Saturday, October 18, 2008

అమెరికాలో మోసాలు


Oliver B Roy (left) who signed the certificates







నాకు తెలిసిన మిత్రులు కొందరు ఇండియాలో డాక్టరేట్లు తెచ్చుకున్నారు.
మిసిమి ఎడిటర్ ఆలపాటి రవింద్రనాథ్ కు గౌరవ డాక్టరేట్ వచినప్పుడు సన్మాన సభ జరిగినప్పుడు సినారె రానని నిరాకరించారు. డిగ్రీ సరైనదని రుజువు కావాలన్నారు.
ఆయన్ అనుమానం నిజమే .జరిగిన విషయం ఇది.
అవి అంతర్జాతీయ కాలిఫోర్నియా యూనివర్శిటీనుండి లభించినట్లు అందమైన సర్టిఫికెట్లు ఉన్నాయి. మద్రాసులో Thiagarajan.K of united writers association 75 kamakoti nagar, chennai 600087 phone 4838965) అనే వ్యక్తి ఒక సంఘాన్ని నడుపుతూ కొందరికి వారి వారి కృషి, రచనలు ఆధారంగా ఇలా డిగ్రీలు ఇప్పిస్తున్నట్లు తెలిసి ఆయన్ని కలిశాను. తాను కేవలం మధ్యవర్తిని మాత్రమేనని, విషయమంతా అమెరికాకు పంపిస్తే, వారే నిర్ణయించి డిగ్రి ఇస్తారని చేప్తారు.
ఆలీవర్ బి. రాయ్ సంతకంతో సర్టిఫికెట్లు ఉన్నాయి. నేను అమెరికా వెళ్ళినప్పుడు అతడిని గురించి, ఆ యూనివర్శిటీ గురించి ఆరాతీశాను. అలాంటి యూనివర్శిటీ ఎక్కడా ఉనికిలో లేదని తెలిసింది. అయితే బి. రాయ్ మాత్రం ఉన్నట్లు, ఆయన అడ్రస్ పట్టుకొని వివరాలు సేకరించారు. సిలికన్ వ్యాలి దగ్గరలో ఆయన నివసిస్తున్నారు. నేను స్టాన్ ఫర్ట్ యూనివర్శిటీకి వెళ్ళినప్పుడు ఫోను చేసి నేను పలానా అని, ఆయనను చూడాలనుకుంటున్నాని కోరాను. ఫలానా సమయంలో రమ్మని చెప్పారు. నా మేనల్లుడు చెరుకూరి రాజశేఖర్ అక్కడ హూలేట్ ప్యాకర్డ్ లో పనిచేస్తున్నాడు. అతడిని వెంటపెట్టుకుని రాయ్ ఇంటికి వెళ్ళాము. ఆయన వృద్ధుడు. ఆయన భార్యను పరిచయం చేశాడు. ఆమె రచయిత్రి. మూడు గదుల ఇల్లు, సిమ్మింగ్ ఫూల్ ఉన్నది. అక్కడ కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మధ్యలో ఆయనకు అనుమానం వచ్చి యూనివర్శిటీ గురించి ఆరాతీయటానికి వచ్చావా అని అడిగారు. అవును అని చెప్పి వివరాలు అడిగాను. యూనివర్శిటీ కేంద్రం వాషింగ్ టన్ లో ఉన్నదని అడ్రసు, వ్యక్తిపేరు ఇచ్చాడు. ఫోన్ అడిగితే లేదన్నాడు. యూనివర్శిటీకి ఫోన్ లేకపోవటం ఏమిటనేది ఆశ్చర్యం వేసింది. డిగ్రీలు ఎలా ఇస్తారు. అని అడిగితే, ఆయా వ్యక్తుల కృషిని బట్టీ ఇస్తామన్నారు. ఎంత చార్జి చేసారు అంటే, ఆయన చెప్పిందాన్ని బట్టి 15, 20 వేల రూపాయల మధ్య ఉన్నది. క్లాస్ రూము లు, టీచింగ్ లు ఉంటాయా అంటే లేవన్నాడు. నేపాల్, ఇండియా, శ్రీలంక, మొదలైన చోట్ల తమ ఏజెంట్లు ఉన్నారని చెప్పాడు. హోమియో ఇత్యాది కోర్సులు ఉంటాయన్నాడు. మద్రాసు నుండి వెలువడే హిందూ పత్రికలో తమ యూనిర్శిటీపై విమర్శ వచ్చిందని, ప్రెస్ కటింగ్ చూపాడు. తాను సమాధానం పంపిస్తున్నట్లు చెప్పాడు. మేము ఆయనతో కలసి ఫోటో తీయించుకున్నాము.

తరువాత ఆయన చెప్పిన ప్రకారం వాషింగ్ టన్ రాజధానిలో వెళ్ళి చూస్తే నల్లజాతివారు ఉండే పేద ఇళ్ళ మద్య ఒక అపార్టు మెంటు. అక్కడ ఎవరూ లేరు. ఫోను లేదు. అంతా బోగస్ అని తేలింది.

మరుసటి సంవత్సరం ఆరా తీస్తే ఆలీవర్ రాయ్ మేము వెళ్ళిన అడ్రస్ లో ఉండటం లేదని, ఆ ఫోను కూడా పనిచేయటం లేదని తెలిసింది. భారతదేశంలో మాత్రం చాలా మంది ఆ డిగ్రీలు పెట్టుకొని అవి నిజమేననుకుని డాక్టరేట్లుగా ముద్రవేసుకుంటున్నారు.

రాయ్ అలివర్ అందిచ్చిన సమాచారం ప్రకారం యూనివర్సిటి 1912 లో కాన్ పూర్ లొ మొదలై సిలోన్ మీదుగా అమెరికా చేరుకున్నది.క్రైస్తవ మత ప్రచార సంస్త ఇది.ఇంటి అడ్రస్ నే యూని వర్సిటి అనుకో మన్నారు. కనీ సం ఫో న్ కూడా లే ని సంస్థ .
తెలిస్తే ఆంజనేయులు ( writer and journalist who contributed between you and me column in H ,రవీంద్రనాథ్ లు డిగ్రీలు అవతల పారే సే వారే .మరి కొందరు తెలుగు వారు మోస పోయారని తెలిసింది.

No comments: