Mandali Buddha Prasad, Cnaare, YLP in the rally
concluding meet in Srikakulam
Dr Yarlagadda Lakshmiprasad
Ghajal Srinivas moved the participants with his ghajals on greatness of Telugu language

సాహిత్య జైత్రయాత్ర
కీ.శే. నార్ల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా తెలుగు భాషను కాపాడుకోవడానికి స్కూళ్లల్లో 11వ తరగతి వరకు తెలుగు తప్పనిసరిగా నేర్చుకునేటట్లు చేయటం, వీధుల్లో బోర్డుల నుండి వాడుకలో అన్ని విధాలా తెలుగుని ఆంధ్రప్రదేశ్ లో బాగా వినియోగించటానికి ఒక ఉద్యమం తలపెట్టారు. ఫిబ్రవరి 21, 2009న విజయవాడ నుండి ప్రారంభమైన ఈ ఉద్యమ సాహిత్య యాత్ర శ్రీకాకుళం వరకు సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం, తెలుగు శాఖల విద్యార్థులు ఈ యాత్రను శిక్షణగా వినియోగించుకున్నారు. ముందుగా కృష్ణాజిల్లాలో నార్ల వెంకటేశ్వరరావు మెట్టిన కౌతరం గ్రామం నుండి బయలుదేరి విజయవాడలో ఊరేగింపులు, సభలు జరిపారు.
ఈ సాహిత్య యాత్రకు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (హిందీ అకాడమీ అధ్యక్షులు, మాజీ రాజ్య సభ సభ్యులు) ఆధ్వర్యం వహించారు. ఆయనకు తొడుగా గజల్ శ్రీనివాస్ నిలిచారు. నార్ల వెంకటేశ్వరరావు భాషకు చేసిన సేవ, ప్రచురించిన సాహిత్యం, ప్రచారం చేస్తూ యువతరంలో తెలుగు భాష పట్ల మక్కువ పెంచటానికి ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంగ్లీషుతో సహా పర భాషలను చదువుకుంటూనే తెలుగు మాధుర్యాన్ని నుడికారాన్ని మరువకుండా సహజమైన పదజాలంతో వినియోగించుకుంటూ పోవాలని అన్నారు.
ఈ యాత్ర విజయవాడ నుండి భీమవరం, రాజమండ్రి, కాకినాడ, తుని, పాయకారావు పేట, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వరకు సాగింది. ప్రతిచోటా కళాశాల, పాఠశాల విద్యార్థి, విద్యార్థునులను పాల్గొనెటట్లు ప్రోత్సహించారు. ప్రెస్ క్లబ్ వారు కూడా ఈ యాత్రకు బాగా సహకరించారు.
జస్టిస్ రఘురాం, జస్టిస్ భానుప్రసాద్, మంత్రి మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్. వెంకయ్యనాయుడు, శాసన మండలి సభ్యులు శేషారెడ్డి, రత్నకుమారి, సుప్రసిద్ధ కవి, రచయిత సినారె, మాజీ గవర్నర్, రచయిత్రి రమాదేవి, ఎన్. ఇన్నయ్య, బాబి వర్ధన్, చల్లా రామకృష్ణ, కాళిపట్నం రామారావు, కొల్లి శారద (నార్ల వెంకటేశ్వరరావు పెద్ద కుమార్తె) వెలగా వెంకటప్పయ్య, పర్వతనేని సుబ్బారావు, విజయకుమార్ (ఎమ్.ఎస్.కో) ప్రచురణ కర్త, కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు, నన్నయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, శ్రీకాకుళం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సుధాకర్, నడుస్తున్న చరిత్ర పత్రిక సంపాదకుడు, ఆచార్య బాలవర్ధన్, కె. రాం ప్రసాద్, శంకర్ నారాయణ, గుమ్మా సాంబశివరావు, కొండపల్లి సుదర్శన్ రాజు మొదలగు వారు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్యంలో నార్ల వెంకటేశ్వరరావు కృషిని యువతరం వారు తెంచుకోవటానికి వీలుగా ఆయన్ను గురించి అనేక వివరాలు తెలియజేశారు. విశాలాంధ్ర ప్రచురణాలయం వారు నార్ల రచనల 12 సంపుటాలను విక్రయిస్తున్న సమాచారాన్ని తెలియపరచి అవి ప్రతీ సంస్థలో ఉంచి, చదివి, నార్ల నాటికలను ప్రదర్శించి, తెలుగు నుడికారాన్ని ఇనుమడింప చేయాలన్నారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తలపెట్టిన ఈ సాహిత్య యాత్రకు అటు పత్రికల్లోనూ, ఇటు టీ.వీ.ల్లోనూ చక్కని ఆదరణ లభించింది. ఇలాంటి సాహిత్య యాత్రను ఇంకా కొనసాగించాలని నిర్ణయించారు. శ్రీకాకుళంలో కాళిపట్నం రామారావు నడుపుతున్న కథా కేంద్రానికి విద్యార్థులను తీసుకు వెళ్ళి చూపారు. అక్కడ కథా రచయితల, రచయిత్రుల ఫోటోలను ప్రదర్శించిన తీరును, కథలను అట్టి పెట్టిన పద్ధతిని రామారావు గారు సందర్శకులకు వివరించారు. 82వ ఏట కూడా ఆయన సాహిత్యంలో నిర్విరామ కృషి చేయడాన్ని అందరూ అభినందించారు. తరువాత సాహిత్య సమావేశంలో కూడా రామారావు గారు వచ్చి పాల్గొన్నారు. ఇది 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు (2009) వరకు జరిగింది. ఈ యాత్రలో గురజాడ, వీరేశలింగం విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవించారు. నార్ల విగ్రహాన్ని త్వరలో విజయవాడలో ప్రతిష్టించబోతున్నట్లు ప్రకటించారు.

1 comment:
అభినందించదగ్గ మంచి ప్రయత్నం.
Post a Comment