Wednesday, April 22, 2009

జేంస్ రాండి చాలెంజ్










with James Randi in World Congress on april 10,USA
left Innaiah, Rohit, right Dr Naveena










నా అమెరికా పర్యటనలో ఇటీవల జేంస్ రాండి ని కలిసాను. శాస్త్రీయ పరిశీలన వారు నిర్వహించిన ప్రపంచ సభలొ నేను ప్రసంగించడానికి ఏప్రిల్ 10 న్ వెళ్ళినప్పుడు జేంస్ రాండి కలిసాడు. కుశల ప్రశ్నల తరువాత తన గ్రంథం నాస్త్ర దాం పై చేసిన డి సంతకం చేసి ఇచ్చారు .ఇండియాలో ప్రేమానంద్ ఆరోగ్యం అడిగి విచార పడ్డారు .హోమియొ , జ్యొతిష్యం, అతీంద్రియ శక్తులు పై శాస్త్రీయమని నిరూపించిన వారికి 1 మిలియన్ డాలర్లు బహుమానం ఇంకా అమలులో వుందని చెప్పారు. సభలలో ఆయన ప్రదర్సనా పూర్వక ప్రసంగాలు బాగా ఆకట్టుకున్నాయి .చాలెంజ్ వివరాలకు వెబ్ సైట్ లో చూసి పాల్గొన వచ్చు .http://www.randi.org/

4 comments:

krishna rao jallipalli said...

కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ ప్రైజు మని అలానే ఉంటుంది... చాలెంజ్.

Naga said...

నన్ను కలిస్తే అతీంద్రియ శక్తులు శాస్త్రీయం అని నిరూపించగలను. ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు.

Anonymous said...

జేంస్ రాండి వీడియొల ని యుట్యుబ్ నుంచి తొలగించారని చదివాను. మరి అది జరుగుతుంటె మన రాండి మహాశయుడు ఎమీ చెస్తూన్నారు? స్వాముల వార్లు చాతుర్మాస వ్రతమని దూర ప్రాతాలకు వేల్లినట్లు గా మీరు ఇలా మీ నాస్తిక మతస్థులను/మిత్రులను కలసి, వారు చెప్పెది విని, కొత్తవి తెలుసు కొని, మళ్ళీ బ్లొగ్ లో రాసి ( దీనినే నవవిధ భక్తులలో శ్రవణం,స్మరణం మొ|| అని అంటారు) ప్రజలందరికి ఎదో చేతనైంత మేలు చెశాను నా జీవితంలో అని తృప్తి చెందుతున్నారను కుంటాను. Good going sir.

నాగన్నగారు ఇన్ని విషయాలు తెలిసిన ఇన్నయ గారికి మీరు టోలీ పుస్తకాలు చదివి అలా అనుటున్నారని కూడా తెలుసు వారికి జగ్గి వాసుదెవ్ ( వీరి పూర్వ నాస్తిక మితృడు కరుణా నిధి ఈ మధ్యనే జగ్గి వాసుదేవ్ గారిని కలసి ఎలా పొగిడాఒ నెట్ లో చూడండి),రమణ మహర్షి, యు.జి. కృష్ణమూర్తి ల గురించి తెలుసు కాని వీరి గురించి వారు రాయరు,మాట్లాడరు అదంతే. అర్థం చేసుకోరు మీరు ....

naprapamcham said...

జేంస్ రాండి యుటూబ్లు, ఇంటర్నెట్ సైట్ బహుళ ప్రచారములో వున్నవి.వాటిని తొలగించలేదు.