Friday, June 5, 2009

వాస్తు నేరాలు

ఇటీవల అంటువ్యాధిలా వాస్తు ప్రబలింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో అతిగా ఉన్నదని అభిప్రాయం ఏర్పడింది. అమెరికాలో ఉన్న ఆంధ్రులకు కూడా ఇది ప్రస్తుతం అంటుకున్నది.
వాస్తులో వాస్తవం లేదని, శాస్త్రీయ (సైంటిఫిక్) పరిశీలనకు అది నిలవడం లేదని చూపినా నమ్మకమే గట్టిగా అమలు అవుతున్నది. ప్రజలలో ఉన్న ఈ నమ్మకాన్ని పట్టుకొని వాస్తు వ్యాపారులు గృహాలలోనూ, పరిశ్రమలలోనూ దీనిని అమలు పరుస్తున్నారు. పత్రికలూ, టి.వి.లు కూడా తమ గిట్టుబాటు ధోరణిలో వాస్తుకు ప్రోత్సాహం పలుకుతున్నాయి.
హైదరాబాదులో నెలకొన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యంతో పాటు వాస్తు కూడా బోధిస్తున్నారు. దీనికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులను సమకూరుస్తున్నది. యూనివర్సిటీ ఇలా అశాస్త్రీయ అంశాలను విద్యార్థులకు చెప్పడం ద్రోహం అని, దీనిని తొలగించాలనీ, శాస్త్రీయం అని రుజువు అయేవరకూ కొనసాగించరాదనీ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో మేము దాఖలు చేసిన రిట్ పిటిషన్ అడ్మిట్ అయింది. యూనివర్సిటీ వారికి నోటీసులు ఇచ్చి రెండేళ్ళయినా ఇంతవరకూ సమాధానం చెప్పలేదంటే వారి లోపాన్ని, మెతకదనాన్ని గ్రహించవచ్చు.
వాస్తులో పూర్వ గ్రంథాలు కులాన్ని పాటించాయి. కట్టడాలలో కుల హెచ్చుతగ్గులను పేర్కొన్నాయి. ప్రస్తుతం అది వివాదాస్పదం అవుతుందని ఏమీ ఎరగనట్టుగా వూరుకుంటున్నారు. అంతేగాని వాస్తు గ్రంథాలలో కులపరంగా కట్టడాలు పేర్కొనడం తప్పు అని వాస్తు పండితులు ధైర్యంగా రాయడం లేదు.
వాస్తు పండితులు చెప్పినవి విఫలమైనప్పుడు వాటికి బాధ్యత వహించరు. పైగా రోగాలకు, ఆర్థిక ఇబ్బందులకు కట్టడాలలో వాస్తు దోషాలను చూపుతున్నారు. నమ్మినవారు కట్టడాలను కూలగొట్టడం, మరమ్మత్తులు చేయడం ద్వారా విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఎలాంటి బాధ్యతనూ వాస్తు పండితులు స్వీకరించరు. వారికి వచ్చే వాస్తు ఆదాయం పై పన్నులు లేవు. లెక్కలు చూపరు. అంతా రహస్యం. వైఫల్యాలను శిక్షించాలంటే తప్పించుకు పోతారు. చివరకు నమ్మకస్తులు గుడ్డిగా ప్రభుత్వ కార్యాలయాలలోకి కూడా వాస్తును ప్రవేశపెట్టారు. ప్రజల పన్నులతో వచ్చే డబ్బును ఇలా ఖర్చు చేయటం అభ్యంతరకరమైన విషయం.ఈ సందర్భాలను పదే పదే చర్చలలో, టి.వి.ల ద్వారా, పత్రికా ముఖంగా చెబుతూ ప్రభుత్వ దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదు. సమాజం ఈ రంగంలో వెనక్కి నడుస్తున్నది అనడానికి వాస్తు

5 comments:

Prof. Kodali Srinivas said...

గృహ విలాపం -
Gruha Vilapam


పండుగ పబ్బాలు ,పెళ్లి పెరంటాళ్ళకు

రంగు రంగుల వలువలతో తోడున్నా నీనెచ్చెలిగా !

రోగాల -రో స్తులు చావు బ్రతుకుల పోరాటంలో ...

కష్టాల కన్నీళ్లను మోనంగా దిగామింగా నీ ప్రాణ నేస్తంగా !

కంటికి రెప్పలా ,కాలి చెప్పులా అనుక్షణం నీడగా, జాడగా

శైశవం నుండి నీకొక ఆస్థిత్వాన్ని అందించా నీ విలాసంగా !

నీచేతిలో దగాపడి ముద్దాయిగా వాస్తు బోనులో నిలబడ్డా ...

నీ అసమర్ధ జీవనయానంలో తగిలే ప్రతి రాయికి
జన్మనిచ్చిన రాకాసి తల్లిగా !

నేరం నీదైతే ... వాస్తు ముద్దాయిగా నాకెందుకు ఈ మరణ శిక్ష ?

, said...

ఇక్కడ వాస్తు నిజమా కాదా అన్నది కాదు ప్రశ్న. మొదటి విషయమేమంటే వాస్తు ని నమ్మేవారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది. యీ రోజు మనం యేదైనా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొంటున్నపుడు మనకు నమ్మకం లేకపోయినా ఫర్వాలేదు. కాని రేపు అదే స్థలాన్ని అమ్మేటప్పుడు వాస్తు చూడకుండా కొనేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆ విధంగా స్థలాన్ని అమ్మేటప్పుడు వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని వాస్తుకు సరిపడే స్థలాలని, ఇళ్లని కొనడం జరుగుతోంది. యీ విషయం ఇంటి స్థలాల వరకైతే ప్రస్తుతం ఇలా వుంది. ఇక మనం ఇంట్లో వాస్తు పరంగా మార్పులు చేరుపులు తలపెట్టడం అనేది వేరే విషయం.

యేమైనా మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

innaiah said...

I sm thankfult to Prof Kodali Srinivas for participating in the discussion.He is my good friend and we participated in Vaastu meetings on occasions.
I donot know that he writes such wonderful powerful poems on Vaastu.

Prof. Kodali Srinivas said...

Thank you sir,Fallowing all your articles

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం
ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది .
అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం .

త్వరలో నేను ప్రచురించే పుస్తకం
"వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను .
తగిన పారితోషకం ఉంటుంది .
అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .

naprapamcham said...

We must all cooperate with the effort of Prof Kodali Srinivas. Cartoon will have tremendous effect.