Saturday, July 18, 2009

సూర్యుడి గురించి తెలిసింది స్వల్పమే

July 22 ,2009 Solar Eclipse
మనకు అతి సమీపంలో వున్న తార సూర్యుడే.ఆ తరువాత దగ్గరగా వున్న తార ప్రాక్షిమ సెంటారి నుండి భూమి మీదకు వెలుగు కిరణాలు రావడానికి 4 ఏళ్ళు పడుతున్నది.ఇక మిగిలిన తారల గురించి తెలిసింది తక్కువ,దూరం ఎక్కువ .
8.2 నిమిషాలలో సూర్యుడినుండి మనకు కిరణాలు వస్తాయి. భూమి పైన వున్న వాతావరణ పొరలు వడకట్టి నందున మనకు చాలా ప్రమాదాలు తప్పుతున్నాయి.
సూరుడు గురించి సైన్స్ క్రమెణా తెలుసుకుంటున్నది .
1991 లో జపాన్ పంపిన యొకొ శాటిలెట్ వలన సూర్య బింబ ఎక్స్ రే తీయగలిగారు .భూమి మీద చూడలేని సూర్య అంశాలు నిమిత్తం 1990 లో యులిసిస్ ,1995 లో పెట్టిన సోహొ ద్వారా చాలా విషయ సేకరణ జరుగుతున్నది.
సూర్య కాంతి సూటిగా చూడరాదుగనుక ,1890 నుండీ స్పెక్ త్రొ హెలియొ గ్రాఫ్ ,1931 నుండి కరొనగ్రాఫ్ ఉపయోగిస్తున్నారు .
మనకు సూర్యుడికీ మధ్య వస్తె చంద్రుడు సూర్య గ్రహణం
అంటారు .
లెక్కలు నిర్దిస్త అంచనాలు సైన్స్ వాడిన ,పిచ్చి జోస్యాలు చెప్పదు .మానవుల బలహీనతల పై జోస్యం వ్యాపారం చేయదు.
ప్రతి సెకండ్ కూ అనంతంగా కిరణాలు భూమిమీద పడుతుండగా పుట్టుక అప్పుడు ఎన్ని పడతాయో చెప్పలేము .అయినా జోస్య వ్యాపారం సాగిపోతున్నది.

13 comments:

Venkataramana said...

ఇన్నయ్య గారు,
మీరు ఎవరి దగ్గరైనా మీ జాతక౦ వ్రాయి౦చి చూసుకున్నారా?
ఇలా ఎ౦దుకు అడుగు తున్నాన౦టే, కొ౦త మ౦ది వాళ్ళకు జాతక౦లో చెప్పిన స౦ఘటనలు జరిగాయని చెప్పారు. నేను ఈ మధ్యనే ఒక స౦ఘటన విన్నాను. ఒక 16 ఏళ్ళ అబ్బాయి ఈత నేర్చుకు౦టూ చనిపోయాడు. అబ్బాయి మునిగిపోతున్నప్పుడు అక్కడవున్న వాళ్ళు అతన్ని లాగడానికి వెళ్తే తామను అబ్బాయి గట్టిగా లాగితే తాము కూడా మునిగే అవకాశ౦ ఉ౦దని ఎవరూ కాపాడలేదు. అబ్బాయికి చిన్నప్పుడే జాతక౦ వ్రాయి౦చారు. కానీ సిద్దా౦తి జాతక౦ చూడొద్దన్నాడు. అబ్బాయిది, మార్క౦డేయ జాతక౦ అని మాత్ర౦ చెప్పాడు. అబ్బాయి చనిపోయాక జాతక౦ చూసారు. 16 ఏళ్ళప్పుడు, ఫలానా తిదిన, శుక్రవార౦ రోజు, సాయ౦త్ర౦ నీటి గ౦డ౦ వు౦దని వ్రాసి ఉ౦దట. పురాణాల్లో మార్క౦డేయుడు 16 ఏళ్ళ ఆయుష్షుతో పుట్టాడ౦ట.
ఇ౦త కరెక్టుగా చెప్పడ౦ ఎలా సాధ్యమని నా స౦దేహ౦.

Nadendla said...

జ్యోతిషుడు చెప్పిన పది పాయింట్లలో రెండు మూడు పాయింట్లు అనుకోకుండా నిజమైతే అవే గొప్ప అనుకుంటారు జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు.

Nadendla said...

వీళ్ళకి నిజాలు రుచించవు. నాసా తీసిన ఫొటోలని కూడా ఫాబ్రికేషన్ (మానవ సృష్టి) అన్నారంటే వీళ్ళలో నిజాయితీ ఎంత లోపించిందో అర్థమైపోతుంది.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...

ఇన్నయ గారు,
నేను మీకు గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటుంది అనేదానికి యు.జి. కృష్ణముర్తి గారి ఉదాహరణ చూపాను. మీకు తెలిసే ఉంటుంది యు.జి. గారి గురించి ఆయన మాటాలలో ఎక్కడా దేవుడు అనే పదం కూడా ఉపయొగించరు కదా. అటువంటి వ్యక్తికి మరి పౌర్ణమి, శివరాత్రి రోజులలోనే వారి శరీరం లో అలా మార్పులు ఎందుకు కలిగింది ? గ్రహాల ప్రభావం మనిషి మీద లేదు అని ఎలా చేప్పగలం? నేను చేప్పినది మీరు నమ్మకం కలగక పొతే యు.జి. ని కలసిన వారు, బాగ తెలిసిన వారు చాలామంది ఉన్నారు కదా మీరు వారిని విచారించండి. మీకు అది పెద్ద పనేమి కాదనుకుంటాను ఎందుకంటె మీరు షిర్ది కి వేళ్ళి సాయిబాబ ఫొటొ నిజమా కాదా అని సమాచారం సేకరించి టి.వి.9 లో ప్రసారం చేశారని చదివాను మీ బ్లాగులో. యు.జి. గారి మీద హేతువాదుల అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూన్నాను.

Venkataramana said...

ఇన్నయ్య గారు,
మీరు జాతకాలని నమ్మరని అ౦దరికీ తెలుసు.
మీ ఆవిడ కూడా నమ్మదు అని తెలుసు.
మీ అబ్బాయి రాజు గారు Washington Post మేనేజి౦గ్ ఎడిటర్ అని నేను ఇప్పుడే వికిపీడియాలో చూశాను.
మీ అబ్బాయి రాజు గారు జాతకాలని నమ్ముతారా? నాకు ఈ అనుమాన౦ ఎ౦దుకు వచ్చి౦ద౦టే, కి౦ది లి౦క్ చూడ౦డి.
http://www.washingtonpost.com/wp-srv/artsandliving/horoscopes/index.html
నా ఈ అనుమానాన్ని మీరు నివృత్తి చేయాలి.

Marxist-Leninist-Feminist Revolutionary said...

ఒకవేళ అతను నమ్మారనుకుందాం, తల్లితండ్రులు పిల్లల్ని కనగలరు కానీ వాళ్ళ నమ్మకాల్ని కనలేరు కదా.

Venkataramana said...
This comment has been removed by the author.
Venkataramana said...

ప్రవీణ్,
నేను సూటిగా ఇన్నయ్య గారిని అడిగితే నువ్వు మధ్యలో వస్తావె౦దుకు? ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధాన౦ ఉ౦డదు.
దయచేసి నీ మనోభావాలు వెళ్ళడి౦చడ౦ మానుకో. సమాధాన౦ వున్నప్పుడే చెప్పు.

Malakpet Rowdy said...

Here is the response for the question posed to Raju Narisetti:

Hyderabad, India: Hello Raju,

Everyone in India know that your father, Innaiah does not believe in horoscopes and astrology.

I found a horoscopes column in the Washington Post. Do you believe in horoscopes?

___________________________________


Liz Spayd and Raju Narisetti: I don't. But a newspaper needs to serve a very broad audience and horoscopes are very, very popular among WP's readers.SO WHAT DOES IT MEAN? IF IT FETCHES THEM MONEY THEN THEY WILL DO IT. BUT IF THE ASTROLOGERS DO THE SAME, THEN ITS A CRIME.

AINT THIS HYPOCRICY?


http://www.washingtonpost.com/wp-dyn/content/discussion/2009/07/17/DI2009071702342.htmlవెంకటరమణగారూ,

కొట్టాల్సిన చోట కొట్టి, అడగాల్సిన ప్రశ్న అడిగి వీళ్ళ నోళ్ళు మూయించారు. హేతువాదం పేరుతో వీళ్ళు చేస్తున్న పచ్చిమోసాన్ని అసంకల్పితంగానే బయటపెట్టారు.

Congratulations. I think this man will keep his mouth shut until this issue cools down, or will try to divert the issue.

Venkataramana said...

నాకు ఇన్నయ్య గారు, మరియు రాజు ల్లో ఒక similarity కనిపిస్తు౦ది.
రాజు తన డబ్బు స౦పాదన తగ్గకు౦డా, ఉద్యోగ౦ ఊడకు౦డా ఉ౦డడనికి, మరియు తన అస్థిత్వాన్ని కాపాడుకోవడనికి horoscope predictions ని ప్రచురిస్తున్నాడు.
ఇక, ఇన్నయ్య గారు తన అస్థిత్వాన్ని కాపాడుకోవదానికి horoscopes వ్యతిరేకిస్తున్నారు.
ఇన్నయ్య గారికి వ్యతిరేకిస్తే పోయి౦దేమీ లేదు. రాజుకి నమ్మక౦ లేకపోయినా వ్యతిరేకిస్తే పోయేదు౦ది కాబట్టి ప్రచురిస్తున్నాడు.
మీ అబ్బాయి hypocrite అని అనుకోవచ్చా?
ఇన్నయ్య గారు మీరు గత 3రోజులుగా స్ప౦ది౦చడ౦ లేద౦టే, మీరు ఊళ్ళో లేరని అనుకు౦టున్నాను.
ఇది చూసుకోగానే దీనిపై మీ స్ప౦దనకై చాలా మ౦ది ఎదురు చూస్తున్నారు.

ఇక్కడ రాజు ఇ౦కో విషయ౦ స్పష్ఠ౦ చేసాడు.USA లో కుడా horoscope predictions are very,very popular.
The popularity forced him to print columns in which he doesn't believe.

మనిషి పరిస్థితులు తనకు ఎదురిచ్చినపుడు మొదట తన శక్తి మేరకు పోరాడతాడు. చాలా మ౦ది తమలోని లోపాలను తాము స్వతహాగా తెలుసుకోలేరు. దీనికి కారణాలు విషయ పరిజ్నాన౦ లేకపోవడ౦, మరియు అహ౦తో కూడిన ఆలోచనలు. మానసిక శాస్త్రవేత్తలనడిగితే అహ౦ వల్లే సగ౦ కష్ఠాలు వస్తున్నాయని చెబుతారు. మరియు ఏ మత గ్ర౦ధ౦ని తీసుకున్నా అహ౦ వు౦డకూడదని చెబుతాయి.
మనిషి ఓడిపోయినపుడు వేరొకరి సహాయ౦ కోరతాడు. తనపై తనకు నమ్మక౦ తగ్గుతు౦ది. ఇలా౦టి పరిస్థితుల్లో జాతకాలని ఆశ్రయి౦చడ౦ జరుగుతు౦ది. జాతకాలు తప్పు అని మీరు చెప్పేదానిక౦టే మనుషులకు ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో, తమపై తమకు నమ్మక౦ లేని వాళ్ళలో నమ్మక౦ పె౦పొదిస్తే మీ మానవతా వాద౦ గెలుస్తు౦ది. లేక పోతే మీరిలాగే ఉ౦టారు. జనాలు అలాగే జాతకాలపై ఆధారపడతారు.

Malakpet Rowdy said...

ఇలాంటి విషయాలలో మరో నాస్తికవాది కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి పధ్ధతి చాలా నచ్చుతుంది నాకు. ఆయన చెప్పేవాటితో మనం విభేదించినా ఆయన పధ్ధతి మనకి చిర్రెత్తించదు.

వెంకటరమణగారన్నట్టు జాతకాలు పాతకాలంలో ఎందుకు ప్రసిధ్ధమయ్యాయి - ప్రాచీన ఖగోళశాస్త్రానికీ, జ్యోతిషానికి తేడా ఏమిటి, జ్యోతిషం అనేది ఉజ్జాయింపు లెక్కలేగానీ 100% సత్యం ఎందుకు కాదు, నకిలీ జ్యోతిష్కులు చేసే మోసం ఏమిటి, అప్పట్లో సూర్యుడిని చంద్రుడీని గ్రహాలని ఎందుకు అనుకున్నారు, రాహు, కేతువుల గ్రహస్థానాలేమిటి ... అన్నిటికన్నా ముఖ్యంగా - జ్యోతిషంలో ఉన్న అవకతవకలేమిటి, మనుషులు దానిమీద ఎందుకు ఆధారపడుతున్నారు .. అనే విషయాల జోలికి పోకుండా "చంద్రుడు గ్రహం కాదు, ఆయస్కాంత శక్తిలేదు, కాకరకాయ కూరలో ఉప్పులేదు" లాంటి అసందర్భ ప్రేలాపనలు పేలితే జనాలకి వళ్ళు మండటం ఖాయం.