Monday, August 3, 2009

హేతువాదం ఎందుకు?


Photo courtesy: Ramabrahmam of Jana Vignana Vedika

చిత్రంలో ఎడమనుంచి కుడి వైపుకు: శ్రీయుతులు గాంధీ, శ్రీమతి చందనా చక్రవర్తి, సి.నరసింహా రావు, టి.వి.రావు ఇంకా ప్రారంభోపన్యాసం చేస్తున్న ఇన్నయ్య.

పుస్తక రూపంలో వందేళ్ల రాజకీయ చరిత్ర
భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘం
న్యూస్‌టుడే, హైదరాబాద్‌: త్వరలో 'వందేళ్ల ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్ర' అనే పుస్తకాన్ని ప్రజల ముంగిటకు తీసుకురానున్నట్లు భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘం పేర్కొంది. ఈ గ్రంథంలో చరిత్రను, నిష్పక్షపాతంగా శాస్త్రీయంగా విశ్లేషించినట్లు సంఘ సభ్యులు వివరించారు. సామాజిక వేత్తలకు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం భారతీయ రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సంఘ సమావేశం నిర్వహించారు. సంఘం కోఆర్డినేటర్‌ ఎన్నికైన ప్రముఖ రచయిత, మానవతావాది నరిశెట్టి ఇన్నయ్య, జనవిజ్ఞాన వేదిక సభ్యులు టి.వి.రావు, మానవ వికాస వేదిక సభ్యులు సాంబశివరావు, భారత హేతవాద సంస్థ సభ్యులు వీరన్నతో సామాజిక విశ్లేషకులు నరసింహారావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి సామాజిక వేత్త చందన చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇన్నయ్య మాట్లాడుతూ రాజకీయ పార్టీల్లోని అవినీతి, పక్షపాత ధోరణి, కుల మత మౌఢ్యాలతోపాటు సమాజంలో వేళ్లూనుకుంటున్న మూఢ, అంధవిశ్వాసాలపై రాడికల్‌ హ్యుమనిస్ట్‌ సొసైటీ పోరాడుతుందన్నారు. ప్రజలను చైతన్యం చేయడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. మానవతావాద విలువలను సమాజానికి చాటిచెప్పడానికి తమ రచనలు, వ్యాసాలు, కళలు ద్వారా పెద్ద పీట వేసిన ఎం.ఎన్‌.రాయ్‌, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, మల్లాది రామ్మూర్తి, మల్లాది సుబ్బమ్మ, పాలగుమ్మి పద్మరాజు, త్రిపురనేని గోపిచంద్‌, జి.వి.కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రాంబ్రహ్మం తదితర మహానుభావుల స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ఈ తరంపై ఉందన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న చందన చక్రవర్తి మాట్లాడుతూ బాధ్యతగల స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం మూఢ విశ్వాసాలకు పెద్దపీడ వేయడం ఆందోళన కలిగిస్తున్న పరిణామన్నారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమైనప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. భావసారూప్యత ఉన్న సంఘాలన్నీ కలిసి పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకోవాలని సూచించారు. పాఠ్యగ్రంథాల్లో సైతం మూఢ విశ్వాసాలు కల్పించేలా పాఠాలు పొందుపరచడం దారుణమని సామాజిక విశ్లేషకులు నరసింహరావు తప్పుపట్టారు. మేథావులు సైతం బాబాలకు పాదపూజ చేయడం దుర్మార్గమైన చర్య అని హేతువాద సంఘ సంఘ ప్రతినిధి అనంత్‌ అన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తమ పబ్బం గడుపుకుంటున్న సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని మానవ వికాస వేదిక సభ్యులు సాంబశివరావు సూచించారు. సామాజిక వేత్త గాంధీ మాట్లాడుతూ సమాజంలో తాత్విక చింతన, హేతువాద దృష్టి, భావవికాసం, మానవతావాదం పెంపొందడానికి అన్ని సంఘాలు కలసికట్టుగా కృషి చేయాలన్నారు.

Text courtesy: ఈనాడు దినపత్రిక 3rd August 2009

10 comments:

Praveen Mandangi said...

ఈ మధ్య జనంలో భక్తి విశ్వాసాలు పెరిగాయి. మా కుటుంబ సభ్యులలో ఒకప్పుడు భక్తి విశ్వాసాలు అంతగా లేవు కానీ కరీంనగర్ లో ఉన్న రోజుల్లో సాయిబాబా భక్తులు పరిచయమైన తరువాత మా ఇంట్లో వాళ్ళలో కూడా భక్తి విశ్వాసాలు పెరిగాయి.

పెదరాయ్డు said...

అసలు హేతువాదమ౦టే ఏమిటి? దానికున్న శాస్త్రీయత ఏపాటిది?

Kathi Mahesh Kumar said...

@పెదరాయ్డు:అనుపూర్వికంగా వచ్చే నీతిసూత్రాల మంచిచెడ్డలను గుర్తించకుండా గుడ్డిగా ఫాలోఅయిపోవడాన్ని ప్రశ్నించి, ఈ ఆచారాల ప్రయోజనాన్ని తిరగదోడి పరీక్షించుకుంటూ ఉండటమే హేతువాదం.

స్థిరపడిపోయిన ఆచారాల వల్ల నిత్యసంచలన స్వభావం కలిగిన సంఘానికి చెడుజరిగే అవకాశం ఉందిగనక పున:సమీక్షను కోరుతుంది హేతువాదం. ఆ పున:సమీక్ష తర్క,హేతు,మానవశ్రేయస్సు ఆధారంగా జరగాలనుకోవడమే దాని శాస్త్రీయత.

హేతువాదం అంటే గుడ్డిగా నమ్మకం కాదు. ప్రశ్నించి తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకోవడం లేదా ఉన్న నమ్మకాన్ని మార్చుకోవడం.

మీరు ఈ బ్లాగుల ద్వారా హేతువాదాన్ని అర్థం చేసుకోవడంకన్నా బెట్రెన్డ్ రస్సెల్ ను చదివితే లాభముంటుంది. ప్రయత్నించండి.

మంచు said...

""మీరు ఈ బ్లాగుల ద్వారా హేతువాదాన్ని అర్థం చేసుకోవడంకన్నా బెట్రెన్డ్ రస్సెల్ ను చదివితే లాభముంటుంది. ప్రయత్నించండి.""

ఇది మాత్రం చాలా చాలా కరక్ట్ .

Anonymous said...

* హేతువాదం అంటే గుడ్డిగా నమ్మకం కాదు. ప్రశ్నించి తెలుసుకుని నమ్మకాన్ని పెంచుకోవడం లేదా ఉన్న నమ్మకాన్ని మార్చుకోవడం.*

Then why Mr. Innaiah blindly beliving హేతువాదం. Without questioning it. He would visit US and gave lecturers. But swamiji's should not visit and give lecturers.
How come these people includes
త్రిపురనేని గోపిచంద్‌ in their troup. I admire him a lot as a person and writer. I read two of his books one he wrote on philosophers and second one Pandita parameswara Saastri ...
These Hetuvadi's are nomatch to him.

Satyamevajayate said...

మహేష్ కుమార్ గారు ,హేతువాదానికి సరైన అర్ధం చెప్పారు .రంగనాయకమ్మ గారి" శాస్త్రీయ దృక్పథం " లో కూడా ఎన్నో ప్రశ్నలకి చక్కటి సమాధానాలు ఉన్నాయి.ఆసక్తి ఉన్నవారికి ఉపయోగం ఆ పుస్తకం.

Praveen Mandangi said...

కాకి తల మీద పొడిస్తే అశుభం అని నమ్మిన ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉండేవాడు. అతను మా నాన్న గారే. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మితే ఇక మారుమూల గ్రామాలలో ఉండేవాళ్ళ సంగతి ఏమిటి? మా ఇంటి ముందు కొబ్బరి చెట్ల మీద కాకులు గుడ్లు పెట్టాయి. మేడ మీద నుంచి ఆ కొబ్బరి చెట్ల ఆకులు కోస్తుండగా పొడిచాయి. అయినా ఇంత చదువుకున్న వాళ్ళు కాకి పొడిస్తే అశుభం, గుడ్ల గూబని చూస్తే అశుభం అనుకోవడం హాస్యాస్పదం.

Kathi Mahesh Kumar said...

@శ్రీకర్: ఇన్నయ్యగారి మీద అపోహలు పెంచుకుంటూ obsess అయిపోవడం వల్ల ఆయన్కొచ్చే నష్టంకన్నా మీకు అయ్యే సమయం వృధా మీకు ముఖ్యం.

హేతువాదానికి ఇన్నయ్య ఒకరే యజమాని కాదు. హేతువాదం ఇన్నయ్యగారితో అంతం అవదు. అదొక తత్వం. అనుక్షణం మారుతున్న మానవావసరాలకు అనుగుణంగా మారమనడమే దాని లక్ష్యం. కాబట్టి మీకు నచ్చిన మీరు నమ్మిన హేతువాదుల రచనలు చదవండి.

naprapamcham said...

The essential feature of rationalism is to follow cause and effect.In this process it sticks to scientific proceedure. The safe method is self correction. Hence there is no place for authoritarianism.Rationalism is ever progressive and helpful to mankind.It is endless process.Finality and perfection is not claimed in this method. That is how people are moving forward.Of course the obstacles are there and rationalism is trying to remove them slowly through scientific education

Praveen Mandangi said...

మత భక్తులు ఎంత గలీజ్ బాష వాడుతారో చూడండి. http://webhosting4india.net/images/bharadwaja_language.png గాలి నా కొడుకు (తండ్రి లేకుండా పుట్టినవాడు) లాంటి phrases ఉపయోగించే లెవెల్ వాళ్ళది.