Monday, June 8, 2009

ఎందుకని ? ఆలోచించండి

అదేమిటో గాని ఏ మతంలోనూ స్త్రీలను పురుషులతో సమానంగా చూడలేదు. మానవ హక్కులలో పేర్కొన్న సమానత్వం మతాలలో లేదు. ప్రధాన దేవుళ్ళందరూ మగవాళ్లే. ముఖ్యమైన ప్రవర్తనంతా పురుషులే. క్రైస్తవ పోపులు కేవలం మగరాయుళ్లే. అందరూ సమానం అన్న బౌద్ధంలో సైతం స్త్రీలకు ప్రాధాన్యత లేదు. దక్షిణ అమెరికానుండి చైనా వరకూ, ఆస్ట్రేలియా నుండి కెనడా వరకూ వివిధ దేశాలలో రకరకాల దేవుళ్ళను సృష్టించారు. కొందరు చరిత్రలో కలిసిపోయారు. కొందరు మార్పులకు లోనయ్యారు. మరి కొందరు సంస్కరించబడ్డారు. ఇదంతా పురుషుల పనే గనక స్త్రీలకు ప్రాధాన్యత ద్వితీయ స్థానంలోనే లభించింది. మూల గ్రంథాలలో కూడా రచయితలు పురుషులే గనక స్త్రీలను అగౌరవంగా కొన్నిసార్లు నీచంగా, మరికొన్నిసార్లు బానిసలుగా భావించారు. ఏతావాతా అంతా పురుషమయంగా సాగిపోతున్నది. స్త్రీలు మతాలను వ్యతిరేకించి హక్కులు, సమానత్వం కావాలనటం అంతగా లేదు. నమ్మకాల వలన పురుషాధిక్యతను, మూలగ్రంథాలను, మత విశ్వాసాలను గుడ్డిగా నమ్ముతున్నారు. అదే పిల్లలకు నూరిపోస్తున్నారు. మానవ హక్కులకు మతాలకు వైవిధ్యం వచ్చినప్పుడు మతాలనే స్వీకరిస్తున్నారు. అన్ని దోషాలకూ ఈ పురుషాధిక్యత మూలం అయి కూర్చున్నది.
ఎందుకని ? ఆలోచించండి. మార్గాంతరాలున్నాయా?

8 comments:

హరి దోర్నాల said...

మీరన్నట్టు మొదటి నుండి పురుష దేవతలే లేరు. నాగరికత ప్రాథమిక దశలో ఉన్నప్పుడు స్త్రీ దేవతలకే ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది. మాతృత్వం ఒక పవిత్ర మైన శక్తిగా వారు భావించే వారు. భారత దేశంలో అంబ, ఈజిప్ట్ లో ఐసిస్, రోములో వీనస్ ఇలాంటి వారే. మాత్రు దేవతలకు సంబధించిన లింకు ఇక్కడ చూడండి. పురుషుడు సహజంగా బలాధిక్యు డైనప్పటికి, వారసులను సృష్టిచే శక్తి తనకు లేదని భావించడం వలన స్త్రీ దేవతలను అంగీకరించక తప్ప లేదు.

క్రమంగా నాగరికత పెరిగిన కొద్దీ సృష్టి రహస్యాలు మరింతగా ఆకళింపు చేసుకున్న పురుషులు పునః సృష్టిలో తమ పాత్ర కూడా ఉందని తెలిసిన తర్వాత పితృ స్వామ్య వ్యవస్థ బలంగా వేల్లూను కుంది.సహజంగా పురుష దేవతలు పైచేయి సాధించారు. సహజంగా బలహీనురాలైన స్త్రీ ఆహార సంపాదనలో అందరికన్నా ముందుండే తన ఆదిమ పాత్ర నుంచి, పురుషుడికి సేవకురాలిగా, విలాస వస్తువుగా మారింది.

ఇప్పటికి అనేక మంది విద్యా వంతురాల్లైన యువతులు ఉద్యోగం చేయకుండా భర్త నీడలో బతక డానికి ప్రాధాన్యత నీయడం చూస్తుంటాము. మరికొంత మంది విద్యా వంతులై కూడా ఫ్యాషన్లు, సీరియల్లు మొదలైన వాటితో కాలం వెల్ల బుచ్చడం కూడా వుంది.

కాబట్టి స్త్రీలు సాధికారత సాధించాలంటే పురుషులతో పోటీ పడి ముందు కెల్లడమే మార్గం. ఇప్పటికే చాలా మంది స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. పారిశ్రామికంగా అమేయమైన అభివృద్ధి సాధించిన ప్రస్తుత నేపధ్యంలో ఒకప్పుడు తాము కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి సాధించడం చాలా సులభం.ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగంలో బలం కంటే బుద్ధి కుశలత, ఓపిక ముఖ్య పాత్ర వహించబోతున్నాయి.

హరి దోర్నాల said...

.నేను ఇంతకూ ముందు చెప్పిన లింకులు ఇవిగో
http://en.wikipedia.org/wiki/Mother_goddess
http://en.wikipedia.org/wiki/Isis
http://en.wikipedia.org/wiki/Durga

Malakpet Rowdy said...

Agree with Hari.
-------------------

A curious question though - you seem to be bashing Hindu religion all the time (though you mention the other religions for namesake)

But now, when Hindu religion has more Goddesses than any other religion (The most powerful Goddess is more powerful than Brahma Vishnu and Shankar) and every other Hindu temple in India is the temple of a goddess, you conveniently skip this fact to suit your argument (You only talk specifics about Christianity and Budhism because you find something to bash those religions and then generalize it to all the religions.


I am really amused by the way you try your best to twist the facts but yet fail to impress the readers.

Sorry, I usually read your posts and have a hearty laugh but this time couldnt resist posting this. Do keep writing, I'm enjoying your stuff.

Another question though - you guiys keep asking proofs for everything on earth. CAN YOU PROVE EACH EVERYTHING THAT YOU HAVE MENTIONED ON YOUR BLOG SCIENTIFICALLY - I repeat Scientifically - not some obscure references to the Communist literature/

naprapamcham said...

All Hindu holy books ,Veda, Upanishads, Gita give prime importance to male gods.
It is not the question of mentioning christianity causally nor ignoring islam, and Buddhism. They are major religions in the world with large following. Hence we cannot ignore where as Hinduism by and large confine to one country. The emphasis is on Male dominance which is established.

Malakpet Rowdy said...

Hmmm, Do you mean to say that the Budhdhist population is more than the Hindu population?

And again, you spoke about Vedas and Gita but conveniently ignored the Puranas to suit your argument lol :))

Malakpet Rowdy said...

You spoke about 33% Christians and 6% buddhists but ignored 16% Hindus in the world population!

Malakpet Rowdy said...

Here is the distribution of Hindu population across the world (Top 10), for your kind information.

India 755,135,000
Nepal 18,354,000
Bangladesh 15,995,000
Indonesia 7,259,000
Sri Lanka 2,124,000
Pakistan 1,868,000
Malaysia 1,630,000
USA 1,032,000
South Africa 959,000
Myanmar 893,000

Do you still claim it is by and large confined to one country?

Praveen's talks said...

హిందూ పతివ్రతల కథలు స్త్రీలని ఎలా కించ పరిచే విధంగా ఉన్నాయో చలం గారు "విషాదం" పుస్తకంలో వివరంగానే వ్రాసారు: http://viplavatarangam.net/2009/06/16/32