Thursday, March 12, 2009

రచయిత, ఉపన్యాసకులు శేషాద్రి


శేషాద్రి (మధ్యలో ఉన్నారు)
చిరకాలంగా మిత్రులుగా మేము అనేక రంగాలలో కలిసి పనిచేశాం. కందాడై శేషాద్రి మంచి రచయిత, ఉపన్యాసకులు. హాస్యప్రియులు. సుప్రసిద్ధ కమ్యూనిస్ట్ అడ్వకేటు కన్నభిరాన్ కు దగ్గర బంధువు వారి తాతలిరువురూ అన్నదమ్ములు. 1822 జులై 1న, నెల్లూరులో పుట్టిన శేషాద్రి మదరాసులో హైదరాబాదులో, హేగ్ చదివి డిగ్రీలు పొందారు. దేశ, విదేశాలు పర్యటించారు. ఆయన తండ్రి నైజామ్ కొలువులో పనిచేసేవారని చెప్పారు. తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హింది మాట్లాడటం శేషాద్రికి కొట్టిన పిండి.
1940 ప్రాంతాలలో కమ్యూనిస్టుగా జీవితాన్ని ఆరంభించి స్వాతంత్ర్యానంతరం ఆ ఉద్యమానికి దూరమై కేవలం సానుభూతిపరుడుగా మిగిలి, విద్యారంగంలో స్థిరపడ్డారు. నెల్లూరు వాడు కావడం వలన అక్కడి వారితో చిరపరిచితం, అనుభవాల దృష్ట్యా జమీన్ రైతు తెలుగు వారపత్రికలో అనేక వ్యాసాలు వ్రాసారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన నాకు పరిచయమయ్యారు. ఆ తరువాత జీవితమంతా సన్నిహిత స్నేహితులుగా కుటుంబ మిత్రులుగా ఉన్నాము.
మేము 1970 ప్రాంతాలలో ప్రసారిత అనే పేరిట ఒక త్త్రైమాస పత్రికను తెలుగులో హైదరాబాదు నుండి ప్రారంభించాము. పి. సత్యనారాయణ సహ సంపాదకుడు శేషాద్రి మాకు సలహాదారుడుగా ఉంటూ అందులో వ్యాసాలు వ్రాశాడు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో తెలుగులో వివిధ కోర్సులు చెప్పడానికి వీలుగా ఆ వ్యాసాలు తోడ్పడేవి. తెలుగులో ఉన్నత విద్య అభివృద్ధి కావాలంటే అనువాదాలకు బదులు ఆ స్థాయిలో ఇతర దేశాలలో ఉన్న కోర్సులను స్వేచ్ఛగా తెలుగులోకి తీసుకు రావాలని యథేచ్ఛగా సాంకేతిక పదజాలం వాడాలని అప్పుడే తెలుగు పిల్లలు సాంకేతిక, వైద్య, వ్యవసాయ తదితర కోర్సులు నేర్చుకోవడానికి వీలుంటుందని శేషాద్రి చెప్పేవారు. అది నేటికీ అమలుపరచదగిన అంశం.
జెట్టి సాంబశివరావుతో కలసి హేగ్ లో కోర్సులు చదివి తరువాత కొన్నాళ్ళు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, (ఢిల్లీ). వరంగల్ పోస్టు గ్రాడ్యుయేట్ సెంటర్, రాజేంద్ర నగర్ పంచాయతీరాజ్ సంస్థలలో పనిచేశారు. విదేశాలలో అనేక ఉపన్యాసాలు చేశారు. తెలుగులోనూ ఇంగ్లీషులోను చేసిన రచనలలో, కృతయుగ, కమ్యూనిస్టు ఉద్యమమం వ్యవసాయ పాలన, మార్క్సిజం, రాజకీయ శాస్త్రం ఇత్యాదులున్నవి.
నా ఆహ్వానంపై శేషాద్రి అనేక మానవ వాద, హేతువాద సమావేశాలలో అధ్యయన తరగతులలో ఉపన్యాసాలిచ్చారు. చివరి రోజులలో హైదరాబాదులోని చెండ రాజేశ్వరరావు వృద్ధుల సంస్థలో ఉండేవారు. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తలపెట్టిన పంచాయతీ రాజ్ సంస్కరణలకు శేషాద్రి అనేక విధాల తోడ్పడ్డారు.

9 comments:

Anonymous said...

"ఇతర దేశాలలో ఉన్న కోర్సులను స్వేచ్ఛగా తెలుగులోకి తీసుకు రావాలని యథేచ్ఛగా సాంకేతిక పదజాలం వాడాలని అప్పుడే తెలుగు పిల్లలు సాంకేతిక, వైద్య, వ్యవసాయ తదితర కోర్సులు నేర్చుకోవడానికి వీలుంటుందని శేషాద్రి చెప్పేవారు. అది నేటికీ అమలుపరచదగిన అంశం."
అమలు పర్చటానికి ఏమిటీ అడ్డంకి?

innaiah said...

Telugu akadeki, telugu university, official language commission,syllabi committees. text book writings have to undertake this task but they did not. That is why children are going to English medium

Anonymous said...

విశ్వవిద్యాలయాల్లో ఉన్న మీరే ఇలా అంటే, ఇక ఏమిటి చెప్పేది!? దీనికి మీరుకూడా బాధ్యులే! ఎలా అంటారా? మీ పోస్టులలోంచి ఓ చిన్నమాట ఇక్కడ కాపీపేస్ట్ చేస్తున్నా:

"తెలుగు అకాడమి, తెలుగు యూనివర్సిటీ, అధికార భాషా సంఘం, సిలబస్ కమిటీలు....జ్యోతిష్యం, వాస్తు వంటి మూఢనమ్మకాల ఛాందసాలు ప్రచారంలో పెట్టారు....నేడు ఛాందసుల చేతుల్లో తెలుగు వికసించకుండా వున్నది."

వీటికి వ్యతిరేకంగా పనిచేసే దీక్షలో,మీకు -" వైజ్ఞానిక, సాంకేతిక, న్యాయ, పాలన, వాణిజ్య, వ్యవసాయ రంగాలలో ఏ స్థాయిలోనైనా, ఏ విషయాన్నైనా తెలుగులో చదువుకోనే అవకాశం కల్పిచడం " అనేది మీ పనికానట్టుగానూ,తెలుగు అకాడిమీ/విశ్వవిద్యాలయాల పనిగానూ భావించారేమో అని నా అభిప్రాయం.

మీరు ప్రయత్నిస్తే ఆ పని సాధించగలరు; నా భావం జ్యోతిష్యాలనూ,వాస్తులనూ తెగనాడాలని కానేకాదు. దాన్ని కృషిచేసుకునేవాళ్ళని చేయనీయండి.సమాంతరంగా మీరు మిగిలిన రంగాలలో తెలుగులో చదువుకునే ఏర్పాటు
సాధించండి.అందులోనూ - "యథేచ్ఛగా సాంకేతిక పదజాలం " అన్నది చాలా ముఖ్యమైనది; మళ్ళా అనువాదాలు ఉండకూడదు - వడి/వేగం అని చదువుకొని మళ్ళా దాన్ని స్పీడ్/వెలాసిటీ అని చదువుకొని, బలం/శక్తి/పని అని చదువుకొని మళ్ళా దాన్ని ఫోర్స్/ఎనెర్జీ/వర్క్ అని చదువుకోవటంలోనే తెలుగుపిల్లల సమయం అయిపోతే - సొంతగా అంతర్జాతీయ స్థాయిలో ఓ పేపర్ ప్రెజంట్ చేయ్యాలి అనే కోరిక ఎప్పుడు పుడుతుంది? మళ్ళీ వాడు ఏ అమెరికన్ యూనివర్శిటీలో చేరినప్పుడు మాత్రమే!అంత దూరం వెళ్ళాక భాష మీద ప్రేమ/దోమ ఏంటి? ఏదో నాస్టాల్జియా - అదీ ఓ మానసిక పరిస్థితే.అంతేగానీ శాస్త్రీయంగా చెప్పాలంటే తెలుగు ఉంటేయే,లేకపోతేయే? కావల్సింది ఙ్ఝానసమూపార్జన
కానీ!?లేదా తెలుగువాళ్ళ దగ్గర ఓ మేధావిగావర్గంలో చెలామణి అవ్వగల ఓ ఆనందం; అంతే!

మీరు ఎడిసన్ గురించి సరిగా అర్ధం చేసుకోలేదు .శాస్త్రీయత కూడా కొన్ని విశ్వాసాలమీద ఆధారపడ్డదే! న్యూటన్
మహాశయుడు కూడా ఈథర్ ఉంది అని నమ్మాడు - కానీ శాస్త్రీయ దృక్పదాలవల్ల ఓ రోజుకి దాన్ని తోసిరాజని మరో
థియరీ కనుక్కొన్నాడు మ్యాక్స్ ప్లాంక్. అలాంటి ఆలోచన సరళి నడవటానికి మూడనమ్మాకాలు/జ్యోతీష్యాలు
అడ్డుకావు.పాశ్చాత్యం నాకు స్టాండర్డ్ కాదు గానీ, మరి అక్కడ యూనివర్శిటీల్లో సైతం ఎన్నో పనికిమాలిన కోర్సులు లేవా!? కానీ వాళ్ళు అన్నీ పరిరక్షస్తారు.సంఘం వదిలేసిన వాటిన కూడా!

మూఢవిశ్వాశాలు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నాయి - అన్న్దది మీరు ఎరుగని విషయం కాదే!భారతదేశానికో, తెలుగుకో మాత్రమే పట్టిన తెగులు కాదే!మూఢవిశ్వాసాలకి విద్యతో కుడా సంబంధం లేదే!

విద్య వల్లే అన్నీ బాగుంటే - ఓ కంప్యూటర్ ఇంజనీర్ కి టెర్రరిజమే సమాధానం అని ఏలా అనిపిస్తుంది? మన విప్లవవాద రచనలకీ, తుపాకీతో మార్పు సాధించగలం అన్న నమ్మకానికీ, విద్యకి లంకె కుదిరనట్టు మరి నా విద్య ఎందుకు నాకు నేర్పలేకపోతోంది?

కాబట్టి మీ ఛాందసం మీది! వాళ్ళ చాందసం వాళ్ళది. వాళ్ళని వదిలేసి,మీరు చెయ్యగలిగే మంచి చేయండి.తెలుగు అకాడమీ/విశ్వవిద్యాలయాలు చేస్తున్న పని వేరే అయినంత మాత్రాన, మీరు వారిని తెగనాడక్కర్లేదు.దానిగోల వేరు.

ఇన్నివేల ఏళ్ళ క్రితం నుంచి మనకి సాహిత్యం ఇలా ఉంది అని ఒకరు చెప్పకపోతే మనం అనాగరికులంగా ఉన్నామని
పాశ్చాత్యులు/ మళ్ళీ మీ లాంటి హేతువాదులు నిర్ణయిస్తారు. అప్పుడు ఆత్మన్యూనతతో జాతి మొత్తం
కుంచించుకుపోతోంది.అందుకోసమైనా - మంచివైనా, చెడ్డవైనా మన నాగరికత అనేదానికి ఓ ఋజువుగానైనా -
మతగ్రంధాలు,తెలుగు ప్రాచీన సాహిత్యాలు,జ్యోతీష్యాలు,వాస్తులు, సంస్కృతమూ, సంగీతమూ, నాట్యమూ,నాటకమూ అన్నీ అన్నీ బతికించే ఉంచాలి;వాటి గురించే సమయం / డబ్బు వెచ్చించే సంస్థలూ ఉండాలి. అవి బతికించే అవసరం
లేదనుకుంటే, తెలుగు కూడా బతికి ఉండాల్సిన అవసరం లేదు; ఇది తెలిసో తెలీకో ఆల్రెడీ "ప్రాచీనం" అయిపోయింది; ఇక అందరం ఇంగ్లీషే నేర్చుకుందాం.

చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, అసలు "మీరు" తెలుగు బతికుండాలి అని ఎందుకనుకుంటున్నారో నాకు తెలియట్లేదు!?

Anonymous said...

"కొన్ని కారణాల వల్ల ప్రత్యక్షంగా చేయలేకపోతున్నాము" అనో,లేక "మేము కొందరం ప్రయత్నించినా ఇలాంటి ప్రతుఘటన వచ్చింది" - అని పూర్తిగా ఏకరువు పెట్టడమో ఏదో ఒకటి సమాధానమిస్తారేమోనని ఆశించాను.

కానీ మేధావి వర్గాలు పూనుకుని ఈ పనిని చేయించలేకపోయాము అంటే నమ్మశక్యం గా లేదు. కొబ్బరికాయలు కొట్టే "సైంటిస్టులు"న్నట్టే, తెలుగులో సైన్స్ ఉండాలి అని కోరుకునే "ఛాందసవాదు"లూ ఉంటారు. ఉదాహరణకి నేనే!మీ హేతువాదాన్ని ఒప్పుకోకపోయినా, ఆ తెలుగు గురించిన పాయింట్ ని ఒప్పుకోవట్లేదా!ఎటొచ్చి మేము విశ్వవిద్యాలయాల్లో లేము.కాబట్టి దీనికోసం మీరు ఓ గ్రూపును ఖచ్చితంగా తయారు చేయగలరు.

కానీ మీరు తెలుగు ఎందుకు ఉండాలి అనుకుంటున్నారో రాస్తే చూద్దామని మాత్రం చాలా ఉత్సుకత ఉంది నాకు.

innaiah said...

Majority of the people in Andhra Pradesh stay in the state and so also their children. Naturally they aspire to get their children educated in advaced courses on par with developed countries.This will enable them to get jobs, professional career,research facilities etc.
But the students cannot study any course in Telugu after school, like law, medicine, engineering, agriculture, business administration and so on. Hence they are sending their children to english medium schools.
But Telugu language is neglected in developing advanced courses. Small countries like korea and other countries have their courses in their languages.
That will save time .
Telugu has to be developed through technical vocabulary, dictionaries, encyclopedias, adoption of technical terminology into Telugu . That has to be done by adademies, commissions, syllabi committees, for which they meant. But they neglected and did not care to develop language in those necessary subjects. This cannot be undertaken by individuals.
There is no hatred towards English language. But there is need to develop Telugu language for the sake of majority.That is the point.

""ఈగ హనుమాన్ (హనీ) said...

మిత్రమా!
ఒక సైంటిఫిక్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా చెబుతున్నా!
సైన్సు- తెలిసిన ప్రపంచములో కొంత భాగాన్ని, అన్ని కోణాల్లోంచి అర్థమ్య్యేలా చెబుతుంది కానీ మనకందనీ, సైన్సుకందని సృష్టి యెంతో ఉంది. విశ్వాన్నంతటినీ వివరించే శక్తి, స్తోమత సైన్సుకు ప్రస్తుతానికి లేదు. మీరేమంటారు.
మీ ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)

Anonymous said...

అవునూ!ఇప్పుడు మెజారిటీ ఇంగ్లీషులో నేర్చుకుంటాము అంటోది!దానికి భిన్నంగా తెలుగుని అభివృద్ధిని చేయండి అని ఎందుకు చెబ్తున్నారు అనేది నా ప్రశ్న!?

మెజారిటీ కోరుకుంటున్నది ఇంగ్లీషు;

తెలుగు లేదా దేశీ /విదేశీ కంపెనీలైనా, పెద్ద కంపెనీలలో మంచి ఉద్యోగాలు - ఇంగ్లీషులో నేర్చుకున్నవారికే ఇస్తారు; తెలుగులో యం.బి.ఏ,అకౌంట్స్,న్యాయ శాస్త్రం చదువుకున్నా, "తెలుగులో అన్నీ తెలుసుగదా" అని ఉద్యోగం ఇవ్వరు!ఇంగ్లీషులో చదివిన వారికే ఇస్తారు;

అందుకనే మెజారిటీ ఇంగ్లీషే నేర్చుకుంటారు.అందుకని, ప్రభుత్వ కాలేజీల్లో/స్కూళ్ళల్లో చిన్నప్పడినించి ఇంగ్లీషే నేర్పించాలి అని పోరాడాలి గానీ, తెలుగులో పెద్ద చదువులు నేర్పించాలి అని ఎందుకంటున్నారు?

చిన్నప్పుడు తెలుగు, పెద్ద చదువుల్లో ఇంగ్లీషు ఎందుకు? చిన్నప్పడినించి ఇంగ్లీషులోనే నేర్పేస్తే - యూనిఫామిటీ ఉంటుందిగా!? ప్రాచీన తెలుగులో ఎందుకు నేర్పించాలి?

కనపడకుండా కొన్ని వర్గాలు తమ ఆధిపత్యం అలాగే కొనసాగించడనికా!?

మంచి ఉద్యోగాలు, ఎదుగుదలకు అవకాశాలు ఉన్న "ఇంగ్లీషు" కొన్ని వర్గాలు నేర్చుకుంటారు. నిరుపేదలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారు తెలుగులో నేర్చుకొని, ఎన్నో మంచి అవకాశాలకు సంవత్సరాల దూరంలో ఉండిపోతారు.పాఠశాలలో ఉన్న రోజుల్లో సైతం, సాధించడానికి విద్యార్ధికి చాలా ఉంది సార్!జీ సరిగమ లో ప్రైజు ఒకటే కాదు.వాటన్నింటికి తెలుగు మీడియం ప్రతిబంధకం అవుతుంది.

Confining us to Telugu language is an Oppression.I want to be taught in English right through LKG.Because i get tremendous opportunity to access a whole lot of resources for growth and development.

Is it an unjust Demand!? Please Answer me. Is it unjust demand to ask for english to be the medium of instruction all through!? Why should i bother about Telugu!?

The next generation will speak in its own dialect of english! Why do we need to keep Telugu alive!?

Your "majority point" is not convincing, sir; In fact, its the majority which wants english!and you are trying to stop them by bringin in more telugu!?

Let's reason it out!Why do we need to keep Telugu alive when the majority wants english for a living, growth and development!?

naprapamcham said...

I am for modernising Telugu to accommodate advanced subjects. But the present Telugu is not suitable for that. Deliberately Telugu was kept backward without any science, technological and modern subjects vocabulary. That is because all institutions are dominated by traditional outdated pandits.That is harming the common students who cannot afford courses in English.

Anonymous said...

తిరిగి సమాధానమిచ్చినందుకు ధన్యవాదాలు.తెలుగుని ఆధునీకరించాలన్న మీ అభిప్రాయంతో నేను మొదటనుంచి ఏకీభవిస్తున్నాను.కానీ,అసలు తెలుగు మనుగడ ఎందుకు కాపాడుకోవాలి,దాన్ని వదిలేసి ఇంగ్లీషునే చేరదీస్తే వచ్చే నష్టం ఏమిటి?అన్న ప్రశ్నని మీరు దాటవేస్తున్నారు.
ఎనివే,థాంక్యూ వెరీ మచ్ ఫర్ రెస్పాండిగ్ టు మై లాంగ్ కామెంట్స్.