

పూర్తి పేరు గోపరాజు రామచంద్రరావు.1955లో ఆవుల గోపాలక్రిష్నమూర్తి వద్ద తెనాలిలో పరిచయం. ఆ తరువాత హైదరాబాద్ లో అస్సెంబ్లి ఎదుట చెట్లు పీకి కూరగాయల మొక్కలు నాటే వుద్యమంలో చెంత వున్నాను .మా ఇంటికి తరచు వచేవారు. చొక్కా లేకుండా పంచె కప్పుకొని నిరాడంబర జీవితం గడిపారు. కొన్ని సభలలో కలసి పాల్గొన్నాము .ఆయన సాహసి.నాస్తికుడుగా బ్రహ్మణులచేత వెలికి గురి అయ్యారు. ఒక దళిత వాడలో వుండి ,చెప్పింది చేసి, కులాంతర మతాంతర మానవ వివాహాలను చేయించారు. ఫ్రపంచ పర్యటన చేసి నాస్తిక వుద్యమానికి ప్రచారం చేసారు.నేను అమెరికా యురోప్ లో పర్యటించినప్పుడు గోరా తెలుసా అని అడిగేవారు.మత పరంగా ఆహార నిషేధాలు నిరసిస్తూ, పంది గోవు మాంసాలతో విందు చేసినప్పుడు విజయవాడ లో మతస్తులు ఆందోళన చేసినా ముందుకు సాగారు.గాంధిని కలసినా తన వాదన వినిపించి నాస్తికత్వానికి నిలచిన గోరా చరిత్ర లో గొప్ప వ్యక్తిగా నిలిచారు .1975లో సభలో మాత్లాడుతూ చనిపోయారు
3 comments:
అసెంబ్లీ ఎదుట పూల చెట్లు పీకి కూరగాయ మొక్కలు నాటిన కార్యక్రమంలో మా అన్నయ్య జీవన్ కూడా పాల్గొన్నారు. మా నాన్న నాగం గారు తెలంగాణాలో గోరా గారికి ముఖ్య సహచరుడిగా వుండేవారు. సూర్యాపేట నాస్తిక కేంద్రం ను గోరా గారు తరచుగా సందర్శించేవారు. నాగం గారు మీకేమయినా గుర్తుకువుంటే తెలియజేయండి. నాన్న గారు మరణించి 9 ఏళ్ళు కావస్తోంది.
I know Nagam and we used to meet in some meetings. But Welost contact later.I am glad you came into contact.
నాన్నగారు మీకు పరిచయం వున్నందుకు, మీకు గుర్తుకు వున్నందుకు చాలా సంతోషంగా వుంది. గత సంవత్సరం సి బి రావు గారు చికాగోకి వచ్చి మాతో రెండు రోజులు గడిపారు. మా నాన్నగారి స్మృతులను వారితో పంచుకోగలరని ఆశిస్తున్నాను. మీరు ఈ సారి యు ఎస్ సందర్శనలో షికాగో కానీ దగ్గరి ప్రాంతం లోకి కానీ వస్తే నాకు తెలియజేయగలరు. వీలయినంతవరకు మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తాను.
EmailID: sarathn at hotmail dot com
Post a Comment