Sunday, September 6, 2009

రాజశేఖరరెడ్డి- జ్యొతిష్యం

మేము ముందే చెప్పాము అంటూ ప్రగల్భాలు పలుకుతూ, సునామి వంటివి అలా చెప్పగలిగాము అన్న జ్యోతిష్యులు లేకపోలేదు.
ఆంధ్ర ప్రదేష్ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశెఖరరెడ్డి సెప్తెంబర్ 2 న మరణిస్తాడని చెప్పిన జ్యోతిష్యుడు ఎవరన్నా వున్నారా?
అంత ప్రధాన విషయం ఎందుకు చెప్పలేకపోయారు ?
జ్యోతిష్యం సాంఘిక నేరం .అది గ్రహిస్తే మంచిది
శాస్త్రీయ పరిశీలనకు జ్యొతిస్యం నిలవదు.
అందుకే ఎవరైనా శాస్త్రియతను జ్యోతిస్యంలో రుజువు చెస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తానని జేంస్ రాండి బాంక్ లో ధనం పెట్టి సవాల్ చేస్తున్నాడు.www.randi.org

46 comments:

తెలుగు వెబ్ మీడియా said...

నిజమే, సెప్టెంబర్ 2న మీకు గండం అని ముందే చెప్పి ఉంటే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ఎక్కేవాడు కాదు కదా?

Anil Dasari said...

ఆ రకంగా ఎవరన్నా చెప్పుంటే .. ఆ చెప్పింది జరిగినా జరక్కపోయినా ముందా జ్యోతిష్యుడు లేచిపోయుండేవాడు.

Anonymous said...

అబ్రకదబ్ర గారు,

మీరు కరక్టు..

తెలుగు వెబ్ మీడియా said...

నిజమే అబ్రకదబ్ర గారు. ఏ జ్యోతిష్యునికీ అంత ధైర్యం ఉండదు. ఎంతైనా వాళ్ళు చెప్పేవి కట్టు కథలు, పిట్ట కథలే కదా.

Anonymous said...

ఈ విధంగా జరిగిందని కూడా నేను విన్నాను.

మిహిర అనే అంతర్జాతీయ ఆధ్యాత్మిక మాసపత్రికలో భవిష్యవాణి (వారఫలాలు) వ్రాసే జ్యోతిష్యుడు తనని కలసిన రాజకీయ నాయకులకు సెప్టెంబరు 2వతారీఖననే వై.ఎస్. ఇంటినుంచి బయలు దేరిన సమయం 8:15 అది శని హోరా, 9:36 సమాచార వ్యవస్థ ఆగిపోయిన సమయం లో గల హోరా ఆధారంగా ఖచ్చితంగా మరణం సంభవిస్తుందదని చెప్పారు. వెంటనే ఆ త్రాష్టులు ఆ జ్యోతిష్యుని ఇంటిని ద్వంసం చెయ్యటానికి ప్రయత్నించి, దాదాపు 30 వేల విలువగల సామాగ్రిని 15 నుంచి 20 నిముషాలలో ద్వంసం చేసి పడేసారు.

తెలుగు వెబ్ మీడియా said...

జ్యోతిష్యం, వాస్తు చెప్పడం ప్రొఫెషనల్ గా అంత లాభదాయకం కాదు కానీ గ్రహ పూజలు చెయ్యాలని భయ పెట్టే వాళ్ళకి మాత్రం లాభమే. మా ఇంటికి వచ్చే ఫామిలీ పురోహితుడు కూడా అలాగే సంపాదిస్తుంటాడు. భయ పెట్టడం చెయ్యని వాళ్ళకి మాత్రం పెద్ద లాభం రాదు, "అడ్డు గోడలు" కథలో జగన్నాథం పంతులు కూడా భయ పెట్టే టెక్నిక్ లు నేర్చుకోకుండా పేదరికంలో ఉండిపోతాడు. అయితే అతను తన కొడుకుని బాగా చదివించి, ఉద్యోగస్తుడిని చేసి పేదరికం నుంచి బయట పడాలనుకుంటాడు కానీ పౌరోహిత్య వృత్తి కొనసాగించాలనుకోడు. http://sahityaavalokanam.net/?p=268

జయహొ said...

*శాస్త్రీయ పరిశీలనకు జ్యొతిస్యం నిలవదు.*

మరి శాస్త్ర పరి శోధనకు నిలచిన హెలికాప్టర్ ఎందుకు కూలింది? శాస్త్రప్రకారం అది కూల కూడదు కదా? చనిపొయిన వారు తిరిగి వాస్తారా? జ్యొతిష్కం నిజం కాక పొతే ప్రజలకు డబ్బూ పోతాయెమోగాని ప్రాణాలు కాదు. ఇది మీరు ఎందుకు గ్రహించటం లేదు?

తెలుగు వెబ్ మీడియా said...

ఆ హెలికాప్టర్ కి రెండేళ్ళ నుంచీ లైసెన్స్ లేదు. నిర్లక్ష్యంగా ఉంటూ డొక్కు హెలికాప్టర్ ని కావాలని రిపైర్ చెయ్యకపోతే అది మనుషుల తప్పు కానీ టెక్నాలజీ తప్పా?

పునర్వసు said...

జ్యోతిశ్యపు predictions తప్పయితే అది చెప్పే వాని లోపమే గాని, అది జ్యోతిష్య శాస్త్రపు లోపము కాదు, అని ఎందుకు అనుకోకూడదు logical thinkers.

తెలుగు వెబ్ మీడియా said...

నిర్లక్ష్యానికీ, మోసానికీ మధ్య చాలా తేడా ఉంది. నిర్లక్ష్యానికి పోయి లైసెన్స్ లేని డొక్కు హెలికాప్టర్ నడపడానికీ, తెలిసి తెలియని కట్టు కథలు, పిట్ట కథలు చెప్పడానికీ మధ్య తేడా లేదా?

పునర్వసు said...

నిర్లక్ష్యానికి ఫలితం ప్రాణాలు పోవడం. చూస్తూనే ఉన్నారుగా. జ్యోతిశపు పిట్ట కథలు చెప్పించు కునేవరెవరూ, వారి ప్రయత్నాలు మానుకుని పూర్తిగా జ్యోతిశ్యాన్నే నమ్ముకోరు. కానీ టెక్నాలజీని నమ్ముకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు.
టెక్నాలజీ, శాస్త్రము అని మీరు చెప్పేవన్ని కూడా ఇంకా పూర్తి పరిపక్వత పొందలేదు. టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన వస్తువులు ఎంతకాలం పనిచేస్తాయో చెప్పమని తయారు చేసిన వాళ్ళను అడిగితె, సుమారుగా ఇంతకాలం పనిచేయవచ్చు అని చెబుతారు కానీ, ఖచితంగా ఇంతకాలం పనిచేస్తుందని చెప్పగలరా? పోనీ సుమారుగానైన అంతకాలం పనిచేస్తుందని గ్యారంటి ఉందా. ఒకవేళ మరుసటి రోజే చెడిపోతే వాడు చెప్పినవన్నీ
పిట్టకతలేన? వాళ్ళు మోసగాల్లెన?
ఎన్నికలలో వాగ్దానాలు చేసి, వాటిని నెరవేర్చక పోవడం రాజ కీయ నాయకులూ చేసే మోసం, లక్షలు వసూలు చేసి, ప్రాణాలు నిలబెట్టక పోవడం డాక్టరులు చేసే మోసం. జ్యోతిష్యులు చెప్పినది జరిగితే, అది నిజం, లేకపోతె అది అబద్దం. ఇంతే కానీ అది మోసం కాదు.

పునర్వసు said...

మీ మొదటి కామెంటు చూస్తుంటే, జ్యోతిషులు ఎవరైనా ముందే చెప్పుంటే ముఖ్య మంత్రి గారు హెలికాప్టరు ఎక్కేవారు కాదు, బ్రతికేవారు అని మీ ఉద్దేశం కాబోలు. జ్యోతిష్యులు ఎవరూ చెప్పలేదు కాబట్టి వారు చేసేది మోసం, వారు చెప్పేది పిట్ట కథలు అంటున్నారా? మరి ముఖ్య మంత్రి గారు ఎవరైనా జ్యోతిష్యులను సంప్రదించారా వెళ్లేముందు?

తెలుగు వెబ్ మీడియా said...

నేను హార్డ్ వేర్ ప్రొఫెషనల్ ని. నా టెక్నాలజీ గురించి తెలియక పోవడం జరగదు. కంప్యూటర్ ని రఫ్ గా వాడి, హై వోల్టేజ్ కి ఎక్స్పోజ్ చేసి ఆరు నెలలకే మదర్ బోర్డ్ కాల్చుకున్న వాళ్ళని చూశాను. కంప్యూటర్ ని జాగ్రత్తగా వాడితే పదేళ్ళు వరకు రిపైర్లు లేకుండా పని చెయ్యగలదు. రాజశేఖర రెడ్డి ఎక్కిన హెలికాప్టర్ పదేళ్ళ క్రితం అమెరికాలో కొన్నది. రెండేళ్ళ క్రితం హెలికాప్టర్ ఇంజిన్ పాడయ్యిందని దాని లైసెన్స్ రెన్యువల్ చెయ్యలేదు. ఇంజిన్ రిపైర్ చెయ్యకుండా హెలికాప్టర్ ని నడిపితే అది మనిషి చేసిన తప్పు కానీ టెక్నాలజీ లోపమా? కంప్యూటర్ అయినా, హెలికాప్టర్ అయినా మెషీన్ రఫ్ గా వాడితే ఆరు నెలలకే రిపైర్లు రావడం విచిత్రం కాదు.

పునర్వసు said...

నాకు పెద్దగా టెక్నాలజీ తెలియదు గాని, మీకు తెలిసిన టెక్నాలజీ తో కొచెం ఇది తెలుప గలరు. రెసిస్టర్ల రెసిస్టన్స్ చెప్పేటప్పుడు + or - 5% అని ఎందుకు చెబుతారు, ఖచితంగా ఎందుకు చెప్పలేరు?

voltage fluctations అంటే తెలుసు కానీ, రఫ్ గా వాడడం అంటే అర్థం కాలేదు.

తెలుగు వెబ్ మీడియా said...

నేను కంప్యూటర్ హార్డ్ వేర్ ఎక్కువగా పుస్తకాలు చదివి నేర్చుకున్నాను. హార్డ్ వేర్ తో పాటు టివి టెక్నాలజీ ఇతర కూడా నేర్చుకున్నాను. కంప్యూటర్ కి UPS లేదా స్టేబిలైజర్ పెట్టకుండా హై వోల్టేజ్ కి ఎక్స్పోజ్ చేసి SMPS కాలిపోయిందనో, మదర్ బోర్డ్ కాలిపోయిందనో బాధ పడితే అది కంప్యూటర్ టెక్నాలజీ తప్పా, UPS లేదా స్టేబిలైజర్ పెట్టని వాడిది తప్పా? మొన్న మా ఇంటిలో హై వోల్టేజ్ వచ్చినప్పుడు టివి కాలిపోయింది కానీ కంప్యూటర్లు కాలలేదు. టివి మా అమ్మగారు కొన్నారు. నా కంప్యూటర్లకి UPS ఉంది. అమ్మగారి టివికి స్టేబిలైజర్ లేదు. ఇక్కడ జరిగినది టెక్నాలజీ తప్పా, మనుషుల తప్పా?

తెలుగు వెబ్ మీడియా said...

డీజిల్ ఇంజిన్ లో యాక్సిల్స్ అరిగిపోవడం వల్ల ఇంజిన్ పని చెయ్యకపోతే అది ఇంజిన్ రఫ్ గా వాడిన డ్రైవర్ తప్పా, డీజిల్ ఇంజిన్ టెక్నాలజీ తప్పా?

పునర్వసు said...

కంప్యుటర్ రఫ్ గా వాడడం గురించి చేబుతారనుకుంటే, డీజల్ ఇంజన్లు గురించి చెబుతారేమిటి? కంప్యూటర్ల గురించి మాట్లాడండి మొదట, తరువాత డీజల్ ఇంజన్లు గురించి చెబుదురుగాని?

తెలుగు వెబ్ మీడియా said...

శ్రీకాకుళం పట్టణంలో గోవింద్ అనే ఒక ISP ఆపరేటర్ ఉన్నాడు. ISP సర్వర్ ని 24 గంటలు ఆన్ లో ఉంచాలి, AC కూలింగ్ లో పెట్టాలి. వాడు తన సర్వర్ ని టేబుల్ ఫాన్ కూలింగ్ లో పెట్టాడు కానీ AC పెట్టలేదు. అంత రఫ్ గా వాడితే సర్వర్ కాలిపోక ఏమవుతుంది? ఓ రోజు నిజంగానే సర్వర్ కాలిపోయి శ్రీకాకుళం పట్టణంలో కొన్ని వందల మందికి ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయ్యింది. సర్వర్ కాకుండా క్లైంట్ సిస్టమ్ అయినా హీట్ ఎక్కితే కాలుతుంది. UPS లేదా స్టేబిలైజర్ లేకపోయినా కాలుతుంది.

పునర్వసు said...

electronics లో resitor చాలా basic కదా? దానిని గురించి మీరు మాట్లాడడం లేదు?

పునర్వసు said...

కంప్యుటర్ కు సరైన వోల్టేజి, కూలింగ్ ఉంటె ఎంతకాలమైనా పనిచేయాలి మీరు చెప్పినవిదంగా, ఎప్పటికి పాడవా కూడదు? (if you UPS and AC as you sai. except the hard drive which is a moving part, has wear and tear). అవునా, కాదా?

పునర్వసు said...

కంప్యుటర్ కు సరైన వోల్టేజి, కూలింగ్ ఉంటె ఎంతకాలమైనా పనిచేయాలి మీరు చెప్పినవిదంగా, ఎప్పటికి పాడవా కూడదు? (if you use UPS and AC as you said. except the hard drive which is a moving part, has wear and tear). అవునా, కాదా?

తెలుగు వెబ్ మీడియా said...

ప్రొఫెషన్ కోసం నేను పుస్తకాలు చదివి కంప్యూటర్, టివి, UPS, స్టేబిలైజర్, బూస్టర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, ఫైబర్ ఆప్టిక్స్, మీడియా కన్వర్టర్ లాంటివి తెలుసుకున్నాను. ప్రొఫెషన్ కోసం నేను చదివినవి, ప్రొఫెషనల్ గా నాకు ఎదురైన అనుభవాలు క్లియర్ గా చెప్పగలను. నేను చదవనివి, అనుభవంలోకి రానివి నేను చెప్పలేను కానీ మనిషి చేసిన తప్పులకి టెక్నాలజీని విమర్శించడం హాస్యాస్పదం అని చెప్పగలను.

తెలుగు వెబ్ మీడియా said...

హార్డ్ డిస్క్ అయినా హీట్ ఎక్కువైతే కాలిపోతుంది. నావి కూడా రెండు హార్డ్ డిస్క్ లు కాలిపోయాయి. రఫ్ యూసేజ్ వల్ల పాడవ్వని పరికరమనేది ఉండదు. అది ఎలెక్ట్రానిక్స్ లోనైనా డీజిల్ మెకానిజంలోనైనా.

Anonymous said...

పునర్వసూ, మీరు మరీ అమాయకుల్లా ఉన్నారు. సైన్సును నెత్తినెట్టుకుని, మన సనాతన ధర్మాలను హేళన చేసే వీరందరూ ఎడ్యుకేటడ్ అన్న భ్రమలో ఉన్నట్లున్నారు. మీ ప్రశ్నలు వీరికి కనీసం అర్ధం అయి కూడా ఉండవని వాళ్ళ సమాధానాలు చూస్తే మీకే అర్ధమవుతుంది.

తెలుగు వెబ్ మీడియా said...

డీజిల్ ఇంజిన్ లో చక్రాలు, యాక్సిల్స్, లీవర్స్ అరిగిపోయినట్టే కంప్యూటర్ లో హార్డ్ డిస్క్, ప్రోసెసర్ కూలింగ్ ఫాన్, SMPS కూలింగ్ ఫాన్ వగైరా అరిగిపోతాయి. ఆత్మకూరు దగ్గర కూలిపోయిన హెలికాప్టర్ ని యాక్సిల్స్ అరిగిపోయాయో, ఫాన్లు అరిగిపోయాయో తెలియకుండానే టెక్నాలజీలో తప్పు ఉందంటే ఎలా?

పునర్వసు said...

అనుభవంలోకి వచ్చేవి మాత్రమే చెబుతానన్న సారూ, మీరు చవినదేంత, మీ అనుభవమెంత? మీకు తెలిసిన దాని కంటే, తెలుసుకోవల్సినదే ఎక్కువ? చదవనిది, అనుభవంలోకి రానిదంతా, అబద్దం, మోసం అనే భ్రమలో ఉన్నారు.
మీరు వ్రాసినదాన్ని బట్టి, మీకు కంప్యుటర్లో పార్టులు ఏమి పనిచేస్తాయో తెలుసు గాని, ఎలా పనిచేస్తాయో తెలియదు లాగుంది. ఇంకా చదవండి, తెలుసుకోండి. నాకు టెక్నాలజీ అంతా తెలుసు అనుకోవడం ఎంత ఆత్మవిశ్వాసం(అహంభావం). ఇరుసులు, ప్యాన్లు తిరుగుతాయి కాబట్టి అరుగుతాయి, కాని మెమరీ, ప్రాససరు లో కదిలే పార్టులు ఏవి ఉండవు కాబట్టి, సరైన కూలింగ్, వోల్టేజి ఉంటె అవి ఎప్పటికి చెడిపోకూడదు మీ టెక్నాలజీ ప్రకారం. అవునా, కాదా?

తెలుగు వెబ్ మీడియా said...

ప్రోసెసర్ లో డయోడ్స్ కాలిపోతే ప్రోసెసర్ యొక్క టెక్నాలజీ తొక్కలోది అనుకునే మెంటాలిటీ ఉన్నది మీకే కదా. CDకి గీతలు పడినా CD పని చెయ్యాలి, ఫ్లాపీలో ఫిల్మ్ చిరిగిపోయినా ఫ్లాపీ పని చెయ్యాలి అనడం ఎలాంటిదో యాక్సిల్ లేదా లీవర్ అరిగిపోయిన ఇంజిన్ కూడా పని చెయ్యాలనడం అలాంటిదే. రాజశేఖర రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ గత రెండేళ్ళుగా పాడయ్యి ఉంది. దాన్ని రిపైర్ చెయ్యకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళది కాకుండా టెక్నాలజీది తప్పనడం హాస్యాస్పదం కాదా?

తెలుగు వెబ్ మీడియా said...

అబ్రకదబ్ర గారు అన్నారు
>>>>>
ఆ రకంగా ఎవరన్నా చెప్పుంటే .. ఆ చెప్పింది జరిగినా జరక్కపోయినా ముందా జ్యోతిష్యుడు లేచిపోయుండేవాడు.
>>>>>
ఎంత భావవాదులైనా ఇలాంటి విషయాలలో భౌతికవాదం వైపే ఇంక్లైన్ అవుతారు కదా.

Unknown said...

జాతకాలూ గట్రా నమ్మేవాళ్లున్నంతకాలం నమ్మించేవాళ్లుంటూనే వుంటారు...ముందు 'వాళ్లు' కళ్లు తెరవాలి.

Malakpet Rowdy said...

శాస్త్రీయ పరిశీలనకు జ్యొతిస్యం నిలవదు.
___________________________

అబ్బ్బో! మరి తమరు చెప్పిన విషయాలు శాస్త్ర పరిశోధనకి నిలుస్తాయా? అపోలో నిజంగా చంద్రుడిమీదకు చేరిందని ఏ శాస్త్రం నిరూపిస్తుంది?

Malakpet Rowdy said...

పునర్వసూ, మీరు మరీ అమాయకుల్లా ఉన్నారు. సైన్సును నెత్తినెట్టుకుని, మన సనాతన ధర్మాలను హేళన చేసే వీరందరూ ఎడ్యుకేటడ్ అన్న భ్రమలో ఉన్నట్లున్నారు.
___________________________________

The thing is none of these idiots knows the basics of science. This guy Innaiah thinks that he is an expert in science just by reading a couple of translated books meant for 4th grade students

The people who are well versed in science never claim that they are the experts.

Malakpet Rowdy said...

I asked Inniah to prove that the man really landed on Moon - I asked him for Scientific evidence. He has no answer. He believed it becase it appeared in Newspapers, WITHOUT proof.

I aksed the other guy who claims to be a professor to prove two simple things he wrote - even that bugger is silent - he just doesnt have any answers

And these guys talk about HETUVAADAM LOlz ...

తెలుగు వెబ్ మీడియా said...

ఆవు వ్యాసం చెప్పేవాడు టివి గురించి అడిగితే ఆవు, రైలు బండి గురించి అడిగితే ఆవు గురించి చెప్పినట్టు ఇక్కడ కూడా చందమామ గురించి మాట్లాడుతావేం భరద్వాజా?

తెలుగు వెబ్ మీడియా said...

ధరణీ రాయ్ గారు అన్నారు
>>>>>
జాతకాలూ గట్రా నమ్మేవాళ్లున్నంతకాలం నమ్మించేవాళ్లుంటూనే వుంటారు...ముందు 'వాళ్లు' కళ్లు తెరవాలి.
>>>>>
నిజమే. నుదురు చూపించేవాడికే పంగనామం పెట్టగలం కదా.

Malakpet Rowdy said...

మరి దేని గురించి మాట్లాడినా దానికి జ్యోతిషానికి లింకు పెట్టే ఇన్నయ్యలు, తొక్కలో హార్డ్ డీస్క్లు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ళు, సైబర్ కఫేల గురించి పిచ్చి వాగుడు వాగేవాళ్ళకి సన్మాధానం అదే కదా పిచ్చి తుగ్లకూ?

Malakpet Rowdy said...

మరి దేని గురించి మాట్లాడినా దానికి జ్యోతిషానికి లింకు పెట్టే ఇన్నయ్యలు, తొక్కలో హార్డ్ డీస్క్లు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ళు, సైబర్ కఫేల గురించి పిచ్చి వాగుడు వాగేవాళ్ళకి సన్మాధానం అదే కదా పిచ్చి తుగ్లకూ?

Malakpet Rowdy said...

కనీసం ఆవు గురించి కూడ తెలీని, బుర్ర మోకాల్లో ఉన్న దద్దమ్మలకి సమాధానాలు ఇలాగే ఉంటాయి :))

పునర్వసు said...

టెక్నాలజీ తోక్కలోనిది అని నేనలా, టెక్నాలజీ లిమిటేషన్స్ తెలుసుకోమంటున్నాను. తమకు టెక్నాలజీ అంతా తెలుసు అనే భ్రమ లోంచి బయటకు రమ్మంటున్నాను.
మీ మొదటి కామెంటు చూడండి. ఎవరైనా చెబితే బాగుండు, సి మ్ గారు ఎక్కే వారు కారు అని, అంటే హెచ్చరించడానికి జ్యోతిష్యం కావాలా? ఎవరూ ముందు చెప్పలేదు కాబట్టి జ్యోతిష్యం పిట్టకతలా?
జ్యోతిష్యం నమ్మే వాడు నమ్ముతాడు, నమ్మని వాడు నమ్మడు. నమ్మి జాగ్రత్తలు తీసుకుంటే కొంతైనా ఉపయోగం ఉండొచ్చు. నమ్మని వాడు వాడికి తోచిన జాగ్రత్తలు వాడు తీసుకుంటాడు, అదీ మంచిదే. తనకు అంతా తెలుసు అని గర్వపడితే ఏమైనా అవుతుంది.
టెక్నాలజీ, జ్యోతిష్యం దేని లిమిటేషన్స్ దానికి ఉంటాయి. అవి తెలుసుకోమంటున్నాను. బుద్దిని ఉపయోగించి దేనిని ఎంతవరకు వాడుకోవాలో తెలుసుకోమంటున్నాను.

Anonymous said...

మలక్,
ఇంకా క్విక్ గన్ మురుగన్ అలియస్ గన్నయ గారు మీ కామేంట్ల్ చూసి ఖబ్డార్ అంటూ వచ్చెస్తారు. మైండ్ యిట్.

Malakpet Rowdy said...

LOL, Gannaiah is more sensible than Innaiah.

Unknown said...

మొన్న స౦ప్రదాయవాది ఒకాయన ఒక ప౦చా౦గ౦ ములుగు రామలి౦గేశ్వర సిద్ధా౦తి వ్రాసి౦ది చూపి౦చాడు. దానిలో రాజశేఖరరెడ్డి గారి జాతక౦లో అష్టమ శని నడుస్తో౦ది, భద్రతా పరమయిన జాగ్రత్తలు అవసర౦ అని వు౦ది. ఈ స౦వత్సర౦ రాజకీయ ముఖచిత్ర౦ ను౦డి ప్రముఖ నాయకులు కనుమరుగు అని కూడా వు౦ది. నేనే స్వయ౦గా చదివాను. అయితే రాజశేఖరరెడ్డి గారి దుర్మరణ౦ ను ఆపలేక పోయారే౦? ఆయనకు చెప్పినా వినలేదా? మా అన్నయ్య ఇన్నయ్య గారు మూర్ఖ౦గా ఆలోచి౦చి సమయ౦ వృథా చేసుకోవద్దనట౦ తప్పు కాదు. ఋజువు కావాలన్నారు. ఋజువు చెయ్యగలిగితే చెయ్య౦డి లేదా ఊరుకో౦డి. ఋజువు అ౦టే ప౦చా౦గ౦లో వ్రాయట౦ కాదు. శాస్త్రీయ ఋజువు. మా అన్నయ్య ఇన్నయ్య గారు చెప్పే శాస్త్ర ప్రమాణానికి సరి పోవాలి. మా అన్నయ్య ఇన్నయ్య వ్రాసిన అ౦శాలకు ప్రజల౦తా జ్ఞానాన్ని పె౦చుకోవాలని ఆకా౦క్ష. ఒక రామాయణ౦, ఒక భారత౦ చదివో, వినో వీళ్ళకు జ్ఞాన౦ పెరిగితే మరి మా అన్నయ్య ఇన్నయ్య గారి పుస్తకాలు చదివి మరీ ఎ౦తో జ్ఞానవ౦తులు కావచ్చు కదా. పీకేయ౦సిటి, అబ్రకదబ్ర, బోన్గిరి లా౦టి జ్ఞాన బ్లాగర్లు చెప్తున్నా వినకపోతే ఎట్టా? ర౦డి భ్రష్టు పట్టిన ఈ మీ ప్రప౦చాన్ని నా ప్రప౦చ౦ ద్వారా మారుద్దా౦. మా అన్నయ్య ఇన్నయ్య తమ్మయ్య గన్నయ్యను చెపుతున్నా జ్ఞాన౦ కావాల౦డీ..జ్ఞాన౦. అప్పుడు జ్యోతిష్య౦ అవసర౦ లేదు. జ్ఞాన౦ + విజ్ఞాన౦=అన్నయ్య ఇన్నయ్య.

మంచు said...

Gannaiah - you are super.

Unknown said...

గన్నయ్య గారూ
ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి ...వార్తా గిరీష్ సంఘీ మానస చోరుడు ....స్వయంగా రాజశేకర రెడ్డి ఆచూకీ తెలియకుండా పోయినప్పుడు ఆయనకు ఏ ప్రమాదం జరగలేదు, అడవిలో సురక్షితంగా వున్నాడు, తిరిగి వస్తాడు అని భవిష్యవాణి చెప్పాడు.
ఇది టీవీల్లో స్క్రోలింగ్ లో ఎన్నో సార్లు వచ్చింది.
మరి దీనికేమంటారు?
నోటికొచ్చింది వాగేయడం. లక్కీగా అది జరిగితే అంతా తమ గొప్పే అని చాటుకోవడం, జనాలని ఇంకా ఇంకా మోసం చేయడం.
జరగక పొతే వాళ్లకి వచ్చే నష్టం ఏమీ లేదు పిచ్చి జనాలు అట్లాంటివి గురుతుంచు కోరు కదా.
ఈ ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి పూర్వాశ్రమం లో ఒక మిమిక్రీ ఆర్టిస్టు. ఆ ప్రోగ్రాం ల మీదే కనాకష్టం గా బతికే వాడు. తెలుగు దేశానికి ఎన్నికల ప్రచార కాసెట్లు చేసాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ అధికారం లోకి రాగానే ఆర్టీసీలో కండక్టర్ గా చేరి కొంతకాలం పనిచేసాడు.
హఠాత్తుగా జ్యోతిష్య సిద్ధాంతి అవతారం ఎత్తి పంచాగాలు, వారఫలాలు, రాస్తున్నాడు. వాటిని వార్త ప్రచారం చేస్తోంది.
వీళ్ళదే ఉజ్వల భవిష్యత్తు. ఈ రోజుల్లో.

మలక్ పేట్ మెంటల్ said...

గన్నయ్య ఇన్నయ్య తమ్ముడు కాదు, వాడు మా తమ్ముడు. చిన్నప్పుడు చదువు దొంగ. ఇప్పుడు జాతకాలు చెప్పి పొట్ట పోసుకుంటున్నాడు.

Unknown said...

నా ప్రప౦చ౦ సిధ్ధా౦త౦ ప్రకార౦ ఒక సారి పోస్ట్ అయిన తర్వాత నాకు ప్రతిస్ప౦ది౦చవలసిన అవసర౦ లేదనుకున్నాను మా అన్నయ్య ఇన్నయ్య గారి లాగే. అయితే రాజన్న అన్నయ్యను మరొక్క సారి నా ప్రతిస్ప౦దనను చదవమని కోరుతున్నాను. జ్ఞాన౦ పె౦పొ౦దిచుకోమన్నాను కాని ములుగు గారిని సమర్ది౦చానా!? వె౦కన్న అన్నయ్య తమ్ముడు గన్నయ్య నాకూ కలిశాడు. భలే నీ పేరూ నా పేరూ ఒకటే. నువ్వు అన్నయ్య ఇన్నయ్య జ్ఞాన మార్గ౦లో ము౦దుకుపోతున్నావు కదా మరి నాకు వేరే దారి లేదు. మా వె౦కయ్య అన్నయ్య నన్ను సరైన దారిలో పెట్ట లేక పోయాడు ఇప్పుడు వాడు కూడా నా మీదే అధారపడ్డాడు. నేను జాతకాలు చెప్పి వాడికి రోజూ తి౦డి పెడుతున్నాను. చాలామ౦ది లాగే. ఏమి చేస్తా౦, తప్పదు కదా మరి అన్నాడు. అన్నయ్య ఇన్నయ్యను సమర్ధి౦చి గ్నాన మార్గ౦ అదేలే౦డి జ్ఞానాన్ని అలా... అలా.. అలా అన్నమాట.

Malakpet Rowdy said...

Gannaiah,

Whoever you are, YOU ROCK!!!