Monday, June 29, 2009

జ్యొతిష్యం సైంటిఫిక్ కాదా

జ్యొతిష్యం
భారతీయ జ్యొతిష్యం లొ నవ గ్రహాలలో కొత్త్తగా కనుగొన్న యురేనస్ ,నెప్ టూన్ లు లెవు.గ్రహాలకు నిజంగా మానవులపై ప్రభావం వుంటే ఇన్నాళ్ళూ వాటి ప్రభావం తెలియకుండానే చెప్పారన్నమాట.

గ్రహాలకు తారలకు తేడా తెలియక , సూర్యుడిని కూడా గ్రహం అనేశారు .

చంద్రుడు భూమికి అంటిపెట్టుకున్నదే తప్ప గ్రహం కాదు .

రాహువు కేతువు లు వునికిలో లేవు !

రాసులన్నీ వూహలే .నిజంగా లేవు.

తారాబలం అంతా అశాస్త్రీయమే.

గ్రహాలనుండి మనుషులపై పడేదేమీ లేదు .ఇక ప్రభావం ఎక్కడ ?

ఇన్ని కారణాలుగా జ్యోతిష్యం నిరాకరించదగినది

11 comments:

Srini Neeruganti said...
This comment has been removed by the author.
Srini Neeruganti said...

ఈ విశ్వమంతా రెలేటివ్ అనేది అందరికీ తెలిసిందే. జ్యొతిష్యం భూలోక వాసులకు సంభందించినది కనుక, భూమిని కేంద్రంగా తీసుకుంటే
సూర్య చంద్రాదులన్నీ భూమికి గ్రహాలన్నట్లే కదా. వాటిలొ భూమిపై ఎక్కువ వేటి ప్రభావముందో, వాటినే పూర్వీకులు గమనించారేమో.
రాహుకేతువులు ఛాయా గ్రహాలని జ్యొతిష్యం చెబుతోంది కదా. జ్యొతిష్యం అంతా భూటకమే అయితే ఈ సత్యము వాల్లకెలా తెలిసింది? అంతే కాకుండా జ్యొతిష్యం ఏ గ్రహము ఎక్కడ ఎప్పుడు ఉంటుందో అంత సరిగా ఎలా చెప్ప గలుగుతోంది? అదే విధంగా గ్రహణాలు ఎప్పుడు జరుగుతాయో చెబుతోంది. ఏ శాస్ట్రాన్నయినా మనము పూర్తిగా పరిశీలించకుండా విమర్శించదము సరి కాదని నా అభిప్రాయము.

Srini Neeruganti said...

ఈ విశ్వమంతా రెలేటివ్ అనేది అందరికీ తెలిసిందే. జ్యొతిష్యం భూలోక వాసులకు సంభందించినది కనుక, భూమిని కేంద్రంగా తీసుకుంటే
సూర్య చంద్రాదులన్నీ భూమికి గ్రహాలన్నట్లే కదా. వాటిలొ భూమిపై ఎక్కువ వేటి ప్రభావముందో, వాటినే పూర్వీకులు గమనించారేమో.
రాహుకేతువులు ఛాయా గ్రహాలని జ్యొతిష్యం చెబుతోంది కదా. జ్యొతిష్యం అంతా భూటకమే అయితే ఈ సత్యము వాల్లకెలా తెలిసింది? అంతే కాకుండా జ్యొతిష్యం ఏ గ్రహము ఎక్కడ ఎప్పుడు ఉంటుందో అంత సరిగా ఎలా చెప్ప గలుగుతోంది? అదే విధంగా గ్రహణాలు ఎప్పుడు జరుగుతాయో చెబుతోంది. ఏ శాస్ట్రాన్నయినా మనము పూర్తిగా పరిశీలించకుండా విమర్శించదము సరి కాదని నా అభిప్రాయము.

Praveen Mandangi said...

గ్రహణాలు ప్రతి ఏడాడి వస్తాయి. ఎన్ని రోజులకి ఒకసారి గ్రహణాలు వస్తాయో టైమ్ ఇంటర్వెల్ లెక్క పెట్టి చెప్పడం కష్టం కాదు. జ్యోతిషంలో పేర్కొనబడిన గ్రహాలు (ఉనికిలో లేని రాహుకేతువులు తప్ప) మిగితావి రాత్రి పూట, వేకువ ఝామున కంటికి చిన్నగా కనిపించేవే. ఉనికిలో లేని రాహుకేతువులు గ్రహాలనే జ్యోతిష్యం చెపుతోంది. జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు అవి షాడోస్ అని చెప్పడం ఎవరిని సంతృప్తి పరచడానికి?

venkataramana said...

ఇన్నయ్య గారు,
1) రాహువు, కేతువు లు గ్రహాలు కాదు అని ము౦దే అనుకున్నాము. మీరు ఇక్కడ గ్రహి౦చాల్సి౦ది ఏమిట౦టే, సూర్య, చ౦ద్ర గ్రహణాలకు పూర్వికులు రె౦డు కారణాలు చెప్పారు. మరియు, వాటి రిలేటివ్ పొషిషన్స్ (సాపేక్ష స్థానాలు) చెప్పారు. అవి సరిపోతున్నాయా లేదా చెప్ప౦డి.
2) సూర్యుడిని గ్రహ౦ అన్నారు అని అ౦టున్నారు.
౩) ఇప్పటి శాస్త్రవేత్తలు ప్లూటో ని 2006 వరకు గ్రహ౦ అని అన్నారు. కానీ ఇప్పుడు గ్రహ౦ కాద౦టున్నారు.

పైన చెప్పిన ౩ విషయాల్లో నాకు ఒక కామన్ పాయి౦ట్ అర్థమయి౦ది ఏమిట౦టే, ౩ విషయాల్లో వాటి ఉనికిని కరక్ట్ గానే గుర్తి౦చారు అని. పేర్లలో మాత్రమే తేడా వున్నది.
రాశులన్నీ వూహలే అ౦టున్నారు. అది కరక్టే. అవి కర్కటరేఖ, భూమధ్యరేఖ ల లాగే వూహలే.

నేనెప్పుడూ, జ్యో౦తిష్యులు చెప్పి౦ది 100 శాత౦ ఖచ్చిత౦ అని వినలేదు. వాళ్ళు అలా జరగొచ్చు అని చెప్పడ౦ మాత్రమే విన్నాను.

venkataramana said...

ఇన్నయ్య గారు,
నేను హేతువాద౦ అ౦టే, మూఢనమ్మకాలను ప్రాలదోలడ౦ అని అనుకు౦టున్నాను. కరక్టేనా?
మానవతావాద౦ అ౦టే నాకు అర్థ౦ కావడ౦లేదు. వివరిస్తారా?

Satyamevajayate said...

జ్యోతిష్యం ,అనగా జరగబోయేది,జరిగినది గ్రహాలని బట్టి ,చేతిలో గీతలని బట్టి ,లేదా పుటిన సమయాన్ని బట్టి ..ఇలా అనేకరకాలుగా అమాయకులని మభ్య పెడుతున్నారు .
నలుగురు గుడ్డి వాళ్ళు ఒక ఏనుగును గురించి వర్ణించినట్టు ...విశ్వం యొక్క పరిధులు కోటాను కోట్ల నక్షత్ర రాసులు, వాటి మధ్య దూరాలు ,ఇంకా మన ఊహకు అందని నిజాలూ ..ఇవన్ని తెలియని అమాయకుల మూర్ఖత్వం ..ఈ జాతక ప్రపంచం .
మొన్న మొన్న ఒక విమానం , 250 మంది ప్రయాణికుల తో సహా పసిఫిక్ మహా సముద్రం లో కూలిపోయింది ..అందరూ ఆనవాలు లేకుండా చనిపోయారు ..
వీళ్ళందరి జాతకాలలో మరణం --జీవితం లో అతి ముఖ్యమయిన ఘట్టం --రాసిపెట్టి ఉన్నట్లు ,
నిరూపించగల నమ్మకం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు.అది అసలు ఎవరూ చాలెంజ్ గా తీసుకోలేరు .
ఒక్క సారి సునామి లో లక్ష పైగా జనం మలేసియా లో మాయమయ్యారు..అందులో.పసి కూనలు,స్త్రీలు ,వృద్ధులు,అందరూ ఉన్నారు ..వీళ్ళ జాతకాలు ఈ మరణాలని ప్రతిబింబిస్తాయని నమ్మే మూర్కులకి ఎవరు ఏమి చెప్పగలరు ...వారి అజ్ఞానానికి విచారించడం తప్ప?

naprapamcham said...

In Humanism the center is human beings.Equality, human rights, human morality are the main points for practice. all religions are hindrances to human progress because they are dependent on god, belief and other worldly superstion.

Vasavya Yagati said...
This comment has been removed by the author.
Vasavya Yagati said...

ఇక్కడ అసలు జ్యోతిష్యం పునాదులను మర్చిపోయి చర్చ జరుగుతుందని భావిస్తున్న!
జ్యోతిష్యం శాస్త్రం (నేను శాస్త్రం అనలేను అనుకోండి) ప్రకారం, సూర్యడు భూమి చుట్టూ తీరుతాడు మరియు భూమి గుండ్రముగా వుందని ఎక్కడ చెప్పబడలేదు (చాపవలె వుందని భావించేవారు) . అంటే, జ్యోతిష్యం శాస్త్రం యొక్క పునదే నిజం కాదని ఎవరైనా అంగీకరించక మానదు. అలాంటపుడు, దాని పైకప్పు గురించి చర్చ అనవసం అనిపిస్తుంది.
దయచేసి, జ్యోతిష్యం ని సమర్దించేవాళ్ళు ముందుగా వీటికి సమాధానాలు చెప్పి చర్చ కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నాను.

Upendra Agnihotram said...

ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి.ఆనాడు ఏ టెలిస్కోపులు లేకుండా ఆర్యభట్టు,వరాహమిహిరుడు చెప్పిన దూరాల లెక్కలకు నేటి శాస్త్రవేత్తల లెక్కలకు చాలా స్వల్పమైన తేడా ఉంది.
ఎన్ని వేల సంవత్సరాలైనా ముందుగా గ్రహణగణితం, వాతావరణ సూచనలు చేయగల జ్యోతిష్యం అశా్స్తీయమెలా అవుతుంది ?

నేను మీలాగ జ్యోతిష్యం అంతా అబద్దమని మొదట్లో నమ్మిన వాడినే.విషయం తెలుసుకున్నాక విమర్సించడం మానేసాను.