Thursday, February 12, 2009

సైకిక్ సర్జరీ భ్రమలు – మోసాలు



Alex Orbito


ఈ ఫొటోలో ఎడమ నుంచి కీ.శే. ఎం. బసవ పున్నారావు, విక్రమ్, ఎన్. ఇన్నయ్య. బల్లమీద పరున్న వ్యక్తి తనకు దోషం ఉన్నదని చెప్పిన మనిషి.






అమెరికాలో మోసాలు చేసి జేమ్స్ రాండీకి పట్టుబడి, గుట్టు బట్టబయలు కాగా పారిపోయిన అలెక్స్ ఆర్బిటో ఫిలిప్పిన్స్ నుండి వచ్చిన సైకిక్ సర్జరీ మాయగాడు. ఆ మధ్య ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు స్టార్ హోటల్లో సంపన్నులకు సైకిక్ సర్జరీ చేశాడు. బి.ఎన్. రెడ్డి, శైలజ (రామోజీరావు కోడలు) ప్రభృతుల సమక్షంలో మీడియా పబ్లిసిటీ ఇవ్వగా, బాగా డబ్బు గుంజి, నయం చేశాననే వార్త వ్యాపింప చేశాడు. అప్పటికే ఇతడి వ్యవహారం తెలిసిన మేము మరునాడే ప్రెస్ క్లబ్బులో ప్రదర్శన పూర్వకంగా అసలు విషయం బయట పెట్టాం. హేతువాద మానవ వాద సంఘం పక్షాన మెజీషియన్ విక్రమ్ తో ప్రెస్ సమక్షంలో ప్రదర్శన చేసి చూపాం. ఈనాడు పత్రిక, టి.వి. ఛానల్స్ బాగా ఈ విషయాన్ని తెలియపరిచాయి. అంతటితో అలెక్స్ అర్బిటో బెంగుళూరు పారిపోగా అక్కడ కూడా మా హేతువాదులు వెంటబడి విషయం వెల్లడించారు. అతడు అరెస్టు కాకుండా తప్పించుకు పోయాడు. భవిష్యత్తులో సైకిక్ సర్జరీ మోసాలకు ఎవరూ లోను కాకూడదని విక్రమ్ ద్వారా తెనాలి మొదలైన చోట్ల ప్రదర్శనలు చేశాం.
ఎలా చేస్తారంటే
ఒక మనిషిని బల్లమీద పడుకోబెడతాం. అతడి పొట్టలోకి ఐదు వేళ్ళు లోనికి గుచ్చుతున్నట్లు చూపిస్తాం. అలా నొక్కినప్పుడు వేళ్ళు ముడిచి ఉంచుతాం. ఒక వేలి గోరులో కృత్రిమంగా దాచిన ఎర్రని రంగు నీరు బయటికి వస్తుంది. అది తుడిచివేయటానికి దూదిని లేదా బట్టను వినియోగిస్తాము. ముందుగానే ఆ బట్టలో ఉన్న పేగు ముక్కలు దాచి ఉంచుతారు. అవి పొట్ట లోంచి తీసినట్లు చూపుతారు. లోన ఉన్న దోషం పోయినట్లు అందరికీ చాటుతారు. నిజమేకాబోలని రోగి భ్రమిస్తాడు. శరీరంలో ఇతర భాగాల్లోంచి ఇలాగే చేస్తాడు. ఈ వైద్యం ఫిలిప్పిన్స్ లో బహుళ ప్రచారంలో ఉన్నది. అమెరికా సంపన్నులు వెళ్లి చికిత్స చేసుకుని తాత్కాలికంగ తగ్గినట్లు భావించి ఇంటికొచ్చి ఆస్పత్రిపాలవుతారు.

4 comments:

krishna rao jallipalli said...

కొడుకుని అక్కడికక్కడే ఇరగాదీయల్సింది. చదువుకొన్నవాళ్ళు, మేధావులు అనబడే వాళ్లు కూడా ఇటువంటి దొంగ లంజాకోడుకులని ఎలా నమ్ముతారో ఒకోసారి అర్థం కాదు. నా కొడుకు అదే అలెక్ష్ నా కొడుకు ఫోటో ఒకటి బ్లాగులో పెట్టండి.

సుజాత వేల్పూరి said...

కృష్ణారావు గారు,
మీకు కోపం వస్తే పట్టలేం సుమా!

krishna rao jallipalli said...

అవునండి సుజాత గారు. మోసం, నేరం, (అది కూడా నిరక్షరాస్యులని) చేసే వారిని ఉతక్కుండా ఉండలేను.

Anil Dasari said...

ఆకలిరాజ్యంలో కమల్‌హసన్ లా చెప్పాలంటే, కృష్ణారావు గారు కవితలు చెప్పటం కంటే రాయటం ఎక్కువ :-)