is what I call unconsciousness: she is not aware of what she is writing,…she is not aware of what I am going to do with her letter!
She says, 'I forgive you with great love'—as if there is small love and great love, and things like that. Love is simply love; It cannot be great, it cannot be small. Do you think love is a quantitative thing?—one kilo of love, two kilos of love. How many kilos of love makes it great? Or are tons needed?
Love is not a quantity at all, it is a quality. And quality is immeasurable: it is neither small nor great. Whenever somebody says to you, 'I love you very greatly,' beware! Love is just love; it cannot be less than that, it cannot be more than that. There is no question of less and more.
And what crime have I committed that she is forgiving me for? Just old Catholic stupidity—they go on forgiving! I have not confessed any sin, so why should she forgive me?
I stick to all the adjectives, and I will add a few more: that she is stupid, mediocre, idiotic! And if anybody needs to be forgiven it is she, not I, because she is committing a great sin. She is saying in this letter, 'I am fighting through adoption the sin of abortion.' Abortion is not a sin; in this overpopulated world abortion is a virtue. And if abortion is a sin then the Polack Pope and Mother Teresa and company are responsible for it because they are against contraceptives, they are against birth control methods, they are against the pill. These are the people who are the cause of all the abortions; they are responsible. To me they are great criminals!
In this overpopulated world where people are hungry and starving to be against the pill is just unforgivable! The pill is one of the most significant contributions of modern science to humanity—it can make the earth a paradise….
I would like to destroy poverty, I don't want to serve poor people. Enough is enough! For ten thousand years fools have been serving poor people; it has not changed anything. But now we have enough technology to destroy poverty completely.
So if anybody has to be forgiven it is these people. It is the Pope, Mother Teresa, etcetera, who have to be forgiven. They are criminals, but their crime is such that you will need great intelligence to understand it.
And see the egoistic 'holier than thou' attitude. 'I forgive you,' she says. 'I feel sorry for you,' she says. And she asks, 'May God's blessings be with you and fill your heart with his love.' Just bullshit!
I don't believe in any God as a person, so there is no God as a person who can bless me or anybody else. God is only a realization, God is not somebody to be encountered. It is your own purified consciousness. And why should God bless me? I can bless all your gods! Why should I ask for anybody's blessing? I am blissful—there is no need! And I don't believe that there is any God. I have looked in every nook and corner and he does not exist! It is only in ignorant people's minds that God has existence. I am not an atheist, remember, but I am not a theist either.
God is not a person to me but a presence, and the presence is felt when you reach to the climax of your meditativeness. You suddenly feel a godliness overflowing the whole existence. There is no God, but there is godliness.
I love the statement of H. G. Wells about Gautam the Buddha. He has said that Gautam the Buddha is the most godless person yet the most godly too. You can say the same thing about me: I am the most godless person you can find, but I know godliness.
Godliness is like a fragrance, an experience of immense joy, of utter freedom. You cannot pray to godliness, you cannot make an image of godliness, you cannot say, 'May God's blessings be with you'—and that too with a condition: 'May God's blessings be with you during 1981.' Such misers! And what about 1982? Great courage! Great sharing! Such generosity!
'…and fill your heart with his love.' My heart is full with love! There is no space for anybody else's love in it. And why should my heart be filled with anybody else's love? A borrowed love is not love at all. The heart has its own fragrance.
But this type of nonsense is thought to be very religious. She is writing with this desire that I will see how religious she is, and all that I can see is simply that she is an ordinary, foolish person, just the same as you can find anywhere among the mediocre people.
I have been calling her Mother Teresa, but I think I should stop calling her Mother Teresa because I am not very gentlemanly but I have to respond adequately. She calls me Dear Mr Rajneesh, so from now onwards I will call her Dear Miss Teresa—just to be gentlemanly, mannerly!
The ego can come in from the back door. Don't try to throw it out. zzzzz13
I have received a newscutting from Calcutta. The reporter says that he went to Mother Teresa with a cutting from a newspaper about my statement that she is idiotic. She became so mad she tore the cutting and threw it away. And she was so angry that she was not even willing to make any comment. But she has made the comment, tearing the newspaper cutting.
And the reporter said, "I was puzzled. I asked that, 'the cutting belonged to me. I had just come to show it to you and to know your comment?'"
And these people think they are religious people. In fact, by tearing the cutting she simply proved what I have said was right: she is idiotic—this is idiotic. I receive so many "compliments"—in inverted commas—from all over the world that if I start tearing them it will be enough exercise for me—and I hate exercise! wildgs10
నాణానికి మరో వైపు తెలుసుకుని విషాదం కలిగింది.. నిజానికి ఇవన్నీ కామన్సెన్స్ తో ఆలోచించదగ్గ విషయాలు. ఆమె గురించి వస్తున్న వార్తల పైనే ద్రుష్టి పెట్టి, వాస్తవం ఏమై ఉంటుంది, వీళ్లకొచ్చే డబ్బంతా ఎల్లా ఖర్చు పెడుతున్నారు, అని అలోచించకపోవడం కుడా జనం తప్పే! ముఖ్యంగా ఆమెకు సెయింట్ హోదా ఇవ్వడం పచ్చి బూటకమని బుర్ర ఉన్న వాళ్లకెవరికైనా అర్థమయ్యే విషయం. మీరిలా ఆధారాలతో సహా నిరూపించాక, నమ్మక తప్పేట్లు లేదు. ఆమె మిగతా వారి కంటే నయమే కదా అని సరిపెట్టుకోలేకపోతున్నాను. లలిత గారు చెప్పినట్టు లోపం లేని మనిషి ఉండకపోవచ్చు కాని, ఇంత మోసమా! మోసమని ఎందుకంటున్నాంటే, గాంధి కానివ్వండి, మదర్ కానివ్వండి,
మీరు కల్కి భగవాన్ గురించి కూడా రాస్తే తెలుసుకోవాలని ఉంది.
పై అభిప్రాయంలో వాక్యం కట్ అయింది. 'మోసమని ఎందుకంటున్నానంటే గాంధి కానివ్వండి, మదర్ కానివ్వండి, వాళ్ళు మహాత్ములు అని మనం నమ్మాక, ఇలాంటి విషాలు బయట పడితే, మోసపోయామని ఉక్రోషం వస్తుంది.
నిజమే, కొన్ని నిజాలు చాలా చేదుగా ఉంటాయి. నిజానికి ఇలాంటి మాటలు రాయడానికే కాదు, చదవడానికి కూడా ధైర్యముండాలి. గాంధీ, వివేకానందుడు, మదర్ తెరెసాల కృషిని క్రిటికల్ గా పరిశీలించినపుడు బయటపడే విషయాలు మనకే భయం కలిగిస్తాయి. మనకు నచ్చినా, నచ్చకపోయినా ఇవి ఆ వ్యక్తుల నిజ జీవితపు భిన్న పర్శ్వాలు. ఇన్నయ్యగారికి అభినందనలు.
ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజ జీవితంలో వాళ్ళు ఎలాంటి మనుషులైనా, గాంధీ, మదర్ తెరీసా కొన్ని మానవాతీత లక్షణాలకి ప్రతీకలయ్యారు జనుల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో. ఇంతకు మునుపు జీసస్, బుద్ధుడూ, మళ్ళీ ఇటీవల మార్టిన్ లూథర్ కింగ్ వంతి వారలు కూడా. మనిషి పోయినా, ఆ తరవాత ఆ మనిషిలో సవాలక్ష లోపాలున్నాయని బయటికి తెలిసినా, మన అంతరాత్మల్లో ఆ ప్రతీకల బలం కొనసాగుతూనే ఉంటుంది. దాని వల్ల అందరిలోనూ ఎంతో కొంత మంచి జరుగుతూనే ఉంటుంది. మనిషి బలహీనతలని తెలుసుకున్నంత మాత్రాన, ప్రతీకని తొలగించుకోనక్కర్లేదు - ఎందుకంటే ఆ ప్రతీక మీరు నిర్మించుకున్నది. అది మీ సొంతం.
అదలా ఉండగా .. అసలు ఏ మనిషినీ మానవాతీత స్థాయికి యెత్తటం మనం చేసే మొదటి పొరబాటు. సినిమాల్ని సినిమాలా చూడాలి, మనుషుల్ని మనుషుల్లా చూడాలి. :-)
ఒక వ్యక్తిని చాలా ఉన్నతం గా ఊహించుకుని ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ గురించిన చేదు నిజాలు చాలా బాధ కలిగిస్తాయి.కొన్ని సార్లు అది ద్వేషం గా కూడా మారవచ్చు.అదే మొదటి నుండీ తప్పులని కూడా చెపుతూ మంచిని ప్రముఖం గా చెపితే బాగుంటుందేమో?తరువాత తరువాత బాధపడాల్సిన పరిస్థితి వుండదు.మనం ఆరాధిస్తున్నవాళ్ళు మామూలు మనుషులే అని తెలిసినా వాళ్ళూ తప్పులు చేస్తారన్న విషయాన్ని జీర్ణించుకోలేము.ఇప్పుడు నా పరిస్థితి అలాగే వుంది.మనసంతా అదోలా అయిపోయింది.
మహాత్ముడినీ, మదర్ థెరీసాని, వివేకానందుడినీ నమ్మద్దు.
మరి ఇంకో X, Y, Z ని ఎందుకు నమ్మాలి?
వారి మాటలు నిజాలని ఏంటి నమ్మకం?
హీరోలు, మహాత్ములుగా చేసేది మాత్రం మనమే, అందులో సందేహం లేదు. ఆ స్థాయినుండి లాగి పడేసేదీ మనమే. మన ప్రతీకనే మనం ఎత్తేసినా, కించ పరిచినా. అదీ నిజమే.
పాఠ్య పుస్తకాలలో rounded characters గా మహానుభావులని పరిచయం చెయ్యడం అనేది చాలా కష్టమైన పని. ఉదాహరణకు పాత హీరోల మీద ప్రసరించిన కొత్త వెలుగులు నిజమైనవి అనుకుందాం, ఏమని రాస్తాం పాఠం?
నాకు ఇంకా అనుమానంగానే ఉంది గాంధీ గారి గురించి ఆంధ్రభూమిలో రాసినవి out of place ఉదహరించి చూపించినవి అని. ఆయన డబ్బు మనిషే కావచ్చు, ఆ డబ్బు దేనికి వాడారు? నాకు చిన్నప్పడు విన్న కొథలు కొత్తగా అర్థం అవుతున్నాయి ఈ మధ్య. ఏనుగు కథ లాగా అనిపిస్తుంది ఇటువంటి "నిజాలు". ఒక కొన్ని మాటలను, కొన్ని సన్నివేశాలను చూపి ఇది ఈ మనిషి వ్యక్తిత్వం అని చెపితే అది ఎటువంటి నిజం, ఎంత మటుకు నిజం?
ఏమో అయోమయంగా ఉంది. నాకు మాత్రం బాధగా ఉంది.
అసలు వీటిని బహిర్గతపరచటం వెనుక మీ ప్రధాన ఉద్దేశ్యం/ఉద్దేశ్యాలు ఏమిటి?
మీ సమాధానం చూసిన తరువాత మరలా వస్తా ... అప్పుడు సవివరంగా వ్యక్తపరుస్తా నా అభిప్రాయం.
అంతవరకూ ..
లలిత గారు చెప్పిన దానిని నా మాటల్లో చెప్పాలి అంటే ...
"ఒక కొన్ని మాటలను, కొన్ని సన్నివేశాలను చూపి ఇది ---------- అని" చెప్పటానికి చేస్తున్న ప్రయత్నమనే ఈ జాడ్యం మన తెలుగు బ్లాగ్లోకంలో కొంచెం బాగానే ముదిరినట్లుంది.
ఒక గొప్ప వ్యక్తికున్న కొన్ని లోపాలనో బలహీనతలనో తెలుసుకోవడం, వాటికి స్పందించడం వేరు. అసలు మనిషే తప్పుడు మనిషని తెలియడం వేరు. ఈ పోస్టు చూస్తే, మదర్ తెరెసా విషయంలో లోపాలని ఎత్తిచూపటం కాదు, ఆవిడ వ్యక్తిత్వాన్నే ప్రశ్నిస్తోంది. వీటిని ఏవో కొన్ని బలహీనతలని సరిపెట్టుకొని ఆవిడ గొప్పతనాన్ని గూర్చిన మన అంచనాలని అలానే ఉంచుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ చెప్పిన విషయాలే "పరిపూర్ణంగా" నిజమని నమ్మితే(ఇచ్చిన రిఫరెన్సులబట్టి నిజమనే అనిపిస్తోంది), మదర్ గురించి మొత్తం మన అంచనాలే గల్లంతవుతాయి! మరి ఇలాటి నిజాలు బయట పెట్టాలా వద్దా అని ప్రశ్న.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఎష ధర్మః సనాతనః
అని స్మృతివాక్యం. అప్రియమైన సత్యాన్ని చెప్పవద్దూ అని. కానీ నేను దానితో పూర్తిగా అంగీకరించను. ప్రియం అప్రియం సాపేక్షాలు, అస్థిరాలు. "పరిపూర్ణ" సత్యం నిరపేక్షమైనది, శాశ్వతమైనది. కాబట్టి దానికే నా ఓటు. అయితే, అప్రియమైనా సత్యాన్ని చెప్పి, దానితో పాటు ప్రియమైన సత్యాన్నికూడా చెప్పాలని నా సిద్ధాంతం.
ఇలాటి నిజాలవల్ల ఏమిటి లాభం అని ప్రశ్న. ఒక లాభం, జనాలు మోసపోకుండా దీనివల్ల కొంతవరకూ సాధ్యమౌతుంది. అయితే దీని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఏమిటి? ఇలాటి నిజాలు తెలిస్తే, మనిషి మీద, మంచితనం మీద నమ్మకం పోతుంది. మనం కూడా మోసాలు ఎందుకు చెయ్యకూడదూ అన్న అలోచనకూడా కలగవచ్చు.
ఈ నష్టాలగురించి, నిజాలకోసం పోరాడే హేతువాదులు ఆలోచించాలి. మంచిని, మానవత్వాన్ని కూడా పెంపొందించే బాధ్యత వారికుంది. మానవ సమాజపు సమతౌల్యానికీ, సృష్టి సమతౌల్యానికీ కూడా ఇవి అవసరం కాబట్టి.
కానీ నిజాలని చెప్పడంలో చూపే ఆసక్తీ, శ్రద్ధా, మానవతావాదాన్ని ప్రచారం చెయ్యడంలో కనిపించడం లేదు. అదీ దురదృష్టం!
బ్లాగులోని వ్యాసము, దానిపైన కామెంట్లు పూర్తిగాచదివిన తరువాత దిమ్మతిరిగిపోయింది. తెరెస్సా క్రెడిబిలిటీ పైన చాలాకాలం క్రితమే ఎక్కడో చదివినట్లు గుర్తు. దాదాపు ఈ అంశం పై భిన్న అభిప్రాయలను ఒక్ చోటికి తీసుకు వచ్చినట్లయింది.
ఒక వ్యవస్థ గాఎదిగిపోయిన వ్యక్తుల గురించి భిన్న కోణాలు కనిపించటం సహజమేనేమో? అంతెందుకు, మనింటి పక్కవానిగురించి మనకు సంపూర్ణంగా తెలుసా.
ఆఖరుకు మనింట్లో ని వారే భిన్న సందర్భాలలో భిన్న వ్యక్తిత్వాలతో కనపడరూ?
అలాంటిది మనమెప్పుడు చూడని, అనుభవించని విషయాలపట్ల సాధికారికం గా ఒక అభిప్రాయానికి రావటం చాలా కష్టమే!. ఎవరో కామెంటు చేసినట్లు ఏనుగు కధలా ఉండదూ?
మీ వ్యాసం నెగటివ్ షేడ్స్ గురించే వ్రాసిందేతప్ప పాసిటివ్ పాయింట్స్ మొత్తానికి లేవనా?
ఇలాంటి వ్యాసాలు చదివినప్పుడల్లా నాకు మానవజీవితం చరిత్ర ముందు పిపీలికమాత్రంగా కనిపిస్తుంది.ఆ జీవనంలోని అఫష్టత అనంత విశ్వంలా గోచరిస్తుంది.
బుర్రను బాగా కరాబు చేసారు. చాలా థాంక్స్.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Bolloju Baba reaction: The positive aspects of Mother Teresa are to gather destitute children and shelter them, help the poor to share minimum needs. That is why world welcomed her and honored. But she abused that through religion, belief and superstition.
Now catholic religion is using her personality to abuse more and get greater benifits.
This article is meant as an exposure.
Post a Comment