
Roy Torcaso with daughter

Notary Roy Torcaso
రాయ్ తార్కాసో
ఇతను 1961లో అత్యంత ప్రాధాన్యతలోకి వచ్చారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరటానికి మతపరమైన ప్రమాణం చేయవలసి ఉంది. రాయ్ తనకు దేవునిమీద నమ్మకం లేదంటూ ఆ ప్రమాణం చేయటానికి నిరాకరించాడు. కాని ఉద్యోగంలో చేర్చుకోకపోతే కోర్టుకు వెళ్ళి పోరాడాడు.నొటరి గా వుద్యోగం లొ చేరడానికి దేవునిపై ప్రమాణం యెందుకు అని సుప్రీం కోర్త్ కు విళ్ళి 1961 లో గెలిచారు మార్కదర్శకత్వం చూపాడు. అతడు 1992లో నేను కలిసేనాటికి మేరిలాండ్ రాష్ట్ర మానవ వాద సంఘ అత్యక్షులుగా ఉన్నారు. ప్రతిమాసం సమావేశాలు జరుగుతుండేవి. వాటికి వెళ్ళిన నేను రాయ్ తో కలిసి మాట్లాడటం అనుభవాలు పంచుకోవటం జరిగింది. క్రమేణా రాయ్ ఒక కొత్త సంఘానికి నాయకత్వం వహించి చురుకుగా కార్యక్రమాలు చేశారు.
అదేమిటో తెలుసా? ఏవరైనా విపరీత శారీరక బాధలతో, రోగాలతో చనిపోదలిస్తే అందుకు ఆ వ్యక్తికిస్వే
చ్చ ఉండాలని, అతడి సంఘానికి లక్ష్యం. దీనిని క్రైస్తవ మతం వ్యతిరేకించింది. ఇంకా వ్యతిరేకిస్తూనే ఉన్నది. దీనిని EUTHNASIA సంఘం అంటారు. హెం లాక్ సొసైటి కి నాయకత్వం వహించి బాధ తట్టుకోలేక ఇక నయం కాదని తెలి సి నప్పుడు చనిపో యే హక్కు వుండాలని వుద్య మించారు
రాయ్ చాలా మెల్లగా సున్నితంగా మాట్లాడేవారు. చక్కగా రాసేవారు. వృధాప్యం వల్లన ఆయన చురుకుదనం తగ్గినా, మానసికంగా హుషారుగానే ఉండేవారు. 2007 జూన్ 9
లో రాయ్ టార్కాసో చనిపోయారు. అప్పటివరకు ఆయన్ను కలసి మాట్లాడే అవకాశం లభించడం నా అనుభవంలో ఒకటి.
No comments:
Post a Comment