Thursday, February 19, 2009

జీవితమంతా నాస్థికురాలిగా


93 సంవత్సరాల నాస్తిక హేతువాది

సాధారణంగా వయస్సు ముదిరే కొద్దీ భక్తి పెరిగి, చాందసం ఎక్కువై భజనలు చేస్తూ కాలం గడపటం, కర్మ, పునర్జన్మ పట్ల ఆశక్తి చూపుతూ ఉండటం సర్వసాధారణం. అందుకు విరుద్దంగా తన శక్తిపై తనకు నమ్మకం ఉన్నదని, జీవితంలో ఒకటే జన్మ ఉంటుందని, అందులోనే సాధించాలని పట్టుదలగా ఉండే వ్యక్తులు కొద్ది మందే ఉన్నారు. వారు తరతరాల వారికి ఆధర్శ ప్రాయులు. అలాంటి అరుదైన వ్యక్తిని ఫిబ్రవరి 8న (2009) ఇంకొల్లు (ప్రకాశం జిల్లా, పరుచూరు దగ్గర) కలిశాను. ఆమె కొడాలి కమలమ్మ. మంచంలో లేవలేని స్థితిలో ఉన్నారు. నడుం దగ్గర నుంచి కింది భాగం పనిచేయటం లేదు. అయితే మాట్లాడటం, వినటం, మెదడు పనిచేయటం, మామూలుగా ఉండటం విశేషం. ఆమె 1940 నుండి అన్ని నాస్తిక సభలకు, హేతువాద కార్యక్రమాలకు మహిళా శిక్షణ తరగతులకు వెళుతుండేవారు. నేను అనేక పర్యాయాలు ఆ విధంగా ఆమెను కలుసుకున్నాను. తనకు చేతనైనంత ఆర్థిక సహాయం కూడా నాస్థిక ఉద్యమాలకు అందజేస్తుండే వారు.
వృద్ధాప్యంలో అంత దృఢ విశ్వాసంతో సాగిపోవటం బేట్రాండ్ రసెల్, నార్ల వెంకటేశ్వరరావు మొదలైన వారిని చూచి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తిగా మొపర్రు (గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గ్రామం)లో 1916లో పుట్టిన కమలమ్మ కొద్ది పాటి చదువులతో ఖద్దరు ధరించి గాంధీజీ స్వాతంత్ర పోరాట ఉద్యమాలలో పాల్గొని జైళ్ళ పాలయ్యారు. హిందీలో విశారద చదివారు. కుల నిర్మూలన ఉద్యమాల్లో పనిచేశారు. బ్రహ్మ సమాజం ప్రభావం వల్లన అలా చేయగలిగారు. వ్యక్తి గత సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళి జరిమానా కూడా కట్టింది. సహపంక్తి భోజనాలు చేసి కుల పట్టింపులు త్రోసి పుచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరొకసారి జైలుకు వెళ్ళారు. విజయవాడలో గోరా గారి నాస్థిక ఉద్యమంతో సన్నిహిత సంబంధం పెట్టుకుని అలాగే కొనసాగారు. రాజీ పడకుండా నాస్తిక నైతిక ఉద్యమంలో ఉన్నారు. చెబ్రోలు గ్రామంలో మహిళా శిక్షణ నిర్వహించిన సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి పాఠశాలలో పాల్గొన్నారు. ఆమె భర్త కుటుంబరావు 1962లో చనిపోగా వాళ్ళ కుమారుడు ధర్మానందరావును డాక్టర్ చదివించింది. అతడు ఇప్పుడు ఇంకొల్లులో ప్రాక్టీసు చేస్తున్నాడు. అతని వద్దే ఆమె ప్రస్తుతం ఉన్నారు. ఆమె కుమార్తె సరళ ఎమ్.ఎస్.సి. చదివి గద్దె రామచంద్రరావును పెళ్ళాడి, అమెరికాలో నయాగర వద్ద స్థిరపడ్డారు. నేను అమెరికాలో వారింటికి వెళ్ళి ఆతిద్యం పొంది అనేక విషయాలు ముచ్చటించుకున్నాం. గద్దె ఇంటిపేరుగల వారి చరిత్రలను స్వేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కమలమ్మ అమెరికా వెళ్ళి 1977 లో కొన్ని ప్రదేశాలు చూడగలిగారు. అప్పుడు ఫ్రొఫెసర్ ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి వంటి వారిని కలుసుకుని అనుభవాలు స్వీకరించారు. మాంసాహారం ప్రయాణాల్లో తిన్నప్పుడు కూడా ఆమె ఎలాంటి అసహనం కనబరచలేదు.


జీవితమంతా నాస్థికురాలిగా, ఆనందంగా, తోటివారికి సహాయపడుతూ జీవితపు విలువలను గౌరవించింన వ్యక్తి ఆమె. ఒకప్పుడు సత్య సాయిబాబా విజయవాడకు రాగా నిరసన తెలిపి అతడి చర్యలను అడ్డగించటానికి పూనుకున్నారు. అప్పుడు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ప్రజలను మోసగించే బాబాలను ఆమె క్షమించలేదు. నిప్పులు మీద నడచి, అది మహత్తు కాదని ప్రాక్టీసనీ 1980లోనే ఆమె నిరూపించారు. నేను ఇంకొల్లులో కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరించి ఇటీవలె తన జీవితాన్ని గురించి ప్రచురించిన విరామమెరుగని పురోగమనం అనే పుస్తకాన్ని నాకిచ్చాకు. ఇది కావాలంటే ఎవరైనా ఉచితంగా డాక్టర్ బీరం సుందరరావు, తెలుగు లెక్చరర్, ఇంకొల్లు – 5231676, ఫోన్ – 08594-244111, 98480-39080. ఈ పుస్తకాన్ని ఇటీవల చనిపోయిన జాషువా కుమార్తె, లవణం భార్య హేమలతకు అంకితం ఇచ్చారు..8 comments:

subhadra said...

chala goppa vyakti ni prarichaym chesaru.thank you.
kani oka mata cheppalini undi,meeku
kastam kaligite mannimchamdi.
antaa vayo vuddralini chesindi, di, di ,di.antu sambodinchatam naaku chala bhadha kalgindi.
pl veelunte marchandi.

te.thulika said...

ఉదయమే ఇటువంటి వ్యక్తులగురించి తెలుసకోడం చాలా సంతోషంగా వుందండి. ఇటువంటి వ్యక్తులే మనకి నిజంగా ఆదర్శం.
ధన్యవాదాలు.

Bhaskar said...

ఇన్నయ్య గారు,
నాస్తికత్వం కి,హేతువాదానికి, నాస్తికహేతువాదానికి గల తేడాను క్లుప్తంగా వివరించమని కోరుతున్నాను.

పరిమళం said...

Great !

ISP Administrator said...

>>మాంసాహారం ప్రయాణాల్లో తిన్నప్పుడు కూడా ఆమె ఎలాంటి అసహనం కనబరచలేదు.>>
ఇలాంటి పనులు చేస్తే నాస్తికులు హింసావాదులనే అభిప్రాయం బలపడుతుంది. నేను కూడా నాస్తికున్నే కాని మాంసం ముట్టుకోను. నాలుక టేస్ట్ కోసం అమాయక జంతువుల్ని చంపడమేమిటి? This is a vulgaristic practice in so called civilised society.

Hari Dornala said...

@ISP Administrator

This is a vulgaristic practice in so called civilised society...

నాస్తికత్వం, మాంసాహారం తినడం అనేవి రెండు వేరు వేరు విషయాలు. ప్రపంచం లో ఎక్కువ శాతం మంది మాంసాహారం తింటున్నప్పుడు దాన్ని vulgaristic practice అని ఎలా అంటారు? 'అమాయక జంతువులు' అన్నపుడు అమాయక వృక్షాలు కావా? వాటిని ఎందుకు తినాలి? కేవలం రక్తం కనపడు కాబట్టి అది హింస కాదా? పంచములు మీరనే vulgaristic practices చేస్తుంటారు కాబట్టి కుల విచక్షణ (cast discrimination) ని అగ్ర కులాల వారు సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మీ మాటలు వారి వాదనకు ఉతమిచ్చేలా వున్నాయి.

ISP Administrator said...

http://religionexposed.net/hinduism/myth_of_holy_cow_and_hindu_intolerance.html

ఈ ఆర్టికల్ వ్రాసింది నేనే. నేను బ్రాహ్మణవాదిని కాదనడానికి వేరే ఎవిడెన్స్ కావాలా?

Hari Dornala said...

@మార్తాండ గారు
మీరు బ్రాహ్మణ వాదులు కారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మాంసాహారం తినడాన్ని vulgaristic practice గా అభివర్ణించ వద్దని మాత్రమే కోరడం జరిగింది.