Friday, February 20, 2009

ఈ చికిత్సలు, మందులు అమానుషాలు

electropathy
magnet attraction


enjoying urine therapy
సాక్ష్యాత్తూ భారత దేశ ప్రధానిగా చేసిన మొరార్జీ దేశాయ్, తాను మూత్ర వైద్యాన్ని చేసుకుంటున్నట్లు భాహాటంగా ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం మరచిపోవద్దు
ఆధునిక వైద్యంలో ఖరీదు, లోపాలు చూపి మార్గాంతరంగా వేరే వైద్యాలు, చికిత్సలు మార్కెట్ లోకి వచ్చాయి. జనాకర్షణగా అవి అన్ని రకాల ప్రజలనూ ఆకట్టుకుంటున్నాయి. వాటికి శాస్త్రీయత ఉందా, ప్రామాణికత నిర్ధారణ అయిందా, ఫలితాలపై పరిశోధన జరిగిందా, వైఫల్యాలకు ఎవరు బాధ్యత వహిస్తారు, ఎప్పటికప్పుడు లోపాలను దిద్దుకుంటూ పోయే పద్ధతి ఉన్నదా ఇత్యాదులు బొత్తిగా పట్టించుకోవటంలేదు. కానీ ప్రభుత్వ మద్దత్తులు కొన్ని చోట్ల లభిస్తుండగా మరికొన్ని చోట్ల మత నమ్మకాలను, మూఢ విస్వాసాలను, అడ్డం పెట్టుకుని ఈ మార్గాంతర చికిత్సలు జనాన్ని మోసగిస్తున్నాయి.
మాకు కూడా గుర్తింపు కావాలని, ప్రభుత్వం సహాయం అందించాలని మార్గాంతర చికిత్సల వారు పట్టుబట్టారు. కోర్టుకు వెళ్ళారు. వారి కోరిక సబభేనా, కాదా? పరిశీలించి చెప్పమని ఢిల్లీ హై కోర్టు అడిగింది. తొలిసారి ఎలక్ట్రోపతి, ఎలక్ట్రో హోమియోపతి వారు అలా కోర్టుకు వెళ్ళి అడిగారు. అంతటితో కథ ఆరంభమైంది.
కేంద్ర ప్రభుత్వం అఖిల భారత వైద్య, శాఖ, మెడికల్ కౌన్సిల్ ద్వారా నిపుణులను ఒక సంఘంగా నియమించి (1999) మార్గాంతర చికిత్సల శాస్త్రియతను పరిశీలించమని కోరింది. ఆ సంఘం వారు కూలంకషంగా విషయాన్ని మూలానికి వెళ్ళి చూచారు. ఫలితాన్ని నివేదికగా సమర్పించారు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ డా. ఎన్. కె. గంగూలి అధ్యక్షతన ఈ నిపుణుల సంఘం ఎర్పడింది. ఇందులో డా. ఎస్.పి. అగర్వాల్, డా. ఆర్.ఎ. మాష్ లేకర్, అశ్వనీకుమార్, ప్రొఫెసర్ బి.ఎన్. ధవన్, ప్రొఫెసర్ ఎస్.ఎస్. హండా, డా. వి. ఎన్. పాండె, డా. ఆర్. హెచ్. సింగ్, హకీం కలీఫతుల్లా, యునాని వైద్య శాఖ అధిపతి, డా. ఆర్. కన్నన్, డా. లీనా మెహండలే, డా. ప్రమీలాచారీ, డా. జె.ఎన్. పాండే, డా. బి.కె. శర్మ, డా. వసంత ముత్తు స్వామి ఉన్నారు.
వీరు పరిశీలించిన అంశాలు. 1. మార్గాంతర చికిత్స పేరిట చెప్పే వైద్యం. స్థిరమైన ప్రమాణాలతో ఉన్నదా? 2. అందులో ప్రాక్టీస్ చేసేవారు, ఆ వైద్య విధానం తగినంత క్రమ పద్ధతులను పెంపొందించిందా. 3. ఈ వైద్య విదానానికి సమగ్రమైన వైద్య సాహిత్యం ఉన్నదా. 4. ఈ చికిత్సను ప్రభుత్వం గుర్తించవచ్చా. 5. ఈ విధానాన్ని వైద్య శాఖలో బోధించి, డాక్టర్లను తయారు చేయవచ్చా. 6. ఈ వైద్య విధానానికి అనుగుణంగా శాసనాలు చేయవచ్చా.
ఈ వైద్య విధానాలలో కేవలం కొన్ని రోగాలకే పరిమితమై కాక సమగ్రంగా, అన్నింటిని చికిత్స చేసే రీతులు ఉన్నాయా.
ఈ వైద్య విధానాలలో అవి పుట్టిన దేశాలు, వాటిని గుర్తించాయా.
ఈ వైద్య విధానాలకు తగిన రోగ నిర్ధారణ పద్ధతులు, పరిశీలనా అంశాలు, చికిత్స రీతులు, విఫులంగా, విస్తారంగా పరిశీలించి ప్రకటించారా.
శాస్త్రీయ పరిశీలనకు నిలిచే మందులు, చికిత్సా రీతులు, ఆహార పద్ధతులు, వ్యాయామ రీతులు ఉన్నాయా. ఈ చికిత్సలో వాడే మందులు అర్హమైనవి అని పరీక్షకు పెట్టి తేల్చారా. ఈ వైద్య విధానాలలో శిక్షణ ఇవ్వటానికి తగినన్ని పద్ధతులు పెంపొందాయా. పరిశోధనకు శిక్షణకు అనుకూలమైన రీతులు లభిస్తున్నాయా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ నిపుణుల సంఘం పరిశీలించింది.
భారత దేశంలో మార్గాంతర చికిత్సల పేరిట అమలు జరుగుతున్న వైద్య, విధానాలు : అయస్కాంత చికిత్స (మాగ్నటిక్ తెరపీ), ఎలక్ట్రో పతీ, ఎలక్ట్రో హోమియోపతి, రేకీ, రిఫ్లెక్సాలజీ, మూత్ర చికిత్స, సమ్మోహన చికిత్స (హిప్నో తెరపీ). అరోమా తెరపీ (సువాసనల చికిత్స). కలర్ తెరపీ, ప్రాణిక్ హీలింగ్ (ఒక విధమైన యోగా), జమ్స్, స్టోన్స్ తెరఫీ (రత్నాలు, రాళ్లు చికిత్స), మ్యూజిక్ తెరఫీ (సంగీత చికిత్స), అక్యూపెంచర్ (సూదులు గుచ్చే చికిత్స).
ఈ చికిత్సలు శాస్త్రీయమని రుజువు కాలేదని కనుక వీటిని ప్రభుత్వాలు గుర్తించరాదని వీటికి ఆర్థిక సహాయం అందజేయరాదని, వీటి పేరిట సర్థిఫికెట్, ఢిగ్రీ కోర్సులు ఇవ్వరాదని, వీటి పేరిట డిగ్రీలు తగిలించుకొని ప్రాక్టీసు చేయరాదని వీటిని అమలు పరిచేవారిని డాక్టర్లని పిలవరాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కమిటీ సిఫార్సులను అటు కోర్టు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటిని రాష్ట్రాలకు పంపి వెంటనే అమలు పరచమని 2005 నుండి నిర్దేశించింది. కాని ఆచరణలో అమలు జరగటంలేదు. ప్రతీ మార్గాంతర చికిత్సల వెనుక రాజకీయాలు, వత్తిడులు, మత ప్రభావాలు ఉన్నాయి. ప్రజలల్లో వీటి పట్ల ఉన్న నమ్మకాలు, మరొక్క కారణం, వీటిని విస్తృతంగా ప్రజల్లోకి ప్రజారం చేయవలసిన అసరం ఉన్నది. అంతేకాక హోమియోపతి మొదలైన చికిత్సలలో శాస్త్రియ ఆధారాలేమిటో నిర్థారించాల్సిన అవసరం కూడా ఉన్నది. భారత రాజ్యాంగం స్పష్టంగా శాస్త్రియ పద్ధతిని ప్రజల్లో ప్రజారం చేయటం విధి అని (51 ఎ.హెచ్) ద్వారా పెర్కొన్నది.

1 comment:

ISP Administrator said...

చిన్నప్పుడు నేను తెలియక మా పెరటిలోని మొక్కల మీద యూరిన్ పోస్తే ఆ మొక్కలు చనిపోయేవి. యూరిన్ విషమనడానికి ఆ ఎవిడెన్స్ చాలనుకుంటాను.