Friday, March 27, 2009

వీరే మన జోతిష్కులు – ఇక చదవండి

మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏటా ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసి, జ్యోతిష్యం చెబుతారు. ఇది చాలా కాలంగా జరుగుతున్నది. ప్రభుత్వంలో ఎవరున్నా వారికి అనుకూలంగా చెప్పటం ఆనవాయితీ.
1989లో ఎన్.టి. రామారావు మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరుగులేని వాడిగా వస్తాడని ఆయన జోత్సం చెప్పారు. ఎన్నికల్లో ఎన్.టి. రామారావు ప్రతిపక్ష స్థానానికి పోవల్సి వచ్చింది. అదే చంద్రశేఖర శాస్త్రి మళ్ళీ 1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపడతాడని ప్రగల్భాల జ్యోతిష్యం రవీంద్రభారతిలో హైదరాబాద్ లో ఆహ్వానిత ప్రేక్షకుల సమక్షంలో పలికారు. కానీ ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారు.
నండూరి రామకృష్ణాచార్యులు అధికార భాషా సంఘ అధ్యక్షులుగా కొన్నాళ్ళు పదవి చేపట్టారు. ఆయన అంతటితో పరిమితం కాకుండా జ్యోతిష్యాలు కూడా చెబుతూ 1989లో ఎన్నికల సమయంలో తిరిగి డోకాలేకుండా ఎన్.టి. రామారావు పదవీ చేపడతాడని జ్యోతిష్యం చెప్పారు. అదేమోగానీ, నండూరి వారి పదవి మాత్రం పోయింది.
ఇ.వీ. సుబ్బారావు జ్యోతిష్య పీఠానికి కొన్నాళ్ళు అదిపతిగా ఒక వెలుగు వెలిగారు. ఆయన నాకు మిత్రుడే. కొట్టిపాటి బ్రహ్మయ్య శాసన మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈయన పి.ఎ.గా వ్యవహరిస్తూ, బ్రహ్మయ్య గారి నా జీవిత కథ అనే పుస్తకాన్ని పరిష్కరించారు. ఆయన ఏ పదవిలో ఉన్నా జ్యోతిష్కం చెప్పటం ఆచారంగా పెట్టుకున్నారు. 1989లో ఎన్.టి.ఆర్. మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాడని చెప్పారు. లోగడ ఇలాంటి జ్యోశ్యాలే చాలామందికి చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే ఆయన చెప్పినవి విఫలమైనప్పుడు అదేమని ఎవరూ అడిగేవారు కాదు. కానీ పొరపాటున సఫలమైతే అదంతా తన గొప్పతనమేనని గొప్పలు చెప్పుకునేవాడు.
వీరందరికీ మించిపోయిన మరొక వాస్తు పండితులున్నారు. ఆయన గౌరు తిరుపతి రెడ్డి గారు. ఆయనతో నేను టీ.వీ. ఛానల్స్ లో బహిరంగ చర్చలో తారసిల్లి సవాళ్ళు చేశాను. ఆయనకు బోకరింపు, దబాయింపు, సెక్షన్ హెచ్చు. తాను ఎందరో తనవంతులకు, రాజకీయ వేత్తలకు, పారిశ్రామికులకు వాస్తు చెప్పి పైకి వచ్చునట్లు చేశానని రాసుకున్నాడు. 1999లో ఎన్నికల సందర్భంగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండేవారు. హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం (గాంధీభవన్) లో అధ్యక్షుడు కూర్చునే గది, కుర్చీ మారిస్తే వాస్తు ప్రకారం కలసి వస్తుందని ముఖ్యమంత్రి అవుతాడని గౌరు తిరుపతి రెడ్డి అలా మార్పించేశాడు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కాలేదు కానీ గాంధీ భవన్ లో మార్పులకు ఖర్చు చాలా అయింది. అయితే గౌరు తిరుపతి రెడ్డి తన వైఫల్యాలను ఎప్పుడూ చెప్పడు. అది వాస్తు పండితుల ప్రత్యేకత. సఫలాలన్నీ నిజమో కాదో కొంచం పరిశీలన చేయవలసి ఉన్నది. ఇలాంటివి కోకొల్లలుగా చెప్పవచ్చు. కానీ జ్యోతిష్కులు, వాస్తుపండితులు ఇవేవీ పట్టించుకోరు. వారి మాటలని నమ్మి మోసపోయేవారు, డబ్బులిచ్చేవారు, సమాజంలో ఉన్నంతకాలం వారికి తిరుగులేదు.
These are only few examples. But the game is going on.

5 comments:

దిన్నెల కృష్ణ కుమార్ said...

యాండోయ్ ఇన్నయ్యగోరూ

య్హమ్హాగా రాసేత్తారాండి మీలాటోరు. కాకుంటే మీలాటి భేతు భేతాళవాదులతో ఒచ్చిన సిక్కేటంటే, పతి పదార్దాన్నీ బూతద్దంలోనుంచి సూసేసి, సీమని గాడ్జిల్లా సేసేసుకుని, నిద్దరోయాక సొప్నాల్లో అది గొంతెక్కి కూర్సున్నట్టు గావు గావు కేకలెడతారండే. అదీ మారాజా మీలాటోళ్ళతో ఒచ్చిన సిక్కు. మరి ఆ సిక్కు ముడీడాలంటే మస్తిస్కం సివరాకరికి బద్దలన్నా అవ్వాల, లేదా అందులో బుర్ర అనేది మాడిమసైపోవాల. అందాకా ఈ సోద్యం సూత్తూ కూకోటమే.

Indian Minerva said...

Every man is an architect of his own future అంటారు. అలా కాకుండా తన జీవితాన్ని తనకంటే ప్రభావవంతంగా ఎక్కడో వున్న గ్రహాలు, నక్షత్రాలు, దేవుళ్ళు, దేవతలు ప్రభావితం చేస్తాయి/చెయ్యలి అనుకోవటం respectively పలాయనవాదం/సోమరిపోతుతనం. మోసపోవటం వాళ్ళ బుద్ధిహీనత మానసిక బలహీనత కూడా and I think they deserve it. మోసపోయే వాళ్ళకంటే మొసగాళ్ళనే గౌరవిస్తాను కనీసం వీళ్ళవల్ల వీళ్ళకైనా ఉపయోగం వుంటుంది కాబట్టి. So let them cheat and let these guys get cheated and enjoy the show.

అన్నట్లు మీరు పరిచయం చేసిందే పురాణ ప్రలాపం ఇక్కడ దొరుకుతుంది. కామెంటేటర్లను ఒక్క సారి దీన్లో జోతిష్యఆన్ని గురించిన విమర్శలను చదివి చూసి. ఒక చర్చ ఇక్కడ ప్రారంభించ మని ప్రార్ధన.

here is the link for పురాణ ప్రలాపం http://www.esnips.com/doc/4147ce03-6e2f-47db-8550-9fccda0d260a/Purana_Pralapam_revised

Indian Minerva said...
This comment has been removed by the author.
ISP Administrator said...

జ్యోతిషులు గ్రహదోష నివారణ పూజలు చేస్తే కష్టాలు తొలిగిపోతాయని చెప్పి డబ్బులు లాగుతారు. విచిత్రమేమిటంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని మా అమ్మానాన్నలు కూడా ఒక జ్యోతిషుడిని నమ్మి శాంతి పూజలు చెయ్యించారు. శాంతి పూజలు వల్ల కష్టాలు తొలిగిపోతాయన్నది నిజమైతే జ్యోతిషులు మురికివాడలకి, గిరిజన గూడలకి కూడా వెళ్ళి అక్కడ శాంతి పూజలు చెయ్యించి అక్కడి ప్రజల కష్టాలు తొలిగించాలి.

కరీంనగర్ జిల్లాలో వరుణ యాగాలు చేశారు. వాతావరణ మార్పుల వల్ల వానలు పడితే వాన దేవుని దయ వల్ల వానలు పడ్డాయని నమ్మించారు. జనాన్ని అమాయకుల్ని చేసి ఆడుకోవడం నీచనికృష్టమైన పని. వాళ్ళకి చేతనైతే ఎండాకాలంలో వరుణ యాగం చేసి వానలు కురిపించాలి. ఆ పని ఏ పంతులూ చెయ్యలేడు అని ఖచ్చితంగా చెప్పగలను.

ISP Administrator said...

భారత నాస్తిక సమాజం వారు ప్రకటించారు "ఎవరైనా జ్యోతిషం, వాస్తు నిజమని నిరూపిస్తే ఐదు లక్షలు ఇస్తాం" అని. నేనైతే ఇరవై ఐదు లక్షలు ఇస్తాను.

భారత నాస్తిక సమాజం వారి అడ్రెస్:
జయగోపాల్
ఎడిటర్, నాస్తిక యుగం పత్రిక
ఆరిలోవ కోలనీ
విశాఖపట్నం

నా అడ్రెస్:
PKM
ప్లాట్ నంబర్ 16
బొందిలిపురం
శ్రీకాకుళం

జ్యోతిషం, వాస్తు నిజమనడానికి ఆధారాలు ఉన్నవాళ్ళు ఎవరైనా డాక్యుమెంటులు వ్రాసి వాటిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మా అడ్రెస్ లకి పంపండి. విశాఖపట్నంలో గానీ, శ్రీకాకుళంలో గానీ ఏదైనా పబ్లిక్ ఆడిటోరియంలో మేము మీటింగ్ పెట్టి జనం ముందు ఆధారాలు పరిశీలిస్తాం. జయగోపాల్ గారు విశాఖపట్నంలో ఉంటున్నారు కాబట్టి బీచ్ లు, కైలాసగిరి అవి ఇవి చూడడానికి వైజాగ్ వెళ్లేవారు డైరెక్ట్ గా జయగోపాల్ గారి ఇంటికి వెళ్ళి డాక్యుమెంటులు సబ్మిట్ చెయ్యొచ్చు.