తెనాలి నుండి అమెరికా వెళ్ళి ఒక పుష్కర అనుభవంతో యిప్పుడు తాను పుట్టిన సమాజాన్ని కొంతైనా బాగు చేద్దానుకోవడం విశేషం.
కొల్లూరు వెంకటసుబ్బారావు అమెరికాలో కొల్లూరు రావుగా సమాజంలో పెద్ద పేరు పొందారు. ఆయన రచనలు మెగ్రాహిల్ ప్రచురణ కర్తలు వెలువరించారు. విశ్వవిద్యాలయాలు, వివిధ వ్యాపార సంస్థలు, సుబ్బారావు గారి పుస్తకాలు, వ్యాసాలు చదువుతూ సలహాలను పాటిస్తున్నారు. ఆయన చేబట్టిన సమస్య అంతటి ప్రాధాన్యత గలది.
కాలుష్యం, ఆరోగ్యం, జనాభా, ఆర్థిక సమస్య, విద్య, శిక్షణ, వివిధ పరిశ్రమల పెంపుదలతో వీటిని సక్రమంగా నివారణ, చిక్కులు ఎదుర్కోవడానికి మార్గాంతరాలు యివన్నీ చాలా ప్రధాన మైన అంశాలు. పరిశ్రమ, వ్యవసాయ, విద్యారంగంలో యివి నూరిపోయాలి. కొల్లూరి వారి తపన అంతా కాలుష్య నివారణ చేస్తూ, సమాజాభివృద్ధి గావించడమే.
కొల్లూరు వారు భారతదేశంలో ప్రారంభమైన విద్య పూర్తి చేసి, ఉన్నత విద్య అంతా అమెరికాలో, జర్మనీలో చేశారు. కేవలం డిగ్రీల చదువుకు పరిమితం కాకుండా, అనుభవం కోసం ప్రపంచమంతటా పర్యటించారు. ఆయన వెళ్ళిన ప్రాంతాలలో రష్యా, చైనా, ఇంగ్లండ్, జపాన్, థాయ్ లాండ్, కెనడాలు పేర్కొనదగినవి.
అమెరికా, కెనడాలలో వాతావరణ పరిసరాలు మెరుగుపరిచే కృషిజరిపిన, కొల్లూరు వారు, తాను చిన్నప్పడు తిరిగిన ఆంధ్రప్రాంతం కొన్ని సంవత్సరాల తరువాత చూస్తే అక్కడ చేయాల్సింది ఎంతో వుందనిపించింది. పిల్లలు చదువుకోవాలి, కాని వారి చుట్టూ మురికి అనారోగ్యం, దుర్భర స్థితి. అది పోగొట్టాలి. ఎలా?
కొల్లూరు వారు ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో వుంటూ, పరిసరాల ఆరోగ్య సేవా సంస్థ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో పరిసరాలు, ఆరోగ్యంపై బోధనా నిపుణులుగా వున్నారు. రిస్క్ ఎనాలసిస్ సంఘానికి అధ్యక్షులు (న్యూయార్క్, న్యూజెర్సీలో) ఇవన్నీ అమెరికా స్థాయిలోనే ఉన్నతమైన సాధనాలు.
కొల్లూరు సుబ్బారావు తెనాలిలో కీ.శే. డాక్టర్ కొల్లూరు వెంకట్రాయుడు గారి కుమారుడు.
జనాభాను అదుపులో పెట్టి జీవన ప్రమాణాన్ని పెంచడానికి చర్యలు సత్వరమే చేబట్టాలని కొల్లూరు సూచిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి గాను అడ్డొచ్చే రాజకీయ ప్రతిబంధకాల్ని పక్కబెట్టాలని ఆయన మరోసూచన. దేశంలోని అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు వారానికి కనీసం 8 గంటలు శిక్షణ విధిగా యిచ్చి, ఉత్పత్తి పెంచడానికి కృషి చేయాలని సుబ్బారావు గారి సూచన. రోడ్లు, ఇతర సదుపాయాలు పెంపొందించే వందేళ్ళ పథకాలు చేబట్టాలని ప్రభుత్వం దీనికి గాను దేశభక్తి బాండ్లను జారీ చేయవచ్చునంటున్నారు.
పరిశ్రమలు స్థాపించినప్పుడు అందువల్ల వచ్చే కాలుష్యాన్ని నివారిస్తూ, చిక్కులు తొలగిస్తూ, వ్యాపారాలు సాగించే పద్ధతులను కొల్లూరు వారు సూచించారు. అనేక పరిశ్రమలు వీరి సలహాలను పాటిస్తున్నాయి. మన దేశంలో యివి చాలా అవసరం. కాలుష్య నివారణకు అవసరమైన పద్ధతులు, డబ్బు ఖర్చు రీత్యా, చాలా మంది అవలంబించడం లేదు. అందువలన మనుషులకు వచ్చే ప్రమాదాన్ని విస్మరిస్తున్నారు.
మేమిద్దరం లాస్ ఎంజలిస్లోనూ ,న్యూయార్క్ లోనూ కలసి తిరిగి అనేక విశేషాలు గ్రహించాము కొల్లూరు వెంకటసుబ్బారావు అమెరికాలో కొల్లూరు రావుగా సమాజంలో పెద్ద పేరు పొందారు. ఆయన రచనలు మెగ్రాహిల్ ప్రచురణ కర్తలు వెలువరించారు. విశ్వవిద్యాలయాలు, వివిధ వ్యాపార సంస్థలు, సుబ్బారావు గారి పుస్తకాలు, వ్యాసాలు చదువుతూ సలహాలను పాటిస్తున్నారు. ఆయన చేబట్టిన సమస్య అంతటి ప్రాధాన్యత గలది.
కాలుష్యం, ఆరోగ్యం, జనాభా, ఆర్థిక సమస్య, విద్య, శిక్షణ, వివిధ పరిశ్రమల పెంపుదలతో వీటిని సక్రమంగా నివారణ, చిక్కులు ఎదుర్కోవడానికి మార్గాంతరాలు యివన్నీ చాలా ప్రధాన మైన అంశాలు. పరిశ్రమ, వ్యవసాయ, విద్యారంగంలో యివి నూరిపోయాలి. కొల్లూరి వారి తపన అంతా కాలుష్య నివారణ చేస్తూ, సమాజాభివృద్ధి గావించడమే.
కొల్లూరు వారు భారతదేశంలో ప్రారంభమైన విద్య పూర్తి చేసి, ఉన్నత విద్య అంతా అమెరికాలో, జర్మనీలో చేశారు. కేవలం డిగ్రీల చదువుకు పరిమితం కాకుండా, అనుభవం కోసం ప్రపంచమంతటా పర్యటించారు. ఆయన వెళ్ళిన ప్రాంతాలలో రష్యా, చైనా, ఇంగ్లండ్, జపాన్, థాయ్ లాండ్, కెనడాలు పేర్కొనదగినవి.
అమెరికా, కెనడాలలో వాతావరణ పరిసరాలు మెరుగుపరిచే కృషిజరిపిన, కొల్లూరు వారు, తాను చిన్నప్పడు తిరిగిన ఆంధ్రప్రాంతం కొన్ని సంవత్సరాల తరువాత చూస్తే అక్కడ చేయాల్సింది ఎంతో వుందనిపించింది. పిల్లలు చదువుకోవాలి, కాని వారి చుట్టూ మురికి అనారోగ్యం, దుర్భర స్థితి. అది పోగొట్టాలి. ఎలా?
కొల్లూరు వారు ప్రస్తుతం అమెరికాలోని న్యూజెర్సీలో వుంటూ, పరిసరాల ఆరోగ్య సేవా సంస్థ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయాలలో పరిసరాలు, ఆరోగ్యంపై బోధనా నిపుణులుగా వున్నారు. రిస్క్ ఎనాలసిస్ సంఘానికి అధ్యక్షులు (న్యూయార్క్, న్యూజెర్సీలో) ఇవన్నీ అమెరికా స్థాయిలోనే ఉన్నతమైన సాధనాలు.
కొల్లూరు సుబ్బారావు తెనాలిలో కీ.శే. డాక్టర్ కొల్లూరు వెంకట్రాయుడు గారి కుమారుడు.
జనాభాను అదుపులో పెట్టి జీవన ప్రమాణాన్ని పెంచడానికి చర్యలు సత్వరమే చేబట్టాలని కొల్లూరు సూచిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి గాను అడ్డొచ్చే రాజకీయ ప్రతిబంధకాల్ని పక్కబెట్టాలని ఆయన మరోసూచన. దేశంలోని అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు వారానికి కనీసం 8 గంటలు శిక్షణ విధిగా యిచ్చి, ఉత్పత్తి పెంచడానికి కృషి చేయాలని సుబ్బారావు గారి సూచన. రోడ్లు, ఇతర సదుపాయాలు పెంపొందించే వందేళ్ళ పథకాలు చేబట్టాలని ప్రభుత్వం దీనికి గాను దేశభక్తి బాండ్లను జారీ చేయవచ్చునంటున్నారు.
పరిశ్రమలు స్థాపించినప్పుడు అందువల్ల వచ్చే కాలుష్యాన్ని నివారిస్తూ, చిక్కులు తొలగిస్తూ, వ్యాపారాలు సాగించే పద్ధతులను కొల్లూరు వారు సూచించారు. అనేక పరిశ్రమలు వీరి సలహాలను పాటిస్తున్నాయి. మన దేశంలో యివి చాలా అవసరం. కాలుష్య నివారణకు అవసరమైన పద్ధతులు, డబ్బు ఖర్చు రీత్యా, చాలా మంది అవలంబించడం లేదు. అందువలన మనుషులకు వచ్చే ప్రమాదాన్ని విస్మరిస్తున్నారు.
2 comments:
రావు గారిని సంప్రదించటానికి వివరాలు చెప్పగలరా??
ముఖ్యంగా ఇ-మెయిలు
Rao Kollur@aol.com
Post a Comment