Wednesday, October 8, 2008
Experiences in USA continued-అమెరికా నాస్తిక నాయకులతో
Madalyn O hair Murray
నేను మొదటిసారి 1992లో అమెరికా వెళ్లినప్పుడు మడల్యా ఓ హేర్ తో ఫోన్ లో మాట్లాడాను. ఆమె టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ లో ఉండేది. అప్పటికే వృద్ధురాలు. భారత దేశంలో పర్యటించినప్పుడు విజయవాడ, హైదరాబాదు సభలలో పాల్గొన్నది. ఫోనులో చాలాసార్లు చాలాసేపు మాట్లాడాను. ఆస్టిన్ ఆహ్వానించినా నేను వెళ్ళలేకపోయాను. ఎందుకోగాని విజయవాడ నాస్తిక కేంద్రానికి చెందిన లవణం పట్ల వ్యతిరేకత చూపింది. అమెరికా నాస్తికులలో ఆమె తీవ్రవాది. రేడియో, టి.వి. ఛానల్స్ ద్వారా నాస్తిక ప్రచారం ఉధృతంగా చేసింది. పుస్తకాలు, వ్యాసాలు ప్రచురించింది. ఆమె తీవ్ర ధోరణికి తట్టుకోలేక కొందరు చీలిపోయి వేరే సంఘం పెట్టుకున్నారు.
1960 ప్రాంతాలలోనే మడల్యా ఓహెర్ పోరాడి పాఠశాలలలో మత విద్య బోధించరాదని పట్టుబట్టి సుప్రీం కోర్టు ద్వారా గెలిచింది. మేరీలాండ్ రాష్ట్రం నుండి వెళ్లి ఆస్టిన్ లో స్థిరపడింది. అమెరికా పర్యటనలో మరోసారి ఆమెను కలుసుకోవాలను కుంటుండగా హత్యకు గురైంది. ఆమెదగ్గర పనిచేసే వారే డబ్బు కోసం అలా చేశారని తరవాత బయటపడింది.
నాస్తిక ఉద్యమ కేంద్రం ఆస్టిన్ నుండి న్యూజెర్సీకి మారింది. శ్రీమతి ఎలెన్ జాన్సన్ అధ్యక్షురాలుగా నాయకత్వం వహించింది. ఆమెకు మద్దతుగా రాల్ బేరియర్ స్పోక్స్ పర్సన్ గా ఉండేవాడు. వారికి స్ట్రాటన్ ఐలెండ్ లో స్టూడియో ఉండేది. అది న్యూయార్క్ న్యూజెర్సీ మధ్య ఉన్నది. 1998 December 13 లో వారు సుదీర్ఘమైన ఇంటర్వ్యూ నాతో చేశారు. అది అమెరికాలో ప్రసారం అయింది. మదర్ థెరిసా నుండి ఇండియాలో నాస్తిక ఉద్యమాల రీతులను ఆ ఇంటర్వ్యూలో వివరించాము. మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర ఫోటోలు తీశారు. అమెరికన్ ఎథియిస్ట్ మాగజైన్ లో నా వ్యాసాలు ప్రచురించారు. ఫ్రాంక్ జెండ్లర్ (కొలంబస్) ఎడిటర్ గా ఉన్నారు. ఆయన ఇండియా వచ్చి నాస్తిక కేంద్రంలో ప్రసంగించినప్పుడు మేము కలసి ఉన్నాము (2003). వాషింగ్టన్ లో జరిగిన నాస్తిక సభలలో, పార్లమెంట్ ఎదుట జరిగిన రాలీలో సుప్రీంకోర్టు దగ్గర ప్రదర్శనలో నేను పాల్గొనగలిగాను. చాలామంది అమెరికన్ నాస్తికులు సన్నిహితులయ్యారు. అప్పుడే రీటా స్వాన్ (చిన్నపిల్లల సమస్యల నిపుణురాలు)ను కలిశాను.
Ellen Johnson president of American Athiest Association(center), Ron Barrier with Innaiah in Studio
అమెరికాలో మరొక ప్రముఖ నాస్తిక సంఘానికి మార్గరెట్ డౌనీ నాయకత్వం వహిస్తున్నారు. శాస్త్రీయ పరిశీలనా కేంద్ర ప్రారంభోత్సవం వాషింగ్టన్ లో 2006లో జరిగినప్పుడు ఆమెను కలిశాను. చేతి పర్సులో గోరా ఫోటో పెట్టుకొన్నది. లవణం తనకు తెలుసని చెప్పింది. 2007 సెప్టెంబరులో వాషింగ్టన్ లో జరిగిన నాస్తిక సభలకు నన్నాహ్వానించింది.
Margaret Downey
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment