Friday, December 26, 2008
క్రైస్తవం ఇంత అమానుషమా?
Innaiah with Sam Harris in USA
Book Release function
{L to R}Vikram,Mr Isanaka Muralidhar, Innaiah, Mrs Chandana Chakravarty, Ravi Prakash,CEO TV9,
Mr C.Narasimharao. in press club, Hyderabad, India
శాం హారిస్ రాసిన 'A Letter to Christian Nation" అనే పుస్తకాన్ని క్రైస్తవం ఇంత అమానుషమా? అనే పేరుతో తెలుగీకరించారు.
మతం మానవాళికి మత్తుమందన్నాడు కార్ల్ మార్క్స్. ఎవరికి వారు తమ మతం గొప్పదంటే తమ మతం గొప్పదంటూ యుద్ధాలు సృష్టిస్తున్నారు; మూఢనమ్మకాలకు తమ వంతు చేయూతనిస్తున్నారు.
ఈ భూమిపై జరిగే ప్రతి పనీ, దేవుని అనుజ్ఞతోనే జరుగుతుందని క్రిష్టియన్ల విశ్వాసం. 2004 సునామిలో కొన్ని వేల మంది పిల్లలు తల్లి తండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. తమిళ్‌నాడు లోని వెళ్లంకన్ని మేరి మాత చర్చ్ కు, క్రిస్ట్మస్ పర్వదినాన వెళ్లిన భక్తులు, ఆ మరుసటి దినం వుదయాన చర్చ్ పక్కనే గల బీచ్ లో వాహ్యాళి కెళ్లిన సందర్భంలో, సునామి వాత పడి సుమారు 2000 మంది చనిపోయారు;120 వ్యాపార అంగళ్లు కొట్టుకు పోయాయి. చర్చ్ కు ఏమి కాలేదు. ఆసియ ఖండంలో సునామి దెబ్బకు ఎంతో మంది అనాధలయ్యారు. దేవుడే వుంటే ఇలాంటి అరాజకపు పని జరగనిస్తాడా?
ఏసు దయామయుడని క్రిస్టియన్ల విశ్వాసం. బైబుల్ లో పరమత సహనం: దేవుని యందు విశ్వాసం లేని వారిని చిత్రహింస చెయ్యాలని (సెయింట్ ఆగస్టీన్), చంపెయ్యాలని(అక్వినాస్) చెప్పారు.బైబుల్ బానిసత్వాన్ని, జంతుబలిని ప్రోత్సహిస్తుంది.ఆఫ్రికా ఖండం ఎయిడ్స్ తో సతమతమౌతుంటే, సహారా ఎడారి ప్రాంతంలో కండోం లు వాడవద్దన్న క్రైస్తవుల ప్రచారంతో, ఎయిడ్స్ అక్కడ ఒక పెద్ద సామాజిక సమస్యై కూర్చుంది. క్రిస్టియానిటి గర్భస్రావాన్ని అనుమతించక పోవటం తో , పెళ్లి కాని తల్లులు, పెక్కు సమస్యలు, కొన్ని దేశాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది.బైబుల్ లో పరస్పర విరూద్ధాంశాలు చాల ఉన్నాయి. ఆ వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
బైబుల్ దేవవాక్కయితే, ఇందు లో గణితానికి సంబంధించి తప్పులెలా వుంటాయి? బైబుల్ సర్వస్వం కాదు.వైజ్ఞానిక విషయాలను చెప్పటంలో విఫలమయ్యింది. ఉదాహరణకు విద్యుత్, జీవాణువు (DNA), విశ్వ పరిమాణం, విశ్వ వయస్సు ఇంకా కాన్సర్ చికిత్స గురించి బైబుల్ చెప్పలేదు. ఈ విశాల జగత్తులో బాల్య మరణాలు అధికం. బాప్టిజం పుచ్చుకోకుండా చనిపోతున్న ఈ బాలలంతా, శాశ్వతంగా నరకంలో వుండి పోతారని,సెయింట్ ఆగస్టీన్ బాష్యం చెప్పారు.క్రైస్తవంలో,అనంత విస్ఫోటనాన్ని (Big Bang theory) అంగీకరించక, అంతా దేవుడి తెలివైన నమూనా (Intelligent Design) అని నమ్మి, ఆ సిద్ధాంత ప్రచారానికై, అశాస్త్రీయ పాఠ్య పుస్తకాలను పిల్లలపై రుద్దుతున్నారు.
మత సంఘర్షణలు: కాథొలిక్స్కు, ప్రొటెస్టంట్లకు పడదు.సున్నీ, షియాలకు పడదు.శైవులకూ, వైష్ణవులకూ పడదు. వీరంతా ఒకే మతంలో వుంటూ, ఆ మతానికి పరస్పర విరుద్ధ భాష్యాలు చెపుతూ కలహించు కొంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా భిన్న మతస్తులు పరస్పరం యుద్ధాలు చేసుకొంటున్నారు.
1775 లో అమెరికా లో బానిసత్వాన్ని తొలగించాలని కొందరు వాదిస్తే, అలా వాదించే వారు తమ సమయాన్ని వృధా చేసుకొంటున్నారని తలిచారు. ఈ మతం వలన మానవాళికి ఒరిగిందేమిటి? పరస్పర యుద్ధాలు, మనిషిని అంధ విశ్వాసాల లోకి నెట్టి వేయటం తప్ప. విద్య,శాస్త్రీయ దృక్పధం,హేతువాదం పెంపొందిన నాడు , దేవుడనే ఇప్పటి ప్రజల విశ్వాసం చూసి, భవిష్య మానవుడు నవ్వుకుంటాడు.
ఈ పుస్తకాన్ని e-book గా ఇస్తున్నాము.
http://www.esnips.com/doc/fb11c928-9223-4e15-9b84-80836c12e26e/Christianity-by-Sam
Subscribe to:
Post Comments (Atom)
13 comments:
Thank you for bringing such a wonderful review on "A Letter to Christian Nation".
మతం మారణహోమాలకీ, రాజకీయ ఉపయోగాలకేతప్ప మానవకళ్యాణానికి ఉపయోగపడ్డ instances చాలా తక్కువ. క్రైస్తవానికైనా,ఇస్లాంకైనా,హిందూమతానికైనా ఇదే వర్తిస్తుంది. వాటి మూలాల్లో తేడావున్నా ఉపయోగంలో మాత్రం అన్నీ ఒకదానికొకటి ధీటే!
చాలా మంచి పుస్తకమును అందించారు. మహేష్ గారు చెపినట్లు గా " మతం మానవకళ్యాణానికి ఉపయోగపడ్డ సందర్భాలు చాలా తక్కువ" అని అన్నారు. ఇలా ఉపయొగ పడని మతముల లో కి కొంత మందిని అయినా మారడమును నిరొధించ డములో మీ పుస్తకము వుపయొగ పడుతుందని ఆశిస్తూ... మరొక సారి ధన్యవాదముల తో.
పుస్తకంలో అచ్చుతప్పులు చాలా వున్నాయి.
తప్పులు తప్పుడు సాంకేతికాన్నిస్తాయి కదా!
పుస్తకంలో అచ్చుతప్పులు చాలా వున్నాయి.
తప్పులు తప్పుడు సాంకేతికాన్ని, సంకేతాల్నిస్తాయి కదా!
నరిశెట్టి ఇన్నయ్య గారు,
Excellent review. Keep up the good work. Also bring such review on Hinduism.
There is one fundamental difference between "Natural Religions" (Asiatic) and "Historical Religions" like Christianity and Islam.
The plurality and tolerence were inbuilt in Asiatic Traditions. It is true that some one can find several faults with such systems.
Where as "Historical Religions" (Christianity and Islam) identity and survival is dependent on "that" supposed historical event. That is the reason why they allways thump those books and say, it is written in our book(s),
1) so all of other Religions,
2) Lifestyles,
3) Traditions,
4) Cultures,
5) Languages,
6) Gods,
7) Goddesses,
8) Sacred Books,
9) Sacred Places
are false, hence we have the right to soul harvest "you" (Pagans, Heathens and Kafirs). You either convert or die.
This constant conflict brought death and destruction to humanity ever since those Historical Religions sprang some time around 2000 years ago.
When Christians win over Whites in Europe the very first thing they did was banning other religions in Roman Empire, burnig sacred books, destroying Temples, destroying Libraries (e.g. Library at Alexandria, the wold famous Library built by the Great Alexander). Similarly when Muslims came to India, they did the same thing to Hindus. For example when Bhaktiyaar Khillji invaded Bihar, he slaughtered thousands of learned Professors, Students and burned thousands of great literay books (Basic Sciences, Mathematics, Astronomy, Religion, Culture, Economics, etc). We are talking about the Great Library at Nalanda. This Library burning and destroying of Universities brought "Dark Ages" in India.
The ultimate goal of any Religion should be "Live and Let Live, even though we differ on ideologies and practices".
"Religion is the opium of the people". - Carl Marx
Why Marx was vilified by West?
This is one side of the view. It is not the final view. Sam Harris, Dawkins, Dennett, Hitchens are presenting only the negative aspects of the picture. It is very lame way of putting and may result in to bad consequences. They are just omitting the big role played by the religion in shaping human society(often comes with a price like any other system). Please refrain from labelling the whole religion as "Bad", which "innahiah" stated in one of his previous commnets. These works are presented in unreviewed books not peer reviewed by scholar community, none of these works are properly presented in a descent journal. Neither Sam or Dawkins were able to make it to any scientific journal with these views as I am aware of if you know please inform me. They are opinions of a single or group of persons with similar views talking is some meetings and wrting some personal unreviewed books. It is useless naive propaganda and does more damage.
Please read a scientific and well reviewed work by Jonathan Haidt(well reviewed in Science journal vol 316 18th may 2007 page 998) and other before pushing such centric view. Here I would also refer to an article in science "The Origin and Evolution of Religious Prosocilaity" by Ara Norenzayan etal., in SCIENCE journal volume 322 3 october 2008 page 58.
I agree there are some bad things happened but just using that alone to label the whole religion is irrational, denial and ignorance.
my sincere apology for the printing mistakes.Will take care to amend infuture
http://blogchalo-blogchalo.blogspot.com/
Mr. అరుణం: Very well said. Please write more to educate people.
Proper education and awareness are the tools that cut trash out of these cults. These intolerant western ideologies must give way to humanity in this 21st century.
People of the World suffered immensely for patronizing such intolerant ideologies so long.
Two world wars, Slavery and Colonization was imposed on poor and illiterate people all over the world, due to their intolerant world view.
"మతం,సైన్స్ మానవ జాతి పురోభివృద్ధికి రెండు కళ్లు"
-అల్బర్త్ ఐన్ స్టీన్
నాస్తికత సైన్స్ కి తెలియని దాన్ని నమ్మదు.అంటే భూమి గుండ్రంగా ఉందని 1500a.d. లో నాస్తికులు నమ్మలేదు.మనం అనుభవించే కాలం కాక వేర్వేరు కాలాలు ఉన్నాయన్న వాణ్ణి ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కన్నా ముందే చెప్పిన వాణ్ణి కూడా పిచ్చి వాడని నాస్తికులు అనుకుని ఉంటారు.అలాగే దేవుడున్నాడు అన్నవాళ్లని పిచ్చివాళ్లంటున్నారు ఇప్పటి నాస్తికులు.
ఇంతకీ 1500a.d. ముందు భూమి గుండ్రంగా లేదా....?
ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ అవినీతి, అక్రమాలు, అధర్మం, కుళ్లు, కుతంత్రాలు విపరీతమైన స్థాయిలో వర్ధిల్లుతుంటాయి. ఎన్ని పాపాలు చేసినా వాడు వెనకేసుకుని వస్తాడు కదా! ఈ దేశంలో ప్రతి గుడి నిర్మాణం వెనుకా రాజకీయనాయకుల డబ్బు ఉంటుంది. కనిపించని దేవుడి కొసం కోట్లు ఖర్చుపెట్టేవారు ఎదుటి మనిషికి పది రూపాయలు సహాయం చెయక పొవడం అసలైన విషాదం. మానవ పరిణామ క్రమంలో దేవుడు అనే వాడికి బదులు మానవత్వం అనే కాన్సెప్ట్ ఉండి ఉంటే ఈ ప్రపంచం ఎంత గొప్పగా ఉండేదో మరి !!
Post a Comment