Friday, July 31, 2009

Children should be free from religion

Review of Innaiah Narisetti’s Forced into Faith.
How Religion Abuses Children’s Rights?
Prometheus Books, Amherst, NY, 2009, 126 pgs.

‘Children should be brought up without allowing religion to influence them. […] Children should not inherit religion. […] Superstitions should not be taught under any circumstances.’ These quotes summarize the essence of Innaiah Narisetti’s appeal to free children from the bondage of religion imposed by parents and the social community. Imposing religion upon children is child abuse. In his succinct book Narisetti cuts to the heart of a much-neglected problem: the education and upbringing of children. For liberals this is considered mostly to be a private matter and therefore not a topic for moral concern. But this is a grave mistake. Liberalism (and humanism) should take the individual as its core value. No individual has the right to limit the freedom of other individuals. Children are not the property of their parents. Parents have no right to force their children into their faith. Education, and upbringing, should be free from religion. Education can be secular by facilitating compulsory public education (political secularism); upbringing should be secular as well, but the state is limited to enforce this (moral secularism). There should be a widespread consensus that it is immoral to speak of religious children, just as it is immoral to speak of a child as belonging to a political party of ideology. Narisetti highlights evils done in name of religion by examples taken from Christianity, Islam, Judaism, Hinduism and Buddhism. The documentary Jesus Camp also comes to my mind. This documentary is about a summer camp in the US that brainwashes children by instilling a frightful fear of god and Satan using obnoxious propaganda methods. Narisetti’s moral beacon is the Charter of Rights of Children (1989), which is added in total to the text. On paper the rights of children seem to be well protected, but alas, as with so many things, there is a seemingly unbridgeable gap between promises and reality. What is needed is a cultural gestalt switch about children: children are not property, but individuals who have rights, like the right to good (science based) education that includes education about human rights and the equality of women and men, heterosexuals and homosexuals. Religion is a big obstacle for securing the rights of children worldwide. Laws that protect religion, like the First Amendment in the US (especially the Free Exercise Clause: ‘Congress shall make no law respecting an establishment of religion, or prohibiting the free exercise thereof’), are used as an escape for those who violate human and children’s rights claiming that it is their religion. Religion should not be a hide out for injustices and evil. Narisetti doesn’t say it out loud, but it seems that religion should have the status of a personal opinion and a hobby, and not a privileged status that can be used to subject women and children. We all should be much more careful to protect the rights of children and not be put off by the smokescreen of religion. Narisetti remarks drily: ‘We cannot expect religions to condemn themselves. It is like handling our house keys to a thief with a request to stand guard.’ To remain silent about the injustices done to children in the name of religion is immoral.

Floris van den Berg is a philosopher and Co-Executive Director of Center for Inquiry Low Countries. florisvandenberg@dds.nl.

Thursday, July 30, 2009

బలవంతపు దైవ నమ్మిక



Forced into Faith -Innaiah Narisetti

Published in 2009 by Prometheus books, New York 126 Pages

Available at amazon.com

యుక్త వయసు తీరేదాకా పిల్లలకు వోటు హక్కు లేదు. ఒక వయస్సు వచ్చేదాకా వివాహానికి, అప్పు తీసుకోవటానికి పిల్లలు అనర్హులు. ఆలొచన, జీవన విధానాన్ని గతి తిప్పే మతం గురించిన ఆలోచనలు పిల్లలకు మనము ఏ వయస్సులో చెప్పాలి?

దేవుని అస్తిత్వం విషయంలో ఆస్తికులు నాస్తికులు ఎక్కడ విభేదిస్తున్నారు?

అబ్దుల్ కలాం పదవిలో ఉన్న సమయంలో సత్య శాయిబాబా కాళ్లకు మొక్కటం - భారతదేశ ప్రధమ పౌరుడు ఇలా చేయటం సరైనదేనా?

హేతువాది తప్పనిసరిగా నాస్తికుడు కావాలా?

ఇన్నయ్య గారి తో మనోజ్ మిట్టా ముఖాముఖి Times of India లో చూడండి.

http://timesofindia.indiatimes.com/Parents-impose-their-belief-system-on-children/articleshow/4831175.cms

Wednesday, July 29, 2009

ఇండియన్‌ రాడికల్‌ ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్య



ఇండియన్‌ రాడికల్‌ ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్య
(న్యూస్‌టుడే-హైదరాబాద్‌)
ఇండియన్‌ రాడికల్‌ హ్యూమనిస్ట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా నరిశెట్టి ఇన్నయ్య ఎన్నికయ్యారు. ఆదివారం ఢిల్లీలోని గాంధీ పీస్‌ పౌండేషన్‌ సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఛైర్మన్‌గా వినోద్‌జైన్‌, ప్రధాన కార్యదర్శిగా ఇన్నయ్యలను ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు కొనసాగే ఈ పదవులను గతంలో జస్టిస్‌ వి.ఎం.తార్కుండే, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, ఎం.వి.రామ్మూర్తి తదితర తెలుగు ప్రముఖులు నిర్వహించారు.

Tuesday, July 28, 2009

క్రైస్తవులు ఇలా ప్రవర్తిస్తున్నారు!

బైబుల్లో కొత్త నిబంధనలను, పాత బైబుల్ నమ్మె యూదులు ఒప్పుకోరు. ఈ కొత్త నాలుగు సువార్తలకు రచయితలు మాత్యు, మార్క్, లూక్, జాన్ వీరంతా జీసెస్ తరువాత 70 నుండి 100 సంవత్సరాలలోపు రచనలు చేశారు. వీటిలో ముగ్గురికి దగ్గర పోలికలున్నా, జాన్ సువార్త తేడాగా ఉంటుంది. క్రీస్తు బాల్యంపై చరిత్రలో ఆధారాలు లేవు. జీసెస్ పేరిట రాసిన అద్భుతాలు అన్ని కథలే. మార్క్ సూవార్తలో క్రీస్తును శిలువ వేయడం వివరంగా రాయగా, మిగిలినవారు ఆయనను అనుకరించారు. ఇక జీసెస్ చనిపోయి, భూస్థాపితమైన తరువాత తిరిగి లేచి రావటం పెద్ద కథ. క్రీస్తును చివరిదశలో అనుసరించిన మగ్ధలీనా పిచ్చిదని, పూనకం, భ్రమకు ఆమెకు ఉన్నాయని మార్క్ అన్నాడు. కేవలం మాత్యూ మాత్రమే తూర్పు దిశనుండి వివేకులు కాస్పర్, మెకైర్, బాల్తసార్ ప్రస్థావన తెచ్చాడు.
బైబుల్లో పరస్పర విరుద్ధాలు 500 వరకు ఉన్నాయని చరిత్రకారులు జాబితా వేసి చూపారు. మొత్తం మీద క్రీస్తు జీవితం గురించి సమకాలీన చరిత్ర ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం. అయినా భక్తులు నమ్మి అనుసరించటంసరేసరి. క్రీస్తు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆయనకు సంబంధించిన వస్తువులు, సమాధిలో అవశేషాలు, ఆయన శవానికి కప్పిన వస్త్రం, శిలువ వేసినప్పుడు కారిన రక్తం, అది పట్టడానికి వాడిన పాత్ర ఇలాంటివన్నీ లభించినట్లు ఇప్పుడు అనేక చోట్ల పదర్శిస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజం అంటే ఏ ఒక్క ఆధారమూ రుజూవుకు నిలబడటం లేదు. చివరకు మేరీ జుట్టు, మర్దలీనా శరీర అవశేషాలు, పాదాలు క్రీస్తు రక్తపు మరకలు ఇత్యాదులన్నీ వివిధ గుడులలో, వివిధ దేశాలలో చూపి భక్తులను ఆకర్షించి డబ్బు దండుకుంటున్నారు. ఆశ్చర్యమేమంటే క్రీస్తు చనిపోయిన తరువాత ఇవన్నీ వెయ్యి సంవత్సరాలకు యూరప్ లో వివిధ ప్రాంతాల్లో బయటపడ్డట్లు, వ్యూహాత్మకంగా చూపటం పేర్కొనదగింది.
జో నికిల్ ఇలాంటివన్నీ ఎంత బూటకాలో పరిశోధించి భయటపెట్టాడు. చివరకు జీసెస్ క్రైస్ట్ రూపం సైతం వ్యూహా జనితాలని, అతని సమకాలీనులెవరు ఆయన్ను రూపాన్ని వర్నించలేదని పేర్కొన్నారు. కొత్త నిబంధనలు రాసిన నలుగురు ఆయన్ని గురించి వర్నించలేదు.
క్రీస్తుకి గడ్డం, జుట్టు మొదలైనవన్నీ ఉత్తరోత్తర గీసిన చిత్రాలే.

Friday, July 24, 2009

మూఢనమ్మకాలపై స్వారీ చేస్తున్న క్రైస్తవ అధిపతులు

ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో క్రైస్తవ మతస్తులున్నారు. వీరిలో వివిధ శాఖలున్నాయి తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూ పోతున్నారు. ఇందులో కేతలిక్ అధిపతి పోపు నుండి వివిధ శాఖల మఠాధిపతులు, తమ శక్తి యుక్తులను వినియోగించి జనంలోని నమ్మకాలు పోకుండా కాపాడుకుంటున్నారు. నిజం చెప్పటం వారికి హానికరం కనుక అబద్దాలకు తేనే పూసి జాగ్రత్తగా అద్భుతాల పేరిట కట్టుదిట్టంగా మత వ్యాపారం చేస్తున్నారు.
ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు శాస్త్రీయ పరిశీలనా కేంద్రానికి సంబంధించిన మజీషియన్ జో నికిల్ తన పరిశోధనలు, పరిశీలనలు నాతో చెప్పాడు. ఎన్నో ఆశక్తికర వాస్తవాలు వెల్లడించాడు. ఆయన రచనలు కంటకీ యూనివర్సిటీవారు ప్రచురించారు కూడా.
రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయినట్లు చెప్పబడుతున్న క్రీసు అవశేషాలు దొరికినట్లు వాటిని స్వేకరించి వివిధ ప్రాంతాల్లో వివిధ దేవాలయాల్లో అట్టిపెట్టి భక్తులను ఆకర్షిస్తున్నారు. వీటిని సందేహించి ప్రశ్నించినవారిని దగ్గరకు రానివ్వటం లేదు. అలా రానిచ్చిన చోట అవి బోగస్ అని తేలిపోయింది. అందువల్లన జాగ్రత్త వహిస్తున్నారు. ఇలా స్వేకరించిన వాటిలో క్రీస్తునుండి కారిన రక్తం కూడా పాత్రలో పెట్టి పూజిస్తున్నారు. అది ఇప్పటికీ ఇంకా ఎర్రగానే ఉన్నట్లు ప్రదర్శించటం పరాకాష్ట. రక్తం కాసేపటికే రంగు మారి ఊదాగా ఉండి తరువాత నల్లగా అయిపోతుంది. కానీ వీరి పదర్శనలో మాత్రం అది ఇంకా ఎర్రగానే ఉండటం విశేషం. ఇలాంటి అనేక విచిత్ర పద్ధతులు ఈ క్రైస్తవులు చేపట్టి యాత్రా స్థలాలుగా మార్చి భక్తులను ఆకట్టుకుని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవన్నీ వివరంగా స్వేకరించి, వివిధ ప్రాంతాలకు పర్యటించి వాటిని శాస్త్రీయంగా పరిశీలించి జో నికిల్ విషయాలను బయటపెట్టాడు. అవి క్రమంగా వెల్లడిస్తూ పోతాం. క్రీస్తు అవశేషాలే కాక మేరీ మాత, మగ్ధలేనా అవశేషాలు కూడా ఉన్నట్లు చూపుతున్నారు.

Tuesday, July 21, 2009

అసత్యాల పునాదిపై జ్యోతిష్య సౌధం

జ్యోతిష్యఫలాలు పత్రికలో టి.వి.లలో వస్తున్నప్పుడు అవి శాస్త్రీయం కాదని, కేవలం వినోదం మాత్రమేనని ప్రకటించమన్నాం. ఆ మేరకు అమెరికా, యూరోప్, ఇండియాలలో గత 30 ఏళ్లుగా లేఖలు రాస్తున్నాం. విజ్ఞప్తులు చేస్తున్నాం. అమెరికా, యూరోప్ లలో కొన్ని పత్రికలు అంగీకరించి, అలా ప్రకటించాయి. కాని వ్యాపార దృష్టి ప్రధానంగా గలవారు వేయలేకపోవడం, కచ్చితంగా తప్పు. దానిపై పోరాటం చేస్తూనే వున్నాం.

జ్యోతిష్యం రుజువుచేస్తే 5 కోట్లు యిస్తామని ప్రకటించిన జేమ్స్ రాండి మా మానవవాదే. చిర్రుబుర్రులాడే వారెవరూ సాహసించి ముందుకు రాలేదు.

జ్యోతిష్యంలో మూలమైన రాసులు ఊహారూపాలు. ఆకాశంలో నక్షత్ర సముదాయాన్ని పూర్వం చూచి వాటికి పేర్లు పెట్టారు. తుల, కన్య, వృశ్చికం అలా ప్రచారంలోకి వచ్చాయి. అవి నిజంగా లేవు. లేని రాసుల ఆధారంగా రాసి చక్రాలు, జన్మ నక్షత్రాలు అంటూంటే, అవి లేవు, నమ్మెద్దు అంటున్నాం.

నక్షత్రాలు చాలా దూరాన వున్నాయి. వాటిని గురించి జ్యోతిష్యానికి ఏమీ తెలియదు. కాని తెలిసినట్లే రాసేసి, నమ్మించారు. అదొక భ్రమపూరిత వాస్తవంగా నమ్మకస్తులలోనిలిచింది. జ్యోతిష్యంలో తారాబలం యావత్తు అశాస్త్రీయం. ఆధారాలులేనిది, నమ్మరానిది అంటున్నాం.

తారా బలం నుండి చంద్రబలానికి వస్తే, మరీ దారుణం. నక్షత్రానికీ, గ్రహానికీ తేడా తెలియదని స్పష్టపడింది. సూర్యుడిని గ్రహం అన్నారు. చంద్రుడిని గ్రహం అన్నారు. రాహువు, కేతువు కథలు తప్ప వాస్తవ ఉనికిలో లేవు. అయినా వాటిని చేర్చారు.

గ్రహాల ప్రభావం మానవులపై వుందనుకుందాం. కొత్తగా నెప్ట్యూన్, యూరేనస్ కనుగొన్నారు. అవి భారత జ్యోతిష్యంలో లేవుగదా. వాటి ప్రభావం ఏమైనట్టు. ప్లూటో సంగతి సరేసరి. గ్రహాల నుండి మానవులపై ఏమి పడుతుంది. ఆధారాలు చూపగలదేమీ లేదు.

గణితం సరిగా వుందని, గ్రహణాలు మొదలైనవి అంచనా వేయగలుగుతున్నా మంటున్నారు. గణితం అటు సైన్స్ లోనూ, సాంకేతికంలోనూ వాడతారు. కాని వారెవరూ మానవుడిపై జోస్యం చెప్పరు.

భవిష్యత్తు తెలుసుకోవాలని మనుషులకు వున్న బలహీనతల్ని జ్యోతిష్యం బాగా వ్యాపారం చేసింది.

వైజ్ఞానిక పద్ధితలో కొత్తవి కనుగొనడం, తెలియనివి తెలుసుకోనడం, తెలిసింది అందరికీ చెప్పడం ముఖ్య లక్షణం. అలాగే తప్పులు దిద్దుకుంటూ పోవడం కూడా వుంది. జ్యోతిష్యం వంటి మూఢ నమ్మక శాస్త్రాలు పూర్వం రాసిన గ్రంధాలనే ప్రమాణంగా తీసుకుంటాయి. మార్పులు చేస్తే తమ వ్యాపారానికి దెబ్బ అనుకుంటారు.

చిరకాలంగా నమ్మిన వాటిని, ఆచరిస్తున్న వాటిని ప్రశ్నించినప్పుడు కోపం రావడం సహజం. అప్పుడు కొంచెం తమాయించుకుని ఆలోచిస్తే, ఆగ్రహావేశాలకు వివేచన జోడిస్తే ఉపయోగం.

జ్యోతిష్యం భిన్న రూపాల్లో వివిధ దేశాల్లో వున్నది. అది పూర్వకాలం నుండీ వస్తున్న నమ్మకం. అది పొరవిప్పినప్పుడు నిజానిజాలు తెలస్తే, దిద్దుకుంటే, మానవులకు మంచిది.

క్రైస్తవం, ఇస్లాం వాస్తవాలను సహించలేక, మనుషుల్ని హతమార్చాయి. భూమి గుండ్రంగా వుందంటే, సూర్యునిచుట్టూ భూమి, గ్రహాలు తిరుగుతున్నాయంటే, హతమార్చారు. జ్యోతిష్యం తప్పు అంటే తిట్టడం ఆశ్చర్యం కాదు. మార్పుకు సమయం పడుతుంది. మానవులకు తోడ్పడేది వైజ్ఞానిక పంధా. మూఢమత విశ్వాసం కాదు. జ్యోతిష్యం మూడ విశ్వాసమే.

186 మంది సైంటిస్టులు (18 మంది నోబెల్ ప్రైజ్ గ్రహీతలు) జ్యోతిషం అశాస్త్రీయమని ప్రకటించారు.

Saturday, July 18, 2009

సూర్యుడి గురించి తెలిసింది స్వల్పమే

July 22 ,2009 Solar Eclipse
మనకు అతి సమీపంలో వున్న తార సూర్యుడే.ఆ తరువాత దగ్గరగా వున్న తార ప్రాక్షిమ సెంటారి నుండి భూమి మీదకు వెలుగు కిరణాలు రావడానికి 4 ఏళ్ళు పడుతున్నది.ఇక మిగిలిన తారల గురించి తెలిసింది తక్కువ,దూరం ఎక్కువ .
8.2 నిమిషాలలో సూర్యుడినుండి మనకు కిరణాలు వస్తాయి. భూమి పైన వున్న వాతావరణ పొరలు వడకట్టి నందున మనకు చాలా ప్రమాదాలు తప్పుతున్నాయి.
సూరుడు గురించి సైన్స్ క్రమెణా తెలుసుకుంటున్నది .
1991 లో జపాన్ పంపిన యొకొ శాటిలెట్ వలన సూర్య బింబ ఎక్స్ రే తీయగలిగారు .భూమి మీద చూడలేని సూర్య అంశాలు నిమిత్తం 1990 లో యులిసిస్ ,1995 లో పెట్టిన సోహొ ద్వారా చాలా విషయ సేకరణ జరుగుతున్నది.
సూర్య కాంతి సూటిగా చూడరాదుగనుక ,1890 నుండీ స్పెక్ త్రొ హెలియొ గ్రాఫ్ ,1931 నుండి కరొనగ్రాఫ్ ఉపయోగిస్తున్నారు .
మనకు సూర్యుడికీ మధ్య వస్తె చంద్రుడు సూర్య గ్రహణం
అంటారు .
లెక్కలు నిర్దిస్త అంచనాలు సైన్స్ వాడిన ,పిచ్చి జోస్యాలు చెప్పదు .మానవుల బలహీనతల పై జోస్యం వ్యాపారం చేయదు.
ప్రతి సెకండ్ కూ అనంతంగా కిరణాలు భూమిమీద పడుతుండగా పుట్టుక అప్పుడు ఎన్ని పడతాయో చెప్పలేము .అయినా జోస్య వ్యాపారం సాగిపోతున్నది.

Thursday, July 16, 2009

చంద్రుడి గురించి ఎంతో గ్రహించాలి.




చంద్రుడి గురించి


1969 జులై 20 న్ చంద్రుడిపై నిల్ ఆంస్త్రాంగ్ కాలు పెట్టి మానవ జాతికి గర్వకారణమయ్యాడు. అక్కడనుండి రాళ్ళు తేగా జనం చూస్తున్నారు, సైంటిస్టులు పరిశీలిస్తున్నారు .చంద్రుడిపై గాలి లేదు .భూమికి వున్న ఆకర్షణ లేదు .భూమి నుండి మనం ఒక వైపు చంద్రుడినే చూడగలం .ఇప్పుడు సాస్త్రీయ పరికరాల ద్వారా అటువైపు తెలుసుకోగలుగుతున్నాము .చంద్రుడి లొ అయస్కాంతశక్తి లేదు. నీరు లేదు .అక్కడ మన బరువులో 6వ వంతు మాత్రమే వుంటాము . భూమిపై సముద్రాల మీద మాత్రమే చంద్రుడి ప్రభావం వున్నందున ఆటు ఫోటు కలుగుతున్నది .ంఅనుషులపై చంద్రుడి ప్రభావం లేదు. మనం చూసే చంద్రకాంతి సూర్య కిరణాల పరావర్తనమే.384 400 కిలో మీటర్ల దూరాన వున్న చంద్రుడు గ్రహం కాదు .భూమికి ఉప గ్రహం. పూర్వ కాలం నుండీ మనవాళ్ళు చంద్రుడిపై ఎన్నో కథలు అల్లారు ,వింత ఆకారాలు చూశారు. గ్రహణాలప్రభావం అంటూ నేటికీ జనాన్ని మభ్య పెడుతున్నారు .సైన్స్ పొరలు విప్పుతూ చెబుతున్నది .ఇంకా చంద్రుడి గురించి ఎంతో గ్రహించాలి. జ్యొతిష్యం అంతా అరాచకం ,అవివేకం మాత్రమే .

Wednesday, July 15, 2009

పిరమిడ్ మోసాలు





ఈజిప్త్ లో పిరమిడ్ లు రాజులు తమ కోసం నిర్మించిన సమాధులు .కొన్ని వేలమంది కూలీలను వాడి ఎన్నో ఏళ్ళు కట్టించారు.దక్షిణ అమెరికాలో పిరమిడ్లు పండుగ లు జరుపుకునే కట్టడాలు.ఇప్పుడు కొందరు బయలుదేరి పిరమిడ్ల ఆకారాల కింద బ్లేడ్ పెడితే అవి కాస్మిక్ ఎనర్జి తో పదును ఎక్కి శాశ్వతంగా వాడుకో వచ్చునంటున్నారు .మరి కొందరు పిరమిడ్లకు జబ్బులు నయం చేసే గుణం వున్నదని అసత్య ప్రచారం చెస్తున్నారు .ఇవన్ని రుజువులు లేని అబద్దాలు .కాని కొందరు మోసపోతూనే వున్నారు .పిరమిడ్ పధకాలు అమాయకులనుండి ధనం కాజేసే విధానమే. ఇందులో ఒకరితో మొదలుపెట్టి ,10 రూపాయలు వసూలు చేసి, మరొక పదిమందిని అలాగే చేర్పించమంటారు.ఇది అలా సాహి పోతూ వుంటుంది .మొదలు పెట్టినవారికి డబ్బు కమిషన్ చేరుతుంటుంది.ఇది లాటరి పధకం. పిరమిడ్ల పేరిట చెప్పే సైన్స్ మాటలకు అర్థం గాని రుజువులు గాని లేవు. అయినా జనం మోసాలకు గురి అవుతూనే వున్నారు .

Sunday, July 12, 2009

తెలియనప్పుడు

కార్య కారణ జ్ఞానం

ప్రతిదానికీ కారణం వుంటుందని అన్నాది నుండీ జనం తలచారు.అది సరైనదే.కారణం తెలియనప్పుడు శక్తులను వూహించారు.దేవుడు దయ్యం,నరకం స్వర్గం అలా వచ్చాయి .కారణం తెలిసిన తరువాత కూడా నమ్మకాలు అట్టిపెట్టుకుంతే అది మూఢనమ్మకం అన్నమాట.ఇప్పటికీ అధారాలు లేని నమ్మకాలు: ఆత్మ, పునర్జన్మ .ఆలాగే అతీంద్రియ శక్తులు .వీటి చుట్టూ చాలా ఆధ్యాత్మిక వ్యాపారం జోరుగా సాగిపోతున్నది .ప్రశ్నలు వేయడం పిల్లలకు సహజం.కాని కొన్ని ప్రశ్నలు వేస్తే తప్పు అని, కళ్ళు పోతాయని భయపెట్టి నోరు మూయిస్తారు.నేను ఎట్లా పుట్టాను, దేవుడిని ఎవరు పుట్టించారు అని పిల్లలు అడిగితే,తెలియదు , తెలుసు కుని చెబుతాను అనాలి .రుజువు చేయలేనివి చెబితే పిల్లలకు మాఢనమ్మకాలు నూరిపోసినట్లె .మనకు తెలియనివి ప్రక్రితిలో చాలా వున్నాయి. క్రమేణా తెలుసుకుంటూ పోవడమే మంచి పధతి.

Friday, July 10, 2009

రుద్రాక్షలొ కులం!!

రుద్రాక్ష జాబాలోపనిషద్ ప్రకారం

బ్రాహ్మణులు తెల్లనివి,

శూద్రులు నల్లనివి

కొమట్లు ఆకు పచ్చనివి

రాజులు(క్షత్రియులు) ఎర్రనివి

రుద్రాక్షలు ధరిస్తె మంచిదట.

ఇవిగాక రుద్రాక్షలు ధరిస్తే యవ్వనం , ఆర్యోగ్యం గురించి కధలు వున్నాయి.

ఇవన్నీ శిక్షార్హం అవునా కాదా?

Wednesday, July 8, 2009

జోరుగా రుద్రాక్షల దొంగ వ్యాపారం


రుద్రాక్షలు
ధరిస్తే ఆరోగ్యం, సంపద సమకూడుతుందని ప్రచారం చేసి లైసెన్స్ లేని పన్నులు లే ని అబద్దపు వ్యాపారం చేస్తున్నారు.కులరీత్యా ఎవరు ఏ రంగు రుద్రాక్ష ధరించాలో చెబుతున్నారు .ఇదంతా డ్రగ్స్ అండ్ మాజికల్ రెమిడీస్ చట్టం క్రింద శిక్షకు అర్హం . రుద్రాక్షలు చెట్టు కాయలు.హిమాలయ ప్రాంతాలలో, నేపాల్ లో ,ఇండొనీషియా ,హవాయి, జావా, ఆస్త్రేలియ లలో వుంటుంది. నీలి రంగులో ప్రారంభమై ,ఎండుతున్నప్పుడు గొధుమ,ఎరుపు ,నలుపు గా మారుతుంది .పండుతూ ఎండుతూ పోతుంటే చారలు ఏర్పడి ,ముడుచుకపోతూ ముఖాలు ఆకారాలు వస్తాయి .దీనికి పురాణ గాధలు అల్లి, నమ్మే జనంపై మత వ్యాపారం చేస్తున్నారు .21 ముఖ ఆకారాలకు కధలు అల్లారు. జ్యొతిష్యాన్ని ,వాస్తును జోడించారు .టో కుగా ,చిల్లరగా ప్రచారం చేస్తున్న అసత్యాలు అన్నీ శిక్ష కు గురి చేయాలి .ఫ్రభుత్వము నిద్రాణంలో వున్నది .



Tuesday, July 7, 2009

జ్యొతిష్యం కొత్త ఎత్తుగడలు

వ్యాపారంలో ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలు అనుసరించినట్లే జ్యొతిస్యంలో జనాన్ని దో చు కోడానికి వ్యూహాలు పన్నుతుంటారు .2009 జూలై ఆగస్ట్ లో మూడు గ్రహణాలు వస్తున్నయి కనుక పెద్ద ఉపద్రవం రానున్నదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు పుస్తకమే రాసారు .దీనిపై పత్రికలు ,టి.వి లు విపరీతంగా గాధలు ప్రచారం చేస్తున్నయి .మూడో ప్రపంచ యుద్దం రావచ్చు అనేటంతవరకు వెళ్ళారు .లోగడ అలాగె వచ్చినట్లు కథలు అల్లారు .ప్రభుత్వం చేతులు ముడుచుకొని వున్నది. అందులోనే నమ్మకస్తులు వున్నారు గనుక ఇలా జరుగుతున్నది .చట్టాన్ని ప్రయోగించి అబద్దాలు, మోసాలు క్రింద శిక్షలు అమలు పరిస్తే ,జ్యోతిష్యం పేరిట జరుగుతున్న నేరాలకు కొంత అడ్డుకట్ట పదుతుంది .

Saturday, July 4, 2009

భారత దేశంలో ఇదీ పిల్లల విషయం



3 కోట్ల పిల్లలు బడి ఎరుగరు


8వ తరగతి లోపే 54% బడి మానేస్తారు


10వ తరగతి లోపు 80శాతం దళిత పిల్లలు బడిమానేస్తున్నారు


90శాతం ఆదివాసీ బాలికలు 10 తరగతి లోపు బడి ఆపేయడం


5 ఏళ్ళ లోపు పిల్లలలో 50% పోషకాహారం లేనివారే


19 ఏళ్ళ లోపే 25% అమ్మాయిలు వివాహితలౌతున్నారు


వెయ్యి లో 70 మంది పిల్లలు యేడాది లోపే చనిపోతున్నారు .


(ఆధారం ఏడ్యుకేషన్ వరల్డ్ 2009 క్రై మానిఫెస్తో )

Friday, July 3, 2009

తెలుగు విశ్వ విద్యాలయంలో వాస్తు, జ్యోతిష్యం





అశాస్త్రీయమైన వాస్తు మరియు జ్యోతిష్యం శాస్త్రాల పాఠ్యాంశాలను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తొలగించాలని కోరుతూ, ఇన్నయ్య గారి ఆధ్వర్యంలో T.V.రావు, K.V.రెడ్డి, రామబ్రహ్మం ప్రభృతులు ఈ రోజు (July 3, 2009) సాయంత్రం 4 గంటలకు , విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య భూమన్న గారికి ఒక వినతి పత్రాన్ని అందచేశారు. హేతువాదుల అర్జిపై, హైకోర్ట్ వారు ఈ రెండు విషయాల శాస్త్రీయత ను అధ్యయనం చేయటానికి ఒక నిపుణుల సభ ను నియమించమని , నాలుగు సంవత్సరముల క్రితం విశ్వవిద్యాలయానికి సూచించినారు. ఇంత కాలం గడిచినా విశ్వవిద్యాలయం వారు న్యాయస్థానానికి ఎలాంటి బదులు ఇవ్వలేకపోయారు. ఈ పాఠ్యాంశాల శాస్త్రీయతను నిరూపించలేకపొయారు. ఈ విషయాన్నిఆచార్యుల వారి దృష్టికి తెచ్చి, అశాస్త్రీయమైన ఈ పాఠ్యాంశాలను తొలగించవలసినదిగా కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని ఉపకులపతి వారు, పాత్రికేయుల సమక్షంలో, హేతువాద బృందానికి చెప్పారు.