Monday, February 16, 2009

షిర్డి సాయి గుడి కడితే గిట్టుబాబు


abdul baba marketed as shirdi sai?










Is it real or propagatated by hindu trustees

ఆంధ్రప్రదేశ్ లో షిర్డీ సాయి గుడులు కొన్ని వెలిశాయి. ఇంకొన్ని రాబోతున్నాయి. భక్తులు ఇలా గుడులు కట్టుకుంటూ పోవటం ఇతర రాష్ట్రాలకంటే ఇక్కడ ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం. కొందరు ఈ భక్తిని అమెరికాకు ఎగుమతి చేసి అక్కడా గుడులు కడుతున్నారు. తీరా విచారిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఈ షిర్డీసాయి గుడులపై అజమాయిషీ చేసే అధికారం, లెక్కలు చెప్పమనే అర్హత లేదని తెలిసింది. అలా ఎందుకు, ఎప్పుడు మినహాయింపు ఇచ్చారో, దీనివెనుక ఏఏ శక్తులు పనిచేశాయో తెలియదు. ఇలా కొత్తగా షిర్డీ సాయి గుడి కట్టినవారు ఒక ట్రస్టు ఏర్పరచి, వివిధ రూపాలలో డబ్బు సంపాదించి ఆస్తులు కూడబెట్టి, సాగిపొతున్నా అదేమని అడిగేవారు లేరు. ఆ విధంగా గిట్టుబాటుగా ఆధ్యాత్మిక వ్యాపారం సాగిపోతున్నది. ఇలాగే మరి కొందరు బాబాలకు మినహాయింపులు తెచ్చుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం వీటికి ఎందుకు పనులు వేయరో తెలియదు. వివిధ వస్తువులు తయారు చేసి దేవుడి పేర అమ్మతుంటే వాటిని అమ్మకపు పన్ను నుండి ఎందుకు మినహాయిస్తారో తెలియదు. వ్యాపారానికి దేవుడు పేరు పెట్టగానే బాబా నామ కరణ చేయగానే దాని వెనుక ఏమి జరుగుతున్నా పట్టించుకోకపోవటం, అవినీతికి ఆధ్యాత్మిక ముసుగు కప్పటం, మత విలువగా ఉంటున్నది.
మానవులు గొప్ప సృష్టికర్తలు. అనాదిగా మొదలెట్టి నేటివరకూ సృష్టని కొనసాగిస్తూనే ఉన్నారు. రాను రాను తాము సృష్టించినవి నిజమేనని నమ్మి వాటికే మొక్కుతున్నారు. అలాంటి గొప్ప సంఘటన ఆధునిక కాలంలో జరిగింది.
శాస్త్రీయ పరిశీలనా సంఘం చేసిన కృషి ఫలితంగా వెలుగులోకి వచ్చిన సత్యాలను ఇక్కడ ప్రవేశ పెడుతున్నాం. మహరాష్ట్రలో నానానవతి ప్రభాకర్ ఆధ్వర్యాన ఈ పరిశోధన జరిగింది.
మహారాష్ట్రలో షిర్డీ ఒక మారుమూల గ్రామం. ఒకప్పుడక్కడ బంగారం పనిచేసే వాళ్ళుఎక్కువగా ఉండేవారు. ఆ కుగ్రామానికి 1838 ప్రాంతాలలో ఒక ఫకీరు వచ్చి అక్కడ ఉన్న ఒక దర్గాలో ఉంటుండేవాడు. అతడు తిరుగుతూ, తనలో తను మాట్లాడుకుంటూ రాత్రిళ్ళు వచ్చి అక్కడ పడుకునేవాడు. జనం జాలి తలచి ఆహారం పెట్టేవారు. అతడెవరో, అతడి అసలు పేరేమిటో, తలిదండ్రులెవరో, ఎక్కడ పుట్టాడో రికార్డు లేదు. అతనికి సహాయంగా బయాజాబాయ్ అనే వ్యక్తి ఉండేవాడని గ్రామస్తులు చెప్పుకునేవారు. సూఫీ సూక్తులు ఆసువుగా చెపుతుండేవాడని అన్నారు. 1914 ప్రాంతాలలో నాటి కలెక్టర్ దేశాయ్ అతని ఫొటో తీశాడని కథ అల్లారు. సాయికి తోడుగా సహాయపడుతూ వచ్చిన అబ్దుల్ బాబా అనే అతను అక్కడ ఉంటుండేవాడు. సాయికి చదవటం రాయటం రాదు గనక అతడు మాట్లాడుతూ ఆలాపిస్తూ పోయిన సూఫీ సూక్తులను అబ్దుల్ బాబా కాయితాలపై రాశాడు. అవి ఉర్దూలో, మరాఠీలో ఉన్నాయి. 1917లో సాయి చనిపోయాడన్నారు. ఆ తరువాత క్రమంగా కొందరు తెలివిగల హిందువులు చిన్న కమిటీగా ఏర్పడి, క్రమేణా ట్రస్టు రూపొందించారు. దీనికి మూల సూత్రకారుడు దభోల్కర్, దేశ్ పాండే, సహరాబుధ్ అనే వారు. సాయిని ముస్లిముగా చెబితే జనం వచ్చి ఆరాధించరనీ, వీరు ట్రస్టుగా ఏర్పడి అతడిని హిందూబాబాగా ప్రచారం చేశారు. క్రమేణ చిన్న మందిరంతో ప్రారంభించి విస్తృతపరుస్తూ పోయారు. అంతేగాక సాయి పేరుతో అద్భుతాల జరుగుతన్నట్లు నోటి ప్రచారం చేసి తరువాత రాతలు అమలులోకి తెచ్చారు. సాయిని రకరకాల అవతారాలుగా ప్రచారం చేశారు. జీవిత చరిత్రలు రాసి కట్టు కథల్ని పెట్టుబడిగా వాడుకున్నారు. ఈ అబ్దుల్ బాబా 1950 ప్రాంతాలలో చనిపోయాడు. అతడు బ్రతికుండగా ఈ ట్రస్టీలు అతడి ఫోటో తీసి అదే సాయి ఫోటోగా ప్రచారంలో పెట్టారు. అదే మసీదులో వీరికి సేవలు చేస్తూ కొనసాగిన రసూల్ బాబా ఉండేవాడు. సాయిని గురించి, ఫోటోలు గురించి ఇతర నిజానిజాలను గురించి అడిగితే అతడు నవ్వి ఊరుకునేవాడు. వివాదాలలోకి వెళ్లేవాడు కాదు. కాని సాయి సూఫీ సూక్తులను అట్టిపెట్టాడు. వాటి కాపీ మేము కూడా సేకరించాము. టి.వి. 9 ఛానెల్ ద్వారా హైదరాబాదులో ప్రచారం చేశాం. అయితే అప్పటికే భక్తి ముదిరి, సాయి విషయంలో అబద్ధాలే నిజమై స్థిరపడ్డాయి గనుక వీర భక్తులు సత్యాలను స్వీకరించే స్థితిలో లేరు.
ఆంధ్రపై ఒకప్పుడు పండరీనాథ్ ప్రభావం ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు సాయి పూనకం వచ్చింది. సాయి వ్యాపారం జోరుగా దశదిశలుగా విచ్చలవిడిగా సాగిపోతున్నది. ట్రస్టువారు రెండుచేతులా ఆర్జిస్తుండగా ఒక స్థాయిలో మహరాష్ట్ర ప్రభుత్వం ట్రస్టీలను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. మహరాష్ట్ర శాసన సభలో తీవ్ర చర్చకూడా జరిగింది. ఇప్పుడు సాయి భజన ఎక్కువై ఆదాయం పెరిగి ప్రభుత్వాన్నే ప్రభావితం చేసే స్థాయికి వచ్చింది.
ప్రశ్నించకుండా, పరిశోధించకుండా గుడ్డిగా నమ్మే భక్తులు ఉన్నంత కాలం సాయి వ్యాపారం సాగిపోతుంది. వాళ్లను తానే సాయి అవతారమని పుట్టపర్తి బాబా దక్కించుకోగా, మరికొందరు చిన్న బాబాలు కూడా యథాశక్తి ఈ వ్యాపారంలోకి దిగారు.

24 comments:

bhaskars blog said...

బాగా చెప్పారు. బాబాలను సృష్టించన వాళ్ళము మనమే , మనపైన మనకు ఉన్న అపనమ్మకమే బాబాలాకు పెట్టుబడి. ఏదైనా సాదించాలనుకున్న శక్తి మనలోనే ఉన్నదని చాలా మందికి తెలియదు.

Praveen Mandangi said...

మా కోలనీలో కూడా ఎక్కువ మంది సాయి బాబా భక్తులే, అది కూడా బాగా చదువుకున్న బ్యాంక్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగుల గుంపు. మనం చదివే చదువులు మనలో మూఢ నమ్మకాల్ని మార్చే స్థితిలో లేవు.

--- మార్తాండ

రాత said...

చాల బాగా చెప్పారు
ఆతి భాద కరమయిన విషయం
కూడలి లో ఎక్కువుగా మూఢ నమ్మకాల గురించి , బాబా మహత్తుల గురించి,దేవుని లీల గురుంచి ,
జోతిస్యం , ఆభుత కల్పనల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది . ధీని వల్ల చెడు ఎక్కువగా జరుగుతోంది .
ప్రజలను చైతన్యం కలిగించే రచనలు గాని ,వినోధకరమయిన అంశాలు వ్రాస్తే భాగుంటుంది
ఈ మద్య నా కామెంట్స్ వాటి మీద వ్రాస్తే వారి లో కొంత మంది
నన్ను ఆతి తెలివి వాడినని ఇంక చాల అన్నారు
వారు వారి భావాలను తెలియ చేసినప్పుడు మనం మన భావాలూ తెలియ చేయడం తప్పు లేదు కదా
Questions కి కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పలేరు
కనీసం ఆ mericals కి రుజువులు కూడా లేవు.
ఎక్కడో ఎప్పుడో ఏదో నిజం గా జరిగిందంట.
ఆది మనం నమ్మాలి .....
what a joke.

Praveen Mandangi said...

పెంటయ్యా, పుల్లయ్యా లాంటి పేర్లుగల వ్యక్తులు కూడా ప్రేమానంద, పరమానంద లాంటి పేర్లు పెట్టుకుని, సన్నాసుల మఠాలు పెట్టుకుని హుండీల నిండా చందాలు సంపాదించుకోగలరు, జనం మెదళ్ళలో మూఢ నమ్మకాలు తాండవిస్తున్నంత కాలం.

Anil Dasari said...

షిర్డీ సాయి ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా సత్య సాయి హవానే. జనాలకి తమమీద తమకి నమ్మకం లేకనే ఈ భజనలు, బాబాల మోజులు.

Praveen Mandangi said...

>>ఆతి భాద కరమయిన విషయం
కూడలి లో ఎక్కువుగా మూఢ నమ్మకాల గురించి , బాబా మహత్తుల గురించి,దేవుని లీల గురుంచి ,
జోతిస్యం , ఆభుత కల్పనల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది . ధీని వల్ల చెడు ఎక్కువగా జరుగుతోంది .>>

వాళ్ళకి మత తత్వశాస్త్రాలు తప్ప వేరే తత్వశాస్త్రాలు తెలియవనుకుంటాను. మా ఊరిలో భక్తి రస గ్రంథాలు మార్కెట్ లో చాలా సులభంగా దొరుకుతాయి. ఆరిస్టాటిల్, ప్లాటో వంటి గొప్ప తత్వవేత్తలు వ్రాసిన గ్రంథాలు మాత్రం దొరకవు. నాకు తెలిసి మా ఊర్లో కొత్తగా ప్రారంభమైన విశాలాంధ్ర బ్రాంచిలో తప్ప ఎక్కడా ఆరిస్టాటిల్, ప్లాటో, ఇమ్మాన్యూల్ కాంట్ వంటి వారి తత్వశాస్త్ర గ్రంథాలు దొరకవు.

Kathi Mahesh Kumar said...

తెలుగు బ్లాగు లోకంలో మూఢనమ్మకాలనీ హిందూఅతివాద ధోరణుల్నీ ప్రశంశిస్తారుగానీ, వాటిని ప్రశ్నించేవారిని మాత్రం దేశద్రోహులుగా,తీవ్రవాదులుగా చిత్రీకరించే ధోరణి పెరిగింది. అది చేసేది కొందరే అయినా,మిగిలినవారి మూగఆమోదం పరిస్థితుల్ని మరింత ప్రమాదకరం చేస్తోంది.

http://veeven.wordpress.com/2009/02/16/blogs/#comment-3709

Anonymous said...

@Raata & Maartanda,
I request both of you read below mentioned books written by Narayanamoorti. Hope these books will be useful to you. Maartanda read eastern philosophy also apart from westren philosophy.
1. Atheism by Gora: Translated by Narayanamoorti from Telugu
http://home.pacbell.net/moorty/atheism.pdf
2. Eastern Philosophy prepared in 1987 for my ( Narayanamoorti) students at Monterey Peninsula College.
http://home.pacbell.net/moorty/EasternPhilosophy.pdf
3. The Autobiography of Gudipati Venkatachalam Translated by Narayanamoorti from the original Telugu.
http://home.pacbell.net/moorty/chalam-r.pdf

http://www.well.com/user/jct/
SCIENCE AND U.G.AN EXPOSITION OF THE SCIENTIFIC BASIS OF U.G.'S PHILOSOPHY
By Dr. O. S. Reddy, Centre for Molecular Immunology, Hyderabad.

Praveen Mandangi said...

మహేష్ గారు, నా ఐ.డి. tech@domains2host.net.in నుంచి మీకు మెయిల్ వచ్చి ఉంటుంది. చాలా రోజుల క్రితం తెలుగు వికీపీడియాలో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా వ్రాసినందుకు అందులోంచి నన్ను బ్యాన్ చేశారు. నిజం మాట్లాడకు, పరువు పోతుంది అని వాదించే రకం మనుషులు చాలా మంది ఉన్నారు.

---- మార్తాండ

oremuna said...

marthanada,

can you give me details of those ban in wiki?

Praveen Mandangi said...

59.90.160.86తో సహా చాలా ఐ.పి. అడ్రెస్ లు బ్లాక్ చేశారు. నేను నాకు తెలిసిన సాంకేతికాలు ఉపయోగించి ఐ.పి. అడ్రెస్ లు మార్చినా అవన్నీ బ్లాక్ చేసారు.

---మార్తాండ

oremuna said...

అలా కాదు.

అసలు మీరు ఏమి వ్రాశారు

వారు ఏమి వాదించారు
వంటి వివరాలు కావాలి.

Praveen Mandangi said...

ఆ కథ పూర్తిగా చెప్పే టైమ్ నాకు లేదు. ఆ చాట భారతం ఇక్కడ వ్రాయడానికి ప్లేస్ సరిపోదు కానీ మతానికి సంబంధించిన టాపిక్స్ చదివితే తెలుస్తుంది. హిందూ, ఇస్లాం, క్రైస్తవ ఈ మూడు మతాల గ్రంథాలు, సంస్కృతిలోని అసంగత (పొంతన లేని) కథలు, అంశాలని బయట పెట్టినందుకు నా ఐ.పి.లు బ్లాక్ చేశారు.

Kathi Mahesh Kumar said...

@మార్తాండ: నేను నీకు mail చేస్తున్నాను. అక్కడ మాట్లాడుకుందాం.

oremuna said...

I tried searching, but couldn't get them.

can you give link to atleast two of articles you edited? (not your edits, but articles you edited)

Anonymous said...

ISP Administrator చెప్పిన ఆ ఐపీ అడ్రసును నిషేధించడానికి గల కారణాలను ఇదిగో, ఈపేజీలో చెప్పారు.

oremuna said...

Thanks Chaduvari.

that makes things Transparent.

krishna rao jallipalli said...

ఈ మద్య నా కామెంట్స్ వాటి మీద వ్రాస్తే వారి లో కొంత మంది
నన్ను ఆతి తెలివి వాడినని ఇంక చాల అన్నారు
వారు వారి భావాలను తెలియ చేసినప్పుడు మనం మన భావాలూ తెలియ చేయడం తప్పు లేదు కదా
Questions కి కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పలేరు
...raatha గారూ. నాకు మీలాంటి అనుభవమే చాలా సార్లు ఎదురు అయ్యింది. నా కామెంట్లని ప్రచురించ లేదు మరికొందరు. ఏమి చేస్తాం. ఎవరి బ్లాగులు వారి వారి సొత్తు కదా. వారికి ఆ హక్కు కూడా ఉందని నమ్మే నేను.. ఏకంగా కొన్ని బ్లాగులని బహాస్కరించాను మరి. నేను మాత్రం ఇంత కన్నా ఏమి చేయగలను మరి. వారు నా కామెంట్లని బహాస్కరిస్తే.. నేను మాత్రం ఎలా ఊరుకుంటాను. మనం చేయగలిగింది ఒక్కటే... అటువంటి బ్లాగులకి దూరంగా ఉండడమే. ఈ విషయాలో కూడలి, జల్లెడ చాలా ఉపయోగపడుతాయి. బ్లాగు పేరు, కొంచం subject ప్రచురిస్తారు కదా. అంతే దూరంగా పారిపోవడమే మన వంతు. ఆ బ్లాగులకి వెచ్చించే సమయం వేరే బ్లాగులు (సరదా సరదావి) వెచ్చిస్తే.. మనకీ, మన మనసుకి ఆనందం, సంతోషం. మీరు try చేయండి. all the best.

మాగంటి వంశీ మోహన్ said...

ఇక ఇప్పుడు బాబాల వంతన్నమాట...:)...అబ్దుల్ బాబాను వెలికి తీసినందుకు, మీరు అభినందనీయులు...ఏ మాటకా మాటే...కొన్ని జీవితాలు ఇంతే...కొన్ని తెలుసుకుంటాయి, కొన్ని వాగుతుంటాయి, కొన్ని ప్రశ్నిస్తాయి, కొన్ని తన్నులు తింటాయి, కొన్ని వ్రాస్తాయి, కొన్ని రాయేస్తాయి...

అయినా ఎక్కడ చూసినా ఈమధ్య సబ్జెక్టు ఏట్లోకి, కామెంట్లు తొట్లోకి పోతున్నాయి....ఏమిటో ఈ మాయా, సూఫీ లోనీ సూత ముని మహాశయా...

Praveen Mandangi said...

మధ్యాహ్నం మా టౌనంతా కరెంట్ పోవడం వల్ల రిప్లై ఇవ్వలేదు. నేను మహేష్ గారికి పంపించిన లింకు ఇది. http://telugu-wikipedia-watch.net/caste_proverbs.png

Praveen Mandangi said...

ఇంత చదువు చదువుకున్న వాళ్ళకి కూడా కులగజ్జి, మత పిచ్చి పడితే ఎవరు బాగు చేస్తారు?

krishna rao jallipalli said...

ఇంత చదువు చదువుకున్న వాళ్ళకి కూడా కులగజ్జి, మత పిచ్చి ....వీరికి మాత్రమె ఇవి ఎక్కువుగా ఉండును.

pseudosecular said...

"తీరా విచారిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఈ షిర్డీసాయి గుడులపై అజమాయిషీ చేసే అధికారం, లెక్కలు చెప్పమనే అర్హత లేదని తెలిసింది. అలా ఎందుకు, ఎప్పుడు మినహాయింపు ఇచ్చారో, దీనివెనుక ఏఏ శక్తులు పనిచేశాయో తెలియదు."

It looks like that post author was disappointed to know that షిర్డీసాయి గుడుల are not controlled by Secular (sick) government.

Churches, Masques, and Temples are exempted from taxes all over the world. But it is strange that Hindu Temples are controlled and managed by Secular (sick) government in India.

Ideology drive people crazy. They try to hide it at best. But it is evident for the readers.

Why Hindu temples must be controlled by government? when a minority religious places are exempted (or funded from Hindu Temple's money)?

Shame for not questioning/highlighting this inequality.

Praveen Mandangi said...

"తీరా విచారిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఈ షిర్డీసాయి గుడులపై అజమాయిషీ చేసే అధికారం, లెక్కలు చెప్పమనే అర్హత లేదని తెలిసింది. అలా ఎందుకు, ఎప్పుడు మినహాయింపు ఇచ్చారో, దీనివెనుక ఏఏ శక్తులు పనిచేశాయో తెలియదు."

వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఎక్సెంప్షన్ ప్రివిలెజ్ తెచ్చుకున్నారు. లాయర్లు, జడ్జిలలో కూడా సాయిబాబా భక్తులు ఉన్నారు.