

వారెన్ ఎలెన్ స్మిత్
నేను అమెరికాలో కలసిన చాలా ఆసక్తి కరమైన వ్యక్తులలో వారెన్ పేర్కొనదగినవారు. ఆయన ఫోటో స్టూడియో న్యూయార్క్ లో నడిపారు. పెళ్ళి చేసుకోలేదు. నేను కలిసే నాటికే బాగా వృద్ధుడు. సింగిల్ రూమ్ లో ఉంటూ పరిశోధనలు చేస్తూ వ్యాసాలు రాస్తూ, ఆనంద దాయకంగా జీవితం గడుపు తున్నారు. నేను అమెరికాలో న్యూయార్క్ వచ్చిన సందర్భంగా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఉంటున్న అపార్ట్ మెంట్ టెరేస్ మీద సాయంకాలం ఆహ్లాదకరమైన మిత్రుల సన్నివేశం అది. నాతో పాటు మిత్రులు ఆరమళ్ళ పూర్ణచంద్ర, నా భార్య కోమల కూడా ఉన్నారు. అతను భారత నాస్తిక, మానవ వాద వ్యక్తులతో గల సంబంధాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఎలెన్ రాయ్ రాసిన ఉత్తరాన్ని చూపారు. గోరాతో పరిచయం ఉందన్నారు.
ఎలెన్ స్మిత్ హాస్యంగా మాట్లాడతారు, రాస్తారు. ఆయన సంకల్పించి, ప్రచురించిన ఒక బృహత్తర గ్రంథం Who is who in hell అనేది పేర్కొనదగినది.
మత నమ్మకాలు లెని వారు నరకానికి పోతారని అంటారు.దానిపై వ్యంగ్యంగా నాటి నుండి నే టి వరకు ఎవరు నరకం లొ వున్నారో జాబితా ఇస్తూ పెద్ద పుస్తకం ప్రచురించారు నా పే రు కూ డా రాసారు .
అందులో భారతదేశాన్ని గురించి ఆయన కొరికపై నేను వ్యాసాలు వ్రాశాను. అతను తస్లిమా నస్రిన్ ను ఆదుకొని, ఆదరించి, సహాయపడిన వ్యక్తి. ఆమె విషయమై వెబ్ సైట్ నిర్వహించారు. ఆమెను ఆహ్వానించి ఒక హోటల్ లో విందు చేసినప్పుడు నేను పాల్గొన్నాను.
వాషింగ్టన్ లో 2006లో నాస్తికుల సభ, ఊరేగింపు పార్లమెంట్ ఎదురుగా జరిగింది. అందులో ఎలెన్ స్మిత్, నేను కలసి పాల్గొన్నాము. నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటున్నాము. నేను రాసే నాటికి ఆయన 80వ పడిలో ఉన్నారు.
See his fascinating website: http://wasm.us
No comments:
Post a Comment