Wednesday, September 23, 2009
జనాభా పెరిగిపోతున్నది
ఒకప్పుడు జనాభా పెరుగుదల అత్యవసర సమస్యగా పరిగనించారు. ఇందిరా గాంధి కుమారుడు సంజయ్ 1975 ప్రాంతాలలో బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరెషనులు చేయిస్తే పెడ్డ రియాక్షన్ వచ్చింది .ఆ తరువాత ఎవరికి వారు ముక్యంగా రాజకీయ పార్తీలు జనాభా పెరుగుదల వూసెత్తలేదు .
మత పరంగా ముస్లింలు , కేథలిక్కులు జనాభా అదుపు కు వ్యతిరేకులు. హిందువులలో మత రాజకీయ పక్షాలు ముస్లింల బూచి చూపి ,హిందువులు తగ్గి పోతారు గనుక కుటుంబ నియంత్రణ వ్యతిరేకిస్తున్నారు.
జనాభా పెరుగుదల చుట్టూ చాలా సమస్యలు అల్లుక పోయి వున్నాయి .ఆహారం, పిల్లల పోషణ ,కాలుష్యం ,పేదరికం ,తల్లి ఆరోగ్యం ,అన్నీ ఈ సమస్యతో ముడివడి వున్నాయి.
జనంలో మతపరమైన బావాలకు వ్యతిరేకం గా పోతే వోట్లు రావని రాజకీయ పార్తీలు ,కావాలని ఈ సమస్యను దాటి వేయడం చాలా తప్పు. ప్రజలకు నచ్చ చెప్పాలి .పాఠాలలో వివరించాలి .
ఇది భవిష్యత్తును దెబ్బతీసే సమస్య .జాగ్రత్త అవసరం.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
Finally, a sensible post!
http://stalin-mao.net/?p=67
http://stalin-mao.net/?p=72
తొమ్మిది మంది పిల్లల్ని కన్న లాలూ ప్రసాద్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదా మన వాళ్ళు? అనేక మంది స్త్రీలని పెళ్ళి చేసుకుని అనేక మంది సంతానాన్ని కన్న జెమినీ గణేశన్ సంగతి ఏమిటి? పెళ్ళి కూడా లేకుండా అక్రమ సంబంధాలు, అందులోనూ వావివరసలు లేని సంబంధాలు పెట్టుకున్న ఎం.జి.రామచంద్రన్ ల సంగతి ఏమిటి?
ఆడ పిల్లలకి 20 ఏళ్ళు నిండక ముందే పెళ్ళి చేసెయ్యడం, చిన్న వయసులో ప్రెగ్నెన్సీల వల్ల కూడా జనాభా సులభంగా పెరుగుతుంది.
మన దేశానికి, సంస్కృతికీ జనాభా తప్ప వేరే రక్షణ లేదు. ఎంత పెరిగినా మంచిదే. మిషనరీలు మతం మార్చడానికి వీలుపడనంత ఫాస్ట్ రేట్ లో జనాభా పెరగాలి. చైనా లాంటి దేశాలు ఆక్రమించడానికి జంకేటంత జనాభా మనకుండాలి. ఎవరైనా ఆక్రమించినా "మేనేజ్ చెయ్యలేంరా బాబో" అని భయపడేటంత జనాభా మనకుండాలి. మన దేశభాషల్ని బతికించుకోవడానికి అవసరమైనంత జనాభా మనకుండాలి. జనాభా కాదు అసలు సమస్య. ఈ జనాభా ఇందులో సగం కూడా లేని రోజుల్లో - అంటే నా చిన్నప్పుడు కూడా "వామ్మో జనాభా పెరిగిపోతోంది నాయనో" అని ఏడ్చి ముక్కుచీదేవాళ్ళు. ఏమయింది ? ఏమీ కాలేదు. బాగానే ఉన్నాం. అసలు విషయం అది కాదు. వనర్లని కాపాడుకోవడం, అవి అందరికీ తగినంత చేరేలా వ్యవస్థని కట్టుదిట్టం చేయడం - ఇవి ముఖ్యం.
ముస్లింల చేత కూడా ఫామిలీ ప్లానింగ్ చెయ్యిస్తే హిందువుల జనాభా శాతం తగ్గే పరిస్థితి ఉండదు కదా. ముస్లింలకు మినహాయింపు ఇవ్వడం వల్ల సమస్యలు రానే వస్తాయి. అన్ని మతాల వాళ్ళూ ఫామిలీ ప్లానింగ్ చెయ్యించుకోవడం తప్పనిసరి చెయ్యాలి. చైనాలో ఫామిలీ ప్లానింగ్ చెయ్యించుకోకపోతే అరెస్ట్ చేస్తారు. ఇండియాలో కూడా అలాంటి చట్టాలు తేవాలి. గతంలో పెళ్ళి కాని వాళ్ళని కూడా కిడ్నాప్ చేసి ఆపరేషన్లు చెయ్యడం వల్ల సమస్యలు వచ్చాయి. పెళ్ళై ఒకరిద్దరు పిల్లలు పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా ఫామిలీ ప్లానింగ్ చెయ్యించుకునేలా చట్టం చెయ్యాలి.
Post a Comment